బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాది పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇటీవలే స్వర భాస్కర్ ట్విటర్ వేదికగా ప్రెగ్నెన్సీని వెల్లడించింది. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
(ఇది చదవండి: మద్యానికి బానసయ్యా.. తాగుబోతు అని తిట్టేవారు: నటి)
అయితే తాజాగా స్వర భాస్కర్ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. గర్భం ధరించాక తొలిసారిగా బయట కనిపించింది. తన భర్తకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన నటి.. బేబీ బంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేశారు.
స్వర భాస్కర్ పెళ్లికి ముందే గర్భవతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ..' ఇంత తొందరగానా' అంటూ రాశాడు. మరో నెటిజన్ రాస్తూ..'పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ?' అంటూ కామెంట్ చేశాడు. మరొకరు రాస్తూ పెళ్లి సమయంలోనే ఆమె గర్భవతి అంటూ ట్రోల్ చేశాడు. ఇంతకుముందే ఆమెను టార్గెట్ చేస్తూ చాలాసార్లు దారుణంగా ట్రోల్స్ చేశారు.
కాగా..స్వర భాస్కర్ చివరిసారిగా బడ్డీ కామెడీ చిత్రం జహాన్ చార్ యార్ (2022)లో కనిపించారు. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' చిత్రాల్లో నటించింది.
(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. కలెక్షన్స్ ఎంతంటే?)
Comments
Please login to add a commentAdd a comment