అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani), అదానీ ఫౌండేషన్ చైర్‌పర్సన్ 'ప్రీతి అదానీ' మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. వీరిరువురు త్రివేణి సంగమం వద్ద ప్రార్థనలు చేశారు. ఆ తరువాత ఇస్కాన్ క్యాంపును సందర్శించి.. అక్కడ మహాప్రసాదం మండపంలో భోజనం చేయడంలో సహాయం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
మహా కుంభమేళాకు రావడం, ఇక్కడ ఇస్కాన్ మహాప్రసాద్ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని భారతీయ కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ అన్నారు. ఇస్కాన్‌కు కృతఙ్ఞతలు తెలుపుతూ.. లక్షలాది మంది భక్తులకు ఉచిత ఆహారం అందించడం గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.
ఇస్కాన్ మహాప్రసాద సేవ
ఇస్కాన్ వారు మహాప్రసాద సేవ ద్వారా 50 లక్షల మంది భక్తులకు భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రెండు పెద్ద వంటశాలలలో భోజనం తయారు చేసి మేళా ప్రాంతంలోని 40 ప్రదేశాలలో పంపిణీ చేస్తున్నారు. ఇలా రోజుకు లక్ష మంది భక్తులకు భోజనం అందిస్తున్నారు. అంతే కాకుండా 2,500 మంది వాలంటీర్లు ఐదు లక్షల గీతా సార్ కాపీలను పంపిణీ చేయనున్నారు.
మహా కుంభమేళా
మహా కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన సమ్మేళనాలలో ఒకటి. ఇది ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. దీనికి సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కుంభమేళా ప్రారంభమైన మొదటిరోజే.. 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు.
ఇదీ చదవండి: కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్
రూ.4 లక్షల కోట్ల ఆదాయం
ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani performs 'seva' at the camp of ISKCON Temple at #MahaKumbhMela2025
The Adani Group and ISKCON have joined hands to serve meals to devotees at the Maha Kumbh Mela in Prayagraj. The Mahaprasad Seva is being… pic.twitter.com/N1a1qGtS0b— ANI (@ANI) January 21, 2025
Comments
Please login to add a commentAdd a comment