
న్యూఢిల్లీ: ఆర్థిక వివరాల డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం అయిన అకౌంట్ అగ్రిగేటర్ (ఎఎ) నెట్‌వర్క్‌తో వ్యాపారాలను అనుసంధానించడం ద్వారా చిన్న వ్యాపారవేత్తలకు రుణలభ్యత సులభతరమవుతుందని ఐటీ సంస్థ ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తెలిపారు. దీనితో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు కూడా ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
’జీఎస్‌వీ + ఎమెరిటస్ ఇండియా సదస్సు’లో పాల్గొన్న సందర్భంగా నీలేకని ఈ విషయాలు చెప్పారు. వ్యక్తులు .. ఒక ఆర్థిక సంస్థ దగ్గరున్న తమ వివరాలను వేరే సంస్థలతో సురక్షితంగా పంచుకునేందుకు ఎఎ నెట్‌వర్క్ ఉపయోగపడుతుంది. ఇది ఆర్‌బీఐ నియంత్రణలో ఉంటుంది.
(ఇదీ చదవండి: లిథియం బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.37,260 కోట్లు కావాలంట!)