ఐదు ప్రాంతీయ భాషల్లో ‘ఆధార్’ వెబ్‌సైట్ | Aadhar website now in 5 regional languages | Sakshi
Sakshi News home page

ఐదు ప్రాంతీయ భాషల్లో ‘ఆధార్’ వెబ్‌సైట్

Published Sat, Sep 21 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

Aadhar website now in 5 regional languages

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పౌరులకు ఆధార్ కార్డులను అందజేస్తున్న విశిష్ట గుర్తింపు కార్డు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తన వెబ్‌సైట్‌ను మరో ఐదు ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చింది. ప్రజల సౌకర్యార్థం ఇంగ్లిష్, హిందీలతో పాటు బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళ భాషల్లో రూపొందించిన ఆధార్ (www.uidai.gov.in) వెబ్‌సైట్ ను శుక్రవారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. త్వరలో ప్రారంభమయ్యే రెండో దశలో తెలుగుతోపాటు అస్సామీ, మలయాళీ, ఒరియా, పంజాబీ భాషల్లో వైబ్‌సైట్‌ను తీసుకురానున్నట్లు చెప్పారు. బెంగళూరులో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా యూఐడీఏఐ చైర్మన్ నందన్ నీలేకని మాట్లాడుతూ...ఆధార్‌కార్డును ప్రస్తుతం 13 భాషల్లో అందజేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 35 కోట్ల ఆధార్ కార్డులను పంపిణీ చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement