జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' (Nikhil Kamath) ఏది మాట్లాడినా నెట్టింట్లో వైరల్ అవుతుంది. గతంలో అద్దె ఇల్లు గురించి, పిల్లలు కనడానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన ఈయన, ఇప్పుడు 'మఖానా' (Makhana) గురించి, దాని సాగు నుంచి ఎలా కోట్లు సంపాదించవచ్చు అని చెబుతూ ఓ ట్వీట్ చేశారు.
ఫోటోలను షేర్ చేస్తూ.. ప్రపంచానికి విక్రయించే భారతీయ బ్రాండ్(మఖానా)ను నిర్మించడానికి ఇక్కడ స్థలం ఉంది. ఇది నిజంగా పెద్ద బ్రాండ్. నేను వ్యక్తిగతంగా కూడా మఖానాను ఆకర్షితుడయ్యాను అని నిఖిల్ కామత్ ట్వీట్ (Tweet) చేశారు.
ఫాక్స్ నట్ అని పిలువబడే మఖానా ప్రపంచంలోని అత్యంత సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. ప్రపంచంలో ఎక్కువ మఖానా సరఫరా చేసే దేశాల్లో భారత్ (బీహార్) అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో ఎక్కువ మఖానా ఉత్పత్తి బీహార్‌లో జరుగుతోంది. ఇది అక్కడి ప్రజలకు లాభదాయక పరిశ్రమ కూడా.
బీహార్‌లోని వరద పీడిత ప్రాంతాలు మఖానా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ వరి సాగుకంటే కూడా మఖానా సాగు మూడు రెట్ల ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పంట నీటి వనరులలో సహజంగా వృద్ధి చెందుతుంది. అంతే కాకుండా 'సబోర్ మఖానా-1' రకం వంటి ఇటీవలి ఆవిష్కరణలు దిగుబడిని రెట్టింపు చేశాయి. దీనివల్ల దిగుబడి 40 శాతం నుంచి 60 శాతానికి చేరింది. ఇది మఖానా పండించే రైతులకు ఓ వరంగా మారింది.
కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన మఖానాలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యం మీద ద్రుష్టి సారించేవారిని ఆకర్షిస్తుంది. గుండె ఆరోగ్యం, షుగర్ మెయింటెనెన్స్ వంటి వాటితో పాటు.. బరువును తగ్గించడానికి కావాల్సిన సామర్థ్యం ఇందులో ఉండటం వల్ల దీనికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.13,000 వరకు ఉంటుంది.
ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
మఖానా పరిశ్రమ గడచిన పదేళ్లలో మూడు రెట్లు అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఇందులో సాగుకు సంబంధించిన, ఎగుమతుల విషయంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది. కేవలం 2 శాతం విత్తనాలు మాత్రమే ప్రపంచ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రభుత్వ రాయితీలు కల్పించడం.. సాంకేతిక పురోగతులు ఈ నష్టాలను కొంత వరకు తగ్గించాయి. ఈ కారణంగానే వీటి వృద్ధి క్రమంగా పెరిగింది. నిఖిల్ కామత్ మఖానాకు సంబంధించి ఒక డేటాను కూడా ట్వీట్ చేశారు.
Maybe room here to build a really large brand, an Indian brand that sells to the world.
Personally, I'm hooked on Makhana. pic.twitter.com/eu5yK804Ny— Nikhil Kamath (@nikhilkamathcio) January 17, 2025
Comments
Please login to add a commentAdd a comment