philanthropy
-
దానగుణంలో హెచ్‌సీఎల్ నాడార్ టాప్..
ముంబై: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం అధికం. దీంతో ఎడెల్‌గివ్–హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 407 కోట్లతో రెండో స్థానంలో, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 330 కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు. జాబితా ప్రకారం మొత్తం మీద 203 మంది రూ. 5 కోట్లకన్నా అధికంగా విరాళమిచ్చారు. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న మొత్తం 1,539 మంది వ్యక్తుల సంపద 46 శాతం పెరిగింది. 203 మంది ఇచి్చన సగటు విరాళం పరిమాణం రూ. 71 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. వితరణకు సంబంధించి మహిళల జాబితాలో రోహిణి నీలేకని రూ. 154 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రూ. 90 కోట్లతో సుస్మితా బాగ్చీ రెండో స్థానంలో ఉన్నారు. రంగాలవారీగా చూస్తే విద్యారంగానికి అత్యధికంగా రూ. 3,680 కోట్లు, హెల్త్‌కేర్‌కి రూ. 626 కోట్లు లభించాయి. రిచ్ లిస్ట్‌లో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో, రూ. 10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో ఉండగా రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. రిచ్ లిస్టులోని ప్రమోటర్ల సారథ్యంలో ఉన్న తొమ్మిది కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిర్దేశిత 2 శాతానికి మించి ఖర్చు చేశాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 900 కోట్లు, యార్డీ సాఫ్ట్వేర్ ఇండియా రూ. 25 కోట్లు చొప్పున ఖర్చు చేశాయి.ధనవంతులైన టాప్ 10 పరోపకారుల జాబితా▸శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2,153 కోట్లు▸ముకేశ్ అంబానీ & కుటుంబం: రూ. 407 కోట్లు▸బజాజ్ కుటుంబం: రూ. 352 కోట్లు▸కుమార మంగళం బిర్లా & కుటుంబం: రూ. 334 కోట్లు▸గౌతమ్ అదానీ & కుటుంబం: రూ. 330 కోట్లు▸నందన్ నీలేకని: రూ. 307 కోట్లు▸కృష్ణ చివుకుల: రూ. 228 కోట్లు▸అనిల్ అగర్వాల్ & కుటుంబం: రూ. 181 కోట్లు▸సుస్మిత & సుబ్రోతో బాగ్చి: రూ. 179 కోట్లు ▸రోహిణి నీలేకని: రూ. 154 కోట్లుWho are the top 10 impact leaders in the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List?Shiv Nadar tops the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List, followed by Mukesh Ambani and his family and the Bajaj family. These philanthropic leaders continue to… pic.twitter.com/EsnrO831Hd— HURUN INDIA (@HurunReportInd) November 7, 2024 -
International Day of Charity observed: వరదెత్తిన కష్టాల్లో కరుణే ప్రదానం
ఖమ్మం గుమ్మంలో వరద. బెజవాడ కంటిలో బుడమేరు ΄పొంగు. ఆకలి ఆర్తనాదాలు తెలుగువారిని చుట్టుముట్టాయి. ఈ సమయంలో సాయం చేసే చేతులే కాదు దాతృత్వం చూపే గుండెలూ కావాలి. నోట్ బుక్స్ తడిసిపోయిన ఒక చిన్నారికి స్కూల్ బ్యాగ్‌తో మొదలు గుడిసె కూలిన ఒక పేదవాడికి చిన్న ఆసరా వరకూ దాతృత్వంతో సాయం చేయవచ్చు. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తాయి. మనుషులం మనం. ఇవ్వడం తెలిసినవాళ్లం. ఇది ఇవ్వాల్సిన సమయం.‘దానం చేయడం వల్ల ఎవరూ పేద కాబోరు’ అంటుంది ఆనీ ఫ్రాంక్ అనే యూదు బాలిక. ‘ఎంత దానం ఇస్తున్నావన్నది కాదు... ఎంత ప్రేమగా దానం ఇస్తున్నావన్నదే ముఖ్యం‘ అంది మదర్ థెరిసా. ‘దానమీయని వాడు ధన్యుండుగాడయ’ అన్నాడు వేమన. ‘దానం చేయనివారు భూమికి పెద్ద భారం’ అన్నాడు శ్రీనాథుడు. ‘పిట్టకు చారెడు గింజలు... చెట్టుకు చెంబుడు నీళ్లు... ఇవి అందించడానికి మించిన మానవ జన్మకు పరమార్థం ఏముటుంది’ అంటుంది ఓ కథలోని బామ్మ. దానం మనిషి గుణం. ముఖ్యంగా సాటి మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు దానం చేయడానికి తప్పకుండా ముందుకు రావాలి.మనది దానకర్ణుడి నేలమనది దాన కర్ణుడి నేల. ఒకసారి కృష్ణుడు కర్ణుడిని చూడటానికి వెళితే ఆ సమయానికి అతను స్నానానికి సిద్ధమవుతూ రత్నాలు ΄÷దిగిన గిన్నెలో నూనె తలకు రాసుకుంటున్నాడట. కృష్ణుడు ఆ గిన్నె చూసి ‘కర్ణా.. గిన్నె చాలా బాగుంది ఇస్తావా’ అనగానే ఎడమ చేతిలో ఉన్న గిన్నెను ‘తీసుకో’ అని అదే చేత్తో ఇచ్చేశాడట కర్ణుడు. కృష్ణుడు ఆశ్చర్యపోయి ‘అదేమిటి కర్ణా... ఎడమ చేత్తోనే ఇచ్చేశావు’ అనంటే కర్ణుడు ‘అంతే కృష్ణా. దానంలో ఆలస్యం కూడదు. నువ్వు అడిగాక ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి మారేలోపు నా మనసు మారొచ్చు. లేదా నాకు మృత్యువు సమీపించవచ్చు. అందుకే ఇచ్చేశాను’ అన్నాడట. లోకంలో ఎందరో చక్రవర్తులు పుట్టి ఉంటారు, గిట్టి ఉంటారు. కాని దానం కోసం నిలిచిన శిభి, బలి చక్రవర్తులే ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా శ్లాఘించబడుతున్నారు.వరదల్లో అన్నం పెట్టిన తల్లితూర్పు గోదావరి జిల్లాలోని లంకలగన్నవరంలో తరచూ వరదల చేత లేదంటే ΄÷లాలు పండకపోవడం చేత జనం ఆకలితో అల్లాడుతుంటే వారి కోసమని అన్నదానం మొదలెట్టి ఆంధ్రుల అన్నపూర్ణగా కొలవబడుతున్న తల్లి డొక్కా సీతమ్మ (1841–1909)ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మన దగ్గర ఉన్నది అవసరమున్న వారికి పంచడం వల్ల కలిగే తృప్తి, దొరికే ఆశీర్వచనం దైవికమైనవి. దానాల్లోకెల్లా శ్రేష్ఠమైనది అన్నదానం అంటారు. ఇవాళ వరదల్లో చిక్కుకున్నవారి కోసం అన్నదానం చేయవలసినవారే కావాల్సింది.స్పందించే హృదయంమనిషి హృదయానికి ఉన్న గొప్ప లక్షణం స్పందించే గుణం. అదే మానవత్వ గుణం. కరుణ, కనికరం, దయ, సానుభూతి ఇవన్నీ సాటి మనిషి కోసం సాయపడమంటాయి. సాయంలో ఉన్నతమైనది దాతృత్వం. కొందరు అడగకపోయినా దానం చేస్తారు. కొందరు అడిగినా చేయరు. ఉండి కూడా చేయరు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఘటనలు జరిగితే సినిమా హీరోలతో మొదలు సామాన్యుల వరకూ స్పందించేవారు. కనీసం నూట పదహార్లు పంపే పేదవారు కూడా ఉండేవారు. ఇవాళ దానం కోసం ప్రొత్సహించే వ్యక్తులు లేరు. తామే తార్కాణంగా నిలవాలని కూడా అనుకోవడం లేదు. వేల కోట్లు ఉన్నవారు కూడా రూపాయి విదల్చకపోతే ఆ సంపదకు అర్థం ఏమిటి?లక్ష సాయాలుఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో వరద బీభత్సంగా ఉంది. పిల్లలకు పుస్తకాల దగ్గర నుంచి వృద్ధులకు మందుల వరకు అన్నీ కావాలి. వంట పాత్రలు నాశనమయ్యాయి. స్టవ్‌లు పాడయ్యాయి. ఇళ్లు కూలిన వారు ఎందరో. పశువులు కొట్టుకుని పోయాయి. చేతి వృత్తుల పరికరాలు, ఉపాధి సామాగ్రి అంతా పోయింది. జనం రోడ్డున పడ్డారు. వీరి కోసం ఎన్ని వేల మంది సాయానికి వస్తే అంత మంచిది. సరిౖయెన చారిటీ సంస్థలకు విరాళాలు ఇచ్చి సాయం అందగలిగేలా చూడటం అందరి విధి. లేదా ముఖ్యమంత్రుల సహాయనిధికే విరాళం ఇవ్వొచ్చు. మన దగ్గర డబ్బు లేకపోతే సమయం అయినా దానం ఇవ్వొచ్చు. సమయం వెచ్చించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నా చాలు. నేడు ‘అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం’ సందర్భంగా చంద్రునికో నూలుపోగైనా ఇద్దామని సంకల్పిద్దాం. -
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
పిన్న వయసులోనే రూ.110 కోట్లు విరాళం
జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ఆయన సోదరుడు కంపెనీ సీఈఓ నితిన్ కామత్ 2023 ఏడాదికి గాను రూ.110 కోట్లు విరాళం ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ 2023లో చోటు సంపాదించారు. అయితే ఈ లిస్ట్‌లో చోటు సాధించిన వారిలో నిఖిల్ కామత్ పిన్న వయస్కుడు. గడిచిన ఏడాదిలో ఇద్దరు సోదరులు సమిష్టిగా తమ విరాళాన్ని 300 శాతం పెంచి రూ.100 కోట్ల దాతృత్వాన్ని ప్రకటించినట్లు ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 వెల్లడించింది. అయితే ఈ ఏడాది దేశంలో తొమ్మిదో అతిపెద్ద దాతగా వీరు వార్తల్లో నిలిచారు. అయితే 2021లో వీరిద్దరూ తమ వ్యక్తిగత సంపదలో నాలుగింట ఒక వంతు విరాళంగా ఇవ్వాలని ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో రూ.750 కోట్లను తిరిగి ఇచ్చే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు. వాతావరణ మార్పు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు తన సంపదలో 50 శాతం విరాళమిస్తానని గతంలో నిఖిల్ కామత్ ప్రకటించారు. వారెన్‌బఫెట్, మిలిందాగేట్స్, బిల్‌గేట్స్ స్థాపించిన గివింగ్ప్లెడ్జ్పై నిఖిల్కామత్ సంతకం చేశారు. ఇందులో చేరిన నాలుగో భారతీయుడు కామత్. విప్రో మాజీ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా, నందన్ నీలేకని తర్వాత నిఖిల్ గివింగ్‌ప్లెడ్జ్ కమ్యునిటీలో చేరారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం నిఖిల్ మొత్తం రూ.27వేల కోట్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. నిఖిల్ తన సొంత ఫౌండేషన్ యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (వైఐపీపీ) ద్వారా కొన్ని స్టార్టప్ కంపెనీలతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతాన్ని దాతృత్వ కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. -
Janhavi Nilekani: నార్మల్ డెలివరీలు ‘నార్మల్’ కావాలి
గర్భవతుల విషయంలో సాధారణ ప్రసవం అనే మాట ఈ రోజుల్లో ఆశ్చర్యంగా మారింది. దేశమంతటా సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తన నివేదికల్లో చూపింది. అయితే, ప్రభుత్వ– ప్రైవేట్ ఆసుపత్రులలో నార్మల్, సిజేరియన్ ప్రసవాల సంఖ్యలో తేడా మాత్రం ఉంది. ఈ విషయాన్ని తన సొంత అనుభవంతో గమనించిన ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ జాన్హవి నిలేకని మెటర్నల్ హెల్త్‌కేర్ వైపు దృష్టి సారించింది. బెంగళూరులో మురికివాడల్లోని నగర గర్భిణుల్లో సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆస్ట్రికా మిడ్వైఫరీ పేరుతో ప్రసవాల సెంటర్‌నూ ప్రారంభించింది. సాధారణ ప్రసవం ఆవశ్యకతవైపు వేసిన ఆమె అడుగుల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘చదువుకుంటున్నప్పుడే స్వదేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండేవి. అమ్మ మరాఠీ, నాన్న కోంకణి. పుణేలో పుట్టి, బెంగుళూరులో పెరిగాను. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లాను. నా భర్త యేల్ జార్ఖండ్‌కు చెందినవాడు. ఆ విధంగా నేను ఒకే ఒక ప్రాంతానికి చెందినదానిని అని చెప్పలేను. 2012లో పెళ్లయ్యింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కర్ణాటక లో రీసెర్చ్ చేస్తున్నాను. ఆ సమయంలో నార్మల్ డెలివరీ కోసం నగరాల్లోని చాలా ఆసుపత్రుల వారిని కలిశాను. కానీ, నార్మల్ డెలివరీకి వారెలాంటి హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో గర్భిణులకు సరైన సమయంలో మందులు, డాక్టర్లు, నర్సుల సేవ అందడం లేదనీ, దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆ సమయంలోనే తెలుసుకున్నాను. ప్రయివేటు ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాన్ని వ్యాపారంలా మార్చేశాయి. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 80 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. సి–సెక్షన్ ఆ మహిళకు, బిడ్డకు మంచిది కాదు. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నప్పటికీ సర్జరీ చేయడం తప్పు. కానీ, వైద్యులు సాధారణ ప్రసవానికి చాలా సమస్యలు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎన్నో సందేహాలు తలెత్తాయి. చివరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. దేశమంతటా.. మొదట వాయుకాలుష్యంపై పరిశోధనలు చేస్తూ వచ్చాను. కానీ, బిడ్డ పుట్టాక మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనుకున్నాను. 2019లో ఆస్ట్రికా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీని ద్వారా భారతదేశం అంతటా ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, జీఎన్ఎమ్లకు శిక్షణ ఇచ్చాను. దీంతో వారు సురక్షితమైన ప్రసవం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనవసరమైన సిజేరియన్ ప్రసవాల నుంచి వారిని రక్షించగలుగుతున్నారు. ప్రసవ సమయంలో అగౌరవం ప్రతి గర్భిణి గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ పొందాలి. కానీ, ఒక గర్భిణికి నొప్పులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలోని లేబర్‌రూమ్‌లో సిబ్బంది ఆమె మీద చెడు మాటలతో విపరీతంగా అరుస్తారు. చెప్పుతో కొట్టడం కూడా చూశాను. ఇది నాకు చాలా పాపం అనిపించింది. ఇలా జరగకూడదు, దీన్ని ఆపాలి అనుకున్నాను. 2021 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వచ్చాను. అది కూడా సరిపోదని ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టాను. ధనికులైనా, పేదవారైనా ప్రతి స్త్రీకీ మంచి చికిత్స పొందే హక్కు ఉంది. ఇది గుర్తించే, బెంగళూరులోనే ఒక పేరున్న ఆసుపత్రిలో నా ఏడు పడకల కేంద్రాన్ని ప్రారంభించాను. గర్భిణిని కూతురిలా చూసుకునే మంత్రసాని ఉండాలని నమ్ముతాను. విదేశాల నుంచి సర్టిఫైడ్ మంత్రసానులను, వైద్యులను ఈ సెంటర్లో నియమించాను. ఎందుకంటే, ఇక్కడ చేరడానికి డాక్టర్లు ఎవరూ రెడీగా లేరు. దీంతో బయటివారిని సంప్రదించాల్సి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ పనిచేయడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అంతేకాదు, హాస్పిటల్లో ప్లేస్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకంటే సి–సెక్షన్ లకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక నార్మల్ డెలివరీ అంటేనే మహిళలు, వారి కుటుంబసభ్యులు కూడా భయపడుతున్నారు. వారి దృష్టిలో సిజేరియన్ డెలివరీ సురక్షితమైంది. కౌన్సెలింగ్‌తో నార్మల్... నా సంస్థ కర్ణాటక వాణివిలాస్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఓ రోజు హాస్పిటల్ బోర్డ్ మెంబర్ డ్రైవర్ భార్య మా సెంటర్‌కి వచ్చింది. ఆమె నార్మల్ డెలివరీకి భయపడింది. మా మంత్రసాని ఆమె మనసులోని భయాన్ని కౌన్సెలింగ్ ద్వారా తొలగించింది. ఫలితంగా ఆమెకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాధారణ ప్రసవం జరిగింది. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. అంటే, వారికి మానసిక, శారీరక బలాన్ని అందిస్తాం. వారికి సహాయం చేయడానికి మా బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండేళ్లలో 200 మంది గర్భవతులలో కేవలం ఇద్దరికి మాత్రమే సిజేరియన్ అవసరం పడింది. అది కూడా వారికి ప్రసవంలో సమస్య ఉండటం వల్ల. మిగతా అందరికీ సాధారణ ప్రసవాలు జరిగాయి. ఆస్ట్రికా మిడ్వైఫరీ సెంటర్లో ముప్పైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న నర్సులు, మంత్రసానుల కోసం ఆస్ట్రికా స్పియర్ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా సిబ్బంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది సర్టిఫికెట్లు పొందారు. యూరప్ నుంచి కూడా అధ్యాపకులు ఉన్నారు. మా మెటర్నిటీ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి కోర్సులను కూడా అందిస్తుంది. ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని వివరిస్తారు జాన్హవి. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. – డాక్టర్ జాహ్నవి నిలేకని -
ఏకంగా రూ. 3.4 లక్షల కోట్ల విరాళాలిచ్చిన మహిళ ఎవరో తెలుసా?
పరోపకారార్థం ఇదం శరీరం అనేది నానుడి. ఏ ఫలం ఆశించకుండా నలుగురికి సాయం చేయడం. సృష్టిలో ఈ భూమ్యా కాశాలతోపాటు పశువులు, వృక్షాలు ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండానే తమ విధిని నిర్వరిస్తున్నాయి. పరులకి సేవ చెయ్యడమే ఉత్కృష్టమైన జన్మనెత్తిన మనుషుల పరమావధి. తమకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని భావిస్తాం. ఇది కేవలం భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది...కదా! తాజాగా భూరి విరాళాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారో ఓ మహిళా వ్యాపారవేత్త. ఆమె ఎవరు. ఏ దేశస్థురాలు ఆ వివరాలు చూద్దాం. ఆమె మరెవ్వరో కాదు అమెరికు చెందిన మెలిండా ఫ్రెంచ్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్‌గేట్స్ మాజీ భార్య. 3.24 లక్షల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ప్రపంచంలో టాప్‌లో నిలిచారు. 2000లో భర్త బిల్ గేట్స్ తో కలిసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను 2015 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ గా అవతరించింది. ప్రస్తుతం దాదాపు 70 బిలియన్ల డాలర్ల విరాళాలతో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆస్తుల పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దాతృత్వ సంస్థ.వాషింగ్టన్‌లోని సియాటిల్ కేంద్రంగా సేవలందిస్తున్న మెలిండా నేతృత్వంలోని సంస్థ తన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలనే లక్ష్యానికి కట్టుబడి ఉంది. 1964 ఆగస్టు 15న పుట్టిన మెలిండా కంప్యూటర్ సైంటిస్ట్ అయిన మైక్రోసాఫ్ట్‌లో మాజీ మల్టీమీడియా ప్రొడక్ట్ డెవలపర్ , మేనేజర్ కూడా. గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ , అమెరికన్ ఎడ్యుకేషన్‌తో సహా వివిధ సమస్యలపై గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది.1994లో హెల్త్, స్టడీ, జెండర్ ఈక్వాలిటీ కోసం ప్రోత్సహించడానికి ఫౌండేషన్ ద్వారా 39 బిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందించారు.మెలిండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిరుపేద మహిళలకు గర్భనిరోధక అంశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని కోసం ఆమె సంస్థ ద్వారా ఒకబిలియన్ డాలర్లకు పైగా విరాళాలివ్వడం విశేషం. మెలిండా మంచి రచయిత్రి కూడా. భారతదేశంలో ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలకు గుర్తింపుగా, బిల్ అండ్ మెలిండా సంయుక్తంగా 2015లో భారతదేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను అందుకున్నారు.2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్రెంచ్ గేట్స్ , బిల్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు. ఏడేళ్ల డేటింగ్ తర్వాత, 1994లో బిల్ గేట్స్, మెలిండా హవాయిలో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఈ జంట ఆగస్టు 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మెలిండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలుస్తూ వస్తున్నారు. -
జెరోధా ఫౌండర్, బిలియనీర్ నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘జెరోధా’ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నిఖిల్ కామత్ (34) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంపదలో సగం సమాజానికి దానమిస్తున్నట్టు ప్రతిజ్ఞను తీసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే ‘ద గివింగ్ ప్లెడ్జ్’లో చేరి ప్రసిద్ధ పెట్టుబడిదారులు సరసన చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు తమ సంపదను దానం చేస్తామని ప్రకటించిన నాలుగో భారతీయుడు, భారతదేశపు అతి పిన్న వయస్కుడు నిఖిల్ కామత్ కావడం గమనార్హం. ఒక యువ పరోపకారిగా గివింగ్ ప్లెడ్జ్ (సంపద దానం చేస్తూ ప్రమాణం చేయడం) లో చేరడాన్ని గౌరవంగా భావిస్తూన్నానని, ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపించేందుకు తానీ నిర్ణయించుకున్నాను అని కామత్ వెల్లడించాడు. మరింత సమానత్వంతో కూడిన సమాజం అనే ఫౌండేషన్ లక్ష్యం తన ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. (తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ) దేశీయంగా విప్రో అజీమ్ ప్రేమ్ జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి ఈ కార్యక్రమంలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యుల ఆర్థిక వనరులలో ఎక్కువ భాగం లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా ఇస్తారు. అలాగే నితిన్ కామత్ నేతృత్వంలోని రెయిన్‌మాటర్ ఫౌండేషన్, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి వీటికనుగుణంగా జీవనోపాధికి మద్దతుగా పనిచేసే సంస్థలకు మద్దతు ఇస్తుంది. 90 శాతం మందికి చెందాల్సింది కేవలం 10 శాతం మందికే 2021లో ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దేశంలో 90 శాతం మందికి చెందాల్సినవి కేవలం 10 శాతం మంది చేతిలో ఉండకూడదు. జీవితంలో ముందుగానే ఇవ్వడం ప్రారంభించమని ప్రజలను ప్రోత్సహించాలనే ఫిలాంత్రపి ఫిలాసఫి అని చెప్పుకొచ్చారు. రోజుల్లో యువకులుగా డబ్బులు సంపాదించడం మొదలుపెడితే, అది రెండింతలు, పదింతలు అవుతుంది. మన లైఫ్ స్టయిల్‌గా పెద్దగామారదు. మరి సంపాదించిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. అలా కాకుండా మన చుట్టూ ఉన్న, అవసరమైన వారికి సహాయపడే విధంగా ఆ డబ్బును వినియోగిస్తే ఆ కిక్కే వేరని కామత్ అన్నారు. ఇదీ చదవండి: రూ. 4.95 లక్షల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, మాజీ క్రికెటర్ ఎవరో తెలుసా? ఫోర్బ్స్ ప్రకారం, కామత్ 3.45 బిలియన్ల డాలర్ల (రూ. 28 వేల కోట్లు) సంపదలో 50 శాతాన్ని కట్టుబడివాతావరణ మార్పు, శక్తి, విద్య ,ఆరోగ్యం వంటి విషయాలకు విరాళమివ్వడానికి నిర్ణయించుకున్నా నంటూ తన ప్రతిజ్ఞ లేఖలో చెప్పారు. దీనికి అదనంగా, యంగ్ ఇండియన్ ఫిలాంత్రోపిక్ ప్లెడ్జ్ (YIPP), వ్యవస్థాపకులతో కలిసి వారి నికర విలువలో కనీసం 25 శాతం స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా అందజేస్తారు. జెరోధా సహ వ్యవస్థాపకులు సోదరులు నిఖిల్, నితిన్ కామత్ అనేక దాతృత్వ విరాళాలకు ప్రసిద్ధి చెందారు. కామత్ తన సోదరుడు నితిన్ కామత్‌తో కలిసి 2022లో రూ.100 కోట్ల వ్యక్తిగత సంపదను విరాళంగా ఇచ్చారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022 ప్రకారం వీరి 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సాయం 300 శాతం ఎక్కువ. దేశీయంగా తొమ్మిదో అతిపెద్ద ఫిలాంత్రపిస్టులుగా ఉన్నారు. 2010లో వారెన్ బఫెట్, మిలిందా ఫ్రెంచ్ గేట్స్, బిల్ గేట్స్ ‘ద గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గివింగ్ ప్లెడ్జ్‌పై 29 దేశాలకు చెందిన దాదాపు 241 మంది పరోపకారులు సంతకాలు చేశారు.(నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) -
రోజుకు 3 కోట్లు విరాళాలు, టాప్‌లో ఎవరు? అంబానీ, అదానీ ఎక్కడ?
సాక్షి, ముంబై: ఎడెల్ గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త, పరోపకారి హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, 77 ఏళ్ల శివ్ నాడార్ టాప్ ప్లేస్‌ను ఆక్రమించారు.. రోజుకు రూ. 3 కోట్లు విరాళంగా ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఎడెల్ గివ్ హురున్ ఇండియా విడుదల చేసిన తాజా లిస్ట్‌లో రూ. 1161 కోట్ల వార్షిక విరాళంతో దేశీయ అత్యంత ఉదారమైన వ్యక్తిగా శివ నాడార్ నిలిచారు. 484 కోట్ల రూపాయల వార్షిక విరాళాలతో విప్రో 77 ఏళ్ల అజీమ్ ప్రేమ్‌జీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. దాతృత్వంలో ఇప్పటివరకు ఈ జాబితాలో టాప్‌లో ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ విరాళాలు 95 శాతం తగ్గిపోవడంతో రెండో స్థానానికి పడిపోయారు. ఆసియా, భారతదేశపు అత్యంత సంపన్నుడు, గౌతమ్ అదానీ విరాళాలు 46 శాతం పెరగడంతో ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచారు. గత మూడేళ్లలో రూ.400 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. ఇక రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ 1446 కోట్ల రూపాయలతో ఈ జాబితాలో మూడవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2022 ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో భారతదేశంలో 15 మంది దాతలు రూ. 100 కోట్లకు పైగా వార్షిక విరాళాలివ్వగా, 20 మంది రూ. 50 కోట్లకు పైగా విరాళాలను అందించగా, 20 కోట్లకు పైగా విరాళాలిచ్చిన వారి సంఖ్య 43 మంది అని నివేదిక తెలిపింది. ఇంకా 142 కోట్ల రూపాయల విరాళం అందించిన లార్సెన్ అండ్ టూబ్రో గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్, దేశీయ అత్యంత ఉదారమైన ప్రొఫెషనల్ మేనేజర్. జెరోధా వ్యవస్థాపకులు నితిన్ ,నిఖిల్ కామత్ తమ విరాళాన్ని 300శాతం పెంచి రూ.100 కోట్లకు చేరుకున్నారు. వీరితోపాటు మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రొతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి జాబితాలో ఒక్కొక్కరు రూ. 213 కోట్ల విరాళాలత టాప్ 10లోకి ప్రవేశించడం విశేషం. -
‘ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు’, ప్రిన్స్ ఛార్లెస్ ఫంక్షన్‌కు ‘రతన్ టాటా’ డుమ్మా!
అత్యధిక కాలం బ్రిటన్ను పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 అస్తమయం కావడంతో యూకే రాజుగా ఆమె కుమారుడు, ప్రిన్స్ ఛార్లెస్ నియమితులు అయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్రిటన్ రాజుగా ప్రిన్స్ ఛార్లెస్, రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75)లు అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన నెటిజన్లు, వ్యాపార దిగ్గజాలు బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్, దేశీయ దిగ్గజం రతన్ టాటా'ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో పెంపుడు కుక్కల విషయంలో రతన్ టాటా - ప్రిన్స్ ఛార్లెస్‌తో జరిగిన సంభాషణల్ని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. రతన్ టాటా దాతృత్వానికి గుర్తింపుకు గాను ఆయనను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలని 2018 ఫిబ్రవరి 6న ప్రిన్స్ ఛార్లెస్.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డుల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? రెండు పెంపుడు కుక్కల వల్ల. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఇది అక్షరాల నిజం. ఇదే అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన కాలమిస్ట్, వ్యాపార వేత్త సుహెల్ సేథ్ నాటి మధుర స్మృతుల్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ రతన్ టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు. రతన్ టాటాకు లైఫ్ టైమ్ అవార్డును ప్రధానం చేసేందుకు లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌ను సర్వం సిద్ధం చేశారు. ‘‘ 2018 ఫ్రిబవరి 2,3 తేదీలలో బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ కోసం నేను లండన్‌కు చేరుకున్నాను. లండన్ ఎయిర్ పోర్ట్ దిగిన తర్వాత టాటా నుండి సుమారు 11 మిస్డ్ కాల్లు రావడంతో షాకయ్యా. వెంటనే నా బ్యాగ్‌లను తీసుకొని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఆయనకు కాల్ చేశా. టాంగో, టిటో (రతన్ టాటా కుక్కలు ) అనారోగ్యానికి గురయ్యాయి. తిండి తినడం లేదు. నీళ్లు తాగడం లేదు. నేను వాటిని వదిలి రాలేను అని’’ తనతో చెప్పినట్లు సుహెల్ సేథ్ గుర్తు చేసుకున్నారు. ప్రిన్స్ చార్లెస్ ఈవెంట్‌కు టాటా వచ్చేలా నేను ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. టాటా తన అవార్డును స్వీకరించేందుకు రాలేదు. ఈ సందర్భంగా అవార్డుల కార్యక్రమానికి రతన్ టాటా ఎందుకు రాలేదో తెలుసుకున్న ప్రిన్స్ ఛార్లెస్.. టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు.‘‘మనసున్న మారాజు..అతడే రతన్ టాటా ” అని ప్రిన్స్ చార్లెస్ అన్నట్లు సేథ్ తెలిపారు. -
దాతృత్వంలో దేశంలోనే అజీమ్ ప్రేమ్‌జీ టాప్
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ దాన, ధర్మాల్లో ఎప్పుడూ ముందుంటారు. 2020-2021 ఆర్ధిక సంవత్సరంలో విరివిగా దానాలు చేసి అగ్రస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2021 ప్రకారం రోజుకు సగటున రూ.27 కోట్లతో ఏడాదికి రూ.9,713 కోట్లు చొప్పున విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం దాతృత్వంతో హురున్ ఇండియా, ఎడెల్గైవ్ ఇండియా దాతృత్వ జాబితా- 2021లో అజీమ్ ప్రేమ్‌జీ ముందు వరుసలో నిలిచారు. ప్రేమ్ జీ తన విరాళాలను గత ఏడాదితో పోలిస్తే 23 శాతం వరకు పెంచారు. అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఈ మహమ్మారి అరికట్టడం కోసం విరాళాలను రెట్టింపు చేసింది హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శివ్‌నాడార్ ₹1,263 కోట్లతో రెండో స్థానంలో ఉండగా.. రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ₹577 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. తర్వాత వరుస స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ₹377 కోట్ల సహకారంతో జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఈ ఏడాది జాబితాలో ₹183 కోట్ల విలువైన మొత్తం విరాళాలతో ఐదవ స్థానానికి చేరుకున్నారు. ఇక హిందూజా కుటుంబం ₹166 కోట్ల విరాళాలతో జాబితాలో ఆరవ స్థానంలో నిలిచారు. ₹50 కోట్ల విరాళంతో మొదటిసారి ఇన్వెస్టర్ రాకేష్ ఝుంఝున్ వాలా ఈ దాతృత్వ జాబితాలోకి ప్రవేశించారు. (చదవండి: బంపర్ ఆఫర్..! రూ.101కే వివో ఫోన్..షరతులు వర్తిస్తాయి..!) వాతావరణ మార్పుల పరిష్కారాల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు మద్దతు తెలపడానికి సిరోధా సహ వ్యవస్థాపకులు నిథిన్ & నిఖిల్ కామత్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ₹750 కోట్లు ఇవ్వనున్నారు. ఈ జాబితాలో 35వ స్థానంలో ఉన్నారు. 35 ఏళ్ల నిఖిల్ నిఖిల్ కామత్ ఈ జాబితాలో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో ఈ ఏడాది తొమ్మిది మంది మహిళలు పాల్గొన్నారు. రోహిణి నీలేకని దాతృత్వాల కోసం ₹ 69 కోట్లు విరాళం ఇచ్చారు. (చదవండి: ఎలక్ట్రిక్ కార్లపై దృష్టిసారించిన ఉబర్..!) -
విజనరీ ఫిలాంత్రఫిస్ట్: బాలీవుడ్ బ్యూటీ ఇంట్రస్టింగ్ పోస్ట్
సాక్షి, ముంబై: కరోనా సంక్షోభ సమయంలో బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్‌కు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మద్దతుగా నిలిచారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గత వారం సోనూ షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేసిన గ్లోబల్ బ్యూటీ సోనూపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు విజనరీ ఫిలాంత్రఫిస్ట్, దూరదృష్టి కలిగిన పరోపకారి సోను అంటూ తన సహ నటుడిని కొనియాడారు. (సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం!) మొదటగా సోనూ సూద్ నిశితమైన పరిశీలన తనను ఆకట్టుకుందని కమెంట్ చేశారు. అలాగే టిపికల్ సోనూ శైలిలో పరిష్కారం కోసం ఆలోచించడం, సలహాలతో ముందుకు రావడం తనకు చాలా న చ్చిందని ఆమె పేర్కొన్నారు. దీనిక ప్రభుత్వ, ప్రభుత్వేతన శక్తులు స్పందించి ముందుకు రావాలని కోరారు. ప్రతీ విద్యార్థికి విద్య అనేది పుట్టుకతో వచ్చిన హక్కుగా భావించే వ్యక్తిగా ఈ విషయంలో తన పూర్తి మద్దతు సోనూకేనని పీసీ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభం, లాక్డౌన్ కాలంలో వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరోగా అవతరించిన సోనూసూద్ విద్యార్థుల ఆన్లైన్ చదువులకు ఆటంకం రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు. కేవలం ఒక విద్యార్థిని కోసం మొత్తం గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించిన పెద్ద మనుసు సోనూ సూద్ సొంతం. ఇలా అనేక రకాలుగా గత ఏడాది కాలంగా నిరంతరాయంగా పూర్తి నిబద్ధతతో తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారు. సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 29న ఒక వీడియోను పోస్ట్ చేశారు. కాగా కరోనా కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన పిల్లల చదువుకు అంతరాయం కలగకూడదని. తల్లిదండ్రులను పోగొట్టుకున్న కారణంగా ఉత్పన్నమైన ఆర్థిక కారణాలు వారి చదువుకు అడ్డు కాకూడదని కోరుకున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని, వారికి ఆర్థికంగా భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం దేశం కలిసికట్టుగా ఈ గండం నుంచి గట్టెక్కాలని పేర్కొన్నారు. ఈ వీడియోనే తాజాగా ప్రియాంక చోప్రాను ఆకర్షించడం విశేషం. (ఆ పిల్లలకు ఉచిత విద్య అందించాలి: సోనూసూద్) .@SonuSood #EveryLifeMatters https://t.co/fpDKac1PSx pic.twitter.com/cHvpOuZEvp — PRIYANKA (@priyankachopra) May 3, 2021 -
బిల్ గేట్స్‌కే ప్రేరణనిస్తున్న మహాదాత ఎవరో తెలుసా?
సమాజ సేవకు, ముఖ్యంగా విద్యకు భారీగా నిధులను కేటాయించే విప్రో ఛైర్మన్, ఇండియన్ బిలియనీర్ అజీమ్ ప్రేమ్‌జీ తన ఉదారతతో ప్రపంచ దాతలను సైతం ఆకర్షిస్తున్నారు. తాజాగా ప్రపంచ కుబేరుడు, మహాదాత, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమైనవని వ్యాఖ్యానించారు. సామాజిక వేదిక ట్విటర్ ద్వారా బిల్‌గేట్స్ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. అజీమ్ ప్రేమ్‌జి తాజా వితరణ తనకు ఎంతో ఉత్సాహానిచ్చిందని పేర్కొన్నారు. ఇది అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. ముఖ్యంగా సమాజానికి ప్రేమ్‌జీ అందిస్తున్న స్వచ్ఛంద సహకారం, దాతృత్వం, చూపిస్తున్న నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాతలకు ప్రేరణనిస్తుందని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. కాగా విప్రోలోనితన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ఇటీవల అజీమ్ ప్రేమ్‌జీ ప్రకటించారు. రూ.52,700 కోట్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు అందించారు. దీంతో ప్రేమ్‌జీ అందించిన విరాళం విలువ మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరిన సంగతి తెలిసిందే. చదవండి: సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం I’m inspired by Azim Premji’s continued commitment to philanthropy. His latest contribution will make a tremendous impact. https://t.co/IOTiHxtivw — Bill Gates (@BillGates) March 24, 2019 -
సమాజానికి ప్రేమతో రూ.52,700 కోట్లు!
న్యూఢిల్లీ: విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్‌కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్‌జీ నియంత్రణలోని పలు సంస్థల నిర్వహణలో ప్రస్తుతం ఈ వాటాలున్నాయని, వీటి మార్కెట్ విలువ రూ.52,700 కోట్లుగా అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ తన ప్రకటనలో తెలిపింది. దీంతో తన ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రేమ్‌జీ కేటాయించిన మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (21 బిలియన్ డాలర్లు) చేరింది. ఇందులో విప్రోలోని 67 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక యాజమాన్య హక్కులు కూడా ఉన్నాయి. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ప్రేమ్‌జీనే వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాలకు ఆయన గతంలోనే భారీ కేటాయింపులు జరపగా, తాజాగా వీటిని మరింత పెంచారు. 2018 డిసెంబర్ నాటికి విప్రోలో ప్రమోటర్ హోల్డింగ్ 74.3 శాతంగా ఉంది. దేశంలో విద్యా సంబంధిత కార్యక్రమాలతోపాటు పలు ఇతర విభాగాల్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సాయం అందిస్తోంది. కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్‌లో ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగు కోసం ఇనిస్టిట్యూషన్లను ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కొన్నేళ్లలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. ఉత్తరభారత్‌లోనూ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. సమానత, మానవతతో కూడిన స్థిరమైన సమాజం కోసం అన్నది ప్రేమ్‌జీ ఫౌండేషన్ లక్ష్యం. -
సంచలనం : వేల కోట్ల రూపాయల విరాళం
సాక్షి, ముంబై : విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వంతో మరోసారి సంచలనంగా మారారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఛైర్మన్ అయిన ఆయన ఫౌండేషన్ తరుపున భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.52,750 కోట్ల(7.5 బిలియన్ డాలర్లు) విలువైన విప్రో షేర్లను విరాళంగా ఇస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఫౌండేషన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో దాతృత్వంలో ప్రపంచ కుబేరులు, దాతలు బిల్ గేట్స్, వారెన్ బఫెట్‌కు పోటీగా విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ దూసుకొచ్చారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించిన అజీమ్ ప్రేమ్‌జీ ఏకంగా (34శాతం విప్రో షేర్లు) రూ.52,750 కోట్లు విరాళాన్ని ప్రకటించడం విశేషం. దేశంలో సమానమైన, సుస్థిరమైన మానవ సమాజం అభివృద్ధికి దోహదపడేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ధాతృత్వ కార్యకలాపాలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యారంగంపై దృష్టిపెడుతుంది. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థలకు చేయూతనిస్తుందని విప్రో ప్రకటించింది. తాజా ప్రకటనతో ఇప్పటివరకు ఆయన ఇచ్చిన విరాళాలు రూ.1,45,000 (67శాతం వాటా) కోట్లకు చేరింది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి తోడుగా ఉత్తరభారతంలో మరో యూనివర్శిటీని స్థాపించాలని కూడా యోచిస్తోంది. రాబోయే కాలంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. కాగా ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన, సమానమైన విద్య అందేందుకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ కృషి చేస్తుంది. తెలంగాణతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. -
షాకింగ్ న్యూస్ చెప్పిన అలీబాబా కో ఫౌండర్
న్యూయార్క్ : చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు,ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా షాకింగ్ న్యూస్ చెప్పారు. 420 బిలియన్ల డాలర్ల సంస్థనుంచి వైదొలగాలని యోచిస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో దాతృత్వతను కొనసాగించేందుకు, పదవీ విరమణ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ ఈ అంశంపై సమాధానాన్ని దాటవేస్తూ తే వచ్చిన జాక్ చివరికి తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే అలీబాబా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా, కంపెనీ నిర్వహణ మార్గదర్శిగా కొనసాగుతారు. న్యూయార్క్ టైమ్స్ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది. ఇటీవల దాతృత్వంపై మరింత దృష్టి కేంద్రీకరించడంపై ఆలోచిస్తున్నానంటూ, మైక్రోసాఫ్ట్ అధిపతి, దాత బిల్ గేట్స్‌ను ఉదాహరణగా పేర్కొన్న జాక్ చివరికి అన్నంత పనీ చేశారు. విద్య అంటే తనకు అమితమైన ప్రేమ అని అందుకే తన భవిష్యత్ సమయాన్ని ఇక విద్యకే కేటాయిస్తానని పేర్కొన్నారు. ఇది ముగింపు కాదని మరో కొత్త శకానికి నాంది అని చైనీస్ బిలియనీర్ జాక్ మా వ్యాఖ్యానించారు. అలీబాబా, టెన్సెంట్, బైడు, జెడి.కామ్ సంస్థలను తన ఆధ్వర్యంలో లాభాల దౌడు తీయించి, అమెరికన్ సంస్థలు అమెజాన్, గూగుల్ లాంటి సంస్థల గుండెల్లో గుబులు రేపిన ఘనత జాక్ సొంతం.గత నెల వెల్లడించిన ఆలీబాబా త్రైమాసిక ఫలితాల్లో లాభాలు పడిపోయినప్పటికీ, అమ్మకాలలో 60 శాతం పురోగతి సాధించింది. కంపెనీ వార్షిక ఆదాయం సుమారు 40బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోవైపు చైనాలో టీచర్స్‌డేగా వ్యవహరించే (సెప్టెంబరు10, సోమవారం) ఆయన 54వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నారు. కాగా చైనా వ్యాపార దిగ్గజాలు యాభైవ పడిలో పదవికి రాజీనామా చేయడం చాలా అరుదని ఎనలిస్టులు చెబుతున్నారు. మల్టీబిలియన్ డాలర్ల ఇంటర్నెట్ దిగ్గజం ఆవిష్కారానికి ముందు జాక్ ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశారు.1999లోమరో 17మందితో కలిసి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఇ-కామర్స్, డిజిటల్ చెల్లింపుల సంస్థ ఆలీబాబాకు ప్రాణం పోశారు జాక్ మా. ఈ వార్తలపై జాక్‌మా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
దానగుణం అంటే అది!
పూర్వం ఒక గొప్ప సంపన్నుడుండేవాడు. అతను దెవభక్తిపరుడు. క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్లేవాడు. కార్తీక వ్రతం ఆచరించేవాడు. విరివిగా దానధర్మాలు చేసేవాడు. కాశీ యాత్ర కూడా చేశాడు. కానీ ఎవరైనా అవసరార్థం పదీపరకా అడిగినా చిల్లిగవ్వ కూడా ఇచ్చేవాడు కాదు. ఒకసారి అతను ఉంటున్న వీధిలోనే ఒక పేద యువతికి ఆ వీధివాళ్ళంతా కలసి పెళ్ళిచెయ్యాలని నిర్ణయించుకొని చందా పోగుచేశారు. ఆ వీధిలోని కొంతమంది పెద్దమనుషులు ఈయన వద్దకు వెళ్ళారు. కాని అతను నేనేమీ ఇవ్వలేనని చెప్పేశాడు. దాంతో పేదలకు సహాయం చెయ్యని దైవభక్తి దేనికని తలా ఓ తిట్టు తిట్టారు. ఈ పూజలు, ఉపవాసాలు ఎందుకని నానా మాటలన్నారు. అదే గ్రామంలో ఓ మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. అతను బాగా దానధర్మాలు చేసేవాడు. పేద యువతుల పెళ్ళిళ్ళకు, పేదల చదువులకు, అనాథలకు, వితంతువులకు ఉదారంగా సహాయం చేసేవాడు. ఎవరైనా పేదవ్యక్తి మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకయ్యే ఖర్చును భరించేవాడు. అతణì ్ణ ప్రజలు ఎంతగానో గౌరవించేవారు. అతనికోసం పూజలు చేసేవారు. ఒకసారి ఈ సంపన్న భక్తుడు అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజలకు అతని పట్ల ప్రేమ, సానుభూతి లేకున్నా, వ్యాధిగ్రస్తులను పరామర్శించడం పుణ్యకార్యమని పరామర్శకు వెళ్ళారు. ఆశ్చర్యమేమిటంటే, దానధర్మాలు చేసే ఈ మనిషి సంపన్నుడి సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసినవారు ‘నిజంగా మనిషంటే ఈ మహానుభావుడే, ఆ పిసినారి నైజం తెలిసి కూడా అతనికి సేవలు చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు’. అని అతణ్ణి కొనియాడారు. కొన్నాళ్ళకు ఆ సంపన్నుడు మరణించాడు. అందరూ అతని అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దహన సంస్కారాలు పూర్తయిన తరువాత ఆ పెద్దమనిషి ‘అందరూ కొద్దిసేపు ఆగండి’ అని చెప్పాడు.. అందరూ స్నానాల తర్వాత శివాలయం ఆవరణలో గుమిగూడిన తరువాత, ‘మిత్రులారా! మీకో విషయం తెలియజెప్పాలి. అందరూ ఆ పెద్దాయన్ని పిసినారి అని తిట్టుకునేవారు కదా... నిజానికి ఆయన గొప్పదాత. కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదన్నది ఆయన పద్ధతి. దానికోసం ఆయన నన్ను ఎన్నుకున్నారు. నేను చేపట్టే సేవాకార్యక్రమాలన్నీ ఆయన సమకూర్చిన ధనంతోనే!’ అని సభికులవైపు చూశాడు. అందరి కళ్లూ సజలాలయ్యాయి. ప్రతి ఒక్కరి చేతులు జోడించి ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థన చేశారు. -
ఆదాయంలో 75 శాతం దానం: ఎల్అండ్టీ చీఫ్
ముంబై : ఇంజనీరింగ్ దిగ్గజ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఏఎం నాయక్ తన దాతృత్వ హృదయాన్ని చాటుకున్నారు. జీవితకాలపు ఆదాయాల్లో 75 శాతం స్వచ్చంద సంస్థలకే కేటాయించనున్నట్టు వెల్లడించారు. 1600 కోట్ల డాలర్ల సంపదతో ఇంజనీరింగ్ దిగ్గజంగా ఉన్న ఎల్ అండ్ టీ క్రియాశీల నాయకత్వం నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. స్వచ్చంద సేవ అనేది తన వ్యక్తిగత కోరికని, తన మూడు తరాల్లో తాతయ్య, తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడంతో వారు పేదలుగానే జీవనం గడిపారని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన 75 శాతం ఆదాయాలను స్వచ్చంద సేవలకే వినియోగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నాయక్ ఇప్పటికే రెండు స్వచ్చంద సంస్థలను ఏర్పాటుచేశారు. ఒకటి నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ ట్రైనింగ్, మరొకటి 2007లో తన మనువరాలు క్యాన్సర్‌తో చనిపోవడంతో నిరాళి మెమోరియల్ మెడికల్ ట్రస్ట్‌ను స్థాపించారు. అయితే ఇప్పటివరకు ఈ సంస్థలకు కేటాయించిన నిధుల వివరాలను నాయక్ తెలుపలేదు. నాయక్ మొదటి డొనేషన్ 1995లో గుజరాత్‌లోని తన స్వగ్రామంలో ఓ ఆస్పత్రికి కు రూ.125 కోట్లను ఇచ్చారు. నాయక్ ట్రస్టులు ఏడు ప్రాజెక్టులను రన్ చేస్తున్నాయి. వాటిలో రెండు 2017లో ప్రారంభం కానున్నాయి. దానిలో ఒకటి తన భార్య పేరుమీద ఆమె పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వేదిక్ స్కూల్‌గా ఆవిష్కరించబోతున్నారు. నాయక్ ప్రతియేటా తన వేతనంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 1965లో ఎల్ అండ్ టీలో జూనియర్ ఇంజనీర్‌గా నాయక్ కెరీర్ ప్రారంభించారు. అనంతరం 1999లో సీఈవోగా, 2003లో చైర్మన్‌గా ఎంపికయ్యారు. 2012లో అతని చైర్మన్ పదవిని ఎల్ అండ్ టీ పొడిగించింది. 2017లో ఆయన రిటైర్ కాబోతున్నారు. నాయక్‌కు ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు. -
దానకర్ణుల నగరం.. ముంబై!
మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం.. దానకర్ణులకు కూడా రాజధానిగా మారిపోతోంది. ఈ విషయం హురూన్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ విడుదలతో తేలింది. దేశంలో మొత్తం 50 మంది దానకర్ణులను చూస్తే అందులో 15 మంది కేవలం ముంబై నగరం నుంచే ఉన్నారు. వాళ్లు నగదు రూపంలో గానీ, వస్తువుల రూపంలో గానీ 2013 ఏప్రిల్ 1 నుంచి 2014 అక్టోబర్ 31 వరకు చేసిన దానాలను లెక్కలోకి తీసుకున్నారు. కనీసం రూ. 10 కోట్ల దానం నుంచే లెక్కించారు. వీళ్లలో రతన్ టాటా నాలుగో ర్యాంకుతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం రూ. 620 కోట్లు దానం చేశారు. ఐదో ర్యాంకులో ఉన్న ముకేష్ అంబానీ రూ. 603 కోట్లు ఇవ్వగా.. 33వ ర్యాంకులో ఉన్న షారుక్ ఖాన్ రూ. 25 కోట్లు మాత్రమే దానం చేశారు. ఇక 47వ ర్యాంకు సాధించిన సల్లూ భాయ్ రూ. 11 కోట్ల విరాళాలు ఇచ్చారు. ముంబైలో ఉన్న మొత్తం దానకర్ణులంతా కలిపి రూ. 2,129 కోట్లు దానం చేశారు. ఈ జాబితాలో ముంబై తర్వాతి స్థానాన్ని బెంగళూరు నగరం ఆక్రమించింది. అక్కడ మొత్తం 8 మంది దానకర్ణులున్నారు. అయితే దానం మొత్తం చూస్తే మాత్రం ముంబై కంటే బెంగళూరే ఎక్కువ. అక్కడ విప్రో చీఫ్ అజీం ప్రేమ్‌జీ ఒక్కరే రూ. 12,316 కోట్లు దానం చేయడంతో మొత్తం నగరం అంతా కలిపి రూ. 13,200 కోట్ల విరాళాలు ఇచ్చినట్లయింది. ఇక మొత్తం కుబేరుల్లో అజీం ప్రేమ్‌జీ తర్వాత వేదాంత గ్రూపు అధినేత అనిల్ అగర్వాల్ ఉన్నారు. ఆయన వ్యక్తిగత విరాళాలు రూ. 1,796 కోట్లకు చేరుకున్నాయి. హెచ్‌సీఎల్ చీఫ్ శివ్ నాడార్ రూ. 1,136 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. -
ఏటా రూ. 20 కోట్లు ఇస్తా: రోహిణి నిలేకని
న్యూఢిల్లీ: ప్రతి ఏడాది రూ. 20 కోట్లు దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించాలనుకుంటున్నట్టు సాఫ్ట్ వేర్ ప్రముఖుడు నందన్ నిలేకని సతీమణి రోహణి నిలేకని వెల్లడించారు. పర్యావరణం, గవర్నెన్స్, సమన్యాయం, పారదర్శకత తదితర అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళం అందించనున్నట్టు తెలిపారు. ఇన్పోసిస్‌లో ఉన్న తనవాటాలో కొంతభాగాన్ని అమ్మడం ద్వారా ఇటీవల ఆమె రూ.160 కోట్లు ఆర్జించారు. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించినట్టు రోహిణి తెలిపారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్టు వెల్లడించారు. 'ప్రతి ఏడాది రూ. 15 నుంచి రూ. 20 కోట్లు సేవా కార్యక్రమాలకు ఇవ్వాలనుకుంటున్నా' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిణి తెలిపారు. 2005 నుంచి దాతృత్వ కార్యక్రమాలకు ఆమె రూ. 215 కోట్లు విరాళంగా ఇచ్చారు.