శ్రీకృష్ణ జన్మాష్టమి పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఇస్కాన్ మందిరం అధ్యక్షుడు రేవతీ రమణదాస్
–14 నుంచి రాధాగోవిందుల ఊంజల సేవ
–సెప్టెంబర్ 18న ప్రభుపాదుల
జీవిత చరిత్రపై రాష్ట్ర స్థాయి పోటీలు
– వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు
తిరుపతి కల్చరల్: తిరుపతి ఇస్కాన్ మందిరంలో ఈనెల 25,26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు మందిరం అధ్యక్షుడు రేవతీరమణదాస్ తెలిపారు. బుధవారం ఇస్కాన్ సమావేశ మందిరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న శ్రీకృష్ణ జన్మాష్టమి, 26న వ్యాసపూజ ఉంటుందని చెప్పారు. ఇస్కాన్ మందిరం స్థాపించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 1 నుంచి హరినామ నగర సంకీర్తన జగన్నా«థ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మందిరంలో ప్రవచనాలు సాగుతున్నాయన్నారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు మందిరం నుంచి నగర వీధుల్లో హరినామ సంకీర్తనతో పాటు ప్రసాద వితరణ, భగద్గీత పుస్తక వితరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
–14 నుంచి ఊంజల సేవ
ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు రాధాగోవిందుల ఊంజల సేవ నిర్వహిస్తున్నట్లు రేవతీ రమణదాసు తెలిపారు. రోజూ సాయంత్రం 7 నుంచి 8.30 గంటల వరకు ఊంజల్ సేవ ఉంటుందని తెలిపారు. 18వ తేదీన బలరామ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
– ప్రభుపాదుల జీవిత చరిత్రపై రాష్ట్ర స్థాయి పోటీలు
కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీల ప్రభుపాదుల జీవిత చరిత్రపై సెప్టెంబర్ 18న రాష్ట్రస్థాయి పోటీలు నిర్వíß ంచనున్నట్లు తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఇతర ప్రజలు విభాగాలుగా పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు రూ.లక్ష, రూ.75వేలు, రూ. 50 వేలు చొప్పున బహుమతులు అందజేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి ముగ్గురు∙విజేతలకు రూ.10 వేలు,రూ.7,500లు, రూ.5 వేలు చొప్పున బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈనెల 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో తెలుగులోనే ప్రశ్నపత్రం ఉంటుందన్నారు. జిల్లాలో నిర్ణయించిన ఆయా ప్రాంతాలలో సెప్టెంబర్ 18న ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఇస్కాన్ నిర్వాహకులు లీలాపారాయణదాస్, రూపేష్ ప్రభు పాల్గొన్నారు.