'కార్తీకదీపం'.. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సీరియల్ ప్రేమికులు అలెర్ట్ అయిపోతారు. ఆ సీరియల్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. మరీ ముఖ్యంగా ఇందులో నలుపుగా ఉండే వంటలక్క క్యారెక్టర్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తో హిందీలో సినిమా తీసి రిలీజ్‌కి రెడీ చేశారు.
మనకు తెలిసిన ఇలియానా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'తేరా క్యా హోగా లవ్‌లీ'. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సేమ్ 'కార్తీకదీపం' సీరియల్‌లో ఉన్నట్లే ఇందులోనూ హీరోయిన్ నలుపు రంగులో ఉంటుంది. అక్కడ డాక్టర్ బాబు ఉంటే ఇక్కడ పోలీస్ బాబు ఉన్నాడంతే.
(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి పూర్ణ నటించిన హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే)
ట్రైలర్ బట్టి చూస్తే.. హీరోయిన్ నలుపుగా ఉంటుంది. దీంతో ఈమెని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లందరూ నో చెప్పేసి వెళ్లిపోతుంటారు. ఓరోజు ఈమె పెళ్లి చేస్తే ఇవ్వడానికి అని ఉంచిన సామాన్లన్నీ దొంగతనానికి గురవుతాయి. దీంతో దర్యాప్తు కోసం ఓ పోలీస్ వస్తాడు. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. చివరకు ఏమైంది? హీరోహీరోయిన్ ఒక్కటయ్యారా లేదా అనేదే స్టోరీ.
ట్రైలర్ చూస్తే పైకి ఫన్నీగా అనిపిస్తున్నప్పటికీ.. ఇందులో అందం, వరకట్న లాంటి సామాజిక విషయాల్ని ప్రస్తావించారు. కాకపోతే వీటిని సీరియస్‌గా కాకుండా సున్నితమైన హాస్యంతో చెప్పినట్లు అనిపిస్తుంది. ఇలియానా హిట్ కొట్టి చాలాకాలమైపోయింది. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టం తెచ్చిపెడుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment