iskon
-
చిన్మయ్ కృష్ణదాస్‌కు దక్కని ఊరట
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చట్టోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. గురువారం కోర్టులో జరిగిన విచారణకు కృష్ణదాస్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన తరఫున 11 మంది లాయర్లు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ నిర్ణయం తీసుకున్నారు. కృష్టదాస్ను గత ఏడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు -
చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు.. తాజాగా
ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్‌పై పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. తాజాగా చిన్మయ్‌తో పాటు ఆయన వందలాది మంది అనుచరులపై కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ఓ మతపరమైన సంస్థ కార్యకర్త చిన్మయ్ కృష్ణదాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, ఆ దాడిలో తన చేయి, తలకు తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నాటి నుంచి చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వెలుగులోకి వచ్చిన బంగ్లాదేశ్ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అంతకు ముందు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ నేపథ్యంలో పలు ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనపై నవంబర్ 27న కొత్వాలి పోలిస్ స్టేషన్లో మూడు కేసులు, డిసెంబర్ 3న రంగం సినిమా థియేటర్ సమీపంలో పలువురు ఓ పార్టీ కార్యకర్తలు, ఇస్కాన్ సభ్యులు తమపై దాడి చేయడంతో స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. -
చిన్మయ్ కృష్ణదాస్‌తో మాకు సంబంధం లేదు: ఇస్కాన్
ఢాకా : బంగ్లాదేశ్ ఇస్కాన్ పరిణామాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహారంపై బంగ్లాదేశ్ ఇస్కాన్ స్పందించింది.చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై బంగ్లాదేశ్ ఇస్కాన్ జనరల్ సెక్రటరీ చారు చంద్రదాస్ స్పందించారు. చిన్మయ్‌తో, ఆయన చేసిన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. గతంలోనే చిన్మయ్‌ను మా సంస్థ నుంచి తొలగించాం’ అని అన్నారు. గతంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని సంస్థాగత కార్యకలాపాల నుండి, పదవుల నుండి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును తొలగించినట్లు చెప్పారు. న్యాయవాది మరణంపై జరుగుతున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. న్యాయ వాది మరణం, దేశంలో కొనసాగుతున్న నిరసనలతో బంగ్లాదేశ్ ఇస్కాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇస్కాన్ మతపరమైన, ఘర్షణ కార్యకలాపాలలో పాల్గొనలేదని, ఐక్యత సామరస్యాన్ని పెంపొందించడంలో మాత్రమే పాల్గొంటుందని ఆయన అన్నారు. #Bangladesh | Chinmoy Krishna Das Brahmachari does not belong to us: #ISKCONBangladesh The organization would not shoulder any responsibility over his statements and speech: Charu Chandra Das Brahmachari, General Secretary, #ISKCON Bangladesh@DhakaPrasar #ChinmoyKrishnaDas… pic.twitter.com/cuaR5SRc6V— All India Radio News (@airnewsalerts) November 28, 2024 -
బంగ్లాలో కృష్ణదాస్ అక్రమ అరెస్ట్.. స్పందించిన షేక్ హసీనా
ఢిల్లీ : ‘ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అన్యాయం అరెస్ట్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఆయను వెంటనే విడుదల చేయాలి. లేదంటే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా హెచ్చరికలు జారీ చేశారు.ప్రార్ధనా మందిరాల్లో దాడులు, ఘర్షణలు, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ పాలనపై షేక్ హసీనా స్పందించారు. ఓ స్టేట్మెంట్ను విడుదల చేశారు. అందులో.. ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతలను నిర్వహించడంలో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. Former Bangladesh PM Sheikh Hasina issues statement in support of Hindu priest Chinmoy Das:A lawyer has been killed in Chittagong, strongly protesting this murder. Those involved in this murder should be found and punished quickly. Human rights have been grossly violated… pic.twitter.com/7AO3BDTtmn— IANS (@ians_india) November 28, 2024‘నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రణ, ప్రజల జీవితాలకు భద్రత కల్పించడంలో ప్రస్తుత యూనిస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’. కృష్ణదాస్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. హింసాత్మకంగా చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణించినట్లు చిట్టగాంగ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నజీమ్ ఉద్దిన్ చౌదరి తెలిపారు. న్యాయ వాది మరణంలో ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు. నిందితుల్ని శిక్షించడంలో మధ్యంతర ప్రభుత్వం విఫలమైతే మానవ హక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవలని ఉంటుందని హెచ్చరించారు.చిట్టగాంగ్‌లో ఒక న్యాయవాది హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నేరస్తుల్ని వెంటనే శిక్షించాలి. ఈ రకమైన దేశ ఉనికిని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న సంఘ విద్రోహ శక్తులపై ఐక్యంగా పోరాడాలని బంగ్లాదేశ్ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు. -
‘చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ను ఖండిస్తున్నాం’
కోల్‌కతా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ని కోల్‌కతా సీఎం మమతాబెనర్జీ ఖండించారు. ఈ అరెస్ట్ అంశంలో ప్రధాని మోదీతో పాటు అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘తమ ప్రభుత్వం మతాల విషయంలో సామరస్యాన్ని కోరుకుంటుంది. ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఆయన అరెస్ట్‌పై స్థానిక ఇస్కాన్ ప్రతినిధులతో మాట్లాడాను.అరెస్ట్ అంశం విదేశానికి సంబందించి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మేం కేంద్రానికి అండగా నిలుస్తామని తెలిపారు. కాగా, హిందూ సమాజంపై అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఇస్కాన్‌కు చెందినచిన్మయ్ కృష్ణదాస్ ప్రభుని బంగ్లాదేశ్ పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌ను ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Speaking on the Bangladesh issue in the Legislative Assembly, West Bengal CM Mamata Banerjee says, "We do not want any religion to be harmed. I have spoken to ISKCON here. Since this is a matter of another country, the Central government should take relevant action on this. We… pic.twitter.com/Keob4a9aGf— ANI (@ANI) November 28, 2024 -
చైనాకు ఇస్కాన్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య చైనాకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్నెస్(ఇస్కాన్) కూడా చైనా కంపెనీతో చేసుకున్న కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండువందల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కురుక్షేత్రలో కృష్ణార్జున దేవాలయానికి అవసరమైన గుర్రాలను చైనానుంచి కాకుండా ఇండోనేషియా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. కృష్ణార్జున మందిరానికి అవసరమైన 4గుర్రాలను చైనానుంచి కొనుగోలుకు చర్చలు దాదాపు ఖరారయ్యాయి. కానీ దేశంలో చైనా వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆలోచనను విరమించుకుంది. ఈ పరిణామాన్నిఇస్కాన్ అధ్యక్షుడు గోపాల్ దాస్ ధృవీకరించారు. నాలుగు గుర్రాల కోసం చైనా కంపెనీతో చర్చలు జరిపామనీ, అయితే చైనా వ్యతిరేకత కారణంగా ఆర్డర్ ఇవ్వకూడదని నిర్ణయించామని తెలిపారు. ఇండోనేషియాలోని ఒక సంస్థతో చర్చలు జరుగుతున్నామని త్వరలోనే ఖరారు చేయనున్నామని వెల్లడించారు. గోపాల్ దాస్ అందించిన సమాచారం ప్రకారం 34 అడుగులఎత్తు 41 మీటర్ల పొడవుతో పాలరాయితో నాలుగు గుర్రాలను రూపొందించనున్నారు. ఒక్కోదానికి 80-90లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఆలయ సముదాయం నిర్మాణం 2018లో ప్రారంభం కాగా 2022 లో పూర్తి కానుంది. ఆరు ఎకరాలలో 23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులు, 165 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను కలిగి ఉంటుంది. అన్ని గ్రంథాలతో లైబ్రరీ, గోవింద రెస్టారెంట్, 75 గదుల గెస్ట్ హౌస్, ఆర్ట్ గ్యాలరీ, ఆధ్యాత్మిక గిప్ట్స్ షాప్, సూపర్ మార్కెట్, కేఫ్ సౌకర్యాలను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. 60 శాతం నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకుంది. -
ఆనందమానందమాయే..!
– గౌతమీతీరాన గోకులం రాజమహేంద్రవరం కల్చరల్ : ధర్మసంస్థాపనకు ద్వాపర యుగంలో అవనిపై అవతరించిన గోపాలుని జన్మదిన వేడుకలు అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్యసంఘం ఆధ్వర్యంలో ఆదివారం గౌతమఘాట్‌లోని రాధాగోపీనాథ్ దశావతార్ మందిరంలో ఘనంగా జరిగాయి. శ్రావణ బహుళ అష్టమి నడిరేయి దేవకీదేవి గర్భాన జనించిన నల్లనయ్య తెల్లవారేసరికి రేపల్లెలోని యశోదమ్మ ఇంటికి చేరుకున్నాడు. ‘ఏమినోము ఫలమొ–ఇంతపొద్దొక వార్తవింటిమ బలలార వీనులల–మన యశోద చిన్నిమగవాని గనెనట–చూచివత్తమ్మ సుదతులార’ అని రేపల్లెవాసులు ఆనందభరితులయ్యారు. ఆ మధుర క్షణాలు తిరిగి మంగళవారం పునరావృతమయ్యాయి.... ఇస్కాన్‌లో భక్తజనందోహం ఉదయం 4.30 గంటలకు స్వామికి మహామంగళహారతి, 7.30 గంటలకు శృంగార హారతి పూర్తయ్యాక, భక్తులను కృష్ణపరమాత్మ దర్శనానికి అనుమతించారు. హరేకృష్ణనామస్మరణతో వేలాది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని రాధాకృష్ణులు, జగన్నాథ సుభద్రాబలదేవులు, వేంకటేశ్వరస్వామి మూర్తులకు విశేష అలంకరణలు చేశారు. శరీరమే నిజమైన నేస్తం దురలవాట్ల దూరంగా ఉంటే శరీరమే మనకు నిజమైన నేస్తమవుతుందని ఇస్కాన్ నగరాధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్ వెల్లడించారు. సన్నిహితమైన శ్రేయోభిలాషి గురువు, ప్రియాతిప్రియమైన వ్యక్తి భగవంతుడు, ప్రకృతి అంతా భగవంతుని ప్రసాదమేనని ఆయన భాగవతప్రవచనంలో పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి మనం కొన్ని గేలన్ల నీరు తాగి ఉంటాం, ఆ నీటిని మనకు అనుగ్రహించిన భగవంతుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవించడమే మహాపాపమని ఆయన అన్నారు. బహుమతిప్రదానం ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. వివిధ విద్యాసంస్థల నుంచి 3,500మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 251మందికి సర్టిఫికెట్, జ్ఞాపికలను అందజేశారు. ఇస్కాన్ నగరాధ్యక్షుడు సత్యగోపీనాథ్ దాస్, నగరమేయర్ పంతం రజనీశేషసాయి తదితరులు హాజరయ్యారు. -
25న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
–14 నుంచి రాధాగోవిందుల ఊంజల సేవ –సెప్టెంబర్ 18న ప్రభుపాదుల జీవిత చరిత్రపై రాష్ట్ర స్థాయి పోటీలు – వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు తిరుపతి కల్చరల్: తిరుపతి ఇస్కాన్ మందిరంలో ఈనెల 25,26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు మందిరం అధ్యక్షుడు రేవతీరమణదాస్ తెలిపారు. బుధవారం ఇస్కాన్ సమావేశ మందిరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న శ్రీకృష్ణ జన్మాష్టమి, 26న వ్యాసపూజ ఉంటుందని చెప్పారు. ఇస్కాన్ మందిరం స్థాపించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 1 నుంచి హరినామ నగర సంకీర్తన జగన్నా«థ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మందిరంలో ప్రవచనాలు సాగుతున్నాయన్నారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు మందిరం నుంచి నగర వీధుల్లో హరినామ సంకీర్తనతో పాటు ప్రసాద వితరణ, భగద్గీత పుస్తక వితరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. –14 నుంచి ఊంజల సేవ ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు రాధాగోవిందుల ఊంజల సేవ నిర్వహిస్తున్నట్లు రేవతీ రమణదాసు తెలిపారు. రోజూ సాయంత్రం 7 నుంచి 8.30 గంటల వరకు ఊంజల్ సేవ ఉంటుందని తెలిపారు. 18వ తేదీన బలరామ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. – ప్రభుపాదుల జీవిత చరిత్రపై రాష్ట్ర స్థాయి పోటీలు కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీల ప్రభుపాదుల జీవిత చరిత్రపై సెప్టెంబర్ 18న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వíß ంచనున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఇతర ప్రజలు విభాగాలుగా పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు రూ.లక్ష, రూ.75వేలు, రూ. 50 వేలు చొప్పున బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి ముగ్గురు∙విజేతలకు రూ.10 వేలు,రూ.7,500లు, రూ.5 వేలు చొప్పున బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈనెల 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో తెలుగులోనే ప్రశ్నపత్రం ఉంటుందన్నారు. జిల్లాలో నిర్ణయించిన ఆయా ప్రాంతాలలో సెప్టెంబర్ 18న ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఇస్కాన్ నిర్వాహకులు లీలాపారాయణదాస్, రూపేష్ ప్రభు పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
-
నేడు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : బెంగళూరుకు చెందిన శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్‌లోని వాసవి కమిటీ వట్టం సమితి హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నేత హరికృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఏటా మాదిరిగా ఈ సారి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు శ్రీకృష్ణుని దర్శనం, 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక పాఠశాల విభాగం విద్యార్థులకు శ్రీకృష్ణుడు, గోపికల వస్త్ర ప్రదర్శన, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక పోటీలు, అనంతరం 8.30 గంటల వరకు అభిషేకం, 9 గంటలకు ఊయల సేవ, అనంతరం ప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, జేడీఎస్ యువనేత భరత్‌రెడ్డి, వివిధ కార్పొరేటర్లు ఆహ్వానించామన్నారు. ఈ సమావేశంలో జువెలరీ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సోని, వట్టం జగదీష్, శివప్ప, ప్రభు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.