ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు 'గౌతమ్ అదానీ' గురించి అందరికి తెలుసు. ఆసియా సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న ఈయన.. అదానీ గ్రూపులో పనిచేసే ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే తక్కువ జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
భారతదేశంలోని ఇతర పారిశ్రామక వేత్తల జీతాలతో పోలిస్తే.. అదానీ జీతం చాలా తక్కువ. కరోనా మహమ్మారి సమయంలో ముకేశ్ అంబానీ జీతం తీసుకోవడం మానేశారు. అంతకు ముందు ఈయన వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండేది. భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకులు సునీల్ భారతి మిట్టల్ 2022లో రూ. 16.7 కోట్లు వార్షిక వేతనంగా తీసుకున్నారు. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన రాజీవ్ బజాజ్, పవన్ ముంజాల్.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ జీతం కూడా అదానీ జీతం కంటే చాలా తక్కువ.
అదానీ సంస్థలో పనిచేసే ఏఈఎల్ బోర్డు డైరెక్టర్‌గా పనిచేస్తున్న వినయ్ ప్రకాష్ వార్షిక వేతనంగా మొత్తం 89.37 కోట్ల రూపాయలను అందుకున్నారు. గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ వేతనం రూ.9.45 కోట్లు. దీన్ని బట్టి చూస్తే తన సంస్థలో పనిచేసేవారి జీతం కంటే.. అదానీ తక్కువ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
2024 మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ తీసుకున్న జీతం రూ. 9.26 కోట్లు. ఈ జీతం భారతదేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తలకంటే తక్కువని తెలుస్తోంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2023-24లో అదానీ తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు, దీనితో పాటు రూ. 27 లక్షల విలువైన అలవెన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఈయన తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు. అదానీ పోర్ట్స్, ఎస్ఈజెడ్ లిమిటెడ్ నుంచి రూ.6.8 కోట్లు జీతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment