పరోపకారార్థం ఇదం శరీరం అనేది నానుడి. ఏ ఫలం ఆశించకుండా నలుగురికి సాయం చేయడం. సృష్టిలో ఈ భూమ్యా కాశాలతోపాటు పశువులు, వృక్షాలు ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండానే తమ విధిని నిర్వరిస్తున్నాయి. పరులకి సేవ చెయ్యడమే ఉత్కృష్టమైన జన్మనెత్తిన మనుషుల పరమావధి. తమకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలని భావిస్తాం. ఇది కేవలం భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది...కదా! తాజాగా భూరి విరాళాలతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారో ఓ మహిళా వ్యాపారవేత్త. ఆమె ఎవరు. ఏ దేశస్థురాలు ఆ వివరాలు చూద్దాం.
ఆమె మరెవ్వరో కాదు అమెరికు చెందిన మెలిండా ఫ్రెంచ్ గేట్స్. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్‌గేట్స్ మాజీ భార్య. 3.24 లక్షల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన ప్రపంచంలో టాప్‌లో నిలిచారు. 2000లో భర్త బిల్ గేట్స్ తో కలిసి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను 2015 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ గా అవతరించింది. ప్రస్తుతం దాదాపు 70 బిలియన్ల డాలర్ల విరాళాలతో బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆస్తుల పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దాతృత్వ సంస్థ.వాషింగ్టన్‌లోని సియాటిల్ కేంద్రంగా సేవలందిస్తున్న మెలిండా నేతృత్వంలోని సంస్థ తన సంపదలో 99 శాతానికి పైగా విరాళంగా ఇవ్వాలనే లక్ష్యానికి కట్టుబడి ఉంది.
1964 ఆగస్టు 15న పుట్టిన మెలిండా కంప్యూటర్ సైంటిస్ట్ అయిన మైక్రోసాఫ్ట్‌లో మాజీ మల్టీమీడియా ప్రొడక్ట్ డెవలపర్ , మేనేజర్ కూడా. గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ , అమెరికన్ ఎడ్యుకేషన్‌తో సహా వివిధ సమస్యలపై గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది.1994లో హెల్త్, స్టడీ, జెండర్ ఈక్వాలిటీ కోసం ప్రోత్సహించడానికి ఫౌండేషన్ ద్వారా 39 బిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు అందించారు.మెలిండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నిరుపేద మహిళలకు గర్భనిరోధక అంశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని కోసం ఆమె సంస్థ ద్వారా ఒకబిలియన్ డాలర్లకు పైగా విరాళాలివ్వడం విశేషం. మెలిండా మంచి రచయిత్రి కూడా.
భారతదేశంలో ఫౌండేషన్ దాతృత్వ కార్యకలాపాలకు గుర్తింపుగా, బిల్ అండ్ మెలిండా సంయుక్తంగా 2015లో భారతదేశం మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌ను అందుకున్నారు.2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్రెంచ్ గేట్స్ , బిల్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేశారు.
ఏడేళ్ల డేటింగ్ తర్వాత, 1994లో బిల్ గేట్స్, మెలిండా హవాయిలో ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఈ జంట ఆగస్టు 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మెలిండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నిలుస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment