యూఐడీఏఐ చైర్మన్ పదవికి నీలేకని రాజీనామా
బెంగళూర్:ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ నందన్ నిలేకని యూఐడీఏఐ (ఆధార్) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడు రోజుల అనంతరం నీలేకని యూఐడీఏఐ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసిన విషయాన్ని స్వయంగా ఆయన గురువారం వెల్లడించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో నీలేకని పోటీకి సిద్ధమవుతున్నక్రమంలోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఇందుకుగాను కాంగ్రెస్ ప్రకటించిన తొలిజాబితాలో ఆయనకు లోక్ సభ స్థానాన్ని కేటాయించారు. దక్షిణ బెంగళూర్ లోక్ సభ స్థానం నుంచి నీలేకని పోటీకి దిగుతున్నారు.
2007వ సంవత్సరంలో ఇన్ఫోసిన్ సీఈవోగా పనిచేసిన నీలేకని..అనంతరం ఆధార్ చైర్మన్ గా ఎంపికైయ్యారు. దేశంలోని ప్రజలకు కోట్ల సంఖ్యలో భారతదేశ విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ అందివ్వడంలో ఆయన విశేషంగా కృషి చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.