Nandan Nilekani
-
నారాయణమూర్తి అడిగితే.. కొండపై నుంచి దూకేవాడిని: నందన్ నీలేకని
నందన్ నీలేకని అనగానే.. ఆధార్ సృష్టికర్త అని వెంటనే గుర్తొస్తుంది. కానీ ఈయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులలో ఒకరు కూడా. ఇటీవల ఈయన రోస్లాన్‌స్కీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి వెల్లడించారు.నందన్ నీలేకని 1978లో మొదటిసారి ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కలిసిన తరువాత తనలో మార్పు వచ్చిందని చెప్పారు. అంతకంటే ముందు ఐఐటీ బాంబేలో చేరడానికి తన తండ్రిని ఎదిరించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. నాన్న నన్ను కెమికల్ ఇంజినీరింగ్‌లో చేరమని చెబితే.. నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాను. అప్పట్లో అది ఓ చిన్నపాటి తిరుగుబాటు చర్య అని అన్నారు.నేను చదువుకునే రోజుల్లో ఇంజినీర్ లేదా డాక్టర్ అనే రెండు ఉద్యోగాలను మాత్రమే తల్లిందండ్రులు పిల్లలకు చెప్పేవారు. నేను డాక్టర్ కావాలని కోరుకోలేదు, అందుకే ఇంజినీర్ అయ్యాను అని నందన్ నీలేకని చెప్పుకొచ్చారు. 1978లో ఐఐటీ బాంబే నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ పట్టా పొందాను. ఆ తరువాత గ్రేడ్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష రాయ్లకున్నాను, కానీ ఆరోజు అస్వస్థతకు గురవ్వడం వల్ల పరీక్ష మిస్ అయ్యాను. తరువాత ఏం చేయాలో తోచలేదు.ఆ సమయంలో కొత్త టెక్నాలజీని, మినీ కంప్యూటర్లను ఉపయోగిస్తున్న ఓ చిన్న సంస్థ పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ గురించి విన్నాను. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సంస్థకు సాఫ్ట్వేర్ హెడ్‌గా ఉన్న నారాయణమూర్తి ఆఫీసుకు వెళ్ళాను. ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, అదృష్టవశాత్తు వాటన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చాను. ఇదే నా జీవితాన్ని మలుపుతిప్పిన అసాధారణ జాబ్ ఆఫర్ అని నీలేకని అన్నారు.నారాయణమూర్తి ఆకర్షణీయంగా, చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేవారాని నీలేకని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి అని ఆయన నారాయణమూర్తిని కొనియాడారు. ఆయన అడిగితే ఏమైనా చేస్తాను. కొండపై నుంచి దూకమంటే.. తప్పకుండా దూకుతాను అని నీలేకని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. 25ఏళ్ల వయసులో నా లీడర్ నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్ స్థాపించమని గుర్తుచేసుకున్నారు.ఇదీ చదవండి: అలా ఆమె మనసు గెలుచుకున్నా.. 30 ఏళ్లకే మాటపై నిలబడ్డా: ఎన్వీడియా సీఈఓఇన్ఫోసిస్ ప్రస్తావన గురించి మాత్రమే కాకుండా.. ఆధార్‌ను రూపొందించే తన ప్రయాణాన్ని కూడా వివరించారు. ఆధార్‌లో చేరిన ఒక నెలలోపే, నేను వైదొలిగే సమయానికి మేము 600 మిలియన్ల ఐడీలను సాధిస్తామని ప్రకటించాను. ఇది చాలా పెద్ద లక్ష్యం, ప్రజలు నన్ను వెర్రివాడిగా భావించారు. అయితే ఈ లక్ష్యం నా జట్టును ఉత్తేజపరిచింది. ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల మిగతావన్నీ కనుమరుగయ్యేలా చేశాయని నందన్ అన్నారు. -
‘ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం అదే..’ ఉబర్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చిన్న, మధ్య స్థాయి సంస్థలకూ ఇ-కామర్స్ విపణిలో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఫ్యాషన్ సంస్థలు ఎక్కువగా ఓఎన్డీసీ వేదికను వినియోగించుకుంటుండగా, కొత్తగా రవాణా రంగ సంస్థలూ ఈ వేదికపైకి వస్తున్నాయి. తాజాగా తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతదేశంలో ఇంటర్సిటీ బస్సు, మెట్రో రైలు టిక్కెట్ బుకింగ్‌ల వంటి ఆఫర్లను ఉబెర్ కల్పించనుంది. ఈ కంపెనీ గ్లోబల్ సీఈఓ డారా ఖోష్క్రోవ్సహి ‘పెద్ద మొత్తంలో టెక్నాలజీని నిర్మించడం’ అనే అంశంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకనితో గురువారం చర్చించారు. ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంపెనీలు, ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలని తెలిపారు. టెక్నాలజీ కంపెనీగా ఓపెన్ సోర్స్ సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఉబర్ ఎప్పుడూ ముందుంటుందని డారా చెప్పారు. ఉబర్‌కు ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం ఏమిటని నందన్ నిలేకని అడగగా, ఇండియా అత్యంత క్లిష్టమైన మార్కెట్ అని డారా అన్నారు. ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా దేనికీ డబ్బు చెల్లించడానికి ఇష్టపడరని, ఇక్కడ సక్సెస్ అయ్యామంటే ఎక్కడైనా విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. లో–కాస్ట్ సర్వీస్‌లను విస్తరిస్తామని డారా చెప్పారు. ఏమిటీ ఓఎన్డీసీ? దేశీయ ఇ-కామర్స్ విపణిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌దే హవా. కొవిడ్ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణ షాపుల భవితవ్యం అనిశ్చితిలో పడుతోందని గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఉండాలని సంకల్పించింది. ప్రధాని మోదీ సూచన మేరకు నందన్ నిలేకని, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్డీసీ పేరిట లాభాపేక్షలేని ఈ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. -
దాతృత్వ హీరోల్లో నీలేకని, కామత్..
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ చైర్మన్ కేపీ సింగ్, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ వంటి దిగ్గజాలు సంపదను సమాజ శ్రేయస్సు కోసం కూడా గణనీయంగా ఉపయోగిస్తున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 17వ ఆసియా దాతృత్వ హీరోల జాబితా (15 మంది)లో వారు చోటు దక్కించుకున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన ఐఐటీ బాంబేకి 1999 నుంచి ఇప్పటివరకు నీలేకని రూ.400 కోట్లు విరాళంగా ఇచ్చారు. 2020లో డీఎల్ఎఫ్ చైర్మన్ హోదా నుంచి తప్పుకున్న సింగ్ (92 ఏళ్లు).. కంపెనీలో నేరుగా ఉన్న వాటాలను విక్రయించగా వచి్చన రూ.730 కోట్లను దాతృత్వ కార్యకలాపాలకు కేటాయించారు. జిరోధా కామత్ (37 ఏళ్లు) ‘డబ్ల్యూటీఎఫ్ ఈజ్’ పేరిట వ్యాపార దిగ్గజాలతో నిర్వహించే యూట్యూబ్ పాడ్‌కాస్ట్ సిరీస్ ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థలకు రూ. కోటి వరకు విరాళాలు అందచేస్తున్నారు. -
నో ఫ్రిల్స్ ఖాతాలకు పరిష్కారం తప్పనిసరి - నందన్ నీలేకని
ముంబై: ప్రజలు నో ఫ్రిల్స్ బ్యాంక్ ఖాతాలను వినియోగించుకోవడం లేదని, దీనికి బ్యాంక్‌లు విధిస్తున్న చార్జీలే కారణమని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. ఈ సమస్య పరిష్కరించతగినదేనన్నారు. దీనికి పరిష్కారం తప్పనిసరి అంటూ, ఇతర దేశాలు సైతం దీన్ని అనుకరించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ముంబైలో గ్లోబల్ ఎస్ఎంఈ ఫైనాన్స్ ఫోరమ్ కార్యక్రమంలో భాగంగా నీలేకని ఈ అంశాన్ని ప్రస్తావించారు. బ్యాంక్‌లు చేసిన విస్తృత ప్రచారంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఖాతాలు తెరిచారని, ప్రభుత్వాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీకి వీటిని ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఖాతాల్లో బ్యాలన్స్ ఉన్నా కానీ, లావాదేవీలు లేవు. దీనికి బ్యాంకులు విధిస్తున్న చార్జీలే కారణం. ఎలాంటి బ్యాలన్స్ లేని (నో ఫ్రిల్స్) బేసిక్ ఖాతాలను ఆర్థికంగా లాభసాటిగా చూడరాదు. ఆయా ఖాతాలపై ఎన్నో చార్జీలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఆ ఖాతాలను ఉపయోగించడం నిలిపివేస్తున్నారు’’ నీలేకని పేర్కొన్నారు. ఇది నిర్వహణపరమైన సమస్యేనంటూ, దీనికి పరిష్కారం ఉందన్నారు. భారత్ అమలు చేస్తున్న డిజిటల్ ప్రజా సదుపాయాలను కనీసం 50 దేశాలు అమలు చేసే విధంగా భారత్ లక్ష్యం విధించుకోవాలన్నారు. భారత్ సాధించిన అనుభవం, విజ్ఞానాన్ని ప్రపంచం సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత్–యూఏఈ లేదా భారత్–సౌదీ అరేబియా వంటి భారీ కారీడార్ల వైపు చూడాలని, వీటి మధ్య నిధుల ప్రవాహంతో మెరుగైన విజయానికి వీలుంటుందన్నారు. -
50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఫిలాంత్రపిస్ట్ నందన్ నీలేకని మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. తను చదువుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకి భారీ విరాళానని ప్రకటించారు. తన 50 సంవత్సరాల అనుబంధాన్ని పురస్కరించుకుని రూ. 315 కోట్లను విరాళంగా ఇచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) నందన్ నీలేకని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాసిస్ చౌధురి ఒక అవగాహన ఒప్పందంపై మంగళవారం అధికారికంగా సంతకాలు చేశారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరిశోధనలను ప్రోత్సహించడానికి ఐఐటీ బాంబేలోని టెక్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. ఐఐటీ బాంబేతో తన జీవితంలో ఒక మూలస్తంభంలాంటిది. ఇవాల్టి తన ప్రయాణానికి పునాది వేసిందని నీలేకని పేర్కొన్నారు. తన విజయానికి బాటలు వేసిన ఇలాంటి గౌరవప్రదమైన సంస్థతో 50 ఏళ్ల అనుబంధాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థకు సాయం చేయడం సంతోషంగా ఉందని నీలేకని పేర్కొన్నిరు. ఇది కేవలం డబ్బు సాయం మాత్రం కాదు.. తన జీవితానికి చాలా అందించిన గొప్ప ప్రదేశం పట్ల తనకున్న గౌరవం, అలాగే రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దే విద్యార్థుల పట్ల ఇది తన నిబద్ధత అన్నారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) ఐఐటీ బాంబేతో అనుబంధం నీలేకని 1973లో ఐఐటీ బాంబేలోఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. గతంలో కూడా ఇదే ఇన్స్టిట్యూట్కి 85 కోట్లు అందించారు. దీంతో మొత్తం సహకారం రూ. 400 కోట్లకు చేరుకుంది. 1999 - 2009 వరకు ఐఐటీ బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డులో పనిచేశారు. 2005-2011 వరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఉన్నారు. 1999లో ప్రతిష్టాత్మకమైన విశిష్ట పూర్వ విద్యార్ధి అవార్డును, 2019లో ఐఐటీ బాంబే 57వ కాన్వకేషన్‌లో భాగంగా గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు నందన్ నీలేకని. (మరిన్ని బిజినెస్వార్తలు, ఆసక్తికర కథనాల కోసం చదవండి సాక్షిబిజినెస్) To mark 50 years of my association with @iitbombay, I am donating ₹315 crores to my alma mater. I am grateful to be able to do this🙏 Full release: https://t.co/q6rvuMf2jn pic.twitter.com/f8OEfZ1UTq — Nandan Nilekani (@NandanNilekani) June 20, 2023 -
సెల్ఫీ ప్లీజ్!.. ‘నందన్ సార్’ భారత్‌లో మీ సేవలు అమోఘం!
నందన్ నిలేకని పరిచయం అక్కర్లేని పేరు. ‘ఆధార్ కార్డ్’ పేరుతో ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఐడీ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చిన సృష్టికర్త, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ..ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించిన సహా వ్యవస్థాపకుడు..ఆ సంస్థ ఛైర్మన్ కూడా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుల్లో ఒకరైన నందన్ నిలేకనితో సెల్ఫీ దిగాలని ప్రపంచ దేశాలకు చెందిన ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ గ్లోబుల్ క్లయింట్ బిజినెస్ హెడ్ మార్క్ వైడెమాన్ (Mark Wiedman) నందన్ నిలేకని గొప్పతనం గురించి లింక్డిన్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో నిలేకనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తన సంస్థ(బ్లాక్‌రాక్) ఉద్యోగులకు ఆయనంటే మహా ఇష్టం. నేను ఈ సంవత్సరం ముంబైలో నందన్ నీలేకనిని కలిసిన తర్వాత, దేశాభివృద్దిలో ఆయన సేవలు గురించి తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థ హడ్సన్ యార్డ్స్ (Hudson Yards) కార్యాలయానికి ఆహ్వానించినట్లు వైడ్మాన్ తన పోస్ట్‌లో తెలిపారు. అంతేకాదు నిలేకని సహకారాన్ని ప్రస్తావిస్తూ.. వైడ్మాన్ ఒక ప్రశ్నతో ప్రారంభించారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తింపు కార్డు లేకుండా జీవిస్తున్నారని ఊహించగలరా’ అని ప్రశ్నించారు. నిలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' (UPI) సృస్టికర్త. అతను గత 14 సంవత్సరాలుగా వందల మిలియన్ల మందికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డ్‌లను అందించడంలో భారత్ రూపు రేఖల్ని మార్చేశారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. నందన్ సృష్టించిన కొత్త సాంకేతికత భారతీయులకు వారి రోజువారీ జీవితంలో ఎలా సహాయపడుతుందో కూడా పేర్కొన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ జరగాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం భారత్‌తో సహకరించేందుకు 50 దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇక కార్యక్రమం ముగిసిన అనంతరం తన సంస్థ ఉద్యోగులు నందన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారని వెల్లడించారు. చదవండి👉 ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా -
రోహిణి నీలేకని గురించి ఈ విషయాలు తెలుసా? ఇన్పీలో ఆమె తొలి పెట్టుబడి ఎంతంటే?
సాక్షి, ముంబై: భారీ విరాళాలతో దేశంలోనే అత్యంత ఉదాత్తమైన మహిళగా ఘనత కెక్కారు రోహిణి నీలేకని. సంవత్సరానికి రూ. 120 కోట్ల విరాళంతో అత్యంత ప్రసిద్ధ పరోపకారుల్లో ఒకరు. ఎడెల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ ఉమెన్స్ లిస్ట్-2022లో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు రోహిణి. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని భార్య రోహిణి పాపులర్ రైటర్..జర్నలిస్ట్, కాలమిస్ట్. విరాళాల్లో ఎక్కువ భాగం పర్యావరణం, నీరు, విద్యా రంగాలకే. ఎవరీ రోహిణి నీలేకని? ముంబైలో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1960లో జన్మించారు రోహిణి. తండ్రి ఇంజనీర్, ఆమె తల్లి గృహిణి. ఆమె ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి ఫ్రెంచ్ సాహిత్యంలో పట్టా పొందిన రోహిణి 1980లో ఒక జర్నలిస్టుగా తన కరియర్‌ను మొదలు పెట్టారు. 1998లో తన మొదటి నవల స్టిల్బోర్న్ని రిలీజ్ చేశారు. అలాగే పిల్లలకోసం శృంగేరి సిరీస్‌ని తీసుకొచ్చారు. 'నోని' అనే కలం పేరుతో పిల్లలకోసం అనేక రచనలు చేశారు రోహిణి. ఇద్దరు పిల్లల బాధ్యత, దాతృత్వ సేవలు నందన్, రోహిని దంపతులకు నిహార్ , జాన్హవి అనే ఇద్దరు పిల్లలు. నందన్ నీలేకని బిజీగా ఉన్న సమయంలో తల్లిగా పిల్లల పెంపక బాధ్యతలను పూర్తి తీసుకున్నారు. ఇది చాలా కష్టమే కానీ ఇంట్లో ఉండే ఫ్రీలాన్స్ ప్రాతిపదికన డాక్యుమెంటరీ స్క్రిప్ట్‌లు రాయడం ద్వారా సమయాన్ని సద్విని యోగం చేసుకున్నారట. 2014లో పిల్లలకోసం ప్రథమ్ బుక్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఇద్దరు యువతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా దాతృత్వంలోకి ప్రవేశించారు రోహిణి. ఇక ఆ తరువాత విరాళాల విషయంలో ఏమాత్రం సంకోచించకుండా ముందుకు సాగారు. దీంతోపాటు లాభాపేక్షలేని పిల్లల ఎన్జీవో EkStepని కూడా స్థాపించారు. 2001లో నీరు, పారిశుధ్యం కోసం అర్ఘ్యం ఫౌండేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక విద్యపై దృష్టి సారించే అక్షర ఫౌండేషన్‌కు చైర్‌పర్సన్‌గా పలు సేవలందించారు అయితే 2021సెప్టెంబరు లో అర్ఘ్యం ఫౌండేషన్ చైర్పర్సన్ పదవినుంచి తప్పుకున్నారు. మనుమడు తనుష్‌కి జంతువులంటే చాలా ఇష్టం. అతని స్పూర్తితోనే హంగ్రీ లిటిల్ స్కై మాన్స్టర్ (2020,) ది గ్రేట్ రిఫాసా బుక్స్ రాశానని స్వయంగా రోహిణి ఒక సందర్బంలో చెప్పారు. రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్ (ATREE) అశోక ట్రస్ట్ ట్రస్టీల బోర్డులో ఉన్నారు. 2012 నుండి కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఎమినెంట్ పర్సన్స్ అడ్వైజరీ గ్రూప్‌లో పని చేస్తున్నారు. 2011జూలైలో, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిట్ అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు.ఆమె 2017లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో విదేశీ గౌరవ సభ్యురాలి గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇన్ఫోసిస్ ఆవిర్భావంలో రోహిణి పాత్ర నందన్ నీలేకని 1981లో మరో ఆరుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించేనాటికి రోహిణి , నందన్ల అప్పుడే పెళ్లయింది. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న మొత్తం 10వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టారట. ఆతరువాత ఇన్ఫీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ధనవంతురాలిగామారారు. అయితే విరాళాలు ఇవ్వడంలో ఎపుడూ ముందుండే రోహిణి, ముఖ్యంగా ఆగస్ట్ 2013లో ఇన్ఫోసిస్‌లో 5.77 లక్షల షేర్లను విక్రయించి సుమారు రూ. 164 కోట్లు దానం చేశారు. 2010, 2014లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆసియాలో టాప్ దాతల్లో ఒకరిగా ఎంపికయ్యారు. దీంతోపాటు 2022లో ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్‌లో ఉత్తమ గ్రాస్‌రూట్ పరోపకారి అవార్డును, అసోంచాం ఫిలాంత్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2020-21 అవార్డును అందుకోవడం విశేషం. అంతేకాదు వాతావరణ మార్పు, లింగ సమానత్వం, స్వతంత్ర మీడియా, జంతు సంక్షేమ రంగంలో పనిచేస్తున్న సుమారు 80 పౌర సమాజ సంస్థలకు ఆమె మద్దతిస్తారు. "గివింగ్ ప్లెడ్జ్" 2010లో బిల్, మెలిండా గేట్స్ వారెన్ బఫెట్ దాన్ని ఏర్పాటు చేసిన తమ సంపదలో సగం దానం చేసే బిలియనీర్ల ఎలైట్ నెట్వర్క "గివింగ్ ప్లెడ్జ్" లో నందన్, రోహిణి నీలేకని చేరారు. 2017నాటికి విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్-షా, శోభా డెవలపర్స్ ఛైర్మన్ ఎమెరిటస్ పిఎన్సి మీనన్, నందన్ నీలేకని దంపతులతో కలిపి 21 దేశాల నుంచి 171 మంది ప్రతిజ్ఞ చేశారు. -
Nandan Nilekani: ఎఎ నెట్‌వర్క్‌తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం
న్యూఢిల్లీ: ఆర్థిక వివరాల డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం అయిన అకౌంట్ అగ్రిగేటర్ (ఎఎ) నెట్‌వర్క్‌తో వ్యాపారాలను అనుసంధానించడం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు రుణలభ్యత సులభతరమవుతుందని ఐటీ సంస్థ ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తెలిపారు. దీనితో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు కూడా ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ’జీఎస్వీ + ఎమెరిటస్ ఇండియా సదస్సు’లో పాల్గొన్న సందర్భంగా నీలేకని ఈ విషయాలు చెప్పారు. వ్యక్తులు .. ఒక ఆర్థిక సంస్థ దగ్గరున్న తమ వివరాలను వేరే సంస్థలతో సురక్షితంగా పంచుకునేందుకు ఎఎ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. ఇది ఆర్బీఐ నియంత్రణలో ఉంటుంది. (ఇదీ చదవండి: లిథియం బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.37,260 కోట్లు కావాలంట!) -
ఇండియన్ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్ నీలేకని
న్యూఢిల్లీ: భారత్ రానున్న పది సంవత్సరాల్లో ‘‘కీలకమైన ఆర్థిక క్రియాశీలత’’ను ప్రదర్శించనుందని ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యయుతమైన రీతిలో విస్తృత ప్రాతిపదికన, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ క్రియాశీలత ఉంటుందని కూడా ఆయన విశ్లేషించారు. డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ (ఓఎన్డీసీ), రికార్డ్ అగ్రిగేటింగ్ సిస్టమ్, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఫాస్ట్‌ట్యాగ్, ఈ-వే బిల్లుల వంటి ప్రభుత్వ చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి బాటన దోహదపడే అంశాలుగా వివరించారు. కార్నెగీ ఇండియా నిర్వహించిన బల్ టెక్నాలజీ సమ్మిట్ 7వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో 60 కోట్ల మందికి ఆధార్ గుర్తింపు ఉంటే, ప్రస్తుతం 130 కోట్ల మంది భారతీయులకు ఈ ఐడీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది దేశంలో ఎక్కడైనా ఉపయోగించగల ఆన్లైన్ ఐడీ అని పేర్కొంటూ, బయోమెట్రిక్స్, ఓటీపీల ద్వారా ఒక వ్యక్తి ప్రమాణీకరణకు ఇది దోహదపడుతుందని అన్నారు. (టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్, న్యూ లుక్ చూస్తే ఫిదానే!) ఇవీ చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..! ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్ -
యూపీఐ ద్వారా బీఎన్‌పీఎల్
ముంబై: ఇప్పుడు కొనుక్కో– తరువాత చెల్లించు(బయ్ నౌ పే లేటర్–బీఎన్‌పీఎల్) వంటి మరిన్ని ప్రొడక్టులను యూపీఐ ప్లాట్ఫామ్లో భాగం చేయాలంటూ టెక్నాలజీ రంగ వెటరన్ నందన్ నిలేకని పేర్కొన్నారు. యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా నిలేకని రుపే క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టారు. ఆర్బీఐ అధికారికంగా అనుమతించడంతో యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రుపే కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ఈ సందర్భంగా యూపీఐ ప్లాట్ఫామ్లో రుపే కార్డ్ విడుదల క్రెడిట్ సేవలకు సంబంధించి ఉపయుక్తమైన తొలి అడుగు అంటూ నిలేకని వ్యాఖ్యానించారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ప్లాట్‌ఫామ్ ఆర్కిటెక్ట్‌లలో ఒకరైన నిలేకని ఆర్బీఐ అనుమతితో భవిష్యత్‌లో విభిన్న రుణ సౌకర్యాలకు తెరలేచే వీలున్నట్లు అంచనా వేశారు. 40.5 కోట్లమంది ప్రజలు యూపీఐను వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోట్లమందికి బీఎన్‌పీఎల్ తదితర మార్గాలలో డిజిటల్ లావాదేవీలకు వీలు ఏర్పడితే వినియోగదారు రుణాలు బహుముఖాలుగా విస్తరిస్తాయని అభిప్రాయపడ్డారు. -
వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూత బడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపి వేసింది. బెంగళూరుకు చెందిన షాప్‌ఎక్స్ ఈ మేరకు దివాలా పిటీషన్ దాఖలు చేసింది. దివాలా (ఐబిసి) కోడ్, 2016 సెక్షన్ 10 ప్రకారం దివాలా కోసం దరఖాస్తు చేసినట్టు కంపెనీ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ (MCA) ఫైలింగ్‌లో తెలిపింది. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. . షాప్‌ఎక్స్ -
మూతబడిన మరో స్టార్టప్.. షాప్‌ఎక్స్
న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేకపోవడంతో మరో స్టార్టప్ సంస్థ మూతబడింది. టెక్ దిగ్గజం నందన్ నీలేకని ఇన్వెస్ట్ చేసిన షాప్‌ఎక్స్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దివాలా పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నాయి. అత్యంత స్వల్ప మార్జిన్ల వల్ల వ్యాపార నిర్వహణ లాభసాటిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎడ్టెక్ స్టార్టప్‌లు క్రెజోడాట్ఫన్, సూపర్లెర్న్, ప్రోటాన్ తదితర స్టార్టప్‌లు మూతబడ్డాయి. కిరాణా స్టోర్స్, ఇతర చిన్న తరహా రిటైలర్లకు లాజిస్టిక్స్, కొనుగోళ్లపరమైన సహకారం అందించేందుకు 2014లో అమిత్ శర్మ, అపూర్వ జోయిస్ కలిసి షాప్‌ఎక్స్ ఏర్పాటు చేశారు. నందన్ నీలేకనితో పాటు ఫంగ్ స్ట్రాటెజిక్ హోల్డింగ్స్, రాజేశ్ రణావత్, కేవల్ నోరియా తదితర ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ 2020 నాటికి 60 మిలియన్ డాలర్లు సమీకరించింది. తీవ్రమైన పోటీతో తరచూ వ్యాపార వ్యూహాలను మార్చుకున్నప్పటికీ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. నిధుల కొరత కారణంగా తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైంది. -
స్టార్టప్‌లకు ఫండమెంటమ్ నిధులు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కోచైర్మన్ నందన్ నీలేకని సహవ్యవస్థాపకుడిగా ఏర్పాటైన ఫండమెంటమ్ పార్టనర్షిప్ దేశీయంగా తొలి దశ స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు వీలుగా 22.7 కోట్ల డాలర్లు(రూ. 1,793 కోట్లు) సమీకరించినట్లు వెల్లడించింది. తద్వారా ప్రాథమికస్థాయి వృద్ధిలోగల స్టార్టప్‌లకు నిధులు అందించనున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో సిరీస్–బి రౌండ్ ద్వారా స్టార్టప్‌లకు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు ఫండమెంటమ్ సహవ్యవస్థాపకుడు, జనరల్ పార్టనర్ ఆశిష్ కుమార్ పేర్కొన్నారు. ఏదైనా ఒక స్టార్టప్ కొన్ని మైలురాళ్లకు చేరడం, వృద్ధి బాట పట్టడం వంటి పరిస్థితుల్లో రెండో రౌండ్ ద్వారా నిధులను అందించే సంగతి తెలిసిందే. ఇది రెండో ఫండ్ అని పేర్కొన్న ఆశిష్ ఏడాదికి 4–5 స్టార్టప్‌లకు 2.5–4 కోట్ల డాలర్ల మధ్య పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వివరించారు. 10 కోట్ల డాలర్లతో తొలి ఫండ్‌ను నిర్వహించిన ఫండమెంటమ్.. ప్రస్తుతం యూనికార్న్ హోదాను పొందిన ఫార్మ్ఈజీ, స్పిన్నీ తదితరాలకు నిధులు అందించిన విషయం విదితమే. -
అగ్నిపథ్ భేష్! పథకంపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ప్రశంసల వర్షం!
దేశాన్ని కుదిపేస్తున్న అగ్నిపథ్ అంశంపై కార్పొరేట్ దిగ్గజాలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ అగ్నివీరుల భవిష్యత్‌పై హామీ ఇవ్వగా.. తాజాగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని అగ్నిపథ్ స్కీంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై ఇన్ఫోసిస్ పరిశీలిస్తుందా అని షేర్ హోల్డర్ అడిగిన ప్రశ్నకు నందన్ నిలేకని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేం నమ్ముతున్నాం. యువతకు అగ్నిపథ్ అనేది గొప్ప అవకాశం. అగ్నిపథ్‌లో చేరి కెరియర్ను ప్రారంభించడమే కాదు, క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను నిర్మించుకోవచ్చు. వీటితో పాటు భవిష్యత్ కోసం కావాల్సిన నైపుణ్యాలని మెరుగుపరుచుకోవచ్చు' అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, ఇన్ఫోసిస్ యువతలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది. సంస్థ నిర్దేశించిన సెలక్షన్ క్రైటీరియా మేరకు ఉద్యోగుల్ని నియమించుకుంటామని అన్నారు. -
రియల్ ఎస్టేట్ డీల్స్.. ఏప్రిల్‌లో ఇదే రికార్డు..
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని బెంగళూరులో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు. నగరంలోని బిలయనీర్స్ స్ట్రీట్‌లో ఉన్న 9,600 చదరపు గజాల స్థలాన్ని ఆయన ఏప్రిల్ 19న కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీ కోసం ఆయన ఏకంగా రూ.58 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇందులో స్టాంప్ డ్యూటీ కింద రూ. 2 కోట్లు పన్ను కట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సింగిల్ ప్రాపర్టీ విషయంలో ఇదే ఖరీదైన డీల్‌గా చెప్పుకుంటున్నారు. బెంగళూరులోని కోమంగల ఏరియాలోని బ్లాక్ 3ని బిలియనీర్స్ స్ట్రీట్‌గా పిలుస్తారు. ఐటీ బూమ్ వచ్చిన తర్వాత సంపన్నులైన వారిలో ఎక్కువ మంది ఇక్కడే నివసిస్తున్నారు. దీంతో ఈ ఏరియాలో స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని రియల్టీ వర్గాలు అంటున్నాయి. ఫ్యామిలీ ట్రస్టు ద్వారా నందనిలేకని కొనుగోలు చేసిన ప్రాపర్టీ 9,600 చదరపు అడుగులు ఉండగా ఇందులో బిల్డప్ ఏరియా 3,084 చదరపు అడుగులు ఉంది. చదవండి: రూ.110 కోట్ల పెట్టుబడులు..95% ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్‌లలోనే.. -
Good News: కోటికి పైగా ఉద్యోగాలు..ఇక మీదే ఆలస్యం..!
ఐటీ ఉద్యోగం సంపాదిచడం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త. రాబోయే మరికొన్ని సంవత్సరాల్లో దేశీయ ఐటీ ఉద్యోగాల డిమాండ్ 4.5 మిలియన్ల నుంచి 9 -10 మిలియన్ల చేరుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం స్వచ్ఛంద సంస్థ 'అసెంట్ ఈ -కాంక్లేవ్' 6వ ఎడిషన్‌లో నందన్ నిలేకని పాల్గొన్నారు. ఈ సందర్భంగా "అడాప్టివ్ అడ్వాంటేజ్" అనే అంశంపై ప్రసంగించారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ సేవల వినియోగం, పెరుగుతున్న యునికార్న్ సంస్థలు (100కోట్ల వ్యాల్యూ), దిగ్గజ ఐటీ సంస్థలు భారీ ఎత్తున లాభాల్ని గడిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వర్క్ ఫోర్స్ డిమాండ్ 4.5 మిలియన్ల నుంచి 9-10 మిలియన్లకు చేరుకుంటుందని అన్నారు. కరోనా కారణంగా టెక్నాలజీ రంగం అభివృద్ది చెందిందని, దీంతో ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నా లేదంటే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. విద్యా అర్హత, ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఏ టెక్నాలజీ మీద ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకొని ఆ దిశగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిదని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్‌తో సహా నాలుగు ప్రధాన ఐటి సంస్థలు డిజిటల్ ఎక్స్పర్ట్స్ కోసం పెద్దపీఠ వేడయంతో అట్రిషన్ రేట్లు పెరిగాయని నివేదించాయి. మరోవైపు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో వరకు దాదాపు 2.5 లక్షల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లతో ఫ్రెషర్లను నియమించుకునేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిపింది. చదవండి: ఒక్క జాబ్‌కే 5 మంది పోటీ పడుతున్నారు..ఈ రంగాల్లోనే -
ఈకామర్స్‌కు షాక్: రంగంలోకి నందన్ నీలేకని
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ సృష్టికర్త, ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నందన్ నీలేకనికి మోదీ సర్కార్ కీలక బాధ్యతలను అప్పగించింది. డిజిటల్ మోనోపలీకి చెక్‌పెట్టే మార్గాలపై సలహా ఇచ్చే ప్రభుత్వ ప్యానెల్లో నీలేకనిని సభ్యుడిగా చేర్చింది. తద్వారా ఈకామర్స్ రంగంలో అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సప్లయ్ చెయిన్‌ను డిజిటలైజ్ చేయడం, కార్యకలాపాలను ప్రామాణీకరించడం, మరిన్ని సరఫరాదారులను చేర్చడాన్ని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాలు, వినియోగదారులకు విలువను పెంచుతుందని భావిస్తున్నారు. డిజిటల్ గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ తొమ్మిది మంది సభ్యుల సలహా మండలిలో నందన్ నీలేకనిని కూడా చేర్చడం విశేషం. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) పేరుతో ఏర్పటవుతున్న ఈ కమిటీ నిబంధనల అమలును వేగంగా ట్రాక్ చేయడానికి సూచనలు ఇస్తుందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి (డీపీఐఐటీ)జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ), ప్రాథమికంగా డిజిటల్ గుత్తాధిపత్యాలను అరికట్టడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. ఐటీ దిగ్గజం నందన్ నీలేకనీతో పాటు, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ, క్యూసిఐ చీఫ్ ఆదిల్ జైనుల్ భాయ్, అవానా క్యాపిటల్ వ్యవస్థాపకుడు అంజలి బన్సాల్, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ దిలీప్ అస్బే ఉన్నారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ హెడ్ సురేష్ సేథి, ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ చీఫ్ ప్రవీణ్ ఖండేల్వాల్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. కాగా నందన్ నీలేకని యుఐడీఏఐ చైర్మన్ గానూ, టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, న్యూ పెన్షన్ స్కీమ్, జీఎస్టీ సహా ఐదు కీలక ఆర్థిక రంగ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ సాంకేతిక సలహా బృందానికి నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
గుడ్‌న్యూస్ : ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు .. ఎన్నో తెలుసా ?
బెంగళూరు : పట్టభద్రులకు శుభవార్త ! భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు ఇన్ఫోసిస్ రెడీ అయ్యింది. కోవిడ్ నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకోవడంతో కంపెనీ ఆర్డర్లు పెరిగాయి. దీంతో కొత్తగా వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో నందన్ నీలేకని ప్రకటన చేశారు. కోవిడ్ ఎఫెక్ట్ కోవిడ్ ఎఫెక్ట్, ఆటోమేషన్ కారణంగా వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పోయాయి. ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనైంది. అయితే క్రమంగా మార్కెట్ పుంజుకుంటోంది. కోవిడ్ ఆంక్షలు, లాక్డౌన్ , ప్రయాణ నిషేధాలు తదితర కారణాలతో విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కష్టంగా మారింది. అయితే ఇన్ఫోసిస్ నుంచి భారీ రిక్రూట్మెంట్ ప్రకటన రావడంతో ఐటీ ప్రొఫెనల్స్‌కి ఊరట లభించింది. ఇన్ఫోసిస్‌తో మొదలు ఇన్ఫోసిస్‌కి ఇటీవల భారీగా ఆర్డర్లు రావడంతో రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. 2022 నాటికి అమెరికా కేంద్రంగా 25,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ 40వ వార్సికోత్సవ సమావేశంలో నందన్ నీలేకని చెప్పారు. అంతేకాదు ఇటీవలే ఇండియాలో దాదాపు 19,230 మందిని సంస్థలోకి తీసుకున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం కెనాడాలో ఇన్ఫోసిస్‌కి 4,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య రెట్టింపు చేస్తామని తెలిపారు. చదవండి : పెట్రోల్, డీజిల్‌కి... ఆ బ్రాండ్ గుడ్‌బై -
ఈ - ఫైలింగ్ పోర్టల్‌లో అవాంతరాలు
న్యూఢిల్లీ: పన్ను రిటర్నుల దాఖలు, రిఫండ్ల ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చే ఉద్దేశ్యంతో ఆదాయపన్ను శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక అంతరాలు దర్శనమిచ్చాయి. దీనిపై యూజర్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్విట్టర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అంతరాయాలను సరిచేయాలంటూ ఇన్ఫోసిస్, ఆ సంస్థ సారథి నందన్‌నీలేకనిని మంత్రి కోరారు. ‘‘అంతరాయాల విషయమై నా టైమ్‌లైన్‌పై ఫిర్యాదులను చూశాను. ఇన్ఫోసిస్, నందన్ నీలేకని మన పన్ను చెల్లింపుదారులకు నాణ్యమైన సేవలను అందించే విషయంలో నిరాశపరచదని భావిస్తున్నాను’’ అంటూ మంత్రి ట్వీట్ చేశారు. పన్ను చెల్లింపుదారులకు నిబంధనల అమలును సులభంగా మార్చడమే తమ ప్రాధాన్యమని మంత్రి చెప్పారు. నూతన ఈ–ఫైలింగ్ పోర్టల్ ఈ నెల 7న ప్రారంభమైంది. దీన్ని రూపొందించే కాంట్రాక్ట్‌ను 2019లో ఇన్ఫోసిస్ సొంతం చేసుకుంది. జీఎస్టీ నెట్వర్క్ పోర్టల్‌ను అభివృద్ధి చేసిందీ ఇన్ఫోసిస్ కావడం గమనార్హం. చదవండి: ప్రముఖ వెబ్సైట్ల సర్వర్ డౌన్ -
ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఎంతంటే..?
న్యూఢిల్లీ: గతేడాది (2019–20)లో ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ) సలీల్ పరేఖ్ మొత్తం పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో జీతంతో కలుపుకుని పరిహారం రూ .16.85 కోట్లు కాగా, స్టాక్ ఆప్షన్ల మార్గంలో రూ .17.04 కోట్లు, ఇతరత్రా చెల్లింపుల కింద రూ. 38 లక్షలు ఈయనకు చెల్లించినట్లు కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. అంతక్రితం ఏడాది (2018–19)లో రూ. 24.67 కోట్లు చెల్లించగా.. ఈ మొత్తంతో పోల్చితే గతేడాది చెల్లింపులు 39% పెరిగాయి. సంస్థ చైర్మన్ నందన్ నీలేకని తనకు ఎటువంటి పారితోషికం వద్దని చెప్పినట్లు నివేదిక పేర్కొంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) యూబీ ప్రవీణ్ రావు వేతనం 17.1% పెరిగి రూ. 10.6 కోట్లకు చేరింది. ఇక గతేడాదిలో టీసీఎస్ సీఈఓ, ఎండీ రాజేష్ గోపీనాథన్ వేతనం 16% తగ్గింది. ఈయనకు రూ. 13.3 కోట్లు చెల్లించినట్లు టీసీఎస్ ప్రకటించింది. మరోవైపు, విప్రో సీఈఓ అబిదాలి నీముచ్వాలా పారితోషికం 11.8% పెరిగింది. గతేడాదిలో ఈ తీసుకున్న మొత్తం రూ. 33.38 కోట్లుగా వెల్లడైంది. పనిలో వేగం పెరిగింది: సలీల్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో గ్లోబల్ టెలికమ్యూనికేషన్స్, హై టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ వంటి పలు పరిశ్రమల్లో వేగం పెరిగిందని సలీల్ పరేఖ్ అన్నారు. క్లైయింట్ల అవసరాలపైన దృష్టిసారించడం ద్వారా ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
ఇన్ఫోసిస్.. బోణీ భేష్!
బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్... అంచనాలను మించిన బంపర్ ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2019–20, క్యూ3) సంస్థ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,466 కోట్లకు చేరింది. 2018–19 సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ. 3,610 కోట్లు. దీంతో పోలిస్తే... 23.7 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 7.9 శాతం వృద్ధితో రూ.23,092 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ3లో ఆదాయం రూ.21,400 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడటం.. అన్ని వ్యాపార విభాగాల్లోనూ స్థిరమైన వృద్ధి సాధించటం కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ3లో ఇన్ఫీ రూ. 4,206 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గానూ దూకుడు.. 2019–20 ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌తో (క్యూ2)... అంటే సీక్వెన్షియల్ ప్రాతిపదికన పోల్చి చూసినా ఇన్ఫీ ఫలితాలు మెప్పించాయి. క్యూ2లో నికర లాభం రూ.4,019 కోట్లతో పోలిస్తే క్యూ3లో లాభం 10.7 శాతం ఎగసింది. ఆదాయం రూ.22,629 కోట్ల నుంచి 2 శాతం వృద్ధి చెందింది. గైడెన్స్ అప్... సానుకూల వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాను (గైడెన్స్) పెంచింది. ప్రస్తుత 2019– 20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయం 10– 10.5 శాతం మేర వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2) ఫలితాల సందర్భంగా ఆదాయ గైడెన్స్ 9–10%గా కంపెనీ లెక్కగట్టింది. ఇక నిర్వహణ మార్జిన్ గైడెన్స్‌ను కూడా 21–23%గా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ►డాలర్లపరంగా చూస్తే క్యూ3లో ఇన్ఫీ నికర లాభం 24.8 శాతం వృద్ధితో 627 మిలియన్ డాలర్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 8.6 శాతం పెరిగి 3.24 బిలియన్ డాలర్లకు చేరింది. ►డిజిటల్ వ్యాపార విభాగం ఆదాయాలు గతేడాది క్యూ3తో పోలిస్తే ఈ క్యూ3లో 40.8 శాతం వృద్ధి చెంది 1,318 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. ఇన్ఫీ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 40.6 శాతానికి చేరింది. ►క్యూ3లో నిర్వహణ మార్జిన్ 21.9 శాతంగా నమోదైంది. ►క్యూ3లో కంపెనీ నికరంగా 6,968 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో డిసెంబర్ చివరి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2,43,454కు చేరింది. క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 19.6 శాతంగా నమోదైంది. క్యూ2లో ఇది 21.7 శాతంగా ఉంది. ఇక మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 38.8 శాతానికి చేరింది. ►డిసెంబర్ క్వార్టర్లో కొత్తగా 84 మంది క్లయింట్లు జతయ్యారు. దాదాపు 1.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కంపెనీ దక్కించుకుంది. ‘భారీస్థాయి కాంట్రాక్టులను చేజిక్కించుకోవడంలో కంపెనీ తన సత్తాను కొనసాగిస్తోంది. మరోపక్క, ఉద్యోగుల వలసలు కూడా తగ్గుముఖం పడుతుండటం కలిసొస్తోంది’ అని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు.. కంపెనీ ఖాతా పుస్తకాల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, అదేవిధంగా ఉన్నతాధికారులు (ప్రధానంగా సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్) అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ‘అంతర్గత వేగులు (విజిల్ బ్లోయర్స్) చేసిన అన్ని ఆరోపణలపై కంపెనీ నియమించిన ఆడిట్ కమిటీ సీరియస్‌గా, లోతైన స్వతంత్ర విచారణను చేపట్టింది. అయితే, ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలూ లభించలేదు’ అని కమిటీ చైర్పర్సన్ డి. సుందరం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఆడిట్ కమిటీ నివేదికపై ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకని స్పందిస్తూ... ‘సలీల్ పరేఖ్, నీలాంజన్ రాయ్ కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్‌ను కొత్త వ్యూహాలతో విజయపథంవైపు నడిపించడంలో సలీల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఇప్పుడున్న డిజిటల్ యుగంలో తమ సత్తా చాటేందుకు క్లయింట్లు పూర్తిస్థాయిలో అస్త్రాలకు పదునుపెడుతున్నారు. ఈ మార్పు మా ఆదాయాల్లో రెండంకెల వృద్ధికి ప్రధానంగా దోహదం చేస్తోంది. అంతేకాకుండా నిర్వహణ మార్జిన్లు పుంజుకోవడం కూడా కంపెనీ మెరుగైన పనితీరుకు చోదకంగా పనిచేస్తోంది’. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ ‘పూర్తి ఏడాదికి ఆదాయ గైడెన్స్‌ను పెంచడం కంపెనీ పటిష్టమైన పనితీరుకు నిదర్శనం. సహజంగా మొత్తం ఐటీ పరిశ్రమకు సీజనల్‌గా బలహీనమైన క్వార్టర్లో సైతం ఇన్ఫీ ఈ స్థాయి ఫలితాలను ప్రకటించడం శుభపరిణామం. అంతేకాకుండా ఇకపై రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవడం మరో ప్రధానాంశంగా చూడొచ్చు’ – మోషే కత్రి, వెడ్‌బుష్ సెక్యూరిటీస్ ఎండీ ఇన్ఫీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1.5 శాతం లాభపడి రూ.738 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. -
ఇన్ఫోసిస్ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు : టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్ 20 న బోర్డుకు 2 పేజీల లేఖలో అనైతిక పద్ధతులపై ఆరోపించిన స్వల్ప వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఫిర్యాదు రావడం ఇది రెండోసారి. విజిల్ బ్లోయర్ ఈ ఆరోపణలు రేపిన సెగ ఇంకా చల్లారకముందే, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సలీల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకనితోపాటు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఒక లేఖ రాశారు. సీఈవో పరేఖ్ కంపెనీలో చేరి ఒక సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ, ముంబైలో కాకుండా బెంగళూరులో నివాసం ఉండాలన్న షరతును ఉల్లంఘించారని ఆరోపించారు. 11 బిలియన్ డాలర్ల కంపెనీ ఫైనాన్స్ విభాగ ఉద్యోగిని అని చెప్పుకున్న విజిల్‌బ్లోయర్, పరేఖ్ అక్రమాలను బహిర్గతం చేసినందుకు తనపై ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తన గుర్తింపును వెల్లడించలేకపోతున్నానంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగిగా, వాటాదారుగా, సంస్థ విలువ వ్యవస్థలను క్షీణింపజేస్తున్న పరేఖ్ గురించి కొన్ని వాస్తవాలను ఛైర్మన్, బోర్డు దృష్టికి తీసుకురావడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తక్షణమే స్పందించి, సంస్థ భవిష్యత్తు కనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. పరేఖ్‌కు రెండు నెలల గడువు ఇచ్చినప్పటికీ కేవలం తన వ్యాపార ప్రయోజనాలకోసమే బెంగళూరుకు మకాం మార్చకుండా, ముంబైలోనే ఉంటున్నారని ఆరోపించారు. సీఈవోకు స్టాక్ మార్కెట్ కనెక్షన్లు ఉన్నాయని, అనేక సంస్థలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించిన ఫిర్యాదుదారుడు, పరేఖ్ తన పెట్టుబడుల పర్యవేక్షణ కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకున్న చాలామంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేయడం ప్రారంభించారన్నారు. సీఈవో నెలకు రెండు సార్లు ఆఫీస్‌కు వచ్చేందుకు విమాన చార్జీలు, ఇతర రవాణా చార్జీలకే సంస్థ రూ. 22 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. నెలకు నాలుగు బిజినెస్ క్లాస్ విమాన టిక్కెట్లు, ఇంటికి నుంచి ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకి, ఆఫీసు నుంచి విమానాశ్రయం వరకు పికప్, డ్రాప్ చార్జీలు ఇందులో ఉన్నాయని విజిల్ బ్లోయర్ ఆరోపించారు. అయితే తాజా ఆరోపణలపై, అటు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్, ఇటు ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు. -
నందన్ నీలేకనికి అజయ్ త్యాగి కౌంటర్
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని వ్యాఖ్యలపై సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు. ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశం తరువాత సెబీ చైర్మన్ అజయ్ త్యాగి స్పందించారు. ప్రదానంగా ‘దేవుడు కూడా ఇన్ఫోసిస్ నెంబర్లను మార్చలేడు’ అన్ని నీలేకని వ్యాఖ్యాలపై స్పందించాలని అడిగినపుడు ఈ విషయాన్ని దేవుడిని అడగాలి లేదా అతడిని (నిలేకని)అడగాలి ఇందులోతాను చెప్పేదేమీలేదంటూ వ్యాఖ్యానించారు. నవంబర్ 5 న జరిగిన కంపెనీ వార్షిక విశ్లేషకుల సమావేశంలో నందన్ నిలేకని మాట్లాడుతూ కంపెనీ సొంత దర్యాప్తులో విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదును బలపరిచే ఆధారాలు లభించలేదన్నారు. అంతేకాదు దేవుడు కూడా ఇన్ఫోసిస్ నెంబర్లను మార్చలేడని పేర్కొన్నసంగతి తెలిసిందే. కాగా ఇన్ఫోసిస్ స్వల్ప కాలంలో లాభాలు, ఆదాయాలు పెంచుకోడానికి అనైతిక పద్ధతులను అనుసరిస్తోందని, కంపెనీలో ‘నైతికమైన ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే ఓ గ్రూప్, కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నిరంజన్ రాయ్‌కు వ్యతిరేకంగా కంపెనీ బోర్డుకు, యుఎస్ సెక్యురిటీస్, ఎక్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ-సెక్)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై యుఎస్ సెక్, సెబీ దర్యాప్తును ప్రారంభించాయి. -
ఇన్ఫీలో రగిలిన వివాదంపై సెబీ దృష్టి
ముంబై: టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌లో రగిలిన వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా సూచనలు కనిపించడంలేదు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణల కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రెండురోజులుగా స్టాక్మార్కెట్లో ఇన్ఫీ షేరు ఎన్నడూ లేనంతగా కుదేలైంది. దీంతో మార్కెట్ రెగ్యులేటరీ సెబీ రంగంలోకి దిగనుంది. తాజా ఆరోపణలపై సంస్థను ఇప్పటికే వివరణ కోరింది. త్వరలోనే ఈ వ్యవహారంపై విచారణను ప్రారంభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అకౌంటింగ్ ప్రమాణాలకు విరుద్దమని కొందరు బోర్డు సభ్యులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంతర్గత ఆడిటర్ల తో ఆడిట్ కమిటీ సంప్రదింపులు జరుపుతోందని, విచారణ కోసం న్యాయసేవల సంస్థ శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కోని నియమించుకున్నామని స్టాక్ ఎక్స్చేంజీలకు నీలేకని తెలియజేశారు. మరోవైపు ఖాతాల గోల్మాల్ చేయిస్తున్నారని, పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పష్టం చేశారు. కాగా స్వయంగా పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో మంగళవారం ఏకంగా 17 శాతం ఇన్ఫోసిస్ షేరు కుదేలైంది. కాగా, గడిచిన ఆరేళ్లలో ఇంత భారీగా ఇన్ఫీ షేరు క్షీణించడం ఇదే తొలిసారి. (చదవండి : ఇన్ఫీలో మరో దుమారం ! ) -
ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమే: నీలేకని
బెంగళూరు/యశవంతపుర: ఆధార్ కార్డు నిఘా లేదా గోప్యతకు సంబంధించిన సాధనం కాదని కేవలం గుర్తింపు కార్డు మాత్రమే అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మాజీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. ఆధార్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదని స్పష్టం చేశారు. ‘ఆధార్ ఒక సరళమైన వ్యవస్థ. ఎందుకంటే ఒక సంస్థ మీకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేటప్పుడు గోప్యతకు సంబంధించిన సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆధార్ మీకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. నాకు తెలిసి గోప్యత నిఘా కంటే భిన్నంగా ఉంటుంది’అని సోమవారమిక్కడ జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఆధార్ సర్వాంతర్యామిగా మారటం ఆందోళన కలిగించే విషయమేనని పేర్కొన్నారు. -
నగదు రహిత ఎకానమీకి చాలా దూరంలో: నీలేకని
న్యూఢిల్లీ: నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మనం చాలా దూరంలోనే ఉన్నామని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ కమిటీ చైర్మన్ అయిన నందన్ నీలేకని అన్నారు. డిజిటల్ చెల్లింపులను మరింత ఆమోదనీయంగా మార్చేందుకు ఈ వ్యవస్థ చుట్టూ ఉన్న భద్రతా సంబంధిత అంశాలను పరిష్కరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన 2019 ఇండియా ఫోరం ఫర్ పీసీఐ సెక్యూరిటీ స్టాండర్స్ కౌన్సిల్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీలేకని ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాల్లో కార్డులు, పీవోఎస్ రూపంలో డిజిటల్ చెల్లింపులు పెరిగినట్టు చెప్పారు. ‘‘నగదు తక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థగా మారేందుకు మనం చాలా దూరంలోనే ఉన్నాం. నగదు చాలా సౌకర్యం కావడమే దీనికి కారణం. ఎవరైనా నగదు స్వీకరిస్తారు. పైగా దీనికి ఎటువంటి లావాదేవీ చార్జీ ఉండదు. లావాదేవీల సంఖ్యలో సెక్యులర్ పెరుగుదలనే మనం చూస్తున్నాం. కార్డుల చెల్లింపుల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చాలి. లావాదేవీల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో తక్కువ సెక్యూరిటీ సమస్యలు, తక్కువ మోసాలు, తక్కువ వివాదాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని వివరించారు. ఉన్న సదుపాయాల నడుమ వ్యవస్థలో నగదు వినియోగాన్ని తగ్గించడంతోపాటు, మరింత మందిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించడమనేది వాస్తవిక సవాలుగా నీలేకని పేర్కొన్నారు. -
డిజిటల్ చెల్లింపులు పెంచేది ఎలా?
ముంబై: దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పురోగతిపై కసరత్తు ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఆధార్ రూపశిల్పి నందన్ నిలేకని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ఆర్బీఐ మంగళవారం ఏర్పాటు చేసింది. తొలి సమావేశం తరువాత 90 రోజుల్లో కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. దేశంలో ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల పరిస్థితి? ఆర్థిక వ్యవస్థలో ఇందుకు సంబంధించి లోపాలేంటి? వాటిని ఎలా అధిగమించాలి? డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విస్త రణకు అనుసరించాల్సిన మార్గాలు? ప్రజల్లో ఈ వ్యవస్థపై విశ్వాసాన్ని ఎలా పెంపొందించాలి? అన్న అంశాలపై నిపుణుల కమిటీ దృష్టి పెడుతుంది. కమిటీలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్,విజయాబ్యాంక్ మాజీ ఎండీ, సీఈఓ కిషోర్ శాన్సీ, ఐటీ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన అరుణ శర్మ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ చీఫ్ ఆఫీసర్ సంజయ్ జైన్ సభ్యులుగా ఉంటారు. ‘ఆర్బీఐతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్, భారతీయుల కోసం చెల్లింపుల వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్బీఐ, కమిటీలు కృషి చేస్తాయి’ అని నీలేకని ట్వీట్ చేశారు. -
ఆధార్‌తో ఇబ్బందులు తలెత్తవు : బిల్ గేట్స్
వాషింగ్టన్ : ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం ఎటువంటి తస్కరణకు గురికాదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. అది కేవలం ఒక బయో గుర్తింపు కార్డు మాత్రమేనని అన్నారు. ఆధార్ సాంకేతికతను ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు చేపడుతున్న చర్యలను గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఆధార్ కార్డుని పొందేందుకు మన వ్యక్తిగత సమాచారాన్ని అప్లికేషన్లో సమర్పిస్తాం. తద్వార ప్రతి భారతీయుడు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందుతాడు. వ్యక్తి ఆధార్ సంఖ్య ద్వారా అతని మొబైల్ నెంబర్, బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడి అవుతాయి. మరేయితర సమాచారం బహిర్గతం కాదని’ బిల్‌గేట్స్ తెలిపారు. ఒక వ్యక్తి ఆధార్ సంఖ్యతో ఎన్ని బ్యాంకు అకౌంట్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇది ఒక రకంగా సమాజానికి మేలు చేసే అంశమని.. జనాభా ఆర్థిక స్థితిగతులు, దేశం ఆర్థిక పరిస్థితి వంటివి ఆధార్‌తో అంచనా వెయొచ్చని తెలిపారు. తద్వార ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకొనే వీలుంటుందని చెప్పారు. మెరుగైన పాలన అందించేందుకు దోహదపడే ఆధార్‌వంటి సాంకేతికత అన్ని దేశాలు అనుసరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ బ్యాంకు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణ కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చిందని తెలిపారు. ఇప్పటికే భారత్ పొరుగు దేశాలు ఆధార్ సాంకేతికతను తమ దేశాల్లో అమలు చేయడానికి సుముఖంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకనిని ఆయా దేశాలు సంప్రదించాయని పేర్కొన్నారు. ఆధార్‌తో వ్యక్తిగత సమాచారం అంగట్లో పెట్టినట్టేనని దుమారం చెలరేగింది కదా అనే ప్రశ్నకు.. ‘ఆధార్‌తో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఎందుకంటే అదొక బయో గుర్తింపు కార్డు మాత్రమేన’ని సమాధానమిచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఆధార్‌ను దుర్వినియోగం చేయడం మినహా.. ఒక గుర్తింపు కార్డుగా ఆధార్ కన్నా విశిష్టమైనది మరొకటి లేదని ధీమా వ్యక్తం చేశారు. మోదీ పాలన కంటే ముందే ఆధార్ మొదలైనా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆధార్ సాంకేతికత ఉండడం శుభపరిణామం. విద్యా, ప్రభుత్వ పాలనలో సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు నందన్ నీలేకని చేసిన కృషి అభినందనీయ మన్నారు. -
ఈసారి చిన్న సంస్థల వంతు..!
ముంబై: మొండిబాకీల సమస్య కేవలం పెద్ద కార్పొరేట్లకే పరిమితం కాదని... ఈసారి చిన్న సంస్థల వంతూ రానుందని ప్రముఖ బ్యాంకరు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచ్చిన రుణాల నాణ్యతపై మరింతగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ‘మొండిబాకీలన్నీ పెద్దపెద్ద కార్పొరేట్లవేనన్న అభిప్రాయం ఉంది. అయితే, ఎస్ఎంఈ వ్యాపారాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అదింకా పూర్తి స్థాయిలో బయటపడటం లేదు అంతే..‘ అని ఉదయ్ పేర్కొన్నారు. ఐటీ దిగ్గజం నందన్ నీలేకని సమక్షంలో మంగళవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన కొటక్ మహీంద్రా బ్యాంకు ‘విజన్’ను ఆవిష్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) వర్గీకరణ విషయంలో ఫిబ్రవరి 12న ఆర్బీఐ ఇచ్చిన సర్క్యులర్‌తో మొండిబాకీల సమస్య మరింతగా ముదిరే అవకాశం ఉందన్నారు. ‘‘ఎన్పీఏల విషయంలో యూరోపియన్ దేశాలైన గ్రీస్, ఇటలీ తర్వాత మూడో స్థానానికి భారత్ చేరింది. దీన్ని చక్కదిద్దే చర్యలు అవసరం’’ అని ఉదయ్ కొటక్ వ్యాఖ్యానించారు. టెక్నాలజీతో కొటక్ ఛార్టర్... తక్కువ నగదున్న వ్యవస్థలో వినియోగదారులకు టెక్నాలజీ ఆధారంగా మరింత మెరుగైన సేవలందించటమే లక్ష్యంగా కొటక్‌మహీంద్రా బ్యాంకు తాలూకు ఏబీసీడీ ఛార్టర్ను నీలేకనితో కలసి ఉదయ్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇవి...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడ్డ యాప్, బయో మెట్రిక్ బ్రాంచ్‌లు, కస్టమర్‌కు తగ్గ సేవలు, డేటాతో నిండిన డిజైన్. ఈ సందర్భంగా నీలేకని మాట్లాడుతూ ‘‘గడిచిన దశాబ్దంలో టెక్నాలజీతో అంతరాలు తగ్గాయి. ప్రపంచమంతా ఒక్క మొబైల్లో ఒదిగిపోవటంతో మనం ముందెన్నడూ ఊహించని సేవలు, ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి’’ అన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఏడాది కిందట 811 సేవింగ్స్ ఖాతాను ప్రారంభించామని, ఇపుడు పూర్తి స్థాయి ఉత్పత్తులు, సేవలను దేశం నలుమూలలకూ అందించాలన్న లక్ష్యాన్ని విధించుకున్నామని ఉదయ్ కొటక్ తెలియజేశారు. ‘‘ఆధార్ ఓటీపీ గుర్తింపును ఆర్బీఐ ఆమోదించిన మూడునెలలకు మేం 811 సేవల్ని ఆరంభించాం. అప్పటికి 80 లక్షల మంది ఖాతాదారులున్నారు. డిసెంబర్ 31నాటికి ఈ సంఖ్య 1.2 కోట్లకు చేరింది. దేశంలోని డిపాజిట్లలో 2 శాతం... మొబైల్ లావాదేవీల్లో 8 శాతం మా సొంతం. వచ్చే ఐదేళ్లలో ప్రయివేటు బ్యాంకుల వాటా 30 నుంచి 50 శాతానికి చేరుకుంటుందనే నమ్మకం నాకుంది’’ అన్నారాయన. మొండి బాకీలకూ టెక్నాలజీ పరిష్కారం 2008 ఆర్థిక సంక్షోభం తరవాత సరైన మదింపు లేకుండా ఇన్ఫ్రా తదితర రంగాలకు భారీ రుణాలిచ్చారని, వాటి చెల్లింపులను ఎనిమిదేళ్లుగా పొడిగించుకుంటూ రావడం మొండిబాకీల సంక్షోభానికి ప్రధాన కారణమని ఉదయ్ వ్యాఖ్యానించారు. సంక్షోభానంతరం ఇచ్చిన రుణాల అసలు మొత్తంలో కనీసం 40 శాతం వెనక్కి వచ్చినా సంతోషించవచ్చన్నారు. ప్రస్తుతం రిటైల్ రుణాల మంజూరులో టెక్నాలజీని వినియోగిస్తుండటం.. భవిష్యత్‌లో మొండిబాకీల సమస్యలను తగ్గించేందుకు తోడ్పడగలదని చెప్పారు. బ్యాంకుల జాతీయీకరణతో ఒరిగిందేమిటి .. బ్యాంకుల జాతీయీకరణ జరిగి 50 ఏళ్లు గడిచినా... అనేక కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని ఉదయ్ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల జాతీయీకరణతో ఒనగూరిన ప్రయోజనాలేమిటని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వజ్రాభరణాల వ్యాపారస్తులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు .. పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) భారీగా మోసగించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటివి అసాధారణ పరిస్థితులన్నారు. ఈ స్కాంతో బ్యాంకింగ్ వ్యవస్థపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించడానికి బ్యాంకర్లతో పాటు నియంత్రణ సంస్థ, ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల వ్యవస్థ ద్వారా లావాదేవీలు వంద కోట్ల స్థాయికి చేరగలవని నీలేకని చెప్పారు. గతేడాది డిసెంబర్ ఆఖరు నాటికి ఈ లావాదేవీలు 14.5 కోట్లకు చేరాయి. -
మోదీ కేర్’కు నిలేకనీ సాయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకానికి(ఎన్‌హెచ్‌పీఎస్) అవసరమయ్యే సాంకేతిక వనరుల(ఐటీ) కల్పనలో సాయానికి ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకనీ అంగీకరించారని నీతి ఆయోగ్ తెలిపింది. మోదీ కేర్‌గా పిలుస్తున్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆధార్ తరహాలోనే ఎన్‌హెచ్‌పీఎస్ పథకానికి కూడా భారీ స్థాయిలో ఐటీ సేవలు అవసరమని, ఆ నేపథ్యంలో ఆధార్ జారీ వ్యవస్థ యూఐడీఐఏ మాజీ చైర్మన్ నిలేకనీని సంప్రదించామని నీతి ఆయోగ్ అధికారి ఒకరు తెలిపారు. -
ఆధార్‌పై దుష్ప్రచారం
సాక్షి, బెంగళూరు: ఆధార్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు పద్ధతిప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న నీలేకని.. దేశంలో ఉన్న ప్రభుత్వ గుర్తింపు పత్రాల్లో అత్యంత విశిష్టమైన ఆధార్‌పై కావాలనే అవాస్తవాలను ప్రచారం చేస్తుండటం విచారకరమన్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆధార్ వ్యవస్థకు భద్రత కల్పించామన్నారు. ఆధార్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తే అదేరకమైన ఫలితాలుంటాయన్నారు. ‘ఇదంతా ఆధార్ వ్యవస్థకు అపఖ్యాతిపాలు చేసేందుకు వందశాతం పద్ధతిప్రకారం జరుగుతున్న దుష్ప్రచారం. ఆధార్ డేటా రక్షణకు ఎన్నో దశల భద్రత కల్పించాం. దీన్ని ఛేదించటం అంత సులభమేం కాదు’ అని అన్నారు. కాగా, ఆధార్ డేటా తస్కరణకు గురైందంటూ వస్తున్న వార్తలతో ఆందోళన వద్దని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం సూచించారు. ఢిల్లీలో జరిగిన 6వ వార్షిక అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో పాల్గొన్న మంత్రి.. ‘ఆధార్‌లో మీ మతం, సామాజికవర్గం, వైద్య, విద్య, ఆదాయ వివరాలేమీ ఉండవు. ఐరిస్, వేలిముద్రలు మాత్రమే ఉంటాయి. వందలకోట్లసార్లు ప్రయత్నించినా ఈ డేటాను చోరీ చేయలేరు. దేశంలో అత్యంత గోప్యమైన విషయాలు.. బ్యాంకు ఖాతాల వివరాలు, ఆరోగ్య వివరాలే’ అని రవిశంకర్ అన్నారు. -
ఆధార్ హ్యాకింగ్‌పై స్పందించిన నీలేకని
సాక్షి, బెంగళూరు: ఆధార్ డేటా హ్యాకింగ్‌పై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ఎట్టకేలకు స్పందించారు. ఆధార్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకే ఆధార్‌పై కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆధార్‌ను దుర్వినియోగపరిచేందుకు "కల్పిత ప్రచారం" చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డ్ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రిబ్యూన్ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావిస్తూ ఆధార్‌పై నిర్మాణాత్మక దృష్టిలేకుండా.. ప్రతికూల అభిప్రాయాలతో ఉంటే.. చర్యలు కూడా ప్రతికూలంగానే ఉంటాయన్నారు. అందువల్ల ప్రజలు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని కలిగి ఉండటం మంచిదని పేర్కొన్నారు. మరోవైపు యుఐడిఎఐ తాజా విధానాన్ని నందన్ నీలేకని స్వాగతించారు. ఈ వ్యవహారంలో ఆధార్ సంస్థ కీలక ప్రకటన చేసిందని ప్రశంసించారు. ఇక ప్రతివారు తమ వర్చువల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చని, ఇది చాలా ముఖ్యమైన ఫీచర్లను అందిస్తోందని చెప్పారు. దీంతో ఆధార్ నెంబర్‌ను వెల్లడి చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే ఇతర ఏజెన్సీలు ఆధార్ నెంబర్లను సేకరించే ఛాన్స్ ఉండదని తెలిపారు. అటు సుప్రీకోర్టు ఆధార్‌ను గుర్తిస్తుందనే నమ్మకం తనకుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా ఆధార్ వివరాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడీఏఐ చర్యలు చేపట్టింది. వర్చువల్ ఐడీ, పరిమిత కేవైసీ కోడ్ అనే రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక వర్చువల్ ఐడీని జారీ చేసే విధానాన్ని ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది. మార్చి ఒకటి నుంచి ఇది పూర్తిస్థాయి అమల్లోకి రానుంది. -
నందన్ నీలేకనిపై బాలకృష్ణన్ ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంపై ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి.బాలకృష్ణన్ ప్రశంసలు కురిపించారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ఇన్పీ బోర్డు సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని అభినందించారు. గత బోర్డు చేసిన 'దుర్వినియోగాలను' సరిచేయడానికి, ప్రస్తుత సిఈఓకు సహేతుకమైన జీతాలను ఫిక్సి చేశారన్నారు. ముఖ్యంగా మాజీ సీఈవో విశాల్ సిక్కా కంటే తక్కువ వేతనం ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత నష్టాలను సరిచేయడానికి నందన్ సరియైన పని చేశారని, ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాలరీ స్ట్రక్చర్ రీజనబుల్‌గా ఉందని శనివారం వ్యాఖ్యానించారు. ఉన్నత వృద్ధిని పొందడం ద్వారా వాటాదారుల విలువను పెంచుకునేందుకు స్పష్టంగా దృష్టి కేంద్రీకరించాలనీ, బోర్డు ఏవైనా అభీష్టాలను వ్యక్తీకరించాలంటే సరైన వాదనతో వాటాదారులకు వివరించాలని ఆయన సూచించారు. కాగా ఇన్ఫీ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పరేఖ్ జీతం 2018-2019 ఆర్థిక సంవత్సరాంతానికి రూ. 65 మిలియన్లుగా నిర్ణయించారు. వేతనం కింద రూ.6.5 కోట్లు, దీనికి తోడు రూ.9.75 కోట్లను వేరియబుల్ చెల్లింపుల కింద పొందుతారని ఇన్పోసిస్ ప్రకటించింది. మాజీ సీఈవో విశాల్ సిక్కా వేతనం కింద సుమారు రూ.43 కోట్లు పొందేవారు. -
ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 2న పరేఖ్ బాధ్యతలు చేపడతారు. ఆయన పదవీకాలం అయిదేళ్ల పాటు ఉంటుంది. ఇకపై యూబీ ప్రవీణ్ రావు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని ఇన్ఫోసిస్ తెలిపింది. పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ సారథ్యంలో ఇన్ఫోసిస్ పురోగమించగలదని కంపెనీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. కీలకమైన సీఈవో పదవికి ఇన్ఫోసిస్ బయటి వ్యక్తిని తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో సీఈవోగా వ్యవహరించిన విశాల్ సిక్కా.. వ్యవస్థాపకులతో విభేదాల నేపథ్యంలో కొన్నాళ్ల క్రితమే రాజీనామా చేశారు. నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు పరేఖ్ ఎంపిక జరిగినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. ఇన్ఫీ బాధ్యతలు చేపడుతున్న పరేఖ్.. పలు సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
దాతృత్వ నెట్‌వర్క్‌లోకి నీలేకని దంపతులు
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణి నీలేకని తాము సైతం సమాజ సేవకు సంపదను ధారపోస్తామంటూ ముందుకొచ్చారు. తమ సంపదలో సగం మేర సమాజానికి దానం చేసేందుకు ముందుకు వచ్చిన వ్యక్తుల సమూహం ‘ద గివింగ్ ప్లెడ్జ్’లో నీలేకని దంపతులు చేరారు. ఇందుకు సంబంధించి అంగీకారం తెలుపుతూ నీలేకని రాసిన లేఖను ద గివింగ్ ప్లెడ్జ్ తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ‘‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన... మన కర్మలను నిర్వహించే హక్కే మనకుంది. అంతేకానీ, ఆ కర్మ ఫలితాలను నిర్దేశించే హక్కు లేదు. చేసే పనుల నుంచి ప్రతిఫలాన్ని పొందలేమన్న భయంతో అసలేదీ చేయకుండా ఉండకూడదని భగవద్గీత చెప్పిన నైతిక ధర్మం. దాన్ని అర్థం చేసుకునే అపూర్వ అవకాశాన్ని కల్పించిన బిల్, మిలిందాకు మా ధన్యవాదాలు. ఈ ఆదర్శం కోసమే మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం’’ అని నీలేకని తన లేఖలో పేర్కొన్నారు. నందన్ నీలేకని, ఆయన సతీమణి రోహిణిని గివింగ్ ప్లెడ్జ్లోకి సంతోషంతో ఆహ్వానిస్తున్నానంటూ బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. గివింగ్ ప్లెడ్జ్‌ను బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా, వారెన్ బఫెట్ కలసి 2010లో ఏర్పాటు చేశారు. అధిక ధనవంతులను దాతృత్వం దిశగా ప్రోత్సహించేందుకు ఇది ఏర్పాటయింది. ఈ నెట్‌వర్క్‌లో మన దేశం నుంచి విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, బయోకాన్ కిరణ్ మజుందార్ షా, శోభా డెవలపర్స్ ఎమిరటస్ చైర్మన్ పీఎన్సీ మీనన్ ఇంతకుముందే చేరగా, వీరి బాటలోనే నీలేకని దంపతులు నిర్ణయం తీసుకున్నారు. -
ఇన్ఫీ.. ఆల్ ఈజ్ వెల్
బెంగళూరు : గత కొన్ని రోజుల వరకు వివాదాలతో సతమతమైన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయట. కంపెనీలో ఇప్పుడంతా బాగుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి బుధవారం తెలిపారు. ఈ సాఫ్ట్వేర్ దిగ్గజంలో నెలకొన్న అన్ని సమస్యలను సరళీకృతం చేసే నైపుణ్యాలను తమ కంపెనీ చైర్మన్ నందన్ నిలేకని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. '' నిజంగా అంతా బాగుంది. ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో తాను చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. నందన్ చైర్మన్‌గా ఉన్నారు. ఇక మనం నిక్షేపంగా నిద్రపోవచ్చు'' అని బెంగళూరులో జరిగిన 2017-18 ఇన్ఫోసిస్ బహుమతుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిలేకని చాలా మంచిగా బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి అని, అన్ని క్లిష్టతరమైన సమస్యలను సరళీకృతం చేసే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు. ఇన్ఫోసిస్ ఆయన చేతుల్లోకి వెళ్లినప్పుడు చాలా క్లిష్టతరమైన సమస్యలున్నాయని పేర్కొన్నారు. అంతా ఆయనకు వదిలేయండి. అన్ని సర్దుకుంటాయని అన్నారు. నిలేకని తన ఉద్యోగాన్ని చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. కాగ, విశాల్ సిక్కా సారథ్యంలో జరిగిన పనామా డీల్ విషయంలో నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాల వివాదాల నేపథ్యంలో విశాల్ సిక్కా రాజీనామా చేశారు. సిక్కా రాజీనామా అనంతరం కంపెనీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నిలేకని ఇన్ఫీలోకి పునరాగమనం చేశారు. నిలేకని వచ్చిన తర్వాత జరిపిన పనామా డీల్ విచారణలో ఎలాంటి అవకతవకలు జరుగలేదంటూ క్లీన్ చీట్ ఇచ్చారు. సీఈవో విషయంలో నిలేకనికి ఎవరూ సూచనలు ఇవ్వాల్సినవసరం లేదని, ఎందుకంటే ఆయన కూడా మంచి సీఈవో అని మూర్తి అభివర్ణించారు. తనకు తాను మంచి సీఈవో అవడం వల్ల, ఈ పోస్టుకు ఎవరు సరిపోతారో నిలేకనికి తెలుసన్నారు. -
విశాల్ సిక్కాకు ఇన్ఫీ క్లీన్చిట్
బెంగళూరు : ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాకు క్లీన్చిట్ లభించింది. వివాదస్పద డీల్ పనయ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని నేతృత్వంలో జరిగిన బోర్డు తేల్చింది. మాజీ సీఈవో విశాల్ సిక్కాకు మద్దతుగా నిలుస్తూ.. అవతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని నిలేకని పేర్కొన్నారు. ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ డీల్‌లో ఎలాంటి అవతవకలు జరుగలేదని విచారణలో బోర్డు తేల్చినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. పనయ డీల్, కార్పొరేట్ గవర్నెన్స్ విషయాల్లోనే కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, మాజీ సీఈవో విశాల్ సిక్కాకు మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే విశాల్ సిక్కా రాజీనామా చేయడం, తదుపరి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంపెనీ ప్రయోజనాలరీత్యా విచారణ నివేదికను బహిర్గతం చేయట్లేదని నిలేకని పేర్కొన్నారు. ప్రస్తుతం పనయ డీల్ విషయంలో వెలువడిన ప్రకటనతో నారాయణమూర్తి ఆరోపణల్లో ఎలాంటి రుజువు లేదని తెలిసింది. పనయ డీల్‌ను బహిర్గతం చేయాలంటూ పలుమార్లు నారాయణమూర్తి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీలోకి నిలేకని పునరాగమనం అనంతరం తొలిసారి ఇన్ఫోసిస్ తన క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో కంపెనీ లాభాలు ఏడాదికి 7 శాతం పెరిగి రూ.3726 కోట్ల ఆర్జించినట్టు రిపోర్టు చేసింది. 2018 ఆర్థిక సంవత్సరపు గైడెన్స్‌ను మాత్రం కంపెనీ 6.5-8.5 శాతం నుంచి 5.5-6.5 శాతానికి తగ్గించింది. -
ఆధార్ గట్టెక్కుతుంది
వాషింగ్టన్: నేటి డిజిటల్ యుగంలో పౌరుల గోప్యతా పరిరక్షణకు భారత్ సరైన దిశలోనే సాగుతోందని ఆధార్ రూపకర్త నందన్ నిలేకని అన్నారు. ఆధార్ పథకం గోప్యత పరీక్షను విజయవంతంగా అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా శుక్రవారం వాషింగ్టన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నీలేకని ప్రసంగించారు. ‘గోప్యతకు సంబంధించి భారత్‌లో అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నాయి. ఆధార్ గోప్యతను ఉల్లంఘిస్తోందంటూ చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో భారత్‌లో గోప్యత ప్రాథమిక హక్కుల్లో భాగమా? అనే ప్రశ్న తలెత్తింది. ఆ తరువాత 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. గోప్యత ప్రాథమిక హక్కుల్లో భాగమని కోర్టు తీర్పు చెప్పింది. చట్టం, హేతుబద్ధత, సమానత్వం ప్రాతిపదికన ఆ హక్కుకు పరిమితులు విధించొచ్చని కూడా తెలిపింది’ అని నీలేకని వివరించారు. సామాజికాభివృద్ధి, సృజనకు డిజిటల్ సాంకేతికత ముఖ్యమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ జరిపే విచారణలో ఆధార్ గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత లేమి కారణంగా ఎవరికీ ప్రభుత్వ ప్రయోజనాలు దూరం కాకుడదని నీలేకని అన్నారు. అదే సమయంలో టెక్నాలజీ సంక్షేమ కార్యక్రమాల్లో అడ్డంకి కాకూడదని అభిప్రాయపడ్డారు. -
గవర్నెన్స్ లోపించడంపైనే ఆందోళన
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించి గత బోర్డు సరైన విధానాలు పాటించకపోవడంపైనే తాను ఆందోళన వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంలో వ్యక్తిగత ప్రయోజనాలేమీ ఇమిడి లేవని స్పష్టం చేశారు. చైర్మన్‌గా ఆర్ శేషసాయి, మరికొందరు బోర్డు సభ్యుల రాజీనామాతో సంస్థకు నూతనోత్తేజం కలిగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ఇవి కొనసాగుతాయన్నారు. చైర్మన్‌గా నందన్ నీలేకని రాకతో మళ్లీ గవర్నెన్స్ ప్రమాణాలు తిరిగి రాగలవన్నారు. ఇన్ఫీకి అచ్ఛే దిన్(మంచి రోజులు) తెచ్చే ప్రయత్నాల్లో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు మూర్తి పేర్కొన్నారు. ఇన్ఫీ ప్రమోటర్లతో విభేదాల నేపథ్యంలో సీఈవోగా విశాల్ సిక్కా, పలువురు బోర్డు సభ్యులు రాజీనామా చేయడం, సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని తిరిగి చైర్మన్ పదవి చేపట్టడం తెలిసిందే. సంస్కృతి, మంచిపేరు, విలువల్ని ఆస్తులుగా కంపెనీకి ఇచ్చామని.. సంస్థలో చెప్పుకోతగిన స్థాయిలో వాటాలు ఉన్నప్పటికీ ప్రమోటర్లు స్వచ్ఛందంగా తప్పుకున్న దాఖలాలు దేశ కార్పొరేట్ చరిత్రలోనే లేవని మూర్తి వ్యాఖ్యానించారు. -
ఇన్వెస్టర్ల భేటీలో మూర్తి తీవ్ర ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్ర ఆందోళనను వ్యక్తంచేశారు. లోపాలను గుర్తించకుండా ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యులు తనపై వ్యక్తిగత దాడికి దిగారన్నారు. అవి చాలా బాధ కలిగించినట్టు మూర్తి చెప్పారు. విశాల్ సిక్కా రాజీనామా అనంతరం తలెత్తిన పరిస్థితులపై తొలిసారి పెట్టుబడిదారులతో మూర్తి భేటీ అయ్యారు. తను ఎక్కువగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పోరాడినట్టు మూర్తి చెప్పారు. గ్లోబల్ కంపెనీ స్థాయిగా ఇన్ఫీ తిరిగి పొందడానికే తాను కోరుకున్నట్టు తెలిపారు. త్రైమాసిక ఫలితాలను, గైడెన్స్‌ను రిపోర్టు చేసిన తొలి కంపెనీ ఇన్ఫోసిస్నేని, గట్టి కార్పొరేట్ పాలనతో తాము ఇలాంటి ప్రమాణాలను ఆర్జించామని మూర్తి చెప్పారు. మాజీ బోర్డు సభ్యులు కంపెనీలో లోపాలు గుర్తించకుండా.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారన్నారు. ఇటీవల విశాల్ సిక్కా రాజీనామా అనంతరం బోర్డు సభ్యులు మూకుమ్మడిగా మూర్తిపై విరుచుకుపడ్డారు. ఆయనపై పలు ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై సరియైన వేదికపై సరియైన సమయంలో స్పందిస్తానని మూర్తి గట్టి జవాబిచ్చిన సంగతి తెలిసిందే. కంపెనీ మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి, మాజీ సీఎఫ్ఓ రాజీవ్ బన్సాల్‌కు అధిక మొత్తంలో సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చారని మూర్తి ఆరోపించారు. రాజీవ్ బన్సాల్‌కు ఎక్కువ సెవరెన్స్ ప్యాకేజీ చెల్లించడాన్ని బోర్డు అంగీకరించిందని శేషసాయి తనకు చెప్పారని, కానీ వార్షిక సాధారణ సమావేశంలో శేషసాయి అబద్ధం ఆడినట్టు మూర్తి చెప్పారు. రాజీవ్ బన్సాల్‌పై మరింత విచారణ చేపట్టినప్పుడు శేషసాయి ఏం మాట్లాడలేకపోయారని తెలిపారు. సెవరెన్స్ పే విషయంపై జరిగిన సమావేశ మినిట్స్‌ను కూడా బోర్డు రికార్డు చేయలేదన్నారు. పైగా బన్సాల్ ఒప్పందాన్ని బహిర్గతం చేయలేమని జేఫ్ లేమన్ చెప్పినట్టు మూర్తి పేర్కొన్నారు. అంతకముందు వెళ్లిన ఏ సీఎఫ్ఓకి కూడా కంపెనీ సెవరెన్స్ ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. బోర్డు పారదర్శకంగా లేదని, తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. బలహీనమైన పాలన పద్ధతులు కంపెనీలో ఉండటమే తన ముఖ్యమైన ఆందోళన అని చెప్పారు. నిలేకని నేతృత్వంలో మేనేజ్మెంట్ టీమ్ ర్యాలీ జరుపుతుందని తనకు విశ్వాసం ఉందని, ఇన్ఫోసిస్‌కు మళ్లీ ఆ కీర్తిని తీసుకొస్తుందని మూర్తి ధీమా వ్యక్తంచేశారు. నందన్ ఎంతో విలువలతో కూడిన వ్యక్తి అని, 15 ఏళ్లుగా తనకు నిలేకని తెలుసని మూర్తి చెప్పారు. ఇన్ఫోసిస్‌కు మంచి రోజులు తీసుకురావడానికి నందన్ తన శతవిధాలా ప్రయత్నించాలని కోరుకుంటున్నట్టు మూర్తి తెలిపారు. -
ఇన్ఫీకి నీలేకని జోష్..!
♦ ఆయన రాకతో శుభారంభం ♦ సీఎల్ఎస్ఏ వ్యాఖ్యలు ♦ సీఈవో ఎంపిక ప్రక్రియ జోరు... ♦ వ్యూహాల పునఃసమీక్ష సానుకూలాంశాలు న్యూఢిల్లీ: వివాదాల నుంచి బైటపడే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా రావడం కంపెనీకి ఊతమివ్వగలదని బ్రోకింగ్ కన్సల్టెన్సీ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. ఇది సంస్థకు శుభారంభం ఇవ్వగలదని పేర్కొంది. సుస్థిరమైన నాయకత్వం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించుకోవడం, కంపెనీ సంస్కృతిపరమైన వివాదాల పరిష్కారం మొదలైన అంశాల దిశగా ఇన్ఫీ తలపెట్టే చర్యలకు సంబంధించి గత ఆరేళ్లలో కంపెనీకి లభించిన అత్యుత్తమ శుభారంభం ఇదే కాగలదని సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. వ్యవస్థాపకులు, బోర్డు మధ్య విభేదాల నేపథ్యంలో సీఈవో విశాల్ సిక్కా వైదొలగడం, పరిస్థితులు చక్కదిద్దేందుకు నందన్ నీలేకని పునరాగమనం తదితర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్.. ఇప్పటికే సీఈవో ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారని, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాలను పునఃసమీక్షించడం మొదలుపెట్టడం తదితర అంశాలు సానుకూల ధోరణిలో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపర్చాయని సీఎల్ఎస్ఏ తెలిపింది. ‘ఇన్ఫీ వ్యూహాల దిశ మారనుండటం, మెరుగైన నాయకత్వం, తక్కువ వేల్యుయేషన్ తదితర అంశాల కారణంగా రిస్కులతో పోలిస్తే రివార్డులు గణనీయంగా మెరుగుపడగలవు’ అని పేర్కొంది. మరోవైపు, ఇన్ఫోసిస్‌కు దార్శనికత గల సీఈవో అవసరమని పరిశ్రమ నిపుణుడు గణేష్ నటరాజన్ తెలిపారు. సదరు సీఈవోకి టెక్నాలజీ నైపుణ్యం ఒక్కటే ఉంటే సరిపోదని.. ఇటు బోర్డును.. అటు ఒత్తిడి చేసే వర్గాలను సైతం మెప్పిస్తూ, కంపెనీని ముందుకు తీసుకెళ్లే సత్తా కూడా ఉండాలని ఆయన చెప్పారు. బైబ్యాక్‌లో ప్రమోటర్లు కూడా.. ఇన్ఫోసిస్ ప్రతిపాదిత బైబ్యాక్ ఆఫర్లో తమ షేర్లను కూడా విక్రయించాలని కంపెనీ ప్రమోటర్లు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు ప్రమోటర్లు తమ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే, ఆయా ప్రమోటర్ల పేర్లు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితర సహ వ్యవస్థాపకులకు ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో 12.75 శాతం వాటాలు ఉన్నాయి. వ్యవస్థాపకుల నుంచి వేధింపుల కారణంతో సీఈవో హోదా నుంచి సిక్కా వైదొలిగిన మరుసటి రోజే ఇన్ఫోసిస్ బోర్డు సుమారు రూ. 13,000 కోట్ల విలువ చేసే షేర్ల బైబ్యాక్ ఆఫర్‌కి ఆమోదముద్ర వేసింది. షేరు ఒక్కింటికి రూ. 1,150 చొప్పున మొత్తం రూ. 11.3 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ ప్రతిపాదనకు ప్రత్యేక తీర్మానం ద్వారా షేర్హోల్డర్లు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉన్నట్లు కంపెనీ వివరించింది. -
నందన్ రాకతో రూ.9400 కోట్లు వచ్చాయ్...
సాక్షి, ముంబై : నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి జోష్ అందించింది. సోమవారం స్టాక్మార్కెట్లో ఇన్ఫీ షేర్లు 5 శాతం మేర పైకి జంప్ చేయడంతో, ఇన్వెస్టర్ల సంపద కూడా రూ.9000 కోట్లకు పైననే ఎగిసింది. బోర్డు వార్ నేపథ్యంలో కంపెనీ సీఈవోగా పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేయడంతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన చెలరేగింది. ఈ ఆందోళనకర పరిస్థితులను చక్కదిద్దడానికి, కంపెనీ స్థిరత్వానికి ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో నందన్ నిలేకని, మళ్లీ ఇన్ఫీలోకి అడుగుపెట్టారు. నాలుగు రోజుల క్రితం నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆయన పదవి స్వీకరించారు. లాంగ్ వీకెండ్ తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్లో నిలేకని పునరాగమనం ఇన్ఫీపై సెంటిమెంట్ బలపర్చింది. నందన్ పునరాగమనం క్లయింట్స్‌లో, షేర్‌హోల్డర్స్‌లో భరోసా ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు. నందన్ నిలేకని మళ్లీ ఇన్ఫోసిస్‌లోకి రావడం, ఆరేళ్ల కాలంలో మంచి ప్రారంభాన్ని ఇన్ఫీకి అందించనట్టై, నాయకత్వంలో మళ్లీ స్థిరత్వం సంపాదిస్తారని సీఎల్ఎస్ఏ చెప్పింది. ఈ నియామకం వ్యవస్థాపకులతో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి, క్లయింట్స్‌కు సహకరిస్తుందని జెఫ్ఫెరీస్ బ్రోకరేజ్ పేర్కొంది. సిక్కా రాజీనామాతో ఒక్కసారిగా ఇన్ఫీ షేరు భారీగా కుదేలైన సంగతి తెలిసిందే. దాదాపు 15 శాతం మేర క్షీణించింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.30వేల కోట్ల మేర ఆవిరైపోయింది. తర్వాత ఇన్ఫీ షేర్లు మెల్లమెల్లగా కోలుకోవడం ప్రారంభించాయి. నందన్ నిలేకని రాకతో, మరింత బలపడ్డాయి. -
నీలేకని జోష్: టాప్ గెయినర్‌గా ఇన్ఫీ
ముంబై: బోర్డ్ వార్ సంక్షోభంతో మార్కెట్ క్యాప్‌ను భారీగా నష్టపోయిన సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సోమవారం నాటి మార్కెట్లో లాభాలతో దూసుకుపోతోంది. ఇటీవలి పరిణామాలకు చెక్ పెడుతూ కొత్త ఛైర్మన్‌గా నందన్‌నీలేకని రంగంలోకి దిగడంతో ఈ షేర్‌కు బూస్ట్ లభించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌లో స్థిరత్వానికి ఛైర్మన్ నందన్‌నీలేకని హామీ ఇవ్వడంతో ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. దీంతో లాంగ్ వీకెండ్ తరువాత మొదలైన మార్కెట్లలో భారీ కొనుగోళ్లతో టాప్ గెయినర్‌గా నిలిచింది.3 శాతానికి పైగా లాభపడి 944 వద్ద కొనసాగుతోంది. ఒకప్పటి చైర్మన్, సహవ్యవస్థాపకులు నందన్ నీలేకని తాజాగా తిరిగి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని చేపట్టారు. వెంటనే ఇన్వెస్టర్లతో, వాటాదారులతో సమావేశం నిర్వహించి, భద్రతకు, స్థిరత్వానికి హామీ ఇచ్చారు. అంతేకాదు తన పదవీ కాలం ఎన్నాళ్లు ఉంటుందనేది బోర్డు తనకు చెప్పలేదనీ, కానీ కంపెనీ కార్యకలాపాల్లో స్థిరత్వాన్ని తీసుకువచ్చేవరకూ చైర్మన్ పదవిలో కొనసాగనున్నట్లు నీలేకని హామీ ఇవ్వడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు రూ.13,000 కోట్లతో సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ఆఫర్ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. కాగా ఇన్ఫోసిస్ ప్రమోటర్లలో ఒకరైన నారాయణమూర్తి కంపెనీ కార్పొరేట్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఈవో, ఎండీ పదవులకు విశాల్ సిక్కా గత వారంలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
అప్పుడు 26, ఇపుడు 62
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ నూతన ఛైర్మన్ నందన్ నీలకేని బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చీ రావడంతోనే పనిలో పడిపోయారు. సంస్థ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో గురువారం రీఎంట్రీ ఇచ్చిన తరువాత పెట్టుబడిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు కంపెనీ వృద్ధి కొనసాగుతుందంటూ వాటాదారులకు నందన్ నీలేకని హామీ ఇచ్చారు. కంపెనీ సభ్యుల మధ్య స్థిరత్వంపై నీలేకని మాట్లాడుతూ, చాలా స్థిరమైన బోర్డుతో తాము పటిష్టంగా ఉన్నామని, సభ్యుల పూర్తి మద్దతు తనకు ఉందని స్పష్టం చేశారు. బోర్డు తనను ఏకగ్రీవంగా ఎన్నుకుందని, తన తక్షణ, ప్రధాన కర్తవ్యం సీఈవో ఎంపిక అని వ్యాఖ్యానించారు. కంపెనీలో ఇటీవలి పరిణామాలపై భయపడాల్సిన అవసరం లేదంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన అంశాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. 26ఏళ్ల వయసపుడు ఇన్ఫోసిస్ లో చేరాను. ఇపుడు 62 వయసులో మళ్లీ ఇన్ఫోసిస్‌లో రీజాయిన్ అయ్యానని ట్వీట్ చేశారు జీవితం చక్రభమణంలా పూర్తిగా తిరిగిందంటూ తను పాత సంస్థలో మళ్లీ చేరిన ఉత్సాహాన్ని పంచుకున్నారు. విశాల్ సిక్కా ఆకస్మిక రాజీనామాపై సంస్థ నిర్వహణ కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం ఉండదని నొక్కిచెప్పిన ఆయన కొత్త సీఈవో అన్వేషణలో ఉన్నామని, తుది నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని చెప్పారు. ఇందుకోసం ఈ బోర్డు ప్రపంచవ్యాప్తంగా తగిన అభ్యర్థిని శోధిస్తుందని, ఇన్ఫోసిస్ పూర్వ విద్యార్ధులతో సహా అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలిస్తానని చెప్పారు. మరోవైపు సంస్థకు విశాల్ సిక్కా చేసిన కృషిని కూడా ఆయన అంగీకరించారు. ఆయన నేతృత్వంలో ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ముందుకు తీసుకువెళతామన్నారు. అలాగే కార్పొరేట్ గవర్నెన్స్‌లో నారాయణ మూర్తి తండ్రిలాంటివారంటూ ప్రశంసించారు. దీంతోపాటు మేనేజ్మెంట్ బోర్డులో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయనే సూచన కూడా అందించారు. కాగా ప్రస్తుతం, ఇన్ఫోసిస్ బోర్డులో నందన్ నీలేకనితో సహా ఎనిమిది మంది ఉన్నారు. కిరణ్ మజుందార్ షా అధ్యక్షతన నామినేషన్ కమిటీ సీఈఓ నియామకాన్ని పరిశీలిస్తోంది. Joined @Infosys at 26, re-joined it at 62. Life does turn full circle! — Nandan Nilekani (@NandanNilekani) August 25, 2017 -
ఇన్ఫీని గాడిలో పెట్టడానికే వచ్చా: నిలేకని
న్యూఢిల్లీ : వ్యవస్థాపకులకు, బోర్డుకు మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దడానికి ఇన్ఫోసిస్ కొత్త చైర్మన్‌గా నందన్ నిలేకని రీఎంట్రీ ఇచ్చారు. ఆర్.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. గురువారం ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం చేసిన తర్వాత మొట్టమొదటిసారి శుక్రవారం నిలేకని ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవస్థాపకులకు, కంపెనీకి మధ్య స్థిరత్వం సంపాదించడమే లక్ష్యంగా తాను ఇన్ఫీలోకి అడుగుపెట్టినట్టు నిలేకని చెప్పారు. కంపెనీని గాడిపెట్టిన అనంతరమే తాను ఇన్ఫీ నుంచి నిష్క్రమిస్తానని తెలిపారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా తన పాత్ర బోర్డు పర్యవేక్షణ, పాలన, పనితీరు పరంగా ఉంటుందన్నారు. విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఆ పదవిలోకి తీసుకురాబోయే కొత్త సీఈవోగా కోసం కంపెనీ వెలుపల, లోపల వ్యక్తులను వెతుకుతున్నామని చెప్పారు. కొత్త సీఈవో అందరి వాటాదారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ.. టెక్నాలజీ పరంగా బలమైన పట్టు ఉండాలన్నారు. కొత్త సీఈవో ఎంపిక కోసం సెర్చ్ కమిటీని త్వరలోనే నియమిస్తామన్నారు. ఇన్ఫోసిస్ బోర్డుతో పనిచేసే కంపెనీ అని, వాటాదారులందరినీ సంప్రదించిన తర్వాత, కొన్ని రోజుల్లోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని నిలేకని తెలిపారు. నాన్-ఎగ్జిక్యూటివ్చైర్మన్గా తన ఎంపిక, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని పేర్కొన్నారు. అవసరమైనంత కాలం ఇక్కడే ఉంటానని, ఒక్కసారి నా బాధ్యత నెరవేరాక కంపెనీ నుంచి వైదొలుగుతానని ఇన్వెస్టర్ల కాన్ఫరెన్స్‌లో చెప్పారు. నారాయణమూర్తికి తాను గొప్ప ఆరాధకుడనని కూడా చెప్పారు. భారత కార్పొరేట్ గవర్నెన్స్‌కు మూర్తి తండ్రిలాంటి వారని మూర్తి అభివర్ణించారు పనాయా డీల్‌పై స్పందించిన నిలేకని, ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటానని, స్వల్పకాలికంగా కంపెనీ పనితీరులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని చెప్పారు. క్లయింట్స్‌తో, డీల్స్‌తో సంస్థ చేసుకున్న న్యాయ ఒప్పందాలకు తాను కట్టుబడి ఉంటానన్నారు. ''ఇన్ఫోసిస్‌కి మళ్లీ తిరిగిరావడం సంతోషంగా ఉంది. క్లయింట్లు, షేర్హోల్డర్లు, ఉద్యోగులు మొదలైన వారందరికీ ప్రయోజనాలు చేకూర్చేలా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా బోర్డులోని నా సహచర సభ్యులతో కలసి పనిచేస్తాను'' అని నిలేకని చెప్పారు. -
ఇన్ఫో @ నీలేకని
♦ మళ్లీ సొంతగూటికి... చైర్మన్‌గా పగ్గాలు ♦ ప్రస్తుత చైర్మన్ శేషసాయి, కో–చైర్మన్ రవి రాజీనామా ♦ బోర్డు నుంచి కూడా తప్పుకున్న విశాల్ సిక్కా ♦ స్వతంత్ర డైరెక్టర్లుగా వైదొలిగిన జెఫ్రీ, జాన్ ♦ కొత్త సీఈవో కోసం కొనసాగనున్న అన్వేషణ న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా వ్యవస్థాపకులు, బోర్డుకు మధ్య విభేదాలతో నలిగిపోయిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కి కాస్త ఊపిరి తీసుకునే అవకాశం దొరికింది. సంక్షోభ పరిస్థితులకు తెరదించుతూ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని సొంత గూటికి మళ్లీ తిరిగొచ్చారు. ఇతర సహ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి కంపెనీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న ఆర్.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తారు. గురువారం బోర్డు సమావేశం అనంతరం ఇన్ఫోసిస్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. రవి వెంకటేశన్ సహ–చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగుతారు. ఇక గతవారం సీఈవో పదవికి రాజీనామా చేసినా.. వారసుడి ఎంపిక దాకా వైస్–చైర్మన్‌గా కొనసాగుతున్న విశాల్ సిక్కా.. తాజాగా బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు జెఫ్రీ ఎస్ లేమాన్, జాన్ ఎచ్‌మెండీ కూడా బోర్డు నుంచి వైదొలిగారు. ఆయా అధికారుల రాజీనామాలను ఆమోదించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ మార్పులు తక్షణం అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. తాత్కాలిక సీఈవోగాను, ఎండీగాను యూబీ ప్రవీణ్ రావు కొనసాగుతారు. పూర్తి స్థాయి కొత్త సీఈవో కోసం అన్వేషణ కొనసాగనుంది. తాజా పరిణామాలను వివరించేందుకు ఆగస్టు 25న (ఇవాళ) ఇన్వెస్టర్లతో సమావేశం అవుతున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందని, ఇన్ఫోసిస్ ప్రక్షాళన జరగాలంటూ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తదితరుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవస్థాపకులు పదే పదే తనను టార్గెట్ చేసుకుంటున్నారని పరోక్షంగా ఆరోపిస్తూ సిక్కా అర్ధంతరంగా సీఈవో పదవికి గత వారం రాజీనామా చేసినప్పటి నుంచి ఇన్ఫీ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. చైర్మన్‌గా నీలేకని నియామకం వార్తలతో అమెరికా నాస్డాక్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 0.74 శాతం ఎగిసింది. 14.93 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. నెలలుగా సంక్షోభం.. ఆరేడు నెలలుగా ఇన్ఫీలో సంక్షోభం చెలరేగుతోంది. సహవ్యవస్థాపకులు.. ముఖ్యంగా నారాయణ మూర్తికి, బోర్డుకు మధ్య విభేదాలు అంతకంతకూ ముదిరాయి. ఇజ్రాయెల్ సంస్థ పనయా కొనుగోలు వ్యవహారం మొదలు అనేక అంశాల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ మూర్తి పలు సందర్భాల్లో బోర్డును తప్పుపట్టారు. బోర్డు, మూర్తి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం బహిరంగంగానే కొనసాగింది. ఈ పరిణామాల నడుమ.. ఇన్ఫీ చరిత్రలో సీఈవోగా నియమితుడైన తొలి వ్యవస్థాపకయేతర వ్యక్తి విశాల్ సిక్కా ఆగస్టు 18న రాజీనామా చేశారు. అసలు బాధ్యతలపై దృష్టి పెట్టనివ్వకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు పెరిగిపోతుండటం ఇందుకు కారణంగా ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సిక్కా రాజీనామాకు వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి నిరంతరాయంగా ఆరోపణలు గుప్పిస్తుండటమే కారణమంటూ ఇన్ఫోసిస్ బోర్డు.. స్టాక్ ఎక్సే్చంజీలకు రాసిన ఈ–మెయిల్లో ఆరోపించింది. ఈ పరిణామంపై మండిపడిన నారాయణమూర్తి.. బోర్డు ఆరోపణలు ఖండించారు. ఇన్వెస్టర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు మూర్తి ప్రకటించినప్పటికీ.. అది వాయిదా పడింది. సిక్కా రాజీనామా అనంతరం నీలేకనికి బాధ్యతలు అప్పగించాలంటూ ఇన్వెస్టర్లతో పాటు ఇన్ఫీలో గతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు మాజీ సిబ్బంది నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో నీలేకని తిరిగి వెనక్కి రావడానికి అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిక్కాతో తెగదెంపులు.. నందన్ నీలేకని తిరిగి రావడం ఖరారైన నేపథ్యంలో ఇన్ఫోసిస్.. సిక్కాతో సంబంధాలు పూర్తిగా తెగదెంపులు చేసుకోనుంది. కాంట్రాక్టు ప్రకారం ఆయనకు ఇవ్వాల్సిన పరిహారాన్ని చెల్లించేయనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. ఆయనకు 90 రోజులకి సంబంధించి బేస్ పేతో పాటు ఉద్యోగులకు లభించే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని పేర్కొంది. ఇప్పటిదాకా షేర్ల రూపంలో ఆయనకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లించనున్నట్లు వివరించింది. ఇన్ఫీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని 2002–2007 మధ్య కాలంలో సంస్థ సీఈవోగా పనిచేశారు. ఆ తర్వాత విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ ఆధార్‌కు సారథ్యం వహించేందుకు 2008లో వైదొలిగారు. నీలేకని సీఈవోగా వ్యవహరించిన 2002 మార్చి 2007 ఏప్రిల్ మధ్య కాలంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ ఏకంగా 374 శాతం ఎగిసింది. పరిశ్రమను మించిన పనితీరు కనపర్చింది. అమ్మకాలు 40%, లాభాలు వార్షికంగా 37 శాతం మేర వృద్ధి చెందాయి. సొంతగూటికి రాక సంతోషం: నీలేకని ఇన్ఫోసిస్‌కి మళ్లీ తిరిగిరావడం సంతోషంగా ఉంది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నాను. క్లయింట్లు, షేర్హోల్డర్లు, ఉద్యోగులు మొదలైన వారందరికీ ప్రయోజనాలు చేకూర్చేలా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా బోర్డులోని నా సహచర సభ్యులతో కలసి పనిచేస్తాను. గడిచిన మూడేళ్లుగా సీఈవోగా సేవలు అందించిన విశాల్‌కి కృతజ్ఞతలు. ఆయన భవిష్యత్‌లో చేపట్టే వాటిల్లోనూ రాణించాలని కోరుకుంటున్నాను. స్వాగతిస్తున్నా..: విశాల్ సిక్కా నందన్ నీలేకని నియామకాన్ని స్వాగతిస్తున్నా. బాధ్యతల బదలాయింపు జరిగే వరకూ బోర్డులో కొనసాగుతానని గతంలో చెప్పా. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన రాకతో తక్షణం వైదొలుగుతున్నా. నందన్ సమర్థుడైన నాయకుడు. ఇన్ఫోసిస్ కొత్త శిఖరాలు అధిరోహించేలా మార్గనిర్దేశం చేసే దిశగా నీలేకని నియామకాన్ని స్వాగతిస్తున్నా. ఆయనతో పాటు ప్రవీణ్, ఇతర ఇన్ఫోసియన్లు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమర్ధ నాయకుడు నీలేకని..: శేషసాయి ఇన్ఫోసిస్‌ను వృద్ధి పథంలో నడిపించేందుకు నీలేకని సమర్ధుడైన నాయకుడు. భవిష్యత్తు వ్యూహాలపై కంపెనీ దృష్టి పెట్టేందుకు ఆయన నియామకం దోహదపడగలదు. నీలేకని సారథ్యంలో కంపెనీ మేనేజ్మెంట్ బృందం సమిష్టిగా పనిచేసి.. ఇన్ఫోసిస్‌ను పరిశ్రమలో అగ్రస్థానానికి చేర్చగలదనడంలో సందేహం లేదు. -
ఇన్ఫీలో మరో వివాదం: డైరెక్టర్లు రాజీనామా?
ఆధార కార్డుల ఆర్కిటెక్ట్ నందన్ నిలేకని, ఇన్ఫోసిస్‌లోకి పునరాగమనం చేయనున్నారా? ఆయన రీఎంట్రీతో ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో నెలకొన్న సమస్యలు సద్దుమణుగుతాయా? లేదా? ఆయన రాక మరింత వివాదానికి తెరతీసిందే అవకాశముందా? ప్రస్తుతం టెక్ ఇండస్ట్రిలో ఇదే చర్చనీయాంశంగా మారాయి. నందన్ నిలేకని రీఎంట్రీ కన్ఫామ్ అని ఇప్పటికే పలువురు చెప్పేస్తున్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆయన కొన్ని రోజుల్లో పదవిని అలంకరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. 2009లో ఇన్ఫోసిస్ సీఈవోగా ఆయన పక్కకు తప్పుకున్నప్పటి నుంచి ఆయన ఎలాంటి అధికారిక స్థానాలను కంపెనీలో అలంకరించలేదు. 12 దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్‌కంపెనీలు నందన్ నిలేకని పునరాగమనం చేయాలంటూ బోర్డుకు లేఖ కూడా రాశారు. ప్రస్తుత పరిస్థితులను చక్కబెట్టడానికి నిలేకనినే కరెక్ట్ అంటూ పేర్కొన్నారు. నిలేకని రీఎంట్రీతో ఇన్ఫోసిస్ బోర్డు అంతా పునర్నిర్మాణం జరుగనుంది. ఈ పునర్ నిర్మాణంలో మరో వివాదం చోటుచేసుకోబోతుంది. నిలేకని రీఎంట్రీ చేస్తే, కొందరు బోర్డు డైరెక్టర్లు రాజీనామా చేద్దామని సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చైర్మన్ ఆర్ శేషసాయి, డైరెక్టర్లు రూపా కుద్వా, జెఫ్ లెహ్మన్, కో-చైర్మన్ రవి వెంకటేషన్ కూడా రాజీనామాకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం బోర్డులో ఉండేవారిలో నారాయణమూర్తి దూరపు బంధువు డీఎన్ ప్రహ్లాద్, ఇటీవలే ఇన్ఫీ బోర్డులోకి చేరిన డీ సుందరమ్, పునితా కుమార్ సిన్హాలు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నట్టు తెలిసింది. నారాయణమూర్తికి, నిలేకని సన్నిహితంగా ఉండే బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందర్ షా కూడా బోర్డులో సభ్యురాలిగా ఉంటారో లేదో స్పష్టతలేదు. బుధవారం నిలేకని, మూర్తి కూడా సమావేశమయ్యారని, ఇన్ఫీలోకి రావడానికి కొంత భరోసాను నిలేకని కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. నిలేకని చైర్మన్‌షిప్‌లో మూర్తి బోర్డులో చేరే పరిణామాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. -
పర్యటన వాయిదా..నందన్ నీలేకని రిటర్న్స్?
సాక్షి, ముంబై: అంచనాలనకునుగుణంగా పీస్ మేకర్‌గా భావిస్తున్న నందన్ నీలేకని ఇన్ఫోసిస్ సంక్షోభాన్ని తీర్చిదిద్దేందుకు సన్నద్ధం కానున్నారు. విశాల్ సిక్కా రాజీనామాతో క్రైసిస్‌లో పడిపోయిన ఇన్ఫీని ఆదుకునేందుకు నీలేకని ఇన్ఫోసిస్ బోర్డులోకి రానున్నారనే అంచనాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఆయన ఎంపిక కానున్నారని సమాచారం. ముఖ్యంగా నీలేకని తన రెండు నెలల అమెరికా పర్యటనను వాయిదావేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ బోర్డులో ప్రక్షాళన తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం నలుగురు బోర్డు సభ్యులకు ఉద్వాసన తప్పదని భావిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఛైర్మన్ ఆర్.శేషసాయి, కో చైర్మన్ రవి వెంకటేశన్, రూపా కుద్వా, జెఫ్ లేమాన్ లకు ఇబ్బందులు తప్పవని మార్కెట్ వర్గాల భావన. భారత రెండో దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ను గట్టెక్కించేందుకు ఆధార్ సృష్టికర్త, సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని ఇన్ఫోసిస్‌లోకి మళ్లీ రావడంఖాయమనే తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఈ సస్పెన్స్‌కు తెరపడదు. మరోవైపు కంపెనీ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇన్వెస్టర్లతో ఆ రోజు తలపెట్టిన సమావేశం వాయిదా పడింది. మూర్తి అనారోగ్య కారణాలరీత్యా ఈ నెల 29కి దీన్ని వాయిదా వేశారు. అంతేకాదు దాదాపు 12మందికి పైగా ఫండ్ మేనేజర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు మాజీ సీఈవో నందన్ నీలేకని ఇన్ఫీ బోర్డులోకి పునరాగమనాన్ని ఆకాంక్షిస్తున్నారు. సమస్య పరిష్కారానికి షేర్ హోల్డర్ల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఆయనే సరైన వ్యక్తి అని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స ఫండ్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఒక ఉమ్మడి లేఖను ఇన్ఫోసిస్ ఛైర్మన్‌కు రాయడం గమనార్హం. కాగ ఇన్ఫోసిస్‌ను నెలకొల్పిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నిలేకని ఒకరు. ఈయన కంపెనీకి సీఈవోగా 2002 నుంచి 2007 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆధార్ కార్డు రూపకల్పన ప్రాజెక్టు హెడ్‌గా 2009లో బాధ్యతలు స్వీకరించి ఇన్ఫీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
ఇన్పీ ఛైర్మన్‌గా ఆయన్ను వెనక్కి తీసుకురండి: ప్రాక్సీ
ముంబై: సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి సంక్షోభంలో పడింది. ఈ పరిణామంపై కార్పొరేట్ గవర్నెన్స్ నిపుణులు, మార్కెట్ పెద్దలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రాక్సీ ఇన్వెస్టర్ సలహా సంస్థ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేసింది. ఇన్ఫీలో అత్యంత ఉన్నత వ్యవస్థాపకులలో ఒకరైన నందన్ నీలేకన్‌ను బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ తీసుకోవాలని ప్రదిపాదించింది. ఈ మేరకు ఆయనను కన్విన్స్ చేయాల్సి ఉందని తన నివేదికలో పేర్కొంది. తద్వారా భారత ఐటీ పరిశ్రమకు గుండెకాయలా ఉన్న ఇన్ఫీని కాపాడుకోవడానికి కోరింది. ఇన్ఫీ విజయమే ఐటీ భవిష్యత్తుకు సూచికలాంటిదని తెలిపింది. ఇన్ఫోసిస్ బోర్డు తన సీఈవోను కాపాడుకోలేకపోయిందని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఎఎస్) సంస్థ అభిప్రాయపడింది. కార్పొరేట్ పాలన నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు , నిర్వహణకు మధ్య ఇటీవల నెలకొన్నవివాదమే దీనిక కారణమని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో నందని నీలేకని సరైన వ్యక్తిగా పేర్కొంది. టెక్నాలజీ పురోగతితో వేగంతో ఉన్న ఆయన దేశంలో డిజిటల్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. అలాగే ప్రపంచ నాయకులు, ఇతర అధికారులతో కలిసి పనిచేసిన అనుభవ ఉందనీ, ఇన్ఫోసిస్ ప్రారంభంనుంచి సంస్థలో ఉన్న నందన్ నీలేకని కార్పొరేట్ సంస్కృతిని అర్థం చేసుకోవడంతోపాటు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో కొంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొంది. ఈ పరిణామాలు సమీప భవిష్యత్తులో ఇన్ఫీకి కొంత ఎదురు దెబ్బేనని ఏంజెల్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. అయితే వీటన్నింటిని సంస్థ అధిగమిస్తుందనే నమ్ముతున్నామని ఏంజిల్ బ్రోకింగ్ ఐటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సరభ్‌జిత కౌర్ నంగ్రా చెప్పారు. బోర్డు వైస్ చైర్మన్‌గా సిక్కాకు ఉద్వాసన పలికే ప్లాన్‌లో భాగమే ఈ నిర్ణయమని సింఘి అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు & ఎండీ మహేష్ సిన్ఘి అభిప్రాయపడ్డారు. కాగా మూడు దశాబ్దాల క్రితం ఇన్ఫోసిస్‌ను స్థాపించిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నీలేకనీ కూడా ఒకరు. మార్చి 2002 - ఏప్రిల్ 2007 మధ్య ఆయన సంస్థకు సీఈవోగా తన సేవలందించారు. అయితే కార్పొరేట్ గవర్నెన్స్ , భారీ వేతన ప్యాకేజీలపై రగిలిన వివాదం, తదనంతర పరిణమాలు చివరకు ఇన్ఫోసిస్ మొట్టమొదటి నాన్- ఫౌండర్ సీఈవో విశాల్ సిక్కా రాజీనామాకు దారి తీశాయి. ఆయన ఆకస్మిక రాజీనామాతో తాత్కాలిక సీఈఓ, ఎండీగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఎఫ్ఓ) యూబీ ప్రవీణ్‌రావు ఎంపికైన సంగతి తెలిసిందే. -
ఉపాధికి ఊతం.. బిగ్ డేటా
♦ చిన్న వ్యాపారుల రుణ లభ్యతకు కీలకం ♦ తద్వారా ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ♦ నందన్ నీలేకని బెంగళూరు: ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిపరమైన సమస్యలకు బిగ్ డేటానే పరిష్కారమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చెప్పారు. ఇప్పటిదాకా రుణాలు సరిగ్గా దొరకక ఇబ్బంది పడుతున్న చిన్న వ్యాపారాలకు కూడా దీంతో తోడ్పాటు లభించగలదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు. ‘బిగ్ డేటా అనేది ఏదో అర్థం కాని సాంకేతిక పదమో, గిమ్మిక్కో కాదు. ఇది వాస్తవానికి దేశంలోని చిన్న వ్యాపార సంస్థల పెట్టుబడి ప్రక్రియకు, వృద్ధికి తోడ్పడుతోంది. ఇవి అంతిమంగా ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడతాయి‘ అని ఆయన చెప్పారు. వస్తు, సేవల పన్నుల విధానం జీఎస్టీ అమల్లోకి రావడంతో వ్యాపార సంస్థలకు సంబంధించిన కీలక గణాంకాలు అందుబాటులోకి వస్తున్నాయని నీలేకని తెలిపారు. ‘జీఎస్టీ పరిధిలోని దాదాపు ఎనభై లక్షల పైగా చిన్న వ్యాపార సంస్థలకు క్రమంగా రుణాలు లభించడం మొదలవుతుంది. ఆయా వ్యాపార సంస్థలు.. రుణ సదుపాయం అందుబాటులోకి వచ్చాక మరింత వృద్ధి చెందుతాయి.. తదనుగుణంగా ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది‘ అని చెప్పారు. వ్యాపారాల పనితీరుకు సంబంధించి సరైన డేటా లేకనే చిన్న వ్యాపార సంస్థలకు రుణాలు లభించడం కష్టమవుతోందని నీలేకని చెప్పారు. మరోవైపు, మొండి బాకీల అంశంపై స్పందిస్తూ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలోని ఆర్బీఐ ఈ సమస్య పరిష్కారానికి చెప్పుకోతగ్గ ప్రయత్నమే చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐఎం పరీక్ష రాయకపోవడం మంచిదైంది.. ఐఐఎం ప్రవేశ పరీక్ష రాయకపోవడం తన అదృష్టమని లేకపోతే.. తాను ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితో కలిసి పనిచేసే అవకాశం కోల్పోయి ఉండేవాడినని నీలేకని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ పరీక్ష రాసి ఉండి ఉంటే ప్రస్తుతం ఏ సబ్బుల కంపెనీలోనో మరో దాన్లోనో మేనేజరుగా స్థిరపడిపోయి ఉండేవాడినని ఆయన చమత్కరించారు. ‘ఐఐఎం ప్రవేశ పరీక్షను మిస్ కావడం నా అదృష్టం. అప్పట్లో నేను ఉద్యోగం వెదుకుతూ ఓ చిన్న కంపెనీకి వెళితే అక్కడ నారాయణ మూర్తి నాకు ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత మా అనుబంధం మరింత బలపడింది.. అదే ఇన్ఫోసిస్ ఆవిర్భావానికి దారి తీసింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఒకవేళ నేను గానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటే ఇన్ఫీలో భాగమయ్యే వాణ్ని కాను. అదృష్టవశాత్తూ అంతకన్నా ముందుగానే నేను ఇన్ఫోసిస్‌లో చేరాను‘ అని నీలేకని చెప్పారు. ఐఐటీలో విద్యాభ్యాసం, అక్కడి పరిస్థితులు తనలో ఆత్మవిశ్వాసం పెంపొందించాయని, నాయకుడిగా ఆలోచన ధోరణిని మార్చుకోవడానికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. -
నందన్ నీలేకని 100 మిలియన్ డాలర్ల ఫండ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థలకు చేయూతనిచ్చే దిశగా 100 మిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటుకు..ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, వెంచర్ క్యాపిటలిస్టు సంజీవ్ అగర్వాల్ చేతులు కలిపారు. ‘ది ఫండమెంటమ్ పార్ట్నర్షిప్’ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ ఫండ్.. ముఖ్యంగా కన్జూమర్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనుంది. అవకాశాలను బట్టి 200 మి.డాలర్ల దాకా పెంచనున్నట్లు పేర్కొంది. వ్యాపారాన్ని తదుపరి స్థాయికి పెంచుకునేందుకు వనరులు అన్వేషిస్తున్న సంస్థల్లో 10–25 మి. డాలర్ల శ్రేణిలో ఇన్వెస్ట్ చేయనుంది. -
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల సంచలన నిర్ణయం
బెంగళూరు : దేశీయ కార్పొరేట్ చరిత్రలో మరో సంచలనం చోటుచేసుకోబోతుంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు తమ కంపెనీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీలో ఉన్న మొత్తం స్టేక్ అమ్మేయడానికి సన్నద్దమవుతున్నారని వార్తలొస్తున్నాయి.. కంపెనీలో సహవ్యవస్థాపకులు కలిగిన రూ.28వేల కోట్ల విలువైన 12.75 శాతం స్టేక్ ను అమ్మేయాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. గత కొంతకాలంగా ఇన్ఫోసిస్ లో బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు చోటుచేసుకున్న వివాదం తెలిసిందే. గత మూడేళ్లుగా కంపెనీ నడుస్తున్న తీరుపై వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బహిరంగంగానే పలుమార్లు బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. అయినా కూడా బోర్డు సభ్యులు ఏ మాత్రం సమస్య లేదన్న రీతిలో వ్యవహరించడం ఈ పరిణామాలకు దారితీస్తోంది. బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య వార్ కంటే కంపెనీలోని స్టేక్ ను అమ్మేసి, 1981లో తాము స్థాపించిన ఈ కంపెనీ నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడమే మేలని ప్రమోటర్స్ గ్రూప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నారాయణమూర్తి, నందన్ నిలేకని ఈ ప్రమోటర్స్ గ్రూప్ కు అధిపతులుగా ఉన్నారు. 1981 జూలై 2న బెంగళూరులో స్థాపించబడ్డ ఇన్ఫోసిస్, 1993లో ప్రజల ముందుకు వచ్చింది. నారాయణమూర్తి, ఎన్ఆర్ నందన్ నిలేకనితో పాటు మరో ఐదుగురు కలిసి ఈ సంస్థను స్థాపించారు. మూర్తి ఆయన భార్య సుధా మూర్తి వద్ద నుంచి 10,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఈ సంస్థను ఆరంభించారు. వీరందరూ మధ్య తరగతి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ ఎంటర్ ప్రీన్యూర్స్. అనంతరం భారత టెక్ పరిశ్రమలోనే ఇన్ఫోసిస్ రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. స్టాక్ మార్కెట్ బ్లాక్ డీల్స్ ద్వారా ఈ స్టేక్ విక్రయం ఉండొచ్చని అంచనా. అయితే ఈ విక్రయ విషయంపై నారాయణమూర్తిని సంప్రదించగా.. ఆయన ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఇది నిజం కాదని తేల్చిచెబుతున్నారు. నారాయణమూర్తి, అతని కుటుంబ సభ్యులకు కంపెనీలో 3.44 శాతం స్టేక్ ఉంది. ఆధార్ లాంచ్ చేయకముందు నందన్ నిలేకని సంస్థ అధికార బాధ్యతలను చేపట్టారు. అయితే ఇన్ఫోసిస్ పై తాను కామెంట్ చేయనని చెప్పిన నిలేకని ఈ విషయంపై మరిన్ని ప్రశ్నలపై స్పందించడానికి నిరాకరించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు-మూర్తి, నిలేకని, క్రిష్ గోపాల్ క్రిష్ణన్, ఎస్డీ షిబులాల్, కే దినేష్ ప్రస్తుతం కంపెనీలో ఎగ్జిక్యూటివ్, లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ లుగా లేరు. ఇటీవల బోర్డు సభ్యులు పలు వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వారు ఆరోపించారు. కార్పొరేట్ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా వ్యవస్థాపకులు, మేనేజ్ మెంట్ పై మండిపడినప్పటికీ.. కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా, బోర్డు సభ్యులు మాత్రం సమస్యే లేదన్న రీతిలో వ్యవహరిస్తుండటం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. మేనేజ్ మెంట్ వ్యవహారంతో విసుగెత్తిన కంపెనీ సహవ్యవస్థాపకులు ఏకంగా ఇన్ఫోసిస్ తో తెగదెంపులే చేసుకోవాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. -
సత్య నాదెళ్ల నందన్ నిలేకనిని అడిగిన ప్రశ్నిదే!
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనాదెళ్ల, ఆధార్ ప్రాజెక్ట్ మూలస్తంభంగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని ఒకే వేదికపై ఆసీనులయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్లో టెక్ టైటాన్స్ ఇద్దరూ ఒకరినొకరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్ల, నందన్ నిలేకనిని ఓ ప్రశ్న అడిగారు. ఆధార్ ప్లాట్‌ఫామ్‌ను కొనియాడిన నాదెళ్ల, టెక్నాలజీ పరంగా ఆధార్‌పై తమకున్న విజన్, దాని ప్రభావం ఏమిటి అని నందన్ నిలేకనికి అడిగారు. తాము డిజైన్ చేస్తున్నప్పుడు ఆధార్ ప్లాట్ ఫామ్‌కు ఓ వేగం, స్థాయి ఉంది. ఆ వేగం, స్థాయి ఉంటేతప్ప నిజంగా అనుకున్న దాన్ని తాము సాధించలేమని నిలేకని చెప్పారు. ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో భద్రపరచుకునేందుకు ఉపయోగపడే డిజిలాకర్‌కు ఆధార్ ఉపయుక్తమవుతుందని చెప్పారు. దేశంలో వ్యక్తిగత డిజిటల్ చెల్లింపులు 5 శాతమే ఉన్నాయని, వచ్చే ఏడాదికి 15-20 శాతానికి చేరుకుంటుందనే అంచనాను వ్యక్తం చేశారు. కార్డు లావాదేవీల కంటే ఆధార్, వేలిముద్ర ఆధారిత డిజిటల్ చెల్లింపులు అధికమవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.తాము ప్రారంభించిన ఆధార్‌కు ఇరు ప్రభుత్వాలు మద్దతు పలకడం చాలా అదృష్టమని సంతోషం వ్యక్తంచేశారు. ఆధార్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించిన ఐదున్నరేళ్లలో బిలియన్ యూజర్లను(100 కోట్ల యూజర్లను) ఛేదించింది. గత 2-3ఏళ్లలోనే ఆధార్‌కు అనూహ్య స్పందన వస్తుందని నందన్ నిలేకని చెప్పారు. ఆధార్ ఆధారిత కేవైసీ వాడుతూ రిలయన్స్ జియో కూడా చాలా తక్కువ సమయంలోనే విజయవంతంగా తన సబ్ స్క్రైబర్ బేస్‌ను సాధించిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆధార్‌కు మరింత డిమాండ్ పెరిగింది. నందన్ నిలేకని ఆధార్ ప్రొగ్రామ్‌కు మాజీ చైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి అడ్వయిజరీగా ఉన్నారు. -
‘ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు షాక్’
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దుతో అందరికీ మేలు జరుగుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని అన్నారు. నోట్ల కష్టాలు స్వల్పకాలమే ఉంటాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు షాక్ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ షాక్ దేశానికి మంచి చేస్తుందని, ఆర్థిక మందగమనం కొంత కాలమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆధార్ కార్డుతో ఎవరైనా జీరో బాలెన్స్ లేదా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరవొచ్చని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో 3 నుంచి 6 నెలల్లో డిజిటల్ నగదు లావాదేవీలు పెరుగుతాయని అంచనా వేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులను కొనసాగిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి నిలేకని ధన్యవాదాలు తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను ఆధార్ కు సంధానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
ఇపుడున్న ఉద్యోగాలు భవిష్యత్తులో ఉండవట..!
హైదరాబాద్: ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని యువకులకు షాకిచ్చే సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఉనికిలో ఉన్న ఉద్యోగాలు చాలా వరకు భవిష్యత్తులో ఉండకపోవచ్చని చెప్పారు. దీనికి పరిష్కారంగా ఏదో ఒకటి చేయాలని, విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యాల శిక్షణలోనూ, విద్యావ్యవస్థలో పూర్తి మరమ్మతుల అంశాల సమగ్ర పరిశీలనపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఎడ్యుకేషన్ సిస్టంలో వినూత్నమైన మార్పులతోపాటు, సృజనాత్మకత ఆధారిత నైపుణ్యాలను పెంచుకోవాలని సోమవారం పీటీఐకి చెప్పారు. ఈ తరహా నైపుణ్యాల పెంపు ద్వారా భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇండియా (యుఐడిఎఐ) మాజీ చైర్మన్ నీలేకని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలు జీవితాంతం నేర్చుకునే పనిలో ఉంటూనే, కొత్త కొత్త నైపుణ్యాలు, ఆలోచనలను పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యావ్యవస్థలో మార్పులు రావాలని కోరారు. ఈ విషయంలో ఒక పెద్ద మార్పు అవసరం ఉందని నీలేకని వ్యాఖ్యానించారు. ఆటోమేషన్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంజిలిజెన్స్ , బాట్స్ లాంటివి సాఫ్ట్ వేర్, బీపీఓ రంగంలో దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో మరిన్ని కొత్త ఉద్యోగావకాశాలు రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు పొందడం గతంలో ఉన్నంత తేలిక కాదన్నారు. ఆ వైపుగా దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. భారతదేశం యొక్క 7-8 శాతంగా జీడీపి వృద్ధి రేటు నిరుద్యోగానికి కారణమా అన్న ప్రశ్నకు దేశీయ సేవలపై దృష్టిపెట్టాలని నీలేకని చెప్పారు. -
టాటా, నీలేకని, విజయ్ కేల్కర్..మైక్రోఫైనాన్స్ సంస్థ
న్యూఢిల్లీ: రతన్ టాటా, నందన్ నిలేకని, విజయ్ కేల్కర్ వంటి దిగ్గజాలు కలిసి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రధానంగా దేశంలోని రుణ లభ్యత లేని వర్గాలకు తక్కువ వడ్డీకే రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించనుంది. ‘అవంతి ఫైనాన్స్ త్వరలో రిజిస్ట్రేషన్ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంటుంది. దీని కార్యకలాపాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభం అవుతాయి’ అని టాటా ట్రస్ట్ పేర్కొంది. -
‘రైల్ యాత్రి’లో నీలేకని పెట్టుబడులు
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ సమాచార అప్లికేషన్(యాప్), వెబ్సైట్ రైల్యాత్రి.ఇన్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని పెట్టుబడులు పెట్టారు. అయితే, ఈ మొత్తం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. నీలేకనితోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్లయిన హీలియన్ వెంచర్స్, ఒమిడ్యార్ నెట్వర్క్స్, బ్లూమ్ వెంచర్స్ కూడా తాజాగా పెట్టుబడులు పెట్టిన వాటిలో ఉన్నాయని రైల్యాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. 2014లో ఆరంభమైన రైల్యాత్రి ఇప్పటివరకూ 3 మిలియన్ డాలర్లను(దాదాపు రూ.20 కోట్లు) సమీకరించినట్లు అంచనా. రైళ్లలో ప్రయాణిస్తున్నవారి(క్రౌడ్ సోర్సింగ్) మొబైల్ జీపీఎస్ డేటా ఆధారంగా రైళ్లకు సంబంధించిన ప్రయాణ జాప్యాలను ఈ యాప్ అంచనావేసి ఇతర ప్రయాణికులకు అందిస్తుంది. సంబంధిత రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుంది. కోచ్ పొజిషన్, ఆన్-టైమ్ హిస్టరీ, వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ గనుక తీసుకుంటే అది కన్ఫర్మ్ అవుతుందా లేదా వంటి సమాచారాలను కూడా ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. ఆధార్ పాజెక్టును విజయవంతం చేసిన యూఐడీఏఐ మాజీ చైర్మన్ నీలేకని వంటి టెక్నోక్రాట్ నుంచి పెట్టుబడులు అందుకోవడం తమకు గర్వకారణమని రైల్యాత్రి సహ వ్యవస్థాపకుడు కపిల్ రైజాదా వ్యాఖ్యానించారు. -
‘సెడెమ్యాక్’లో నీలేకని పెట్టుబడులు..
ముంబై: వాహన విడిభాగాల స్టార్టప్, సెడెమ్యాక్ మెక్ట్రానిక్స్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని , నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ కలిసి 75 లక్షల డాలర్లు(50 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. అందరూ ఈ కామర్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుండగా నిలేకని అందుకు భిన్నంగా ఈ సెడెమ్యాక్ స్టార్టప్‌కు నిధులందించారు. వినూత్న ఐడియాలకు పెట్టుబడులందించే వ్యూహంలో భాగంగా నీలేకని, ఐఐటీ-బాంబే ల్యాబ్‌లో ఊపిరి పోసుకున్న సెడెమ్యాక్లో ఇన్వెస్ట్ చేశారు. నెక్సస్ వెంచర్, ఇండియా ఇన్నోవేషన్ ఫండ్లు కూడా ఈ స్టార్టప్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి. సెడెమ్యాక్ సంగతి...: చిన్న ఇంజిన్లు, పవర్ ట్రైన్ల కోసం కంట్రోల్స్ అందించే సెడెమ్యాక్ స్టార్టప్‌ను 2008లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ శశికాంత్ సూర్యనారాయణన్ ప్రారంభించారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసిన సూర్యనారాయణన్, ఇతర ఐఐటీయన్లు-పుష్కరాజ్ పన్సే, అమిత్ దీక్షిత్, మనీశ్ శర్మ్లతో కలసి దీనిని నిర్వహిస్తున్నారు. టాటా మోటార్స్, మహీంద్రా గ్రూప్, అశోక్ లేలాండ్, టీవీఎస్ మోటార్స్ తదితర దిగ్గజాలు సెడెమ్యాక్ క్లయింట్లు. -
టెలికం స్టార్టప్ ‘మబుల్’లో నీలేకని పెట్టుబడులు
న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ మబుల్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇది యూజర్లు తమ మొబైల్ డేటా వాడకం, టెలికం వ్యయాలను ట్రాక్ చేసుకునేందుకు, నియంత్రించేందుకు ఉపయోగపడే యాప్ సర్వీసులను అందిస్తోంది. వ్యక్తిగత హోదాలో నీలేకని ఇన్వెస్ట్ చేశారని, మొబైల్ టెక్నాలజీ ప్రోడక్టు కంపెనీలో ఆయన పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారని మబుల్ సీఈవో అశ్విన్ రామస్వామి తెలిపారు. అయితే మబుల్‌లో నీలేకని ఎంత ఇన్వెస్ట్ చేసినదీ వెల్లడి కాలేదు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు మబుల్ తోడ్పాటు అందించగలదని నీలేకని పేర్కొన్నారు. ఆయన ఇటీవలే టీమ్ ఇండస్ అనే ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థలోనూ ఇన్వెస్ట్ చేశారు. ఐఐటీలో చదివిన రామస్వామి, ప్రణవ్ ఝా, రాఘవేంద్ర వర్మ కలిసి 2013లో మబుల్‌ను ఏర్పాటు చేశారు. ఈ యాప్ ఆరు నెలల్లో అయిదు లక్షల పైగా డౌన్లోడ్లు నమోదు చేసింది. -
ఆధార్ సమాచారం భద్రం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆధార్ కార్డుల్లో నిక్షిప్తమై ఉన్న ప్రజల సమాచారం భద్రంగా ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ(యూఐడీఏఐ) మాజీ చైర్మన్ నందన్ నిలేకని స్పష్టం చేశారు. ఆధార్ అనేది వ్యక్తులను ధ్రువీకరించే విధానం మాత్రమేనని, కార్డుల్లో ఉన్న సమాచారం ఎక్కడికీ బదిలీ కాదని శుక్రవారమిక్కడ వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు సృష్టించిన వ్యక్తులకు సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఏటా ఇచ్చే వి.కృష్ణమూర్తి అవార్డును తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నిలేకని మాట్లాడుతూ 67 కోట్ల కార్డులు ఇప్పటి వరకు జారీ అయ్యాయని చెప్పారు. అయిదవ దశ నమోదుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ చేరికతో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఆధార్ నమోదులో ఆంధ్రప్రదేశ్(తెలంగాణ, సీమాంధ్ర) ముందుందని గుర్తు చేశారు. ఆధార్ ఒక ధ్రువీకరణ మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే వివరాలు తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశిష్ట గుర్తింపుతోనే.. సబ్సిడీల రూపంలో ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని నిలేకని అన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పెద్ద ఎత్తున అవకాశం ఉందని చెప్పారు. ‘విశిష్ట గుర్తింపు ద్వారా అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వ లబ్ధి చేకూరుతుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఏటా కేంద్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్లు ఆదా అవుతుంది. ఆధార్ సమాచారంలో 99.99% ఖచ్చితత్వం ఉంటుంది. పేరు నమోదులో భాగంగా చేతి వేళ్లు, రెండు కనుపాపల చిత్రాలను తీసుకుంటారు. నకిలీలకు తావు లేదు. పన్ను చెల్లింపు ప్రక్రియలో ఆధార్ అనుసంధానంతో పారదర్శకత ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన ధన యోజన ప్రాజెక్టుకు ఆధార్ సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’ అని అన్నారు. ఆధార్ ఫలాలు భవిష్యత్‌లో కనపడతాయని చెప్పారు. కాగా, మారుతీ ఉద్యోగ్ ఫౌండర్ చైర్మన్‌గా, బీహెచ్ఈఎల్, సెయిల్‌కు చైర్మన్‌గా వి.కృష్ణమూర్తి సేవలందించారు. -
అభ్యర్థుల ఆస్తుల లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిదే!
16వ లోక్‌సభకు ఒక పక్క నుంచి ఎన్నికలు మొదలయ్యాయి. 9 విడతలుగా జరిగే ఈ ఎన్నికలలో తొలి విడత ఈ నెల 7న, రెండ విడత 9న జరిగాయి. ఈ రోజున మూడవ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 12న 4వ విడత-17న 5 - 24న 6 - 30న 7 - మే 7న 8వ విడత - మే 12న 9వ విడత ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లో తమ వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలియజేయాలి. తమ ఆస్తుల వివరాలు కూడా స్పష్టం చేయాలి. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు నామినేషన్‌తో పాటు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పటివరకు నామినేషన్లు వేసిన నేతల్లో కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నందన్ నీలేకని అత్యంత ధనవంతుడుగా తేలింది. లోక్‌సభకు పోటీ చేసేవారిలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అత్యంత ధనవంతు జాబితాలో నందన్ నీలేకనితోపాటు వరుసగా అనిల్ కుమార్ శర్మ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నామా నాగేశ్వర రావు, మణికుమార్ సుబ్బా, నవీన్ జిందాల్, వివేక్, హెచ్ డీ కుమారస్వామి, వి.బాలకృష్ణన్, : పినాకి మిశ్రా,డీకే సురేష్,కుల్దీప్ బిష్ణోయ్, ఏ కృష్ణప్ప ఉన్నారు. అత్యంత సంపన్నులైన ఈ రాజకీయ నేతలు ఎక్కడ నుంచి, ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో ఈ దిగువన ఇస్తున్నాం. మొదటి స్థానం: పేరు: నందన్ నీలేకని - వయసు: 58 ఏళ్లు - ఆస్తులు: రూ.7,700 కోట్లు పార్టీ: కాంగ్రెస్ - రాష్ట్రం: కర్ణాటక - స్థానం: దక్షిణ బెంగళూరు లోక్‌సభ నీలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు. వచ్చే ఎన్నికలలో ఆయన గెలిస్తే దేశంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయనేతగా రికార్డులకెక్కుతారు. ఆయన ఆస్తులలో 80 శాతం ఇన్ఫోసిస్‌లోనే షేర్ల రూపంలో ఉన్నాయి. రెండో స్థానం: పేరు: అనిల్ కుమార్ శర్మ - ఆస్తులు: రూ.850 కోట్లు పార్టీ: జనతాదళ్ (యునైటెడ్) - రాష్ట్రం: బీహార్ - స్థానం: జహానాబాద్ లోక్‌సభ మూడవ స్థానం: పేరు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి - ఆస్తులు: రూ. 600 కోట్లు పార్టీ : తెలంగాణ రాష్ట్ర సమితి - రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్ - స్థానం :చేవెళ్ల నాలుగవ స్థానం: పేరు: నామా నాగేశ్వర రావు - ఆస్తులు : రూ. 338 కోట్లు పార్టీ : టిడిపి - రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్ - స్థానం : ఖమ్మం అయిదవ స్థానం: పేరు: వ్యాపారవేత్త నవీన్ జిందాల్ - ఆస్తులు: రూ.300 కోట్లు పార్టీ: కాంగ్రెస్ - రాష్ట్రం: హర్యానా - స్థానం: కురుక్షేత్ర లోక్‌సభ ఆరవ స్థానం: పేరు: వివేక్ - - ఆస్తులు: రూ.265 కోట్లు పార్టీ: కాంగ్రెస్- రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్ - స్థానం: పెద్దపల్లి ఏడవ స్థానం: పేరు: మణికుమార్ సుబ్బా - ఆస్తులు: రూ.205 కోట్లు పార్టీ: కాంగ్రెస్ రెబల్ - రాష్ట్రం: అసోం - స్థానం: తేజ్‌పూర్ లోక్‌సభ మణికుమార్ సుబ్బా ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు సార్లు గెలిచారు. అయితే ఈసారి కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎనిమిదవ స్థానం: పేరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి - ఆస్తులు: రూ.190 కోట్లు పార్టీ: జనతాదళ్ (సెక్యూలర్) - రాష్ట్రం: కర్ణాటక - స్థానం: చిక్‌బళ్లాపూర్ తొమ్మిదవ స్థానం: పేరు: ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ వి.బాలకృష్ణన్ - ఆస్తులు: రూ.190 కోట్లు పార్టీ: ఆమ్ ఆద్మీ - రాష్ట్రం: కర్ణాటక - స్థానం: సెంట్రల్ బెంగళూరు పదవ స్థానం: పేరు: పినాకి మిశ్రా - ఆస్తులు: రూ.137 కోట్లు పార్టీ: బీజూ జనతాదళ్ - రాష్ట్రం: ఒడిశా - స్థానం: పూరి పినాకి మిశ్రా న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. 11వ స్థానం: పేరు: డీకే సురేష్ - ఆస్తులు: రూ. 85 కోట్లు పార్టీ: కాంగ్రెస్ - రాష్ట్రం: కర్ణాటక - స్థానం: రూరల్ బెంగళూరు 12వ స్థానం: పేరు: కుల్దీప్ బిష్ణోయ్ - ఆస్తులు: రూ.78 కోట్లు పార్టీ: హర్యానా జన్హిత్ కాంగ్రెస్ - రాష్ట్రం: హర్యానా - స్థానం: హిస్సార్ 13వ స్థానం: పేరు: ఏ.కృష్ణప్ప - వయసు:68 - ఆస్తులు: రూ.70 కోట్లు పార్టీ: జనతాదళ్ (సెక్యూలర్) - రాష్ట్రం: కర్ణాటక - స్థానం:తుమ్కూరు ఈ ఆస్తుల వివరాలన్నీ వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తెలిపినవే. వీరిలో అయిదుగురు కర్ణాకటకు చెందినవారు కాగా, ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు హర్యానాకు చెందినవారు. బీహార్, అసోం, ఒడిశాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. -
రాజకీయ నేతల ధనవంతుల జాబితాలో.....
-
ఇద్దరు భర్తలు... ఇద్దరు భార్యలు...ఒక్క ఎంపీ సీటు
ఈ లోకసభ ఎన్నికల్లో బెంగుళూరు సౌత్ లో చాలా ఆసక్తిదాయకమైన పోటీ నెలకొంది. ఐటీ రంగ దిగ్గజం నందన్ నీలేకని, ఓటమినెరుగని బిజెపి నేత అనంతకుమార్ లు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. నీలేకని కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, అనంతకుమార్ బిజెపి నుంచి పోటీ పడుతున్నారు. ఇద్దరు నాయకుల భార్యలు కూడా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అనంత్ కుమార్ భార్య తేజస్విని, నీలేకని భార్య రోహిణి ల ప్రచార శైలి కూడా చాలా భిన్నం. రోహిణి రాజకీయాలకు కొత్త. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లడం ఆమెకు అలవాటు లేదు. ఐటీ ఉద్యోగులతో కలిసి మాట్లాడటం కాస్త సులువుగానే ఉన్నా మిగతా ప్రజలతో ఆమె కలవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. అసలు భర్త రాజకీయాల్లోకి వస్తారన్న విషయాన్ని ఆమె ఏనాడూ ఊహించలేదు. ఆమె ఇప్పటికీ జీర్ఝించుకోలేకపోతోంది. అయితే మారిన పరిస్థితులకనుగుణంగా తనను తాను మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్విని అనంత్ కుమార్ 1988 నుంచే ప్రజా జీవనంలో ఉన్నారు. ఆమెకు ప్రజలను కలవడం బాగా అలవాటు. నిజానికి అనంత్ కుమార్ కు మొదటి నుంచీ ఆమె వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అసలు అనంత్ సక్సెస్ కు కారణం తేజస్వినే అని చాలా మంది చెబుతున్నారు. ఆమె గతంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ విభాగంలో పనిచేశారు. భర్త క్రియా శీల రాజకీయాల్లోకి రాగానే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిని, భర్త కార్యాలయాన్ని మేనేజ్ చేస్తున్నారు. నందన్ ఆస్తులు 770 కోట్లు. ఆయనకు ఇన్ఫోసిస్ లో 1.45 శాతం షేర్లున్నాయి. రోహిణికి కూడా 1.30 శాతం షేర్లున్నాయి. అనంత్ కుమార్ భార్యకు 4/2 కోట్ల ఆస్తి, అనంతకుమార్ కి 51.13 లక్షల విలువైన ఆస్తులున్నాయి. -
గెలుపు కోసం శ్రమిస్తున్న సతిపతులు
‘కార్యేషు దాసి.. కరుణేషు మంత్రి.. భోజ్యేషు మాత.. శయనేషు రంభ.. అపురూపమైనదమ్మ ఆడజన్మ.. ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా’ అన్న సినీ కవి మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కష్టసుఖాల్లో, గెలుపోటముల్లో అన్నింటా... అన్ని వేళలా తోడునీడగా కలిసి నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల బరిలో నిలిచిన తమలో సగమైన జీవితభాగస్వామి గెలుపు కోసం సతిపతులు శ్రమిస్తున్నారు. ఎండలు చుర్రుమంటున్నా.. ఉక్కపోతతో చెమట చిందిస్తూ విజయావకాశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన మంత్రాంగాన్ని నడుపుతున్నారు. వీరి చిత్తశుద్ధి ముందు భానుడి ప్రతాపం చిన్నబోతోంది. నిలేకనికి నీడలా.. ఐటీ రంగ ప్రముఖుడిగా ప్రపంచ ప్రజలకు సుపరిచితుడే అయినా రాజకీయాలకు పూర్తిగా కొత్తవారైన నందన్ నీలేకని బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఇన్ని రోజులు సాధారణ ప్రజాజీవనానికి కాస్తంత దూరంగానే ఉన్న ఆయన విజయావకాశాలను మెరుగు పరిచేందుకు జీవిత భాగస్వామి రోహిణి నీలేకని తీవ్రంగా శ్రమిస్తున్నారు. బెంగళూరు దక్షిణ పరిధిలో ఐటీ రంగానికి చెందిన వారు ఎక్కువగా ఉండే బీటీఎం లేఅవుట్, జయనగర తదితర ప్రాంతాల్లో రోహిణి విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన భర్త విజయావకాశాలను మెరుగు పరిచడంతో తనకున్న నైపుణ్యాన్ని ఆమె ధారపోస్తున్నారు. సాధారణ ప్రజల్లో ఒకరుగా కలిసిపోయే ప్రయత్నం చేస్తూనే స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ... నందన్ నిలేకని గెలుపునకు అవసరమైన మంత్రాంగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అనంతకుమార్‌కు అండగా తేజస్విని భర్తల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్న వారిలో అందరికన్నా ముందంజలో తేజస్విని ఉన్నారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన అనంతకుమార్ విజయం కోసం ఆయన భార్య తేజస్విని విస్తృత ప్రచారాన్ని సాగిస్తున్నారు. అనంతకుమార్ నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె పాదయాత్ర సాగిస్తూ ఓటర్లలో చైతన్యం తీసుకువస్తున్నారు. నిత్యం ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో అనంతకుమార్‌ను గెలిపించాల్సిన ఆవశ్యకతను, నరేంద్ర మోడిని ప్రధానిని చేయాల్సిన అవసరాన్ని గురించి వివరిస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న తేజస్విని నగర ప్రజలకు సుపరిచితులే కావడంతో ఆమె ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గీతను దాటించేందుకు శివన్న పుట్టినింట రాజకీయాలనే చూస్తూ పెరిగినా మెట్టినింట మాత్రం వాటికి దూరంగా జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి గీతా శివరాజ్‌కుమార్. ప్రముఖ రాజకీయ వేత్త బంగారప్ప గారాల పట్టిగా, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ ఇంటి కోడలిగా గీత సుపరిచితులే. రాజకీయ జీవితం ఆమెకు కొత్తే అయినా అందులో అడుగుపెట్టాలని అనుకున్న మరుక్షణం నుంచే శివరాజ్‌కుమార్ ప్రోత్సహిస్తూ వచ్చారు. ఎన్నో విమర్శలు ఎదురవుతున్నా లెక్కచేయక ఆమె వెన్నంటి నిలిచారు. తన భార్య రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందోనన్న విషయంపై అందరికీ వివరణలు ఇస్తూ వచ్చారు. పార్టీలో చేరడం మొదలుకొని నామినేషన్ దాఖలు చేయడం వరకు ఆమె వెంటే ఉన్నారు. ఇక ఇప్పుడు తన సినీ గ్లామర్‌తో భార్యకు విజయావకాశాలను పెంచే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అయితే తాను తన భార్య గీతకు ఓటేయ్యాలని కోరతాను తప్పితే జేడీఎస్ తరఫున ప్రచారం చేయబోనని శివరాజ్‌కుమార్ పేర్కొనడం కొసమెరుపు. -
నాడు 200.. నేడు 7700 కోట్లు!!
నందన్ నీలేకని.. ఆధార్ కార్డుల పుణ్యమాని దేశం మొత్తానికి తెలిసిన పేరిది. ఒకప్పుడు నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించిన వ్యవస్థాపకులలో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు లోక్‌సభకు పోటీ చేస్తున్న సందర్భంగా, తన ఆస్తుల విలువ 7,700 కోట్ల రూపాయలని ప్రకటించి సంచలనం సృష్టించారు. బహుశా ఈ ఎన్నికల్లో ఆయనకంటే ధనవంతుడైన అభ్యర్థి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, 1978లో ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ చదవిన తర్వాత ఉద్యోగావకాశం వస్తే తనకొద్దని విదిల్చికొట్టేనాటికి ఆయన జేబులో ఉన్నవి కేవలం 200 రూపాయలే!! అక్కడినుంచి ఇప్పుడు దాదాపు 8వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించే స్థాయికి ఎదిగారు. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న నందన్ నీలేకనికి నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన కోరమంగళ వద్ద రిసార్టు లాంటి ఇల్లు, లెక్కలేనన్ని విలాసవంతమైన కార్లు.. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. తనకు ఇప్పటికే బోలెడంత డబ్బుందని, ఇప్పుడు డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రావట్లేదని నీలేకని అన్నారు. మార్పు తేవడం కోసమే వస్తున్నానన్నారు. తాను నిజాయితీగా సంపాదించానని, అంతా ప్రకటించానని చెప్పారు. నందన్ నీలేకని సంపాదనలో అత్యధిక భాగం ఆయనకు, ఆయన భార్య రోహిణికి ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్ల రూపంలోనే ఉంది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్‌లో వీళ్లిద్దరికీ కలిపి 3శాతం షేర్లున్నాయి. -
నందన్ నీలెకని నామినేషన్ దాఖలు.. ఆస్తి 7,770 కోట్లు!
బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న నందన్ నీలెకని.. తన ఆస్తి 7,770 కోట్లుగా ఎన్నికల కమిషన్ కు దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. నందన్ నీలెకని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు అనే సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17 తేదిన జరిగే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలెకని శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అధికార కెబినెట్ మంత్రులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆయన భార్య రోహిణి వెంట రాగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి నీలెకని సమర్పించారు. సుమారు 5 వేల మంది నామినేషన్ కార్యక్రమానికి హజరైనారు. 'ఓట్ ఫర్ నందన్, ఓట్ ఫర్ కాంగ్రెస్' అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తనకు సంపదతోపాటు బెంగళూరులో లక్షలాది ఉద్యోగాలను ఇన్ఫోసిస్ అందించిందని.. కంపెనీ షేర్ల ద్వారా మరికొంత సంపదను ఉద్యోగులకు అందించిందని నీలెకని తెలిపారు. -
నీలేకని ఆస్తులు రూ. 7,700కోట్లు
నేడు బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానానికి నామినేషన్ సాక్షి, బెంగళూరు: ‘‘రూ. 10 వేలతో ఇన్ఫోసిస్ స్థాపించాం. చిన్న స్థాయి నుంచి విజయవంతమైన కంపెనీగా ఎదగడంతో ఈరోజు నాకు, నాభార్య రోహిణికి కలిపి రూ. 7,700 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి’’ అని కాంగ్రెస్ నేత, ఆధార్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. విజయవంతమైన వ్యాపారవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన నందన్ నీలేకని బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో... అంతకు ఒకరోజు ముందే ఆయన తన ఆస్తుల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. ఐఐటీ పూర్తి చేసినప్పుడు తన జేబులో కేవలం 200 రూపాయలే ఉన్నాయని నీలేకని తెలిపారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో నందన్ నీలేకని కూడా ఒకరన్న విషయం తెలిసిందే. -
నా ట్రాక్ రికార్డే గెలిపిస్తుంది...
సాక్షి, బెంగళూరు : రాజకీయాలతో పాటు ఎన్నికల నిర్వహణలోనూ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని బెంగళూరు దక్షిణ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి, ఐటీ నిపుణుడు నందన్ నీలేకని అన్నారు. శుక్రవారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బెంగళూరును అభివృద్ధి చేయడంతో పాటు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇన్నేళ్ల తన వృత్తి జీవితంలో అప్పగించిన ఏ పనైనా ఐటీ నిపుణుడుగా సమర్థవంతంగా పూర్తి చేస్తానని ప్రజలు నమ్ముతున్నారని, ఆ ట్రాక్ రికార్డే తనను గెలిపిస్తుందని అన్నారు. ఆప్ పార్టీ ద్వారా తనకెలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. ఒక బెంగళూరు వాసిగా తనకు నగరంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఇక ప్రజలను నేరుగా కలవడంతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని, ఇదే సందర్భంలో తన క్యాంపైన్లో భాగంగానే సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన పాత సహోద్యోగి, ప్రస్తుత ఆప్ ఎంపీ అభ్యర్ధి బాలకృష్ణన్‌కు శుభాకాంక్షలు మాత్రమే తాను చెప్పగలనని అన్నారు. -
యూఐడీఏఐ చైర్మన్ పదవికి నీలేకని రాజీనామా
బెంగళూర్:ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని యూఐడీఏఐ (ఆధార్) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడు రోజుల అనంతరం నీలేకని యూఐడీఏఐ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసిన విషయాన్ని స్వయంగా ఆయన గురువారం వెల్లడించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో నీలేకని పోటీకి సిద్ధమవుతున్నక్రమంలోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇందుకుగాను కాంగ్రెస్ ప్రకటించిన తొలిజాబితాలో ఆయనకు లోక్ సభ స్థానాన్ని కేటాయించారు. దక్షిణ బెంగళూర్ లోక్ సభ స్థానం నుంచి నీలేకని పోటీకి దిగుతున్నారు. 2007వ సంవత్సరంలో ఇన్ఫోసిన్ సీఈవోగా పనిచేసిన నీలేకని..అనంతరం ఆధార్ చైర్మన్ గా ఎంపికైయ్యారు. దేశంలోని ప్రజలకు కోట్ల సంఖ్యలో భారతదేశ విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ అందివ్వడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
ఎలక్షన్ వాచ్...
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నందన్ నిలేకని సాక్షి, బెంగళూరు: ‘ఆధార్’ రూపకర్తగా గుర్తింపు పొందిన నందన్ నిలేకని(58) ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దక్షిణ బెంగళూరు లోక్‌సభ స్థానాన్ని నందన్ నిలేకనికి కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. దీంతో ఆదివారం ఉదయం బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిలేకని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిలేకని మీడియాతో మాట్లాడుతూ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ-ఆధార్) చైర్మన్ పదవికి నాలుగు రోజుల క్రితమే రాజీనామా చేసినట్టు చెప్పారు. ఆధార్ ప్రచారంలో తన ఫొటో వాడుకోవడం నిబంధనలకు విరుద్ధమైతే ఎన్నికల కమిషన్ తీసుకునే ఏ చర్యలకైనా తాను కట్టుబడి ఉంటానన్నారు. కాగా, బెంగళూర దక్షిణ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ అనంతకుమార్ బరిలో దిగనున్నారు. బలగాల తరలింపునకు 100 రైళ్లు న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపునకు కేంద్ర హోం శాఖ 100కు పైగా రైళ్లను వినియోగించనుంది. ఎన్నికల షెడ్యూల్‌ను, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని బలగాలను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వేగంగా తరలించేందుకు వీలుగా రైళ్లను అద్దెకు తీసుకోవాలని హోం శాఖ నిర్ణరుుంచింది. ఎన్నికలకు ఆయూ రాష్ట్రాల్లోని బలగాలకు అదనంగా సుమారు 2 లక్షల మంది కేంద్ర పారామిలటరీ సిబ్బందిని మోహరించనున్నట్టు అంచనా. ఈ మేరకు తరలింపు ఏర్పాట్ల కోసం హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఇప్పటికే రైల్వేబోర్డు చైర్మన్‌కు లేఖ రాసినట్టు అధికారవర్గాలు వెల్లడించారుు. డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు: కారత్ సాక్షి, చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకేతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం నాగపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే నుంచి తమకు ఆహ్వానం అందిందని, కానీ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన డీఎంకేతో పొత్తుపెట్టుకోవడం వల్ల ఆ పార్టీకి అండగా నిలిచిన ట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సీపీఎం, సీపీఐలు కలిసి పోటీ చేస్తాయని కారత్ స్పష్టం చేశారు. తమిళనాడులో కాంగ్రెస్‌కు భంగపాటు సాక్షి, చెన్నై: తమిళనాడులో పొత్తుల కోసం కాంగ్రెస్ ఎదురుచూపులు ఫలించలేదు. పొత్తులపై డీఎంకే, డీఎండీకేల కోసం ఎదురు చూసిన కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. 2 జీ స్పెక్ట్రం కేసులో తమ పార్టీకి చెందిన రాజా, కనిమొళిని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని బహిరంగంగానే ఆరోపించిన డీఎంకే అధినేత కరుణానిధి కాంగ్రెస్‌తో పొత్తుకు నిరాసక్తత ప్రదర్శించారు. అయితే కాంగ్రెస్ పెద్దల రాయబారంతో కరుణ మెత్తబడినా ఆయన తనయుడు స్టాలిన్ ససేమిరా అనడంతో పొత్తు ప్రస్తావనే లేకుండా పోయింది. మరోవైపు కాంగ్రెస్ పిలుపును ఖాతరు చేయని డీఎండీకే.. బీజేపీ కూటమిలో చేరింది. దీంతో ఒంటరిపోరుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులను అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. విరాళమిస్తే.. కేజ్రీతో విందు! బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కర్ణాటకపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 15, 16 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విరాళాలు రాబట్టుకునేందుకు 15న బెంగళూరులో కేజ్రీవాల్‌తో డిన్నర్ ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ కర్ణాటక మీడియా సమన్వయకర్త రోహిత్ రంజన్ తెలిపారు. డిన్నర్లో పాల్గొనే ఒక్కో వ్యక్తి రూ.20వేలు చెల్లించాలన్న వార్తలపై ప్రశ్నించగా విధి విధానాలు నిర్ణయించాల్సి ఉందన్నారు. కాగా, ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం రూ.13.41లక్షలను ఖర్చు చేసినట్లు ఆర్టీఐ కింద ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. నరేంద్ర మోడీపై మండిపడ్డారు. పేదలకు 50 వేల ఇళ్లు కట్టిస్తానంటూ హామీ ఇచ్చి 11 ఏళ్లు గడిచినా ఆయన 50 ఇళ్లు కూడా కట్టించలేదని ఆదివారం మథుర సమీపంలోని నౌజీల్ పట్టణంలో జరిగిన సభలో ఎద్దేవా చేశారు. ఎప్పుడూ గెలవనన్ని సీట్లు గెలుస్తాం: అద్వానీ రాంచీ: లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ గెలవనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అతితక్కువ స్థానాలకు పడిపోతుందని జోస్యం చెప్పారు. 1951-52 నుంచి ఎన్నికలన్నింటినీ చూశానని, ఆ అనుభవం మీద ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే తమ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకుంటుందని తెలిపారు. రాజస్థాన్ మాజీ గవర్నర్ కైలాస్పతి మిశ్రా జ్ఞాపకార్థం ఆదివారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అద్వానీ.. కాంగ్రెస్‌కు మూడంకెల సీట్లు దక్కే సూచనలు ఏమీ లేవన్నారు. ‘వారణాసి’పై పార్టీ నిర్ణయిస్తుంది: జోషి సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న వివాదంపై బీజేపీ సీనియర్ నేత, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి తొలిసారి స్పందించారు. ‘నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. నిబద్ధత గల బీజేపీ సైనికుడిలా బోర్డు నిర్ణయాన్ని శిరసావహిస్తా’ అని తెలిపారు. వారణాసి స్థానం నుంచి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నిలబెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జోషి వాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శివసేనతో నవనిర్మాణ సేన ఢీ! ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) శివసేనపై సమర శంఖారావం పూరించింది. శివసేన పోటీచేసే లోక్‌సభ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపడంతోపాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించింది. ఎంఎన్ఎస్ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఏడుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. వీరిలో బాలీవుడ్ నిర్మాత మహేష్ మంజ్రేకర్ కూడా ఉన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరిన నందన్ నీలేకని
న్యూఢిల్లీ: ఆధార్ (యూఐడీఏఐ) చైర్మన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు నిన్న కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాలో చోటు కల్పించారు. నీలేకనికి దక్షిణ బెంగళూర్ లోక్ సభ నియోజకవర్గాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను వెల్లడించిన అనంతరం నీలేకని కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల సమరానికి 194 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు రూపొందించిన ఈ జాబితాలో కొత్తవారికి, యువకులతోపాటు సినీ, ఐటీ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులకూ చోటు దక్కింది. జాబితాలో 28 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు అండమాన్ నికోబార్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 35 శాతం టిక్కెట్లు 50 ఏళ్లలోపు వారికే దక్కాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
194 మంది అభ్యర్థులు సిద్ధం
లోక్ సభ’కు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల జాబితాలో సోనియా, రాహుల్, నీలేకని, క్రికెటర్ మహ్మద్ కైఫ్ 28 మంది మహిళలకు చోటు 35 శాతం టికెట్లు 50 ఏళ్లలోపు వారికే సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమరానికి 194 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు రూపొందించిన ఈ జాబితాలో కొత్తవారికి, యువకులతోపాటు సినీ, ఐటీ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులకూ చోటు దక్కింది. జాబితాలో 28 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు అండమాన్ నికోబార్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 35 శాతం టిక్కెట్లు 50 ఏళ్లలోపు వారికే దక్కాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాబితాలోని ప్రముఖులు... తొలి జాబితాలోని ప్రముఖుల్లో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి, పార్టీ ఉపాధ్యాక్షుడు రాఢహుల్గాంధీ అమేథీ నుంచి పోటీకి దిగుతున్నారు. అలాగే ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ (ససారాం-బీహార్), హోంమంత్రి షిండే (షోలాపూర్), రైల్వే మంత్రి ఖర్గే (గుల్బర్గా), కన్నడ సినీ నటి రమ్య (మాండ్య-కర్ణాటక), నందన్ నిలేకని (బెంగుళూరు సౌత్), జ్యోతిరాధిత్య సింధియా (గుణ-మధ్యప్రదేశ్), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ (చింద్వాడ), సంజయ్‌దత్ సోదరి ప్రియాదత్ (ముంబై నార్త్-సెంట్రల్), కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ (ఫరుఖాబాద్) నుంచి పోటీచేస్తున్నారు. ఒడిశాలోని కటక్ స్థానం నుంచి సినీనటి అపరాజిత మహంతికి చోటు లభించింది. మరో ఒడిస్సా సినీనటుడు విజయ్ మహంతికి భువనేశ్వర్ స్థానం కేటాయించారు. గత వారం పార్టీలో చేరిన మాజీ ప్రధాని వాజ్‌పేయి అన్న కూతురు కరుణా శుక్లాకు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నుంచి అభ్యర్థిత్వం లభించింది. ప్రముఖ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్పూర్ నుంచి పోటీకి దిగుతున్నారు. నీలేకని శనివారమే పార్టీలో లాంఛనంగా చేరారు. -
‘ఆధార్’ కొనసాగుతుంది: నీలేకని
బెంగళూరు: ‘ఆధార్ బహుళ ఉపయోగ వేదిక. అందులో ఎల్పీజీ కూడా ఒకటి. ఆధార్ పాత్ర కొనసాగుతుందనే విశ్వాసముంది’ అని ఆధార్ (యూఐడీఏఐ) చైర్మన్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని అన్నారు. ‘ఐడియాస్ ఫర్ బెంగళూరు’ పేరిట సోమవారం ఓ కాలేజీలో విద్యార్థినుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి నీలేకని పోటీ చేయడం ఖాయమని వినిపిస్తోంది. అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాకపోయినా ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. -
ప్రజా సమస్యలు తెలియని మీకు.. రాజకీయాలెందుకు?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రజల సమస్యలు ఏ మాత్రం తెలియని ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ నందన్ నిలేకని కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమని కేంద్ర మాజీ మంత్రి, బెంగళూరు దక్షిణ ఎంపీ అనంత కుమార్ విమర్శించారు. ఇక్కడి మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ (న్యాయ, పరిశ్రమలు, ఆర్థిక విభాగాలు) సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. గత పదేళ్ల యూపీఏ పాలనలో ధరల పెరుగుదల, అవినీతిపై నిలేకని ఒక్కమాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. అవినీతి, కుంభకోణాలకు పర్యాయ పదంగా మారిన కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడం ఆయనకు తగదని హితవు పలికారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలు వ్యక్తుల మధ్య కాకుండా వివిధ అంశాల ఆధారంగా జరుగుతాయని నిలేకని గుర్తుంచుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు, వంట గ్యాసు ధరలను నియంత్రించడంలో విఫలమైన కాంగ్రెస్‌కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంస్థల జాతీయ నాయకులు నీరజ్ తాయల్, మహేంద్ర పాండే, రజనీష్ గోయెంగా ప్రభృతులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ లో చేరుతాను..లోకసభకు పోటీ చేస్తాను: నందన్ నీలెకని
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలెకని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో తొలిసారి నీలెకని పెదవి విప్పారు. అంతేకాకుండా పార్టీ టికెట్ కేటాయిస్తే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమని ఆయన అన్నారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని నీలెకని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ హెచ్ ఎన్ అనంత కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ బెంగళూరు లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటి ఆఫ్ ఇండియా కార్యక్రమానికికు నిలేకని సేవలందిస్తున్నారు. 'నన్ను నీలెకని కలిసారు.. పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. లోకసభ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు' అని కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి పరమేశ్వర ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. నీలెకని నికర ఆస్తులు విలువ 1.3 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ అక్టోబర్ మాసంలో వెల్లడించింది. -
నందన్, బాలకృష్ణన్ ఢీ?
దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీలో ఒకప్పుడు వారిద్దరూ సహోద్యోగులు. ఉన్నత స్థానాల్లో ఉండగానే వారు సంస్థను వదిలారు. వారిద్దరూ ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారనున్నారు. వారెవరో కాదు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని, మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్. రానున్న లోక్‌సభలో ఎన్నికల్లో వీరిద్దరూ ముఖాముఖి పోటీ పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణన్- ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఇన్ఫీ డెరైక్టర్ పదవిని వదులుకుని ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. 10 రూపాయల రుసుం చెల్లించి ఆప్ సభ్యత్వం తీసుకున్నారు. దేశంలో ఆప్ సృష్టించనున్న విప్లవంలో తాను భాగస్వామి కావాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరినట్టు 48 ఏళ్ల బాలకృష్ణన్ వెల్లడించారు. అయితే ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ తర్వాత ఈ టాప్ పోస్టు రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్న బాలకృష్ణన్(‘బాల’ అని సుపరిచితం) హఠాత్తుగా గుడ్‌బై చెప్పడం అటు పరిశ్రమ వర్గాలతోపాటు, విశ్లేషకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోవైపు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ - ఆధార్ ప్రాజెక్టు) చైర్మన్ నందన్ నిలేకనిపై బాలకృష్ణన్‌ను ఆప్ పోటీ పెట్టే అవకాశముందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దక్షిణ బెంగళూరు లోక్‌సభ స్థానం నుంచి నందన్‌ను పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికి నిలేకని ఒప్పుకున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ నిర్ధారించారు. అటు బాలకృషన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో నిలేకనిపై ఆప్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే నిలేకనిపై పోటీ చేసేందుకు తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరలేదని బాలకృష్ణన్ తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తానని నిలేకనికి మాట ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ విషయంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని బాలకృష్ణన్ అభిప్రాయపడుతున్నారు. ఆప్‌లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఇంకా స్పష్టం కాలేదు. కేజ్రీవాల్‌ను కలిసిన తర్వాత పోటీపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ ప్రజాభిప్రాయం మేరకు కేజ్రీవాల్ ఆదేశిస్తే బాలకృష్ణన్ బరిలో దిగే అవకాశం లేకపోలేదు. ఐటీ దిగ్గజాల పోటీ సమాచారంతో ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది. -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిలేకని రెడీ!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగుపెట్టనున్నారు. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి ఐటీ దిగ్గజం కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన ఆసక్తిని నిలేకని కాంగ్రెస్‌కు తెలియజేయగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ పరిశీలిస్తోంది. నిలేకని పోటీపై ఇప్పటికే ఊహాగానాలు రావడం విదితమే. సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఆయన్ను కాంగ్రెస్ పోటీకి దింపుతుందని వార్తలొచ్చాయి. వీటిపై ఆయనగానీ, కాంగ్రెస్‌గానీ స్పందిచేందుకు ఇప్పటిదాకా ముందుకు రాలేదు. అయితే ఆయన పోటీ విషయాన్ని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ శనివారం నిర్ధారించారు. నిలేకని తనను కలిసి, రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖతను వ్యక్తపరిచారని అన్నారు. ఆయన్ను పోటీచేయించాలా? వద్దా? అనే విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. నిలేకని ప్రస్తుతం భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. -
ఏటా రూ. 20 కోట్లు ఇస్తా: రోహిణి నిలేకని
న్యూఢిల్లీ: ప్రతి ఏడాది రూ. 20 కోట్లు దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించాలనుకుంటున్నట్టు సాఫ్ట్ వేర్ ప్రముఖుడు నందన్ నిలేకని సతీమణి రోహణి నిలేకని వెల్లడించారు. పర్యావరణం, గవర్నెన్స్, సమన్యాయం, పారదర్శకత తదితర అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు ఈ విరాళం అందించనున్నట్టు తెలిపారు. ఇన్పోసిస్‌లో ఉన్న తనవాటాలో కొంతభాగాన్ని అమ్మడం ద్వారా ఇటీవల ఆమె రూ.160 కోట్లు ఆర్జించారు. ఈ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించినట్టు రోహిణి తెలిపారు. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్టు వెల్లడించారు. 'ప్రతి ఏడాది రూ. 15 నుంచి రూ. 20 కోట్లు సేవా కార్యక్రమాలకు ఇవ్వాలనుకుంటున్నా' అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిణి తెలిపారు. 2005 నుంచి దాతృత్వ కార్యక్రమాలకు ఆమె రూ. 215 కోట్లు విరాళంగా ఇచ్చారు. -
గెలుపు గుర్రాల కోసం అప్పుడే వేట
సినిమా తారలంటే ప్రజలుకు క్రేజ్ ఉండటం సహజం. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా గడువు ఉన్నప్పటికీ పాలక కాంగ్రెస్ పార్టీ అప్పుడే కర్ణాటకలో అభ్యర్థుల వేటలో పడింది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలను గెలుచుకుని తీరాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్దేశించిన నేపథ్యంలో గెలుపు గుర్రాల కోసం పార్టీ నాయకులు అన్వేషణను ప్రారంభించారు. ఇందులో భాగంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. భారత విశిష్ట గుర్తింపు సంఖ్య అథారిటీ (యూఐడీఏఐ) చైర్మన్ నందన్ నిలేకనిని బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని పార్టీ యోచిస్తోంది. దాంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఇది కేవలం ఊహాజనితమని నిలేకని కొట్టి పారేస్తున్నప్పటికీ, ఆయనను పోటీ చేయించే విషయంలో రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నిలేకనిని పోటీ చేయిస్తే, ఆ నియోజక వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఐటీ ఓట్లను సొంతం చేసుకోవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. ఆధార్ సంఖ్యను ఇచ్చే యూఐడీఏఐ అధ్యక్షుడుగా నిలేకని సమర్థంగా వ్యవహరించారని కాంగ్రెస్ భావిస్తోంది. 2009 జూన్‌లో ఇన్ఫోసిస్‌ను వీడి యూఐడీఏఐ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను కల్పించిన విషయం తెలిసిందే. ఇక బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజక వర్గం బీజేపీ కంచుకోటగా ఉంది. 1996 నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ అక్కడి నుంచి గెలుస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించుకున్నారని, కనుక పోటీ చేయబోరని వినవస్తోంది. అదే కనుక నిజమైతే మాజీ క్రికెటర్, కేఎస్‌సీఏ అధ్యక్షుడు అనిల్ కుంబ్లేను రంగంలో దించాలని బీజేపీ యోచిస్తోంది. దీనిపై వ్యాఖ్యానించడానికి కుంబ్లే సహాయకులు నిరాకరించారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు పలువురి అభ్యర్థుల పేర్లను సూచించడానికి కేపీసీసీ ఇదివరకే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 20 నియోజక వర్గాలకు ఆ కమిటీ కొందరి పేర్లను ప్రతిపాదించింది. అలాగే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పలువురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో నటుడు సుదీప్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇటీవల ఆయన నివాసంలో కలుసుకున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ ముగించుకుని వచ్చిన సుదీప్ సీఎంతో సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రే ఆయనను ఆహ్వానించారని కూడా వినవస్తోంది. శాసన సభ ఎన్నికల సందర్భంగా సిద్ధరామయ్య స్వయంగా సుదీప్ నివాసానికి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరారు. అప్పట్లో అతను ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుదీప్ ఆసక్తి చూపారా, లేదా అనేది తెలియరాలేదు. ఇప్పటికే కన్నడ నటీ నటులు ...రాజకీయాల్లో వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు అంబరీష్ ....తాజాగా రమ్యశ్రీ కాంగ్రెస్ ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. -
ఐదు ప్రాంతీయ భాషల్లో ‘ఆధార్’ వెబ్సైట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరులకు ఆధార్ కార్డులను అందజేస్తున్న విశిష్ట గుర్తింపు కార్డు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తన వెబ్‌సైట్‌ను మరో ఐదు ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇంగ్లిష్, హిందీలతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో రూపొందించిన ఆధార్ (www.uidai.gov.in) వెబ్సైట్ ను శుక్రవారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే రెండో దశలో తెలుగుతోపాటు అస్సామీ, మలయాళీ, ఒరియా, పంజాబీ భాషల్లో వైబ్‌సైట్‌ను తీసుకురానున్నట్లు చెప్పారు. బెంగళూరులో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా యూఐడీఏఐ చైర్మన్ నందన్ నీలేకని మాట్లాడుతూ...ఆధార్‌కార్డును ప్రస్తుతం 13 భాషల్లో అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 35 కోట్ల ఆధార్ కార్డులను పంపిణీ చేసినట్లు చెప్పారు.