Uber Cab
-
ఈ క్యాబ్ ఎక్కితే దిగరు..!
సాధారణంగా మీరు క్యాబ్‌ని (cab) బుక్ చేసుకుని ఎక్కగానే ఎంత త్వరగా గమ్యస్థానాన్ని చేరుకుంటామా అని ఆలోచిస్తారు. కానీ ఢిల్లీలోని అబ్దుల్ ఖదీర్ ఉబెర్ (Uber) క్యాబ్లోకి అడుగు పెడితే రైడ్ ముగియాలని కోరుకోకపోవచ్చు! ఎందుకంటే స్నాక్స్, నీరు, వై-ఫై, పెర్ఫ్యూమ్లు, మందులు, హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్లు, టిష్యూలు, శానిటైజర్లు, యాష్‌ట్రే ఒకటేమిటి అన్నీ సౌకర్యాలు ఈ క్యాబ్‌లోనే ఉన్నాయి. దీనిపై రెడ్డిట్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది.అబ్దుల్ ఖదీర్ కేవలం రైడ్ మాత్రమే అందించడం లేదు. బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో (business class flight) ఉండే లాంటి లగ్జరీ అనుభూతిని ఇస్తున్నాడు. పైగా క్యాబ్‌లో అతడు అందిస్తున్న ప్రతిదీ ఉచితం. ఇది సాధారణ టాక్సీ కంటే విలాసవంతమైన లాంజ్ లాగా అనిపిస్తుంది. తన క్యాబ్ ఫోటోను షేర్ చేసిన ఓ ప్రయాణికుడు.. "విమానాల కంటే క్యాబ్ సౌకర్యాలు మెరుగ్గా దొరికాయి!" అని చమత్కరించాడు.క్యాబ్‌లో ప్రయాణికులకు ఖదీర్ అందిస్తున్న విశిష్ట కస్టమర్ సేవలపై సోషల్ మీడియా యూజర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల పట్ల ఖదీర్‌కు ఉన్న శ్రద్ధ అతనిని ఎంతగానో పాపులర్ చేసింది. ఎప్పుడు క్యాబ్ అవసరం వచ్చినా అతని క్యాబ్‌నే బుక్ చేసుకుంటామంటున్నారు చాలా మంది. కొంతమంది అయితే ఖదీర్ అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా చెల్లిస్తామని కూడా చెబుతన్నారు. -
ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ చార్జీలా?
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాల్లో క్యాబ్‌ల కోసం ఓలా లేదా ఉబర్‌లో బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ బుకింగ్ కోసం ఉపయోగించిన ఫోన్ మోడల్‌ను బట్టి చార్జీలు మారుతుంటాయా? మారుతున్నాయనే చెబుతున్నారు. ఖరీదైన ఫోన్ నుంచి బుక్ చేస్తే ఎక్కువ చార్జీ, చౌకరకం ఫోన్ నుంచి బుక్ చేస్తే తక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంబంధిత యాప్‌ల్లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓలా, ఉబర్ల నిర్వాకంపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) స్పందించింది. ఓలా, ఉబర్‌లకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒకరకంగా, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి బుక్ చేస్తే మరోరకంగా చార్జీలు విధిస్తుండడం నిజమేనా? అని ప్రశ్నించింది. ఒకే రకమైన సేవకు రెండు భిన్నమైన చార్జీలా? అని నిలదీసింది. చార్జీల విధిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. వినియోగదారుల నువంచి చార్జీల వసూలులో పూర్తి పారదర్శకత ఉండాలని సీసీపీఏ స్పష్టంచేసింది. ఒకేచోటు నుంచి ఒకే గమ్యస్థానానికి రెండు రకాల ఫోన్ల నుంచి రెండు క్యాబ్‌లు బుక్ చేస్తే రెండు రకాల చార్జీలు వసూలు చేసినట్లు ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్‌లపై విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు. -
ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్‌కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్‌కు రూ.342.47 చూపించింది.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్లో కంటే.. నా యాపిల్ ఐఫోన్లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్‌ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటుగతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!ఈ కామర్స్ సైట్లలో..సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
ఇక ఉబర్‌లో ‘శికారా’ల బుకింగ్!
ఆన్లైన్ రవాణా సేవలందిస్తున్న ఉబర్ కొత్తగా జల రవాణా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రోడ్లపై వాహనాలను బుక్ చేసుకున్నట్లే, ఇకపై నీటిలో బోట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఆసియాలో తొలిసారిగా జల రవాణా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో శికారా(సంప్రదాయ చెక్క పడవలు) బుకింగ్‌ను పరిచయం చేసింది. శ్రీనగర్‌లోని ప్రముఖ దాల్ సరస్సులో ప్రయాణించే ఈ శికారా పడవలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సరస్సు చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. శతాబ్దాలుగా సరస్సులో రవాణా, విశ్రాంతి కోసం శికారాలను ఉపయోగిస్తున్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల‘సాంకేతికత, సంప్రదాయాన్ని మిళితం చేసి ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా శికారా రైడ్ అందించి వారికి మరుపురాని అనుభవాన్ని సొంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కశ్మీర్‌లోని ఉత్కంఠభరిత ప్రకృతి దృశ్యాన్ని మరింత మందికి చేరువ చేయడం, పర్యాటకాన్ని మెరుగుపరిచే ఈ ఐకానిక్ అనుభవాన్ని సృష్టించడం గర్వకారణం’ అని ఊబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ తెలిపారు. ఉబర్ వినియోగదారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఈ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. శికారా రైడ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఉబర్ వేదికగా 15 రోజుల ముందు నుంచి బుక్ చేసుకునే వీలుంది. దాల్ లేక్‌లో దాదాపు 4,000 శికారాలు ఉన్నట్లు అంచనా. -
ఏసీ ఆన్ చేయమంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..?
ఉబర్ క్యాబ్ బుక్ చేసి ఎక్కాక ఏసీ ఆన్ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రెడ్డిట్లోని ‘నెర్డి-ఒజెడ్-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్‌ను రద్దు చేసుకోండి’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్‌లు వేయడం, సడన్ యాక్సిలరేషన్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్ సెంటర్ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్‌కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్‌కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్‌కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.ఇదీ చదవండి: ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలుఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్ లెవల్లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. -
ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,470 కోట్లు చెల్లించనున్న ప్రముఖ కంపెనీ.. ఎందుకంటే..
ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ తన ట్యాక్సీ డ్రైవర్లకు ఏకంగా రూ.1,470 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆస్ట్రేలియాలో చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి పరిష్కారం లభించింది. ఉబర్ తమ దేశంలోకి ప్రవేశించడంతో ఉపాధి కోల్పోయామంటూ దాదాపు 8,000 మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతోంది. పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వచ్చింది. తాజాగా ఈ కేసు విక్టోరియా సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. కానీ, అప్పటికే ఉబర్ డ్రైవర్లతో పరిహార ఒప్పందం కుదుర్చుకుంది. ఉబర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలందిస్తోంది. 2012లో ఆస్ట్రేలియాలోకి ప్రవేశించిన ఉబర్ వేగంగా సేవలను విస్తరించినట్లు న్యాయవాది మైఖేల్ తెలిపారు. దీనివల్ల అప్పటికే స్థానికంగా అద్దె ట్యాక్సీలను నడిపే చాలా మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఉబర్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. డ్రైవర్ల డిమాండ్‌కు సామాన్య పౌరులు సైతం మద్దతు తెలిపినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఉబర్ స్పందిస్తూ ప్రపంచంలో కంపెనీ ఉబర్ సేవలు ప్రారంభించినపుడు ఆయా దేశాల్లో నియంత్రణ నిబంధనలులేవు. ఆస్ట్రేలియాలో ఉబర్ కార్యకలాపాల వల్ల అక్కడి రవాణా వ్యవస్థలు మెరుగైన మార్పులు వచ్చాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దాంతో స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. ఆదేశ నిబంధనల ప్రకారం..2018 నుంచి వివిధ ప్రాంతాల్లోని వారితో పరిహార ఒప్పందాలు చేసుకుంటున్నామన్నారు. ఇదీ చదవండి: మరో ‘కేజీఎఫ్’ ఆనవాలు.. ఎక్కడో తెలుసా..? -
‘ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం అదే..’ ఉబర్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చిన్న, మధ్య స్థాయి సంస్థలకూ ఇ-కామర్స్ విపణిలో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ఇటీవలే తెలిపింది. ప్రస్తుతం నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఫ్యాషన్ సంస్థలు ఎక్కువగా ఓఎన్డీసీ వేదికను వినియోగించుకుంటుండగా, కొత్తగా రవాణా రంగ సంస్థలూ ఈ వేదికపైకి వస్తున్నాయి. తాజాగా తమ సర్వీస్‌లను విస్తరించేందుకు ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఓఎన్డీసీలో ఉబర్ చేరింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా భారతదేశంలో ఇంటర్సిటీ బస్సు, మెట్రో రైలు టిక్కెట్ బుకింగ్‌ల వంటి ఆఫర్లను ఉబెర్ కల్పించనుంది. ఈ కంపెనీ గ్లోబల్ సీఈఓ డారా ఖోష్క్రోవ్సహి ‘పెద్ద మొత్తంలో టెక్నాలజీని నిర్మించడం’ అనే అంశంపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకనితో గురువారం చర్చించారు. ఇండియా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంపెనీలు, ప్రభుత్వాలు చాలా నేర్చుకోవాలని తెలిపారు. టెక్నాలజీ కంపెనీగా ఓపెన్ సోర్స్ సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు ఉబర్ ఎప్పుడూ ముందుంటుందని డారా చెప్పారు. ఉబర్‌కు ఇండియాలో ఆసక్తి కలిగించిన అంశం ఏమిటని నందన్ నిలేకని అడగగా, ఇండియా అత్యంత క్లిష్టమైన మార్కెట్ అని డారా అన్నారు. ఇండియన్ కస్టమర్లు ఎక్కువగా దేనికీ డబ్బు చెల్లించడానికి ఇష్టపడరని, ఇక్కడ సక్సెస్ అయ్యామంటే ఎక్కడైనా విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. లో–కాస్ట్ సర్వీస్‌లను విస్తరిస్తామని డారా చెప్పారు. ఏమిటీ ఓఎన్డీసీ? దేశీయ ఇ-కామర్స్ విపణిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌దే హవా. కొవిడ్ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరాణ షాపుల భవితవ్యం అనిశ్చితిలో పడుతోందని గుర్తించిన కేంద్రం.. చిన్న దుకాణదారులు కూడా ఆన్లైన్లో విక్రయాలు నిర్వహించడానికి వీలుగా ఓ వేదిక ఉండాలని సంకల్పించింది. ప్రధాని మోదీ సూచన మేరకు నందన్ నిలేకని, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం ఓఎన్డీసీ పేరిట లాభాపేక్షలేని ఈ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు. ఇదీ చదవండి: మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. -
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్‌కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్‌లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్‌తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్‌కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్‌లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్‌వర్కర్స్ అసోసియేషన్‌కు చెందిన డెలివరీబాయ్‌లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్‌డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్‌లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్‌లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
నైట్‌లో ముంబయి మొదటిస్థానం.. వీకెండ్లో..
ట్యాక్సీ సర్వీసులను అందించే ఉబర్ సంస్థ 2023లో చేసిన పర్యటనలకు సంబంధించి ఆసక్తికర విషయాలను విడుదల చేసింది. ఈ ఏడాది దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, పుణెల్లో ఎక్కువ మంది రైడ్ బుక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. రాత్రి సమయంలో వచ్చిన బుకింగ్‌ల విషయానికొస్తే.. ముంబయి మొదటిస్థానంలో నిలిచింది. వీకెండ్లో మాత్రం కోల్‌కతాలోని ప్రజలు ఎక్కువగా బుక్ చేసుకున్నారు. 2023 సంవత్సరానికిగాను ఉబర్ రైడ్స్ రికార్డు స్థాయిలో 6800 కోట్ల కిలోమీటర్లలో సేవలందించిందని తెలిపింది. ఇది దేశంలోని మొత్తం రోడ్ నెట్‌వర్క్‌లో వెయ్యి రెట్లు అని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఉబెర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు రైడ్స్‌లో ఎక్కువ భాగం సాయంత్రం 6-7 గంటల మధ్య షెడ్యూల్ చేస్తున్నవే. శనివారం ఉబెర్ ఫేవరెట్ డే. ఆ రోజే అధికంగా బుకింగ్స్ వస్తున్నాయి. రైడ్ బుక్ చేసిన ట్రిప్‌ల సంఖ్య పరంగా దసరా, క్రిస్మస్ అత్యంత ప్రజాదరణ పొందిన రోజులు. ఒక్క డిసెంబర్లోనే అత్యధిక సంఖ్యలో రైడ్లు బుక్ అయినట్లు సంస్థ తెలిపింది. విమానాశ్రయాలకు అధిక సంఖ్యలో ఉబర్ ట్రిప్‌లు ఉదయం 4-5 గంటల మధ్య బుక్ అయ్యాయి. -
ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు..
ఆధునిక కాలంలో ఓలా, ఉబర్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. కావున ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. గమ్యాన్ని చేరుతున్నారు. అయితే ప్రయాణంలో బోర్ ఫీల్ కాకుండా ప్యాసింజర్లు మొబైల్ వినియోగించడం వంటివి చేస్తారు. కానీ ఇటీవల ఒక ఉబర్ డ్రైవర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు బోర్ ఫీల్ కాకుండా చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్స్ (ట్విటర్) వేదికగా విడుదలైన వీడియోలో ఉబర్ డ్రైవర్ ప్రయాణికుల కోసం వెనుక ఉన్న వారికోసం ముందు సీటు వెనుక భాగంలో గేమ్ ఆడుకోవడానికి అనుకూలంగా ఒక స్క్రీన్ అమర్చాడు. దీంతో ఆ ట్యాక్సీ ఎక్కిన ప్యాసింజర్లకు విసుగు రాకుండా ఉంటుంది. ఈ ఐడియా చాలామందిని ఫిదా చేస్తోంది. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ సమయం తెలియాకుండానే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటి వరకు 1.7 మిలియన్ల మంది వీక్షించారు, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ప్రయాణికులను ఎంటర్టైన్ చేయడానికి ఉబర్ డ్రైవర్ కొత్తగా ఆలోచించి అందరిని ఆకట్టుకుంటున్నాడు. -
షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?
ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్న చిటికెలో బుక్ చేసుకుని గమ్యాలను చేరుకుంటున్నారు. అయితే ఈ ట్యాక్సీ సర్వీసులలోని చెల్లింపుల గురించి కొంత సందేహాలు ఒకప్పటి నుంచి ఉన్నాయి. ఈ సమస్యపైన బెల్జియన్ వార్తాపత్రిక ఇటీవల కొన్ని నిజాలను బయటపెట్టింది. ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడించింది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది. ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ. 1498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ. 1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది. (ఇదీ చదవండి: KTM 390 Adventure X: తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు) గతంలో కూడా ఉబర్ సంస్థ మీద ఇలాంటి ఆరోపణలే వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఉబెర్ మాజీ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్, కీత్ చెన్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించిదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఉబర్ మాత్రం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఆధారంగా డబ్బు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. -
Uber Ride: 90 రోజుల ముందే ఉబర్ రైడ్ బుక్ చేసుకోండి!
ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ కంపెనీ 'ఉబర్' (Uber) వినియోగదారుల కోసం మరో గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇది తప్పకుండా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. ఇకపై ఉబర్ సర్వీస్ కోసం 90 రోజులకు ముందే బుక్ చేసుకోవచ్చు. తద్వారా ప్రయాణికులకు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన టెన్షన్ దూరమవుతుంది. (ఇదీ చదవండి: Reset SBI ATM PIN: ఇంటినుంచే ఏటీఎమ్ పిన్ మార్చుకోండి) ఎయిర్ పోర్ట్‌కి వెళ్లేవారు లేదా వచ్చేవారికి ఇప్పటికే ప్రధాన ఎయిర్ పోర్టులలో ఉబర్ ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక పికప్ పాయింట్స్, పార్కింగ్ ఏరియాలను కలిగి ఉండటం వల్ల వినియోగదారుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మూడు నెలలకు ముందే (90 రోజులు) బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి. కేవలం ఎయిర్ పోర్ట్ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఇతర ప్రయాణాలకు కూడా ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకుంటే ఉబర్ డ్రైవర్లు కూడా ముందుగానే బుకింగ్ ప్లాన్ సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మనదేశంలో కొన్ని ఎయిర్ పోర్టులలో ఉబర్ సర్వీస్ మరింత సులువుగా ఉంటుంది. దీని ద్వారా స్టెప్ బై స్టెప్ గైడెన్స్‌ను ఒక యాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతానికి అలాంటి సదుపాయం దేశంలోని 13 ప్రధాన విమానాశ్రయాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
కస్టమర్‌కు షాకిచ్చిన ఉబర్..
ఇటీవల ఢిల్లీలో ఓ కస్టమర్‌కు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ షాక్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల రైడ్‌కి రూ.1,500 లకుపైగా వసూలు చేసింది. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో తప్పిదం గ్రహించిన కంపెనీ అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించింది. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్! ఈ బ్యాంకులో వడ్డీరేట్లు పెరిగాయ్.. టైమ్స్‌నౌ కథనం ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసానికి ఓ మహిళ రైడ్ బుక్ చేసుకున్నారు. ఆమె ప్రయాణం పూర్తయి గమ్య స్థానం చేరుకోగానే ఉబర్ యాప్‌లో చూపిన ప్రారంభ మొత్తం నుంచి రూ.1,525కి మారింది. ఆ మొత్తాన్ని చెల్లించేసిన ఆమె తర్వాత కంపెనీని సంప్రదించి దీనిపై ఫిర్యాదు చేశారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లో లోపం వల్లే ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని ఉబర్ ప్రతినిధి ఆమెకు తెలిపారు. ఆమె సరిహద్దు దాటనప్పటికీ ఉత్తరప్రదేశ్ అంతర్రాష్ట్ర ఛార్జీ వసూలు చేసినట్లు తేలింది. బిల్లులో మున్సిపల్ కార్పొరేషన్ పన్ను కూడా రెండుసార్లు చేరింది. దీంతో ఇంత మొత్తంలో బిల్లు వచ్చింది. బిల్లింగ్‌లో లోపాన్ని గుర్తించిన కంపెనీ బాధితురాలికి డబ్బును తిరిగి చెల్లించింది. ఉబెర్ క్యాష్ వాలెట్లో రూ.900 రీఫండ్ చేసింది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణించేవారి కోసం ఉబర్ తమ సేవల్ని మెరుగుపర్చింది. ఉబర్ రిజర్, పికప్ డైరెక్షన్స్, వాకింగ్ ఈటీఏస్ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఉబర్‌లో కస్టమర్లు ఇప్పుడు 90 రోజుల ముందుగానే రైడ్ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. -
ఉబర్‌లో కారు బుక్ చేసుకొని వెళ్లి బ్యాంకు దోచేశాడు.. కానీ చివరకు..
వాషింగ్టన్: అమెరికాలో ఓ దొంగ సినీఫక్కీలో చోరీ చేశాడు. దర్జాగా ఉబర్‌లో కారు బుక్ చేసుకుని వెళ్లి బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడు. అనంతరం అదే కారులో ఇంటికి తిరిగివెళ్లాడు. ఇంత జరిగినా డ్రైవర్‌కు దొంగతనం గురించి అసలు తెలియకపోవడం గమనార్హం. పోలీసులు వచ్చాకే అతనికి అసలు విషయం తెలిసి కంగుతిన్నాడు. అమెరికా మిచిగాన్ సౌత్‌ఫీల్డ్‌లో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. చోరీకి పాల్పడిన వ్యక్తి పేరు జెసన్ క్రిస్ట్మస్(42). ప్లాన్ ప్రకారం కారు బుక్ చేసుకున్న ఇతడు బ్యాంకులో పని ఉందని డ్రైవర్‌ను హంటింగ్టన్ బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు. తాను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పాడు. దీంతో డ్రైవర్ బ్యాంకు బయటే ఉన్నాడు. అనంతరం తుపాకీతో బ్యాంకు లోపలికి వెళ్లిన జేసన్.. అధికారులను బెదిరించి డబ్బు తీసుకున్నాడు. తర్వాత హుందాగా తిరిగి కారు వద్దకు వచ్చాడు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు. దీంతో అతడు జేసన్‌న తిరిగి తన ఫ్లాట్‌లో డ్రాప్ చేశాడు. వెంటనే పట్టుకున్న పోలీసులు.. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జేసన్ ఫ్లాట్‌కు వెళ్లారు. అతడికి బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. కానీ దొంగ దస్తులపై ఎరుపు రంగు కన్పించడంతో ఎవరైనా షూట్ చేశారా? అని పోలీసులు అడిగారు. అలాంటిదేం లేదని, అది రంగు అని.. బ్యాంకు నుంచే తీసుకువచ్చినట్లు నిందితుడు చెప్పాడు. మరోవైపు డ్రైవర్‌ను కూడా అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను చూసి అతడు షాక్ అయ్యాడు. తనకు ఈ దొంగతనం గురించి ఏమీ తెలియదని వాపోయాడు. పోలీసులు కూడా అతనికి నిజంగానే సంబంధం లేదని నిర్ధరించుకున్నారు. ప్యాసెంజర్ గురించి వివరాలు తెలుసుకోకుండా రైడ్‌కెలా తీసుకెళ్లావని ప్రశ్నించారు. మరోసారి ఎవరైనా అనుమానంగా కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ తరహా దొంగతనాలు నగరంలో జరగలేదని పోలీసులు చెప్పారు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి దోపిడీలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బంధువులు, కుటుంబసభ్యులకు ఖరీదైన బహుమతులు, వస్తువులు ఇవ్వడానికే జేసన్ క్రిస్టియన్ ఈ దోపిడీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లకు కూడా ఎర్ర రంగు అంటుకొని ఉంది. చదవండి: ఖరీదైన రెస్టారెంట్.. బిల్లుచూసి కళ్లు తేలేసిన నెటిజన్లు.. ఏకంగా రూ.1.3 కోట్లు! -
ఓలా, ఉబెర్‌కు ఊహించని దెబ్బ, దూసుకుపోతున్న ఆ యాప్
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే ఓలా, ఉబెర్, ర్యాపిడో ఊహించని దెబ్బపడింది. అధిక చార్జీలు, వ్యవహార తీరుతో తీవ్ర విమర్శల పాలై, అక్కడి సర్కార్ ఆగ్రహానికి గురైన దిగ్గజాలకు అనూహ్యంగా మరో షాక్ తగిలింది. బెంగుళూరు ఆటో రిక్షా డ్రైవర్లు సొంతంగా ఒక యాప్‌ను రూపొందించుకున్నారు. లాంచింగ్‌కు ముందే 'నమ్మ యాత్రి' అప్లికేషన్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) నవంబర్ 1న తన నమ్మయాత్రి సేవలను షురూ చేయనుంది. అయితే ఈ యాప్ ఇప్పటికే 10,000 డౌన్లోడ్స్ సాధించింది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేలా చార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఫీజు ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. ప్రత్యర్థులకు సమానమైన ఇంటర్ఫేస్తో 'సరసమైన ధరల' వద్ద సేవలను అందిస్తుండటం విశేషం. దీంతో ఈ యాప్ చాల బావుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌పై సోషల్ మీడియాలో రివ్యూలు వెల్లువెత్తాయి. పికప్, డ్రాప్ లొకేషన్లను సెట్ చేసిన తర్వాత, సమీపంలోని డ్రైవర్లు చార్జీని కోట్ చేస్తారు. సాధారణంగా పికప్ , డ్రాపింగ్ ప్లేస్ దూరాన్ని బట్టి అదనంగా 10-30 రూపాయల వరకు అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ వసూలు చేయనుంది చిన్మయ్ ధుమాల్ అనే దీనిపై ట్వీట్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై ఓలా, ఉబెర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.దీనిపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసిసి సంగతి తెలిసిందే. Bangalore Auto Rickshaw Drivers launched their own application called 'Namma Yatri' to tackle unfair comission charges of Ola/Uber. - ₹30 fixed platform fees - No cancellation charges - Currently, Cash Only The app is beautiful and responsive. Bangalore is built different! pic.twitter.com/8J7OZIXcA1 — Chinmay Dhumal (@ChinmayDhumal) October 27, 2022 -
బాలీవుడ్ నటికి చేదు అనుభవం.. క్యాబ్ డ్రైవర్ ఎంత పని చేశాడంటే?
ముంబైలో బాలీవుడ్ నటితో అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ క్యాబ్ డ్రైవర్. ఇంటికి వెళ్లేందుకు శనివారం రాత్రి 8.15 గంటలకు నటి మానవ నాయక్ క్యాబ్ బుక్ చేసుకుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో క్యాబ్ ఎక్కిన నటి క్యాబ్ డ్రైవర్‌ను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని వారించింది. అయినా వినకుండా అలాగే ముందుకెళ్లాడు. అతన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు. ఆ తర్వాత కారును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లమని నటి చెప్పడంతో వినకుండా మరింత వేగంతో ముందుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక చీకటి ప్రదేశంలో కారు నిలిపాడు. దీంతో ఆమె ఆందోళనకు గురైంది. ఐదు వందల ఫైన్ మీరు కడతారా అంటూ నటిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు క్యాబ్ డ్రైవర్. అంతే కాకుండా ఆమెను దూషించాడు. వెంటనే గ్రహించిన నటి గట్టిగా అరవడంతో రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు, ఆటోవాలా ఆమెను రక్షించారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సురక్షితంగా బయటపడినా తీవ్రమైన భయాందోళనకు గురైనట్లు మానవ నాయక్ తెలిపింది. మానవ నాయక్ హిందీతో పాటు పలు మరాఠీ చిత్రాల్లో నటించింది. pic.twitter.com/BLIe0v5DV2 — Manava Arun Naik (@Manavanaik) October 15, 2022 ఈ విషయంపై ముంబై జాయింట్ సీపీ స్పందించారు. నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు తీవ్రంగా పరిగణిస్తామని వెల్లడించారు. డీసీపీ స్థాయిలో దీనిపై విచారణ చేపడతామని ఆమె పోస్ట్‌కు ఆయన బదులిచ్చారు. ఈ ఘటనలో క్యాబ్ సంస్థను వివరణ కోరుతున్నట్లు జాయింట్ సీపీ తెలిపారు. -
కస్టమర్‌కు ‘ఉబర్’ షాక్..15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు
ఇంగ్లాండ్: యాప్ ఆధారిత క్యాబ్ సేవలను అందిస్తున్న ఉబర్.. చాలా మందికి సుపరిచితమే. ఏ చిన్న జర్నీ ఉన్నా ఉబర్‌ను చాలా మంది ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకుంటారు. ఛార్జీలు వందల నుంచి వేల వరకు ఉండొచ్చు. కానీ, లక్షల్లో ఉంటుందని మీరెప్పుడైనా ఊహించారా?. ఓ బ్రిటిష్ వ్యక్తికి కేవలం 15 నిమిషాల రైడ్‌కు ఏకంగా రూ.32 లక్షల ఛార్జ్ చేసి ఊహించని షాకిచ్చింది ఉబర్. క్యాబ్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్ చూసుకుని బాధితుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనైనట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. 15 నిమిషాల రైడ్‌కు 38,317 డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 32 లక్షల రూపాయలు ఉబర్ ఛార్జ్ చేసినట్లు తెలిపింది. ఇంగ్లాండ్, మాంచెస్టర్‌లోని బక్స్టన్ ఇన్ ప్రాంతంలో తన పని ముగించుకుని రైడ్ షేర్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నారు ఒలివర్ కల్పన్(22). తాను పని చేసే బార్ నుంచి నాలుగు మైళ్ల దూరంలోని విచ్వుడ్లో తన స్నేహితుడిని కలవాలనుకున్నారు. ఉబర్ భారీ మొత్తంలో ఛార్జ్ చేయటంపై బాధితుడు కల్పన్ సౌత్ వెస్ట్ న్యూస్ సర్వీస్‌కు వివరించాడు. ‘చాలా సార్లు ఉబర్ మాదిరి యాప్‌ల ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఎప్పుడైనా 11-12 డాలర్లు(రూ.900-1000) ఛార్జ్ చేసేవారు. ఈసారి ఉబర్‌లో కారు బుక్ చేసుకోగా.. కేవలం 15 నిమిషాల జర్నీ చేశాను. ఆ తర్వాతి రోజు ఉబర్ నుంచి మెసేజ్ రావటంతో షాక్ అయ్యా. మొత్తం 35,427 పౌండ్లు(39,317 డాలర్లు) ఛార్జ్ చేసినట్లు తెలిసింది.’ అని బాధితుడు కల్పన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కల్పన్.. వెంటనే ఉబర్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. తన బ్యాంకు ఖాతాలో అంత డబ్బు లేకపోవటంతో వారు తీసుకోలేకపోయారని పేర్కొన్నాడు. తొలుత ఛార్జ్ అమౌంట్ చూసి ఉబర్ కస్టమర్ కేర్ వాళ్లు సైతం తికమక పడ్డారు. అయితే.. కల్పన్ రైడ్ గమ్య స్థానం ఆస్ట్రేలియాగా నమోదు కావటంతో భారీ స్థాయిలో ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు గుర్తించారు. ఇంగ్లాండ్‌లోని విచ్‌వుడ్ కాకుండా.. ఆస్ట్రేలియా, విక్టోరియాలోని విచ్వుడ్గా నమోదైనట్లు తేలింది. బ్యాంకులో సరైన నిధులు లేకపోవటంతో ఉబర్ విత్‌డ్రా చేయలేకపోయింది. ఒకవేళ నగదు ఉండి ఉంటే.. తిరిగి తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదన్నారు కల్పన్. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ -
సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం
బెంగళూరు: క్యాబ్ సర్వీసుల సంస్థలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. నిబంధనలు పాటించకుండా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సర్కార్ మూడు రోజుల్లో సేవలను నిలిపివేయాలని ఓలా, ఉబెర్, ర్యాపిడోలను ఆదేశించింది. కర్ణాటక రవాణా శాఖ వాహన అగ్రిగేటర్లకు నోటీసులు జారీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఓలా, ఉబెర్‌లు రెండు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పటికీ కనీసం రూ. 100 వసూలు చేస్తున్నాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించి అగ్రిగేటర్లు సేవలను నిర్వహిస్తున్నారు. అదనంగా, ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టిహెచ్ఎం కుమార్ నోటీసులో పేర్కొన్నారు. ఆటో సర్వీసులను నిలిపివేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయకూడదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీస ఆటో ఛార్జీ మొదటి 2 కి.మీకి రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.15గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే క్యాబ్‌లలో ప్రయాణికుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని నోటీసులో సూచించారు. ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని కూడా ఆయన హెచ్చరించారు. -
ఓలా, ఉబర్‌లకు షాక్! ఇకపై మీ ఆటలు చెల్లవు?
న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని, వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయన్న ఆరోపణలపై క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబర్‌లకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఓలా, ఉబర్‌లకు నోటీసులు జారీ చేశాం. ఏడాది కాలంలో ఆయా సంస్థలు అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని, సర్వీసులు లోపభూయిష్టంగా ఉంటున్నాయని భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి‘ అని సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే తెలిపారు. కస్టమర్ సపోర్ట్ నుండి స్పందన లేకపోవడం, డ్రైవర్ ఆన్లైన్ చెల్లింపులకు నిరాకరించి నగదే ఇవ్వాలంటూ పట్టుబట్టడం, బుకింగ్‌లను ముందు ఒప్పుకుని తర్వాత రద్దు చేసుకునేలా కస్టమర్లపై ఒత్తిడి తేవడం .. ఫలితంగా కస్టమర్లు క్యాన్సిలేషన్ చార్జీలు చెల్లించాల్సి వస్తుండటం వంటి సర్వీసు లోపాలను నోటీసుల్లో ప్రధానంగా చూపినట్లు వివరించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, అసమంజసమైన క్యాన్సిలేషన్ చార్జీలు తదితర ఇతర అంశాలు ఉన్నాయి. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్) గణాంకాల ప్రకారం 2021 ఏప్రిల్ 1 నుండి 2022 మే 1 వరకూ ఓలాపై 2,482, ఉబర్‌పై 770 ఫిర్యాదులొచ్చాయి. చదవండి: క్యాబ్స్‌లో ప్రయాణించే వారికి గట్టిషాకిచ్చిన ఉబర్ ! -
ప్రయాణికులకు భారీ షాక్, పెరిగిన క్యాబ్ ఛార్జీలు!
ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రైడ్ షేరింగ్ సంస్థ సిద్ధమైంది. ఉబెర్ కార్ సర్వీస్ ఛార్జీల ధరల్ని పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్ డైర్టకర్ నితీష్ భూషణ్ బ్లాగ్‌లో తెలిపారు. "పెరుగుతున్న ఇంధన ధరలు అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు పడుతున్నట్లు ఉబర్ డ్రైవర్లు కౌన్సిల్ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. సంస్థ కోసం కష్టపడుతున్న డ్రైవర్ల ఆచరణీయమైన, ఆకర్షణీయంగా ఉండేందుకు కృషి చేస్తాం. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు భూషణ్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కొత్త ఫీచర్లను యాడ్ చేసింది రైడ్ క్యాన్సిలేషన్ అనేది ప్రయాణికుల్లో ప్రధాన సమస్య. అందుకే డ్రైవర్లు ప్రయాణికుల రైడ్‌ను అంగీకరించేందుకు వాళ్లు ఎక్కడ ఉన్నారనే విషయాల్ని చూపించేలా ఉబెర్ కొత్త ఫీచర్‌ను యాడ్ చేసింది అని ఉబెర్ పేర్కొంది. సీపీపీఏ వార్నింగ్‌తో ఇటీవల సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అధారిటీ (సీపీపీఏ) రైడ్ షేరింగ్ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. రైడ్ క్యాన్సిలేషన్, క్యాన్సిలేషన్ ఛార్జీలు,ర్యాండమ్‌గా పెరుగుతున్న ధర, ప్రయాణికులు క్యాబ్ కోసం ఎదురు చూడటం, డ్రైవర్లు ట్రిప్పులను రద్దు చేయమని ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టడం' వంటి ప్రయాణికులకు తలెత్తున్న సమస్యల్ని పరిష్కరించాలని హెచ్చరించింది. అదే సమయంలో క్యాబ్ అగ్రిగేటర్లను రైడ్ క్యాన్సిలేషన్లు, డీ ఫాల్ట్‌గా (యాధృచ్చికంగా) పెరుగుతున్న ఛార్జీలకు సంబంధించిన అల్గారిథమ్‌ల మార్చాలని తెలిపింది. కస్టమర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఉబెర్, ఓలాతో సహా ఇతర రైడ్ షేరింగ్‌లకు సంబంధించిన అల్గారింథమ్లను మార్చేందుకు 30రోజుల సమయం ఇచ్చింది. -
క్యాబ్ సర్వీస్ సంస్థలకు భారీ షాక్: హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
క్యాబ్ సంస్థలు ఎడాపెడా దోచేస్తున్నాయి. పీక్ అవర్స్, ఏసీ ఆన్ చేస్తే డబ్బులంటూ ప్రయాణికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ క్యాబ్ సర్వీస్ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కస్టమర్లకు తలెత్తున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సూచించింది. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం..కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్యాబ్ సర్వీస్ సంస్థలైన ఓలా,ఉబెర్,జుగ్నూ,మేరు సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్ సర్వీస్ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్ ప్రైసింగ్ అల్గారిథమ్, డ్రైవర్స్, పేమెంట్స్ స్ట్రెక్చర్స్ వివరాల్ని వెంటనే అందించాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుల వెల్లువ డిమాండ్ పేరుతో క్యాబ్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. అత్యవసరంగా పనిపై బయటికెళ్లాలంటే మండే ఎండలకు భయపడి ఏసీ ఆన్ చేస్తే చార్జీల మోత మోగిస్తున్నాయి. అడిగే అవకాశం లేక, నియంత్రించే మార్గం లేకపోవడంతో ఆయా సంస్థలు ప్రయాణికుల్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. పీక్ అవర్సే కాదు..సాధారణ సమయాల్లో సైతం అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఆ ఫిర్యాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం..తాజాగా క్యాబ్ సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ,“వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించేలా క్యాబ్ అగ్రిగేటర్లను హెచ్చరించాం. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు ఛార్జీల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్నాయి గత నెలలో లోకల్ సర్కిల్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 ఉన్నప్పటికీ డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు రైడ్ క్యాన్సిలేషన్ చేస్తున్నారని,అందుకు అదనంగా తమ వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు 71 శాతం మంది కస్టమర్లు ఫిర్యాదు చేయగా, 45 శాతం మంది యాప్ ఆధారిత టాక్సీ వినియోగదారులు తమకు సర్జ్ ప్రైసింగ్‌లో 1.5 రెట్లు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ నివేదికలో తేలింది. చదవండి👉 క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా..న్యూస్ చెప్పిన క్యాబ్ కంపెనీలు!
ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా షాకిస్తున్నాయి ఆయా క్యాబ్ కంపెనీలు. సమ్మర్ సీజన్లో క్యాబ్‌లో ప్రయాణిస్తే వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఏసీని ఉపయోగిస్తుంటాం. కానీ ఇకపై క్యాబ్‌లో తిరిగే ప్రయాణికులు ఏసీ వినియోగించుకుంటే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు క్యాబ్ డ్రైవర్లు సిద్ధమయ్యారంటూ పలు వార్త కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం ప్రయాణికుల్ని ఆందోళన కలిగిస్తుండగా..తాజాగా యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఉబర్ తాజాగా ట్రిప్ ఛార్జీలను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది ఉబర్ క్యాబ్ ఛార్జీలను పెంచింది. గతేడాది ఉబర్ ఏప్రిల్ నెలలో 15శాతం ఛార్జీలను పెంచింది. ఈ ఏడాది తాజాగా దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఉబర్ క్యాబ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్ ఇండియా సౌత్ ఏసియా సెంట్రల్ ఆపరేషన్ హెడ్ నితీష్ భూషణ్ తెలిపారు. ‘ఇంధన ధరలలో ప్రస్తుత పెరుగుదల డ్రైవర్లను ఆందోళన కలిగిస్తోంది. వారి నుంచి వచ్చిన విన్నపం మేరకు ట్రిప్ ఛార్జీలను 15% పెంచుతున్నాం. రాబోయే వారాల్లో ఇంధన ధరల కదలికలను పరిశీలిస్తామని చెప్పారు. కాగా ఉబర్ సంస్థ హైదరాబాద్, ముంబై సహా పలు నగరాల్లో చార్జీలను సవరించింది.అవసరమైన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఉబర్ ఇండియా, సౌత్ ఆసియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీశ్ భూషన్ తెలిపారు. ఏసీ ఆన్ చేశారా? ఇక బాదుడే జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఆయా క్యాబ్ సంస్థలకు చెందిన క్యాబుల్లో జర్నీ చేసే ప్రయాణికులు ఏసీ ఉపయోగిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా పలు క్యాబుల్లో ఏసీ ఆన్ చేస్తే ఎంత చెల్లించాలో తెలుపుతూ పలు బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామంటూ క్యాబ్ సంస్థల డ్రైవర్లు స్టికర్లను అతికించారు. చదవండి: క్యాబ్స్‌లో ఏసీ ఆన్ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..! -
బాలీవుడ్ నటికి చేదు అనుభవం, క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో షాపింగ్ చేసిన ఆమె క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రీయాడెడ్ స్టాప్‌లో దిగినప్పుడు క్యాబ్ డ్రైవర్ తన వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడంటూ ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేసింది స్వర. 'హేయ్ ఉబర్ సపోర్ట్.. లాస్ ఏంజిల్స్‌లో మీ కారు డ్రైవర్ ఒకరు నా వస్తువులు తీసుకుని ఉడాయించాడు. అవి నేను పోగొట్టుకోలేదు, అతడే దొంగిలించాడు. దీనిపై మీ యాప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో కనిపించడం లేదు. దయచేసి వాటిని తిరిగి నాకప్పగిస్తారా?' అని ట్వీట్ చేసింది. దీనిపై ఉబర్ యాజమాన్యం స్పందిస్తూ ఈ విషయంలో మీకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం స్వరాను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. 'నీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు అమెరికా ఎలా వెళ్లావు? ముందు ఆ పేపర్స్ చూపించు', 'ఉబర్ తప్పకుండా సాయం చేస్తుంది, అంతకన్నా ముందు నీ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది', 'ఏమిటేమిటి.. ఏ పత్రాలు లేకుండానే యూఎస్ వెళ్లావా?, 'ఆమెకు సాయం చేసి మీ టైమ్ వేస్ట్ చేసుకోకుండి ఉబర్, అమాయక డ్రైవర్ల మీద నిందలు మోపడం జనాలకు బాగా అలవాటైపోయింది. నాకైతే ఆమె ఫేక్ అనిపిస్తోంది' అంటూ స్వరను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. Hey @Uber_Support One of your drivers here in LA just took off with all my groceries in his car while I was on a pre-added stop! It seems there’s no way to report this on your app - it’s not a lost item! He just just took it. Can I please have my stuff back? 💁🏾♀️ #touristproblems — Swara Bhasker (@ReallySwara) March 23, 2022 చదవండి: అభిమానులకు షాక్.. వారంలోపే పునీత్ చివరి సినిమా జేమ్స్‌ను ఎత్తేస్తున్న థియేటర్లు -
క్యాబ్ డ్రైవర్‌గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?
ఇప్పుడిప్పుడే వర్క్ ఫ్రం ఆఫీస్ హడావుడి మొదలవుతుంది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం తిరిగొచ్చింది. క్యాబ్ దొరుకుతుందా? లేదా? దొరికితే సమయానికి ఆఫీసుకు వెళతామా? అన్న సందేహాలతో గుండెల్లో అలజడి మళ్లీ మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో.. క్యాబ్ ఎక్కిన తర్వాత.. డ్రైవర్ ఓ దిగ్గజ కంపెనీకి సీఈఓ అని తెలిస్తే?వెంటనే మీరు ఏమి ఆలోచిస్తారు. ఈ కథనం చదువుతున్నవారు మొదట అలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి కదా అని ఆలోచిస్తారు. కానీ, ఇటీవల అనుభవమే న్యూఢిల్లీ ప్రజలకు ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉబెర్ ఇండియా, దక్షిణాసియా సీఈఓ ప్రభజీత్ సింగ్ సంస్థ చేపట్టిన ఓ పరిశోధనలో భాగంగా ఇటీవలే కొన్ని గంటల పాటు డ్రైవర్ అవతారం ఎత్తారు. సాధారణ క్యాబ్ డ్రైవర్ లాగానే ఢిల్లీ వీధుల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారితో కొంతసేపు ముచ్చటించి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ విషయాలను క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు తమ సామాజిక మాధ్యమాల్లో వెల్లిడించారు. అనన్యా ద్వివేదీ(లింక్డిన్ యూజర్) ఈ విషయంపై తన అనుభవాలను పంచుకుంది. "చాలా రోజుల తర్వాత వర్క్ ఫ్రం ఆఫీస్ కోసం బయటకొచ్చి నేను క్యాబ్ బుక్ చేశాను. డ్రైవర్ ఎవరో తెలుసా? ఉబెర్ ఇండియా బాస్.. ప్రభజీత్ సింగ్! ఓ రీసెర్చ్'లో భాగంగాడ్రైవర్గా మారారంటా. తొలుత నాకు ఏదో సదేహంగా అనిపించి ఆయన గురించి గూగుల్ చేశాను. ఫొటోలు చూసిన తర్వాతే నేను నమ్మాను. ఇది నిజమే!. సమస్యలను అర్థం చేసుకునేందుకు.. ఇలా డ్రైవర్ అవతారం ఎత్తడమనేది చాలా గొప్ప విషయం" అని ఆమె రాసుకొచ్చింది. మరో లింక్డిన్ యూజర్ సౌరభ్ కుమార్ వర్మ కూడా ఉబెర్ ఇండియా సీఈఓపై ప్రశంసలు కురిపించారు. ప్రభజీత్ సింగ్ ఉబెర్ సంస్థ సేవలను మరింత మెరుగుపరించేందుకు పరిశోధనలో భాగంగా డ్రైవర్ అవతారం ఎత్తారు. "ఓ పెద్ద కంపెనీకి సీఈఓ మన క్యాబ్ డ్రైవర్‌గా మారితే మనకు ఎంతో విలువనిస్తున్నట్టే కదా! మనం మరింత భద్రంగా ఉన్నట్టే కదా. ప్రయాణికులను మరింతగా అర్థంచేసుకునేందుకు ప్రభజీత్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే వారితో మాట్లాడుతున్నారు. వారిని పిక్ చేసుకుని, కావాల్సిన చోట దింపుతున్నారు. కుడోస్" అని అన్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. (చదవండి: Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!) -
అమ్మ బాబోయి.. 17 కిమీ దూరానికి ఉబర్‌లో ధరెంతో తెలిసి షాక్ అయిన కస్టమర్?
సాదారణంగా మనం ఉబర్ క్యాబ్‌ల ప్రయాణించినప్పుడు ధరలు ఇతర వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి. మహా అయితే ఈ ధరలు ఒక వంద రూపాయలో లేదా 2 వందలో ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మన చెప్పుకోబోయే స్టోరీ గురుంచి తెలిస్తే షాక్ అవుతారు.. డిసెంబర్ 27న, మాంచెస్టర్ సిటీకి చెందిన సామ్ జార్జ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీకి నైట్ క్లబ్ కు వెళ్లాడు. ఆ రాత్రి అతనికి చాలా ఆలస్యమైంది. చాలా రాత్రి కావడంతో తను ఇంటికి క్యాబ్‌లో వెళ్లాలని అనుకున్నాడు. అతని ఇల్లు నైట్ క్లబ్ నుంచి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, అర్ధరాత్రి కవడంతో క్యాబ్‌లు ఎక్కువగా అందుబాటులో లేవు. దీంతో సామ్ స్నేహితులు అనేక సంస్థలకు చెందిన క్యాబ్‌ల కోసం ప్రయత్నించారు. కానీ, ఏదీ అందుబాటులో లేకపోవడంతో సామ్ ఉబర్ క్యాబ్ సేవలను వినియోగించుకోవాలని భావించాడు. ఆ రాత్రి తను, అతను ఫ్రెండ్స్ కలిసి ఉబెర్ ఎక్స్ఎల్ లేదా ఎస్యువి కారులో అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి తాగిన మందు కిక్ దిగిన తర్వాత మరుసటి రోజు యాప్ లో క్యాబ్ ఛార్జీలను చూసి ఒక్కసారిగా అతను ఆశ్చర్యపోయాడు. క్యాబ్ సంస్థ ఆ యువకుడికి కేవలం 17 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.10,000 వసూలు చేసింది. అర్థరాత్రి సమయంలో ఇంటికి చేరుకోవడానికి అరగంట కంటే తక్కువ సమయం పడుతుంది. పార్టీకి అయిన ఖర్చుతో పోలిస్తే క్యాబ్‌కు అయిన ఖర్చు ఎక్కువ. ముందుగానే, ఈ ప్రయాణానికి సంబంధించిన ధరలను యాప్ లో చూపించినట్లు ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఆ యువకుడు చాలా మత్తులో ఉండటంతో క్యాబ్ ధరంతో తెలియలేదు. (చదవండి: 17 లక్షల యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన వాట్సాప్..!) -
క్యాబ్ యూజర్ల కష్టాలకు చెక్.. సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిన ఓలా!
ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తుంటారు. ఓలా, ఉబెర్ ఉపయోగించే వ్యక్తులు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య ఇది. రైడ్-హైలింగ్ కంపెనీల డ్రైవర్లు డ్రాప్ లొకేషన్ గురించి అడిగిన తర్వాత వెంటనే రైడ్లను రద్దు చేస్తారు అని ప్రజలు ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు. ఒక నిర్ధిష్ట ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడనట్లయితే డ్రైవర్‌ను మనం నిందించలేం. అత్యవసర సమయాలలో ఇలాంటి సమస్య ఎదురైతే వినియోగదారులకు వచ్చే కోపం గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్యాబ్ వినియోగదారుల ఎక్కువగా ఎదుర్కొనే ఈ సమస్య గురుంచి ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పందించారు. ఇకపై కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపారు. ఇక నుంచి లొకేషన్, పేమెంట్ వివరాలన్నీ సదరు డ్రైవర్‌కు కనిపిస్తాయి. రైడ్ తనకు అంగీకారమైతే ప్రొసీడ్ కావొచ్చు. లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేర్పులపై క్యాబ్ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Addressing the 2nd most popular question I get - Why does my driver cancel my Ola ride?!! We're taking steps to fix this industry wide issue. Ola drivers will now see approx drop location & payment mode before accepting a ride. Enabling drivers is key to reducing cancelations. pic.twitter.com/MFaK1q0On8 — Bhavish Aggarwal (@bhash) December 21, 2021 (చదవండి: మీ మొబైల్‌తో నకిలీ పాన్-కార్డు గుర్తించండి ఇలా..?) -
ఓలా, ఉబెర్ సర్వీసులను నిలిపివేసిన డ్రైవర్లు..
-
ఇకపై వాట్సాప్ నుంచి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?
వాహన ప్రయాణికులకు శుభవార్త. చేతిలో ఊబెర్ షేరింగ్ యాప్ లేకపోయినా వాట్సాప్ ఆన్‌లో ఉంటే చాలు ఇకపై ఊబెర్ క్యాబ్స్‌ను బుక్ చేసుకోవచ్చని' ఊబెర్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి మనదేశంలో ఈ తరహా క్యాబ్ సర్వీసుల్ని ఊబెర్ అందించనుంది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రైడ్ షేరింగ్ సంస్థ ఊబెర్ సరికొత్త రైడ్ షేరింగ్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చింది. ఊబెర్ యాప్ లేకుండా ఊబెర్ లోని చాట్ బోట్‌తో కనెక్టై సులభంగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోనే ప్రారంభించారు. త్వరలో దేశం మొత్తం విస్తరించేందుకు ఊబెర్ ప్రతినిధులు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. వాట్సాప్‌తో క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలి వాట్సాప్ యూజర్లు మొత్తం మూడు మార్గాల ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి ఉబెర్ వాట్సాప్ చాట్ లింక్‌పై క్లిక్ చేస్తే బుకింగ్ ఓపెన్ అవుతుంది. అక్కడే పికప్, డ్రాప్ లొకేషన్‌తో పాటు ఫేర్ ప్రైస్, క్యాబ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే వివరాలు డిస్ప్లే అవుతాయి. ఫైనల్‌గా మీరు ‘బుక్ ఎ రైడ్’ పై క్లిక్ చేసి క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. చదవండి: ‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...! -
సామాన్యులకు కేంద్రం మరో భారీ షాక్, ఆటో ఎక్కితే జీఎస్టీ కట్టాల్సిందే..!
సామాన్యులకు కేంద్రం మరో భారీ షాకిచ్చింది. ఇప్పటికే నిత్యవసర వస్తుల ధరలపై జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆటోలో ప్రయాణించే వారిపై జీఎస్టీ విధించనున్నాయి. అంటే..ఆటో ఎక్కినా ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాదని కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. చదవండి: హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నాడే -
హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’
లండన్: ఇటీవల కాలంలో అందరూ ఉబర్, ఓలా, ఆన్లైన్ రైడ్ యాప్‌ల ద్వారా క్యాబ్‌లు బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నారు. దీంతో మనకు ప్రయాణం చాలా సౌకర్యవంతంగానూ మంచి వెసులబాటుగానూ ఉంటుంది. మంచి రద్దీ సమయంలో ఈ క్యాబ్‌ల సాయంతో త్వరితగతిన వెళ్లవచ్చు. (చదవండి: వివాహ వేడుకకు అతిధిలా వచ్చిన ఎలుగుబంటి) అయితే మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యాబ్ మనల్ని పికప్ చేయించుకుని పాయింట్‌కి రీచ్ కాకపోతే వెంటనే సదరు డ్రైవర్‌కి కాల్ చేసి అడుగుతాం. కానీ కొంతమంది డ్రైవర్‌తో మాట్లాడటం ఇష్టం లేకనో లేక మరో ఇతర కారణాలతోనో కేవలం మెసేజ్‌లను పెడతారు. కానీ కొంతమంది డ్రైవర్లు ప్రయాణికులతో మాట్లాడలేని వైకల్యంతో బాధపడే వాళ్లు ఉంటారని మనకు తెలియదు. అచ్చం అలాంటి పరిస్థతిలో లండన్‌కి చెందిన ఉబర్ డ్రైవర్ ఓనూర్ ఉన్నాడు. వివరాల్లోకెళ్లితే....లండన్‌కి చెందిన జెరెమీ అబాట్ అనే వ్యక్తి ఉబర్ క్యాబ్‌ని బుక్ చేసుకుని ఎక్కుతున్నప్పుడు ఆ ఉబర్ డ్రైవర్ సీటుకి వెనుకవైపు ఉన్నఒక చక్కటి సందేశంతో కూడిన లెటర్ని చూసి ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఆ లెటర్లోని సందేశం ఏమిటంటే " నేను చెవిటివాడిని కాబట్టి మీరు నాకు ఏదైనా చెప్పవలసి వస్తే, దయచేసి ఫోన్లో టెక్స్ట్ చేయండి లేదా నేను కారు ఆపినప్పుడు నాకు చూపించడానికి మీరు నోట్‌ప్యాడ్‌లో వ్రాయవచ్చు. మీరు మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయడానికి ఏయూఎక్స్ కేబుల్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజు మీరు ఏం కావల్సిన బాస్‌లా అడగండి చేస్తాను. ఈ ట్రిప్‌ని నేను కూడా మీతోపాటు ఎంజాయ్ చేస్తాను. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. అంతేకాదు మీరు నాతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు." అని ఉంది. దీంతో జెరెమీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. తాను తన జీవిత కాలంలో ఎక్కిన ఉబెర్ క్యాబ్‌ల కంటే ఈ క్యాబ్ తనకు ప్రత్యేకం అని చెప్పాడు. ఈ మేరకు జెరెమీ ఈ ఉబర్ డ్రైవర్ సందేశంతోపాటు ఓనూర్ గ్రేట్ హిరో అంటూ ట్యాగ్లైన జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్ల ఈ సందేశం ఎంత హృదయపూర్వకంగా ఉందో అంటూ ఓనూర్ కష్టపడేతత్వాన్ని, మర్యాదపూర్వక స్వభావాన్ని ప్రశంసిస్తు ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి) I have just entered the most wholesome Uber of my entire life. Big ups, Onur, absolute hero ❤️ pic.twitter.com/lID9Mn7pqF — Jeremy Abbott (@Funster_) October 21, 2021 -
ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి..
-
ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి.. ‘నాకిద్దరు సిస్టర్స్ ఉన్నారు’
ఫ్లోరిడా: మధ్య వయస్కురాలైన ఓ నర్సు ఉబర్ డ్రైవర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అతడి గొంతు పట్టుకుని చితకబాదింది. మహిళ తనను ఇంతలా బాధపెడుతున్న సదరు డ్రైవర్ ఆమె మీద చేయి చేసుకోలేదు. అందుకు అతడు చెప్పిన కారణం ప్రతి ఒక్కరిని కట్టి పడేసింది. ‘‘నాకు ఇద్దరు సోదరీమణలు ఉన్నారు. ఆడవారికి గౌరవం ఇవ్వాలని నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి బోధించింది. అవే నేను పాటించాను’’ అన్నాడు. ఇంతకు సదరు నర్స్ అతడిపై ఎందుకు దాడి చేసింది అనేది మాత్ర తెలియలేదు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో ఈ నెల 17న చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మైఖెల్ స్టిల్విల్ అనే లేడీ నర్స్ ఏప్రిల్ 17న సాయంత్రం ఐదు గంటలకు ఉబర్ కారు బుక్ చేసుకుంది. హస్సీ జూనియర్ అనే వ్యక్తి ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చాడు. కారు ఎక్కిన తర్వాత మైఖెల్ నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చిన తర్వాత సడెన్‌గా హస్సీపై దాడి చేయడం ప్రారంభించింది. వెనక ప్యాసింజర్ సీటులో కూర్చున్న మైఖెల్ నిద్ర నుంచి లేచి.. వెనక నుంచి హస్సీ మెడ పట్టుకుని అతడిని కొట్టడం ప్రారంభించింది. ‘నా కూతురు’ అంటూ అరుస్తూ.. అతడిపై పిడి గుద్దులు కురిపించింది. హస్సీ ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఇంతలో మైఖెల్ ముందుకు వచ్చి అతని ఛాతీపై గోళ్లతో గీరింది.. లోతైన గాయం చేసింది. అతడికి ఏమాత్రం తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా దాడి చేసింది. దారిన పోయే వారు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి సదరు నర్స్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా హస్పీ మాట్లాడుతూ.. ‘‘ఏం జరిగితే అదే జరుగుతుంది.. నేను మాత్రం ఆమెపై చేయి చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. పైగా చిన్నతనం నుంచి ఆడవారిపై చేయి చేసుకోకూడదు అనే వాతావరణంలో నేను పెరిగాను. అందుకే ఆమెపై ప్రతి దాడి చేయలేదు’’ అన్నాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో నర్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. చదవండి: మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి ఈమె 8 మంది శిశువులను చంపారట! -
గుండు కొట్టించాడు.. ఉన్న ఉద్యోగం ఊడింది
సాక్షి ,హైదరాబాద్: మంచి జరగాలని దేవునికి తలనీలాలు ఇచ్చుకోవడం చాలా మంది చేసేదే! అయితే, అదే గుండు వల్ల ఉన్న ఉద్యోగం పోవడం నిజంగా దురదృష్టమే. హైదరాబాద్ నగరంలో గుండు కోట్టించుకున్నందుకు ఓ యువకుడికి ఉద్యోగం పోయింది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ఉబర్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్నాడు. అనంతరం ఎప్పటిలానే ఫిబ్రవరి 27న ఉబర్ యాప్‌లో సెల్ఫీతో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో పలుమార్లు ప్రయత్నిస్తే అతడి ఖాతా పూర్తిగా బ్లాక్ కావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. కారణం ఏంటా అని చూస్తే గుండుతో విధుల్లో చేరేందుకు వచ్చిన శ్రీకాంత్ ముఖాన్ని ఉబర్ యాప్ గుర్తుపట్టకపోవడంతో ఉపాధికి దూరమయ్యాడు. అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్లతో 4.67 స్టార్ రేటింగ్‌తో ఉన్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశాడు. ‘ప్రస్తుతం నా ఖాతా బ్లాక్ అయింది. ఉబర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. నా కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. కానీ, నేను అంత భరించలేను. నెల తర్వాత మళ్లీ ఉబర్ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది’ అంటూ అతను వాపోయాడు. యాప్ ఆధారిత ట్రాన్స్పోర్ట్ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలాయుద్దీన్ ఈ విషయంపై మాట్లాడుతూ డ్రైవింగే శ్రీకాంత్ కు జీవనాధారమని, అతడు కారు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో ఉబర్ అల్గారిథమ్ డ్రైవర్ల ముఖాల్ని గుర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు రాకూడదని, ఉబర్ సంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ( చదవండి: తాగి తందనాలు.. భార్య హోటల్లో పనిచేస్తుండటంతో ) -
మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి
వాషింగ్టన్: కరోనా సమయంలో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. కొంతమంది ముఖానికి మాస్క్ ధరించడాన్ని విధిగా పాటిస్తున్నారు. మరికొంత మంది మాస్క్ వేసుకోవాడన్ని లేక్క చేయకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. తాజాగా ఓ ఉబర్ డైవర్ తన కారులో ప్రయాణిస్తున్న మహిళను మాస్క్ ధరించాలని కోరగా ఆమె అతనిపై దాడికి దిగి, అసభ్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుభాకర్ ఖాడ్కా అనే ఉబర్ డ్రైవర్ ఆదివారం బేవ్యూ ప్రాంతంలో ముగ్గురు మహిళలను తన కారులో ఎక్కించుకున్నాడు. కారులో కూర్చున్న ముగ్గురు మహిళల్లో ఓ మహిళ మాస్క్ ధరించలేదు. దీంతో ఉబర్ డ్రైవర్ సదరు మహిళను మాస్క్ ధరించాలని కోరాడు. దీంతో ఆ మహిళ కోపంగా డ్రైవర్ మీదకు వెళ్లుతూ కావాలని దగ్గటం ప్రారంభించింది. అదీకాక తీవ్రంగా అరుస్తూ అతని మాస్క్, మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళలు తమ గమ్యస్థానంలో కారు దిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఉబర్ సంస్థ ఇక సదరు మహిళకు ఉబర్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. డ్రైవర్ సుభాకర్ ఖాడ్కా మాట్లాడుతూ.. ఆ మహిళ కారులో తనపై పెప్పర్ స్ప్రే చల్లిందని తనకు శ్వాస తీసుకోవాడనికి చాలా ఇబ్బంది అయినట్లు తెలిపాడు. తనది నేపాల్దేశామని, ప్రయాణికులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపాడు. తనది నేపాల్ దేశమని ఆ మహిళలు వివక్ష చూపి, దాడికి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: వ్వాట్! ఏమన్నారూ.. అనేముందు ఆలోచించాలి -
క్యాబ్ డ్రైవర్ పాటకు నెటిజన్లు ఫిదా
-
క్యాబ్ డ్రైవర్ పాటకు నెటిజన్లు ఫిదా
కోల్‌కతా : క్యాబ్ డ్రైవర్లు రోజుకు ఎంతోమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. కాగా డ్రైవింగ్ఫీల్డ్లో ఉన్నవారిలో కొంతమందికి ఇతర టాలెంట్స్ కూడా ఉంటాయి.ఇందుకు ఉదాహరణే .. కోల్‌కతాకు చెందిన ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ ఆర్యన్ సోని. హిందూస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ లిరిక్స్ ను అద్భుతంగా పాడాడు. కాగా క్యాబ్ డ్రైవర్ పాడిన వీడియోను క్యాబ్‌లో ప్రయాణిస్తున్న బృందా దాస్ గుప్తా ఫేస్బుక్లో షేర్ చేశారు. ' మీకు సంగీతమంటే ఇష్టమా అని క్యాబ్ డ్రైవర్ నన్నుఅడిగాడు. నేను అవును అని చెప్పగానే.. నాకూ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమంటూ ఆర్యన్ హిందూస్తాన్ క్లాసికల్ సాంగ్ ను పాడారంటూ' బృందాదాస్ గుప్తా చెప్పింది. ఇదంతా సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ ఆర్యన్ సోని సింగింగ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
డ్రైవర్ పిచ్చి చేష్టలు : మహిళకు వింత అనుభవం
పుణె : ఓ ఊబర్ క్యాబ్ ప్రయాణికురాలికి వింత అనుభవం ఎదురైంది. క్యాబ్ డ్రైవర్ పిచ్చి చేష్టల కారణంగా తనే స్వయంగా కారు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 21న పుణెలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తేజస్విని దివ్య నాయక్ అనే మహిళ గత నెల 21న పుణె నుంచి ముంబై వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. డ్రైవర్ కారు నడుపుతూ ఫోన్ మాట్లాడుతుండటంతో ఆమె వద్దని వారించింది. ఫోన్ మాట్లాడటం ఆపేసిన అతను ఆ తర్వాత నుంచి నిద్రలోకి జారుకోవటం ప్రారంభించాడు. కారు డ్రైవర్ తన నిద్రమత్తు కారణంగా ఒకానొక సమయంలో వేరే కారును ఢీ కొట్టబోయాడు. దీంతో భయపడిపోయిన ఆమె అతడ్ని ఓ అర్థగంట నిద్రపోమని, తాను కారు నడుపుతానని చెప్పింది. తనకు వెన్నునొప్పి ఉన్న కారణంగా ఎక్కువ సేపు కారు నడపలేనని అంది. ఆమె కారు నడపటం మొదలుపెట్టగానే అతడు నిద్రపోవటం మానేసి ఫోన్లో మాట్లాడటం ప్రారంభించాడు. ఆమె కారు బాగా నడుపుతోందంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ నిద్రపోవటంతో తేజస్విని అతడి ఫొటోలు, వీడియోలు తీసింది. ముంబై చేరుకోవటానికి ఓ అర్థగంట ముందు అతడు నిద్రలేచి డ్రైవింగ్ చేయటానికి ఉపక్రమించాడు. అతడి వాలకంతో బాగా నొచ్చుకున్న ఆమె అతడి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఉంచింది. అంతేకాకుండా ఊబర్ కంపెనీని ట్యాగ్ చేసి ‘‘ ఇది జరిగినపుడు నేను నిద్రలో లేకపోవటం, డ్రైవింగ్ తెలిసుండటం వల్ల బ్రతికి బయటపడ్డాను. నేను కోపంతో రగిలిపోతున్నా. ఎంత ధైర్యం ఉంటే డ్రైవర్లు సరైన రెస్ట్ లేకుండా కారు నడపటానికి వస్తారు? ఎంత ధైర్యం ఉంటే పక్కవారి ప్రాణాలను ప్రమాదంలో పెడతారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. thanking god I’m alive right now and I wasn’t asleep when this happened & that I know how to drive.@Uber @Uber_Support @Uber_India I am seething with anger right now. how dare they drive if they’re not well rested? how dare they put anyone else’s life at risk? part 1 #uber pic.twitter.com/lUUFXpHCQS — tejaswinniethepooh (@teja_main_hoon_) February 21, 2020 -
పగలు హెయిర్‌స్టైలిస్ట్‌గా.. రాత్రి వేళల్లో..
అట్లాంటా: ‘దేవుడు ఎప్పుడు.. ఎవరి జీవితాన్ని ఏవిధంగా మలుపు తిప్పుతాడో తెలియదు.. కెవిన్ ఎస్క్చ్ రూపంలో వచ్చి నా కలను నెరవేర్చాడు’ అంటున్నారు అమెరికాకు చెందిన ఉబెర్ డ్రైవర్ లాటోన్యా యంగ్. 16వ ఏటనే బిడ్డకు జన్మనిచ్చిన ఆమె కుటుంబాన్ని పోషించడం కోసం పగలూ రాత్రీ తేడా లేకుండా కష్టపడేవారు. పొద్దంతా హెయిర్‌స్టైలిస్ట్‌గా.. రాత్రి వేళల్లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన పిల్లలకు కావాల్సినవన్నీ సమకూర్చేవారు. సింగిల్ పేరెంట్ అయినప్పటికీ పిల్లలకు ఏ లోటూ రాకుండా ఉండేందుకు తన కలల్ని సైతం ఫణంగా పెట్టారు. ఫీజు కట్టే స్థోమత లేక లాయర్ కావాలనే కోరికను పక్కన పెట్టేశారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఓ ప్రయాణికుడి రూపంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే లాటోన్యా ఆశయం నెరవేరింది. ఒకానొక రోజు తన కారులో ఎక్కిన ఎస్క్చ్ అనే వ్యక్తికి బోర్ కొట్టకుండా ఉండేందుకు తన జీవితం గురించి చెప్పుకొచ్చారు లాటోన్యా. ‘చిన్నతనంలోనే తల్లి కావడం వల్ల డ్రాపౌట్‌గా మిగలాల్సి వచ్చింది. ఎంత కష్టపడినా పిల్లల అవసరాలు తీర్చేందుకు మాత్రమే నా సంపాదన సరిపోతోంది. మొదట స్కూల్ నుంచి తర్వాత జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి నన్ను తొలగించినపుడు ఎంతగానో బాధపడ్డాను. ఫీజు కట్టేందుకు డబ్బు సిద్ధం చేసుకున్న ప్రతీసారి నా పిల్లలలకు ఏదో ఒక అవసరం వచ్చి పడేది. అందుకే ప్రతీసారి ఆ డబ్బును వాళ్ల కోసమే ఖర్చు చేసేదాన్ని. ఇప్పుడు 700 డాలర్లు కడితేగానీ నన్ను కాలేజీలో చేర్చుకోరు’ అంటూ 43 ఏళ్ల లాటోన్యా అతడికి తన పరిస్థితి గురించి వివరించింది. ఆ తర్వాత అతడు కారు దిగిపోవడం, ఆ విషయం గురించి లాటోన్యా మరచిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ రోజు లాటోన్యాకు యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ‘ నువ్వు ఇప్పుడు క్లాసులకు హాజరు కావచ్చు’ అన్న పదాలు చూడగానే ఆమె ఎగిరి గంతేశారు. తన కారులో ఎక్కిన ప్రయాణికుడి సహాయంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అంతేగాక తన గ్రాడ్యుయేషన్‌కు అతడు హాజరయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో స్వీట్ షాక్‌కు గురైన లాటోన్యా..‘ అతడికి ధన్యవాదాలు.. నాకు 16వ ఏటనే కొడుకు పుట్టాడు. అప్పడే స్కూలు నుంచి తీసివేశారు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా. జీవితాన్ని ఎలా మొదలు పెట్టామన్నది కాదు.. ఎలా ముగించామన్నదే ముఖ్యం. ఎప్పుడు ధైర్యాన్ని వదలొద్దు’ అంటూ తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. ఈ క్రమంలో లాటోన్యా, ఆమెకు సహాయం చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే విధంగా లాటోన్యా మంచి లాయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటూ నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. -
క్యాబ్ ఆవాజ్: డ్రైవర్ల సమ్మె బాట
నగరంలో క్యాబ్ సేవలూ నిలిచిపోనున్నాయి. ఇప్పటికే ఆర్టీసీకార్మికులు సమ్మె చేస్తుండగా... క్యాబ్ డ్రైవర్లూ ఈ నెల 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లనున్నారు. ఈ మేరకుతెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ నాయకులు గురువారం ప్రకటించారు. కిలోమీటర్‌కు రూ.22 చెల్లించాలని, డ్రైవర్ల ఐడెంటిటీ రద్దును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిపై స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో సమ్మె అనివార్యమన్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు సైతం సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 19నుంచి క్యాబ్ బంద్ చేపట్టనున్నట్లు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ షేక్ సలావుద్దీన్, కన్వీనర్ కె.ఈశ్వర్రావు, కో–చైర్మెన్ బి.వెంకటేశం తెలిపారు. దీంతో 19నుంచి ఉబెర్, ఓలా తదితర క్యాబ్‌లతో పాటు, ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్ సేవలు కూడా నిలిచిపోనున్నాయి. కిలోమీటర్‌కు రూ.22 చొప్పున చెల్లించాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే మొబైల్ యాప్‌లతో పాటు మీటర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు పెద్ద ఎత్తున లీజు వాహనాలను పెంచేశాయి. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చాలామంది అప్పులపాలయ్యారు. ఫైనాన్షియర్ల వద్ద చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. డ్రైవర్ల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రతి డ్రైవర్‌కు కనీసం బిజినెస్ గ్యారెంటీ ఇవ్వాలని, ఇందుకనుగుణంగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను మార్చుకోవాలని జేఏసీ చైర్మెన్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీలకు నడిపే క్యాబ్‌లకు సంబంధించి జీవో 61, 66లకు అమలు చేయాలని కోరారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు.19వ తేదీ వరకు తమ డిమాండ్లపైన స్పష్టమైన హామీ లభించకపోతే సమ్మెను నిరవధికంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. నిలిచిపోనున్న 50 వేల క్యాబ్‌లు క్యాబ్ బంద్ కారణంగా నగరంలో సుమారు 50 వేలకు పైగా ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ల సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే సుమారు 5 వేలకు పైగా క్యాబ్‌లకు కూడా బ్రేక్ పడనుంది. అలాగే హైటెక్‌సిటీ, కొండాపూర్, మాధాపూర్, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కారణంగా రాత్రి పూట సిటీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యాబ్ సేవలను వినియోగించుకుంటున్నారు. కానీ క్యాబ్‌లు కూడా సమ్మెలో పాల్గొంటే ప్రజా రవాణాకు మరింత ఆటంకం కలగనుంది. క్యాబ్ డ్రైవర్ల సమ్మె వల్ల సుమారు 5 లక్షల మందికి పైగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. -
‘నజర్ కే సామ్నే’ అంటూ అదరగొట్టిన ఉబర్ డ్రైవర్
లక్నో: సాదాసీదా జీవితం గడుపుతున్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ తనలోని అద్భుతమైన టాలెంట్‌తో ప్రయాణీకులను అబ్బురపరుస్తూ.. రణు మొండాల్‌ను తలపిస్తున్నారు. నిత్యం తన కారులో ప్రయాణించే వారిని క్యాబ్ డ్రైవర్ వినోద్ తన గానంతో అందరిని అలరిస్తున్నాడు. తాజాగా అతని కారులో ప్రయాణించిన ప్రియాంశు.. తాను అద్భుతంగా పాటలు పాడే ఓ డ్రైవర్‌ను కలిశానని, అతను సొంతంగా యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నాడని అతన్ని వెలుగులోకి తీసుకురావాలని ఉబర్ ఇండియాను కోరాడు. అంతేకాక 1990లో హిట్టయిన 'ఆషికీ' చిత్రంలోని 'నజర్ కే సామ్నే' అనే పాటను ఆలపిస్తున్న వీడియోను షేర్ చేశారు. ప్రఖ్యాత గాయకుడు కుమార్ సాను పాడిన అలనాటి క్లాసిక్ పాటను తన గళంతో సుతిమెత్తగా ఆలాపిస్తూ.. సంగీత ప్రియుల హృదయాల్ని కొల్లగొడుతున్నాడు. 56 సెకన్లకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అతని గానాన్ని, గొంతులోని మాధుర్యాన్ని చూసి నెటిజన్లు తన్మయత్వంతో పులకరిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ వినోద్ తన అద్భుత గాన ప్రతిభతో ప్రయాణికులను మైమరిపిస్తూ.. తమ సంస్థ సామాజిక మాధ్యమాల్లోని పేజీల్లో ప్రతినిత్యం వార్తల్లో ఉంటున్నారని ఉబర్ ఇండియా సంస్థ యాజమాన్యం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్లో పేర్కొంది. Met an @Uber_India driver Vinod ji in Lucknow. He is an amazing singer and asked to sing a song for me after finishing his ride. Aur kya chaiye. Please watch this video and make him famous. He is also having his own @YouTube @youtubemusic channel. #Lucknow #Uber pic.twitter.com/G4zu8u2531 — #SavePriyanshu (@crowngaurav) September 14, 2019 -
నిర్మలా సీతారామన్‌కు మారుతి కౌంటర్
గువహటి: యువత (మిలీనియల్స్/20–40 మధ్యనున్నవారు) కార్లు కొనడానికి బదులు ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ సేవలను వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతుండడమే ఆటోమొబైల్ వాహన విక్రయాలు పడిపోవడానికి కారణమన్న కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వాదనను దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి అంగీకరించలేదు. వాహన విక్రయాల ప్రస్తుత మందగమనానికి ఇది బలమైన అంశం కానేకాదని, ఓ అభిప్రాయానికి రావడానికి ముందుగా పూర్తిస్థాయి అధ్యయనం అవసరమని పేర్కొంది. ప్రజలు ఇప్పటికీ కార్లను తమ ఆంకాక్ష మేరకు కొనుగోలు చేస్తున్నారని మారుతి సుజుకీ ఇండియా ఈడీ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యువత కార్లను కొని, ప్రతీ నెలా ఈఎంఐలు చెల్లించేందుకు ఇష్టపడడం లేదని, దీనికి బదులు వారు ట్యాక్సీ సేవల వైపు మొగ్గుతున్నారని మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం చేసిన ప్రకటన పెద్ద చర్చకే తావిచి్చంది. ఓలా, ఉబెర్ అంశం ప్రస్తు్తత మందగమనానికి పెద్ద కారకం కాదన్నారు శ్రీవాస్తవ. ‘‘ఓలా, ఉబెర్ గత ఆరు, ఏడేళ్లుగా మార్కెట్లో ఉన్నాయి. ఈ సమయంలో ఆటో పరిశ్రమ అత్యుత్తమ ప్రదర్శన చవిచూసింది. గత కొన్ని నెలల్లోనే ఏమైంది? ఇది ఓలా, ఉబెర్ వల్లేనని ఆలోచించకండి’’ అని శ్రీవాస్తవ అన్నారు. అమెరికాలో ఉబెర్ బలమైన ప్లేయర్‌గా ఉన్నప్పటికీ, అక్కడ కార్ల విక్రయాలు గత కొన్ని సంవత్సరాల్లో బలంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆకాంక్ష మేరకే... ‘‘భారత్‌లో 46 శాతం మంది కార్లు కొనే వారు, మొదటి సారి కొనుగోలుదారులే. ఇది కారు కొనాలన్న వారి ఆకాంక్షల వల్లే. ప్రజలు ఓలా, ఉబెర్ ద్వారా వారం రోజులు ప్రయాణించినా కానీ, వారాంతంలో కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారు’’ అని శ్రీవాస్తవ చెప్పారు. ఆటో మార్కెట్ మందగమనానికి ఎన్నో కారణాలున్నాయని శ్రీవాస్తవ అన్నారు. మార్కెట్లో లిక్విడిటీ (నిధులు/రుణాలు) కొరత, నియంత్రణపరమైన అంశాల వల్ల (భద్రతా ఫీచర్ల అమలు వంటి) ఉత్పత్తుల ధరలు పెరగడం, అధిక పన్నులు, బీమా ప్రీమియం రేట్లు పెరగడాన్ని కారణాలుగా పేర్కొన్నారు. గత నెల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలు దీర్ఘకాలానికి పరిశ్రమకు మేలు చేసేవని, ప్రస్తుత మందగమనానికి బ్రేక్ వేసేందుకు చాలవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న పండుగల అమ్మకాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాను ఆయన ప్రకటించారు. -
క్షీణతకు ఓలా, ఉబెర్ కూడా కారణమే..
చెన్నై: మౌలికరంగ ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్‌్కఫోర్స్.. కేంద్రం నుంచి నిధుల సహకారం అవసరమైన రంగాలను గుర్తించే పనిలో ఉందని ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తన వ్యయాలను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ఇందులో మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడమే ఉత్తమమని చెప్పారు. ఇప్పటికే 100 లక్షల కోట్లను మౌలిక రంగంపై ఖర్చు చేయనున్నట్టు తాము ప్రకటించామని, దాన్ని వేగవంతం చేయాల్సి ఉందన్నారు. ప్రాజెక్టులను వేగంగా గుర్తించేందుకు టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, దాంతో నిధులు వెచ్చించడం వీలు పడుతుందని వివరించారు. ‘‘ఇప్పటికే టాస్‌్కఫోర్స్ పని ఆరంభించింది. ప్రాజెక్టులను గుర్తించే పనిలో ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. నీతిఆయోగ్ సీఈవోతోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులతో ప్రభుత్వం ఈ టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వం ఇప్పటికే రెండు భారీ నిర్ణయాలను (ప్రోత్సాహకాలు) ప్రకటించిందని, మరో ఒకటి రెండు నిర్ణయాలు ఉంటాయని హామీనిచ్చారు. 5 ట్రిలియన్ డాలర్లు సాధ్యమే... 5 ట్రిలియన్ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా భారత్‌ను తీసుకెళ్లేందుకు... మౌలిక రంగంపై నిధులు ఖర్చు చేయడంతోపాటు, ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ని ర్ణయాలు భాగమేనని మంత్రి తెలిపారు. దేశ జీడీపీ 5 శాతానికి జూన్ క్వార్టర్లో పడిపోయిన నేపథ్యంలో, 5 ట్రిలియన్ డాలర్లకు జీడీపీని తీసుకెళ్లడం సాధ్యమేనా? అన్న మీడియా ప్రశ్నకు.. జీడీపీ పెరగడం, తగ్గడం మామూలేనని.. యూపీఏ హయాంలో 2012–15లోనూ ఇదే జరిగిందని పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వాహన అమ్మకాల క్షీణతకు ఓలా, ఉబెర్ కూడా కారణమే.. వాహన అమ్మకాలు పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మిలినీయల్స్ (యువత) మనస్తత్వం మారిందని, వారు సొంత కారు కంటే, ఓలా, ఊబర్ సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె చెప్పారు. బీఎస్–6 నిబంధనలకు మారడం, రిజిస్ట్రేషన్ సంబంధిత అంశాలు, వినియోగదారుల ఆలోచనల్లో మార్పు రావడం గడ్డు పరిస్థితులకు కారణాలుగా పేర్కొన్నారు. ‘మిలీనియల్స్ ఆటోమొబైల్ వాహనం కోసం ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించడానికి ఇష్టపడడం లేదు. బదులు ఓలా, ఊబర్ లేదా మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ అంశాలన్నీ వాహన పరిశ్రమపై ప్రభావం చూపించాయి. వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి చెప్పారు. -
‘పీక్’ దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో : – తార్నాక లాలాపేట్‌కు చెందిన సునీల్ తాను నివాసం ఉంటున్న ఇందిరానగర్ నుంచి బాలానగర్ కోర్టు వరకు క్యాబ్‌లో వెళ్లాడు. సుమారు 20 కిలోమీటర్ల దూరం. సాధారణంగా అయితే రూ.350 వరకు చార్జీ అవుతుంది. కానీ ట్రాఫిక్ రద్దీని సాకుగా చూపుతూ ఏకంగా రూ.813 చార్జీ పడింది. గత్యంతరం లేక చెల్లించాడు. .. ఇవి కేవలం ఏ కొద్ది మంది ప్రయాణికులో ఎదుర్కొంటున్న అనుభవాలు మాత్రమే కాదు. నగరంలో ప్రతి రోజూ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య. పీక్ అవర్స్ (రద్దీ వేళలు), స్లాక్ అవర్స్ (రద్దీ లేని సమయం) పేరుతో క్యాబ్ సంస్థలు చార్జీల మోతమోగిస్తున్నాయి. కొద్దిపాటి వర్షం కురిసినా ట్రాఫిక్ రద్దీని సాకుగా చూపుతూ చార్జీలు పెంచేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేని సరికొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి. ప్రయాణికుడు బుక్ చేసుకున్న ప్రాంతానికి సమీపంలో క్యాబ్‌లు అందుబాటులో లేవనే సాకుతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వరకు రూ.100 వరకు చార్జీ అవుతుంది. కానీ సర్‌చార్జీతో కలిపి రూ.200కు పెంచేస్తారు. ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సర్వీసులు ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. చార్జీలపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. డైనమిక్ ఫేర్... ప్రత్యేకంగా ఏర్పాటు చేసే రైళ్లు, విమానాల తరహాలో క్యాబ్‌లలోనూ ప్రయాణికుల డిమాండ్ పెరిగిన కొద్దీ డైనమిక్ ఫేర్ అమలు చేస్తున్నారని, ప్రయాణికుల అత్యవసర సమయాన్ని ఇలా సొమ్ము చేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రద్దీని సాకుగా చూపుతూ రద్దీ లేని వేళల్లోనూ చార్జీలు పెంచడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మణికొండ నుంచి లింగంపల్లికి వెళ్లినప్పుడు ఎలాంటి రద్దీ లేదు. కానీ అదనంగా రూ.వంద పెంచేశారు. ఏ రకంగా ఇది సరైందో సమాధానం కూడా చెప్పడం లేదు.’అని పరమేశ్ విస్మయం చెందారు. సాధారణంగా ప్రయాణికులు బుక్ చేసుకున్న సమయంలో వాహనాల రద్దీ తక్కువగా ఉండవచ్చు. ఆ సమయంలో తక్కువ చార్జీలు నమోదవుతాయి. రద్దీ, ప్రయాణ సమయం పెరిగిన కొద్దీ చార్జీల్లో కొంతమేరకు వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు మొదట రూ.344 నమోదైతే ఆ తరువాత ఇది రూ.405కు పెరగవచ్చు. రద్దీ తక్కువగా ఉండి, నిర్ధారిత సమయం కంటే తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకున్నప్పుడు చార్జీలు కొంత మేరకు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది.కానీ అనూహ్యంగా చార్జీలు రెట్టింపు కావడం పట్లఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపుఆన్‌లైన్‌పేమెంట్‌లకు కొంతమంది డ్రైవర్లు అంగీకరించకపోవడం వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త చట్టంలోనూ లేని ప్రస్తావన... కేంద్రం కొత్తగా రూపొందించిన రోడ్డు భద్రత చట్టంలో క్యాబ్ అగ్రిగేటర్లు విధించే చార్జీలపైన ప్రభుత్వాలకు ఎలాంటి నియంత్రణ లేకపోవడం గమనార్హం. ‘‘ కొత్త చట్టం ప్రకారం క్యాబ్ అగ్రిగేటర్లు రవాణాశాఖ నుంచి తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవలసి ఉంటుంది. మోటారు వాహన చట్టం నిబంధనలకు విరుద్దంగా క్యాబ్‌లను నడిపితే రూ.లక్ష వరకు జరిమానా విధించే వెసులుబాటును ఈ చట్టం కల్పించింది. ♦ మణికొండ నుంచి లింగంపల్లి వరకు వెళ్లేందుకు పరమేశ్ ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. మొదట రూ.120 చార్జీ నమోదైంది. ఫరవాలేదనుకొని బయలుదేరాడు. తీరా దిగే సమయంలో అది రూ.220 అయింది. హతాశుడయ్యాడు. కస్టమర్‌కేర్‌ను సంప్రదించాడు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. పీక్ అవర్ కారణంగా చార్జీలు పెరిగాయని చెప్పారు. ♦ హెటెక్‌సిటీ నుంచి భువనగిరికి వెళ్లేందుకు మరో ప్రయాణికుడు కొద్ది రోజుల క్రితం ఔట్స్టేషన్ క్యాబ్ సర్వీసును బుక్ చేసుకున్నాడు. ఇది 8 గంటల ప్యాకేజీ. మొదట రూ.1600 బిల్లు నమోదైంది. తీరా గమ్యస్థానానికి చేరుకున్న తరువాత అది రూ.2750 కి పరుగెత్తింది. -
అక్కడ ఓలా, ఉబెర్‌కు షాక్!
సాక్షి, బెంగళూరు: క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబెర్‌కు గట్టి పోటీ ఎదురు కానుంది. బెంగళూరులో మరో కొత్త క్యాబ్ అగ్రిగేటర్ రంగంలోకి దిగుతోంది. క్యాబ్ సేవల మార్కెట్‌ను ఏలుతున్న ఈ దిగ్గజాలకు నగరంలో భారీ షాక్ తగలనుంది. ‘హోయసాల క్యాబ్స్’ పేరుతో కొత్త క్యాబ్ సంస్థ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. అటు ప్రయాణీకులకు, ఇటు డ్రైవర్లకు మంచి ప్రయోజనాలు అందించనున్నామని కంపెనీ చెబుతోంది. రూ. 6 కోట్ల పెట్టుబడితో నగరంలో క్యాబ్ సేవలను సెప్టెంబర్ 1 నుంచి లాంచ్ చేయనుంది హోయసాల క్యాబ్స్. ఈ మేరకు ఒకమొబైల్ యాప్‌ను కూడా రూపొందించామని సంస్థ ప్రతినిధి ఉమా శంకర్ తెలిపారు. ప్యాసింజర్లు, డ్రైవర్లు ఇద్దరికీ తమ సంస్థ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ‘పీక్ హవర్ చార్జీ’ పేరుతో అదనపు చార్జిని తాము వసూలు చేయబోమని వెల్లడించారు. 2500కు పైగా క్యాబ్స్, మరింత ఎక్కువమంది డ్రైవర్లు, తన ప్లాట్‌ఫాంలో చేరతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కంపెనీ సీవోవో జయసింహ. అంతేకాదు తమ డ్రైవర్లకు నగదు బహుమతులకు బదులుగా, ఉచిత తీర్థయాత్రలు, పిల్లలకు స్టడీ స్కాలర్షిప్లు, ఉచిత ఇంగ్లీష్ లెర్నింగ్ తరగతులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
క్యాబ్ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా?
సాక్షి, బెంగళూరు : ‘హల్లో నువ్వు నా క్యాబ్ దిగి నోర్మూసుకొని వెళ్తావా లేదా నీ దుస్తులు విప్పి నడిరోడ్డుపై రచ్చరచ్చ చేయాలా’ అంటూ ఉబర్ క్యాబ్ ఎక్కిన ఓ మహిళని డ్రైవర్ బెదిరింపులకు పాల్పడటమే కాకుండా అర్థరాత్రి నడిరోడ్డుపై ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. క్యాబ్ డ్రైవర్ బెదిరింపులకు చిగురుటాకులా వణుకుతూ.. బిక్కుబిక్కుమంటూ నడిరోడ్డుపైనే ఆమె అరగంటకు పైగా వేచి ఉన్నారు. అనంతరం మరో క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. బాధితురాలు పేరు అపర్ణ. క్యాబ్ ప్రయాణంలో తనకు ఎదురైన ఈ భయానక సంఘటనను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఆమె ఏమన్నారంటే.. ‘హాల్లో ఫ్రెండ్స్ నా జీవితంలో ఎదురైన భయానక ఘటన ఒకటి మీతో పంచుకుంటున్నాను. గత రాత్రి నేను స్నేహితులో కలిసి ఓ పార్టీకి వెళ్లాను. రాత్రి సమయం కావడంతో నా స్నేహితులు ఉబర్ క్యాబ్ బుక్ చేసి నన్ను ఇంటికి పంపిచారు. మార్గమధ్య డ్రైవర్ తన స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతూ.. కస్టమర్లను బూతులు తిట్టాడు. అయినప్పటికీ నేను అతని జోలికి పోలేదు. ఫోన్ మాట్లాడిన తర్వాత అతను నావైపు తిరిగి ‘ చూడడానికి చదువుకున్నదానిలా ఉన్నావ్..డ్యూటీ అయిపోగానే ఇంటికి వెళ్లొచ్చు కదా? ఎందుకు తాగుతారు. రాత్రి 7గంటలలోపు ఇంటికి వెళ్లక స్నేహితులతో కలిసి ఎందుకు తాగుతారు’ అంటూ నన్ను ప్రశ్నించారు. నేను మద్యం సేవించలేదని, నా గురించి అడగాల్సిన అవసరం మీకు లేదన్నాను. దీంతో అతను నాపై విరుచుపడ్డాడు. చెప్పడానికి వీలు కాని మాటలు అన్నాడు. నువ్వు నా కీప్‌గా కూడా పనికి రావు. నా బూట్లు తూడవడానికి కూడా నువ్వు సరిపోవంటూ అసభ్యకర పదజాలంతో తిట్టడం మొదలెట్టాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో నేను ఉబర్ సేప్టీ బటన్ నొక్కాను. ఉబర్ కస్టమర్ కేర్ నాకు ఫోన్ చేయకుండా డ్రైవర్‌కు ఫోన్ చేశారు. అతను నేను బాగా తాగి ఉన్నానని కస్టమర్ కేర్‌కు బదులిచ్చాడు. నేను గట్టిగా అరుస్తూనే ఉన్నాను. నాకు సహాయం చేయాలని కస్టమర్ కేర్‌ను కోరాను. అయినప్పటికీ ఎలాంటి సహాయం అందించలేదు. అంతేకాకుండా కస్టమర్‌కేర్‌కు కాల్ చేస్తే అది డ్రైవర్‌కు వెళ్తోంది. నేను గట్టిగా అరవడంతో కస్టమర్ కేర్ నాతో మాట్లాడి క్యాబ్ దిగాల్సిందిగా కోరారు. మరొక క్యాబ్ బుక్ చేశామని అందులో వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో డ్రైవర్ మరింత రెచ్చిపోయాడు. వెంటనే క్యాబ్ ఆపేసి ‘ వెంటనే నా కారు దిగి వెళ్లిపో.. లేదంటే ఇక్కడే నీ దుస్తులు విప్పి రచ్చరచ్చ చేస్తా’ అని బెదిరించారు. అప్పుడు రాత్రి 11.15గంటల సమయం అవుతుంది. ఉబర్ కస్టమర్ చెప్పిన ప్రకారం మరో క్యాబ్ రాలేదు. చేసేది ఏమి లేక నా స్నేహితులకు ఫోన్ చేసి మరో క్యాబ్‌లో ఇంటికి వెళ్లాను. ఉబర్ సంస్థ కస్టమర్లకు ఎంత సెక్యూరిటీని ఇస్తుందో ఈ సంఘటన ద్వారా తెలిసిపోయింది. తర్వాత కూడా ఉబర్ నుంచి నాకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. ఒక వేళ నాకు అక్కడ ఏదైనా జరిగిఉంటే ఎలా? ఉబర్ సంస్థ తమ కస్టమర్లకు కల్పించే సెక్యూరిటీ ఇదేనా?’ అంటూ అపర్ణ ట్విటర్లో ప్రశ్నించారు. అమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తమకు జరిగిన అనుభవాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఉబర్ క్యాబ్ డ్రైవర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని, ఎన్ని కేసులు నమోదైనా సంస్థ తగిన చర్యలు తీసుకోవడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. -
‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’
ముంబై: అదృష్టం అంటే ఈ ముంబై ఫ్యాషన్ డిజైనర్‌దే. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. నిజంగానే అదృష్టం కాకపోతే.. మెట్రో స్టేషన్ మీద నుంచి పది మీటర్ల రాడ్డు క్యాబ్ మీద పడటం.. అది కూడా డ్రైవర్ పక్కన ఉన్న ఖాళీ సీట్లో పడటం ఏంటి. దాంతో తాను లేచిన వేళ చాలా మంచిదైంది అనుకుంటున్నారు రింకు జైన్. వివరాలు.. గోరేగావ్‌కు చెందిన రింకు జైన్ ఫ్యాషన్ డిజైనర్. ఈ క్రమంలో పట్టణంలో ఓ బొటిక్ నిర్వహిస్తున్నారు రింకు. ఈ నేపథ్యంలో బుధవారం తన షాప్ వద్దకు వెళ్లడానికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. ముంబై వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో జోగేశ్వరి ప్లైఓవర్ కిందుగా క్యాబ్ ప్రయాణం చేస్తుండగా.. 10 మీటర్ల పొడవైన రాడ్ వచ్చి రింకు ప్రయాణిస్తున్న క్యాబ్ మీద పడింది. ఆ రాడ్ కాస్త డ్రైవర్ పక్కన ఖాళీగా ఉన్న సీట్లో పడింది. ఆ సమయంలో రింకు, ఆమె స్నేహితురాలు వెనక ప్యాసింజర్ సీట్లో కూర్చోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం గురించి రింకు మాట్లాడుతూ.. ‘నాకు ముందు సీట్లో కూర్చోనే అలవాటు. కానీ ఈ సారి లగేజ్ ఎక్కువ ఉండటంతో దాన్ని డ్రైవర్ పక్క సీట్లో పెట్టి.. నేను, నా ఫ్రెండ్ వెనక ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాం. ప్లైఓవర్ కిందకు రాగానే మేం ప్రయాణిస్తున్న క్యాబ్ మీద రాడ్ పడింది. ఈ సంఘటనతో మేం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాము. ఇప్పటికి కూడా ఆ భయం నుంచి కోలుకోలేదు’ అని తెలిపారు. -
నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన; అరెస్ట్
కోల్‌కతా: ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సీరియల్ షూటింగ్‌కు వెళ్లడానికి బుధవారం ఉదయం స్వస్తికాదత్త ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేశారు. కారులో షూటింగ్ స్పాట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసి, ఆమెను బయటికి లాగాలని ప్రయత్నించాడు. స్వస్తికా దత్త ప్రతిఘటించడంతో కారులోనే మరో చోటికి తీసుకెళ్లడానికి యత్నించి, ఫోన్లో తన ఫ్రెండ్స్‌ని కూడా రమ్మన్నాడు. దీంతో బెదిరిపోయిన నటి కారుదిగి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ కారుతో సహా పారిపోయాడు. ఇదంతా కేవలం అరగంట వ్యవధిలో జరిగిందని స్వస్తికా దత్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కారు నెంబర్, డ్రైవర్ పేరుతో సహా వివరాలను షేర్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. -
గాల్లో ఎగిరే కారు వచ్చేసింది!
కాలుష్యం.. ట్రాఫిక్.. ఈ రెండు చాలు నగర జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో తెలిపేందుకు. అయితే కొన్ని నగరాల్లో వీటి నుంచి మెట్రోరైలు కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ అంతకు మించిన ఉపశమనాన్ని మనకు అందించేందుకు ఉబర్ సంస్థ మరో ముందడుగు వేసింది. గాల్లో ఎగిరే ట్యాక్సీ కార్లను మన ముందుకు తెచ్చింది. దీన్ని చూసేందుకు హెలికాప్టరో.. కారో కూడా అర్థం కాదు. నలుగురు ఎంచక్కా ఈ కారులో వెళ్లొచ్చు. నార్త్ స్టార్ అనే కంపెనీతో కలసి ఉబర్ ఈ కారును డిజైన్ చేసింది. ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఉబర్ ఎలివేట్ సమ్మిట్–2019లో ఈ కారును ప్రదర్శనకు ఉంచింది. అయితే 2020లో తొలుత పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామని, 2023 వరకు ఎయిర్ ట్యాక్సీ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనుంది. అతి త్వరలోనే మన దగ్గరికి కూడా రావాలని కోరుకుందాం. -
ఎక్కే ముందు ఓ రేటు.. దిగాక మరో రేటు
ఓలా, ఉబర్ యాప్ చార్జీల్లో మోసాలు క్యాబ్ చార్జీలతో నగరవాసుల గుండె గుభేల్మంటోంది.ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రయాణానికిసంబంధించిన చార్జీ సదరు ప్రయాణికుడి ఫోన్లోని యాప్‌లో ఒక విధంగా, డ్రైవర్ ఫోన్లోని యాప్‌లో మరో విధంగాచూపిస్తుండడం గందరగోళానికి కారణమవుతోంది. దీంతో తరచూ ప్రయాణికులు, డ్రైవర్లకు మధ్య గొడవలుఅవుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఎంజీరోడ్ బుద్ధభవన్ నుంచి ఆటోనగర్‌కు వెళ్లేందుకు ఈ నెల 29న (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఒక ప్రయాణికుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. తన మొబైల్ యాప్‌లో 20.13 కి.మీ. ప్రయాణానికి రూ.344.30 చార్జీ నమోదైంది. అందుకు తన అంగీకారాన్ని తెలియజేసి క్యాబ్ ఎక్కేశాడు. సరిగ్గా 48.37 నిమిషాల్లో క్యాబ్ గమ్యస్థానం చేరుకుంది. తన మొబైల్లో నమోదైన చార్జీల ప్రకారం డ్రైవర్‌కు రూ.344 చెల్లించేందుకు డబ్బులిచ్చాడు. దీంతో డ్రైవర్ తన మొబైల్ యాప్‌లో నమోదైన విధంగా రూ.1120.18 చెల్లించాల్సిందేనని స్పష్టం చేశాడు. దీంతో ప్రయాణికుడి గుండె గు‘బిల్’మంది. తన మొబైల్లో నమోదైన చార్జీలు చూపించాడు. ఆ ప్రకారమే చెల్లిస్తానన్నాడు. అందుకు డ్రైవర్ ససేమిరా అన్నాడు. అలా చెల్లిస్తే తాన అకౌంట్లోంచి మిగతా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ప్రయాణికుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కువ చెల్లించబోనని తేల్చిచెప్పాడు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు ఎవరికి వారు ఫోన్లో ఉబర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. ప్రయాణికుడి మొబైల్లో నమోదైన ప్రకారమే చెల్లించాలని సమాధానం వచ్చింది. డ్రైవర్‌కు సైతం అతని మొబైల్ నమోదైన చార్జీలు వసూలు చేయాలని సూచించారు. నగరంలో తరచుగా ప్రయాణికులకు ఎదురవుతున్న క్యాబ్ కష్టాలకు ఈ ఉదంతం నిదర్శనం. ఇది ఒక్క ఊబెర్ మొబైల్ యాప్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ఓలా యాప్‌లోనూ ఇదే తరహా రెండు రకాల చార్జీలు నమోదవుతున్నాయి. దీంతో డ్రైవర్, ప్రయాణికుల మధ్య తరుచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఓలా మనీ ఉందనుకుంటే,... మరోవైపు ఓలామనీ నుంచి చెల్లించేందుకు అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది డ్రైవర్లు అందుకు అంగీకరించడం లేదు. నేరుగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలామనీ నుంచి తమ అకౌంట్లోకి డబ్బులు బదిలీ కావడం లేదని, దీంతో తాము నష్టపోవాల్సి వస్తుందని డ్రైవర్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితంఒక ప్రయాణికురాలు ఇదే విధమైన ఇబ్బందిని ఓలా కస్టమర్‌కేర్ దృష్టికి తెచ్చింది. దీనిపై ఎలాంటి సమాధానం లభించలేదని, చివరకు డ్రైవర్ డిమాండ్ చేసిన విధంగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని ఆమె విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి ఉదంతాలపై ఉబర్, ఓలా క్యాబ్ అగ్రిగేట్ సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి రెండు రకాల చార్జీల్లో ఎక్కువగా నష్టపోతుంది ప్రయాణికులే. చార్జీలు తక్కువగానే ఉన్నాయని క్యాబ్ ఎక్కిన వినియోగదారులు తీరా క్యాబ్ దిగిన తరువాత ఎక్కువ మొత్తంలో సమర్పించుకోవలసి వస్తోంది. ఎందుకిలా.. క్యాబ్ సంస్థలు ఇలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని చూపడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ప్రయాణికులు బుక్ చేసుకున్న సమయంలో వాహనాల రద్దీ తక్కువగా ఉండవచ్చు. ఆ సమయంలో తక్కువ చార్జీలు నమోదవుతాయి. రద్దీ, ప్రయాణ సమయ ం పెరిగిన కొద్దీ చార్జీల్లో కొంత మేరకు వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు మొదట రూ.344 న మోదైతే ఆ తరువాత ఇది రూ.405కు పెరగొచ్చు. రద్దీ తక్కువగా ఉండి, నిర్ధారిత సమయం కంటే తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకున్నప్పుడు చార్జీలు కొంత మేరకు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. కానీ అనూహ్యంగా రూ.1,120కి పైగా పెరిగే అవకాశాలు మాత్రం ఉండబోవు. ఎలాంటి మార్పులు, చేర్పులు ఉన్నా వినియోగదారుల మొబైల్ యాప్‌లతో పాటు, డ్రైవర్ల మొబైల్ యాప్‌లలో కూడా నమోదు కావాలి. కానీ అలా జరగడం లేదు. సాంకేతిక కారణాల వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని క్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒకవేళ ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చే స్తే మాత్రం అనంతరం వారి ప్రయాణాల్లో తగ్గిం పు ఉంటుందని చెప్పి సమస్యల పరిష్కారాన్ని దాటవేస్తున్నారు. రద్దీ లేకున్నా చార్జీలు ఎక్కువే.. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు రద్దీ వేళలుగా పరిగణిస్తారు. ఈ సమయాల్లో క్యాబ్ చార్జీలు అనూహ్యంగా పెరుగుతాయి. ఒక్కోసారి సాధారణ చార్జీలు రెట్టింపవుతాయి. కానీ రద్దీ లేని పగటి వేళల్లోనూ తరుచు గా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పగటిపూట, రాత్రి 9 తరువాత కూడా ఎక్కువ చార్జీలు న మోదవుతున్నాయని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పక్కా ప్లాన్‌తో ఊబర్ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ : కారును దొంగిలించాలనే కుట్రలో భాగంగా ఊబర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు ఓ డ్రైవర్‌ను దారుణంగా హతమార్చారు. అనంతరం ముక్కలుగా కోసి మురికి కాలువలో పడేశారు. వివరాలు.. తూర్పు ఢిల్లీలోని శాఖార్‌పూర్‌లో నివాసముండే రామ్‌గోవింద్ ఊబర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మంగళవారం ఢిల్లీలోని ఎంజీ రోడ్డు నుంచి ఘజియాబాద్‌కు ఫర్హాత్ అలీ (35, సీమా శర్మ (30) దంపతులు క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఘజియాబాద్‌కు చేరుకోగానే గోవింద్‌ను తమ ఇంటికి ఆహ్వానించారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం గోవింద్‌కు టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. అనంతరం అతన్ని గొంతు నులిమి హత్య చేశారు. మరునాడు మృతదేహాన్ని ముక్కలుగా కోసి మూడు సంచుల్లో ప్యాక్ చేసి నొయిడాలోని మురికి కాలువలో పడేశారు. తప్పుదారి పట్టించారు.. జనవరి 29న డ్యూటీ నిమిత్తం వెళ్లిన తన భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో గోవింద్ భార్య శాఖార్‌పూర్ పోలిస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, గోవింద్‌ను హత్య చేసిన అనతరం నిందితులు తెలివిగా వ్యవహరించారు. మృత దేహాన్ని పడేసిన తర్వాత క్యాబ్‌ను యథావిధిగా నడిపించారు. పోలీసులకు దర్యాప్తు సవాల్‌గా మారింది. మదాంగిర్ నుంచి కాపాషిరాలో కారు చివరగా బుక్ అయినట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. అక్కడి నుంచి కారులోని జీపీఎస్ పరికరం పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఫర్హాత్ దంపతులను మెహ్రౌలి-గురుగ్రామ్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిందితులు ఫర్హాత్ అలీ, సీమా శర్మ నేరాన్ని అంగీకరించారని తూర్పు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ వైజయంత ఆర్యా వెల్లడించారు. సాంకేతిక సహాయంతో గోవింద్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
మేము బంద్ చేస్తోంటే.. నువ్ పని చేస్తావా..
సాక్షి, ముంబై : పని వేళల్లో మార్పులు, ఆదాయంలో వాటా పెంపును కోరుతూ యాప్-బేస్డ్ క్యాబ్ డైవ్రర్లు ముంబయ్ వ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి నిర్వహిస్తున్నారు. ఎవరూ పనుల్లోకి పోకుండా నిరసన పాటిస్తున్నారు. అయితే, బంద్ కొనసాగుతుండగా క్యాబ్ నడుపున్నవంటూ ఓలా సంస్థకు చెందిన ఓ డ్రైవర్‌ను సోమవారం చితకొట్టారు. దుర్భాషలాడుతూ అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇప్పుడీ విడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, డ్రైవర్‌పై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తమ ఆదాయాన్ని లాక్కుంటున్నారు.. ఓలా, ఊబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ముంబయ్ వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది యాప్-బేస్డ్ డ్రైవర్లు నిరసనలకు దిగడంతో దేశ వాణిజ్య రాజధానిలో 90 శాతం మేర క్యాబ్‌లు షెడ్లకే పరిమితమయ్యాయి. కాగా, డ్రైవర్లు సోమవారం తమ నిరసనలను ముమ్మరం చేశారు. కుర్లాలోని ఊబర్ కార్యాలయం నుంచి అంధేరిలోని ఓలా ఆఫీస్ వరకు నల్ల జెండాలు ధరించి భారీ ర్యాలీ తీశారు. ఓలా, ఊబర్ సంస్థలు కుట్రకు పాల్పడుతున్నాయనీ, కావాలనే వినియోగదారుల వద్ద తక్కువ వసూలు చేసి తమకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. -
బూతులు తిడుతూ.. జుట్టు లాగి...
సాక్షి, ముంబై: క్యాబ్ ప్రయాణంలో ఓ జర్నలిస్ట్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. తోటి ప్రయాణికురాలు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడింది. ఈ ఘటన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు క్యాబ్ సంస్థ దర్యాప్తునకు సహకరించకపోవటంపై బాధితురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు దాడి చేసిన ఘటనను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పోస్టులు ఉంచారు. ముంబైకి చెందిన ఉష్నోటా జూన్ పౌల్ అనే జర్నలిస్ట్ ఉబెర్ పూల్ ప్రయాణం బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో క్యాబ్ ఉరిమి ఎస్టేట్ వద్దకు చేరుకోగానే క్యాబ్‌లో ఉన్న ఓ ప్రయాణికురాలు డ్రైవర్‌తో గొడవ పడింది. ‘తాను ఎక్కువ చెల్లించినప్పటికీ.. చివర్లో దించటమేంటని?’ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగింది. ఇంతలో ఉష్నోటా జోక్యం చేసుకుని డ్రైవర్‌కు మద్ధతుగా నిలిచారు. దీంతో సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. ఉష్నోటాపై పిడి గుద్దులు గుప్పిస్తూ.. పిచ్చి బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. వెంటనే ఉష్నోటా ఫోటోలు తీసేందుకు యత్నించగా, సదరు మహిళ ఫోన్ లాక్కుని పగలగొడతానని బెదిరించింది. ఈ వ్యవహారాన్నంతా డ్రైవర్ మౌనంగా ఊస్తూ ఉండిపోయాడే తప్ప, అడ్డుకోడానికి యత్నించలేదని ఆరోపణ. అంతలో స్థానికులు పెద్ద ఎత్తున్న గుమిగూడగా, అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ఉష్నోటాను రక్షించాడు. ఈ ఘటన తర్వాత దాడికి పాల్పడ్డ మహిళ అక్కడి నుంచి జారుకుంది. స్థానికుల సాయంతో ఉష్నోటా దగ్గర్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో స్పందించేందుకు ఉబెర్ సంస్థ నిరాకరించటంతో అసంతృప్తి వెల్లగక్కుతూ ఉష్నోటా ఫేస్బుక్, ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. గాయాలు, క్యాబ్‌లోపల ఆమె జట్టు పడి ఉన్న చిత్రాలను కూడా పోస్ట్ చేశారు. ఆమెకు మద్ధతుగా వందలాది రీ-పోస్టులు వెలియటంతో ఎట్టకేలకు ఉబెర్ యాజమాన్యం స్పందించింది. ‘ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ వ్యవహారంలో బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని, దర్యాప్తునకు తప్పకుండా సహకరిస్తామని’ ఉబెర్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆమె పోస్టుపై స్పందించారు. -
క్యా'బ్' పరేషాన్
దేశీయ రవాణా రంగంలోకి ప్రవేశించిన క్యాబ్ సంస్థలు ప్రయాణికులపై దండయాత్ర చేస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆటోరిక్షాలు, మెట్రో రైలు వంటి అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల చార్జీలను ప్రభుత్వమే నియంత్రిస్తుంది. కానీ సిటీలో క్యాబ్ సంస్థలపై మాత్రం నియంత్రణ అనేదే లేదు. వీటి చార్జీలపైనా ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకుండా పోయింది. మోటారు వాహన నిబంధనల మేరకు 2006లో ‘సిటీ క్యాబ్యాక్ట్’నుఅమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం కిలోమీటర్‌కు రూ.10 చొప్పున, రాత్రి వేళల్లో రూ.15 చొప్పున చార్జీలు ఉండేవి. బడా క్యాబ్ సంస్థల ప్రవేశంతో చార్జీల నియంత్రణ అంశం ఎవరి పరిధిలో లేకుండా పోయింది. దీంతో ‘పీక్ అవర్స్’ పేరుతో సగటు ప్రయాణికుడి నడ్డి విరుస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో:రవాణా రంగంలోకి దూసుకొచ్చిన అంతర్జాతీయ క్యాబ్ సంస్థలు విధించే చార్జీలు మొదట్లో ఆటోరిక్షా కంటే తక్కువగా ఉండేవి. ఈ చార్జీలతో ఆకట్టుకున్న ఊబెర్, ఓలా వంటి క్యాబ్ సంస్థలు ఇప్పుడు ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. ఆటోరిక్షాలు, ఇతర ప్రజా రవాణా వాహనాల్లో రాత్రి 10 గంటలు దాటాక మాత్రమే సాధారణ చార్జీలపైన 50 శాతం అదనపు చార్జీలు విధించే వెసులుబాటు ఉంది. కానీ క్యాబ్ సంస్థలు ప్రత్యేకంగా ‘పీక్ అవర్స్’ లేదా ‘స్లాక్ అవర్స్’కు వేర్వేరుగా చార్జీలు చార్జీలను పెంచేస్తున్నాయి. ఇలాంటి పెంపు నిబంధన నిర్దిష్టంగా లేకున్నా, నియంత్రించేవారు గాని.. కనీసం దీనిపై ఫిర్యాదు చేసేందుకు గాని అవకాశం లేకపోతోంది. వేసవిలో పెరిగిన క్యాబ్ డిమాండ్ కొద్ది రోజులుగా పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో పాటే క్యాబ్‌లకు డిమాండ్ పెరిగింది. సాధారణ రోజుల్లో 1.2 లక్షల క్యాబ్‌లు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తుండగా.. ప్రస్తుతం వేసవి రద్దీకి అనుగుణంగా సుమారు 1.6 లక్షల క్యాబ్‌లు తిరుగుతున్నాయి. 8 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజూ ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా చార్జీలను పెంచేస్తున్నారు. ఒకవేళ పీక్ అవర్స్‌లో క్యాబ్‌ల కొరత కారణంగా చార్జీలు పెరుగుతున్నట్లు భావించినా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు మాత్రమే పీక్ అవర్స్‌గా భావించాలి. కానీ క్యాబ్ చార్జీలు ప్రతి గంటకు మారిపోవడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లోనూ పీక్ అవర్ చార్జీలు విధిస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోపిడీకి సాక్ష్యాలివిగో.. ♦ దిల్సుఖ్నగర్ నుంచి బోడుప్పల్ వరకు 15 కిలోమీటర్లు ఉంటుంది. సాధారణంగా ఈ దూరానికి క్యాబ్ చార్జీ రూ.250 అవుతుంది. కానీ ఇటీవల ఓ ప్రయాణికుడు ఏకంగా రూ.798 చెల్లించాల్సి వచ్చింది. ♦ హైటెక్‌సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు సాధారణంగా రూ.300 నుంచి రూ.350 వరకు ఉంటుంది. కానీ రెండు రోజుల క్రితం ఈ చార్జీ రూ.650కి పెరగడంతో సదరు ప్రయాణికుడు బెంబేలెత్తాడు. ♦ గంట గంటకూ చార్జీలు జంప్ అవుతున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ♦ పీక్ అవర్స్ నెపంతో 1:2, 1:3, 1:4 చొప్పున చార్జీలను ఆయా క్యాబ్ సంస్థలు పెంచేస్తున్నాయి. ♦ మీటర్ ఆధారంగా నడిచే ఆటో రిక్షాలు, ట్యాక్సీలు తదితర వాహనాల చార్జీలపై ఆర్టీఏ, తూనికలు–కొలతలు శాఖల నియంత్రణ ఉంటుంది. కానీ మొబైల్ యాప్‌తో సేవలందజేస్తున్న క్యాబ్‌లను నియంత్రించే అధికారం ఏ ప్రభుత్వ విభాగానికీ లేకుండా పోయింది. ప్రభుత్వమే చార్జీలునిర్ణయించాలి బడా క్యాబ్ సంస్థలను ప్రభుత్వం నియంత్రించకపోవడమే ఇందుకు కారణం. ఆటోలు, ట్యాక్సీలకు ఉన్నట్లుగానే క్యాబ్‌లకు కూడా ఫిక్స్డ్ చార్జీలు ఉండాలి. ప్రభుత్వమే ఈ చార్జీలను నిర్ణయించి పారదర్శకంగా అమలు చేయాలి. – అనిల్ కొఠారి, గ్రీన్‌క్యాబ్స్ ఓనర్ మాకూ అన్యాయమే.. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల్లో సగానికి పైగా ఆవే తీసుకుంటాయి. జీఎస్టీతో సహా భారమంతా మా డ్రైవర్లపైనే వేస్తున్నారు. డీజిల్ ఖర్చులు, మెయింటనెన్స్ ఖర్చులన్నీ మినహాయిస్తే రోజుకు రూ.500 కూడా రావడం లేదు. – సిద్ధార్థ్గౌడ్, జై డ్రైవరన్న అసోసియేషన్ అధ్యక్షుడు -
ఉబర్‌లో వెళుతున్నారా? ఇది మీకోసమే..
న్యూఢిల్లీ : ప్రయాణ హడావుడిలో సాధారణంగా ప్రయణికులు అపుడపుడూ తమ వస్తువులను మరిచిపోవడం.. ఆనక గాభరా పడడం మనకు తెలిసిందే. అయితే క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ సంస్థ కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా ప్రచురించింది. తమ క్యాబ్‌ల్లో ప్రయాణించేవారిలో ఎక్కువగా వస్తువులు మర్చిపోతున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉందని వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా, ఫిలిపీన్స్ దేశాలు ఉన్నాయని ఉబర్ సంస్థ తెలిపింది. శుక్రవారం ఉబర్ యాప్ వెలువరించిన వార్షిక నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రయాణికులు మర్చిపోతున్న వాటిలో మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయట. అలాగే పెళ్లి కానుకలు, బంగారు నగలు ఈ వరుసలో తరువాతి స్థానంలో నిలిచాయని ఉబర్ వెల్లడించింది. అంతేకాదు ఉబర్ రిపోర్టులో బెంగళూరు నగరం ఎక్కువగా మర్చిపోతున్న నగరంగా ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రయాణికులు ఎక్కువగా మర్చిపోతున్న పది వస్తువులలో ఫోన్స్, బ్యాగ్స్, ఐడి కార్డులు, కళ్లద్దాలు, గొడుగులు ఉన్నాయి. చిన్న చిన్న వస్తువులే కాకుండా ఏకంగా ఎల్ఈడి టీవీలు, పిల్లల కోసం వాడే టెంట్ హౌస్‌లు లాంటి పెద్ద వస్తువులను మరిచిపోతున్నారట. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వస్తువులను మర్చిపోతున్నారని తెలిపింది. అదీ తరచుగా శని, ఆదివారాల్లో వస్తువులను మర్చిపోతుండటం గమనార్హం. ఉబర్ మార్కెటింగ్ అధికారి మాట్లాడుతూ.. ఉబర్ ప్రయాణాలలో వస్తువులను పోగొట్టుకున్నపుడు యాప్ ద్వారా ఎలాంటి సహాయం పొందగలరో ప్రయాణికులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా తరచుగా వస్తువులు పోగొట్టుకునే ప్రయాణికులను గుర్తించి వారి వస్తువులను తర్వాతి ప్రయాణంలో అప్పగిస్తున్నామన్నారు. అలాగే రైడ్ ముగిసిన తరువాత తమ వస్తువులను మరోసారి సరిచూసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
పరువు పోయింది.. రూ.334 కోట్లు కట్టాల్సిందే!
పారిస్: షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేసిన పాపానికి అది విడాకులకు దారితీసిందని ఫ్రెంచి వ్యాపారవేత్త లబోదిబో మంటున్నాడు. ఇందుకు కారణమైన ఉబర్ క్యాబ్ సంస్థ తనకు నష్టపరిహారంగా 40 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు 335 కోట్ల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని దావా వేశాడు. అసలు ఏం జరిగిందంటే.. దక్షిణ ఫ్రాన్స్ లోని కోట్ డీ అజర్ కు చెందిన ఓ వ్యాపారవేత్త ఓరోజు షికారుకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. భార్య మొబైల్ లో ఉన్న యాప్ తో ఓ ఈవెంట్ కి వెళ్లారు. ఆ తర్వాత భార్య మొబైల్ నెంబర్ నుంచి లాగ్ ఔట్ అయ్యాడు. అప్పటినుంచి ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా.. అతడి భార్య మొబైల్స్ కు అప్ డేట్స్ వెళ్తున్నాయి. కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ బిజినెస్ పని మీద ఉండే భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది. ఉబర్ క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తోందని ఆరోపించాడు. చివరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయి విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన పరువు పోయిందని, ఇందుకు కారణమైన ఉబెర్ సంస్థ తనకు 335 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు. తొలిసారి లాగిన్ డాటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్ కు మెస్సేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉబర్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు. -
క్యాబ్ డ్రైవర్ల ఆందోళన: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో ఉదయం 9 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించేందుకు క్యాబ్ డ్రైవర్లు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని.. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామని, దానిని అడ్డుకోవడం సరికాదని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ తెలిపారు. -
నేటి నుంచి క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్ష
-
నేటి నుంచి క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్ష
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి.. భారీ క్యాబ్ ర్యాలీతో ఇందిరా పార్కుకు చేరుకుంటామని, ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, ఉబెర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదన్నారు. రవాణా రంగంలోని ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగినప్పుడు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం.. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమని చెప్పారు. ఈ రెండు సంస్థల్లోనే 80 వేల క్యాబ్‌లు నమోదై ఉన్నాయని, ఆ క్యాబ్‌లు నడిపే తామంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లమేనని అన్నారు. బతుకుదెరువు కోసం అప్పు చేసి కార్లు కొనుగోలు చేశామని, ఓలా, ఉబెర్ సంస్థల మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు ఆ సంస్థలు తమను నిలువుదోపిడీ చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపా లని కోరారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిరుద్యోగులు డ్రైవింగ్ నేర్చుకుని ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, ఉబెర్, ఓలా సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని క్యాబ్ డ్రైవర్లు కోరారు. ముంబై, బెంగళూరు తర హాలో క్యాబ్‌లకు డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేసి హేతుబద్ధమైన చార్జీల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు, డ్రైవర్లకు భద్రత కల్పించేలా ఎస్ఓఎస్ ఫోన్లను ఏర్పాటు చేయాలని, తద్వారా వెహికల్ ట్రాకింగ్‌కు అవకాశం కలుగుతుందని చెప్పారు. దీంతో పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో ప్రయాణికులకు పూర్తి భద్రతతో కూడిన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సర్వేశ్వర్, సురేష్, రెడ్డి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 4వ రోజూ ఆగిన క్యాబ్‌లు.. మంగళవారం నాలుగో రోజు కూడా ఉబెర్, ఓలా క్యాబ్‌లు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారు ఆటోలు, ఇతర సంస్థలకు చెందిన క్యాబ్‌లకు అధిక మొత్తంలో సమర్పించు కోవలసి వచ్చింది. -
ఉబర్ క్యాబ్‌లో ఇంటికి తిరిగొస్తుండగా..!
హైదరాబాద్‌లో చిన్నారి రమ్య విషాదాంత ఘటన తరహాలోనే రాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాలు విడిచిన ఓ విద్యార్థిని ఉదంతం దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల అమ్మాయి కాయుం పెగూ బుధవారం కన్నుమూసింది. ముగ్గురు స్నేహితులతో కలిసి గత శుక్రవారం ఉబర్ క్యాబ్‌లో ప్రయాణించిన కాయుం.. మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణాలు విడిచింది. స్టెపెంబర్ 23న నోయిడాలోని సెక్టర్ 16ఏ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కాయుం ఐసీయూలో ఉందని, ఆమె కోసం ’ఓ పాజిటివ్’ రక్తాన్ని ఎవరైనా దానం చేయాలని కోరుతూ ఆమె సోదరుడు రికేష్ పెగూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టును 18వేల మంది షేర్ చేసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాయుం బుధవారం తుదిశ్వాస విడిచిందని అతని సోదరుడు ఫేస్బుక్లో వెల్లడించారు. ఢిల్లీలోని మిరాండ హౌస్ కాలేజీలో చదువుతున్న కాయుం గత శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి నోయిడాలో ఓ జన్మదిన వేడుకకు వెళ్లింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నలుగురు స్నేహితులు ఉబర్ క్యాబ్‌లో తిరిగి ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఎదురుగా పార్కింగ్ చేసిన ట్రక్కును ఢీకొట్టాడు. నిందితుడిని విఘ్నేష్‌గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఈ ఘటనలో గాయపడిన మిగతా ముగ్గురిని తనూజ కలిత, సిద్ధార్థ పాఠక్, అక్షర బడోలాగా గుర్తించారు. ఈ ముగ్గురికి ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. ‘క్యాబ్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. సిగరెట్ కాలుస్తూ క్యాబ్ నడిపిన అతను నేరుగా పార్కింగ్ చేసిన ట్రక్కును ఢీకొట్టాడు. స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ మమ్మల్ని పట్టించుకోకుండా సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు’ అని ఈ ఘటనలో గాయపడిన తనూజ కలిత తెలిపింది. కాయుం మృతికి కారణమైన ఉబర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని సహచర విద్యార్థులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తున్నారు. యువకుల ర్యాష్ డ్రైవింగ్ వల్ల హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య, బాబాయ్ రాజేశ్, తాతయ్య చనిపోయిన విషయం తెలిసిందే. -
రేప్ చేసేస్తానంటూ ఉబర్ డ్రైవర్ బెదిరింపు
‘‘నోర్మూసుకో.. లేకపోతే కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తా’’ అంటూ ఉబర్ క్యాబ్ ఎక్కిన ఓ యువతిని డ్రైవర్ బెదిరించాడు. ఈ దారుణం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నగరంలో జరిగింది. దాంతో ఆమె చిగురుటాకులా వణికిపోయింది. యాప్ ద్వారా ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్లొచ్చని అనుకుంటే.. ఈ రకమైన బెదిరింపులు రావడం చూసి హడలిపోయింది. దాంతో కదులుతున్న కారులోంచి కిందకు దూకేసింది. అయినా ఆగని డ్రైవర్, ఆమెను కారుతో తొక్కించేయాలని చూశాడు. దాంతో క్యాబ్ డ్రైవర్ సంతు పర్మాణిక్ (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో స్నేహితురాలు కలిసి క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆమె స్నేహితురాలు మధ్యలోనే దిగిపోయింది. అప్పటివరకు బాగానే ఉన్న డ్రైవర్, ఆ తర్వాతి నుంచి ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. వేగంగా వెళ్తూ సందుల్లోంచి వెళ్లసాగాడు. అవి బాగా నిర్మానుష్యంగా ఉండటంతో.. మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లాలని ఆమె చెప్పింది. తొలుత సరేనన్నా, కాసేపటి తర్వాత మళ్లీ సందుల్లోకే పోయాడు. దీనిపై ఆమె దిగాల్సిన ప్రాంతం వచ్చేవరకు ఆమెతో వాదిస్తూనే ఉన్నాడు. కారు ఆపమని తాను అనగానే అతడు ఒక్కసారిగా మండిపడ్డాడని, మరొక్క మాట మాట్లాడితే కిడ్నాప్ చేసి.. రేప్ చేస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. దాంతో భయపడిన తాను కిటికీ అద్దం కిందకు దించి, అరవడం మొదలుపెట్టానని, అయితే రోడ్డు నిర్మానుష్యంగా ఉండటంతో ప్రయోజనం కనిపించలేదని చెప్పింది. కిందకు దూకేయడానికి ఆమె ప్రయత్నించింది. అది గమనించిన డ్రైవర్.. తన సీటును వెనక్కి జరిపి ఆమెను అడ్డుకుని, పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా ఆమె తలుపు తెరుచుకుని కిందకు దూకేసింది. దాంతో అతడు అరుస్తూ కారు కింద తొక్కేస్తానని బెదిరించాడు. కారు రివర్స్ చేసుకుంటూ మీదకు రావడంతో ఆమె ఫుట్ పాత్ వద్దకు వెళ్లి బయటపడింది. తర్వాత ఆమె ఉబర్ సంస్థతో పాటు పోలీసులకు కూడా దీనిపై ఫిర్యాదుచేసింది. దాంతో పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేశారు. -
డ్రైవర్ నిద్రపోతే.. ప్యాసింజర్ టాక్సీ నడిపాడు!
పగలు, రాత్రి అని తేడా లేకుండా టాక్సీ నడిపే డ్రైవర్లకు మధ్యమధ్యలో కాస్తంత నిద్ర రావడం సహజం. అలాగని బేరాలు పోగొట్టుకోవడం కూడా వాళ్లకు ఇష్టం ఉండదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే గుర్గావ్లో ఓ టాక్సీ డ్రైవర్‌కు ఎదురైంది. అయితే, సదరు ప్యాసింజర్ మంచివాడు కావడం అతడికి కలిసొచ్చింది. ఈ వ్యవహారం అంతా 9 సెకండ్ల వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో ఆ ప్యాసింజర్ అప్లోడ్ చేశాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత గిల్ అనే ఫైనాన్షియల్ అనలిస్టు దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ నుంచి డీఎల్ఎఫ్ ఫేజ్2లో గల తన ఇంటికి ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. టాక్సీ కొంతదూరం వచ్చాక డ్రైవర్‌కు నిద్రమత్తు వచ్చి, డివైడర్‌ను ఢీకొట్టాడు. దాంతో, గిల్ సీట్లోంచి లేచి.. డ్రైవర్‌ను తన సీట్లో కూర్చోబెట్టి, తాను డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి సురక్షితంగా ఆ క్యాబ్‌లోనే ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడికి డబ్బులు చెల్లించేందుకు లేపుదామని ప్రయత్నించినా, అతడు ఎంతకూ లేవలేదు. దాంతో రూ. 500 నోటును డ్రైవర్ ఒళ్లో ఉంచి.. తన ఇంటికి వెళ్లిపోయాడు. టాక్సీ రావడం కూడా అరగంట ఆలస్యంగా వచ్చిందని గిల్ చెప్పాడు. ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండే మాత్రలు వేసుకున్నానని, దానివల్ల తల తిరుగుతోందని డ్రైవర్ చెప్పాడట. -
దోషిగా తేలిన శివకుమార్
-
‘ఉబర్’పై నిషేధం ఎత్తివేతకు హైకోర్టు నో
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని నగరంలో ఉబర్ క్యాబ్‌ల సంచారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యాచారం ఘటన అనంతరం ఓలా క్యాబ్ సంస్థకు అనుమతి ఇచ్చిన మాదిరిగానే తమ సంస్థకు కూడా ఊరట కల్పించాలంటూ చేసిన విన్నపాన్ని తిరస్కరించింది. అయితే ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వానికి ఈ నెల 29వ తేదీలోగా ఓ వినతిపత్రాన్ని దాఖలు చేయాలంటూ జస్టిస్ విభూ భక్రూ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఈ క్యాబ్‌లో ఓ మహిళా ఉద్యోగిని కొద్దిరోజుల క్రితం అత్యాచారానికి గురైన సంగతి విదితమే. ‘ఓలాకు మీకు ఎంతో తేడా ఉంది. చార్జీల మొత్తాన్ని ప్రయాణికుడు క్యాబ్ డ్రైవర్‌కు అందజేస్తాడు. మీ విషయంలో అలా కాదు. మరో విధానంలో ముందుకె ళ్లాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల ఆరో తేదీకి వాయిదా వేశారు. అనధికార ప్లే స్కూళ్లపై వివరణ ఇవ్వండి అనధికార, గుర్తింపు లేని ప్లేస్కూళ్లకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు... స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)తోపాటు స్థానిక నగర పాలక సంస్థలకు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సోషల్ జ్యూరిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజనాన్ని పరిశీలించిన జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ పీఎస్ తేజ్ నేతృత్వంలోని ధర్మాసనం పైవిధంగా స్పందించింది. -
మహిళా ఉద్యోగులకు కార్పొరేట్ అలర్ట్స్
ఉబర్ క్యాబ్ ఘటన నేపథ్యంలో ఈ-మెయిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా ఉద్యోగుల భద్రతకు పెద్దపీట వేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. అటు స్వీయ జాగ్రత్తలూ పాటించాలంటూ ఉద్యోగులకు సూచనలిస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఉబర్ క్యాబ్ సంఘటన నేపథ్యంలో కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల రూపంలో సందేశాలను చేరవేశాయి. కంపెనీ సమకూర్చే క్యాబ్స్‌ను మాత్రమే ప్రయాణానికి వినియోగించాలని ఆ సందేశాల్లో సూచిస్తున్నాయి. ఒకవేళ ఇతర వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తే వాహనం నంబరును రాసుకుని, సంబంధీకులకు ఆ నంబరును చేరవేయాలని గుర్తు చేశాయి. అయితే భద్రత ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించడమేగాక, ఉద్యోగులకు తరచూ సూచనలిస్తున్నట్టు కొన్ని కంపెనీలు వెల్లడించాయి. ఈ-మెయిల్ సందేశాలు.. మహిళా ఉద్యోగులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్యానాసోనిక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోటెక్, ఆర్పీజీ గ్రూప్, ఏజిస్, జెన్సర్ టెక్నాలజీస్ తదితర సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపించాయి. కొన్ని కంపెనీలైతే సమావేశ మందిరాల్లో ఉద్యోగులకు సూచనలు చేస్తున్నాయి. రాత్రి వేళ త్వరగా పని ముగించుకుని, అవసరమైతే మర్నాడు ముందుగా రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నట్టు హైసియా ప్రెసిడెంట్, ప్రోగ్రెస్ సాఫ్ట్వేర్ ఇండియా ఎండీ రమేశ్ లోగనాథన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భద్రత చర్యలు, స్వీయ రక్షణ గురించి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) తరఫున అన్ని వేదికలపైనా చెబుతున్నామని అన్నారు. ‘కొన్ని క్యాబ్ కంపెనీలను నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. వేలాది అనధికార క్యాబ్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశమే’ అని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడాలని అభిప్రాయపడ్డారు. అలర్ట్స్ కొత్తేమీ కాదు.. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ఉద్యోగులకు గుర్తు చేస్తున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. ప్రతి శుక్రవారం అందరు ఉద్యోగులకు భద్రతపరమైన సందేశాలు పంపిస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘రాత్రి 8 లోపే పనులను ముగిం చుకోవాలని మహిళా ఉద్యోగులకు చెబుతున్నాం. రాత్రి 8 తర్వాత వెళ్లేవారికి కంపెనీ కారులో గార్డు రక్షణతో పంపిస్తున్నాం. 10 ఏళ్ల నుంచి ఒకే క్యాబ్ ఆపరేటర్ సేవలందిస్తున్నారు. వాహనాలు, భద్రత ఏర్పాట్లను క్యాబ్ ఆపరేటర్‌తో కలసి తరచూ సమీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత చర్యలు నిరంతర ప్రక్రియ అని టీఎంఐ గ్రూప్ డీజీఎం అపర్ణా రెడ్డి తెలిపారు. స్వీయ రక్షణ విషయంలో ఉద్యోగులకు కంపెనీ నుంచి అలర్ట్స్ కొత్తేమీ కాదన్నారు.