కాంగ్రెస్ లో చేరుతాను..లోకసభకు పోటీ చేస్తాను: నందన్ నీలెకని
కాంగ్రెస్ లో చేరుతాను..లోకసభకు పోటీ చేస్తాను: నందన్ నీలెకని
Published Fri, Jan 10 2014 10:06 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలెకని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో తొలిసారి నీలెకని పెదవి విప్పారు. అంతేకాకుండా పార్టీ టికెట్ కేటాయిస్తే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమని ఆయన అన్నారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని నీలెకని అన్నారు.
ప్రస్తుతం బీజేపీ ఎంపీ హెచ్ ఎన్ అనంత కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ బెంగళూరు లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటి ఆఫ్ ఇండియా కార్యక్రమానికికు నిలేకని సేవలందిస్తున్నారు.
'నన్ను నీలెకని కలిసారు.. పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారు. లోకసభ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు' అని కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి పరమేశ్వర ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. నీలెకని నికర ఆస్తులు విలువ 1.3 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ అక్టోబర్ మాసంలో వెల్లడించింది.
Advertisement