భారతదేశంలో టాప్ 10 ధనవంతుల జాబితాలో రెండవ స్థానం పొందిన 'గౌతమ్ అదానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుమారు 54.5 బిలియన్ డాలర్ల సంపద కలిగి అదానీ గ్రూప్ ఆఫ్ అధినేత ఈ రోజు ఎలా ఉన్నాడో అందరికి తెలుసు. అయితే యుక్త వయసులో ఎలా ఉండేవాడనేది ఇక్కడ చూడవచ్చు.
నేడు దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అంబానీతో పోటీ పడుతున్న ఆదానీ.. సోలార్, థర్మల్ విద్యుత్ తయారీ, ఓడరేవుల నిర్వహణ వంటి ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నారు. గుజరాత్‌లో జన్మించిన ఈయన కాలేజీ చదువుని మధ్యలోనే ఆపేసి డైమండ్ బిజినెస్ చేయడానికి 1980లోనే ముంబై వెళ్ళాడు. ఆ తరువాత కొంతకాలానికి ప్లాస్టిక్ దిగుమతుల వ్యాపారంలో అన్నయ్యకు తోడుగా ఉండటానికి వచేసాడు. ఆ తరువాత 1988లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ స్థాపించాడు.
ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్
చిన్నప్పుడు స్కూల్ ట్రిప్‌లో భాగంగా కాండ్లా ఓడరేవుకి వెళ్లినట్లు, ఆ పోర్టు చూసాక పెద్దయ్యాక ఇలాంటిది నేను కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు అదానీ గతంలో వెల్లడించారు. అనుకున్న విధంగానే ముంద్రా పోర్టు కాంట్రాక్ట్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాగా విస్తరించారు.
ఎన్నెన్నో ఒడిదుడుకులు ఓర్చుకుని ఈ రోజు దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచారు. ప్రస్తుతం ఈయన నెట్ వర్త్ రూ. 5.9 లక్షల కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఆదానీ టాప్ 10 జాబితాలో మొదటి స్థానం పొందే అవకాశాలు కూడా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment