Ileana DCruz Shares Photo Of Her Partner With Their Pet - Sakshi
Sakshi News home page

Ileana DCruz: భర్తను పరిచయం చేసిన ఇలియానా.. కానీ..!

Published Sun, Jul 2 2023 3:22 PM | Last Updated on Sun, Jul 2 2023 4:22 PM

Ileana DCruz Shares Photo Of Her Partner With Their Pet - Sakshi

గోవా బ్యూటీ  ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో పలువురు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది. ఇటీవలే ప్రెగ్నెన్సీ  ప్రకటించిన ముద్దుగుమ్మ.. ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా షాకిచ్చింది. సోషల్ మీడియాలో బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.  

(ఇది చదవండి: బేబీ బంప్‌ ఫోటో షేర్‌ చేసిన ఇలియానా.. మళ్లీ బ్యాడ్‌ కామెంట్స్‌)

అయితే ఇందులో విచిత్రం ఏంటంటే.. ఇలియానా పెళ్లి చేసుకోకుండానే గర్భం ధరించడంతో టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతవరకు తన భర్త ఎవరన్నది అధికారికంగా ప్రకటించలేదు. అయితే గతంలో ఇలియానా  బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వర​కు ఇలియానా ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు.   

తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తన ఇన్‌స్టాలో కుక్క పిల్ల ఫోటోను షేర్ చేస్తూ.. దానికి ముద్దుపెడుతున్న తన భర్త ఫోటోను కూడా పంచుకుంది. అయితే ఆ ఫోటోలో అతను ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. దీంతో ఇలియానా భర్త ఎవరనేది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. దీంతో ఇలియానా భర్త ఎవరో తెలియాలంటే మరి కొంత ఆగాల్సిందే. బిడ్డ పుట్టాకనైనా తన భర్తను అందరికీ పరిచయం చేస్తుందో లేదో వేచి చూద్దాం. 

(ఇది చదవండి: 'ఐ యామ్ నాట్‌ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్'... ఆసక్తిగా టీజర్ ప్రోమో)

కాగా.. ఇలియానా చివరిసారిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్ బుల్‌లో కనిపించింది. ఫిల్మ్ మేకర్ కూకీ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్ నిర్మించారు. ఆమె ప్రస్తుతం అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో రణదీప్ హుడాతో కలిసి నటించనుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement