
హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కీల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నేరుగా ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
అయితే ఈ ఏడాది మార్చిలో తాప్సీ పన్ను వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మథియాస్ బోను పెళ్లాడింది. డెన్మార్‌కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఏడడుగులు వేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన భర్త మథియాస్ బో గురించి కొంతమందికి ఇంకా తెలియకపోవడం బాధకరమని తెలిపింది. అలాంటి వారి పట్ల విచారంగా ఉందని వెల్లడించింది.
తాప్సీ మాట్లాడుతూ.." నా భర్త మథియాస్ బో ఎవరో తెలియని వారి గురించి నేను చాలా బాధపడ్డా. నేను బయటకు వచ్చి అతని గురించి ప్రజలకు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను పెద్ద క్రికెటర్ కాదు.. బిజినెస్‌మెన్ అంతకన్నా కాదు. అతని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలని అనిపించడం లేదు అంతే. ప్రపంచంలో బ్యాడ్మింటన్‌లో అతిపెద్ద విజయాలు సాధించిన వారిలో ఈయన ఒకరు " అని వెల్లడించింది. కాగా.. తాప్సీ 2024 మార్చిలో ఉదయపూర్‌లో మాజీ డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను వివాహం చేసుకుంది. కాగా.. ప్రస్తుతం తాప్సీ భర్త భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.