తొలిసారిగా బేబీ బంప్‌ ఫోటోను షేర్‌ చేసిన ఇలియానా | Ileana Poses With Baby Bump After Announcing Pregnancy | Sakshi
Sakshi News home page

Ileana: ఆ బిడ్డకు తండ్రెవరు? ఇలియానా బేబీ బంప్‌పై నెటిజన్ల సెటైర్లు

Published Thu, May 4 2023 3:01 PM | Last Updated on Thu, May 4 2023 3:32 PM

Ileana Poses With Baby Bump After Announcing Pregnancy - Sakshi

దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్‌ క్రష్‌గా మారింది. కెరీర్‌ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. స్టార్‌ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది.

ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా రీసెంట్‌గా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అనౌన్స్‌ చేయడంతో అందరూ షాక్‌ అయ్యారు. తాజాగా తొలిసారిగా తన బేబీ బంప్‌ను షేర్‌చేసింది. ప్రస్తుతం ఇలియానా షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. 

హీరోయిన్‌ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ మాత్రం ఇలియానా రివీల్‌ చేయకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement