Swara Bhasker Says Cab Driver Steals Her Groceries in Los Angeles - Sakshi
Sakshi News home page

Swara Bhasker: చేదు అనుభవాన్ని వెల్లడించిన నటి, ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Published Thu, Mar 24 2022 4:22 PM | Last Updated on Thu, Mar 24 2022 5:09 PM

Swara Bhasker Says Cab Driver Steals Her Groceries in Los Angeles - Sakshi

బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో షాపింగ్‌ చేసిన ఆమె క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. ప్రీయాడెడ్‌ స్టాప్‌లో దిగినప్పుడు క్యాబ్‌ డ్రైవర్‌ తన వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడంటూ ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేసింది స్వర. 'హేయ్‌ ఉబర్‌ సపోర్ట్‌.. లాస్‌ ఏంజిల్స్‌లో మీ కారు డ్రైవర్‌ ఒకరు నా వస్తువులు తీసుకుని ఉడాయించాడు. అవి నేను పోగొట్టుకోలేదు, అతడే దొంగిలించాడు. దీనిపై మీ యాప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో కనిపించడం లేదు. దయచేసి వాటిని తిరిగి నాకప్పగిస్తారా?' అని ట్వీట్‌ చేసింది. దీనిపై ఉబర్‌ యాజమాన్యం స్పందిస్తూ ఈ విషయంలో మీకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది.

అయితే నెటిజన్లు మాత్రం స్వరాను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 'నీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేనప్పుడు అమెరికా ఎలా వెళ్లావు? ముందు ఆ పేపర్స్‌ చూపించు', 'ఉబర్‌ తప్పకుండా సాయం చేస్తుంది, అంతకన్నా ముందు నీ డాక్యుమెంట్స్‌ చూపించాల్సి ఉంటుంది', 'ఏమిటేమిటి.. ఏ పత్రాలు లేకుండానే యూఎస్‌ వెళ్లావా?, 'ఆమెకు సాయం చేసి మీ టైమ్‌ వేస్ట్‌ చేసుకోకుండి ఉబర్‌, అమాయక డ్రైవర్ల మీద నిందలు మోపడం జనాలకు బాగా అలవాటైపోయింది. నాకైతే ఆమె ఫేక్‌ అనిపిస్తోంది' అంటూ స్వరను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: అభిమానులకు షాక్‌.. వారంలోపే పునీత్‌​ చివరి సినిమా జేమ్స్‌ను ఎత్తేస్తున్న థియేటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement