ఏటా రూ. 20 కోట్లు ఇస్తా: రోహిణి నిలేకని | Rohini Nilekani to spend Rs 20 cr every year for philanthropy | Sakshi
Sakshi News home page

ఏటా రూ. 20 కోట్లు ఇస్తా: రోహిణి నిలేకని

Published Sun, Oct 13 2013 1:59 PM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

Rohini Nilekani to spend Rs 20 cr every year for philanthropy

న్యూఢిల్లీ: ప్రతి ఏడాది రూ. 20 కోట్లు దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించాలనుకుంటున్నట్టు సాఫ్ట్ వేర్ ప్రముఖుడు నందన్ నిలేకని సతీమణి రోహణి నిలేకని వెల్లడించారు. పర్యావరణం, గవర్నెన్స్, సమన్యాయం, పారదర్శకత  తదితర అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళం అందించనున్నట్టు తెలిపారు.

ఇన్పోసిస్లో ఉన్న తనవాటాలో కొంతభాగాన్ని అమ్మడం ద్వారా ఇటీవల ఆమె రూ.160 కోట్లు ఆర్జించారు. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించినట్టు రోహిణి తెలిపారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్టు వెల్లడించారు. 'ప్రతి ఏడాది రూ. 15 నుంచి రూ. 20 కోట్లు సేవా కార్యక్రమాలకు ఇవ్వాలనుకుంటున్నా' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిణి తెలిపారు. 2005 నుంచి దాతృత్వ కార్యక్రమాలకు ఆమె రూ. 215 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement