కోల్‌కతా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ని కోల్‌కతా సీఎం మమతాబెనర్జీ ఖండించారు. ఈ అరెస్ట్ అంశంలో ప్రధాని మోదీతో పాటు అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘తమ ప్రభుత్వం మతాల విషయంలో సామరస్యాన్ని కోరుకుంటుంది. ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఆయన అరెస్ట్‌పై స్థానిక ఇస్కాన్ ప్రతినిధులతో మాట్లాడాను.
అరెస్ట్ అంశం విదేశానికి సంబందించి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మేం కేంద్రానికి అండగా నిలుస్తామని తెలిపారు.
కాగా, హిందూ సమాజంపై అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఇస్కాన్‌కు చెందినచిన్మయ్ కృష్ణదాస్ ప్రభుని బంగ్లాదేశ్ పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌ను ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Speaking on the Bangladesh issue in the Legislative Assembly, West Bengal CM Mamata Banerjee says, "We do not want any religion to be harmed. I have spoken to ISKCON here. Since this is a matter of another country, the Central government should take relevant action on this. We… pic.twitter.com/Keob4a9aGf
— ANI (@ANI) November 28, 2024
Comments
Please login to add a commentAdd a comment