ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్‌పై పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని పలు స్టేషన్‌లలో కేసులు నమోదు కాగా.. తాజాగా చిన్మయ్‌తో పాటు ఆయన వందలాది మంది అనుచరులపై కేసులు నమోదయ్యాయి.
బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ఓ మతపరమైన సంస్థ కార్యకర్త చిన్మయ్ కృష్ణదాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, ఆ దాడిలో తన చేయి, తలకు తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నాటి నుంచి చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వెలుగులోకి వచ్చిన బంగ్లాదేశ్ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.
అంతకు ముందు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ నేపథ్యంలో పలు ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనపై నవంబర్ 27న కొత్వాలి పోలిస్ స్టేషన్‌లో మూడు కేసులు, డిసెంబర్ 3న రంగం సినిమా థియేటర్ సమీపంలో పలువురు ఓ పార్టీ కార్యకర్తలు, ఇస్కాన్ సభ్యులు తమపై దాడి చేయడంతో స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు.
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment