iskan
-
చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు.. తాజాగా
ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్‌పై పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని పలు స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. తాజాగా చిన్మయ్‌తో పాటు ఆయన వందలాది మంది అనుచరులపై కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ఓ మతపరమైన సంస్థ కార్యకర్త చిన్మయ్ కృష్ణదాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, ఆ దాడిలో తన చేయి, తలకు తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నాటి నుంచి చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వెలుగులోకి వచ్చిన బంగ్లాదేశ్ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అంతకు ముందు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ నేపథ్యంలో పలు ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనపై నవంబర్ 27న కొత్వాలి పోలిస్ స్టేషన్లో మూడు కేసులు, డిసెంబర్ 3న రంగం సినిమా థియేటర్ సమీపంలో పలువురు ఓ పార్టీ కార్యకర్తలు, ఇస్కాన్ సభ్యులు తమపై దాడి చేయడంతో స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. -
‘కార్తికేయ2’ టీమ్‌కి అరుదైన గౌరవం
యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. ఈ చిత్ర యూనిట్‌కి ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలని ఆహ్వానం అందింది. కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇస్కాన్ మెయిన్ సంస్థానం నుంచి ఆహ్వానం అందడం పట్ల చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించడం గమనార్హం.పిపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. -
పరమత సహనంతో జీవించాలి
కోల్‌కతా: పరమత సహనంతో మెలగాలని చాటిచెబుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్‌కతాలో ఇస్కాన్ రథయాత్ర ప్రారంభ వేడుకలకు తమ పార్టీలోని ముస్లిం మహిళా ఎంపీ నుస్రత్ జహాన్‌తో కలిసి హాజరయ్యారు. హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్న నటి, బసిర్హత్ నియోజకవర్గ ఎంపీ నుస్రత్ ఇటీవల పార్లమెంటులో ప్రమాణం సందర్భంగా నుదుటన కుంకుమ, మంగళసూత్రం ధరించి హాజరయ్యారు. దీంతో ముస్లిం మతపెద్దలు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. రథయాత్ర వేడుకలకు నుస్రత్ కుంకుమ, మంగళసూత్రంతో వచ్చారు. పూజలో పాల్గొని సీఎంతో కలిసి రథాన్ని లాగారు. ‘నేను ఇస్లాంను నమ్ముతాను. అలాగే అన్ని మతాలనూ గౌరవిస్తాను. మత పిచ్చితో వ్యాఖ్యలు చేసే వారిని నేను పట్టించుకోను. నా మతం ఏంటో, నేను ఏ దేవుణ్ని నమ్మాలో నాకు తెలుసు. నేను పుట్టుకతోనే ముస్లింని. ఇప్పటికీ ముస్లింనే. మతం అనేది మనిషి లోపల ఉండాలి. తలపై కాదు’ అని అన్నారు. -
ఆధ్యాత్మికతతోనే శాంతిస్థాపన
ఇస్కాన్ వ్యాసరచన పోటీలు వన్‌టౌన్ : సమాజంలో ఆధ్యాత్మికతతోనే శాంతిస్థాపన సాధ్యమవుతుందని ఇస్కాన్ కృష్ణాజిల్లా కార్యనిర్వహకులు మురళీధర్‌నాథ్ దాస్ అన్నారు. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద జీవితంపై కృష్ణాజిల్లా వ్యాప్త వ్యాసరచన పోటీ పరీక్షా కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగింది. సుమారు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. దాస్ మాట్లాడుతూ ఇస్కాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మానవ సమాజానికి ఆనందభరితమైన జీవితాన్ని, చక్కని ఆరోగ్యాన్ని ప్రశాంతమైన మనస్సును, అన్ని ఉన్నతమైన లక్షణాలను భగవత్ చైతన్యం ద్వారా అందించటానికి ఇస్కాన్ ప్రయత్నిస్తోందన్నారు. తొలుత జిల్లావ్యాపితంగా పరీక్షలను నిర్వహించి చివరిలో రాష్ట్ర వ్యాప్త పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు జిల్లా స్థాయిలో పది వేలు, ఏడున్నర వెయ్యి, ఐదు వేలు, రాష్ట్ర స్థాయిలో లక్ష, రూ.75వేలు, రూ.50 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేస్తామన్నారు. విజయవాడలోనే బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. -
విశాఖకు ఆధ్యాత్మిక మణిహారం
‘భువిపై భూతల స్వర్గంగా భాసిల్లుతున్న ఇస్కాన్ మందిరం సామాన్యుని సుందర స్వప్న సాకారంగా విరాజిల్లుతోంది. కలలో మాత్రమే చూడగల అపురూప కట్టడం నగరంలో నిర్మాణం కావడం విశాఖప్రజల అదృష్టం. సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన కట్టడం స్మార్ట్‌సిటీ విశాఖాకే తలమానికంగా నిలువబోతుంది. అంతేకాదు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకుS అదనపు సొగసులు తెచ్చుకుంటోంది. అదే సమయంలో ఆధ్యాత్మికశోభను కూడా సంతరించుకోబోతుంది. –సాగర్‌నగర్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) విశాఖనగరశాఖ రూ.100కోట్లతో సాగరతీరాన (సాగర్‌నగర్)అద్భుత ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, పలు విశిష్టతలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం మూడేళ్లలో అందుబాటులోకి రానుంది. సాగరతీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖ ఓ వైకుంఠ దేవాలయంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు. చైన్నైకి చెందిన స్థపతి పర్యవేక్షణలో నిర్మాణ కొనసాగుతున్న ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం 2019కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతినిధులు పనులు శరవేగంగా చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోని ఏ ఇస్కాన్ దేవాలయానికి లేని ఆధ్యాత్మిక హంగులు ఈ మందరంలో సమకూర్చుతున్నారు. దేవతామూర్తుల సమాహారం నాలుగు అంతస్తుల్లో ఆ«ధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. రాధాకష్ణులు ఇతర దేవతల్ని దర్శించుకుని..భక్తులు బయటకు వచ్చేటప్పుడు సుందర సాగరతీరం కనువిందు చేయనుంది. ఆలయంలో ఒక్కో అంతస్తుల్లో ఒక్కోరకమైన దేవతామూర్తులు కొలువుదీరే విధంగా నిర్మాణం చేపడుతున్నారు. ప్రత్యేకతలు –భారతీయ ఆధ్యాత్మిక విలువలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించేందుకు దృశ్యశ్రవణ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనిని ఒకేసారి వందమంది వినియోగించుకోవచ్చు. –నీటి అంతర్భాగంలో ఉండేలా అరుదైన ధ్యానకేంద్రాన్ని(అండర్ వాటర్ మెడిటేషన్ సెంటర్)ఇక్కడ నిర్మిస్తున్నారు. భక్తులు నీటి మధ్యలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఫైబర్‌తో నిర్మిస్తున్న ఈ ధ్యాన కేంద్రం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ తరహా నిర్మాణం ఇప్పటివరకు ఏ ఇస్కాన్ దేవాలయంలోనూ లేదు. –శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాలు, కృష్ణలీలలు, అందరికీ అర్థ్ధమయ్యేలా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ప్రదర్శనశాలను నిర్మించనున్నారు. –భక్తి ప్రదర్శనలు నిర్వహించడానికి కళాక్షేత్రంతోపాటు యాభై పడకల వృద్ధాశ్రామం, గోశాలను ఏర్పాటు చేయనున్నారు. –ఇక్కడ స్పెషల్ ప్లానిటోరియం(ప్రత్యేక వైదిక నక్షత్రశాల)ను నిర్మిస్తున్నారు. సృష్టి నిర్మాణం, పునర్జన్మ తదితర అంశాలతోపాటు స్వర్గం, నరకం, దైవసాన్నిధ్యంలో ఉంటే ఎలాంటి శారీరక అనుభూతులు కలుగుతాయో ప్రత్యేక్షంగా అనుభవించగలిగేలా ఇస్కాన్‌కు చెందిన భక్తి వేదాంత పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఈ ప్లానిటోరియాన్ని నిర్మిస్తున్నారు. –ఆధ్యాత్మిక భావాలు వెదజల్లే శ్రీరాధాపార్థసారథుల మనోహర విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. సుందర స్వప్న సాకారం ఇస్కాన్ మందిరం ఇస్కాన్ మందిరం మనోహరమైన సుందర స్వప్నం. దేశంలోనే ఇస్కాన్ ఆలయాల్లో లేని విశిష్ట ఏర్పాట్లు, ప్రత్యేకతలు ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటకులను సైతం ఆకర్షించేలా అత్యున్నత స్థాయిలో నిర్మిస్తున్నాం. విశాఖనగరాన్ని ఆధ్యాత్మిక చింతనతో కలిగిఉండాలి, ప్రతిపౌరుడు దైవచింతనతో మెలగాలనేది మా సంకల్పం. చిన్నారులు, యువజనులు భారతీయ సాంప్రదాయాలు విడనాడకుండా సంస్కరణవంతమైన జ్ఞానాన్ని,భక్తిని ప్రబోధించడమే ఇస్కాన్ లక్షయం. – నీతాయ్ సేవిని, ఇస్కాన్ నిర్వాహకురాలు విశాఖను విశ్వవ్యాప్తంగా చూపించాలి సుందరమైన సాగరానికి ఆనుకొని ఉన్న సాగరేశ్వరుని సాక్షిగా వైశాఖేశ్వరుని సంకల్పంతో ఆధ్యాత్మికంగా విశాఖను విశ్వవ్యాప్తంగా చూపించాలనేది మా ఆశయం. అకుంఠ దీక్ష, పట్టుదలతో ఆలయ నిర్మాణం చేపడుతున్నాం. దీని వెనుక వేలాది మంది స్థానిక భక్తజనం,దాతల సహకారం, సంకల్పమే ముందుకు తీసుకెళ్తోంది. –సాంబదాస్ ప్రభుజీ, అధ్యక్షుడు ఇస్కాన్ విశాఖనగరశాఖ