Swara Bhasker
-
రాహుల్ గాంధీ పాదయాత్రలో నటి స్వర భాస్కర్
నటి స్వర భాస్కర్ ఆదివారం ఉదయం ముంబైలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'జన్ న్యాయ్ పాదయాత్ర'లో చేరారు. కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. స్వర భాస్కర్, రాహుల్ గాంధీతో పాటు నడుస్తూ కనిపించారు. ఇందులో ఆయన ప్రియాంక గాంధీ, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా ఉండటం చూడవచ్చు. జన్ న్యాయ్ పాదయాత్ర అనంతరం స్వర భాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర అనే రెండు యాత్రలను ప్రశంసించారు. దేశం గత 10 సంవత్సరాలుగా ద్వేషం అనే మహమ్మారితో బాధపడుతోంది. ఈ యాత్ర వల్ల ప్రేమ ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని రెండు భారత్ జోడో యాత్రలు ప్రశంసనీయం. దేశంలో ప్రజలు రాహుల్ గాంధీని కలుసుకోవాలని.. వారితో మమేకం కావాలని కోరుకుంటున్నారని స్వర భాస్కర్ అన్నారు. ఈమె డిసెంబర్ 2022లో కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. न्याय संकल्प पदयात्रा 🇮🇳 अन्याय के खिलाफ जारी यह महासंग्राम नफरत, हिंसा, अत्याचार और तानाशाही को मिटाकर एक खुशहाल हिंदुस्तान की कहानी लिखने जा रहा है। हम अन्याय के विरुद्ध लड़ते रहेंगे आगे बढ़ते रहेंगे... न्याय का हक, मिलने तक ✊🏼 📍 मुंबई pic.twitter.com/H3Epzjmln1 — Congress (@INCIndia) March 17, 2024 -
హీరోయిన్ సీమంతం వేడుక.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆమెపై పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా పెళ్లైన కొన్ని నెలలకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. అప్పట్లో ఆమెపై నెటిజన్స్ ట్రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న స్వరభాస్కర్‌కు ఆమె భర్త సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..) ఆమె భర్త ఫాహద్ అహ్మద్ సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్వరభాస్కర్ సోషల్ మీడియాలో పంచకున్నారు. ఈ సందర్బంగా సీమంతానికి హాజరైన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. నాకు తెలియకుండా ప్లాన్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో వివాహం చేసుకున్నారు ఈ జంట. మార్చిలో సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఆ తర్వాత స్వరా భాస్కర్ గర్భం ధరించినట్లు జూన్నెలలో వెల్లడించింది. బేబీ బంప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. గతంలో స్వరా భాస్కర్‌పై నెట్టింట ట్రోల్స్ తెగ వైరలయ్యాయి. కాగా.. ఆమె 2009లో మధోలాల్ కీప్ వాకింగ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ భామ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీ లీడర్ ఫహద్ అహ్మద్‌ను పెళ్లాడిన సంగతె తెలిసిందే. పెళ్లయిన కొన్ని నెలలకే తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. మొదట సీక్రెట్‌గా చేసుకున్న భామ.. ఆ తర్వాత రిజిస్టర్ వివాహాం చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న నటి ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా తాను బేబీ బంప్‌తో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: షూటింగ్ గ్యాప్‌లో మందు తాగినందుకు చిరంజీవి తిట్టాడు: కోట) అయితే ప్రెగ్నెన్సీ ప్రకటించాక స్వర భాస్కర్ దారుణంగా ట్రోల్స్‌కు గురైంది. అప్పట్లో వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని పలువురు విమర్శించారు. కాగా.. ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్. (ఇది చదవండి: విమానంలో బిగ్‌బాస్ బ్యూటీకి వేధింపులు.. అది కూడా తప్పతాగి! ) View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
బేబీబంప్‌తో నటి పోజులు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాది పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇటీవలే స్వర భాస్కర్ ట్విటర్ వేదికగా ప్రెగ్నెన్సీని వెల్లడించింది. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. (ఇది చదవండి: మద్యానికి బానసయ్యా.. తాగుబోతు అని తిట్టేవారు: నటి) అయితే తాజాగా స్వర భాస్కర్ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. గర్భం ధరించాక తొలిసారిగా బయట కనిపించింది. తన భర్తకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన నటి.. బేబీ బంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేశారు. స్వర భాస్కర్ పెళ్లికి ముందే గర్భవతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ..' ఇంత తొందరగానా' అంటూ రాశాడు. మరో నెటిజన్ రాస్తూ..'పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ?' అంటూ కామెంట్ చేశాడు. మరొకరు రాస్తూ పెళ్లి సమయంలోనే ఆమె గర్భవతి అంటూ ట్రోల్ చేశాడు. ఇంతకుముందే ఆమెను టార్గెట్ చేస్తూ చాలాసార్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. కాగా..స్వర భాస్కర్ చివరిసారిగా బడ్డీ కామెడీ చిత్రం జహాన్ చార్ యార్ (2022)లో కనిపించారు. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. కలెక్షన్స్ ఎంతంటే?) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోలు వైరల్!
బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాది పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. తాజాగా నటి స్వర భాస్కర్ ప్రెగ్నెన్సీ వెల్లడించింది. ఈ మేరకు తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. (ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..! ) కాగా.. స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ థియేటర్లో అక్కడ ఎవరూ కూర్చోకండి) Sometimes all your prayers are answered all together! Blessed, grateful, excited (and clueless! ) as we step into a whole new world! 🧿❤️✨🙏🏽 @FahadZirarAhmad #comingsoon #Family #Newarrival #gratitude #OctoberBaby pic.twitter.com/Zfa5atSGRk — Swara Bhasker (@ReallySwara) June 6, 2023 -
పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని.. ఆ తర్వాత సాంప్రదాయబద్దంగా కూడా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే తాజాగా స్వర భాస్కర్‌ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్) బాలీవుడ్ నటి స్వర భాస్కర్ దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) నాయకుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే నటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. కొంతమంది నెటిజన్స్ చేసిన కామెంట్స్‌తో స్వర భాస్కర్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది. అయితే వీటిపై స్వర భాస్కర్ ఇంతవరకు స్పందించలేదు. ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ..'పెళ్లయిన నాలుగున్నర్ర నెలలకే బిడ్డకు జన్మనిచ్చి తన పనిని ముందుగానే పూర్తి చేశారు.' అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'పెళ్లయిన 3-4 నెలలకే స్వర భాస్కర్ తల్లి అయిన మాట నిజమేనా?’ అని ట్విట్టర్లో ప్రశ్నించారు. అయితే కొందరు నెటిజన్స్ ఆమెకు మద్దతుగా కూడా నిలిచారు. కాగా.. నవంబర్ 2021లో స్వరా ఒక బిడ్డను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది. (ఇది చదవండి: లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!) స్వరా భాస్కర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లు స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. स्वरा भास्कर ने विवाह के 4.5 महीने बाद ही बालक को जन्म देकर समय से पहले काम पूर्ण करने वाले गडकरी जी को दिखाया आईना !! — Raju Das Hanumangadhi Ayodhya (@rajudasji99) May 31, 2023 -
మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. జనవరి 6న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వరభాస్కర్ మరోసారి పెళ్లికి సిద్ధమైంది. తాను ప్రేమించిన ఫహద్ అహ్మద్‌నే మరోసారి పెళ్లాడనుంది. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ తాజాగా మరోసారి సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకోనున్నారు. ఈనెల 11నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఢిల్లీలోని స్వరభాస్కర్ అమ్మమ్మ ఇల్లు వీరి పెళ్లివేదిక కానుంది. ఈనెల 15-16 తేదీల్లో ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో స్వరభాస్కర్వివాహం ఘనంగా జరనుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Prateeq Kumar (@prateeq) -
వివాదంగా మారిన హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. ట్రోలింగ్ షురూ
నిత్యం వార్తల్లో నిలిచే హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలోనూ టాక్‌ఆఫ్ ది టౌన్‌గా మారింది.సమాజ్‌వాదీ పార్టీ ఫహాద్ అహ్మద్‌ను రహస్యంగా పెళ్లాడిన ఆమె తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. గతనెల 6నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న స్వర భాస్కర్ తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈమేరకు తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన వారి జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడీ పెళ్లి వివాదంగా మారింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని స్వర భాస్కర్ పెళ్లాడటంతో ముస్లిం వర్గాల నుంచి ఒకింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు గతంలో ఫహాద్‌ను స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచి ఇప్పుడు పెళ్లెలా చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలోనే ఫహాద్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆమె ఫహాద్‌ని అన్నయ్య అని పిలిచేది. అతని పుట్టినరోజు సందర్భంగా కూడా.. ఫహద్‌ను ‘భాయ్(సోదరుడు)అంటూ సంబోదిస్తూ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఇప్పుడీ ట్వీట్‌ను వైరల్ చేస్తూ.. అన్నా అని పిలిచిన వ్యక్తిని పెళ్లి ఎలా చేసుకోవాలనిపించి అంటూ స్వర భాస్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి దీనిపై ఆమె ఏమైనా కౌంటర్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. -
Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (ఫొటోలు)
-
రాఘవ్ చద్ధాకు స్వర భాస్కర్ వెరైటీ విషెష్
న్యూఢిల్లీ: పిన్న వయసులో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్ధాకు ప్రముఖ నటి స్వర భాస్కర్ వెరైటీగా విషెష్ చెప్పారు. ‘ఇక నుంచి రాఘవ్ చద్ధా పేరు చివర ‘గారు’ జోడించి పిలవాలేమో. ఎంపీ అయినప్పటికీ దీపావళి పార్టీలలో డ్యాన్స్ చేయకుండా వదలం. చద్ధా జీ అభినందనలు. మరింత ఎత్తుకు ఎదగాల ’ని స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. దీనికి రాఘవ్ చద్ధా తనదైన శైలిలో బదులిచ్చారు. ‘నా పేరు చివరిలో ఎటువంటి ప్రత్యయాలు అవసరం లేదు. డ్యాన్స్ ఫ్లోర్‌పైకి నన్ను బలవంతం చేయడం పార్లమెంటరీ ప్రత్యేక హక్కు ఉల్లంఘన/పార్లమెంటరీ ధిక్కారం అవుతుంద’ని ట్వీట్ చేశారు. కాగా, రాఘవ్ చద్ధా, స్వర భాస్కర్ మంచి మిత్రులు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చద్ధా తరపున ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రాఘవ్ చద్ధా, అశోక్ మిట్టల్, ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలు పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు గురువారం ఎన్నికయ్యారు. (క్లిక్: రాజ్యసభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం..) -
బాలీవుడ్ నటికి చేదు అనుభవం, క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు
బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో షాపింగ్ చేసిన ఆమె క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రీయాడెడ్ స్టాప్‌లో దిగినప్పుడు క్యాబ్ డ్రైవర్ తన వస్తువులు తీసుకుని వెళ్లిపోయాడంటూ ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేసింది స్వర. 'హేయ్ ఉబర్ సపోర్ట్.. లాస్ ఏంజిల్స్‌లో మీ కారు డ్రైవర్ ఒకరు నా వస్తువులు తీసుకుని ఉడాయించాడు. అవి నేను పోగొట్టుకోలేదు, అతడే దొంగిలించాడు. దీనిపై మీ యాప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో కనిపించడం లేదు. దయచేసి వాటిని తిరిగి నాకప్పగిస్తారా?' అని ట్వీట్ చేసింది. దీనిపై ఉబర్ యాజమాన్యం స్పందిస్తూ ఈ విషయంలో మీకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామంటూ రిప్లై ఇచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం స్వరాను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. 'నీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు అమెరికా ఎలా వెళ్లావు? ముందు ఆ పేపర్స్ చూపించు', 'ఉబర్ తప్పకుండా సాయం చేస్తుంది, అంతకన్నా ముందు నీ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది', 'ఏమిటేమిటి.. ఏ పత్రాలు లేకుండానే యూఎస్ వెళ్లావా?, 'ఆమెకు సాయం చేసి మీ టైమ్ వేస్ట్ చేసుకోకుండి ఉబర్, అమాయక డ్రైవర్ల మీద నిందలు మోపడం జనాలకు బాగా అలవాటైపోయింది. నాకైతే ఆమె ఫేక్ అనిపిస్తోంది' అంటూ స్వరను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. Hey @Uber_Support One of your drivers here in LA just took off with all my groceries in his car while I was on a pre-added stop! It seems there’s no way to report this on your app - it’s not a lost item! He just just took it. Can I please have my stuff back? 💁🏾♀️ #touristproblems — Swara Bhasker (@ReallySwara) March 23, 2022 చదవండి: అభిమానులకు షాక్.. వారంలోపే పునీత్ చివరి సినిమా జేమ్స్‌ను ఎత్తేస్తున్న థియేటర్లు -
ఐదేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఐసీయూ బెడ్‌పై ఉంది.. ఈ సినిమాతోనే ఆక్సిజన్ దొరికింది
Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాలో విభిన్నమైన పాత్రలు చేసే స్వరా వాస్తవ జీవితంలో కూడా విభిన్నంగా ఉంటుంది. సినిమాలపై స్పందన నుంచి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంది స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజన్ల మనోభావాలు దెబ్బతినే పోస్టులు, ట్వీట్లు పెట్టి ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంది స్వరా భాస్కర్. 'మీ కష్టంతో వచ్చిన విజయాన్ని చూసి మిమ్మల్ని ఎవరైనా అభినందించాలని అనుకుంటే.. గత ఐదేళ్లుగా తలలో చెత్త పెట్టుకుని గడపరనుకుంటా.' అని ట్వీట్ చేసింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ. అయితే ఈ ట్వీట్ 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ఉద్దేశించి చేసిందని నెటిజన్స్ స్వరాపై మండిపడుతున్నారు. ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటా స్వరా. ప్రజలు అడుగుతున్నారు.. తాము ఆదరిస్తున్న సినిమాను ఎందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు మెచ్చుకునేలా ఒక్క పదం కూడా మాట్లాడట్లేదని. అంటే కేవలం ప్రముఖమైన వారు మాత్రమే. మీరు చిల్ అవ్వండి.' అని నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ 'స్వరా చాలా తెలివైనది. ఒకరి కష్టంపై పేరు సంపాందించుకోవడం ఎలానో తనకు చాలా బాగా తెలుసు. కానీ జనం పిచ్చోళ్లు కాదు. నిన్ను నమ్మడానికి. ఇది నీ కెరీర్‌కు సహాయపడదు.' అని రాసుకొచ్చాడు. If you want someone to congratulate you for the ‘success’ of your efforts.. maybe don’t spend the last five years shitting on their heads.. 💁🏾♀️ #justsaying — Swara Bhasker (@ReallySwara) March 13, 2022 మరొకరైతే 'అతను అభినందించడానికి అర్హుడు స్వరా. ఐదేళ్ల నుంచి బాలీవుడ్ దాదాపు ఐసీయూ బెడ్‌పై ఉంది. ఈరోజు బాలీవుడ్‌కు అతనే ఆక్సిజన్ అందించాడు. ప్రజలు మర్చిపోయిన మిమ్మల్ని అతనే గుర్తు చేశాడు.' అని రాశారు. కాగా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, హన్సల్ మెహతా, ఆదిత్య ధర్ తదితరులు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ చిత్రానికి హర్యాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కల్పించాయి. He deserve to be Congratulated @ReallySwara Since 5 years Bollywood has almost in ICU Bed, Today he gave Oxygen for Bollywood.. You were deleted from people brain, he reminded.. If you not support him by thinking he's not Terrorists gang, then read comments@vivekagnihotri https://t.co/EOSyiB3jc3 — RaMesh Chauhan #BJP_Only (@RameshChauhanM) March 14, 2022 People are talking about big Bollywood stars .. U can chill..Nobody is expecting anything from you.. #TheKashmiriFiles https://t.co/WtX3whFLjn — Upadhya Dr 🇮🇳 (@LonelyStranger_) March 14, 2022 -
వారు తిరస్కరించిన పాత్రలతోనే నా కెరీర్ రూపొందింది..
Swara Bhaskar Says Her Career Made Up Of Roles Rejected By Others: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ పక్కన పెడితే.. వాస్తవ జీవితంలో మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నంగా ఉంటారామె. సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తారు స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టి.. ఆపై ట్రోలింగ్‌కు గురవుతారు. అయితే తాజాగా తాను నటించిన పాత్రల గురించి పలు ఆసక్తిర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కెరీర్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలు ఇతరులు వద్దనుకోవడం వల్లే తనకు వచ్చాయని పేర్కొన్నారు. 'రాంజనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి చిత్రాలలో నాకు వచ్చిన పాత్రలను మొదటగా వేరే నటీమణులకు ఆఫర్ చేశారు. ప్రేమ్ రతన్ ధన్‌పాయో సినిమాలో సల్మాన్ ఖాన్‌కు చెల్లెలిగా చేయాలని ఎవరు కోరుకుంటారు. ఇలాంటి పాత్రలన్నీ ఆఖరి నిమిషంలో అకస్మాత్తుగా వదులుకునేసరికి చివరిగా నన్ను సంప్రదించేవారు. అయితే ఇదందా నన్ను పెద్దగా బాధించేది కాదు. ఒక పాత్రను ఒప్పుకునేప్పుడు నేను బాక్సాఫీస్ గురించి, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయాలు పెద్దగా ఆలోచించను. ఇంకా వీరే ది వెడ్డింగ్ సినిమాలో ముందుగా నాకు బదులు రియా కపూర్ చేయాల్సింది. కానీ, ఆ పాత్రను నాకివ్వమని స్వయంగా రియా కపూర్ ఒప్పించింది.' అని పేర్కొంది స్వరా భాస్కర్. ఇలా ఇతరులు తిరస్కరించిన పాత్రలతో తన కెరీర్ రూపొందినట్లు, ఆ పాత్రలతోనే తనకు మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. -
కోవిడ్ బారిన పడ్డ మరో బాలీవుడ్ నటి
Actress Swara Bhaskar tests positive for Covid-19: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ఏక్తా కపూర్, మంచు లక్ష్మీ, మహేశ్ బాబు వంటి స్టార్స్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. 'నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి' అని సూచించింది. డబుల్ మాస్క్ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నా అని పేర్కొంది. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్, ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పలువురు ఖాన్ ఫ్యాన్స్కూడా సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తున్నారు. (Aryan Khan Drugs Case: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్) ఆ దేవునికి ధన్యవాదాలు. ఒక తండ్రిగా చాలా రిలీఫ్ పొందుతున్నాను. అంతా మంచిగా, సానుకూలంగా జరగాలని ఆశిస్తున్నానంటూ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు. అలాగే కాలమే తీర్పు చెబితే సాక్షులతో అవసరం లేదంటూ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, తదితరులు ట్విటర్ ద్వారా సంతోషాన్ని ప్రకటించారు.(Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ) ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియమించు కోలేరు. అంటే దీనర్థం అండర్ ట్రయల్ గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా అని ప్రశ్నించారు. అంతేకాదు ఇన్నాళ్లు ఆర్యన్‌కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా, అందుకే అనవసరంగా ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా? అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. కాగా ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ లభించింది. దాదాపు మూడు వారాల తరువాత ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. So if It just took Mukul Rahtogi’s argument, to get bail for Aryan , does it mean his earlier lawyers were so incompetent that he had to spend so many days in jail needlessly? — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021 Thank god . As a father I am So relieved .. … May all good and positive things happen. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 28, 2021 FINALLY ! 👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/2zW4ldEqpW — Swara Bhasker (@ReallySwara) October 28, 2021 -
స్వరా భాస్కర్ గృహ ప్రవేశం.. షాకైన నెటిజన్లు
ముంబై: పాత ఇంట్లో కొత్తగా గృహ ప్రవేశం చేశారు బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్. రెండున్నర సంవత్సరాల తరువాత గత నెలలో స్వరా తను పునర్నిర్మించిన( రినోవేటెడ్) పాత ఇంటిలోకి మారారు. కొత్త ఇంటికి మారిన శుభ సందర్భంగా ఆమె వినాయకునికి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గృహ ప్రవేశ పూజలో పాల్గొన్న ఫోటోలను స్వరా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. వీటిలో ఆమె సంప్రదాయబద్దంగా చీర ధరించి దేవతల ముందు కూర్చొని పూజారుల సాయంతో పూజ చేశారు. ‘దేవుళ్లు ఆమోదించారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. స్వరా భాస్కర్ గృహ ప్రవేశ ఫోటోలను చూస్తుంటే నటి ముఖంలో భక్తి భావన కొట్టొచ్చినట్ల కనిపిస్తోంది. అయితే వీటిని చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. దీనికి కారణం ఆమె గృహ ప్రవేశ పూజ నిర్వహించడమే. ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టే స్వరా ఇప్పుడు ఇలా భక్తి పారవశ్యంలో మునిగిపోవడంతో ఆశ్చర్యపోతున్నారు ‘మీరు ఎథిస్ట్ అనుకున్నాం కానీ ఇలా పూజలు చేస్తున్నారు వావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) ఇక మరో ఫోటోలో స్వరా భాస్కర్ పూర్తి సరదా మూడ్‌లో మునిగిపోయారు. స్వరా తలపై మట్టి కుండను తీసుకెళ్తున్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఆమె ముఖమంతా సంతోషం వెదజల్లుతుంది. కాగా స్వరా పోస్టులపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొత్త ప్రారంభానికి ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వరా గత నెలలో తన ఇంటికి వస్తున్నట్లు ఓ పోస్టు ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: తాలిబన్లపై పోస్ట్.. ‘స్వరాను 6 నెలలు ఆఫ్గనిస్తాన్‌కు పంపండి’ వావ్! వాట్ ఏ బ్యాలెన్స్..సోనూ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
తాలిబన్లపై పోస్ట్.. ‘స్వరాను 6 నెలలు ఆఫ్గనిస్తాన్‌కు పంపండి’
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ పక్కన పెడితే.. వాస్తవ జీవితంలో మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నంగా ఉంటారామె. సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తారు స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టి.. ఆపై ట్రోలింగ్‌కు గురవుతారు. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు స్వరా భాస్కర్. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచాకాలపై బాలీవుడ్ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్వరా భాస్కర్ తాలిబన్ల దాడుల మీద స్పందిస్తూ ట్వీట్ చేసి.. మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వరా ట్వీట్‌పై నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. తన ట్వీట్లో స్వరా ‘‘హిందూత్వ టెర్రరిజం’’ అనే పదాన్ని వాడారు. దీనిపై చాలా మంది నెటిజనుల అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాలిబన్ భీభత్సం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసింది. అయితే అక్కడితోనే ఆగిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం చేయండి. మన మానవతా, నైతిక విలువలు అణచివేత, అణచివేతకు గురైన వారి గుర్తింపుపై ఆధారపడి ఉండకూడదు’’ అంటూ స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. We can’t be okay with Hindutva terror & be all shocked & devastated at Taliban terror.. & We can’t be chill with #Taliban terror; and then be all indignant about #Hindutva terror! Our humanitarian & ethical values should not be based on identity of the oppressor or oppressed. — Swara Bhasker (@ReallySwara) August 16, 2021 ఈ ట్వీట్‌పై నెటిజనులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ‘‘స్వరా భాస్కర్ మరోసారి మా మనోభావాలను దెబ్బ తీశారు.. ఆమె కావాలనే ప్రచారం పొందడం కోసం హిందూత్వాన్ని వాడుకుంటుంది.. ఆమె ట్విటర్ అకౌంట్‌ని సస్పెండ్ చేసి.. అరెస్ట్ చేయండి’’.. ‘‘ఆమె హిందూత్వ ఉగ్రవాదం గురించి మాట్లాడుతుంది. అయితే ప్రభుత్వం ఓ పని చేయాలి. స్వరాను 6 నెలల పాటు అఫ్గనిస్తాన్ పంపించాలి. అక్కడ ఆమె తాలిబన్ల ఉగ్రవాదాన్ని రుచి చూస్తుంది.. దాంతో ఆమెకు రెండింటి మధ్య తేడా అర్థం అవుతుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. స్వరా భాస్కర్‌ను అరెస్ట్ చేయండి అనే హాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. -
స్వరా భాస్కర్, ట్విటర్ ఇండియా హెడ్‌పై ఫిర్యాదు.. కారణం?
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్‌తోపాటు ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరిపై ఢిల్లీలో ఫిర్యాదు నమోదైంది. ఈ నెల ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన వీడియోపై అనుచిత ట్వీట్లు చేసినందుకు వీరిద్దరిపై ఫిర్యాదు అందింది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనప్పటికీ ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా ఘజియాబాద్‌లో సూఫీ అబ్దుల్ సమద్ అనే వృద్ధుడిపై కొంతమంది దాడి చేసి తన గడ్డం కత్తిరించాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అతనితో వందే మాతరం, జై శ్రీ రామ్ అనాలని బలవంతం చేశారని ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేతలు, జర్నలిస్టులు తమ ట్విటర్లలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే నటి స్వరా భాస్కర్, పాత్రికేయురాలు ఆర్ఫా కన్నుమ్ శర్వాణి, ఆసిఫ్ ఖాన్ దాడి వీడియోను తమ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఓ న్యాయవాది తన ఫిర్యాదుతో బుధవారం ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. మత పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ వీడియోను వీరంతా షేర్ చేసి... శాంతికి విఘాతం కల్పించడంతో పాటు పౌరుల మధ్య మత కల్లోలాలను సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పందిస్తూ ఇందులో మతతత్వానికి సంబంధించిన విషయం ఏం లేదని స్పష్టం చేశారు. అదృష్టం పేరుతో మోసగించినందుకు అతనిపై కోపంతో హిందువులు, ముస్లింలు మొత్తం ఆరుగురు దాడి చేశారని పేర్కొన్నారు.ఇక ఇదే వీడియోపై ట్విట్టర్, ట్విట్టర్ కమ్యూనికేషన్ ఇండియా, ద వైర్ జర్నలిస్టులు మహ్మద్ జుబైర్, రానా అయూబ్, కాంగ్రెస్ నేతలు శర్మ మహ్మద్, సల్మాన్ నిజామీ, మస్కూర్ ఉస్మానీ, రచయిత సభా నఖ్వీలపై ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. -
సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: రైతు ఉద్యమానికి మద్దతిస్తూ.. అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు బుధవారం ఇండియాలో కలకలం రేపాయి. మా అంతర్గత విషయంలో మీ జోక్యం ఏంటి అంటూ క్రీడా, సినీ రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతి విద్వేశ ప్రచారం నుంచి దేశాన్ని కాపాడే బాధ్యతలో సెలబ్రిటీలు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఏక్తా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు సోషల్ మీడియాలో ‘ఇండియాటుగెదర్’ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. ‘‘రైతుల ఉద్యమాన్ని సాకుగా తీసుకుని దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దంటూ’’ సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇండియాటుగెదర్ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. వీరిదిలా సాగుతోంటే మరోవైపు దిల్జిత్ దోసాంజ్, కంగనా రనౌత్‌ల మధ్య మరో రచ్చ నడిచింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజనులు మరో ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తెచ్చి.. సెలబ్రిటీలను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు వారు గుర్తించిన ఆ ఆసక్తికర అంశం ఏంటంటే ఇండియాటుగెదర్‌లో భాగంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ చేసిన ట్వీట్స్ రెండు ఒకేలా ఉన్నాయి. అక్షరం పొల్లు పోకుండా.. సేమ్ టూ సేమ్ ఉన్నాయి. వీటిని చూసిన నెటిజనుల ‘‘ఎవర్ని ఎవరు కాపీ కొట్టి ఉంటారో అర్థమై చావడం లేదే’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇద్దరి ట్వీట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసి రీ ట్వీట్ చేస్తూ.. ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి ట్వీట్స్ మాత్రమే కాక మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్ అన్ని సేమ్ ఒకేలా ఉండటంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాక దేశంలో పలు ముఖ్యమైన అంశాలపై కామ్‌గా ఉండే బాలీవుడ్.. రైతుల ఉద్యమం అంశంలో మాత్రం మూకుమ్ముడిగా స్పందించడం ఏంటో అంటూ నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రైతు ఉద్యమంపై ట్వీట్ వార్) అయితే సెలబ్రిటీల తీరును మరి కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఖండిస్తున్నారు. సెలబ్రిటీలంతా ఒకే సమయంలో ఒకేలాంటి ట్వీట్లు చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్ని పేయిడ్ ట్వీట్లు.. లేదా బలవంతంగా.. ఒత్తిడి చేయడం వల్ల ఇలా ట్వీట్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ పన్ను చేసిన ట్వీట్ ఆలోచన రేకెత్తిస్తోది. ‘‘ఒక ట్వీట్ మీ ఐక్యతను దెబ్బతీస్తే, ఒక జోక్ మీ విశ్వాసాన్ని.. ఒక ప్రదర్శన మీ మత విశ్వాసాన్ని కించపరిస్తే.. అప్పుడు మీరు ప్రచార గురువుగా మారడానికి బదులు.. మీ విలువల వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలి’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: కోహ్లి మద్దతు.. నెటిజనుల విమర్శలు) If one tweet rattles your unity, one joke rattles your faith or one show rattles your religious belief then it’s you who has to work on strengthening your value system not become ‘propaganda teacher’ for others. — taapsee pannu (@taapsee) February 4, 2021 ఇక రైతులకు మద్దతుగా నిలిచిన నటి స్వరా భాస్కర్ ప్రతీ అంశంలో బాలీవుడ్‌ని నిరంతరం ప్రశ్నిస్తున్న వారిని ఎద్దేవా చేస్తూ.. మరో ట్వీట్ చేశారు. ‘రైతులకు మద్దతుగా నిలబడండి.. ఈ అంశంపై బాలీవుడ్ స్పందించాలి అనే వారికి ఇదిగో సమాధానం.. ఇప్పడేం అంటారు’ అంటూ స్వరా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. और बोलो ‘Speak Up Bollywood.. Speak up Celebrities’ 🤪🤪🤪🤪🤪🤪 — Swara Bhasker (@ReallySwara) February 3, 2021 -
రియాను దారుణంగా వేధిస్తున్నారు..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ ప్రేమికురాలు రియా చక్రవర్తికి సంబంధించి మీడియాలో రోజు ఏదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నటి స్వరా భాస్కర్ రియాకు మద్దతుగా నిలిచారు. మీడియా మంత్రగత్తెను వేటాడే విధంగా రియాను వేధిస్తుందని విమర్శించారు. ఉగ్రవాది కసబ్ విషయంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్వరా ట్వీట్ చేశారు. ‘కసబ్ విషయంలో కూడా మీడియా ఇలా ప్రవర్తించలేదు. కానీ రియా చక్రవర్తి విషయంలో మాత్రం దారుణంగా ప్రవర్తిస్తోంది. ఆమెకు సంబంధించిన విషపూరిత కథనాలతో ప్రజలను రెచ్చగొడుతుంది. భారతీయ మీడియాతో పాటు ఇలాంటి విషపూరిత కథనాలను ప్రొత్సాహిస్తున్నందుకు మనం కూడా సిగ్గు పడాలి’ అంటూ స్వరా ట్వీట్ చేశారు. (చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’) I don’t think even #Kasab was subjected to the kind of witch-hunt on media.. & media trial that #RheaChakrobarty is being subjected to! Shame on Indian Media.. Shame on us for being a toxic voyueristic public consuming this poisonous hysteria.. #RheaDrugChat #SushantSinghRajput — Swara Bhasker (@ReallySwara) August 26, 2020 నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి తన కుమారిడికి విషం ఇచ్చి చంపేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి సీబీఐ సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్ధ్ పితానీని ప్రశ్నించింది. -
నటి స్వర భాస్కర్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై కించపర్చే వ్యాఖ్యల చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు ఊరట లభించింది. ఆమెపై కోర్టు ధిక్కార చర్యకు సమ్మతి తెలిపేందుకు అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ ఆదివారం తిరస్కరించారు. ఈ ప్రకటన నేరపూరిత ధిక్కారం కాదు అని ఆయన పేర్కొన్నారు. స్వర భాస్కర్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టుపై ఎటువంటి అభ్యంతరకర వాఖ్య లేదని, సుప్రీం అధికారాన్ని తగ్గించే ప్రయత్నం జరగలేదని ఏజీ వెల్లడించారు. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ‘ముంబై కలెక్టివ్’ నిర్వహించిన ప్యానెల్ చర్చలో స్వర భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది సంస్థపైదాడిగా పేర్కొంటూ ఆమెపై క్రిమినల్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని కోరుతూ న్యాయవాదులు మహేక్ మహేశ్వరి, అనుజ్ సక్సేనా, ప్రకాష్ శర్మలతో కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏజీ ప్రతికూలంగా స్పందించారు. కాగా ఒక వ్యక్తిపైన అయినా కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించాలంటే కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్ 15 ప్రకారం అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి అవసరం. -
'జేఎన్‌యూ సందర్శనకు దీపికకు రూ.5 కోట్లు'
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఎంతటి హింసాత్మకంగా మారాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ముసుగు ధరించిన దుండగులు కొందరు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో జనవరి 7న బాధిత విద్యార్థులకు సంఘీభావంగా బాలీవుడ్ అగ్రతార దీపిక పదుకొనే జేఎన్యూకు వెళ్లారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. జేఎన్‌యూను సందర్శించడానికి ఆమె 5 కోట్ల రూపాయలను తీసుకుందంటూ ట్విటర్లో ప్రచారం జరుగుతోంది. (వివాదాస్పద సన్నివేశంపై స్పందించిన నటి) దీనిపై బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ స్పందించారు. ఇది పూర్తిగా అర్థం పర్థం లేని తప్పుడు సమాచారమని సదరు వార్తలను కొట్టిపారేశారు. "జేఎన్‌యూలో రెండు నిమిషాలు ఉన్నందుకే దీపిక ఐదు కోట్లు తీసుకుంది. కానీ స్వర భాస్కర్ ఏడాదిగా సీఏఏ కోసం వ్యతిరేకంగా అరిచి గీపెడుతున్నా కేవలం వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని మాత్రమే సంపాదించింది. దేవుడా... మనుషులకు నిరాశను ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ కమ్యూనిజాన్ని మాత్రం ఇవ్వకయ్యా" అని ఓ ట్విటర్ యూజర్ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దీనికి స్వర ఘాటుగా రిప్లై ఇస్తూ.. "బాలీవుడ్ గురించి తప్పుగా రాసే ఇలాంటి చెత్త వార్తలను ఎలా నమ్ముతారు అసలు? ఇంతకు మించిన మూర్ఖత్వం లేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. (జేఎన్‌యూలో దీపిక) -
అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్
ముంబై: ఇష్టపడిన వ్యక్తి నుంచి విడిపోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుందని.. అయితే దురదృష్టవశాత్తూ జరిగే సంఘటనలను ఎవరూ మార్చలేరని బాలీవుడ్ విలక్షణ నటి స్వరభాస్కర్ అన్నారు. ప్రేమలో ఉన్నపుడు ఒకరి కోసం ఒకరు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. సామరస్యపూర్వకంగా విడిపోవడంలో తప్పులేదన్నారు. రాంజానా, తను వెడ్స్ మను, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలతో స్వరా నటిగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2011లో ఓ సినిమా షూటింగ్ సమయంలో స్క్రీన్ రైటర్ హిమాంశు శర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు సజావుగానే సాగిన వీరి బంధం ఆ తర్వాత బీటలు వారింది. అప్పటి నుంచి ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ‘పింక్విల్లా’తో మాట్లాడిన స్వరభాస్కర్ ప్రేమ- బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. ‘విడిపోవడం అనేది దురదృష్టకరం. అయితే మా విషయంలో పరస్పర నిందారోపణలు లేవు. మా ఇద్దరిలో ఓ ఒక్కరు ఎలాంటి తప్పు చేయలేదు. చెడుగా ప్రవర్తించలేదు. ఎవరినీ ఎవరు మోసం చేయలేదు. మనం ఒక దారిలో ప్రయాణిస్తున్నపుడు అందులో ఎన్నో మలుపులు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తున్నపుడు ఒకరు కుడివైపు.. మరొకరు ఎడమ వైపు వెళ్లాలని అనుకుంటారు. అప్పుడు ఎవరో ఒకరు రాజీ పడాలి. నీతో కలిసి నడుస్తా అని చెప్పాలి. లేదంటే గుడ్ బై చెప్పి వెళ్లాలి. మా విషయంలో ఇదే జరిగింది. ఇతరుల అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. నా జీవితంలో ఇలాంటివి ఎదురైనపుడు నా కుటుంబం నాకు అండగా నిలబడింది. కాబట్టి చాలా తొందరగా బాధ నుంచి బయటపడ్డాను’అని పేర్కొన్నారు. -
నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ
జేఎన్‌యూలో జరిగిన దుండగుల దాడిపై బాలీవుడ్ తారలు స్పందించారు. హీరోయిన్ స్వరా భాస్కర్, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్ దేశ్‌ముఖ్ ట్విటర్ వేదికగా ఈ హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలోకి చోరబడి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విచక్షణా రహితంగా రాళ్లతో, ఇనుప రాడ్లతో విద్యార్థులపై దాడి చేయడంతో విద్యార్థులతోపాటు జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, నటి స్వరా భాస్కర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్వరా భాస్కర్ తల్లి జేఎన్‌యూలో ఉంటూ.. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులకు సహాయం అందిచాలని తన తల్లిని కోరారు. ‘‘ఢిల్లీ వాసులకు అర్జెంట్ అప్పీల్. బాబా మంగ్నాథ్ మార్గంలోని ప్రధాన గేట్ బయట పెద్ద సంఖ్యలో గుమిగూడండి. ముసుగులో ఉన్న ఏబీవీపీ వాళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి తీసుకురండి’’ అని కోరారు.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం) Urgent appeal!!!! To all Delhiites PLS gather in large numbers outside the Main Gate of JNU campus on Baba Gangnath Marg.. to pressure the govt. & #DelhiPolice to stop the rampage by alleged ABVP masked goons on JNU campus. PLS PLS share to everyone in Delhi!🙏🏿🙏🏿 9pm on 5th. Jan pic.twitter.com/IXgvvazoSn — Swara Bhasker (@ReallySwara) January 5, 2020 స్వరా పోస్టు చేసిన దానిపై స్పందించిన షబానా అజ్మీ..దాడిని కేవలం ఖండిస్తే సరిపోదు. ఈ చర్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే క్యాంపస్‌లో జరిగిన హింసకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు. ‘ఇదంతా నిజంగా జరుగుతుందా... ఓ పీడకలలా అనిపిస్తోంది. నేను ఇండియాలో లేను. దాడి కారణంగా 20 మంది విద్యార్థులు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు’ అని షబానా పేర్కొన్నారు. కాగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించాల్సిన చోట ఇలా జరగడం దారుణమని, ఇది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతుందని హీరోయిన్ తాప్సీ అన్నారు.. వీరితో పాటు రితేష్ దేశ్‌ముఖ్, దియా మిర్జా, విశాల్ దాద్లానీ సైతం ఈ ఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. This is beyond shocking ! Condemnation is not enough. Immediate action needs to be taken against the perpetrators . https://t.co/P5Arv9aNhj — Azmi Shabana (@AzmiShabana) January 5, 2020 such is the condition inside what we consider to be a place where our future is shaped. It’s getting scarred for ever. Irreversible damage. What kind of shaping up is happening here, it’s there for us to see.... saddening https://t.co/Qt2q7HRhLG — taapsee pannu (@taapsee) January 5, 2020 Why do you need to cover your face? Because you know you are doing something wrong, illegal & punishable. There is no honour in this-Its horrific to see the visuals of students & teachers brutally attacked by masked goons inside JNU-Such violence cannot & should not be tolerated — Riteish Deshmukh (@Riteishd) January 5, 2020 -
పౌరసత్వ రగడ: నటి ఆవేదన
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రముఖ నటి స్వరా భాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థులను క్రిమినల్స్‌గా చిత్రీకరిస్తున్నారని, వర్సిటీలో ఆందోళకారులపై పోలీసులు దాడి చేయడం సరైనది కాదని అన్నారు. సోమవారం స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె.. విద్యార్థులపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని ఆమె గుర్తుచేశారు. విద్యార్థుల వాదనను ప్రభుత్వం ఎందుకు వినడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీ చార్జ్ చేసి, హాస్టల్స్‌ను ధ్వసం చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.