ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘జెరోధా’ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నిఖిల్ కామత్ (34) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంపదలో సగం సమాజానికి దానమిస్తున్నట్టు ప్రతిజ్ఞను తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే ‘ద గివింగ్ ప్లెడ్జ్’లో చేరి ప్రసిద్ధ పెట్టుబడిదారులు సరసన చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు తమ సంపదను దానం చేస్తామని ప్రకటించిన నాలుగో భారతీయుడు, భారతదేశపు అతి పిన్న వయస్కుడు నిఖిల్ కామత్ కావడం గమనార్హం.
ఒక యువ పరోపకారిగా గివింగ్ ప్లెడ్జ్ (సంపద దానం చేస్తూ ప్రమాణం చేయడం) లో చేరడాన్ని గౌరవంగా భావిస్తూన్నానని, ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపించేందుకు తానీ నిర్ణయించుకున్నాను అని కామత్ వెల్లడించాడు. మరింత సమానత్వంతో కూడిన సమాజం అనే ఫౌండేషన్ లక్ష్యం తన ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ)
దేశీయంగా విప్రో అజీమ్ ప్రేమ్ జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి ఈ కార్యక్రమంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యుల ఆర్థిక వనరులలో ఎక్కువ భాగం లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా ఇస్తారు. అలాగే నితిన్ కామత్ నేతృత్వంలోని రెయిన్‌మాటర్ ఫౌండేషన్, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి వీటికనుగుణంగా జీవనోపాధికి మద్దతుగా పనిచేసే సంస్థలకు మద్దతు ఇస్తుంది.
90 శాతం మందికి చెందాల్సింది కేవలం 10 శాతం మందికే
2021లో ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశంలో 90 శాతం మందికి చెందాల్సినవి కేవలం 10 శాతం మంది చేతిలో ఉండకూడదు. జీవితంలో ముందుగానే ఇవ్వడం ప్రారంభించమని ప్రజలను ప్రోత్సహించాలనే ఫిలాంత్రపి ఫిలాసఫి అని చెప్పుకొచ్చారు. రోజుల్లో యువకులుగా డబ్బులు సంపాదించడం మొదలుపెడితే, అది రెండింతలు, పదింతలు అవుతుంది. మన లైఫ్ స్టయిల్‌గా పెద్దగామారదు. మరి సంపాదించిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. అలా కాకుండా మన చుట్టూ ఉన్న, అవసరమైన వారికి సహాయపడే విధంగా ఆ డబ్బును వినియోగిస్తే ఆ కిక్కే వేరని కామత్ అన్నారు.
ఇదీ చదవండి: రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా?
ఫోర్బ్స్ ప్రకారం, కామత్ 3.45 బిలియన్ల డాలర్ల (రూ. 28 వేల కోట్లు) సంపదలో 50 శాతాన్ని కట్టుబడివాతావరణ మార్పు, శక్తి, విద్య ,ఆరోగ్యం వంటి విషయాలకు విరాళమివ్వడానికి నిర్ణయించుకున్నా నంటూ తన ప్రతిజ్ఞ లేఖలో చెప్పారు. దీనికి అదనంగా, యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (YIPP), వ్యవస్థాపకులతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతం స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తారు.
జెరోధా సహ వ్యవస్థాపకులు సోదరులు నిఖిల్, నితిన్ కామత్ అనేక దాతృత్వ విరాళాలకు ప్రసిద్ధి చెందారు. కామత్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి 2022లో రూ.100 కోట్ల వ్యక్తిగత సంపదను విరాళంగా ఇచ్చారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 ప్రకారం వీరి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సాయం 300 శాతం ఎక్కువ. దేశీయంగా తొమ్మిదో అతిపెద్ద ఫిలాంత్రపిస్టులుగా ఉన్నారు. 2010లో వారెన్ బఫెట్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ‘ద గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గివింగ్ ప్లెడ్జ్‌పై 29 దేశాలకు చెందిన దాదాపు 241 మంది పరోపకారులు సంతకాలు చేశారు.(నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం)
Comments
Please login to add a commentAdd a comment