
బెంగళూరు : పట్టభద్రులకు శుభవార్త ! భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు ఇన్ఫోసిస్ రెడీ అయ్యింది. కోవిడ్ నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకోవడంతో కంపెనీ ఆర్డర్లు పెరిగాయి. దీంతో కొత్తగా వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో నందన్ నీలేకని ప్రకటన చేశారు.
కోవిడ్ ఎఫెక్ట్
కోవిడ్ ఎఫెక్ట్, ఆటోమేషన్ కారణంగా వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పోయాయి. ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనైంది. అయితే క్రమంగా మార్కెట్ పుంజుకుంటోంది. కోవిడ్ ఆంక్షలు, లాక్‌డౌన్ , ప్రయాణ నిషేధాలు తదితర కారణాలతో విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కష్టంగా మారింది. అయితే ఇన్ఫోసిస్ నుంచి భారీ రిక్రూట్‌మెంట్ ప్రకటన రావడంతో ఐటీ ప్రొఫెనల్స్‌కి ఊరట లభించింది.
ఇన్ఫోసిస్‌తో మొదలు
ఇన్ఫోసిస్‌కి ఇటీవల భారీగా ఆర్డర్లు రావడంతో రిక్రూట్‌మెంట్ మొదలు పెట్టింది. 2022 నాటికి అమెరికా కేంద్రంగా 25,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ 40వ వార్సికోత్సవ సమావేశంలో నందన్ నీలేకని చెప్పారు. అంతేకాదు ఇటీవలే ఇండియాలో దాదాపు 19,230 మందిని సంస్థలోకి తీసుకున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం కెనాడాలో ఇన్ఫోసిస్‌కి 4,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య రెట్టింపు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment