చిన్న, మధ్య స్థాయి సంస్థలకూ ఇ-కామర్స్ విపణిలో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఫ్యాషన్ సంస్థలు ఎక్కువగా ఓఎన్‌డీసీ వేదికను వినియోగించుకుంటుండగా, కొత్తగా రవాణా రంగ సంస్థలూ ఈ వేదికపైకి వస్తున్నాయి.
తాజాగా తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్‌డీసీలో ఉబర్ చేరింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతదేశంలో ఇంటర్‌సిటీ బస్సు, మెట్రో రైలు టిక్కెట్ బుకింగ్‌ల వంటి ఆఫర్‌లను ఉబెర్ కల్పించనుంది. ఈ కంపెనీ గ్లోబల్ సీఈఓ డారా ఖోష్క్రోవ్సహి ‘పెద్ద మొత్తంలో టెక్నాలజీని నిర్మించడం’ అనే అంశంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకనితో గురువారం చర్చించారు. ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంపెనీలు, ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలని తెలిపారు.
టెక్నాలజీ కంపెనీగా ఓపెన్ సోర్స్ సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఉబర్ ఎప్పుడూ ముందుంటుందని డారా చెప్పారు. ఉబర్‌కు ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం ఏమిటని నందన్ నిలేకని అడగగా, ఇండియా అత్యంత క్లిష్టమైన మార్కెట్ అని డారా అన్నారు. ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా దేనికీ డబ్బు చెల్లించడానికి ఇష్టపడరని, ఇక్కడ సక్సెస్ అయ్యామంటే ఎక్కడైనా విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. లో–కాస్ట్ సర్వీస్‌లను విస్తరిస్తామని డారా చెప్పారు.
ఏమిటీ ఓఎన్‌డీసీ?
దేశీయ ఇ-కామర్స్ విపణిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌దే హవా. కొవిడ్ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణ షాపుల భవితవ్యం అనిశ్చితిలో పడుతోందని గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్‌లైన్‌లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఉండాలని సంకల్పించింది. ప్రధాని మోదీ సూచన మేరకు నందన్ నిలేకని, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్‌డీసీ పేరిట లాభాపేక్షలేని ఈ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు.
ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment