Nikhil Kamath
-
నేనో ఇడియట్‌లా ఫీలయ్యా.. నిఖిల్ కామత్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
ఫిబ్రవరి 14న ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' (Nikhil Kamath) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని చెబుతూనే.. భారతదేశం బాగుంటుందని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.భారతదేశంలోని 25 ఏళ్లలోపు తెలివైన యువ వ్యాపారవేత్తలతో.. ఒకరోజు సమయం గడిపిన తరువాత నేను ఒక ఇడియట్ అని భావిస్తున్నాను. రోజంతా అనవసరమైన మీటింగులతో కాలక్షేపం చేయడం చాలా వృధా.. ఇలాంటి యువకులతో సమయం గడిపితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ తరం నా కంటే చాలా తెలివైనదని నిఖిల్ కామత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే కాకుండా.. ఇది కొత్త భారతదేశం, ఇలాంటి యువకులతో భారతదేశం బాగుంటుందని, చెబుతూ.. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.నిఖిల్ కామత్ పోస్టుపై.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. భారతదేశం అభివృద్ధి చెందడానికి ఇంకెంతో సమయం లేదని ఒకరు.. యువతతో ఎక్కువ సమయం గడపడానికి.. వారిని ప్రోత్సహించడానికి సమయం కేటాయించాలని మరొకరు కామెంట్స్ చేశారు. ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్.. ఆలస్యమైతే డబుల్ ఛార్జ్జెరోధా వృద్ధికి నితిన్ కామత్ తోడుజెరోధా కంపెనీ వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. ఈ కంపెనీ అభివృద్ధి చెందటానికి.. నా సోదరుడు, జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ (Nithin Kamath) కూడా కారణం. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయాలను నేను చూసుకుంటే.. బ్రోకింగ్ సంబంధిత పనులన్నీ కూడా నితిన్ చూసుకుంటాడు. మా మధ్య అప్పుడప్పుడు అభిప్రాయం బేధాలు వచ్చినా.. తరువాత సామరస్యంగా ముందుకు వెళ్తామని నిఖిల్ కామత్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Nikhil Kamath (@nikhilkamathcio) -
నిఖిల్ కామత్ సూపర్ ఫుడ్ ఇదే..! దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందా..?
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్(Nikhil Kamath)) అవిసే గింజలు, మఖానాలను ఇష్టంగా తింటానని ఒక ఇంటర్యూలో అన్నారు. భారతదేశంలో తదుపరి సూపర్ ఫుడ్(superfood) మఖానాలేనని కూడా చెప్పారు. ఆరోగ్య స్ప్రుహ ఉన్న ఈ ఆధునిక కాలంలో కచ్చితంగా గొప్ప ఆరోగ్య ఆహార బ్రాండ్‌గా అవతరిస్తుందని అన్నారు. ఇది డయాబెటిస్, కొలస్ట్రాల్, రక్తపోటు సమస్యలను అద్భుతంగా అదుపులో ఉంచుతుందని చెప్పారు. ఇది నిజంగానే దీర్ఘకాలిక వ్యాధుల(chronic illnesses)ను నివారించడంలో సహాయపడుతుందా అంటే..పోషకాల ప్రొఫైల్..మఖానా(Makhana)లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మఖానాలో 9 శాతం ప్రోటీన్, ఫైబర్‌తో నిండి ఉంటుంది. సహజంగా లభించే సోడియం చాలా తక్కువ సాంద్రతలను కలిగి ఉంటుంది. దీనిలో కొద్దిపాటి కొవ్వు మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్(MufA) రూపంలో ఉంటుంది. పైగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెరను నిర్వహించడానికి, శరీర కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికీ అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందట. మఖానాలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు కేన్సర్ నిరోధక లక్షణాలను పెంచుతుందట. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ ఎంజైమ్‌లు మూత్రపిండాలు శుభ్రపరచడానికి కూడా ఉపయోగపడుతుందట. పెద్దలకు 25-30 గ్రాములు, పిల్లలకు 10-20 గ్రాములు చొప్పున తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని స్మూతీలు, కూరలు, స్నాక్‌ల రూపంలో తీసుకోవచ్చు. అయితే పాలతో మరింత పోషక విలువలను అందిస్తుందట. అలాగే ఇక్కడ తినమగానే.. ప్యాకింగ్ చేసిన రోస్ట్ మఖానాలు మాత్రం తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఇవి ప్రయోజనాల కంటే అనారోగ్యకరమైన ప్రమాదాలనే ఎక్కువగా అందిస్తుందని సూచిస్తున్నారు. (చదవండి: తలనే లాక్ చేశాడు..! తాళం మాత్రం భార్య చేతిలో..) -
కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్
జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' (Nikhil Kamath) ఏది మాట్లాడినా నెట్టింట్లో వైరల్ అవుతుంది. గతంలో అద్దె ఇల్లు గురించి, పిల్లలు కనడానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన ఈయన, ఇప్పుడు 'మఖానా' (Makhana) గురించి, దాని సాగు నుంచి ఎలా కోట్లు సంపాదించవచ్చు అని చెబుతూ ఓ ట్వీట్ చేశారు.ఫోటోలను షేర్ చేస్తూ.. ప్రపంచానికి విక్రయించే భారతీయ బ్రాండ్(మఖానా)ను నిర్మించడానికి ఇక్కడ స్థలం ఉంది. ఇది నిజంగా పెద్ద బ్రాండ్. నేను వ్యక్తిగతంగా కూడా మఖానాను ఆకర్షితుడయ్యాను అని నిఖిల్ కామత్ ట్వీట్ (Tweet) చేశారు.ఫాక్స్ నట్ అని పిలువబడే మఖానా ప్రపంచంలోని అత్యంత సూపర్‌ఫుడ్‌లలో ఒకటి. ప్రపంచంలో ఎక్కువ మఖానా సరఫరా చేసే దేశాల్లో భారత్ (బీహార్) అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో ఎక్కువ మఖానా ఉత్పత్తి బీహార్‌లో జరుగుతోంది. ఇది అక్కడి ప్రజలకు లాభదాయక పరిశ్రమ కూడా.బీహార్‌లోని వరద పీడిత ప్రాంతాలు మఖానా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ వరి సాగుకంటే కూడా మఖానా సాగు మూడు రెట్ల ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పంట నీటి వనరులలో సహజంగా వృద్ధి చెందుతుంది. అంతే కాకుండా 'సబోర్ మఖానా-1' రకం వంటి ఇటీవలి ఆవిష్కరణలు దిగుబడిని రెట్టింపు చేశాయి. దీనివల్ల దిగుబడి 40 శాతం నుంచి 60 శాతానికి చేరింది. ఇది మఖానా పండించే రైతులకు ఓ వరంగా మారింది.కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు, ఫాస్పరస్, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన మఖానాలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యం మీద ద్రుష్టి సారించేవారిని ఆకర్షిస్తుంది. గుండె ఆరోగ్యం, షుగర్ మెయింటెనెన్స్ వంటి వాటితో పాటు.. బరువును తగ్గించడానికి కావాల్సిన సామర్థ్యం ఇందులో ఉండటం వల్ల దీనికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.13,000 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టంమఖానా పరిశ్రమ గడచిన పదేళ్లలో మూడు రెట్లు అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఇందులో సాగుకు సంబంధించిన, ఎగుమతుల విషయంలో అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది. కేవలం 2 శాతం విత్తనాలు మాత్రమే ప్రపంచ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రభుత్వ రాయితీలు కల్పించడం.. సాంకేతిక పురోగతులు ఈ నష్టాలను కొంత వరకు తగ్గించాయి. ఈ కారణంగానే వీటి వృద్ధి క్రమంగా పెరిగింది. నిఖిల్ కామత్ మఖానాకు సంబంధించి ఒక డేటాను కూడా ట్వీట్ చేశారు.Maybe room here to build a really large brand, an Indian brand that sells to the world.Personally, I'm hooked on Makhana. pic.twitter.com/eu5yK804Ny— Nikhil Kamath (@nikhilkamathcio) January 17, 2025 -
నేను దేవుణ్ని కాను...
న్యూఢిల్లీ: ‘‘తప్పులు చేయడం మానవ సహజం. తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘నేను దేవుడిని కాదు. సామాన్య మానవుడినే. కాబట్టి నేను కూడా తప్పులు చేశా’’ అని అంగీకరించారు. అయితే తాను చేసిన తప్పుల్లో చెడు ఉద్దేశం ఏనాడూ లేదని స్పష్టం చేశారు. మనుషులు చేసే తప్పుల వెనుక ప్రమాదకరమైన ఉద్దేశాలు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. ‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు మోదీ ఆదివారం తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. తన రాజకీయ ప్రస్థానంతో సహా పలు అంశాలపై మనసు విప్పారు. తన జీవితంలోని అనేక దృక్కోణాలను ప్రస్తావించారు. తప్పులు చేస్తానని తాను తొలిసారి సీఎం అయినప్పుడే ప్రజలకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ తప్పుల్లో చెడు ఉద్దేశం మాత్రం ఉండదని వివరించానన్నారు. పాడ్‌కాస్ట్‌లో మోదీ ఏం చెప్పారంటే... గోద్రాలో భావోద్వేగాలు అదుపు చేసుకున్నా ‘‘గుజరాత్ సీఎం అయిన తొలినాళ్లలో ఓ సభలో మాట్లాడుతూ మూడు విషయాలు ప్రజలతో పంచుకున్నా. ‘‘నా కృషిలో ఏ లోపమూ లేకుండా జాగ్రత్త పడతా. నాకోసం ఏదీ చేసుకోను. మనిషిని కాబట్టి తప్పులు చేస్తా, కానీ వాటిలో చెడుద్దేశం ఉండబోదు’’ అని వివరించా. ఆ మూడూ నాకు జీవన మంత్రాలు! 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైలు దహనం గురించి తెలియగానే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. చూస్తే హెలికాప్టర్ అందుబాటులో లేదు. చివరకు బహుశా ఓఎన్జీసీకి చెందిన సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ సమకూర్చినా, అది వీఐపీలకు ఉద్దేశించింది కాదంటూ భద్రతా సిబ్బంది అభ్యంతరపెట్టారు. ‘నేను వీఐపీని కాను, మామూలు పౌరుడినే’నని బదులిచ్చి అందులోనే గోద్రా చేరుకున్నా. అందుకోసం ఎంతో వాదించాల్సి వచ్చింది. చివరికి, ఏం జరిగినా నాదే బాధ్యత అని రాసివ్వడానికి కూడా సిద్ధపడ్డా. అంతే తప్ప రిస్క్ చేయడానికి వెనకాడలేదు. తీరా వెళ్లాక గోద్రాలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. నేనూ మనిషినే. నాకూ భావోద్వేగాలుంటాయి. కానీ సీఎంను గనుక వాటికి దూరంగా ఉండాలని నాకు తెలుసు. అందుకే భావోద్వేగాలను అదుపు చేసుకున్నా. అందుకోసం మానసికంగా చేయగలిగిందంతా చేశా. ఆ ఫలితాల రోజు నాలో ఆదుర్దా కలగలేదని చెప్పలేను. కానీ దాన్ని అధిగమించాలని గట్టిగా అనుకున్నా. అందుకే మధ్యాహ్నం దాకా ఫలితాల గురించి నాకు చెప్పొద్దని సిబ్బందికి సూచించా. ఆ రోజు టీవీ కూడా చూడలేదు. మధ్యాహ్నానికల్లా నా ఇంటిముందు ఆనందోత్సాహాలు మిన్నంటాయి. చూస్తే మాకు మూడింట రెండొంతుల మెజారిటీ దక్కింది. మిత్రులు నన్ను సీఎంగానే చూసేవారు నా చిన్నప్పుడు అప్పుడప్పుడు మా కుటుంబ సభ్యుల బట్టలు ఉతికేందుకు ఇష్టపడేవాడిని. అలాగైతే చెరువు దగ్గరికి వెళ్లనిస్తారు కదా! సీఎం అయ్యాక కూడా చిన్నప్పటి మిత్రులను అధికారిక నివాసానికి ఆహా్వనిస్తూ ఉండేవాడిని. కానీ వారు నన్ను సీఎంగానే చూసేవారు. దాంతో నన్ను ‘నీవు’ అని పిలిచేవారే కరువయ్యారు. రాజకీయాల్లో సొంత లాభం కూడదు వ్యాపారానికి, రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యాపారంలో వ్యక్తిగత, ఆర్థిక అభివృద్ధే ముఖ్యం. రాజకీయాల్లో మాత్రం సమాజ సంక్షేమానికే ప్రాధాన్యమివ్వాలి. అందుకు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సొంత లాభం మానుకోవాలి. వ్యాపారంలో ఎలా పైకి ఎదగాలన్నదే కీలకం. రాజకీయాల్లో త్యాగాలెలా చేయాలన్నది కీలకం. వ్యాపారంలో కంపెనీని నంబర్‌వన్‌గా ఎలా మార్చాలో ఆలోచించాలి. రాజకీయాల్లో మాత్రం దేశమే తొలి ప్రాధాన్యం కావాలి. దేశాన్ని నంబర్‌వన్‌గా మార్చే ఆలోచన చేయాలి. రాజకీయాలంటే కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కాదు. అది ప్రజాసేవకు సంబంధించిన అంశం. వ్యక్తిగత ఆశల కంటే ప్రజాసేవే పరమావధి కావాలి. అంతేతప్ప రాజకీయాలంటే ‘లేనా, పానా, బనానా (దండుకోవడం)’ కాదు. అలాంటివారు దీర్ఘకాలం కొనసాగలేరు.కంఫర్ట్ జోన్లో ఉండలేను నేనెప్పుడూ కంఫర్ట్ జోన్లో జీవించలేదు. అలా ఉండిపోయేవారు విజయాలు సాధించలేరు. కంఫర్ట్ జోన్ బయట ఉన్నా గనుక ఏం చేయాలో నాకు తెలిసింది. సురక్షిత స్థానంలో ఉండిపోవడానికి నేను సరిపోనేమో! రిస్క్ తీసుకొనే మనస్తత్వమే మనల్ని ముందుకు నడుపుతుంది. అయితే రిస్క్ తీసుకొనే సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వాడుకోలేదు. చిన్నచిన్న విషయాలే నాకు సంతృప్తినిచ్చాయి. పాత ఆలోచనలు వదిలేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. నాది సాధారణ నేపథ్యంనేను అతి సాధారణమైన నేపథ్యం నుంచి వచ్చా. నేను ప్రాథమిక పాఠశాల టీచర్నయినా నా తల్లి ఆనందంతో అందరికీ స్వీట్లు పంచేదేమో! అలాంటి నేపథ్యం నాది. చిన్నప్పుడు స్కూల్లో సాధారణ విద్యార్థినే. కేవలం పాసయ్యేందుకు చదివేవాడిని. ఇతర కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. సైనిక్ స్కూల్లో చేరేందుకు దరఖాస్తు చేయడానికి నా తండ్రి అంగీకరించలేదు. డబ్బు లేకపోవడమే అందుకు కారణం. అయినా నేనెప్పుడూ అసంతృప్తి చెందలేదు. జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులే నాకు యూనివర్సిటీ. అవే నాకెన్నో పాఠాలు నేర్పాయి. పుట్టుక, చావు గురించి నేనేనాడూ ఆలోచించలేదు. సీఎం అయినప్పుడు నేనెలా అయ్యానని ఆశ్చర్యపోయా’’. గాంధీ ఎన్నడూ టోపీ ధరించకున్నా.. ‘‘మహాత్మా గాంధీ తన జీవితంలో ఎన్నడూ టోపీ ధరించలేదు. కానీ గాంధీ టోపీని ప్రపంచమంతా నేటికీ గుర్తుంచుకుందంటే ఆయన నాయకత్వ పటిమే కారణం. గాంధీ గొప్ప వక్త కాకపోయినా ప్రజలతో మమేకమయ్యే విషయంలో ఆయనకు ఆయనే సాటి! తన వ్యక్తిత్వం, పనితీరుతో దేశమంతటినీ ఒక్కటి చేసి చూపాడు! రాజకీయాల్లో ప్రవేశించడం సులువే. కానీ రాణించడమే కష్టం. అందుకు తిరుగులేని అంకితభావం, ప్రజలతో మమేకమవడం, వారి మంచి చెడుల్లో అండగా నిలవడం, చక్కని భావ వ్యక్తీకరణ వంటి లక్షణాలు చాలా అవసరం. అందుకే వ్యక్తిగత ఆకాంక్షలు లేని, నిస్వార్థంగా దేశ సేవ చేయాలన్న భావన నరనరానా నింపుకున్న కనీసం లక్షమంది యువకులు కావాలిప్పుడు’’.‘మెలోడీ’ మీమ్స్‌పై.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో తన పేరును కలిపి మెలోడీ అంటూ సాగిన మీమ్స్ వెల్లువను ప్రస్తావించగా మోదీ సరదాగా స్పందించారు. ‘‘అలాంటివి నడుస్తూనే ఉంటాయి (వోతో చల్తా హీ రహేగా)’’ అన్నారు. అలాంటి వాటిపై సమ యం వృథా చేసుకోనన్నారు. ‘‘నేను భోజనప్రియుణ్ని కాదు. పర్యటనలప్పుడు అందుబాటులో ఉన్నది తింటా. రెస్టారెంట్‌కు తీసుకెళ్లి మెనూ చేతికిస్తే ఏం కావాలో ఆర్డర్ కూడా ఇవ్వలేను. అలాంటప్పుడు దివంగత అరణ్ జైట్లీ నన్ను ఆదుకునేవారు’’ అని చెప్పుకొచ్చారు.జిన్‌పింగ్‌తో ప్రత్యేక బంధం చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో తన తొలి సంభాషణను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘2014లో నేను ప్రధాని అయ్యాక ఎందరో దేశాధినేతలు అభినందనలు తెలియజేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా మాట్లాడారు. ఇండియాలో పర్యటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘తప్పకుండా రండి, మీకు స్వాగతం’ అని చెప్పాను. ‘‘గుజరాత్లో మీ సొంతూరు వాద్‌నగర్‌ను సందర్శించాలని ఉంది. ఎందుకంటే మనిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉంది. అలనాటి ప్రఖ్యాత చైనా తత్వవేత్త, పర్యాటకుడు హుయాన్‌త్సాంగ్ వాద్నగర్లో చాలాకాలం నివసించారు. చైనాకు తిరిగొచ్చాక నా స్వగ్రామంలో నివసించారు’ అని జిన్‌పింగ్ చెప్పుకొచ్చారు’’ అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు.An enjoyable conversation with @nikhilkamathcio, covering various subjects. Do watch... https://t.co/5Q2RltbnRW— Narendra Modi (@narendramodi) January 10, 2025 ప్రధాని రేసులో నేనూ ఉన్నా.. భారత సంతతి కెనడా ఎంపీ -
38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?
హురున్ ఇండియా విడుదల చేసిన 2024 దాతృత్వ జాబితాలో.. టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు 'శివ్ నాడార్' రూ. 2153 కోట్లు విరాళమిచ్చి అగ్రగామిగా నిలిచారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ, బజాజ్ ఫ్యామిలీ, కుమారమంగళం బిర్లా.. వంటి వారు ఉన్నారు. అయితే ఈ కథనంలో పిన్న వయసులో ఎక్కువ విరాళమిచ్చిన వ్యక్తిని గురించి తెలుసుకుందాం.38 ఏళ్ల నిఖిల్ కామత్ రెయిన్‌మాటర్ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు రూ. 120 కోట్లను విరాళంగా ఇచ్చినట్లు హురున్ ఇండియా జాబితా ద్వారా తెలిసింది. దీంతో భారతదేశంలో చిన్న వయసులో ఎక్కువ డబ్బును దాతృత్వ కార్యక్రాలకు వెచ్చించిన వ్యక్తిగా నిఖిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. రూ. 100 కోట్లకు పైగా విరాళాలు అందించిన వారిలో ఈయన 15వ స్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్నిఖిల్ కామత్ తరువాత.. జాబితాలో ఎక్కువ విరాళాలు అందించిన ఇతర యువ పరోపకారులలో వివేక్ వకీల్, మాధవకృష్ణ సింఘానియా, సరందర్ సింగ్, వరుణ్ అమర్ వాకిల్, రాఘవపత్ సింఘానియా కూడా వున్నారు. అయితే నిఖిల్ కామత్ ఈ జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. యువ వ్యాపారవేత్తలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. -
మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు. -
‘ఏథర్’లో ఉన్నదంతా అమ్మేసుకున్న సచిన్ బన్సాల్
ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీలో తనకున్న 7.5 వాటానంతా అమ్మేసుకుని ఆ సంస్థ నుంచి వైదొలిగారు. 2014 నుంచి ఏథర్ కంపెనీలో దాదాపు రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తొలి ఇన్వెస్టర్లలో బన్సాల్ ఒకరు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. తన వాటాలో 2.2 శాతం భాగాన్ని హీరో మోటోకార్ప్‌కు రూ .124 కోట్లకు విక్రయించిన సచిన్ బన్సాల్ మిగిలిన 5.3 శాతం వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు సుమారు రూ .282 కోట్లకు విక్రయించారు. ఈ డీల్ తర్వాత ఈవీ స్టార్టప్‌లో హీరో మోటోకార్ప్ వాటా 40 శాతానికి పెరగనుంది.2024 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ టర్నోవర్ రూ.1,753 కోట్లుగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.1,784 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తగ్గిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. -
అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
జెరోధా ఫౌండర్ 'నిఖిల్ కామత్' ఇటీవల పిల్లలు కనటం, పెంపకం గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. వారసత్వం కోసం పిల్లలను కనటం అనేది సరైనది కాదని తన అభిప్రాయాలను వెల్లడించారు. తన ప్రస్తుత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తానని, పిల్లల పెంపకం కోసం తన జీవితంలో ఎక్కువ రోజులను అంకితం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.వేలకోట్ల సంపాదించినప్పటికీ.. నిఖిల్ కామత్ ఇప్పటికి కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. డబ్బు విషయంలో చాలా స్పష్టంగా ఉండే ఈయన.. పిల్లల విషయంలో మాత్రం కొంత భిన్నంగా ఆలోచిస్తున్నారు. పిల్లలు ఉంటె వారి కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది తనకు ఇష్టం లేనట్లు పేర్కొన్నారు. జీవితంలో పిల్లల కోసం ఎక్కువ రోజులు వెచ్చించాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.పిల్లలను కంటే.. వారి సంరక్షణ కోసం జీవితంలో 18 నుంచి 20 ఏళ్ళు వెచ్చించాలి. అంటే జీవితంలో 18-20 సంవత్సరాలు వృధా కావచ్చు. ఇది తనకు ఇష్టం లేదని కామత్ అన్నారు. మరణం తరువాత గుర్తుండిపోయేలా.. పిల్లలను కనటంలో ప్రయోజనం ఏమిటి?, నువ్వు రావాలి, బాగా జీవించాలి, నీ జీవితంలో కలిసే వారితో మంచిగా ఉండాలి అని నాకు అనిపిస్తుందని నిఖిల్ కామత్ అన్నారు.భారతీయుడి సగటు జీవిత కాలం 72 సంవత్సరాలు. నా వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. అంటే నేను ఇంకో 35 సంవత్సరాలు జీవిస్తాను. అయితే ఇప్పటికి సంపాదించినా డబ్బును బ్యాంకుల్లో వృధాగా వదిలేయలేను. కాబట్టి నేను సంపాదించే డబ్బును స్వచ్చంద సంస్థలకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
రతన్ టాటా వెనుకుండి నడిపిస్తున్న కంపెనీ..!
-
జెరోధా : కామత్ సోదరులు తీసుకునే జీతాలెంతో తెలుసా?
భారత్‌లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ జెరోధా వ్యవస్థాపకులు నితిన్, నిఖిల్ కామత్ సోదరులు ఒక్కొక్కరు దాదాపు రూ.72 కోట్ల వార్షిక వేతనాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం 2022-2023 కాలానికి ఇద్దరూ కలిపి రూ.195.4 కోట్లు తీసుకున్నారని ఎన్‌ట్రాకర్ నివేదిక తెలిపింది. జెరోధా సీఈఓ నితిన్ కామత్ భార్య సీమా పాటిల్ రూ.36 కోట్లు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేణుమాధవ్ రూ.15.4 కోట్లు తీసుకుంటున్నారు. ఇక జెరోధాకు మొత్తం ముగ్గురు డైరక్టర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు కామత్ బ్రదర్స్. కాగా.. డైరక్టర్లు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవచ్చని 2021లో బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇక ఆర్ధిక సంవత్సరం 2023లో జీరోదా ఎంప్లాయీ బెనిఫిట్ 35.7శాతం పెరిగి రూ. 623 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరంలో అది రూ. 459 కోట్లుగా ఉండేది. వందల కోట్లలో జీతాలు డైరక్టర్లతో సహా.. ఉద్యోగులకు రూ. 380 కోట్లను జీతాలుగా ఇచ్చింది జీరోదా. ముఖ్యంగా రూ. 623 కోట్లల్లో రూ. 236 కోట్లను ఈఎస్ఓపీ (ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప2 ప్లాన్) కోసం కేటాయించింది. బ్రోకరేజ్ సంస్థగా జెరోధా వాల్యూ 3.6 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ. 30వేల కోట్లు. 2021లో ఇది 2 బిలియన్ డాలర్లుగా ఉండేది. సంస్థ వాల్యూ అనతికాలంలో ఏకంగా 80శాతం వృద్ది చెందింది. 'గ్రో'తో పోటీ..! ఇటీవలి కాలంలో భారతీయుల్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్‌పై ఆసక్తి, అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తూ, యాక్టివ్‌గా ఉంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. జీరోదా ఆదాయానికి ఇది ఒక కారణమని తెలుస్తోంది. అయితే.. ఈ బ్రోకరేజ్ ఇండస్ట్రీలో పోటీకూడా అదే విధంగా పెరుగుతోంది. జెరోధాకు ‘గ్రో’ అనే మరో స్టాక్‌బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. 2023 సెప్టెంబర్ నెల చివరికి.. జెరోధాలో 6.48 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉండగా.. గ్రో లో 6.63 మిలియన్ మంది యాక్టివ్‌గా ఉన్నారని డేటా చెబుతోంది. -
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
పిన్న వయసులోనే రూ.110 కోట్లు విరాళం
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఆయన సోదరుడు కంపెనీ సీఈఓ నితిన్ కామత్ 2023 ఏడాదికి గాను రూ.110 కోట్లు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ 2023లో చోటు సంపాదించారు. అయితే ఈ లిస్ట్‌లో చోటు సాధించిన వారిలో నిఖిల్ కామత్ పిన్న వయస్కుడు. గడిచిన ఏడాదిలో ఇద్దరు సోదరులు సమిష్టిగా తమ విరాళాన్ని 300 శాతం పెంచి రూ.100 కోట్ల దాతృత్వాన్ని ప్రకటించినట్లు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 వెల్లడించింది. అయితే ఈ ఏడాది దేశంలో తొమ్మిదో అతిపెద్ద దాతగా వీరు వార్తల్లో నిలిచారు. అయితే 2021లో వీరిద్దరూ తమ వ్యక్తిగత సంపదలో నాలుగింట ఒక వంతు విరాళంగా ఇవ్వాలని ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో రూ.750 కోట్లను తిరిగి ఇచ్చే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు. వాతావరణ మార్పు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు తన సంపదలో 50 శాతం విరాళమిస్తానని గతంలో నిఖిల్ కామత్ ప్రకటించారు. వారెన్‌బఫెట్, మిలిందాగేట్స్, బిల్‌గేట్స్ స్థాపించిన గివింగ్ప్లెడ్జ్పై నిఖిల్కామత్ సంతకం చేశారు. ఇందులో చేరిన నాలుగో భారతీయుడు కామత్. విప్రో మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా, నందన్ నీలేకని తర్వాత నిఖిల్ గివింగ్‌ప్లెడ్జ్ కమ్యునిటీలో చేరారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం నిఖిల్ మొత్తం రూ.27వేల కోట్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. నిఖిల్ తన సొంత ఫౌండేషన్ యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (వైఐపీపీ) ద్వారా కొన్ని స్టార్టప్ కంపెనీలతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. -
అందుకే కొనను: అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పిన బిలియనీర్
అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ గుట్టు విప్పారు ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath). భారతదేశ యంగెస్ట్ బిలియనీర్ అయిన ఆయన.. తన పాడ్‌కాస్ట్ 'WTF ఈజ్ విత్ నిఖిల్ కామత్' తాజా ఎపిసోడ్లో మాట్లాడుతూ తాను అల్ట్రా లగ్జరీ బ్రాండ్స్ కొనడం ఆపేనట్లు చెప్పారు. హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాన్ని నిఖిల్ కామత్ తప్పుపట్టారు. అది ఒకరకంగా కస్టమర్లను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు కస్టమర్లకు ఉత్పత్తిని నేరుగా విక్రయించకుండా "సంబంధాన్ని పెంచుకునేలా" చేస్తాయన్నారు. అంతిమంగా కస్టమర్లకు ఉత్పత్తులు చేరేలోపు వారిని రకరకాల ఛట్రాల్లో ఇరికిస్తాయన్నారు. ఇదంతా తమ ఉత్పత్తులకు విలువను పెంచుకునే ఎత్తుగడలో భాగమేనన్నారు. “గత 3-4 సంవత్సరాలుగా నేను హెర్మేస్, లూయిస్ విట్టన్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్ల ఉత్పత్తులు కొనడం పూర్తిగా ఆపేశాను. ఎందుకంటే వారు కస్టమర్లతో ఆడుకుంటున్నారు. కస్టమర్లను ఊరించి ఫలితం పొందడమే వారి మార్కెటింగ్ వ్యూహం” అని కామత్ తన పోడ్కాస్ట్లో అన్నారు. తప్పుడు వ్యూహం! ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అహంకారంతో కూడిన వ్యూహంగా నిఖిల్ కామత్ భావిస్తున్నారు. “వారు ఈ బ్యాగ్‌లు, వస్తువులను మిలియన్ల కొద్దీ తయారు చేయగలరు. కానీ అహంకారంతో కూడిన వ్యూహంతోనే ఇలా పరిమితంగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్నారు. కస్టమర్లు దీన్ని గమనించాలి” అన్నారు. హెర్మేస్ వంటి అల్ట్రా-లగ్జరీ బ్రాండ్లు వాటి ప్రత్యేకత, పరిమిత లభ్యతకు ప్రసిద్ధి చెందాయి. కస్టమర్లు హెర్మేస్ హ్యాండ్‌బ్యాగ్‌ను కొనుగోలు చేయాలంటే ముందుగా అనేక చిన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. -
Rhea Chakraborty-Nikhil Kamath: ప్రేమలో పడ్డ సుశాంత్ సింగ్ ప్రేయసి.. అతడెవరో తెలుసా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు బాలీవుడ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెపోబ్యాచ్ సుశాంత్‌ను సైడ్ చేయడం వల్లే అతడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు ఆక్రందన చెందారు. నటుడిది ఆత్మహత్య కాదని.. సినిమా ఇండస్ట్రీనే హత్య చేసిందని ఆరోపించారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి కూడా అతడి మరణానికి కారణమంటూ ఆరోపణలు సైతం వెలువడ్డాయి. అటు సుశాంత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం కూడా వెలుగు చూసిన సంగతి తెలిసిందే! ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రియా జైలు శిక్ష సైతం అనుభవించింది. ఈ విమర్శలు, తీవ్రమైన నెగెటివిటీ, ఆరోపణలు, కోర్టు కేసుల ఫలితంగా రియా చక్రవర్తికి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి మామూలవుతున్న ఆమె తాజాగా ప్రేమలో పడిందంటూ ఓ పుకారు షికారు చేస్తోంది. జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని రెడ్డిట్‌లో ఓ రూమర్ వైరలవుతోంది. రియా ప్రేమలో పడిదంటూ వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ విరాట్ కోహ్లి మేనేజర్ బంటీ సాజ్దేతో ప్రేమలో పడిందని వార్తలు రాగా అవన్నీ వట్టి పుకారుగానే తేలిపోయింది. మరి ఇప్పుడు నిఖిల్ కామత్‌తో ప్రేమాయణంలో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. చదవండి: హీరోయిన్ రిఫర్ చేసింది.. కానీ డైరెక్టర్ ఆ మాట అని రిజెక్ట్ చేశాడు.. అర్జున్ కల్యాణ్ -
జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘జెరోధా’ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నిఖిల్ కామత్ (34) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంపదలో సగం సమాజానికి దానమిస్తున్నట్టు ప్రతిజ్ఞను తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే ‘ద గివింగ్ ప్లెడ్జ్’లో చేరి ప్రసిద్ధ పెట్టుబడిదారులు సరసన చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు తమ సంపదను దానం చేస్తామని ప్రకటించిన నాలుగో భారతీయుడు, భారతదేశపు అతి పిన్న వయస్కుడు నిఖిల్ కామత్ కావడం గమనార్హం. ఒక యువ పరోపకారిగా గివింగ్ ప్లెడ్జ్ (సంపద దానం చేస్తూ ప్రమాణం చేయడం) లో చేరడాన్ని గౌరవంగా భావిస్తూన్నానని, ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపించేందుకు తానీ నిర్ణయించుకున్నాను అని కామత్ వెల్లడించాడు. మరింత సమానత్వంతో కూడిన సమాజం అనే ఫౌండేషన్ లక్ష్యం తన ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) దేశీయంగా విప్రో అజీమ్ ప్రేమ్ జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి ఈ కార్యక్రమంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యుల ఆర్థిక వనరులలో ఎక్కువ భాగం లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా ఇస్తారు. అలాగే నితిన్ కామత్ నేతృత్వంలోని రెయిన్‌మాటర్ ఫౌండేషన్, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి వీటికనుగుణంగా జీవనోపాధికి మద్దతుగా పనిచేసే సంస్థలకు మద్దతు ఇస్తుంది. 90 శాతం మందికి చెందాల్సింది కేవలం 10 శాతం మందికే 2021లో ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశంలో 90 శాతం మందికి చెందాల్సినవి కేవలం 10 శాతం మంది చేతిలో ఉండకూడదు. జీవితంలో ముందుగానే ఇవ్వడం ప్రారంభించమని ప్రజలను ప్రోత్సహించాలనే ఫిలాంత్రపి ఫిలాసఫి అని చెప్పుకొచ్చారు. రోజుల్లో యువకులుగా డబ్బులు సంపాదించడం మొదలుపెడితే, అది రెండింతలు, పదింతలు అవుతుంది. మన లైఫ్ స్టయిల్‌గా పెద్దగామారదు. మరి సంపాదించిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. అలా కాకుండా మన చుట్టూ ఉన్న, అవసరమైన వారికి సహాయపడే విధంగా ఆ డబ్బును వినియోగిస్తే ఆ కిక్కే వేరని కామత్ అన్నారు. ఇదీ చదవండి: రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ఫోర్బ్స్ ప్రకారం, కామత్ 3.45 బిలియన్ల డాలర్ల (రూ. 28 వేల కోట్లు) సంపదలో 50 శాతాన్ని కట్టుబడివాతావరణ మార్పు, శక్తి, విద్య ,ఆరోగ్యం వంటి విషయాలకు విరాళమివ్వడానికి నిర్ణయించుకున్నా నంటూ తన ప్రతిజ్ఞ లేఖలో చెప్పారు. దీనికి అదనంగా, యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (YIPP), వ్యవస్థాపకులతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతం స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తారు. జెరోధా సహ వ్యవస్థాపకులు సోదరులు నిఖిల్, నితిన్ కామత్ అనేక దాతృత్వ విరాళాలకు ప్రసిద్ధి చెందారు. కామత్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి 2022లో రూ.100 కోట్ల వ్యక్తిగత సంపదను విరాళంగా ఇచ్చారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 ప్రకారం వీరి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సాయం 300 శాతం ఎక్కువ. దేశీయంగా తొమ్మిదో అతిపెద్ద ఫిలాంత్రపిస్టులుగా ఉన్నారు. 2010లో వారెన్ బఫెట్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ‘ద గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గివింగ్ ప్లెడ్జ్‌పై 29 దేశాలకు చెందిన దాదాపు 241 మంది పరోపకారులు సంతకాలు చేశారు.(నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం)