నందన్ నీలేకని అనగానే.. ఆధార్ సృష్టికర్త అని వెంటనే గుర్తొస్తుంది. కానీ ఈయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులలో ఒకరు కూడా. ఇటీవల ఈయన రోస్లాన్‌స్కీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి వెల్లడించారు.
నందన్ నీలేకని 1978లో మొదటిసారి ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కలిసిన తరువాత తనలో మార్పు వచ్చిందని చెప్పారు. అంతకంటే ముందు ఐఐటీ బాంబేలో చేరడానికి తన తండ్రిని ఎదిరించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. నాన్న నన్ను కెమికల్ ఇంజినీరింగ్‌లో చేరమని చెబితే.. నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో చేరాను. అప్పట్లో అది ఓ చిన్నపాటి తిరుగుబాటు చర్య అని అన్నారు.
నేను చదువుకునే రోజుల్లో ఇంజినీర్ లేదా డాక్టర్ అనే రెండు ఉద్యోగాలను మాత్రమే తల్లిందండ్రులు పిల్లలకు చెప్పేవారు. నేను డాక్టర్ కావాలని కోరుకోలేదు, అందుకే ఇంజినీర్ అయ్యాను అని నందన్ నీలేకని చెప్పుకొచ్చారు. 1978లో ఐఐటీ బాంబే నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ పట్టా పొందాను. ఆ తరువాత గ్రేడ్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్ష రాయ్లకున్నాను, కానీ ఆరోజు అస్వస్థతకు గురవ్వడం వల్ల పరీక్ష మిస్ అయ్యాను. తరువాత ఏం చేయాలో తోచలేదు.
ఆ సమయంలో కొత్త టెక్నాలజీని, మినీ కంప్యూటర్లను ఉపయోగిస్తున్న ఓ చిన్న సంస్థ పాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ గురించి విన్నాను. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సంస్థకు సాఫ్ట్‌వేర్ హెడ్‌గా ఉన్న నారాయణమూర్తి ఆఫీసుకు వెళ్ళాను. ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, అదృష్టవశాత్తు వాటన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చాను. ఇదే నా జీవితాన్ని మలుపుతిప్పిన అసాధారణ జాబ్ ఆఫర్ అని నీలేకని అన్నారు.
నారాయణమూర్తి ఆకర్షణీయంగా, చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేవారాని నీలేకని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి అని ఆయన నారాయణమూర్తిని కొనియాడారు. ఆయన అడిగితే ఏమైనా చేస్తాను. కొండపై నుంచి దూకమంటే.. తప్పకుండా దూకుతాను అని నీలేకని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. 25ఏళ్ల వయసులో నా లీడర్ నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్ స్థాపించమని గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి: అలా ఆమె మనసు గెలుచుకున్నా.. 30 ఏళ్లకే మాటపై నిలబడ్డా: ఎన్‌వీడియా సీఈఓ
ఇన్ఫోసిస్ ప్రస్తావన గురించి మాత్రమే కాకుండా.. ఆధార్‌ను రూపొందించే తన ప్రయాణాన్ని కూడా వివరించారు. ఆధార్‌లో చేరిన ఒక నెలలోపే, నేను వైదొలిగే సమయానికి మేము 600 మిలియన్ల ఐడీలను సాధిస్తామని ప్రకటించాను. ఇది చాలా పెద్ద లక్ష్యం, ప్రజలు నన్ను వెర్రివాడిగా భావించారు. అయితే ఈ లక్ష్యం నా జట్టును ఉత్తేజపరిచింది. ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల మిగతావన్నీ కనుమరుగయ్యేలా చేశాయని నందన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment