బాలీవుడ్ భామ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‍వాదీ పార్టీ లీడర్ ఫహద్ అహ్మద్‌ను పెళ్లాడిన సంగతె తెలిసిందే. పెళ్లయిన కొన్ని నెలలకే తల్లి కాబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. మొదట సీక్రెట్‌గా చేసుకున్న భామ.. ఆ తర్వాత రిజిస్టర్ వివాహాం చేసుకుని ఒక్కటయ్యారు. ప్రస్తుతం గర్భంతో ఉన్న నటి ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా తాను బేబీ బంప్‌తో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
(ఇది చదవండి: షూటింగ్ గ్యాప్‌లో మందు తాగినందుకు చిరంజీవి తిట్టాడు: కోట)
అయితే ప్రెగ్నెన్సీ ప్రకటించాక స్వర భాస్కర్ దారుణంగా ట్రోల్స్‌కు గురైంది. అప్పట్లో వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని పలువురు విమర్శించారు. కాగా.. ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్.
(ఇది చదవండి: విమానంలో బిగ్‌బాస్ బ్యూటీకి వేధింపులు.. అది కూడా తప్పతాగి! )
Comments
Please login to add a commentAdd a comment