Ileana DCruz
-
రెండోసారి గర్భం దాల్చిన ఇలియానా!
పాత సంవత్సరం వీడ్కోలు పలకగా కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలతో మన జీవితాల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 2024 ఎలా గడిచిందనేది పలువురూ గుర్తు చేసుకుంటున్నారు. సంతోషాలు, బాధలు, కష్టాలు, గుణపాఠాలు.. ఇలా ఎన్నో రకాల జ్ఞాపకాలను తడిమి చూసుకుంటున్నారు. హీరోయిన్ ఇలియానా (Ileana D'Cruz) కూడా 2024 గురించి చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉందనేది చూపించింది.మరోసారి ప్రెగ్నెన్సీజనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని చెప్పింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. ఇది చూసిన అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది మరో బుజ్జాయి రాబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇలియానా ప్రియుడు మైఖేల్ డోలన్‌ను పెళ్లాడింది. కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్ పూర్తి ఫొటోను షేర్ చేసింది.అప్పట్లో టాప్ హీరోయిన్సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. తొలి చిత్రం దేవదాసుతో అందరికీ తెగ నచ్చేసింది. పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్.. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్లో బర్ఫీ మూవీ ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో అందులో నటించింది. ఆ వెంటనే హిందీలోనే వరుస చిత్రాలు చేసింది. ఆమె బాలీవుడ్లోనే సెటిలైపోయిందన్న భావనతో ఇలియానాను సౌత్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)చదవండి: ముంబై వదిలేసి సౌత్‌కు షిఫ్ట్ అయిపోతా: అనురాగ్ కశ్యప్ -
చిన్న తప్పుతో టాలీవుడ్‌కి దూరం.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన కెరీర్‌ని డిసైడ్ చేస్తాయి. సినిమా యాక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఇలియానా పరిస్థితి ఇలాంటిదే అని చెప్పొచ్చు. 'దేవదాస్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్ బాబుతో చేసిన 'పోకిరి' హిట్ కావడంతో ఫేట్ మారిపోయింది. స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేసింది. తమిళంలో చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చేసిన ఓ మూవీ ఈమె కెరీర్ ఖతమయ్యేలా చేసింది!(ఇదీ చదవండి: RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?)దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఉన్న టైంలో ఇలియానా.. బాలీవుడ్లో అడుగుపెట్టింది. 'బర్ఫీ' మూవీ చేసింది. హిందీ చిత్రాలు చేస్తే చేసింది గానీ దక్షిణాది దర్శకులని కించపరచేలా కామెంట్స్ చేసింది. దీంతో ఈమెని తెలుగు, తమిళ దర్శకులు పట్టించుకోవడం మానేశారు. మరోవైపు మైకేల్ టోలన్ అనే విదేశీయుడితో ప్రేమలో పడి, చాన్నాళ్లు అతడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం హిందీ సినిమాల్లో మాత్రమే చేస్తున్న ఇలియానా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఛాన్సులు ఆగిపోవడం గురించి మాట్లాడింది. తెలుగు, తమిళ సినిమాల్లో చేస్తున్నప్పుడు హిందీలో 'బర్ఫీ'లో ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో వదులుకోలేకపోయాను. దీంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నానని.. దక్షిణాది చిత్రాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలు వచ్చింది. అందుకే సౌత్‌లో అవకాశాలు రావడం లేదని ఇలియానా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) -
అలాంటి 'దర్శకనిర్మాతల' వల్లే తెలుగులో ఛాన్సులు రాలేదు: ఇలియానా
'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్ హీరోయిన్గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్‌గానే చెప్పింది.2012లో ఇలియానాకు బాలీవుడ్లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ వార్తతో ఇక సౌత్ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది. -
అలా ఎవరైనా అంటే అస్సలు తట్టుకోలేను: హీరోయిన్ ఇలియానా
చేసినవి తక్కువే సినిమాలే అయినా టాలీవుడ్ గుర్తుండిపోయే హీరోయిన్లలో ఒకరైన ఇలియానా.. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటోంది. అయితే పెళ్లి చేసుకోకుండానే తల్లయిన ఇలియానాపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలానే కుటుంంబం, భర్తపై కూడా పలువురు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు దీనిపై స్వయంగా ఇలియానానే స్పందించింది. అలా మాట్లాడితే తట్టుకోలేనని ఆవేదన వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: నడుము అందాలతో అనుపమ.. కేతికని ఇలా చూస్తే అంతే!) 'గర్భవతి అయిన తర్వాత కూడా పనిచేయాలనుకున్నా. కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. అప్పుడు అమ్మ అండగా నిలిచింది. బిడ్డ పుట్టిన తర్వాత ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు నా భాగస్వామి మైకేల్ సపోర్ట్ చేశాడు. మా బంధం గురించి బహిరంగంగా చెప్పాలని లేదు. అలానే చేసి గతంలో విమర్శలు ఎదుర్కొన్నాను. నా గురించి ఏమన్నా తట్టుకోగలిగాను. కానీ నా భాగస్వామి(భర్త), కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేను' అని ఇలియానా చెప్పుకొచ్చింది. 2018లో చివరగా తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో కనిపించిన ఇలియానా.. ఆ తర్వాత హిందీకే పరిమితమైంది. రీసెంట్గా మార్చి 8న ఈమె నటించిన 'తేరే క్యా హోగా లవ్ లీ' చిత్రం రిలీజైంది. ఇది కాకుండా ఈ బ్యూటీ చేతిలో ఇంకో హిందీ మూవీ ఉంది. (ఇదీ చదవండి: కాస్ట్లీ నెక్లెస్‌తో సెన్సేషనల్ హీరోయిన్.. రేటు ఎంతో తెలుసా?) -
నేను ఫొటోలు దిగి చాన్నాళ్లయింది: ఇలియానా
‘‘నేను ఫొటోలు దిగి చాన్నాళ్లయింది. అలాగే ఈ ప్లాట్ఫామ్లో నా అబీప్రాయాలు షేర్ చేసి కూడా చాలా రోజులైంది. తల్లయ్యాక బిడ్డను చూసుకోవడం, ఇల్లు చక్కబెట్టుకోవడంతోనే సరిపోతోంది. నాకోసం టైమ్ కేటాయించుకోలేకపోతున్నాను’’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నారు ఇలియానా. గత ఏడాది ఆగస్టులో ఒక బాబుకి జన్మనిచ్చారు ఇలియానా. ప్రెగ్నెసీ తర్వాత సహజంగా కొందరికి ఏర్పడే డిప్రెషన్లాంటిది ఇలియానాకి కూడా ఏర్పడిందట. సినిమా స్టార్‌గా కొన్నేళ్లు మేకప్‌కి దగ్గరగా ఉన్న ఇలియానాకి ఇప్పుడు మేకప్ బాక్స్ తెరిచే సమయం కూడా లేదు. ఇక హెయిర్ స్టయిల్ అంటారా? గట్టిగా ముడి వేసుకునే ఉంటున్నారట. తల్లయ్యాక వచ్చిన ఆ మార్పులు గురించి ఇలియానా మాట్లాడుతూ – ‘‘మా చిన్నోడి చేతికి జుట్టు దొరికితే అంతే సంగతులు. అందుకే దాదాపు ముడి వేసుకునే ఉంటున్నాను’’ అంటూ ఆ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇంకా చెబుతూ – ‘‘అమ్మ అయ్యాక నా లైఫ్ స్టయిల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటివరకూ ఒక రకంగా.. ఇప్పుడు ఒక రకంగా. నాకు నేనే పరాయిదానిలా అనిపిస్తున్నాను. తల్లయ్యాక కొంతమంది త్వరగా కోలుకుని, పనిలో (కొందరు హీరోయిన్లు సినిమాలు చేయడం గురించి) పడిపోతారు. కానీ నేను అంత త్వరగా కమ్‌బ్యాక్ కాలేను. అయితే ఎప్పటికైనా రావడం ఖాయం. కాకపోతే త్వర త్వరగా కాకుండా నాకు కుదిరినట్లు మెల్లిగా వర్కవుట్స్ చేసుకుంటూ, పూర్వపు శక్తి తెచ్చుకున్నాకే వస్తాను. ఇలా ఇంటికి, నా బిడ్డకి అంకితం కావడం నాకు ఏమాత్రం బాధగా లేదు. ఎందుకంటే అన్నింటికన్నా నా జీవితంలోకి వచ్చిన ఈ అందమైన చిన్నోడు ముందు నాకు ఏదీ పెద్దగా అనిపించడంలేదు. ఇప్పుడైతే ప్రతి రోజూ ఓ 30 నిమిషాలు వర్కవుట్ చేస్తున్నాను. ఆ తర్వాత జస్ట్ ఓ ఐదు నిమిషాలు స్నానం చేసి, నా ఇంటి పనులతో బిజీ అవుతున్నాను. ఒక్కోసారి వర్కవుట్ చేసే వీలు కుదరడంలేదు. అయినా ఫర్వాలేదు. నేను చెప్పాచ్చేదేంటంటే కచ్చితంగా ‘బౌన్స్ బ్యాక్’ అవుతా. అయితే కొంత ఆలస్యంగా..’’ అన్నారు ఇలియానా. ఇదిలా ఉంటే... గత ఏడాది మైఖేల్ డోలన్‌ని పెళ్లాడారు ఇలియానా. అయితే కొన్నాళ్ల పాటు రహస్యంగా ఉంచారు. కుమారుడు పుట్టాక మైఖేల్ పూర్తి ఫొటోను షేర్ చేశారు ఇలియానా. -
కొప్పు పెట్టుకుని అందవిహీనంగా.. టైమే ఉండట్లే: ఇలియానా
దేవదాసు, పోకిరి సినిమాలతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఇలియానా. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె గతేడాది ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైంది. ఆ సమయంలో తన పార్ట్నర్ మైఖేల్ అండగా ఉన్నాడని గతంలోనే చెప్పుకొచ్చింది. అయితే తల్లిగా తన పిల్లాడిని చూసుకోవడానికే ఉన్న సమయమంతా అయిపోతుందంటోంది బ్యూటీ.. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. కొప్పు పెట్టుకుని అందవిహీనంగా.. 'ఒక తల్లిగా పిల్లాడిని చూసుకుంటూ ఇల్లు చక్కబెట్టడానికే సమయమంతా సరిపోతోంది. నాకంటూ టైమే దొరకడంలేదు. బాబుకు నా జుట్టు దొరక్కుండా నెత్తిన కొప్పు పెట్టుకుని అందవిహీనంగా తయారవుతున్నాను. ఓ సెల్ఫీ తీసుకోవాలన్న ఆలోచన కూడా రావడం లేదు. కానీ కొన్నిసార్లు ఇదెంతో కష్టంగా ఉంటోంది. కంటినిండా నిద్ర ఉండట్లేదు. దీని గురించి నేనేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాకంటూ ఓ బుడ్డోడు ఉన్నాడు.. అంతకన్నా సంతోషమేముంటుంది? అయితే ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్ గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు కానీ ఇది నిజంగా నిజం. మనకు మనమే పరాయివాళ్లమైపోతాము. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నాకంటూ కొంత సమయం కేటాయించుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాను. 30 నిమిషాలు వర్కవుట్ చేసి తర్వాత స్నానం చేస్తున్నా.. ఇది ఎంతో అద్భుతంగా పని చేస్తోంది. కానీ కొన్నిసార్లు వర్కవుట్ చేయడం కూడా కుదరడం లేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నా కొత్త జీవితం ఎలా ఉందో చెప్తున్నాను. ప్రసవం తర్వాత వెంటనే మునుపటిలా కొత్త ఎనర్జీతో కనిపించే తల్లుల జాబితాలోకైతే నేను రాను. అందుకు నాకు సమయం పడుతుంది. అయినా ఇలా ఓ సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేసి ఎన్నాళ్లైందో కదా!' ' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
'కార్తీకదీపం' కాన్సెప్ట్‌తో హిందీలో సినిమా? హీరోయిన్గా ఇలియానా
'కార్తీకదీపం'.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీరియల్ ప్రేమికులు అలెర్ట్ అయిపోతారు. ఆ సీరియల్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. మరీ ముఖ్యంగా ఇందులో నలుపుగా ఉండే వంటలక్క క్యారెక్టర్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తో హిందీలో సినిమా తీసి రిలీజ్‌కి రెడీ చేశారు. మనకు తెలిసిన ఇలియానా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'తేరా క్యా హోగా లవ్లీ'. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సేమ్ 'కార్తీకదీపం' సీరియల్లో ఉన్నట్లే ఇందులోనూ హీరోయిన్ నలుపు రంగులో ఉంటుంది. అక్కడ డాక్టర్ బాబు ఉంటే ఇక్కడ పోలీస్ బాబు ఉన్నాడంతే. (ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే) ట్రైలర్ బట్టి చూస్తే.. హీరోయిన్ నలుపుగా ఉంటుంది. దీంతో ఈమెని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లందరూ నో చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఓరోజు ఈమె పెళ్లి చేస్తే ఇవ్వడానికి అని ఉంచిన సామాన్లన్నీ దొంగతనానికి గురవుతాయి. దీంతో దర్యాప్తు కోసం ఓ పోలీస్ వస్తాడు. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. చివరకు ఏమైంది? హీరోహీరోయిన్ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ. ట్రైలర్ చూస్తే పైకి ఫన్నీగా అనిపిస్తున్నప్పటికీ.. ఇందులో అందం, వరకట్న లాంటి సామాజిక విషయాల్ని ప్రస్తావించారు. కాకపోతే వీటిని సీరియస్‌గా కాకుండా సున్నితమైన హాస్యంతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఇలియానా హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టం తెచ్చిపెడుతుందేమో చూడాలి? (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) -
ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా: పోకిరి భామ
పోకిరి భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయితే గతేడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అంతే కాకుండా తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టింది. అయితే ప్రస్తుతం బిడ్డతో మాతృత్వం ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో తన భాగస్వామి మైఖేల్ డోలన్‌కు సపోర్ట్‌గా ఉన్నారని వివరించింది. ఇలియానా మాట్లాడుతూ.. 'ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యా. కానీ ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నా. నేను నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను. ఇది నిజంగా తెలివి తక్కువ పని నాకు తెలుసు, కానీ నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు. అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తనను బాగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పా' అని అన్నారు. తన భాగస్వామిని గురించి మాట్లాడుతూ.. 'బిడ్డ పుట్టిన తర్వాత మేము కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాం. నేను ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నా. మైక్ ఇంత అద్భుతమైన భాగస్వామి అయినందుకు నేను నిజంగా లక్కీ. అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి.. ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు." అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే పర్సనల్ విషయాల్లో ప్రైవసీ మెయింటెన్ చేస్తున్న ఇలియానా.. తన పార్ట్నర్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కాగా.. ఇలియానా చివరిసారిగా ది బిగ్ బుల్లో అభిషేక్ బచ్చన్‌తో కలిసి కనిపించింది. ప్రస్తుతం ఆమె రణదీప్ హుడా సరసన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో నటించనున్నట్లు తెలుస్తోంది. -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న ఇలియానా!
దేవదాసు సినిమాతో హీరోయిన్గా ప్రయాణం మొదలుపెట్టింది ఇలియానా. సన్నజాజి తీగలా ఉండటంతో ఈమెకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. పోకిరి, జల్సా, కిక్, జులాయి.. ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బర్ఫీ మూవీతో హిందీ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌కు దూరమైంది. ప్రస్తుతం ఆమె నటించిన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ, లవర్స్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ! ఇదిలా ఉంటే ఇలియానా.. మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందని, ఈ ఏడాది మే నెలలో వీరి పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. ఆగస్టులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందీ బ్యూటీ. బాబు ఆలనాపాలనా చూసుకుంటున్న బ్యూటీ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా సినిమాలపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట. నిజంగానే గుడ్‌బై చెప్పనుందా? అందువల్ల ప్రస్తుతం తాను ఏ సినిమా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడం లేదని, భర్త, పిల్లాడితో అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇలియానా నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా? లేదంటే పిల్లాడు పెద్దయ్యేంతవకు మాత్రమే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు.. వీడియో చూశారా? -
భర్తని పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా.. ఇతడెవరో తెలుసా?
జీరో సైజ్ బ్యూటీ అననగానే చాలామందికి గుర్తొచ్చే పేరు ఇలియానా. అప్పట్లో పలు తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తన నాజుకు నడుముతో కుర్రాళ్లని పిచ్చెక్కించేసింది. ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో ఛాన్సులు తగ్గిపోవడంతో స్క్రీన్ పై కనిపించడం మానేసింది. ఇకపోతే ఈ ఏడాది ఆగస్టులో బిడ్డకు జన్మనిచ్చింది కానీ పెళ్లి-భర్త గురించి మాత్రం ఎక్కడ రివీల్ చేయలేదు. ఎట్టకేలకు ఇప్పుడు తన భర్త ఫొటోని బయటపెట్టింది. గోవా బ్యూటీ ఇలియానా.. 'దేవదాసు' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత' పోకిరి'తో స్టార్ హోదా దక్కించుకుంది. 10కి పైగా తెలుగు మూవీస్ చేసినప్పటికీ.. జల్సా, కిక్, జులాయి తప్పితే చెప్పుకోదగ్గవి ఈమె కెరీర్లో లేవు. అలానే తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఇక ఈమె నటించిన రెండు హిందీ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ లో తను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు బయటపెట్టిన ఇలియానా.. భర్త ఎవరు? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆగస్టులో మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్లకు ఫొటోని స్టోరీలో పెట్టింది తప్పితే అతడు భర్త కాదా అనేది రివీల్ చేయలేదు. తాజాగా ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటిస్తుండగా.. మీరు సింగిల్ పేరెంటా? అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి బదులిస్తూ తన భర్తతో కలిసున్న ఫొటోని ఇలియానా స్టోరీలో పోస్ట్ చేసింది. అతడి పేరు మైఖేల్ డోలన్ అని మాత్రమే తెలుసు తప్పితే అతడు ఏం చేస్తున్నాడు? ఇండస్ట్రీతో సంబంధం ఏమైనా ఉందనేది మాత్రం ఇంకా సస్పెన్స్. అలానే వీళ్లిద్దరూ ఈ ఏడాది మే నెలలోనే పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. కానీ ఇందులో నిజం మాత్రం తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజల్టిదే!) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచాడు: ఇలియానా
దేవదాసు మూవీ భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరీ సినిమాతో ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకుంది. పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం గోవాలోనే. నటిగా టాలీవుడ్లో దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచేసింది. ఆ చిత్రం విజయంతో తెలుగు దర్శక నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. దీంతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అలా అగ్ర కథానాయకిగా ఉన్న రోజుల్లోనే తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. బాలీవుడ్‌పై ఆశతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై మనసు పారేసుకుంది. అంతే ఆమె కెరీర్ అక్కడితో ఖతం అయిపోయిందని చెప్పాలి. (ఇది చదవండి: నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి) ఇక కేడీ చిత్రం ద్వారా పరిచయమైనా ఆ చిత్రం ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని విజయ్ సరసన నన్బన్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఓకే అనిపించుకున్నా ఇలియానా మాత్రం మళ్లీ ఇక్కడ కనిపించలేదు. ఆ తర్వాత హిందీలో కొన్ని చిత్రాలు చేసినా అవి సక్సెస్ కాలేదు. అలా ఇలియానా కథ ముగిసిపోయింది. అయితే ఈమె ప్రేమ గురించి పలు వదంతులు ప్రచారమయ్యాయి. కానీ ఇటీవలే చివరికి పెళ్లి కాకుండానే తల్లి కూడా అయ్యింది. ఆ తర్వాత మైకేల్ డోలన్ తన బిడ్డకు తండ్రి అని బహిరంగంగా ప్రకటించింది. ఇటీవలే ఇలియానా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కోయ ఫినిక్స్ డోలన్ అని నామకరణం చేసింది. ఈ సందర్భంగా తన మాతృహృదయం గురించి ఇలియానా ట్విట్టర్లో పేర్కొంది. అమ్మతనాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నట్లు చెప్పింది. (ఇది చదవండి: ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!) రెండు నెలలే పూర్తయిన తన బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో తన గుండె వేదనతో కొట్టుకుందని ఇలియానా చెప్పింది. కన్న బిడ్డ అనారోగ్యానికి గురైనప్పుడు కలిగే బాధను ఎలా భరించాలి అన్నది ఎవరు చెప్పరని తెలిపింది. ఏ మహిళ అయినా తల్లి అయిన తర్వాతే ఈ బాధ అర్థం అవుతుందని పేర్కొంది. అయితే తన ప్రేమికుడు తాను కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పారని తన కన్నీటిని తుడిచి నవ్వించారని చెప్పింది. ఆయన తన పక్కన ఉంటే ఏది కష్టం అనిపించలేదని, ఇప్పుడు తాను తన బిడ్డతో చాలా సంతోషంగా ఉన్నానని ఇలియానా చెప్పింది. -
ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాత సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..!
ప్రస్తుతం పోకిరీ భామ ఇలియానా పేరు నెట్టింట మార్మోగిపోతోంది. గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన భామ.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా బిడ్డ పేరును సైతం రివీల్ చేసింది. దీంతో ఇలియానా భర్త పేరుపై చర్చ మొదలైంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అతన్ని పెళ్లి చేసుకుందా? అని ఆరా తీస్తున్నారు. ఇంతకుముందే తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న భామ.. అతని పేరు, ఎవరనేది ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. (ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో) తాజాగా తన బిడ్డకు కోయా ఫోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. దీన్ని పెట్టిన పేరును పరిశీలిస్తే ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలుస్తోంది. అతనితో దాదాపు ఏడాది పాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే 13 న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని సమాచారం. ఇలియానా గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడానికి ఒక నెల ముందు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇలియానా భర్త మైఖేల్ గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. గర్భం ధరించాక పలుసార్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో భర్త ఫోటోలను సైతం రివీల్ చేసింది. (ఇది చదవండి: చేయి ఆడించడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా: నటి) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
9 నెలలు...బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన ఇలియానా
-
ప్రెగ్నెన్సీతో పోకిరీ భామ.. బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేసిన ముద్దుగుమ్మ!
పోకిరీ భామ ఇలియానా గురించి టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేదు. దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పోకిరీ మూవీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ముద్దుగుమ్మకు అవకాశాలు అంతేస్థాయిలో వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఇలియానా ఇప్పటి వరకు ఆమె భాయ్‌ఫ్రెండ్ ఎవరో బయటపెట్టలేదు. ఇటీవల ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పటికీ వాటితో ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది భామ. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!) తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు. అయితే తాజాగా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఉన్న ఇలియానా.. తన భాయ్‌ఫ్రెండ్‌ను ఫోటోను పంచుకుంది. డేట్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చి అతనితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అయితే పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా సోషల్ మీడియా పోస్ట్ చిత్రాలలో ఉన్న వ్యక్తి సెబాస్టియన్ కానందున ఊహాగానాలకు తెరపడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. అప్పటిలోగా తన భాయ్‌ఫ్రెండ్ పేరును ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రెగ్నెన్సీకీ బాలీవుడ్లో వెబ్ సిరీస్‌ల్లో నటించింది. (ఇది చదవండి: ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్) -
తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ ఇలియానా ఇబ్బందులు!
హీరోయిన్ ఇలియానా గురించి తెలుగు ఆడియెన్స్‌కి కొత్తగా చెప్పేదేం లేదు. 'పోకిరి' సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లింది. సినిమాలు- వెబ్ సిరీసులు చేసింది. అలాంటి బ్యూటీ.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. కొన్నినెలల ముందే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తొమ్మిది నెల కావడంతో తను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..) హీరోయిన్ ఇలియానా తెలుగులో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. కానీ తర్వాత కాలంలో సరైన సినిమాలు చేయకపోవడం ఈమె కెరీర్ కి మైనస్ అయిపోయింది. దీనికి తోడు ఆమె ఫిట్నెస్ పై దృష్టి పెట్టకపోవడం కూడా ఓ రకంగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గతేడాది కాస్త సన్నబడినప్పటికీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. ఇదంతా కాదన్నట్లు కొన్నాళ్ల ముందు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. తల్లి కాబోతున్నట్లు అయితే చెప్పింది కానీ ఎవరితో రిలేషన్ ఉందనేది మాత్రం ఇలియా తొలుత రివీల్ చేయలేదు. కొన్నిరోజుల ముందు ఆ వ్యక్తి ఎవరో ఫొటోని పోస్ట్ చేసినప్పటికీ పూర్తి స్పష్టత ఇవ్వలేదు. సరే ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భంతో ఏ పనిచేయలేకపోతున్నానని, ఎంతో నీరసంగా ఉందని తన ఇన్‌స్టా స్టోరీలో ఇలియానా రాసుకొచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. త్వరలో ఇలియానా ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. (ఇదీ చదవండి: గే రిలేషన్షిప్లో కొడుకు? నా నిర్ణయం అదే: 'అదుర్స్' విలన్) -
భర్త ఫోటోను షేర్ చేసిన పోకిరి భామ.. కానీ..!
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చింది. సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. (ఇది చదవండి: బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. మళ్లీ బ్యాడ్ కామెంట్స్) అయితే ఇందులో విచిత్రం ఏంటంటే.. ఇలియానా పెళ్లి చేసుకోకుండానే గర్భం ధరించడంతో టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతవరకు తన భర్త ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. అయితే గతంలో ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఇలియానా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాలో కుక్క పిల్ల ఫోటోను షేర్ చేస్తూ.. దానికి ముద్దుపెడుతున్న తన భర్త ఫోటోను కూడా పంచుకుంది. అయితే ఆ ఫోటోలో అతను ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. దీంతో ఇలియానా భర్త ఎవరనేది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. దీంతో ఇలియానా భర్త ఎవరో తెలియాలంటే మరి కొంత ఆగాల్సిందే. బిడ్డ పుట్టాకనైనా తన భర్తను అందరికీ పరిచయం చేస్తుందో లేదో వేచి చూద్దాం. (ఇది చదవండి: 'ఐ యామ్ నాట్ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్'... ఆసక్తిగా టీజర్ ప్రోమో) కాగా.. ఇలియానా చివరిసారిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్ బుల్లో కనిపించింది. ఫిల్మ్ మేకర్ కూకీ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ నిర్మించారు. ఆమె ప్రస్తుతం అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో రణదీప్ హుడాతో కలిసి నటించనుంది. -
ప్రెగ్నెన్సీ.. కంట్రోల్లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా!
ఒకప్పుడు బొద్దుగుమ్మలకు డిమాండ్ ఉండేది. కానీ కాలం మారుతూ ఉండేకొద్దీ సన్నజాజిలకు క్రేజ్ పెరిగిపోయింది. సరిగ్గా అలాంటి సమయంలో జీరో సైజ్ నడుముతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉంటే ఈ బ్యూటీ దేవదాసు చిత్రంతో తెలుగులో తళుక్కుమని మెరిసింది. ఆ తర్వాత పోకిరి, రెడీ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తరచూ బేబీ బంప్ ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. కానీ బిడ్డకు తండ్రెవరు? అన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. నువ్వు బరువు పెరుగుతున్నావని ఏమైనా ఆందోళన చెందుతున్నావా? అన్న ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ.. 'కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు బరువు పెరగడం సహజం. కానీ జనాలు దీని గురించి పదేపదే కామెంట్ చేస్తుండటంతో మొదట నేను కూడా కొంత కలవరపడ్డాను. డాక్టర్ దగ్గరకు చెకప్‌కు వెళ్లిన ప్రతిసారి బరువు చెక్ చేస్తుండటంతో ఎంత వెయిట్ ఉన్నానో తెలిసిపోయేది. నా కడుపులో ఒక శిశువు ప్రాణం పోసుకుంటున్న విషయాన్ని అందరూ గుర్తు చేసేవారు. అప్పుడు బరువు గురించి ఆలోచించడం అనవసరం అనిపించింది. కొన్ని నెలలుగా నా శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా చుట్టూ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి బరువు అనేది పెద్ద విషయం కాదు. సరిగ్గా ఇన్ని కిలోలు పెరిగితే చాలు వంటి నిబంధనలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మీ శరీరం మాట వినండి. మీ మనసుకు నచ్చిందే చేయండి' అని చెప్పుకొచ్చింది. తొలిసారి బేబీ గుండెచప్పుడు విన్నప్పుడు మీకెలా అనిపించింది? అన్న ప్రశ్నకు 'అత్యంత ఆనందమైన క్షణాల్లో ఇది ఒకటి. నేను ఎంత సంతోషించాను అనేదాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. సంతోషం, కన్నీళ్లు, తృప్తి.. ఇలా అన్ని భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి' అని పేర్కొంది ఇలియానా. చదవండి: రజనీకాంత్ భార్యగా నిరోషా? ఈ సినిమాతోనే రీఎంట్రీ -
తొలిసారిగా బేబీ బంప్ ఫోటోను షేర్ చేసిన ఇలియానా
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా రీసెంట్గా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. తాజాగా తొలిసారిగా తన బేబీ బంప్‌ను షేర్చేసింది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇలియానా రివీల్ చేయకపోవడం గమనార్హం. -
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే
చిత్ర పరిశ్రమలో డేటింగ్ అనేది సర్వసాధారణం. ఇద్దరు ఇష్టపడితే చాలు కలిసి సహజీవనం చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే తమ రిలేషన్‌ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. మరికొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లికి ముందే డేటింగ్ చేసి గర్భం దాల్చుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భంగా దాల్చారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం. ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్‌కి మకాం మార్చింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా ఇటీవల షాకింగ్ విషయం తెలిపింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో కొన్నాళ్లు డేటింగ్లో ఉన్న ఇలియానా.. 2019లో అతనితో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటుంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. త్వరలోనే బిడ్డకి తండ్రి ఎవరో ప్రకటించి, పెళ్లి పీటలేక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన అలియా.. 2022 ఏప్రిల్‌లో అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే అలియా ప్రెగ్నెంట్. కానీ వివాహం అయిన రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అమీ జాక్సన్ ఎవడు, రోబో 2.O చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అమీ జాక్సాన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం పెళ్లికి ముందే అకీరా నందన్‌కు జన్మనిచ్చింది. ‘బద్రి’ సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట.. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి అకీరా పుట్టాక పెళ్లి చేసుకుంది. మరో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు తీసుకున్నారు. పూర్ణ మలయాళీ బ్యూటీ పూర్ణ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ‘సీమ టపాకాయ్’, ‘అవును’చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. గతేడాది అక్టోబర్‌లో దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆరు నెలలు గడవకముందే ఏప్రిల్ 4న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దియా మీర్జా కల్కి కొచ్లిన్, నేహా ధూపియా అమృత అరోరా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చారు. -
తల్లి కాబోతున్న ఇలియానా...
-
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!
గోవా బ్యూటీ ఇలియానా గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇలియానానే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అంటూ ఉన్న చైన్‌ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..‘లిటిల్ డార్లింగ్ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను’అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇలియానా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఆమె ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటిజన్లకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ కొంతమంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే బిడ్డకు తండ్రి ఎవరో ఇలియానాకు తెలుసు. ఆ విషయంలో మనం జోక్యం చేసుకోవడం సరికాదు అని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఇలియానా పెళ్లి అయింది. కొన్నాళ్లు కలిసి జీవించిన ఈ జంట.. 2019లో విడిపోయారు. అప్పట్నుంచి ఆమె సింగిల్ గానే ఉంటోంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత భర్తను పరిచయం చేసే అవకాశం ఉందని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. సరోగసీ లేదా దత్తత తీసుకోవడం ద్వారా ఇలియానా తల్లి అయ్యే ఛాన్స్ ఉందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఇలియానా లైఫ్ పార్టనర్ ఎవరనేది అధికారికంగా ఎవ్వరికీ తెలియదు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
ఆస్పత్రి పాలైన ఇలియాన, ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో..!
ఇలియానా.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించింది గోవా బ్యూటీ. ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె పోకిరి మూవీతో మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన ఇలియాన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఫ్యాన్స్‌కి చేరువుగా ఉంటుంది. అయితే తాజాగా ఇలియాన తీవ్ర అస్వస్థతకు గురైంది. కనీసం ఆహారం తీసుకోలే స్థితిలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. తాజాగా తన హెల్త్ గురించి సోషల్ మీడియాలో ఇలియాన అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్ చేసింది. తాను ఆహారం తీసుకోలేని స్థితి ఉండగా వైద్యులు మూడు బాటిళ్ల సలైన్స్ ఎక్కించినట్లు ఈ సందర్భంగా చెప్పింది. తన పోస్ట్‌లో ఒక్క రోజులో ఎంత మార్పు అంటూ చేతికి సలైన్ ఎక్కిస్తున్న ఫొటోని షేర్ చేసింది. ఇక మరో ఫొటోకి.. డాక్టర్లు తనని బాగా ట్రీట్ చేస్తున్నారని, 3 బ్యాగ్స్ ఐవీ లిక్విడ్స్ ఇచ్చినట్లు క్యాప్షన్ ఇచ్చింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్, సన్నిహితులను ఉద్దేశిస్తూ ఆమె మరో పోస్ట్ షేర్ చేసింది. ‘అందరూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞుతురాలిని. ఇప్పుడ నేను బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది’’ అని పేర్కొంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆకాంక్షిస్తున్నారు. చదవండి: నా కూతురికి దూరంగా ఉండాల్సి వస్తోంది : ప్రణిత ఎమోషనల్ ఆ భయంతోనే అజిత్ సినిమాను వదులుకున్నాను: జయసుధ -
ట్రెండ్ సెట్టర్ 'పోకిరి'ని మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే!
'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఆడే పండుగాడు..' ఈ డైలాగ్ వినగానే బుర్రలో పోకిరి సినిమా గిర్రున తిరుగుతుంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పలు కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా నడిచి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా వచ్చి నేటికి 16 ఏళ్లు నిండాయి. 2006 ఏప్రిల్ 28న విడుదలైంది పోకిరి. మహేశ్ యాక్టింగ్‌కు, ఇలియానా అందాలకు, పూరీ డైరెక్షన్ మార్క్‌కు థియేటర్లలో విజిల్స్ మార్మోగిపోయాయి. అయితే ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఛాన్స్ మొదటగా ఇలియానాకు రాలేదు. పూరీ జగన్నాథ్ పోకిరి కోసం మొదటగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను సంప్రదించాడు. కానీ అప్పటికే ఆమె హిందీలో 'గ్యాంగ్‌స్టర్: ఎ లవ్ స్టోరీ' సినిమాకు సంతకం చేయడంతో పోకిరి చేయలేనని చెప్పేసింది. అలా ఆమె చేతిలో నుంచి సువర్ణ అవకాశం చేజారిపోయింది. విశేషమేంటంటే పోకిరి, గ్యాంగ్‌స్టర్ రెండూ ఒకేసారి రిలీజయ్యాయి. పోకిరి ఇక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే గ్యాంగ్‌స్టర్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. చదవండి: దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్‌గా మన హీరోయిన్! కంగనా తర్వాత పోకిరి ఛాన్స్ ఆయేషా టకియా, పార్వతి మెల్టన్, దీపికా పదుకొణెలకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ వీళ్లెవరూ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పి చేజేతులా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అలా ఈ బంపరాఫర్ గోవా బ్యూటీ ఇలియానా చేజిక్కించుకుంది. ఇక పోకిరి సినిమాలో ఆమె అందం, యాక్టింగ్‌తో ఎలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 16 Years since the Pandu gadu Mania took us away 💥🔥 A Remarkable TRENDSETTER in South Indian Cinema🤘 SuperStar's SWAG & VIBE will be Recreated with #SarkaruVaariPaata 😎💪#Pokiri #16YearsForSouthIHPokiri@UrstrulyMahesh #PuriJagannadh #Ileana #ManiSharma pic.twitter.com/a18kwTgsao — Viswa CM (@ViswaCM1) April 28, 2022 చదవండి: ఆడిషన్స్‌కు వెళ్తే రిజెక్ట్ చేశారు, అదే నా లక్ష్యం -
ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నా : ఇలియానా
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చెలామణి అయిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. దేవదాస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే బాడీ షేమింగ్ వల్ల ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఇటీవలె వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా ఈ వార్తలపై స్పందించింది. అవుతను నేను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ అది బాడీ షేమింగ్ వల్ల మాత్రం కాదు. 12 ఏళ్ల వయసునుంచే నాకు శరీర సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి నా శరీరాకృతి కారణం కాదు. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డిప్రెషన్లోకి వెళ్లా. అందుకే చనిపోవాలనుకున్నా. కానీ మీడియాలో మాత్రం బాడీ షేమింగ్, బాడీ డిస్మోర్ఫిక్ అంశాలతోనే ఆత్మహత్య ఆలోచన చేసినట్టు రాశారు. ఆ ఆర్టికల్ చూసి చాలామంది తనకు సందేశాలు పంపడం ప్రారంభించారు. దాంతో నాకు చాలా చిరాకు కలిగింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిందీ భామ. -
కొత్త బిజినెస్ మొదలు పెట్టనున్న ఇలియానా!
నటీనటులు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు.. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. గోవా బ్యూటీ ఇలియానా కూడా త్వరలో కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇలియానా కొత్త బిజినెస్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. అందులో భాగంగానే బేకరీ, రెస్టారెంట్లు వంటి చైన్ బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. హీరోయిన్గా తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని తన పేరుతోనే వీటిని మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నారని టాక్. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం అంటే రిస్క్ చేసినట్టే అనే కొందరు అన్నారట. ఇలియానా కూడా ఈ ఆలోచనతోనే లాక్డౌన్ తర్వాతే వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. సో.. భవిష్యత్తులో ఇలియానా బేకరీ, ఇలియానా రెస్టారెంట్‌కి శ్రీకారం జరుగుతుందన్నమాట. -
షూటింగ్లో ఇలియానా చేతికి గాయం
'దేవదాసు' చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా అడుగు పెట్టిన సన్నజాజి ఇలియానా. వరుస సినిమాలతో తెలుగులో హవా చూపిన ఈ భామ 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. హిందీ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోని'తో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చినా పెద్ద ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె బాలీవుడ్లోనే అవకాశాలు వెతుక్కుంటోంది. తాజాగా ఆమె 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఇలియానా గాయపడ్డారు. (చదవండి: రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!) ఆమె అరచేతికి స్వల్ప గాయమైంది. దీనికి సంబంధించిన రెండు ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. "ఒక రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగ్లో ఎవరైనా గాయపడతారా?" అని నవ్వుతూ సరదాగా రాసుకొచ్చారు. మరో ఫొటోలో "ఐయామ్ ఫైన్" అని తెలిపారు. ఇక ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం "అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ"లో హీరో రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వర్ణ వివక్షపై పోరాడే యువతి పాత్రలో ఇలియానా కనిపిస్తారు. ఇలియానా నటించిన ‘ముబారకాన్’ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లేను అందించిన బల్వీందర్ సింగ్ జంజ్వా ఈ చిత్రంతో దర్శకునిగా మారుతున్నారు. (చదవండి: నేనెప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలనుకోలేదు) -
ఇలియానా ఫోటోలను కొత్తగా ఓ లుక్కేద్దాం
ఇలియానా బాలీవుడ్ ప్రయాణం బర్ఫీ సినిమాలో ఒక ఛాలెంజింగ్ రోల్‌తో మొదలైంది. ఆ సినిమాలో ఎంతో ప్రతిభ ఉన్న రణభీర్ కపూర్, ప్రియాంక చోప్రా పక్కన్న తనదైన నటనతో ఆకట్టుకుంది. అప్పటి నుంచి తన నటనతో, హావభావాలతో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ప్రేక్షకులని కట్టిపడేస్తున్న ఈ గోవా బ్యూటీ ఈ సంవత్సరం తన 34వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 2019లో పాగల్పంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇలియానా ఈ సంవత్సరం కొన్ని కొత్త సినిమాలతో మనల్ని అలరించనున్నారు. (నివేదాకు వకీల్ సాబ్ టీమ్ స్పెషల్ గిఫ్ట్) ఈ న్యూ నార్మల్ కాలంలో తన తరువాతి సినిమా 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' టీమ్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ కూడా మొదలు పెట్టేసారని ఆమె తెలిపారు. సోనీ పిక్చర్స్ ఇండియా, మూవీ టన్నల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిరిస్తున్న అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ సినిమా నల్లగా ఉండడం వల్ల సమాజంలో ఎంతో పక్షపాతాన్ని ఎదుర్కొంటున్న ఒక అమ్మాయి కథ. హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఇలియానాకు జోడీగా రణదీప్ హుడా నటించనున్నాడు. ఇలియానా ఇంతకు ముందు నటించిన ముబారకాన్ సినిమాకు స్క్రీన్ ప్లే రాసిన బల్వీందర్ సింగ్ జాంజువా ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇలియానా పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లపై ఓ లుక్కేద్దాం... ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఆమె మానసిక ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తూ మనల్ని మనం జాగ్రత్తగా ఎలా చూస్కోవాలో చెప్తూనే ఉంటారు. 2020 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్‌లో దిగిన సెల్ఫీ ఒక్కసారిగా గుండెదడ పెంచేసింది. దీనికి క్యాప్షన్: ఈ రోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా మనం మన రోజూవారీ జీవితంలో మానసిక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతను ఇద్దామా? అంటూ పోస్ట్ చేసింది. సైజ్ జీరో చేప ఇలియానాకు బీచ్‌లపై, సముద్రంపై ఉన్న ప్రేమను మరోసారి చూపించుకున్నారు. గతంలో దిగిన ఈ ఫోటోలో తన ఈమె తన స్విమ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సర్వసాధారణంగా కనిపిస్తూ ఇలియానా న్యూ ఇయర్ పోస్ట్ చూస్తే తను గ్లామర్‌తో మెరవడమే కాదు సాధారణంగా కూడా అందంగానే ఉంటుందని చెప్పాల్సిందే. కుందనపు బొమ్మ పర్పల్ రంగు వెడ్డింగ్ గౌనులో విశ్వాసమే ఆభరణంగా ధరించిన ఇలియానా ఇంకా అందంగా కనిపిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి ఎవరూ ఊహించకుండా వచ్చిపడిన లాక్డౌన్ కాలంలో వర్క్అవుట్ తర్వాత సెల్ఫీని పోస్ట్ చేస్తూ అందరిని జాగ్రత్తగా ఉండమని కోరారు ఇలియానా. -
ఇలా చేస్తే అన్నీ మాయం!
ఇలా చేయండి బాధలు, భయాలు అన్ని మటుమాయమవుతాయి అని చెప్పుకొచ్చింది నటి ఇలియానా. ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఓహో అంటూ వెలిగిపోయిన విషయం తెలిసిందే. కాగా తమిళంలో ఆదిలోనే కేడీ చిత్రం ద్వారా పరిచయమైన ఈ అమ్మడిని ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్రాలకే పరిమితమైపోయింది. అలాంటిది చాలా కాలం తర్వాత నటుడు విజయ్‌కు జంటగా. శంకర్ దర్శత్వంలో నంబన్ చిత్రంతో కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు. అలాగని తెలుగు చిత్రాలను కాదనుకుని బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అయితే అక్కడ ఆశించిన ఆదరణ లభించలేదు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాల ప్రయత్నాల్లో ఉంది. కాగా ఈ కరోనా కాలంలో అందరూ నటీమణుల మాదిరిగానే ఇలియానా కూడా మీడియాతో భేటీలు అభిమానంతో ముచ్చట్లు అంటూ కాలం గడుపుతోంది. అదేవిధంగా ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు వంటి కసరత్తులు చేస్తూ అందాలను పదిల పరుచుకుంటోంది. అలా ఇటీవల ఇలియానా ఒక భేటీలో పేర్కొంటూ కొన్ని సమయాల్లో మనసు తట్టుకోలేనంత బాధ, భయం కలుగుతాయి అని చెప్పింది. అలాంటి సమయాల్లో తాను వ్యాయామాలు చేస్తానని చెప్పింది. అప్పుడు భయం, బాధలు అన్ని మటుమాయం అయిపోతాయి అని చెప్పింది. కాబట్టి అందరూ ఈ సూత్రాన్ని పాటించండి అని పేర్కొంది. వ్యాయామం చేస్తున్నప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటున్న భావన కలుగుతుందని చెప్పింది. ( నాలో మంచి కుక్ ఉందని తెలుసుకున్నా! ) ఆ మధ్య కాస్త బరువు పెరిగానని దీంతో కొందరు రకరకాలుగా విమర్శలు చేశారని తెలిపింది. దీంతో తీవ్రంగా కసరత్తులు చేసి ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా యథాస్థితికి మారినట్లు తెలిపింది. తాను నిత్యం వ్యాయామం చేస్తారని తెలిపింది. ఆన్లైన్లో చూసి రకరకాల వ్యాయామాలు చేస్తానని చెప్పింది. ఇంత సమయం అని పరిమితులు ఉండదని ఒకసారి 75 నిమిషాలు చేస్తే, మరోసారి రెండు గంటల వరకు చేస్తారని చెప్పింది. ఇలా అందరూ వ్యాయామం చేసి అందరూ మంచి ఆరోగ్యంతోపాటు శరీరాన్ని బలంగా ఉంచుకోవాలని ఇలియానా సలహా ఇచ్చింది. ఒక్కసారి వ్యాయామం చేసి చూడండి దాని ఫలితం మీకే అర్థం అవుతుంది అని ఈ బ్యూటీ పేర్కొంది. -
‘రోజుకు 12 మాత్రలు వేసుకున్నా’
నటి ఇలియానా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రతి నిత్యం ఏదో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండేదో, ఇప్పుడు అలా ఉండడానికి ప్రయత్నిస్తోంది. 2005లో సినీరంగ ప్రవేశం చేసింది ఈ గోవా బ్యూటీ . తెలుగులో దేవదాస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ మూవీ సక్సెస్‌తో వరుస అవకాశాలను రాబట్టుకుని స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తమిళంలో పరిచయం అయిన కేడీ చిత్రం ఈ జాణను నిరాశ పరిచింది. దీంతో కోలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. తెలుగులో వెలిగిపోతున్న రోజుల్లో నన్బన్ అనే చిత్రంతో కోలీవుడ్‌లో రీఎంట్రీ అయ్యింది. అయితే ఇక్కడ అదే ఇలియానాకు చివరి చిత్రం. తెలుగులో క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌పై దృష్టి సారించడంతో దక్షిణాదికి దూరమైంది. అదే సమయంలో ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో మునిగిపోయింది. అయితే ఆ ప్రేమ ఎంతో కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా ఈ మధ్యనే బ్రేకప్ అయ్యింది. అయితే ఆండ్రూతో లవ్ బ్రేకప్ నటి ఇలియానాపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఈ విషయాన్ని తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తన ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆండ్రూకు సంబంధించిన జ్ఞాపకాలను తుడిచేసినా, మానసికంగా వాటి నుంచి బయటపడడం సుల భం కాలేదు. అతనితో లవ్ బ్రేకప్ ఇలియానాను మానసికంగా చాలా కృంగదీసింది. దీని గురించి ఇలియానా తెలుపుతూ ఆ మనోవేదన నుంచి బయటపడడానికి వారమంతా చికిత్స కోసం ఆస్పత్రి చుట్టూ తిరిగానంది. దీంతో చిత్రాల్లో నటించడం కూడా మానుకున్నానని చెప్పింది. మానసికవేదనతో ఒక సమయంలో రోజుకు 12 మాత్రలు వేసుకున్నానని చెప్పింది. అందువల్ల బరువు పెరిగిపోయానని తెలిపింది. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళదామనుకుంటే ఆ ఫొటోలను తీసి ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో పెడతారోనన్న భయం కలిగేదని .. అందుకే జిమ్‌కు వెళ్లడం కూడా మానేశానని చెప్పింది. అలా కొంత కాలం గదిలోనే ఏకాంతంగా గడిపేసినట్లు, చాలా మానసికవేదనకు గురైనట్లు చెప్పిన ఇలియానా ఇప్పుడు మళ్లీ నటనపై పూర్తిగా దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ దక్షిణాదిలో అవకాశాలను మళ్లీ రాబట్టుకోగలుగుతుందా? ఎందుకంటే ఇప్పటికే ఓ తెలుగు చిత్రంలో నటించినా అది సత్ఫలితాన్నివ్వలేదు. -
తల్లి కాబోతున్న ఇలియానా?
ప్రముఖ నటి ఇలియానా తల్లి కాబోతోందా..? అంటూ బీటౌన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఇలియానా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేస్తూ, ‘హబ్బీ’ (భర్త) అని కామెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇపుడు ఇలియానా తల్లి కాబోతున్నారని తాజా రూమర్. అజయ్ దేవగణ్‌తో కలిసి రైడ్ చిత్రంలో కథానాయికగా నటించింది ఇలియానా. ఇటీవలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో సినిమా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇలియానా, తాను గర్భం దాల్చిన సంగతి బయటపడకుండా ఉండేందుకు లూజు, తేలికైన డ్రస్సుల్లో కనిపిస్తున్నారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆండ్రూ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇలియానా ఫొటోను షేర్ చేశాడు. బాత్ టబ్ లో కాఫీ తాగుతూ ఉన్న ఇలియానా ఫోటోకు ఆండ్రూ ‘ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే పెళ్లి గురించే ఇప్పటివరకూ స్పందించని ఇలియానా తాజా ప్రచారంపై ఏమంటారో చూడాలి. -
టీవీ సీరియల్స్ చేస్తాను: ఇలియానా
సాక్షి, ముంబయి: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైన హీరోయిన్లలో గోవా సుందరి ఇలియానా ఒకరు. తాను టీవీ సీరియల్స్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇలియానా చెప్పగానే, ఇక సిల్వర్ స్క్రీన్ నుంచి ఆమె తప్పుకోనుందేమోనని ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఇలియానా చేసిన వ్యాఖ్యలను కొందరు దుష్ప్రచారం చేయడమే అందుకు కారణం. తాను నటించిన మూవీ ముబారకన్ శనివారం సోని మ్యాక్స్ లో ప్రసారం అవుతుందని అందరూ మూవీని చూడాల్సిందిగా నటి ఇలియానా ప్రమోట్ చేసుకున్నారు. దీనిపై కొందరు స్పందిస్తూ.. ఎన్నో సినిమాల్లో నటించారు, బుల్లితెరపై కనిపించే ఆలోచన లేదా అంటూ ఆమెను అడిగారు. సీరియల్స్ లో నటిస్తానని కచ్చితంగా చెప్పలేను. అయితే ఛాలెంజింగ్ రోల్ దొరికితే టీవీ సీరియల్స్ లో కనిపించేందుకు తనకు ఏ ఇబ్బంది లేదన్నారు ఇలియానా. సినిమా నచ్చితే థియేటర్లకు మళ్లీ మళ్లీ వచ్చి చూసి ప్రేక్షకులు మమ్మల్ని ఆధరిస్తారు. సీరియల్స్ లో అలాంటి అవకాశం ఉండదు. కీలకపాత్ర వస్తే మాత్రం బుల్లితెరపై కనిపించేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ముబారకన్ లో అనిల్ కపూర్, అతియా శెట్టి, అర్జున్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. -
ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!
సాక్షి, ముంబై : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్లను గుర్తుపట్టగలరా. ఒకరు బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి అని చెప్పవచ్చు. మరో నటి ఎవరబ్బా అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆమె మరెవరో కాదు సన్న నడుము సుందరి ఇలియానానే. నమ్మలేనట్లుగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నిన్న (నవంబర్ 1న) ఇలియానా పుట్టినరోజు సందర్భంగా అతియా ఈ ఫొటోను షేర్ చేస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. వీరి రిలేషన్ ఏంటంటారా.. వీరిద్దరూ బాలీవుడ్ మువీ ముబారకన్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. గోవా సుందరి ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది. కొన్ని రోజుల కిందట ఆమె మరీ సన్నగా, పాలిపోయినట్లుగా ఉన్న ఫొటోలు ఆమె అభిమానులను బాధించాయి. సన్న నడుము సుందరికి ఏమైంది అని ఆరాతీయడం మొదలుపెట్టారు. అయితే ఆమె ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇల్లీ బేబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. -
మహేష్ బాబు ఎవరో కూడా తెలీదు..!
బాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా.. తన తాజా చిత్రం బాద్ షాహో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కటంతో ఇలియానా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సందర్భంగా తన సినీ రంగం ప్రవేశంపై మీడియాతో మాట్లాడిన ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఇలియానా సౌత్ సినీ రంగం గురించి మాట్లాడింది. చిన్నతనంలో ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆలోచనతో ఎయిర్ హెస్టస్ కావాలనుకున్నానని తెలిపిన ఇలియానా.. తరువాత ష్యాషన్ డిజైనింగ్ వైపు మనసు మళ్లిందని తెలిపారు. అయితే దేవుడు మాత్రం తనను సినీ రంగంవైపు నడిపించాడన్నారు. 16 ఏళ్లకే సినీ రంగంలోకి అడుగుపెట్టడంతో అప్పట్లో ఏం తెలిసేది కాదన్న ఇల్లిబేబీ.. పోకిరి సినిమాకు ముందు మహేష్ ఎవరో కూడా తెలియని చెప్పారు. తరువాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నానన్న ఇలియానా ప్రస్తుతం తన వృత్తిపై తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. -
ఇలియానా 'ముద్దు'ముచ్చట!
ప్రేమంటేనే పిచ్చి.. ఆ పిచ్చిలోకంలో స్వేచ్ఛగా విహరిస్తున్నామంటోంది ఇలియానా.. తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్ర్యూ నీబోన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ అమ్మడు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ 'ప్రేమ' ఫొటోలను షేర్ చేసుకుంది. నీబోన్‌తో సన్నిహితంగా విహరిస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది. నీబోన్‌తో లిప్‌లాక్ చేస్తున్న ఫొటోను పోస్టు చేసి.. 'ప్రేమ అనే పిచ్చిలోకంలో..' అంటూ కామెంట్ పెట్టింది. అంతేకాదు ప్రియుడికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను ఈ హాట్ భామ షేర్ చేసింది. ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలసి షికార్లకు వెళ్లడం.. అప్పుడప్పుడు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం తెలిసిందే. తన బాయ్‌ఫ్రెండ్ గురించి ఈ మధ్య ఇలియానా మాట్లాడుతూ.. అతని గురించి తరచూ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని, అతను సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడతానని, అతని ప్రైవసీకి భంగం కలిగించకూడదని తెలిపింది. ‘‘నటీనటులను ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారో ఒక్కోసారి అంతకు రెండింతలు ద్వేషిస్తారు. ఏ కారణం లేకుండానే తిడతారు. ఏవేవో మాటలంటారు. కొన్నిసార్లు వాళ్ల మాటలు మరీ దారుణంగా ఉంటున్నాయి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. ఇవన్నీ నాకు తెలుసు. నటిస్తున్నాను కాబట్టి నాకు తప్పదు. అతనూ మాటలు పడడం మంచిది కాదు. అందుకే, అతని గురించి పబ్లిగ్గా మాట్లాడను’’ అని పేర్కొంది. కొన్నాళ్ల క్రితం వరకు టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా వెలుగొందిన ఇలియానా.. ఇప్పుడు బాలీవుడ్లో నటనపరంగా మంచి పేరు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. 2012లో 'బర్ఫీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా 'ముబారకన్', 'బాద్షాహో' చిత్రాల్లో ప్రేక్షకులను అలరించింది. A moment. In a world of madness. A post shared by Ileana D'Cruz (@ileana_official) on Sep 17, 2017 at 2:29am PDT -
ప్రియుడి గురించి నోరువిప్పిన హీరోయిన్!
కొన్నాళ్ల క్రితం వరకు టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా వెలుగొందిన ఇలియానా.. ఇప్పుడు బాలీవుడ్లో నటనపరంగా మంచి పేరు తెచ్చుకుంటోంది. 2012లో 'బర్ఫీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కమర్షియల్, గ్లామరస్ హీరోయిన్‌గానూ అడపాదడప చాన్స్‌లు దొరుకుతున్నాయి. ఇలియానా అందరిలాంటి నటి కాదు. బాలీవుడ్లో ఇతర నటీమణుల్లాగా ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టలేదు. వీలు చిక్కినప్పుడల్లా తన ప్రేమికుడి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్‌తో ఇలియానా సహజీవనం చేస్తోంది. వీరిద్దరూ సరదాగా దిగిన ఫొటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా ఇలియానా 'మిడ్-డే' పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తన ప్రియుడి గురించి పలు విషయాలు తెలిపింది. అతని గురించి తరచూ మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, అతను మామూలుగా ఉండటానికి ఇష్టపడతానని, అతని ప్రైవసీకి భంగం కలిగించకూడదని తెలిపింది. 'చిత్ర పరిశ్రమలో నేను 11 ఏళ్లుగా కొనసాగుతున్నాను. ఇక్కడి పని సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నటులుగా మాకు ఎంతో ప్రేమ లభిస్తుంది. అదే సమయంలో కారణం లేకున్నా ఎంతో వ్యతిరేకతను మూటగట్టుకుంటాం. మేం చేసే వ్యాఖ్యలు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఇదంతా ఆండ్ర్యూ భరించాల్సి రావడం సరికాదనేది నా భావన. అతను సాధారణ వ్యక్తి. ప్రైవసీని ఇష్టపడతాడు. కొంతమంది వచ్చి అతను భారతీయుడు కాదు అంటూ ఏవేవో చెప్తుంటారు. కానీ, అతను నాకు ప్రత్యేకమైన వ్యక్తి. ఏ తప్పు లేకపోయినా నా కుటుంబాన్ని ఒకరు వేలెత్తిచూపే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటాను' అని ఇలియానా తెలిపింది. మరీ ఆండ్ర్యూను ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి తాము సహజీవనంలో గడుపుతూ ఆనందంగా ఉన్నామని, పెళ్లి, సహజీవనానికి మధ్య భేదం చాలా చిన్నదని పేర్కొంది. -
ఇలియానాతో అభిమాని అసభ్య ప్రవర్తన
ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో అలరించిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిమితమయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇటువైపు చూడటం మానేసిన ఈ అమ్మడు వరుసగా హిందీలో అవకాశాలను అందుకుంటోంది. అయితే, ఇటీవల ఓ పురుష అభిమాని ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడట. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన ఇలియానా.. అతని వికృత స్వభావంపై తీవ్రంగా మండిపడింది. 'మనం నివసిస్తున్నది చాలా సంకుచితమైన, అల్పమైన ప్రపంచం. నేనొక పబ్లిక్ ఫిగర్‌ని. బహిరంగ ప్రదేశాల్లో నాకు పెద్దగా వ్యక్తిగత జీవితం ఉండదని తెలుసు. కానీ, అంతమాత్రాన నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో అభిమాన వికారాలను నాపై చూపకండి. నేనూ ఒక మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ ఇలియానా ఘాటుగా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇలియానా నటించిన 'బాద్షాహో' హిందీ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మీ, ఈషా గుప్తా ప్రధాన పాత్రల్లో మిలాన్ లుథ్రియా రూపొందించిన ఈ సినిమాపై ఇలియానా భారీ ఆశలే పెట్టుకుంది.It's a pretty shitty world we live in. I'm a public figure. I understand that I don't have the luxury of a private & an anonymous life.(1/2)— Ileana D'Cruz (@Ileana_Official) August 20, 2017But that doesn't give any man the right to misbehave with me. Don't confuse "fan antics" with that. I am a WOMAN at the end of the day.(2/2)— Ileana D'Cruz (@Ileana_Official) August 20, 2017 -
ఆ హీరోతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నా: నటి
ముంబయి: టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి ఇలియానా దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లాక ఆమె జోరు పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీతో మంచి మార్కులే కొట్టేసినా.. ఈ గోవా సుందరికి అవకాశాలు మాత్రం గడప తొక్కలేదు. ఈ బ్యూటీ గత ఐదేళ్లలో ఐదు హిందీ మూవీల్లో మాత్రమే నటించింది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ భామ ముబారకన్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో తన సినీ అనుభవాలను ఆమె షేర్ చేసుకుంది. '15 ఏళ్ల వయసులో మూవీలో చాన్స్ వచ్చింది. అయితే నేను అంతగా నటించను. మీ భాష రాదు, మాట్లాడను. నా ఇష్టం వచ్చినట్లుగా ఉండాను అని షరతులు పెట్టినా దర్శకుడు ఒప్పుకున్నారు. షూటింగ్ విదేశాల్లో అనగానే.. పైసా ఖర్చులేకుండా అమెరికాకు వెళ్తున్నానని సంబరపడ్డాను. తెలుగు, హిందీ భాషలు నాకు అసలే రావు. అయితే ఇంటర్వ్యూలో హిందీలో బదులు చెప్పమని అడిగినా.. ఇంగ్లీష్‌లో ఏదోలా మేనేజ్ చేసేదాన్ని. టాలీవుడ్లో ప్రముఖ హీరోలతో పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ హిందీపైనే ఎక్కువ దృష్టిపెట్టాను. నా లేటెస్ట్ మూవీ ముబారకన్. ఇందులో పంజాబీ అమ్మాయిగా ఆకట్టుకుంటాను. అర్జున్ కపూర్, అనిల్ కపూర్ లాంటి స్టార్లతో పని చేసిన ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. టాలీవుడ్లో తొలిమూవీ ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి చేశాను. అతడితో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాను. తొలిరోజు స్క్రిప్టు ఇచ్చాక ఎలా పలకాలో సాయం చేయాలని రామ్‌ను అడిగాను. అతడు ఆ మాటలు చదవి వినిపించగానే నేను గట్టిగా నవ్వేశాను. నాకు భాష రాకపోవడంతో తొలుత అతడు జోక్ చేస్తున్నాడని భావించాను. క్రమక్రమంగా నటనపై దృష్టిపెట్టి ఎంతో నేర్చుకున్నానని' నటనలో తొలి రోజులను ఇలియానా వివరించారు. ముబారకన్ జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. -
లక్షాధికారులు!
రామ్‌చరణ్ లక్షాధికారి అయ్యాడండీ. ఈ హీరోగారు 40 లక్షలకు అధిపతి. హన్సిక ఏకంగా 60 లక్షలకు అధిపతి అయ్యారు. త్రిష 30, ఇలియానా 40 లక్షలు... ఇలా లక్షాధికారులు అయినందుకు వీళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కోట్లు కోట్లు పారితోషికం తీసుకునే వీళ్లు లక్షాధికారులైనందుకు ఆనందపడటమేంటి? అనేగా మీ డౌట్! అయితే అసలు విషయంలోకి వెళదాం... కరెన్సీ కష్టాల కారణంగా ఎవరెవరు తమ బ్యాంక్ ఖాతాల్లో ఎంతుందో చూసుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు అనుకుంటున్నారా? కాదండి! ఈ లెక్క సోషల్ మీడియాల్లోని తమ ఖాతాల్లో అభిమానుల సంఖ్య. ఈ లెక్క ఆల్ ఇండియాకి సంబంధించినది కాదు.. హోల్ వరల్డ్‌ది అన్న మాట. సెలబ్రిటీలంతా అభిమానులతో నేరుగా తమ విశేషాలు పంచుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అభిమాన నటీనటులతో నేరుగా మాట్లాడకపోయినా.. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవచ్చు కాబట్టి, వీళ్ల ఎకౌంట్స్‌ని ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఒక్కో సెలబ్రిటీ ఎకౌంట్లో లక్షల్లో ఫాలోయర్స్ ఉంటారు. గడచిన పది రోజుల్లో... 40, 60, 30 లక్షలకు చేరుకున్న సెలబ్రిటీల ఖాతాల వివరాల్లోకి వెళితే... మీకోసం ఎంత కష్టపడుతున్నానో రామ్‌చరణ్‌కి ట్విట్టర్, ఫేస్బుక్లో ఖాతాలున్నాయి. ఫేస్బుక్ ఖాతాను ఇప్పుడు ‘40 లక్షల’ మంది అనుసరిస్తున్నారు. ‘‘మన ఫ్యామిలీ మొత్తం నాలుగు మిలియన్లు (40 లక్షలు). చాలా ఆనందంగా ఉంది. చూడండి.. ఫేస్బుక్లో మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నానో’’ అంటూ షూటింగ్ సమయాల్లో ఫోన్ ద్వారా ఫేస్బుక్లో తాను అప్డేట్ చేస్తున్న ఫొటోను రామ్‌చరణ్ పోస్ట్ చేశారు. తాను చేస్తున్న సినిమాల విశేషాలతో పాటు అడపా దడపా ఫేస్బుక్ ద్వారా ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా ‘చాట్’ చేస్తుంటారు రామ్‌చరణ్. అభిమానులు అడిగిన ప్రశ్నలకు లైవ్‌లో ఓపికగా సమాధానాలిస్తుంటారు. మీ ప్రేమకో మంచి ఉదాహరణ బబ్లీ బ్యూటీ హన్సిక తమిళంలో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాక అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పైగా తమిళనాడులో ‘చిన్న ఖుష్బూ’ అనిపించుకున్నారు కాబట్టి, అభిమానుల సంఖ్య సినిమా సినిమాకీ పెరుగుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ ఫేస్బుక్ ఖాతాలో 60 లక్షలు ఫాలోయర్స్ చేరారు. ఫేస్బుక్లో ఎప్పట్నుంచో ఆమెకు ఎకౌంట్ ఉంది. ‘‘అభిమానులు నన్నెంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం’’ అని హన్సిక పేర్కొన్నారు. ఆ ఫొటోలకు బోల్డంత క్రేజ్ గోవా బ్యూటీ ఇలియానా హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక సౌత్‌కి దూరమయ్యారు. కానీ, అభిమానులకు మాత్రం దూరం కాలేదు. ముఖ్యంగా ఈవిడగారి ‘ఇన్స్టాగ్రామ్’కి ఫాలోయర్ల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే.. ఎప్పటిప్పుడు తన పర్సనల్ ఫొటోలను అందులో పొందుపరుస్తుంటారు. ‘వామ్మో.. చాలా హాట్ గురూ’ అనే స్థాయిలో ఆ ఫొటోలు ఉంటాయి. బికినీలో ఉన్న ఫొటోలను, వీడియోలను సైతం ఆమె పెడుతుంటారు. ఆ ఫొటోలకున్న క్రేజ్ ఎలాంటిదింటే ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌ని 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. థర్టీ ప్లస్.. థర్టీ లాక్స్! త్రిష వయసు 30. నటిగా ఆమె కెరీర్ వయసు దాదాపు 15. ఇన్నేళ్లుగా కథానాయికగా రాణించడం అంటే చిన్న విషయం కాదు. పైగా చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటం అంటే మాటలు కాదు. ఈ చెన్నై చందమామ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఈవిడగారి ట్విట్టర్ ఎకౌంట్‌ను 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ‘‘థ్యాంక్యూ.. నా మనసులో మీకు (ఫ్యాన్స్) ప్రత్యేకమైన స్థానం ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె. కోట్లు తీసుకునే తారలకు వందల్లో ఫ్యాన్స్ ఉంటే లాభం లేదు. లక్షల్లో ఉండాలి. అప్పుడే లైమ్‌లైట్‌లో ఉన్నట్లు లెక్క. కెరీర్ మంచి ఊపు మీద ఉంటుంది. అందుకే ఈ కోటీశ్వరులందరూ తమను ఫాలో అవుతున్న లక్షలాది అభిమానులకు ‘బిగ్ థ్యాంక్స్’ అంటున్నారు. -
హాట్ వీడియో పోస్ట్ చేసిన ఇలియానా
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్లో టైం పాస్ చేస్తున్న హాట్ బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ గోవా సుందరి. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 40 లక్షలకు చేరినందుకు గాను ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది ఇల్లీ బేబి. సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవటంతో గతంలో కూడా ఇలాంటి వీడియోలతో సందడి చేసింది ఈ బ్యూటి. టూ పీస్ బికినీలో అండర్ వాటర్‌లో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులకు కృతజ్ఞతలు తెలపడం కూడా ఇంత హాట్ గానా అంటూ కొంత మంది పెదవి విరుస్తుంటే, మరి కొంత మంది మాత్రం ఇలియానా అందాలను షేర్ చేస్తూ ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేతిలో ఉన్న ఇలియానా సౌత్ ఇండస్ట్రీ పిలుపు కోసం ఎదురుచూస్తోంది. 4 MILLION!!!! U guys ROCK!!! Sending so much love your way! -
బికినీలో రెచ్చిపోయిన ఇలియానా
టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి బాలీవుడ్‌కు మకాం మార్చిన గోవా సుందరి ఇలియానా బికినీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఎంతో ఎంజాయ్ చేశానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. తనకు పుట్టిన రోజు విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది. స్విమ్మంగ్ పూల్‌లో నీటి లోపల తీసిన ఈ హాట్ బికినీ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో నెటిజన్లు వీక్షించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ ఈ వీడియో తీశాడని తెలిపింది. ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో ఇలియానా మునిగితేలుతున్నట్టు, ఆయనతో పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. -
శ్రీమతి ఇలియానా?!
పెళ్లైన ఆడవాళ్లను ‘శ్రీమతి’ అని, కానివాళ్లను ‘కుమారి’ అని సంబోధించడం, గౌరవించడం మన భారతీయ సంప్రదాయం. ఆ లెక్కన ఇలియానాకి పెళ్లి కాలేదు కనుక ‘కుమారి ఇలియానా’ అనడం సబబు. మరి, శ్రీమతి అంటున్నారేంటి అని ఆలోచిస్తున్నారా! ఈ గోవా బ్యూటీకి పెళ్లైందనేది తాజా ఖబర్. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా ప్రేమలో ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆండ్రూతో తన ప్రేమాయణం బయటకు రాకుండా దాచేయాలని ఇలియానా ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఈ ప్రేమ పక్షులు బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. అటు ముంబై, ఇటు హైదరాబాద్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. గతేడాది డిసెంబర్ లోనే ఆస్ట్రేలియాలో ఆండ్రూ, ఇలియానాల పెళ్లి జరిగిందట. పెళ్లికి హాజరైన అతిథులతో ఎక్కడా తమ పెళ్లి విషయం చెప్పొద్దని ప్రామిస్ చేయించుకున్నారట. ప్రేమ, శృంగారం వంటి విషయాల గురించి పలు సందర్భాల్లో ఓపెన్‌గా మాట్లాడిన ఇలియానా పెళ్లైన సంగతి ఎందుకు దాచారు? ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగా.. పెళ్లి జరగలేదా? -
ఇలియానా మాట మార్చింది: గౌరంగ్
గడచిన రెండు రోజులుగా ముంబైలో ‘ఆంఖే 2’ చిత్రం గురించే అందరి చర్చ. ‘ఆంఖే’కి సీక్వెల్‌గా అనీస్ బజ్మీ దర్శకత్వంలో గౌరంగ్ దోషీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా ప్రారంభోత్సవం ఇంత భారీగా జరగలేదట. అందుకే హాట్ టాపిక్ అయింది. అయితే ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకున్న వాళ్లందరూ ఇప్పుడు దాని గురించి మానేసి, ఇలియానా-చిత్రనిర్మాత గౌరంగ్ దోషీల గురించి మాట్లాడుకుంటున్నారు! ఈ సినిమా చేస్తానని తాను కమిట్ కాలేదని ఇలియానా, ఆమె మాట మారుస్తోందని గౌరంగ్ ఆరోపిస్తున్నారు. ఆ విషయంలోకి వస్తే... ‘ఆంఖే 2’కి సైన్ చేయలేదు: అమితాబ్ బచ్చన్, అర్షద్ వార్శి, అర్జున్ రామ్‌పాల్, ఇలియానా, రెజీనా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారని ప్రారంభోత్సవం నాడు దర్శక-నిర్మాతలు ప్రకటించారు. ఇలియానా మినహా మిగతావాళ్లంతా ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. దాంతో ఇలియానా తాలూకు సినిమా క్లిప్పింగ్స్ కట్ చేసి, వీడియో ప్రదర్శించారు. కట్ చేస్తే.. అసలా సినిమాలో ఇలియానా యాక్ట్ చేయడంలేదట. ‘‘ఈ సినిమా చేస్తున్నారా? అని ‘ఆంఖే 2’ గురించి అందరూ అడుగుతున్నారు. నేనీ సినిమాకి సైన్ చేయలేదు’’ అని శుక్రవారం ఇలియానా స్పష్టం చేశారు. అనుమతి లేకుండా తన పేరుని ప్రకటించడం, వీడియో క్లిప్పింగ్స్‌ని ప్రదర్శించడం ఆమెను ఆగ్రహానికి గురి చేసింది. ఈ సినిమాకి అడిగినప్పుడు ఇలియానా తిరస్కరించారని ఆమె సన్నిహితులు అంటున్నారు. రిజెక్ట్ చేసిన సినిమా తాలూకు నటీనటుల లిస్టులో తన పేరు ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసిందట. దర్శక- నిర్మాతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారట. పబ్లిసిటీ కోసం ఇలియానా అవసరంలేదు ‘నేనీ సినిమా సైన్ చేయలేదు’ అని ట్విట్టర్ ద్వారా ఇలియానా పేర్కొన్న కొంత సమయానికి గౌరంగ్ స్పందించారు. ‘‘నేనూ, అనీస్ బజ్మీ ‘ఆంఖే 2’ ప్రారంభోత్సవం రెండు రోజులకు ముందు ఇలియానాను కలిశాం. సినిమా లైన్, తన పాత్ర నచ్చిందని ఆమె చెప్పింది. మరో వారంలో సైన్ చేయాల్సి ఉంది’’ అని గౌరంగ్ అన్నారు. కాగా, పబ్లిసిటీ కోసమే తన పేరుని వాడుకున్నారనీ, ఫైనాన్షియర్లను ఆకట్టుకోవడానికే ఇలా చేశారనీ ఇలియానా అన్నట్లు గౌరంగ్కి తెలిసిందట. ‘‘అసలు నా సినిమాకి పబ్లిసిటీయే అవసరం లేదు. ఇలియానా పేరుని వాడుకుని ఫైనాన్స్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఓ ఐదు నక్షత్రాల హోటల్లో ఇలియానాను పర్సనల్‌గా కలిసినప్పుడు పారితోషికం గురించి కూడా మాట్లాడారట. ఆ విషయంలో ఓ క్లారిటీకి కూడా వచ్చామని గౌరంగ్ అంటున్నారు. ఇప్పుడేమో ఈ సినిమా చేయాలనుకోవడంలేదని ఇలియానా మాట మార్చిందని ఆరోపించారు. ఏదేమైనా.. ఈ విషయానికి ఇంతటితో ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నాననీ, ఆరోపణలు చేయదల్చుకోలేదనీ ఆయన అన్నారు. ఇలియానా సినిమా చేయకపోయినా ఫర్వాలేదనీ, ఆమెకు ‘ఆల్ ది బెస్ట్’ అని గౌరంగ్ పేర్కొన్నారు. మరి.. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్స్టాప్ పడుతుందో.. లేక మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. -
బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నా!
ఒక్కోసారి ఏం చేస్తున్నాం? ఏం చేయబోతున్నాం? అనే విషయాల్లో క్లారిటీ ఉండదు. డైలమాలో పడిపోతాం. ఆ మధ్య ఇలియానా పరిస్థితి అదే. నమ్మి చేసిన సినిమా ఫ్లాప్ అయితే ఇక.. ఏ కథని నమ్మాలి, దేన్ని నమ్మకూడదో తెలియకుండా పోయిందట. ‘హ్యాపీ ఎండింగ్’ ఫెయిల్యూర్ తర్వాత ఇలియానాకి ఓ బంగారంలాంటి అవకాశం వచ్చిందట. బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ డెరైక్టర్‌తో పెద్ద నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించిందని ఇలియానా పేర్కొన్నారు. ఆ సినిమా పేరు మాత్రం ఇల్లూ బేబి చెప్పడంలేదు. అందులో ఇలియానాకి ఆఫర్ చేసిన పాత్ర అటు గ్లామర్ ఇటు పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నదట. ఈ పాత్రకు నన్నే ఎందుకు అడిగారు? అని ఆ చిత్రనిర్మాతను అడిగానని ఇలియానా చెబుతూ - ‘‘కథ, నా పాత్ర నచ్చాయి. కానీ, వర్కవుట్ అవుతుందో? లేదో అని డౌట్. అందుకే నన్నెందుకు అడుగుతున్నారు? అన్నాను. అప్పుడా నిర్మాత ‘మీరైతే బాగా చేయగలుగుతారని నమ్మకం’ అన్నారు. నటిగా నా మీద నాకు డౌట్ లేదు కానీ, సినిమా జడ్జిమెంట్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయాను. దాంతో నా అంతట నేనే వేరే హీరోయిన్ పేరు సూచించాను. కట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నా దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నందుకు నేనేం పశ్చాత్తాపపడలేదు. ఏదీ మన చేతుల్లో ఉండదు. ఒక్కోసారి అలా జరిగిపోతుంది. బాధపడితే మళ్లీ ఆ సినిమా రాదు కదా. అందుకే లైట్ తీసుకున్నా’’ అన్నారు. -
నేను ప్రేమలో విఫలమయ్యా!
నేను ఇంతకు ముందొక సారి ప్రేమలో పడ్డాను. అయితే ఆ ప్రేమ విఫలమైందని పేర్కొన్నారు నటి ఇలియానా. ఆదిలో కోలీవుడ్‌నే వెతుక్కుంటూ వచ్చిన ఆ గోవా సుందరికి ఇక్కడ ఎవరూ గుర్తించలేదు.అయితే టాలీవుడ్ మాత్రం తొలి చిత్రంతోనే అక్కున చేర్చుకుంది. అంతే కాదు టాప్ హీరోయిన్ అందలం ఎక్కించింది. ఆ తరువాత కోలీవుడ్‌లో విజయ్‌తో న న్భన్ చిత్రంలో నటించే అవకాశాన్ని మాత్రం వాడుకుని మళ్లీ ఇటువైపు చూడలేదు.అంతే కాదు ఆ తరువాత ఉన్నత స్థాయికి చేర్చిన టాలీవుడ్‌ను కాదనీ బాలీవుడ్ మోహంతో హిందీ చిత్రాలపై దృష్టి సారించారు. అయితే అక్కడ అమ్మడిని అంతగా పట్టించుకోలేదు. బర్ఫీ లాంటి కొన్ని చిత్రాలు చేసినా ఆపై దాదాపు రెండేళ్లు ఇలియానాను బాలీవుడ్ దూరంగా పెట్టేసింది. తాజాగా అక్షయ్‌కుమార్‌తో నటించిన రుస్తుం చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఇప్పుడు కొత్త చిత్రాలేమీ లేవు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమ కలాపాలు మాత్రం జోరుగా సాగిస్తున్నారు. విదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని ఎంత హాయి ఈ రేయి అని డ్యూయెట్లు కూడా పాడుకుంటున్నారట. త్వరలో ఆయనతో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఇలియానా ఒక భేటీలో పేర్కొంటూ యువతీయువకులు ప్రేమలో పడ్డప్పుడు కలల్లో తేలిపోతుంటారన్నారు. నీవు లేక నేను లేను, నీవే నాలోకం అంటూ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటారన్నారు. అలాంటిది ప్రేమ విఫలం అయితే ఒకరినొకరు విమర్శించుకుంటార ని, ఆరోపణలు గుప్పించుకుంటూ కొట్టుకునే వరకూ వెళతారన్నారు. అంతటితో ఆగకుండా పగతీర్చుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అయితే అది కరెక్ట్ కాదన్నారు. తాను ఇంతకు ముందు ఒకరిని ప్రేమించానని, ఒక దశలో అభిప్రాయ భేదాల కారణంగా ఆ ప్రేమ విఫలమైందని తెలిపారు. దీంతో నీ దారి నీది నా దారి అనుకుని విడిపోయాం గానీ, ఒకరినొకరు విమర్శించుకోలేదన్నారు. గొడవలు పడలేదని, ఒకరిపై ఒకరు పగ పెంచుకోలేదని చెప్పారు. అలాగని ఆ తరువాత స్నేహంగా మెలగలేదని అన్నారు. ఇక తన పెళ్లి గురించి అడుగుతున్నారని,సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అన్నారు.అయితే ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని ఇలియానా పేర్కొన్నారు. -
'రుస్తుం' నేరస్తుడా కాదా?
టైటిల్ : రుస్తుం జానర్ : క్రైమ్- మిస్టరీ నటీనటులు : అక్షయ్ కుమార్, ఇలియానా డిక్రూజ్, ఈషా గుప్తా, అర్జన్ బజ్వా తదితరులు దర్శకత్వం : టిను సురేష్ దేశాయ్ నిజాయితీ కలిగిన ఓ నౌకాదళ అధికారి, ఒంటరితనాన్ని ఫీలయ్యే అతని అందమైన భార్య, ఆమె ప్రియుడు, ఆ ప్రియుడి సంచలన హత్య.. నాలుగు మాటల్లో చెప్పాలంటే ఇదే 'రుస్తుం' కధ. సృష్టించిన కథ కాదు..1959లో జరిగిన వాస్తవ సంఘటన. నానావటి అనే నావల్ కమాండర్ జీవితంలోని అనూహ్య ఘటన. మీడియాలో సంచలనాత్మకమైన కేసుగా ప్రచారం పొందిన ఘటన. సాధారణంగా సినిమాల్లో అయినా, నిజ జీవితాల్లో అయినా భర్త వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండటం, తెలిసినా భార్య మౌనంగా భరించడం, లేదంటే తప్పు తెలుసుకుని వస్తే భార్య అతన్ని క్షమించటం లాంటివి చూస్తుంటాం. కానీ ఇక్కడ భార్య వివాహేతర సంబంధం, భర్త ముందు ఆ బంధాన్ని ఒప్పుకోవడం, ఆ తర్వాతి పరిస్థితులను తెరపై చూపించారు. నిజాయితీ గల నావల్ కమాండర్ రుస్తుం పావ్రీ(అక్షయ్ కుమార్), సింథియా(ఇలియానా)లు భార్యాభర్తలు. విధి నిర్వహణలో రుస్తుం ఆమెకు దూరంగా ఉన్న క్రమంలో సింథియా.. ధనవంతుడైన పార్శీ యువకుడు, భర్త స్నేహితుడు అయిన విక్రమ్ మఖిజా(అర్జన్ బజ్వా)తో ప్రేమలో పడుతుంది. అదే విషయాన్ని భర్తకు వివరిస్తుంది. విషయం అర్థం చేసుకున్న రుస్తుం.. భార్యను స్నేహితుడి వద్దకే పంపాలని అనుకుంటాడు. భార్యాపిల్లలను సినిమాకు పంపించి, భార్య ప్రియుడు ఉండే చోటుకి వెళ్లి అనూహ్యంగా అతన్ని షూట్ చేస్తాడు. అక్కడి నుంచి నేరుగా అధికారుల వద్దకు వెళ్లి లొంగిపోతాడు. పైగా స్నేహితుడిని చంపినందుకు ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదంటూ కోర్టుకు విన్నవిస్తాడు. మీడియాలో సంచలనమై కూర్చుంటుంది ఈ హత్య. రుస్తుం నేరస్తుడు కాదంటూ కొందరు, అతను శిక్షార్హుడంటూ మరికొందరు గళాలు విప్పుతారు. రుస్తుం శిక్షించబడ్డాడా.. రక్షించబడ్డాడా.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపైన చూడాల్సిన కథనం. దర్శకుడు పెద్దగా సమయాన్ని వృధా చేయకుండా ప్రేక్షకులను డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిపోయాడు. కోర్టు విచారణ ఆద్యంతం ఆసక్తిగా కొనసాగుతుంది. సినిమా మొత్తానికి అక్షయ్ నటన వెన్నెముక లాంటిదని చెప్పొచ్చు.. పాత్రకు హుందాతనం తెచ్చిపెట్టారు. ఇలియానా ఇరగదీసిందనే చెప్పాలి. రాక రాక వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు. క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశారు. ఇలియానా ప్రియుడిగా కనిపించిన అర్జన్ బజ్వా పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. అన్నను చంపిన వ్యక్తికి శిక్ష పడాలని కోరుకునే పాత్రలో ఈషా గుప్తా నటన ఆశించినంత ఆకట్టుకోలేకపోయింది. అసలు కథకు కావలసినంత డ్రామాను జోడించాడు దర్శకుడు.కొన్నిచోట్ల కథనం కాస్త సాగినట్టుగా అనిపిస్తుంది. ఓ నిజాయితీ గల ఆఫీసర్ విలువ.. అతని సేవలు, అదే ఆఫీసర్ సరైన పనిని సరైనది కాని పద్ధతిలో చేయడం, కేసుకి సంబంధించి ప్రజా స్పందన, భార్య సంఘర్షణ, చివరికి లభించనున్న తీర్పులాంటివి ప్రేక్షకులను కథలో లీనం చేస్తాయి.. ఆలోచనలో పడేస్తాయి. మొత్తానికి అక్షయ్ అద్వితీయ నటన కోసం 'రుస్తుం' సినిమాను తప్పక చూడాలనేది ధియేటర్ బయట టాక్. -
'ఆమె వివాహేతర సంబంధమే అసలు విషయం'
తన తదుపరి చిత్రం 'రుస్తుం' గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అక్షయ్ కుమార్. క్రైమ్ మిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ తొలిసారి నేవల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో భార్య ప్రియుడిని చంపే వ్యక్తిగా అక్షయ్ నటిస్తున్నారు. దీనిపై అక్షయ్ మాట్లాడుతూ.. సాధారణంగా హిందీ సినిమాల్లో భర్త వివాహేతర సంబంధం కలిగి ఉంటాడు, చివరికి తన తప్పు తెలుసుకున్నాక భార్య అతడిని క్షమిస్తుంది, అంగీకరిస్తుంది. తిరిగి వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు. కానీ ఈ కథలో అలా కాదు. భార్యే వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటుంది, భర్త క్షమాపణలు కోరుతుంది.. ఆ భర్త క్షమించాడా లేదా అన్నది తెర మీద చూడాల్సిన కథ అన్నారు. భార్య వివాహేతర సంబంధమే కథకు కీలకమైన పాయింట్ అని తెలిపారు. ఈ సినిమాలో అక్షయ్ భార్యగా ఇలియానా నటిస్తున్నారు. తొలిసారి ఇంత వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నందుకు ఈ స్టార్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి నౌకాదళ అధికారిగా నటిస్తున్న అక్షయ్.. పాత్రకు సంబంధించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదని చెబుతున్నారు. ప్రత్యేకించి నౌకాదళ ఆఫీసర్లను కలవడంగానీ, పుస్తకాలను చదవడంలాంటివేమీ చేయలేదట. ఓ అధికారి మాత్రం సెల్యూట్ ఎలా చేయాలి, బ్యాడ్జెస్ ఎలా ధరించాలి అనే విషయాల్లో ఆయన్ను గైడ్ చేసినట్లు తెలిపారు. ఆ యూనిఫామ్ వేస్కున్న తరువాత మాత్రం తెలీకుండానే బాధ్యతగా ఫీలయ్యానని, అధికార దర్పం తెలిసిందని అంటున్నారు. ఆ యూనిఫామ్ ధరించేవారిని చూస్తుంటే తనకిప్పుడు అసూయగా ఉందని చెప్పారు ఎయిర్ లిఫ్ట్ స్టార్ అక్షయ్ కుమార్. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన రుస్తుం ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఇలియానా మరోసారి బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. -
ఆ విషయాన్ని మాత్రం భరించలేను...
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన సొగసరి ఇలియానా. హీరోయిన్ గా వెండితెరపై నాజూకుగా కనిపించేందుకు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. బర్ఫీ, హ్యాపీ ఎండింగ్, మై తేరా హీరో, మరికొన్ని బాలీవుడ్ మూవీలలో నటించి హిందీ ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన రుస్తుమ్ లో నటిస్తుంది. జీరో సైజ్ అంటూ హీరోయిన్లు చాలా మంది గతంలో బాడీని ఆ ఆకృతిలో మార్చుకునేందుకు తంటాలు పడ్డారు. అందుకు కారణం ఇల్లీ బేబీనే అని కూడా భావించవచ్చు. ఎందుకంటే నాజూకు నడుముతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది ఈ గోవా సుందరి. ఒకానొక సమయంలో తాను కాస్త లావుగా ఉండేదాన్నని, చాలా రోజులు బాడీ సమస్యను ఎదుర్కొన్నానని పేర్కొంది. ఇప్పటికీ చాలా లావుగా ఉన్నాట్లే భావిస్తానని, ఎందుకుంటే తాను అందరిలా కాదని అభిప్రాయపడింది. కాస్త బరువు పెరిగినా, ఓ మై గాడ్.. నేను ఇంత లావుగా ఉన్నానా? అని ఆందోళన చెందుతానని చెప్పుకొచ్చింది. ఓ ఫొటోను తన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన బరువు, నడుము గురించి కొన్ని విషయాలు చెప్పింది. ఒకవేళ తాను బయటికి వెళ్లినప్పుడు అద్దంలో చూసుకుంటే సాధారణ అమ్మాయి లాగ కనిపిస్తే చాలు, తన అందంపై ఎన్నో కామెంట్లు వస్తాయంటోంది. అయినా కూడా తాను ఎందుకు ఫొటోలలో చాలా స్పెషల్ గా కనిపించాలి, అంత అవసరం లేదని మనసుకు సమాధానం చెప్పుకుంటానంది. మోడల్స్ శరీరాకృతి వేరు హీరోయిన్ల స్టైల్ వేరని, ఎవరికి నచ్చిన తరహాలో వారు ఉండాలనుకుంటారని చెప్పింది. -
ఏడాదంతా అదే చేశా!
ఇలియానా ఇప్పుడేం చేస్తున్నారు? చేతినిండా సినిమాలైతే లేవు. జస్ట్ ఒకే ఒక్క సినిమా ఉందట. అది కూడా హిందీ సినిమా. ఆ సినిమా చిత్రీకరణ ఆరంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం. అది పట్టాలెక్కితేనే ఆ సినిమా అయినా ఉన్నట్లు లెక్క. చేతిలో సినిమాలేవీ లేకపోయినా ఇలియానా బిజీగానే ఉన్నారట. ఎలా? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ మధ్య ఇలియానాకు కొత్తగా ఒక ఇష్టం ఏర్పడింది. అదే ‘ఫొటోగ్రఫీ’. ఒక మంచి కెమేరా కొనుక్కోవాలనుకున్నారట. షాపింగ్ అంటూ మాల్స్ చుట్టూ తిరిగే బదులు ఇంటిపట్టునే కూర్చుని ఆన్లైన్లో కొనుక్కుంటే బెటర్ కదా అనుకున్నారు. ఆన్లైన్ ద్వారా ఓ మంచి కెమేరా కొనుక్కున్నారు. అది చేతికి అందినప్పటి నుంచీ కంటికి నచ్చిందల్లా తన కెమెరాతో క్లిక్‌మనిపిస్తున్నారు. ‘‘పిల్లలను ఎక్కువగా ఫొటోలు తీస్తున్నాను. వాళ్లు బెస్ట్ మోడల్స్ అని నా అభిప్రాయం. ఈ ఏడాది ఎక్కువగా ఫొటోలు తీయడమే చేశా’’ అని చెప్పారు. హిందీలో ఆమె చేసిన చివరి చిత్రం ‘హ్యపీ ఎండింగ్’ గత ఏడాది విడుదలైంది. ‘ఏడాది పాటు సినిమాలు ఒప్పుకోకుండా ఎందుకు ఖాళీగా ఉన్నారు?’ అనే ప్రశ్న ఇలియానా ముందుంచితే - ‘‘ఈ ఏడాది కాలంలో చాలా కథలు విన్నాను. నన్ను ఎగ్జయిట్ చేసే కథ ఏదీ రాలేదు. మంచి కథ, చక్కని పాత్ర అయితేనే చేయాలనుకుంటున్నా. అలా అనుకోవడం వల్లే ఈ గ్యాప్ వచ్చింది’’ అని పేర్కొన్నారు. -
నేను నా లవర్‌తోనే ఉన్నాను
నేను నా లవర్‌తోనే ఉన్నాను. చాలా సంతోషంగానూ ఉన్నాను. పనికట్టుకుని మరీ కొందరు నాపై వదంతులు ప్రచారం చేస్తున్నారు అంటూ ఫైర్ అవుతోంది నటి ఇలియానా. ఇంతకు ముందు దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగులో హీరోయిన్గా టాప్ లెవల్లో వెలిగిన ఈ గోవా సుందరి తమిళంలో మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. తొలి రోజుల్లో కేడీ చిత్రంలో నటించినా ఆ చిత్రం అపజయంతో కోలీవుడ్‌ను వదిలి టాలీవుడ్‌ను పట్టుకున్న ఇలియానా అక్కడ విజయాల మీద విజయాలు వచ్చిపడడంతో టాప్ హీరోయిన్గా వెలిగిపోయింది. అలాంటి సమయంలో అమ్మడికి బాలీవుడ్ మోహం పెరిగింది. దీంతో అక్కడ మకాం పెట్టింది. హిందీలో బర్ఫీ చిత్రం నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చి పట్టినా అక్కడ ఆశించిన స్థాయిని మాత్రం పొందలేక పోయింది. ఫలితంగా ప్రస్తుతం ఇలియానా చేతిలో ఒక్క చిత్రం లేదు.దీంతో మళ్లీ దక్షిణాదిపై దృష్టి సారించినట్లు త్వరలోనే ఒక చిత్రంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి మాత్రం మోడలింగ్ , వాణిజ్య ప్రకటనలతో కాలం గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఒక విదేశీ వ్యక్తి ప్రేమలో పడ్డట్టు తనే స్వయానా తన ట్విట్టర్లో పేర్కొంది. అయితే ఇప్పుడతనికి టాటా చెప్పేసి బాలీవుడ్ నటుడొకరితో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. అయితే ఇలాంటి ప్రచారాన్ని పెడ చెవిన పెట్టే ఇలియానా ఈ సారి మాత్రం ఘాటుగానే స్పందించింది. తనపై గాసిప్స్ ప్రచారం చేయడంలో మీడియా అత్యుత్సాహం కనబరుస్తూనే ఉందని ఆరోపించారు. తాను తన లవర్‌తోనే ఉన్నాననీ, అతనితో చాలా సంతోషంగా ఉన్నాననీ అంది. అయితే తన లవర్ పని మీద ఆస్ట్రేలియా వెళ్లడంతో కొన్ని నెలలుగా అతన్ని కలవలేదనీ తాము ఫోన్లో టచ్‌లోనే ఉన్నామని పేర్కొన్నారు. అంతేగానీ తానెవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు కథలను విన్నాననీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఇలియానా అంటోంది. -
అన్నీ చెప్పేస్తే...ఇంకేం ఉంటుంది!
‘‘నాకెలా నచ్చితే అలా ఉంటా.. ఏది అనిపిస్తే అది ఓపెన్‌గా చెప్పేస్తా. పొగడ్తలంటే అసహ్యం. ఉచిత సలహాలిస్తే అస్సలు నచ్చదు’’ అంటున్నారు ఇలియానా. ఈ గోవా బ్యూటీకి నచ్చని, నచ్చే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ► నేను హీరోయిన్ని కాబట్టి ఇరవైనాలుగు గంటలూ ఎంటర్టైన్ చేయాలనుకుంటే నా వల్ల కాదు. కెమెరా కోసం మాత్రమే నటిస్తాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంత న్యాయం చేయాలో అంతా కెమెరా ముందు చేసేస్తాను. ఆ తర్వాత ఇతరుల ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచించను. నా గురించి ఆలోచించుకుంటాను. ► నేను చాలా ఫ్రెండ్లీ పర్సన్‌ని. నా ఫ్రెండ్షిప్ని ఇతరులు ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకుంటాను. ఒకవేళ ఇష్టపడకపోతే వాళ్లతో బలవంతంగా స్నేహం చేయను. ► ఈ ప్రపంచంలో ఎంత బెస్ట్ పర్సన్ అయినా, అందర్నీ మెప్పించలేరు. ఎక్కడో చోట ఎవరో ఒకర్ని నిరుత్సాహపరుస్తారు. అది సహజం. అందుకే అందర్నీ మెప్పించడానికి ట్రై చేయను. ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. ► నా వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడను. అన్ని విషయాలూ చెప్పేస్తే ఇంకేముంటుంది? అందుకే కొన్నయినా దాచుకుంటా. ఒకరి కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోను. నాకెలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అలా ఉండటం తప్పు అని ఎవరైనా అంటే కేర్ చేయను. ► నేను అందంగా ఉండనని నా ఫీలింగ్. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలా ఉండననుకుంటాను. అమ్మాయి దేహంలోకి బలవంతంగా ఇరికించిన అబ్బాయినేమో అనిపిస్తుంటుంది. ► సోషల్ నెట్వర్క్ అంటే ఇష్టం. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా అందరితోనూ టచ్‌లో ఉండొచ్చు. ► నేను పార్టీ యానిమల్‌ని కాదు. ముఖ్యంగా హాట్ డ్రింక్స్ తీసుకునేవాళ్ల మధ్యలో ఉండటానికి ఇష్టపడను. ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు అక్కడున్నవాళ్లు మాట్లాడుతున్నంతసేపూ హాయిగా మాట్లాడతాను. మద్యం పుచ్చుకోబోతున్నారని తెలియగానే అక్కణ్ణుంచి వెళ్లిపోతా. ► యాక్చువల్‌గా ఫొటోగ్రాఫర్స్ కనిపించగానే మొహం మీద చిరునవ్వు పులుముకుని పోజులిచ్చే టైప్ కాదు నేను. కెరీర్ ఆరంభించిన మొదట్లో చాలా ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత తర్వాత వృత్తిలో ఇది కూడా భాగమే అని సర్ది చెప్పుకున్నా. అప్పట్నుంచీ ఫొటోలకు పోజులివ్వడం పెద్ద ఇబ్బందిగా అనిపించడంలేదు. ► సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హద్దులు దాటడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా చొరవ తీసుకోవాలనుకుంటారు. అలాంటివాళ్లకు వీలైనంత దూరంగా ఉంటాను. -
ఆ ఉంగరం వెనుక సీక్రెట్!
నాజూకు నడుము ఇలియానా ఎంగేజ్మెంట్ రహస్యంగా అయిపోయిందా?... ఇప్పుడు బాలీవుడ్లో జోరుగా షికారు చేస్తున్న వార్త ఇది. ఈ వార్త రావడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య ఇలియానా వేలికి మెరుస్తున్న ఓ ఉంగరమే ఈ చర్చలకు కారణమైంది. ఆ ఉంగరానికి ఉన్న స్టోన్ తళుకులు చూస్తుంటే, ఖరీదైన వజ్రంలా ఉందని కూడా చెప్పుకుంటున్నారు. ఇలియానా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ ఆమెకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం అయ్యుంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల ఓ ముంబై విలేకరి ఈ ఉంగరం వెనక ఉన్న కథను బయటకు లాగుదామని ప్రయత్నించగా, ఇలియానా చాలా తెలివిగా తప్పించుకున్నారట. ‘మీ వేలికి ఉన్న ఉంగరం గురించి చెబుతారా?’ అని ఆ విలేకరి అడిగితే, ‘ఉంగరం గురించా? చాలా బ్యుటిఫుల్గా ఉంది’ అని అందరూ అంటున్నారని ఇలియానా అన్నారట. ఆ సమాధానానికి ఎలా రియాక్ట్ కావాలో ఆ విలేకరికి అర్థం అయ్యుండదని ఊహించవచ్చు. ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అని ఇలియానా ఇన్‌డెరైక్ట్‌గా ఇలా తెలివిగా సమాధానం చెప్పి ఉంటారు. -
హద్దులు దాటితే అంతు చూడాలి!
ఇలియానా చాలా ఫ్రెండ్లీ టైప్. అందరితో సరదాగా ఉంటారు. షూటింగ్ లొకేషన్లో అయితే ఇలియానా ఉంటే సందడి ఉన్నట్లే అని చాలామంది అంటుంటారు. కో-స్టార్స్‌తో అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారట. ఈ విషయం గురించి ఇలియానా మాట్లాడుతూ - ‘‘కలుపుగోలుతనంగా ఉండటం నాకిష్టం. అది ఓ విధంగా ప్లస్.. మరో విధంగా మైనస్. ప్లస్ ఏంటంటే.. అందరూ చక్కగా మాట్లాడతారు. మైనస్ ఏంటంటే.. కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది మనం గ్రహించగలగాలి. లేకపోతే హద్దులు దాటేస్తారు. తేడాగా ప్రవర్తించడానికి ట్రై చేస్తారు. అలాంటివాళ్లను దూరం పెట్టేయాలి. హద్దులు దాటినప్పుడు అంతు చూడటానికి వెనకాడకూడదు. నేనైతే మనుషుల మనస్తత్వాలను సులువుగానే గ్రహించగలుగుతాను. నాతో ఎవరైనా పిచ్చిగా ప్రవర్తించాలని అనుకుంటే, వాళ్ల బాడీ లాంగ్వేజ్ ద్వారా అర్థం చేసేసుకుంటా. చాలా తెలివిగా వాళ్లని పక్కన పెట్టేస్తా’’ అన్నారు. -
ఊహల్లో కూడా అతణ్ణి సోదరుడిలా అనుకోలేను!
రీల్ లైఫ్‌లో రొమాన్స్ చేసే హీరో, హీరోయిన్ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ కుదిరితే రియల్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌గా కొనసాగుతారు. అంతే తప్ప బ్రదర్, సిస్టర్ బాండింగ్ ఉండేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఇటీవల ఓ సందర్భంలో ఇలియానా ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చి, ‘మీ సరసన నటించే హీరోల్లో మీరు ఎవర్ని బ్రదర్‌లా ఫీలవుతారు?’ అని ఓ విలేకరి అడిగితే, ‘ఎవర్నీ అలా అనుకోను’ అని ఆమె ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు. కనీసం ఎవరినైనా బ్రదర్‌లా ఊహించుకునే ప్రయత్నమైనా చేస్తారా అంటే.. ‘‘రణ్‌బీర్ కపూర్‌ని మాత్రం ఊహల్లో కూడా బ్రదర్‌లా అనుకోలేను’’ అని మొహమాటపడకుండా చెప్పేశారీ గోవా బ్యూటీ. ఇలియానా తొలి హిందీ చిత్రం ‘బర్ఫీ’లో రణ్‌బీరే హీరో. ఆ చిత్ర సమయంలో ఈ చాక్లెట్ బాయ్‌తో ఇలియానా చాలా స్నేహంగా ఉండేవారు. రణ్‌బీర్‌లో మంచి స్నేహితుణ్ణి చూస్తున్న ఇలియానా, అతనిలో బ్రదర్‌ని చూడలేకపోతున్నారేమో. అందుకే కాబోలు... ఎప్పటికీ రణ్‌బీర్‌లో బ్రదర్‌ను చూడనంటే చూడలేనని తెగేసి చెప్పారామె. -
ఇక్కడ ఎవరి పోరాటం వాళ్లది!
‘‘జీవితం అంటేనే పోరాటం. తుది శ్వాస విడిచే వరకూ పోరాడాలి’’ అని ఇలియానా అంటున్నారు. జీవితం గురించి ఇప్పుడీ రేంజ్లో ఈ గోవా బ్యూటీ మాట్లాడటానికి కారణం ఉంది. ఇటీవల ఎవరో ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి తన అభిప్రాయం చెప్పడం ఇలియానా విన్నారట. అసలా వ్యక్తి జీవితం ఏంటో? అతని మనస్తత్వం ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒక అభిప్రాయానికి రావడం ఇలియానాకి విచిత్రంగా అనిపించిందట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘ఈ ప్రపంచంలో సమస్యలు లేనివాళ్లంటూ ఎవరూ ఉండరు. ఎవరి సమస్యలు వాళ్లకుంటాయి. ఎవరి పోరాటం వాళ్లది. ఇతరుల జీవితాన్ని పై పైన చూసేసి, వాళ్లు గురించి స్టేట్మెంట్ ఇచ్చేయడం సరి కాదు. ఆ మాటకొస్తే.. అసలు ఎవరి గురించీ ఒక జడ్జిమెంట్‌కి రాకూడదు. ఇక్కడ ఎవరూ ఉత్తములు కాదు.. ఎవరూ అథములూ కాదు. అందుకే ఎవర్నీ విమర్శించకూడదు. వీలైతే ఫ్రెండ్లీగా ఉండాలి’’ అన్నారు. -
సెల్ఫీయా.. నో నో!
నచ్చిన వ్యక్తితో సెల్ఫీ, మంచి డ్రెస్ వేసుకుంటే సెల్ఫీ, కొత్త ప్రదేశానికి వెళితే సెల్ఫీ... ఇలా సెల్ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం ఇప్పుడో ఫ్యాషన్ అయిపోయింది. ఈ పిచ్చి ఎందాకా ముదిరిందంటే.. చివరికి చచ్చిపోయిన వాళ్లతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు. ఇటీవల ఈ సెల్ఫీల గురించి ఇలియానా స్పందించారు. ‘‘ఏమోనండి బాబూ నాకు సెల్ఫీలంటే ఇంట్రస్ట్ లేదు’’ అని పేర్కొన్నారు ఈ గోవా సుందరి. ఇటీవల ఓ రెస్టారెంట్ దగ్గర చిన్న పాప సెల్ఫీ తీసుకుంటూ ఇలియానాకి కనిపించిందట. ‘‘ఒక్క ఫొటో కోసం ఆ పాప దాదాపు 15 నిమిషాలు కేటాయించింది. ఆ ఓపికకు ఆశ్చర్యపోయాను. ఇదే ఓపికను ఉపయోగపడే విషయాలకు కేటాయిస్తే బాగుంటుంది కదా అనిపించింది’’ అని ఇలియానా పేర్కొన్నారు. అది మాత్రమే కాదు.. తనకంత ఓపిక లేదని, ఎవరైనా ఒత్తిడి చేస్తే, అప్పుడు కాదనలేక సెల్ఫీకి ఓకే చెబుతానని స్పష్టం చేశారు. -
ఇలియానా బ్యూటీ సీక్రెట్స్
సౌందర్య సంరక్షణ అనేది ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండాలి. గత కొన్నాళ్లుగా మనం వేసవిని చూస్తున్నాం. ఈ వేసవికి తగ్గట్టుగా నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. వేసవి అనగానే నాకో విషయంలో చాలా భయంగా ఉంటుంది. ఈ భయమంతా నా స్కిన్ గురించే. నాది చాలా సున్నితమైన చర్మం. కొంచెం ఎండలోకి వెళ్లినా కందిపోతుంది. అందుకే సమ్మర్లో సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా బయటికెళ్లే ప్రసక్తే లేదు. ►ఈ సీజన్లో జుట్టు బాగా ఎండిపోయినట్టుగా అవుతుంది. అందుకనే వారంలో రెండు సార్లయినా తప్పనిసరిగా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను. ఆ తర్వాత మంచి షాంపూతో హెయిర్ వాష్ చేస్తాను, ► సమ్మర్లో అవుట్డోర్ షూటింగ్స్ ఉండకూడదని కోరుకుంటాను. చల్లని ప్రదేశంలో షూటింగ్ అంటే భలే హాయిగా ఉంటుంది. ►వేసవిలో మేకప్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. షూటింగ్స్ ఉంటే మేకప్ తప్పదు. లేనప్పుడు అస్సలు మేకప్ జోలికి వెళ్లను. ► మామూలుగా ఉదయం లేవగానే వేడి నీళ్లల్లో కొంచెం తేనె, నిమ్మరసం కలుపుకుని తాగుతాను. ఈ సీజన్లో కూడా అలాగే చేస్తాను. ►కాకపోతే ఎక్కువగా ద్రవపదార్థాలే తీసుకుంటాను. కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు ఇలా రెండు గంటలకొకసారి ఏదో ఒకటి తాగుతాను. ►సమ్మర్ వస్తోందంటే చాలు ప్రత్యేకంగా కాటన్ దుస్తులు కొనుక్కుంటాను. ఈ సీజన్లో అవే సౌకర్యంగా ఉంటాయి. ►వేసవిలో ఉదయం 9గంటలకు ముందు, సాయంత్రం ఆరు గంటల తర్వాత స్విమ్మింగ్ చేస్తాను. సమ్మర్లో చల్లని నీళ్లలో ఈతకొడుతుంటే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. ►ఎవరికైనా నా సలహా ఒకటే అవసరం అయితేనే ఎండలో బయటకు వెళ్లండి, లేకపోతే కూలింగ్ గ్లాసెస్, టోపీ పెట్టుకుని వేళ్తే ఎండ నుంచి రక్షణగా ఉంటుంది. -
దక్షిణాదిపైనే దృష్టి: ఇలియాన
ఇలియాన నీ ఇడుపు మాట అంటూ యువత ఈల పాట పాడుకునేంత ప్రాచుర్యం పొందిన నటి ఇలియాన. ఇంతకుముందు దక్షిణాదిలో ఏలిన ఈ గోవా సుందరి ఇప్పుడు ఉత్తరాదిలో నాయకిగా బలపడాలని ఆశపడుతున్నారు. దక్షిణాదిలో పలు విజయాలను సొంతం చేసుకున్న ఇలియాన అక్కడ అపజయాలను ఎదుర్కొని జయాల కోసం పోరాడుతున్నారు. దీంతో మళ్లీ దక్షిణాదిపై తిరిగి దృష్టి సారించాలని భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఏ విషయాన్నైనా నిర్భయంగా మాట్లాడే ఈ క్రేజీ నాయకితో చిన్న భేటీ.... ప్రశ్న : మీ జీవితం ఊహించని స్థాయిలో నడుస్తోందా? జవాబు: అంతకంటే బ్రహ్మాండంగా సాగుతోంది. ప్రశ్న: జయాపజయాలను ఎలా తీసుకుంటారు? జవాబు: జీవితంలో ఆ రెండే అలక్ష్యం చేయలేనివి. విజయం బాధను పోగొడుతుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది. బాలీవుడ్లో బర్ఫీ చిత్రం నాకలాంటి ఆనందాన్ని అందించింది. ఆ తరువాత చేసిన చిత్రం కొంచెం నిరాశపరచింది. తాజా చిత్రం విజయాన్ని అందిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నా. ప్రశ్న: మీ సహ నటీమణుల్లో ఎవరిని పోటీగా భావిస్తున్నారు? జవాబు: ఎవరిని పోటీగా భావించడం నా కిష్టం లేదు. ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంటుంది. విజయాలు వరిస్తుంటాయి. ప్రశ్న : ఎవరి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నారు? జవాబు: ఒక నటిగా దర్శకులదరితోనూ పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే నాలోని ప్రతిభను వెలికి తీయగల దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నాను. ప్రశ్న: ప్రేమ విషయంలో మీ అభిప్రాయం? జవాబు: ప్రేమ అనేది జీవితంలో ఒక అంగం. నిజమైన ప్రేమను పొందడం కష్టం. ఒకవేళ అలాంటి ప్రేమ లభించినా, దానిని నిలుపుకోవడం అంతకంటే కష్టం. ఏదేమైనా ప్రేమ, పెళ్లి ఈ రెండింటిపైనా నాకు నమ్మకం. ప్రశ్న: వివాహ జీవితం సహజీవనం ఈ రెండు విధానాలపై మీ అభిప్రాయం? జవాబు: ఇది ఇద్దరు జీవితాలకు సంబంధించిన అంశాలు. వివాహ జీవితంలో పలు అనుబంధాలను కాపాడుకోవాల్సిన నిర్బంధం ఉంటుంది. సహజీవనం (లీవ్ ఇన్ రిలేషన్ షిప్) అలాంటిది కాదు. ఇది ఇద్దరు చేసుకునే ఒప్పందం. ఈ తరహా జీవితంలో ఎప్పుడైనా విడిపోవచ్చు. వివాహ జీవితంలో అలా కుదరదు. ఒక్కమాటలో చెప్పాలంటే వివాహ జీవితం ఫ్లైట్ యానం లాంటిది. సహ జీవనం రైలు ప్రయాణం లాంటిది. ప్రశ్న: భవిష్యత్తులో ఎలా జీవించాలనుకుంటున్నారు? జవాబు: నేను 18 ఏళ్ల వయసులోనే నటినయ్యా ను. అందుకే కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నాను. -
డేటింగ్‌కి వెళ్లేటప్పుడు మంచి దుప్పటి తీసుకెళ్లాలి
‘‘డేటింగ్ అనేది విదేశీ సంప్రదాయం అయినా మెల్లి మెల్లిగా ఇక్కడివాళ్లు కూడా అలవాటుపడుతున్నారు. డేటింగ్ చేయడం నాకూ ఇష్టమే’’ అని ఇలియానా అంటున్నారు. ఎవరితో డేటింగ్ చేయడం ఇష్టం అని అడిగితే నవ్వేసి ఊరుకున్నారు. కానీ, డేటింగ్ ఎలా ఉంటే బాగుంటుందో ఈ బ్యూటీ చెబుతూ - ‘‘డేటింగ్ ప్లాన్ చేసుకున్న తర్వాత ముందు మంచి పిక్నిక్ బాస్కెట్ కొనుక్కోవాలి. రుచికరమైన తినుబండారాలతో ఆ బాస్కెట్‌ని నింపుకోవాలి. ఏ చోటు బాగుందనిపిస్తే, అక్కడ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ఓ మంచి దుప్పటి తీసుకెళ్లాలి. అది కూడా మంచి మంచి బొమ్మలున్న దుప్పటినే ఎన్నుకోవాలి. అలాగే, చల్లని ప్రదేశాలకే వెళ్లాలి. అక్కడ చలిమంట కాచుకునే సౌకర్యం ఉండాలి. ఈ మూడూ లేకపోతే డేటింగ్ వేస్ట్. డేటింగ్‌కి బీచ్‌కన్నా బెస్ట్ ప్లేస్ ఉండదు. ఇసుకలో పడుకుని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటుంటే.. భలే మజాగా ఉంటుంది. అలాగే, వైన్ కూడా ఉండాలి సుమా. వైన్ సిప్ చేస్తూ, మాటలు పంచుకుంటే మనసులు ఇంకా దగ్గరవుతాయి’’ అన్నారు. -
మేకప్ లేకుండానే
ఈ మధ్య కథానాయికల్లో చాలా మార్పు కనిపిస్తోంది. మేకప్ లేకుండా మాములుగా అడుగు బయట పెట్టడానికి సాహసించని ఈ బ్యూటీస్ ఇప్పుడు మేకప్ లేకుండా ఏకంగా తెరపైనే కనిపించాలనుకుంటున్నారు. ఇలాగైనా సహజత్వానికి దగ్గరగా ఉండే మంచి కథా బలం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. ఇటీవల నటి సమంత కమర్షియల్ చిత్రాల్లో నటించి బోర్ కొట్టిందని యథార్థ కథా చిత్రాల్లో నటించాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టారు. తాజాగా నటి ఇలియానా మేకప్ లేకుండా నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం విశేషం. మొన్నటి వరకు దక్షిణాది సినీ పరశ్రమను ఏలి తన అందాలతో ప్రేక్షకుల్ని కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ కోసం మరింత బక్క చిక్కిన ఈ భామ, తన నాజూకైన అందాలతో అక్కడి కథనాయకుల్ని ఆకర్షిస్తున్నారు. అలాంటిది మేకప్ లేకుండా ఈమె నటనా ప్రతిభకు ముగ్ధులవుతారా? అయితే ఇలియానా ఈ విషయంలో డోంట్ ఫియర్ అంటున్నారు. మే తేరా హీరో చిత్రంలో హాస్య ప్రాతలో నటించానని ఇలియాన తెలిపారు. అయితే హాస్యం పండించడం అంత సులభం కాదని అనుభవ పూర్వకంగా గ్రహించానన్నారు. ఇటీవల విడుదలైన హ్యాపీ ఎండింగ్ చిత్రంలోను ఇంతకుముందు నటించని వైవిధ్య పాత్రను పోషించానని చెప్పారు. ఇకపై కమర్షియల్ చిత్రాల్లో మాత్రమే నటించాలనుకోవడం లేదన్నారు. హైవే చిత్రంలో అలియూభట్ మేకప్ లేకుండానే నటించి మెప్పించారన్నారు. ఆ చిత్రం చూసిన తర్వాత తాను కూడా మేకప్ లేకుండానే నటించాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. మేకప్ లేకుంటే ముఖం ఎలా ఉంటుందో తెలిసినా భ యపడనన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే ఆసక్తిగా నటిస్తానని ఇలియానా అంటున్నారు. అరుుతే చూడటానికి ఆమె అభిమానులు సిద్ధంగా ఉండాలిగా. చూద్దాం ఇలియానా కోరిక తీర్చడానికి ఏ దర్శక నిర్మాత ముందుకొస్తారో. -
చర్చనీయాంశమైన శృంగార కథా రచయిత్రిగా...
సైఫ్ అలీఖాన్, ఇలియానా జంటగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ గురించి అటు మీడియాలోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ ఆసక్తికరమైన చర్చ ఒకటి హల్చల్ చేస్తోంది. పైగా ఆ చర్చ కూడా ఇలియానా పాత్ర గురించే. ఈ సినిమాలో ఇలియానా శృంగార కథల రచయిత్రిగా నటిస్తోందనీ, దానికి తగ్గట్టే అంతకు ముందెప్పుడూ కనిపించనంత అందంగా ఇందులో ఇల్లూ బేబీ కనిపించనుందనీ, బెడ్రూమ్ సన్నివేశాల్లో కూడా సైఫ్‌తో కలిసి రెచ్చిపోయి నటించిందనీ ఈ చర్చ సారాంశం. దీనిపై రకరకాల కథనాలు ఇప్పటికే మీడియాలో వచ్చాయి. ఇలియానా మొదట్లో వీటిపై పెద్దగా స్పందించకపోయినా... ఈ గాలివార్తలు శ్రుతి మించి రాగాన పడఢంతో స్పందించక తప్పలేదు. ‘‘అందరూ అనుకుంటున్నట్లు ఇందులో నేను శృంగార కథల రచయిత్రినే. అయితే... నేను శృంగారాన్ని ఒలకబోశాననే వార్తల్లో మాత్రం నిజం లేదు. ఇందులో నా పాత్ర చాలా పద్ధతిగా ఉంటుంది. రొమాన్స్ అనేది నా రచనల్లో ఉంటుంది తప్ప, నాలో కనిపించదు. నిజానికి ఈ విషయంపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకిస్తున్నానంటే.. అనవసరంగా అంచనాలు పెరగడం, చివరకు థియేటర్లో వాళ్లు ఊహించినవి లేకపోవడం... వంటి కార ణాలు సినిమా ఫలితంపై ప్రభావితం చేస్తాయి.అందుకే చెబుతున్నా’’ అని వివరణ నిచ్చారు ఇలియానా. -
ఆ బంధంలో ఏదో మహత్తు ఉంది!
‘‘ఇద్దరు అపరిచితులు పెళ్లి చేసుకోవడం చాలా తమాషా అయిన విషయం. అసలు.. అభిరుచులు, మనస్తత్వం తెలియకుండా అకస్మాత్తుగా ఓ బంధం ఏర్పరచుకుని జీవితాంతం ఎలా ఉంటారబ్బా అనుకునేదాన్ని. ఇలా ఆలోచించడంవల్లనో ఏమో ఒకప్పుడు నాకు పెళ్లంటే పరమ అసహ్యంగా ఉండేది’’ అని ఇలియానా చెప్పారు. కానీ, ఇప్పుడు అసహ్యం స్థానంలో ఇష్టం ఏర్పడిందట. దాని గురించి ఇలియానా చెబుతూ -‘‘వయసు పెరిగే కొద్దీ మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని బంధాల మీద నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అలా నాకు వివాహ బంధం మీద సదభిప్రాయం ఏర్పడింది. ఈ బంధంలో ఏదో మహత్తు ఉంది. అందుకే, పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనే నా నిర్ణయాన్ని మార్చేసుకున్నాను’’ అని చెప్పారు. ఇంతకీ, త్వరలోనే మీ పెళ్ళట కదా అని అడిగితే... ‘మీ అందరికీ చెప్పే చేసుకుంటా’ అని ఇలియానా నవ్వుతూ బదులిచ్చారు. -
సైఫ్‌తో హాట్ హాట్‌గా...
రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా బతకాల్సిందే... అనే సూత్రాన్ని తూ.చ. తప్పక పాటిస్తున్నారు ఇలియానా. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి చాలామంది భామలే వెళ్లారు కానీ... ఇలియానా అంత వేగంగా అక్కడి పద్ధతుల్ని ఆకళింపు చేసుకున్న తార మాత్రం లేరనే చెప్పాలి. తొలి సినిమా ‘బర్ఫీ’ మినహా ఆ తర్వాత ఇలియానా చేసిన రెండు సినిమాలూ బోల్తా కొట్టాయి. నిజానికి ఇలాంటి అపజయాలు ఎదురైన ఏ హీరోయిన్ అయినా... వెంటనే వెనక్కు వచ్చేస్తారు. కానీ... ఇలియానా అలా కాకుండా, బికినీ ఫొటో షూట్‌తో అక్కడ బోలెడంత పాపులారిటీ తెచ్చేసుకున్నారు. అక్కడి హీరోలతో క్లోజ్‌గా ఉండటమే కాక, కథానాయికలతో దోస్తీ కడుతూ ఉత్తరాది భామగా మారిపోయారు. ఇదిలావుంటే... ఇటీవలే సైఫ్ అలీఖాన్ జోడీగా ఇలియానా నటించిన ‘హ్యాపీ ఎండింగ్’ సినిమా ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ట్రయిలర్స్‌లో ఇలియానా హాలీవుడ్ లుక్ చూసి బాలీవుడ్ జనాలు సైతం ఫిదా అయిపోతున్నారని సమాచారం. మరో విషయం ఏంటంటే... ఈ సినిమా దర్శక ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకెలు కథ రీత్యా ఇందులో ఓ బెడ్రూమ్ సీన్ చిత్రీకరించారట. సైఫ్, ఇలియానా కాంబినేషన్లో రూపొందిన ఈ సన్నివేశంలో ఇలియానా హాట్ హాట్‌గా నటించారని యూనిట్ వర్గాల టాక్. ఈ విధంగా... జయాపజయాలకు అతీతంగా బాలీవుడ్ సంప్రదాయాలను పాటిస్తూ, చకచకా హిందీ తెరపై అగ్ర నాయికల జాబితాకి చేరిపోతున్నారు ఇలియానా. -
మా అమ్మ కూలీలా పని చేసేది!
‘‘ఇలియానాకేం కోట్లు సంపాదిస్తోంది. మహారాణి లాంటి జీవితం అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడైతే నా జీవితం అలానే ఉంది. ఓ మనిషి సుఖంగా జీవించడానికి కావాల్సిన వసుతులన్నీ నాకున్నాయి. కానీ, ఒకప్పుడు అలా కాదు’’ అని ఇలియానా అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో తన చిన్నప్పటి విశేషాలను గుర్తు చేసుకున్నారామె. అప్పట్లో సొంత ఇల్లు కట్టుకోవాలని తన తల్లిదండ్రులు చాలా ఆరాటపడ్డారని ఇలియానా చెబుతూ -‘‘నేను పుట్టి, పెరిగింది ముంబయ్‌లోనే. నాకు పదేళ్లప్పుడు మేము గోవా వెళ్లాం. అప్పటికి నాన్నగారు ఇంకా ముంబయ్‌లోనే పని చేస్తున్నాను. అమ్మ, నేను, నా సిస్టర్ గోవాలో ఉండేవాళ్లం. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనిపించి, అప్పటికే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని నాన్న కొన్నారు. అద్దె దండగ కదా అని, ఆ ఇంటిని ఖాళీ చేసి, ఇల్లు మొత్తం రెడీ కాక ముందే కొన్న ఇంట్లోకి మారాం. ఒకవైపు ఇంటి పనులు జరుగుతుంటే మేం ఎలాగోలా సర్దుకునేవాళ్లం. అమ్మ సంగతి చెప్పక్కర్లేదు. దాదాపు కూలీలా పని చేసేది. మేం స్కూల్ నుంచి రాగానే, ఇంటి పనులు చేసేవాళ్లం. ఆ అలసటతో ఒక్కోసారి నేల మీదే పడుకుని, నిద్రపోయేవాళ్లం. కష్టం విలువ నాకు బాగా తెలుసు. అందుకే ఎవరైనా ‘నువ్వు లక్కీ. కష్టాలెలా ఉంటాయో నీకు తెలియదు కదా’ అంటే, వర్తమానాన్ని చూసి అలా ఎవరి పరిస్థితినీ అంచనా వేయొద్దు. గతంలో వాళ్లెలాంటి కష్టాలు పడ్డారో తెలుసుకుని స్టేట్మెంట్లివ్వండి అంటుంటాను’’ అన్నారు. -
పిల్లలు పుడితే..!
ఆలూ లేదు చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నారట ఎవరో. అలా ఇలియానా ఇంకా పెళ్లి గురించే ఆలోచించడంలేదు.. అప్పుడే పిల్లలు పుడితే బరువు పెరుగుతానేమో అని ఆలోచిస్తున్నారట. అవును మరి.. సన్నగా, మెరుపు తీగలా ఉండే ఏ అమ్మాయి అయినా పిల్లలు పుట్టిన తర్వాత ‘షేప్ అవుట్’ అవుతుందని భయపడటం సహజమే కదా. పైగా ఇలియానా లాంటి హీరోయిన్లకు ఈ భయం ఇంకా ఉంటుంది. అందుకేనేమో పిల్లలు పుట్టిన తర్వాత కూడా స్లిమ్‌గా ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకుంటున్నారట. ఆల్రెడీ ఇలియానా అక్క తల్లయ్యారు. తన అక్క గర్భం దాల్చినప్పుడు, బిడ్డను కనేలోపు వచ్చిన మార్పులు, ఆ తర్వాత మారిన ఆమె శరీరాకృతి గురించి దగ్గరగా చూశారు ఇలియానా. దాంతో తల్లయ్యాక శరీరాకృతి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంతవరకు అవగాహన చేసుకున్నారట. ఏదేమైనా దీన్నిబట్టి ఇలియానాకు ముందు చూపు ఎక్కువ అని మాత్రం అర్థమవుతోంది. -
లైంగిక కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉండాలి?
అసభ్యకర వ్యాఖ్యలతో నటి ఇలియాన మరోసారి కలకలం రేపింది. ఉత్తరాది సినీ సంస్కృతికి, దక్షిణాది సినీ సంస్కృతికి చాలా వ్యత్యాసం ఉంది. బాలీవుడ్ తారలు ఏ విషయమైనా బహిరంగంగా మాట్లాడుతారు. హీరోలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం నుంచి వారితో సంబంధాలు పెట్టుకోవడం వరకు దాపరికాలు లేకుండా చెప్పేస్తారు. కొందరు నటీమణులైతే నగ్నంగానే ఫొటోలకు పోజులిచ్చేస్తారు కూడా. అలాంటి సంస్కృతికి దక్షిణాది నటీమణులు దూరమనే చెప్పాలి. దక్షిణాది నుంచి ఉత్తరాది చిత్ర పరిశ్రమకు వెళ్లిన అసిన్, కాజల్ అగర్వాల్ లాంటి వారు పరిధికి మించి ప్రవర్తించలేదు. అయితే ఇలియూనాకు బాలీవుడ్ అలవాట్లు అబ్బినట్టున్నాయి. తెలుగులో ప్రముఖ కథానాయికగా రాణించిన ఈ బ్యూటీతమిళంలో నన్భన్ చిత్రంతో మంచి పేరునే సంపాదించుకుంది. ఆ తరువాత బాలీవుడ్లో మకాం పెట్టిన ఈ బ్యూటీకి అక్కడ తొలి చిత్రం బర్ఫీ మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీంతో అక్కడ పరిస్థితి అమ్మడికి ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఈమె ప్రవర్తన మాత్రం బరి తెగించినట్లే అనిపిస్తోంది. పురుషులతో సంబంధం గురించి ఇటీవల ఇలియానా ఇచ్చిన ఇంటర్వ్యూ కలకలం రేపింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొంటూ లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలనే తన శరీరాన్ని చక్కని షేప్‌లో ఉంచుకోగలుగుతున్నానని, అది పరవశమైన తరుణమని, అలాంటప్పుడు దానికెందుకు దూరంగా ఉండాలి? అంటూ ఇలియానా చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయి. ఇంతకు ముందు ఒకసారి లైంగిక విషయాల గురించి తన తండ్రితో చర్చిస్తానని చెప్పి ఇదే విధంగా సంచలనం సృష్టించింది. -
నేను చాలా నేర్చుకోవాలి!
నటిగా తాను నేర్చుకోవలసింది చాలా ఉంది అంటోంది నటి ఇలియానా. ఇంతకుముందు నాయకిగా దక్షిణాదిలో ఒక ఊపు ఊపిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి సారించింది. హిందీలో తొలిచిత్రం ఖుషి ఆశించిన విజయం సాధించకపోయినా ఇలియానాకు మాత్రం నటిగా మంచి మార్కులే పడ్డాయి. అక్కడ ఈ అమ్మడి పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అయితే తననీ స్థాయికి చేర్చిన దక్షిణాది చిత్ర పరిశ్రమను ముఖ్యంగా తెలుగు పరిశ్రమను మర్చిపోనంటున్న ఈ గోవా సుందరితో చిన్న భేటీ. తెలుగు నుంచి హిందీకి వెళ్లిన అనుభవం ఎలాగుంది? ఆదిలోతనకు అవకాశాలు ఇచ్చింది దక్షిణాది చిత్ర పరిశ్రమనే. నాలోని నటనా ప్రతిభను గుర్తించింది దక్షిణాది చిత్ర ప్రముఖులే. ఆ తరువాతనే హిందీ చిత్ర అవకాశాలు నన్నెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హిందీ చిత్ర పరిశ్రమకు రావడం అనేది నాకు కొత్తమలుపే. ఇక అక్కడ విజయాలతో ఒక్కో మెట్టుఎదగాలి. ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. నటించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా నా ద్వారా ప్రకటించే వస్తువులు నిజంగా నాణ్యమైనవేనా..? అనే అంశం గురించి ఆరా తీస్తాను. నేను ప్రకటన కోసం నటించిన షాంపూను నేనే పలుసార్లు ఉపయోగించి చూస్తాను. ఎందుకంటే ప్రజల మధ్యకు వెళ్లే ప్రొడక్ట్‌లో నాణ్యత లేకపోతే వాటికి సంబంధించిన ప్రకటనల్లో నేను నటించను. ప్రస్తుతం చాలా మంది నకిలీ వస్తువులతో చాలా మోసపోతున్నారు. అందువల్ల నేను ప్రచారంచేసే వస్తువు ఏమిటి? అందులో ఎలాపాలు పంచుకోవాలి? అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చిస్తాను. వాణిజ్య ప్రకటనలో నటించడం అనేది నా ఉద్దేశంలో మంచి వృత్తినే. కొందరు నటీమణులు జీరో ఫిగర్ పేరుతో మరీ సన్నగా తయారవుతున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? సినిమాకు అందమైన ఆకారం అవసరం. అందమైన అవయవ సంపద కలిగి ఉంటే రంగురంగుల దుస్తులు ధరించి అదరగొట్టవచ్చు. అందుకని నోరు కుట్టుకుని జీరో ఫిగర్ అనిపించుకోవడం నాకిష్టం ఉండదు. మీ దృష్టిలో నాగరీకత అంటే? నాగరికత అంటే నవ్యంగా ఉండాలి. అదే సమయంలో మనకు సౌకర్యంగా ఉండాలి. నలుగురూ నవ్వుకునేలా ఉండకూడదు. నాకు విదేశీ దుస్తులంటే ఇష్టమే. అయితే వాటిని ఇతరులుచూసి బాగున్నామనిపించేలా చూసుకుంటాను. మీరు పోటీపడే నటి ఎవరు? ప్రస్తుతానికి నేనెవరితోనూ పోటీ పడడంలేదు. నటనలో నేనింకా నేర్చుకోవలసింది చాలా ఉంది. ఒక్కొక్కరి నటన నాకొక్కో రకంగా పాఠం. మీరు నిజ జీవితంలోను, సినిమాలోనూ ఎప్పుడూ చాలా అందంగా కనిపించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను కొత్తగా అందంగా తయారవ్వాల్సిందేమీ లేదు. నిజ జీవితంలో ఎలా ఉంటానో, సినిమాలోనూ అలానే ఉంటాను. నిజానికి అందం అనేది మనం మాట్లాడే విధానం, చూపుల్లో, నవ్వులో, ఇతరులతో ప్రవర్తించే విధానంలోనూ ఉంటుంది. దాన్ని పోరాడి పొందాల్సిన అవసరం లేదు. నన్నడిగితే చిరునవ్వే నిజమైన అందం. పలు భాషల్లో నటిస్తున్నప్పుడు భాషా సమస్య తలెత్తదా? ఇప్పుడు భాష ఒక సమస్య కాదు. ఎవరైనా ఏ భాషలోనైనా నటించవచ్చు. నేను పుట్టింది ముంబయిలో. పెరిగింది గోవాలో. అక్కడే చదివాను. 16 ఏళ్ల ప్రాయంలో వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి సిద్ధమయ్యాను. 18 ఏళ్ల వయసులో తెలుగు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత తమిళంలో నటించాను. ఇప్పుడు హిందీ చిత్రాలు చేస్తున్నాను. కాబట్టి భాష ఎలాంటి సమస్య కాదు. -
ఆస్తులమ్మేస్తున్నా
నటి ఇలియానా ఆస్తులు అమ్ముకోవడానికి సిద్ధం అవుతోంది. తమిళంలో కేడీ చిత్రంతో పరిచయమైన నటి ఇలియానా. అయితే ఆ మధ్య విజయ్‌తో రొమాన్స్ చేసిన నన్బన్ చిత్రంతో పాపులర్ అయ్యింది. అదే ఆమె చివరి తమిళ చిత్రం కూడా. అంతకు ముందు తెలుగులో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందిన ఈ గోవా సుందరి ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి సారిస్తోంది. బర్ఫితో హిందీ చిత్ర సీమలో ప్రవేశం చేసిన ఇలియానాకు అక్కడ పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో అక్కడే సెటిల్ అయ్యింది. ముంబాయిలో ఇల్లు కూడా కొనుక్కొన్న ఇలియానా, అంతకు ముందు ఆంధ్రాలో కొనుగోలు చేసిన బంగ్లా, ఇతర స్థిరాస్తులను ఇప్పుడు విక్రయించాలని నిర్ణయించుకుందట. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతాల్లో ఇలియానా సొంతంగా అందమైన భవనాన్ని కొనుక్కున్నారు. ఈ భవనాన్ని అప్పట్లో ఈమె కోటిన్నరకు కొనుక్కున్నారు. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోవడంతో అక్కడి ఆస్తుల విలువ తగ్గిపోతుందనే సమాచారాన్ని కొందరు ఇలియానాకు చేరవేయడంతో ఆమె తన ఆస్తుల్ని విక్రయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇలియానా ఆస్తుల విక్రయం వ్యవహారం గురించి ఆమె తల్లి రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. -
బాలీవుడ్లో గోల్డెన్‌ఛాన్స్!
దక్షిణాది కథానాయికలకు బాలీవుడ్లో సినిమా చేయడం కష్టమేం కాదు. అయితే... అక్కడ నిలదొక్కుకోవడమే కష్టం. గతంలో శ్రీదేవి దక్షిణాది నుంచి వెళ్లి సూపర్‌స్టార్‌గా బాలీవుడ్ తెరను ఏలారు. ఆమధ్య అసిన్ కూడా రెండుమూడేళ్ల పాటు హవా సాగించారు. ఈ మధ్య కాజల్ అగర్వాల్, తమన్నాలు బాలీవుడ్లో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్నా, గొప్పగా పేరుప్రఖ్యాతులు రాలేదు. అయితే... ఇలియానా వీరిద్దరికంటే కొంచెం బెటర్ అని చెప్పాలి. తొలి సినిమా ‘బర్ఫీ’తోనే అక్కడ విమర్శకుల ప్రశంసలందుకున్నారామె. ఆ తర్వాత వచ్చిన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఇలియానాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇటీవల తన బికినీ ఫొటోషూట్‌తో బాలీవుడ్ దిగ్గజాల దృష్టిని అమితంగా ఆకర్షించేశారు ఈ గోవా బ్యూటీ. అందుకే... అద్భుతమైన అవకాశం ఈ అందాలభామకు తలుపు తట్టిందని వినికిడి. ప్రస్తుతం ముంబయ్‌లో ఇదే హాట్ టాపిక్. విషయం ఏంటంటే.. త్వరలో ప్రతిష్టాత్మక యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మించనున్న చిత్రాల్లో ఇలియానా కథానాయికగా నటించనున్నారట. కొత్తగా ఏ హీరోయిన్ని తీసుకున్నా... ఆమెతో ఒకేసారి మూడు సినిమాలకు అగ్రిమెంట్ రాయించుకోవడం యశ్‌రాజ్ ఫిలింస్ వారికి అనవాయితీ. ఆ విధంగా ఇలియానాతో కూడా మూడు సినిమాలకు అగ్రిమెంట్ రాయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో ఒకటి సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ సినిమా. మరొకటి రణ్‌బీర్ కపూర్ చిత్రం. ఇంకొకటి సల్మాన్‌ఖాన్ మూవీ. ఈ మూడు సినిమాలతో ఇలియానా ఫేట్ మారిపోవడం ఖాయం అంటున్నారు పరిశీలకులు. -
లవ్ చేయడంలో ఆశ్చర్యం ఏముంది?
దేవదాస్ పేరుతో తెరకెక్కిన చిత్రం ద్వారా హీరోయిన్గా దక్షిణాదికి పరిచయం అయిన నటి ఇలియానా. ఈ గోవా బ్యూటీకి ఆ చిత్రం తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. తెలుగులో దేవదాస్ తరువాత పోకిరి ఆమె స్థాయిని మరింత పెంచింది. తమిళంలో నన్భన్ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న ఇలియానా ప్రస్తుతం తన దృష్టినంతా పూర్తి బాలీవుడ్‌పైనే సారిస్తుండటం విశేషం. తన ప్రియుడు కూడా ముంబయిలో సెటిల్ అవడం కూడా అందుకు కారణం కావచ్చు. ఏమిటి సడన్‌గా ఇలియానా ప్రియుడి ప్రస్తావన తీసుకొస్తున్నారని అనుకుంటున్నారా? ఆమె ప్రేమ వ్యవహారం ప్రియుడి సమాచారం గురించి ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది. వారి సహ జీవనం గురించి చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇంతవరకు చాలా గుంభనంగా ఉంటూ వ్యక్తిగతం గురించి మాట్లాడడం ఇష్టం లేదంటూ దాటవేసే ధోరణిని అవలంభించిన ఇలియానా ప్రేమ వ్యవహారం తాజాగా బట్టబయలైంది. ప్రస్తుతం ఇలియానా తన ప్రియుడు ఆండ్య్రూతో బాహాటంగానే డేటింగ్ చేస్తుండడం విశేషం. తాను మాత్రం నిజాన్ని ఎంతకాలం దాచగలననుకున్నారో, లేక త్వరలో తాళికి తల వంచబోతున్నారో సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో గడిపేస్తున్నారట. అలాగే ఇటీవల పుట్టిన రోజును జరుపుకున్న ఆండ్యూ శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్లో ఏమని పోస్ట్ చేశారో చూద్దాం. ‘‘హ్యాపీ బర్త్‌డే ఎట్ ఆండ్య్రు. బహుశా ఈ సమయంలో నేను నీ చెంత ఉంటే ఈ ఏడాది నీకు అత్యంత సంతోషకరమైన పుట్టిన రోజు అయి ఉండేదేమో’’ అని పేర్కొన్నారు. అందుకు ఆండ్య్రూ బదులిస్తూ ‘‘అమ్మాయిలు ఎలాంటి మగవారిని ప్రేమిస్తారో తెలుసా? డీసెంట్‌గా ఉండేవారిని, ఆ తరువాత బాగా వంట చేసి పెట్టేవారిని, మంచి కండల వీరుడిని’’ అని పోస్టు చేశారు. అందుకు ఇలియానా ‘‘అహ్హా..హా..హ్హా... అలాంటి నిన్ను నేను లవ్ చేయడంలో ఆశ్చర్యమేముంది’’ అంటూ బదులిచ్చారు. అందుకు ఆండ్య్రూ స్పందిస్తూ ‘‘ఎప్పుడైతే నువ్వలా అన్నావో నాకు లైఫ్ లాటరీలో గెలిచినంత ఆనందంగా ఉంది ఐ లవ్యూ’’ అంటూ బదులిచ్చారు. ఇలియానా, ఆండ్య్రూల ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. ఈ ప్రేమికులిద్దరూ ఇప్పుడు బాలీవుడ్ చిత్రం హ్యాపీ ఎండింగ్లో నటిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్యూ మంచి ఫోటోగ్రాఫర్, గిటారిస్ట్ కూడానట. -
ఇలియానా పాత్రలో...
పళ్లకు క్లిప్, కళ్లకు జోడు... ఫ్యాషన్లకు పోకుండా సాదాసీదా పంజాబీ డ్రస్... ఇది ‘జులాయి’ సినిమా ఇలియానా ఆహార్యం. తన అందంపై తనకే నమ్మకం లేని అమ్మాయిలా కనిపిస్తారు ఆ సినిమాలో ఇలియానా. అలాంటి అమ్మాయిలో కూడా అందాన్ని చూస్తాడు బన్నీ. ‘ఓ మధూ.. ఓ మధూ’ అని ప్రేమించమంటూ ప్రాథేయపడతాడు. నిజంగా త్రివిక్రమ్... నవ్యమైన ఆలోచనకు ఇదో ఉదాహరణ. ఓ విధంగా ఈ తరం కథానాయికల పాత్రలతో పోలిస్తే...‘జులాయి’లో ఇలియానా చేసింది భిన్నమైన పాత్రే. అందుకే అనుకుంటా... ‘జూలాయి’ తమిళ వెర్షన్లో ఇలియానా పాత్రను మీరు చేస్తారా’ అని అడగడమే ఆలస్యం.. ‘సై’ అనేశారట తమన్నా. ప్రశాంత్ ఇందులో కథానాయకుడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. అంటే... త్వరలో తమన్నా కూడా పళ్లకు క్లిప్‌తో, కళ్లకు జోడుతో వెరైటీగా తమిళ తంబీలకు కనిపించనున్నారన్నమాట. మరి ఇలియానా కేక పుట్టించిన ఆ పాత్రను తమన్నా ఏ మాత్రం మెప్పిస్తారో చూడాలి. -
నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు!
టూపీస్ బికినీలో ఇలియానా ఫొటోషూట్.. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే హాట్ టాపిక్. ఈ ఫొటోషూట్‌కి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ముప్ఫై సినిమాల్లో నటించినా రాని పాపులారిటీ ఒక్క ఫొటో షూట్‌తో సొంతం చేసుకుంది ఇల్లూ బేబీ. ఈ ఫొటో షూట్ పుణ్యమా అని... మళ్లీ ఇలియానాను తెలుగులో ఓ సై ్టలిష్హీరో సరసన నటింపజేయడానికి ఈ మధ్య ప్రయత్నాలు కూడా జరిగాయట. అయితే... ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయని టాలీవుడ్ టాక్. రెండు కోట్లు ఇస్తామని సదరు నిర్మాతలు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినా... ‘మూడు కోట్లు ఇచ్చినా నేను చేయలేను. ఎందుకంటే... బాలీవుడ్లో నేను బిజీ’ అని తేల్చి చెప్పేశారట ఇలియానా. ఈ ఫొటో షూట్ ఇలియానాకు ఆ స్థాయిలో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇటీవల ఈ షొటోషూట్ గురించి ఇలియానా మాట్లాడుతూ- ‘‘నా లేటెస్ట్ ఫొటోషూట్‌లో నన్ను చూసిన వారందరూ చాలా అందంగా ఉన్నావని మెచ్చుకుంటున్నారు. కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఆ ఫొటోషూట్ నాకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. నిజానికి ఆ ఫొటో షూట్లో పోజులివ్వడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. గోవాలో సముద్రం ఒడ్డునే మా ఇల్లు అయినా... నాకెందుకో సముద్రం అంటే కాస్త భయం. కానీ... ఈ ఫొటో షూట్ కోసం సముద్రంలో కొంత దూరం వెళ్లి, అక్కడ పోజులివ్వాల్సి వచ్చింది. భయం కళ్లలో కనిపించకుండా జాగ్రత్తపడుతూ ఈ స్టిల్స్ ఇచ్చాను’’ అని చెప్పారు ఇలియనా. ‘ఫొటోషూట్‌లో చాలా సన్నగా కనిపించారు. ఉన్నట్టుండి అలా చిక్కిపోయారేం?’ అని అడిగితే.. ‘‘నా ఆహారపట్టిక చూస్తే హీరోయిన్లు ఇంత భారీగా కూడా తింటారా? అని ఆశ్చర్యపోతారు. నేను భోజనప్రియురాలిని. ఇష్టమైన ఐటమ్స్ అన్నింటినీ చక్కగా లాగించేస్తా. ఎంత తిన్నా నేను బరువు పెరగకపోవడానికి కారణం ఎక్కువ సేపు వర్కవుట్స్ చేయడమే. శరీరానికి అవసరం లేని కేలరీస్ అన్నీ కరిగించేస్తా’’ అని చెప్పారు ఇలియానా. -
నైట్ క్లబ్లో ఇలియానా, వరుణ్
నటి ఇలియానా అర్ధరాత్రి వరకు బాలీవుడ్ నటుడితో క్లబ్ లో గడపడంతో సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందిన నటి ఇలియానా. కోలీవుడ్‌లో నన్బన్ చిత్రంలో విజయ్‌తో రొమాన్స్ చేసిన ఈ గోవా సుందరి తాజాగా ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించారు. ఈమె వరుణ్ ధావన్ సరసన నటించిన మే తేరా హీరో చిత్రం ప్రమోషన్ కోసం బెంగళూరు విచ్చేసి, అక్కడే ఒక నక్షత్ర హోటల్లో బస చేశారు. ఆమెతోపాటు నటుడు వరుణ్ ధావన్ కూడా ఉండడం విశేషం. చిత్ర ప్రచార కార్యక్రమం ముగిసిన తరువాత హోటల్‌కు చేరిన వరుణ్‌ధావన్, ఇలియానా, ఆ వెంటనే నైట్ క్లబ్‌కు వెళ్లారు. అక్కడే అర్ధరాత్రి ఒంటి గంట వరకు వరుణ్ ధావన్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. వీరి రొమాన్స్ చూసిన అక్కడి వారు విస్మయం చెందారు. ఇప్పటికే ఇలియానా నటుడు వరుణ్ ధావన్ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని స్త్రీలంటే చాలా గౌరవం అని పొగడ్తలతో ముంచెత్తి, తను పెళ్లి చేసుకుంటే అలాంటి వ్యక్తినే చేసుకుంటానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడిలా వరుణ్ ధావన్‌తో నైట్ క్లబ్‌ల్లో గడపడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. -
హత్తుకోగానే భలే అనిపించింది!
ఏ వ్యక్తి జీవితంలో అయినా మళ్లీ మళ్లీ తల్చుకుని ఆనందించదగ్గ సంఘటనలు కొన్ని ఉంటాయి. ఇలియానాకు కూడా అలాంటివి ఉన్నాయి. ఇటీవల ఓ సందర్భంలో ఆ మధురానుభూతుల గురించి ఈ గోవా సుందరి చెబుతూ -‘‘ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్దగా సంతోషపెడుతుంటాయి. అప్పుడప్పుడూ గుర్తొస్తుంటాయి. అలా, నా మూడేళ్ల మేనల్లుడు చేసే చిలిపి పనులు నాకెప్పుడూ గుర్తొస్తాయి. వాడు భలే ముద్దుగా ఉంటాడు. ఆ మధ్య ఓసారి గట్టిగా వాణ్ణి హత్తుకున్నాను. ఆ చిన్నారి స్పర్శ నాకు మరపురాని అనుభూతినిచ్చింది. ఆ స్పర్శ తాలూకు అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. అంతేకాదు, నేనిష్టపడేవాళ్లు పంపించే చిన్న సందేశం కూడా నా మనసు పొరల్లో దాగుంటుంది. ఇటీవల దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో ఓ పూజా కార్యక్రమం జరిగింది. దానికోసం నేను ప్రత్యేకంగా కేక్ తయారు చేశాను. అనురాగ్‌కి ఆ కేక్ తెగ నచ్చింది. నాకు నచ్చినవాళ్లకి వండిపెట్టడం నాకిష్టం. ఆ వంటకం వాళ్లకు నచ్చితే ఇంకా ఇంకా సంతోషం. ఆ క్షణంలో వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇలా నన్ను ఆనందపరిచే చిన్న చిన్న విషయాలను అప్పుడప్పుడూ గుర్తు చేసుకుని ఆనందపడిపోతుంటాను’’ అని చెప్పారు. ఇది ఇలా ఉంటే హిందీలో ఇలియానా నటించిన మూడో చిత్రం ‘మై తేరా హీరో’ వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి లిప్ లాక్ సన్నివేశంలో నటించారు ఇలియానా. హీరో హీరోయిన్ల ఈ లిప్ లాక్ ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పెదవి ముద్దు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. -
మేం ప్రేమలో పడితే మీకేంటి?
దక్షిణాదిన ఓ వెలుగు వెలిగి ఉత్తరాదిన తన సత్తా చాటుకునే పనిలో ఉన్నారు ఇలియానా. హిందీలో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న ఇలియానా మరోవైపు తన బోయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో కలిసి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారట. ఈ వ్యవహారం గురించి బాలీవుడ్లో చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. మీరు ప్రేమలో పడ్డారట? అని ఇటీవల ఎవరో ఇలియానాని అడిగితే -‘‘అసలు నా విషయం మీకెందుకండి? మేం సినిమాల్లో ఏం చేసినా చూస్తారు. చివరికి ఐటమ్ సాంగ్స్ చేసినా ఆనందంగా చూసేస్తారు. హీరోయిన్ కదా.. ఐటమ్ సాంగ్ చేసిందేంటి? అని అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా మాట్లాడరు. కానీ, ఏ హీరోతోనో, స్నేహితుడితోనో మాట్లాడుతూ కనిపిస్తే చాలు.. ‘ఆ ఇద్దరి మధ్య సమ్‌థింగ్’ అనేస్తారు. అయినా మేం ప్రేమలో పడితే మీకేంటి? పడకపోతే ఏంటి? అది మా వ్యక్తిగత విషయం. ఒకవేళ ప్రేమించినా అది తప్పా? చెయ్యకూడని తప్పేదో చేసినట్లుగా ప్రచారం చేస్తారు. మేమూ మనుషులమే. మీరు ప్రేమలో పడ్డట్లే మేమూ పడతాం. దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకెందుకు? మేం సెల బ్రిటీలం కనుక వదంతులు ఎదుర్కోవడం అలవాటైపోతుంది. మరి.. మా కుటుంబ సభ్యుల సంగతేంటి? వాళ్లు ఫీలవరా’’ అని ఘాటుగా స్పందించారట. -
వీళ్ల గుండెజారి గల్లంతయ్యిందా?
ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో మహా మహా శాస్త్రవేత్తలే పరిశోధించినా చెప్పలేని అంశం. నిజంగానే ప్రేమంటేనే ఓ మాయ. అదో కొత్త ప్రపంచం కూడా. రీల్‌పై ఎన్నో ప్రేమకహానీలు నడిపే కథానాయికలు, రియల్ ప్రేమను ఎలా ఆస్వాదిస్తారు? ఇటీవలికాలంలో అగ్రకథానాయికల రియల్ లవ్ స్టోరీలకు వెబ్‌సైట్స్‌లో అగ్రతాంబూలం దక్కుతోంది. అసలు వీరి ప్రేమ నిజమేనా? నిజానిజాల సంగతి పక్కనపెడితే వీళ్ల ప్రేమకహానీలు మాత్రం యూత్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఆ కబుర్లలోకి వెళ్తే... ఈ ప్రేమ ఎందాకా? ‘ఇలియానా చిట్టి బెల్లియానా...’ అనే పాట చాలామంది పాడుకునే ఉంటారు. ఇలియానా అందం ఎక్కడుందీ అంటే ‘నడుము’ అని ఎవరైనా చెబుతారు. ఈ స్లిమ్ సుందరి నాభి సౌందర్యానికి మనసు పారేసుకున్నవారు బోల్డంత మంది ఉన్నారు. కానీ, ఇల్లూ బేబీ మాత్రం ఓ తెలుగు హీరోకి మనసిచ్చేసింది. అతనితోనే మూడు ముళ్లు వేయించుకోవాలనుకుంది. అయితే, మోసం చేశాడట. అందుకే విడిపోయింది. పేరు చెప్పకుండా, ఓ హీరో తనను మోసం చేశాడని ఆ మధ్య బహిరంగంగా చెప్పింది ఇలియానా. ఈ చేదు అనుభవంతో ప్రేమకు దూరంగా ఉంటుందేమోనని కొంతమంది భావించారు. కానీ, ఇలియానా మళ్లీ మనసు పారేసుకుంది. ఈసారి ఈ బ్యూటీ మనసు దోచుకున్నది ఓ ఆస్ట్రేలియన్ అని సమాచారం. పేరు ఆండ్రూ. కాఫీ షాప్స్, షాపింగ్ మాల్స్ అంటూ ముంబయ్‌లో ఎక్కడ చూసినా ఈ జంటేనట. ఒకవేళ ఈ లవ్‌స్టోరీ నిజమైతే.. ఇదైనా పెళ్లి పీటల వరకు వెళుతుందో లేదో చూడాలి. దుబాయ్‌లో ప్రేమికుల దినోత్సవం.. పెళ్లి? ఇంట్లో పెద్దవాళ్లకి పెళ్లయితే, ఆ తర్వాతి వాళ్లకి లైన్ క్లియర్ అయినట్లే. కానీ, కాజల్ అగర్వాల్ విషయంలో ఇది రివర్స్. ముందు తన చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లయ్యింది. ఒకప్పుడైతే, ‘చెల్లి పెళ్లయ్యింది. అక్కకేంటి ప్రాబ్లమ్’ అనుకునేవారు. కానీ, మోడ్రన్ యుగంలో ఆ సమస్య లేదు. నిషాకి నచ్చినవాడు దొరకడంతో పెళ్లి పీటల మీద కూర్చుంది. కాజల్‌కి కూడా పెళ్లంటే చాలా గౌరవం. ప్రేమ పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులు కాదనరు. ఎందుకంటే, నిషాది కూడా లవ్ మేరేజే కదా. మీ చెల్లెలి పెళ్లయ్యింది కదా.. మీ పెళ్లెప్పుడు? అని కాజల్‌ని అడిగితే.. ఇంకా టైముందని చెబుతూ వస్తోంది. అయితే, ఇటీవలే తను ప్రేమలో పడిందనే వార్త ప్రచారంలో ఉంది. ముంబయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తకు మనసిచ్చిందట కాజల్. ఈ ఇద్దరూ ప్రేమికుల దినోత్సవాన్ని దుబాయ్‌లో జరుపుకున్నారని సమాచారం. మరి.. పెళ్లెక్కడ చేసుకుంటారో? అతి త్వరలో...! అసలు వీరిద్దరి మధ్య ఉన్నది ప్రేమా స్నేహమా..? అని సిద్ధార్ధ్, సమంత వ్యవహారం తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ‘జబర్దస్త్’ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారనే వార్త వచ్చింది. చాలామంది చెప్పినట్లుగానే ‘అదేం లేదు’ అని తేల్చి చెప్పింది ఈ జంట. కానీ, జాయింట్‌గా చూసినప్పుడు మాత్రం ఇద్దరి కెమిస్ట్రీ ‘లవ్’లో పడ్డారనే సంకేతాన్ని అందజేస్తోంది. ముఖ్యంగా లక్స్ సబ్బు ప్రకటనలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. నిజమైన ప్రేమికులు కాబట్టే, కెమిస్ట్రీ పండిందని చెప్పుకుంటున్నారు. అంతకు ముందు కాళహస్తిలో కలిసి పూజలు చేయడంతో... డౌటే లేదు. ప్రేమించుకుంటున్నారని చాలామంది ఫిక్స్ అయ్యారు. ‘సిద్ధూ నా స్నేహితుడు మాత్రమే’ అని చెప్పుకుంటూ వస్తోంది సమంత. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతమంది భావిస్తున్నారు. లిఫ్ట్‌లో ముద్దుల కేళీ? తమన్నా సినిమాల్లోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఇప్పటివరకు బోల్డన్ని ప్రేమకథా చిత్రాల్లో నటించింది. కానీ, నిజజీవితంలో హీరో కార్తీతో మాత్రమే ఎఫైర్ సాగించిందనే వార్త మూడునాలుగేళ్ల క్రితం హల్చల్ చేసింది. చివరకు కార్తీకి పెళ్లవడంతో ఆ వార్తకు ఫుల్స్టాప్ పడింది. తాజాగా మరోసారి తమన్నా లవ్టాక్లో నిలిచింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్నవాటిలో హిందీ చిత్రం ‘హమ్‌షకల్స్’ ఒకటి. ఈ చిత్రదర్శకుడు సాజిద్‌ఖాన్‌తో తమన్నా ప్రేమలో పడిందని బాలీవుడ్ టాక్. ఈ ఇద్దరూ లొకేషన్లో పరిసర ప్రాంతాలను మర్చిపోయి మరీ కబుర్లు చెప్పుకుంటున్నారట. లిఫ్ట్‌లో సాజిద్‌కి తమన్నా ముద్దులు పెడుతూ నలుగురి దృష్టిలో పడిందనే వార్త కూడా ఉంది. ఈ ఎఫైర్ గురించి తమన్నాని ఎవరో అడిగితే, ఫైర్ అయ్యిందని వినికిడి. ఫ్రెండ్లీగా ఉంటే ఎఫైర్ అంటగడతారా? అన్నట్లు మాట్లాడుతోందట. నిజమేంటో తమన్నాకే ఎరుక. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమలో పడ్డ తారల జాబితా చాలానే ఉంది. ఆ మధ్య ఓ యువహీరోతో త్రిష ప్రేమలో పడిందని, ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనీ వార్త వచ్చింది. కానీ, ఇద్దరూ మాటామాటా అనుకుని విడిపోయారట. ఇక, శింబూతో ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టిన తర్వాత ప్రభుదేవాతో నయనతార ప్రేమలో పడటం, పెళ్లి వరకు వెళ్లిన తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. శింబూతో ప్రేమలో పడ్డానని బహిరంగంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించిన కొన్ని నెలలకే హన్సిక అతన్నుంచీ విడిపోయింది. కానీ, తమ ప్రేమకు ఈ ఇద్దరూ ఫుల్స్టాప్ పెట్టలేదని, కామా మాత్రమే పెట్టారనే వార్త కూడా ఉంది. ఏదేమైనా సినిమా తారలు ఏం చేసినా వార్తే. మరీ... ముఖ్యంగా వాళ్ల ఎఫైర్లకు సంబంధించిన వార్తలు మాత్రం భలే మజానిస్తాయి. -
అతను చాలా నాటీ!
వారం రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు విడుదలైతే ఏ ఆర్టిస్ట్‌కైనా ఒకింత థ్రిల్‌గా, టెన్షన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇలియానా ఈ రెండు రకాల ఫీలింగ్స్‌తో ఉన్నారు. హిందీలో ఆమె కథానాయికగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ మార్చి, 28న ‘మై తేరా హీరో’ ఏప్రిల్ 4న విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేస్తున్నానని ఇలియానా పేర్కొన్నారు. వారం రోజుల గ్యాప్‌లో విడుదలవుతున్న ఈ రెండూ సూపర్ హిట్ అవుతాయని, తనకు డబుల్ ధమాకా ఖాయమని కూడా అన్నారామె. ‘హ్యపీ ఎండింగ్’లో సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ సరసన, ‘మై తేరా..’లో కుర్ర హీరో వరుణ్ ధావన్‌తో నటిస్తున్నారు ఇలియానా. సైఫ్ చాలా మంచి వ్యక్తి అని, ఫ్రెండ్లీగా ఉంటారని ఈ గోవా బ్యూటీ అన్నారు. ఇక, వరుణ్ ధావన్ గురించి మాట్లాడుతూ - ‘‘వరుణ్ చాలా నాటీబోయ్. చిచ్చుబుడ్డిలాంటివాడు. చాలా జోరుగా, హుషారుగా ఉంటాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా ఉండలేడు. అతని ఎనర్జీ లెవల్స్ సుపర్బ్. ఇలాంటి వ్యక్తులు పక్కనుంటే తెలియకుండా మనలో కూడా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఈ చిత్రం షూటింగ్లో వరుణ్‌తో పోటీపడి నేను యాక్ట్ చేస్తున్నాను. తన ముందు తేలిపోకూడదనే ఫీలింగ్ నాలో తెలియని శక్తిని పెంచుతోంది’’ అన్నారు ఇలియానా! -
ఇలియానా అమ్మ అయ్యింది
ఇలియానా ‘అమ్మ’ అయ్యారు. ఇంతవరకూ పెళ్లే కాలేదు. ఏంటీ దారుణం? అనుకుంటున్నారా! ఇంతకీ ఇలియానాను తల్లిని చేసిందెవరో చెప్పలేదు కదూ. బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్. ఏంటి... ఇదంతా నిజమే... అనుకుంటున్నారా! అయితే వివరాల్లోకెళ్లాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్లో ఇలియానా ‘మై తేరా హీరో’ అనే సినిమా చేస్తున్నారు. తెలుగులో వచ్చిన ‘కందిరీగ’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా లొకేషన్లో తోటి నటీనటులందర్నీ ఇలియానా కంటికి రెప్పలా చూసుకుంటున్నారట. ఆహారం, ఆరోగ్యం విషయాల్లో అందరికీ సలహాలు ఇస్తున్నారట. అవసరం లేకపోయినా... ఇలా అందరి బాగోగులూ చూసుకోవడం చూసి, వరుణ్‌ధావన్ ఆమెను ‘మమ్మీ’ అని పిలవడం మొదలుపెట్టాడట. దాంతో లొకేషన్లో ఉన్న అందరూ కూడా సరదాగా ఇలియానాను ‘మమ్మీ.. మమ్మీ’ అని ఆట పట్టిస్తున్నారట. ఇలాగే... ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’ షూటింగ్లో కూడా ఆ చిత్ర హీరో షాహిద్‌కపూర్... ఇలియనాని ‘హౌస్ వైఫ్’ అంటూ ఏడిపించాడు. హౌస్ కీపింగ్ విషయంలో ఆమె అతి జాగ్రత్తని చూసి షాహిద్ అలా ఆటపట్టించాడట. మొత్తంమీద లొకేషన్లో మాత్రం ఇలియానా మంచి ఎంటర్టైన్మెంట్నే ఇస్తున్నారని అనుకుంటున్నారు. -
అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా..!
బాలీవుడ్లో ఇలియానాకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ చిత్రమే ఆమె కష్టాలకు కారణం. ‘బర్ఫీ’తో సంపాదించుకున్న క్రే జ్ మొతాన్ని ‘పటా పోస్టర్’ ఫట్ మనిపించడంతో ఇల్లూబేబీ ఒక్కసారిగా డల్ అయిపోయారట. దీనికి తోడు పుండుమీద కారంలా... బాలీవుడ్ మీడియా ఇలియానాపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తూ కథనాలను కూడా ప్రసారం చేస్తోందట. బక్కపలుచగా, పీక్కుపోయినట్టుగా ఈ సినిమాలో ఇలియానా ఉందని ఘాటైన పదజాలంతో రివ్యూలు రాసేశారట. ఇక దక్షిణాది సినిమానే ఇలియానాకు దిక్కు అని ఉచిత సలహాలు కూడా ఇచ్చారట. ఈ విషయమై ఇలియానా స్పందిస్తూ -‘‘సినిమా హిట్ అయితే... అందరం అందంగా కనిపిస్తాం. అదే ఫ్లాప్ అయితే... ఇదిగో ఇలాంటి విమర్శలే వస్తాయి. ఇవి నాకేం కొత్తకాదు. సౌత్‌లో కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నా. కానీ అక్కడ అత్యధిక పారితోషికం తీసుకున్న కథానాయికను నేనే. ‘బర్ఫీ’లో బార్బీ బొమ్మలా ఉందని రాసిన ఈ మీడియావారే... ఈ సినిమా విషయంలో ఇలా రాశారు. అదంతా ఆ సినిమాల మహత్యం. ఆ కామెంట్లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం సైఫ్అలీఖాన్తో నేను చేస్తున్న ‘హ్యాపీ ఎండింగ్’ మూవీ తప్పకుండా నాకు మంచిపేరు తెస్తాయని నమ్మకం నాకుంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. -
అతనితో నా అనుబంధం ప్రత్యేకం : ఇలియానా
‘‘ప్రపంచానికి నా విషయాలు చాటి చెప్పకపోయినా, నా జీవితంలో ఏం జరుగుతుందో మా అమ్మానాన్నలకు బాగా తెలుసు. వాళ్ల దగ్గర దాచాల్సినంత రహస్యాలేమీ నాకు లేవు’’ అంటున్నారు ఇలియానా. ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి, కొన్ని విషయాలు చెప్పారామె. వాటిలో, ఓ విదేశీయుడితో తన అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు ఇలియానా. ఆ విదేశీయుడితో ఈ గోవా భామ మూడు ముళ్లు వేయించుకోవడం ఖాయమనే వార్త కూడా ప్రచారంలో ఉంది. దీని గురించి ఆ ఇంటర్వ్యూలో ఇలియానా స్పష్టం చేస్తూ -‘‘నిజం చెప్పాలంటే నాకు కమిట్మెంట్ ఫోబియా ఉంది. గతంలో నేనో నటుణ్ణి ప్రేమించాను. మా ప్రేమను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. అతన్ని పూర్తిగా నమ్మాను. కానీ, నా నమ్మకాన్ని చాలాసార్లు వమ్ము చేశాడు. దాంతో ఆ అనుబంధాన్ని వద్దనుకున్నాను. ఆ అనుభవం వల్లనో ఏమో ఓ బంధం కొనసాగాలంటే పెళ్లే అవసరం లేదనిపించింది. పెళ్లి చేసుకోకుండా కూడా మంచి కమిట్మెంట్తో ఉండొచ్చనే ఫీలింగ్ ఏర్పడింది. అందుకే ప్రస్తుతం నా అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అలాంటి ప్రకటన అవసరంలేదని తనకూ అనిపించింది. ఇప్పుడు నా లైఫ్ బాగుంది. ప్రస్తుతం వైవాహిక జీవితం మీద నమ్మకం అయితే లేదు. నేను స్వేచ్ఛను ఇష్టపడే అమ్మాయిని. నన్నెవరూ ఏ విషయంలోనూ నిర్భందించలేరు’’ అని పేర్కొన్నారు.