Mathias Boe
-
'అప్పటికే నా పెళ్లి అయిపోయింది'.. తాప్సీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ తాప్సీ పన్ను ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తాప్సీ పన్ను తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లి గతేడాదిలోనే అయిపోయిందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. గతేడాది డిసెంబర్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని తెలిపింది. ఉదయ్‌పూర్‌లో కేవలం వివాహా వేడుక మాత్రమే నిర్వహించామని తాప్సీ అసలు విషయాన్ని రివీల్ చేసింది. వ్యక్తిగత విషయాలను మేము పెద్దగా బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని.. అందుకే బయటపెట్టలేదని పేర్కొంది. పర్సనల్ విషయాలు బయటపెడితే వర్క్ లైఫ్ దెబ్బతింటుందని చెప్పుకొచ్చింది.కాగా.. ఈ ఏడాది మార్చిలో ఉదయ్ పూర్లోని ఓ కోటలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఆమె సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఆ తర్వాత వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది తాప్సీ. -
తాప్సీ భర్త మథియాస్ సంచలన ప్రకటన.. ఇకపై
భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి కోచ్ మథియాస్ బో కీలక ప్రకటన చేశాడు. కోచింగ్ విధుల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సాత్విక్- చిరాగ్ వైఫల్యం నేపథ్యంలో మథియాస్ బో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మథియాస్ శిక్షణలో సాత్విక్- చిరాగ్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో నంబర్ వన్‌గా ఎదిగారు. కొన్నాళ్లుగా అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ జంట.. విశ్వ క్రీడల్లో కనీసం కాంస్యమైనా సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సాత్విక్- చిరాగ్.. మలేషియా ద్వయం ముందు తలవంచారు.ప్యారిస్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో ఆరోన్ చియా- వూయీ యిక్ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి పతక రేసు నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనుకాగా.. సాత్విక్- చిరాగ్‌లను మథియాస్ బో ఓదార్చాడు. ఈ క్రమంలో శనివారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు మథియాస్ బో.అలసిపోయిన ముసలి వ్యక్తిని‘‘కోచ్‌గా నా ప్రస్థానం ముగిసిపోయింది. భారత జోడీ కోచ్‌గా కొనసాగలేను. ఇక్కడే కాదు.. ప్రస్తుతానికి ఎక్కడా పనిచేయలేను. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో ఎక్కువ సమయం గడిపేశాను. అయినా కోచ్‌గా ఉంటే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.నేనేమో అలసిపోయిన ముసలి వ్యక్తిని. మనం ఊహించిన ఫలితాలు రాకపోతే కచ్చితంగా నిరాశచెందుతాం. మీరు కష్టపడే తత్వం ఉన్న ఆటగాళ్లు. పతకంతో ఇండియాకు తిరిగి రావాలని ఎంతగా ఆకాంక్షించారో.. అందుకోసం ఎంతగా శ్రమించారో నాకు తెలుసు. అయితే, ఈసారి ఆ కల నెరవేరలేదు.గర్వపడేలా చేశారుగాయాలు వేధించినా.. వెనకడుగు వేయలేదు. నొప్పిని భరించేందుకు ఇంజక్షన్లు తీసుకున్నారు. అంకితభావంతో ఇక్కడిదాకా వచ్చారు. ప్రతీ మ్యాచ్ మనసు పెట్టి ఆడారు. నన్ను గర్వపడేలా చేశారు’’ అంటూ మథియాస్ బో.. సాత్విక్- చిరాగ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. భారత్‌లో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయంటూ సహచరుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.మథియాస్ వచ్చిన తర్వాతేకాగా మథియాస్ బో వచ్చిన తర్వాతే తాము ఆటలో మరింతగా రాటుదేలామని సాత్విక్- చిరాగ్ గతంలో పలు సందర్భాల్లో పేర్కన్నారు. తమ విజయాల వెనుక బో కష్టం కూడా ఉందని పేర్కొన్నారు. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బో మరెవరో కాదు.. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను భర్త అన్న సంగతి తెలిసిందే. పదేళ్ల ప్రేమపదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఇక ఒలింపిక్స్ కోసం భర్తతో కలిసి ప్యారిస్ వెళ్లిన తాప్సీ.. డెన్మార్క్‌లో తాము ఇల్లు కొనుగోలు చేశామని.. కొన్నాళ్లు అక్కడే ఉంటామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల మథియాస్ బో రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Mathias Boe (@mathias.boe) -
ఒలింపిక్స్‌లో తాప్సీ సందడి.. ఆ తర్వాత అక్కడే మకాం!
బాలీవుడ్ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్రూబాకు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుతుంది. భారత టీమ్‌తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది.అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. -
ఆయన గురించి చెప్పుకునేంత సీన్ లేదు: తాప్సీ ఆసక్తికర కామెంట్స్
హీరోయిన్ తాప్సీ ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కీల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నేరుగా ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తాప్సీ పన్ను వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మథియాస్ బోను పెళ్లాడింది. డెన్మార్కు చెందిన మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఏడడుగులు వేసింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన భర్త మథియాస్ బో గురించి కొంతమందికి ఇంకా తెలియకపోవడం బాధకరమని తెలిపింది. అలాంటి వారి పట్ల విచారంగా ఉందని వెల్లడించింది.తాప్సీ మాట్లాడుతూ.." నా భర్త మథియాస్ బో ఎవరో తెలియని వారి గురించి నేను చాలా బాధపడ్డా. నేను బయటకు వచ్చి అతని గురించి ప్రజలకు చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే అతను పెద్ద క్రికెటర్ కాదు.. బిజినెస్మెన్ అంతకన్నా కాదు. అతని గురించి మీకు నిజంగా తెలుసుకోవాలని అనిపించడం లేదు అంతే. ప్రపంచంలో బ్యాడ్మింటన్‌లో అతిపెద్ద విజయాలు సాధించిన వారిలో ఈయన ఒకరు " అని వెల్లడించింది. కాగా.. తాప్సీ 2024 మార్చిలో ఉదయపూర్‌లో మాజీ డానిష్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను వివాహం చేసుకుంది. కాగా.. ప్రస్తుతం తాప్సీ భర్త భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫీర్ ఆయి హాసిన్ దిల్రుబా చిత్రంలో కనిపంచనుంది. 2021లో హసీన్ దిల్రుబా మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, సన్నీ కె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ఇండియన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డికి 2021 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఆటగాళ్లు పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.దీంతో తన భర్త కోసం నటి తాప్సీ పన్ను పారిస్ ఒలింపిక్ క్రీడలకు హాజరు కానున్నారు. ఈనెల 29న పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఒలింపిక్స్ చూసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని పేర్కొన్నారు. తన భర్తతో పాటు.. మనదేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు పారిస్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, తాప్సీ భర్త మథియాస్ బో పారిస్ చేరుకున్నారు. మథియోస్ను 2012లో ఒలింపిక్స్ పతకం గెలిచిన తర్వాత తొలిసారి కలుసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.కాగా.. తాస్పీ పన్ను తెలుగులో పలు చిత్రాలు చేసింది. బాలీవుడ్లో సూర్మ (2018), సాంద్ కి ఆంఖ్ (2019), రష్మీ రాకెట్ (2021), లూప్ లాపేట (2022), శభాష్ మిథు (2022) స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తాను స్క్వాష్ గేమ్ మాత్రమే బాగా ఆడగలనని తాప్సీ తెలిపింది. -
అతన్ని సాధారణ మనిషిలాగే భావించా..చూడగానే ప్రేమ పుట్టలేదు: తాప్సీ
తమిళసినిమా: ఒకరిపై ప్రేమ కలగడానికి సరైన నిర్వచనం ఉండదు. కొందరు చూడగానే నచ్చేస్తారు. మరి కొందరు వారి ప్రవర్తన కారణంగా ప్రేమించబడతారు. మరొకరు ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ప్రేమలో పడతారు. ఇలా ప్రేమలో చాలా కోణాలు ఉంటాయి. కాగా తాప్సీ ఎలా ప్రేమలో పడ్డారో చూద్దాం. ఢిల్లీలో పుట్టి పెరిగన బ్యూటీ తాప్సీ. తొలుత బాలీవుడ్లో నటిగా పరిచయమైన, పాపులరైంది మాత్రం దక్షిణాది చిత్రాలతోనే. తెలుగులో జుమ్మందినాథం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, తమిళంలోకి ఆడుగళం చిత్రంతో దిగుమతయ్యారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకుంది. అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువగా స్టార్ హీరోలతో జతకట్టి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత హిందీలో అవకాశాలు రావడంతో అక్కడే ఎక్కువగా దృష్టి పెట్టారు. హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. కాగా ఈమె డెన్మార్క్‌కు చెందిన మాథియస్ బో అనే బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైమ్ ఉందంటున్న చెబుతూ వచ్చిన తాప్సీ సమీప కాలంలో రహస్యంగా ప్రియుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కాగా తన ప్రేమ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ తనకు మాథియస్ను చూడగానే, ఒక నెల తరువాతనో ప్రేమ పుట్టలేదన్నారు. ఆయన్ని చూడగానే గౌరవం ఏర్పడిందన్నారు. ఆయన్ని ఒక సాధారణ మనిషిగానే భావించానని చెప్పారు. ఆ తరువాత తరచూ కలుసుకునేవారిమని చెప్పారు. అలా ఆయన్ని ప్రేమించడం మొదలెట్టానని, అయితే వెంటనే మాథి యస్ బోకు తన ప్రేమను వ్యక్తం చేయలేదని, అందుకు చాలా కాలం తీసుకున్నానని చెప్పారు. ప్రేమ పెళ్లి విధానం వర్కౌట్ అవుతుందా? అని కూడా ఆలోచించడానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పా రు. చివరికి తనకు కావలసిన వ్యక్తిని కనుగొన్నానన్న భావన కలగడంతో ఇద్దరం ప్రేమించుకోవడం మొదలెట్టామని తాప్సీ పేర్కొన్నారు. -
ఇక వ్యక్తిగత జీవితంపై ఫోకస్
వ్యక్తిగత జీవితానికి తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్‌పూర్‌లో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూవరులుగా తాప్సీ, మథియాస్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఓ సారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్నివ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను పన్నెండు గంటలు పని చేసిన రోజులూ ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపైకన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్‌కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు తాప్సీ. -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో లీక్!
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు. ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్‌కీ షాదీ' అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు. పెళ్లి వీడియో లీక్.. తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్‌గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు. తాప్సీ సీనీ కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T — Bollywood Bubble (@bollybubble) April 3, 2024 View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
పెళ్లి వార్తలు.. తాప్సీ ఫస్ట్ పోస్ట్ చూశారా?
సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు అన్ని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. మరికొందరు తమ పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. అలా ఈ మధ్య హీరో సిద్దార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోగా హీరోయిన్ తాప్సీ పన్ను అయితే ఏకంగా పెళ్లే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను పెళ్లాడిందని బాలీవుడ్ సమాచారం. మార్చి 23న వివాహం? మార్చి 23న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాహ వార్తల నేపథ్యంలో తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. సారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో నీ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెప్తున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) చదవండి: కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకుంటే బాగుండేది.. హీరోయిన్ ఏమందంటే? -
సీక్రెట్‌గా ప్రియుడిని పెళ్లాడిన తాప్సీ!
హీరోయిన్ తాప్సీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయో, లేదో అగ్గి మీద గుగ్గిలమైందీ బ్యూటీ. నేను నోరు విప్పితే చాలు ఏది పడితే అది రాసేస్తారా? ఇంకోసారి నా పర్సనల్ విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడనంటూ తెగ సీరియస్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబైంది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. ఉదయ్‌పూర్‌లో రహస్య వివాహం బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఉదయ్‌పూర్‌లో రహస్యంగా పెళ్లి చేసుకుందీ భామ. తన పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉండకూడదనే ఎవవరికీ పెద్దగా ఆహ్వానాలు పంపించలేదట. తనతో పని చేసిన పవైల్ గులాటి, కనిక ధిల్లాన్, అనురాగ్ కశ్యప్ వంటి కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఆ పెళ్లిలోనే వీళ్లంతా.. ఇటీవలే కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్‌కీ షాదీ' అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. అటు పవైల్ కూడా తాప్సీ సోదరి షగ్ను పన్నుతో పాటు మరికొందరితో గ్రూప్‌గా దిగిన ఫోటో షేర్ చేశాడు. ఇవన్నీ చూసిన జనాలు.. తాప్సీకి పెళ్లయిపోయిందంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక తాప్సీ కెరీర్ విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ తను అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ ఓ పక్క స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Pavail Gulati (@pavailgulati) View this post on Instagram A post shared by Kanika Dhillon (@kanika.d) చదవండి: సినిమా ఆఫర్ల కోసం నేను చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదే: ఆశిష్ విద్యార్థి -
అందుకోసమే పెళ్లి అంటున్న బాలీవుడ్ తారలు
-
Taapsee-Mathias: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
మనోళ్ల కోచ్.. వరల్డ్ నంబర్ 1: తాప్సితో ప్రేమ.. మథియస్ బ్యాగ్రౌండ్ ఇదే!
ప్రేమకు సరిహద్దులు ఉండవు.. మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడితే పరిచయాన్ని పరిణయం దాకా తీసుకువెళ్లడమే తరువాయి అన్నట్లు.. ఇప్పటికే ఎన్నో సెలబ్రిటీ జంటలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యాయి. తాప్సి పన్ను- మథియస్ బో కూడా ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉదయ్‌పూర్ వేదికగా ఈ లవ్ బర్డ్స్ మార్చిలో ఏడడుగులు వేయనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను బాలీవుడ్లో పింక్, థప్పడ్ వంటి సినిమాలో నటిగా తనను తాను నిరూపించుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్‌తో కలిసి డంకీ సినిమాలో కనిపించింది ఈ ఢిల్లీ సుందరి. ఎల్లలు దాటిన ప్రేమ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే తాప్సి.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ప్రేమలో పడింది. 2014లో బో ఇండియా ఓపెన్ ఆడేందుకు వచ్చినపుడు స్టాండ్స్‌లో కూర్చుని అతడిని చీర్ చేసింది తాప్సి. అప్పటికే వీరి బంధం గురించి గుసగుసలు వినిపించగా.. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో సాధించిన విజయాలను పరస్పరం సెలబ్రేట్ చేసుకుంటూ తాము ప్రేమలో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారీ సెలబ్రిటీ పీపుల్. తాప్సీనే ఓ అడుగు ముందుకేసి.. రాజ్ షమాని పాడ్‌కాస్ట్‌లో తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించింది. పదేళ్లుగా మథియస్ బోతో తాను రిలేషన్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడిక ప్రేమను పెళ్లిపీటలు ఎక్కించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాప్సి మాత్రం వీటిని ఖండించడం గమనార్హం. ఏదేమైనా మథియస్ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరీ మథియస్ బో? జూలై 11, 1980లో డెన్మార్క్‌లో జన్మించాడు మథియస్ బో. 1998లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టాడు. అనతి కాలంలోనే డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడు. యూరోపియన్ చాంపియన్‌షిప్స్-2006లో పురుషుల డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియస్ బో.. 2010లో డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లునెగ్గాడు. 2011లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా అవతరించాడు. ఒలింపిక్ మెడల్ విన్నర్ ఈ ఆ తర్వాత సహచర ఆటగాడు కార్స్టన్ మొగెన్సన్తో కలిసి మెన్స్ డబుల్స్ విభాగంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు. చైనాలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. 2013 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ సిల్వర్ మెడల్ అందుకుంది ఈ జోడీ. ఇక 2015లో యూరోపియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మథియస్ బో.. 2012, 2017లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ విజేతగానూ నిలిచాడు. భారత బ్యాడ్మింటన్ మెన్స్ జట్టు కోచ్‌గా.. దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతమైన ఆటగాడిగా కొనసాగిన మథియస్ బో.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి అభ్యర్థన మేరకు కోచ్‌గా అవతారమెత్తాడు. మనోళ్లను నంబర్ వన్‌గా నిలిపి 2021 నుంచి చిరాగ్ శెట్టి- ఆంధ్రప్రదేశ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సహా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ టీమ్‌కు మార్గదర్శనం చేస్తున్నాడు మథియస్ బో. చిరాగ్- సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ జోడీగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాడు. తమ విజయాలకు మథియస్కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ ఇద్దరు ప్లేయర్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా! ఇక ప్రస్తుతం మథియస్ బో చిరాగ్- సాత్విక్‌ను 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. సేవలోనూ ముందే.. తన ప్రేయసి తాప్సితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మథియస్కు అలవాటు. ఇటీవలే వీరిద్దరు నన్హీ కాలి ప్రాజెక్టులో భాగమై.. బాలికా విద్య ఆవశ్యకతను చాటిచెప్పే బాధ్యత తీసుకున్నారు. -
హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్‌గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా అంటే అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. మొన్నీమధ్యే రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. తెలుగు హీరో ఆశిష్ కూడా కొన్నిరోజుల క్రితమే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైందట. ప్రియుడితో రహస్యంగా ఏడడుగులు వేయనుందని సమాచారం. (ఇదీ చదవండి: కాబోయే భర్త విజయ్ దేవరకొండలా? రష్మిక ట్వీట్ వైరల్) ఢిల్లీకి చెందిన తాప్సీ.. 'ఝమ్మంది నాదం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, స్టార్ హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా ఫేమ్ సంపాదించింది. రెండు నెలల క్రితం 'డంకీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల సంగతి పక్కనబెడితే తాప్సీ.. గత పదేళ్ల నుంచి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో రిలేషన్లో ఉంది. కాకపోతే ఈ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తగా మెంటైన్ చేస్తూ వచ్చింది. గతేడాది తమ బాండింగ్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అతడితోనే ఏడడుగులు వేయనుందట. సెలబ్రిటీలు ఎక్కువగా ఒక్కటయ్యే ఉదయ్‌పూర్ వీళ్ల పెళ్లికి వేదిక కానుందట. అలానే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే ఈ వేడుక జరగనుందట. అయితే ఈ పెళ్లిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్ లో ఉన్నాను..
-
నా పెళ్లిలో నేను నేనులా కనిపిస్తా: తాప్సీ
‘‘సినిమా ఇండస్ట్రీ కాకుండా బయట వ్యక్తితో నాకు అనుబంధం కుదరాలని కోరుకున్నాను. కెరీర్ ఆరంభించిన తక్కువ టైమ్‌లోనే అది జరిగింది. నాకెవరితో ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందో అలాంటి వ్యక్తే దొరకడం ఆనందంగా ఉంది’’ అంటున్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోతో తాప్సీ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మథియాస్‌తో అనుబంధం గురించి ఓ పత్రిక అడిగితే.. పై విధంగా స్పందించారు తాప్సీ. ఇంకా ఆ ఇంటర్వ్యూలో మథియాస్ గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘మా ఇద్దరి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. అందుకే మా మధ్య జరిగే చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు. పెళ్లికి వధువు చేసుకునే అలంకరణ గురించి మాట్లాడుతూ – ‘‘మందంగా మేకప్ వేసుకుని కనిపించే పెళ్లికూతుళ్లను చూస్తే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే అంత మేకప్‌లో మనం మనలా కనపడం. మన పెళ్లి ఫొటోల్లో మనల్ని మనమే గుర్తుపట్టలేనంతగా ఉంటే ఎలా? పెళ్లి తాలూకు జ్ఞాపకం ఆ క్షణాల వరకే కాదు.. జీవితాంతం ఆ అనుభూతి మిగిలిపోవాలి. అందుకే నా పెళ్లిలో నేను నేనులా కనిపిం చేట్లే ఉంటా. మామూలుగా నా జుత్తు వంకీలు తిరిగి ఉంటుంది. పెళ్లికి కూడా అలానే ఉంచేస్తా’’ అన్నారు తాప్సీ. -
‘నీ పని చూసుకో’...
న్యూఢిల్లీ: సినీ నటి తాప్సీపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులకు సంబంధించి స్పంది స్తూ సహాయం కోరిన ఆమె స్నేహితుడు, భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ మథియాస్ బో (డెన్మార్క్)ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మందలించారు. ఇతర విషయాలపై కాకుండా కోచ్‌గా తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తాప్సీ తదితరులపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో గురువారం ఆమెకు మద్దతుగా మథియాస్ బో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతను స్విస్ ఓపెన్‌లో పాల్గొంటున్న జట్టుతోపాటు స్విట్జర్లాండ్‌లో ఉన్నాడు. ‘నా పరిస్థితి గందరగోళంగా ఉంది. తొలిసారి భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే స్వదేశంలో తాప్సీ ఇంటిపై జరుగుతున్న ఐటీ దాడులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. కిరణ్ రిజిజు... ఏదైనా చేయగలరా’ అని అతను రాశాడు. దీనిపై మంత్రి శుక్రవారం స్పందిస్తూ కొంత ఘాటుగానే జవాబిచ్చారు. ‘అన్నింటికంటే దేశ చట్టాలు సర్వోన్నతమైనవి. వాటిని మనందరం పాటించాలి. తాజా అంశం మనిద్దరి పరిధిలో లేనిది. మన ఉద్యోగ బాధ్యతలకే మనం కట్టుబడి ఉండాలి. అది భారత క్రీడారంగానికి మేలు చేస్తుంది’ అని రిజిజు ట్వీట్ చేయడం విశేషం. డెన్మార్క్‌కు చెందిన 40 ఏళ్ల మథియాస్ బో 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. పీబీఎల్‌లో పుణే ఏసెస్ జట్టుకు ఆడిన నాటి నుంచి ఆ టీమ్ యజమాని తాప్సీతో మథియాస్‌కు సాన్నిహిత్యం ఉంది. -
బాయ్‌ఫ్రెండ్ గురించి నోరువిప్పిన తాప్సీ
'ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమమైన తాప్సీ పన్ను.. వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ సొట్టబుగ్గల సుందరి అక్కడ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ బీటౌన్‌లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తాప్సీ ప్రస్తుతం రష్మీ రాకెట్ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా కొన్నాళ్లుగా ఈ ఢిల్లీ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయెతో రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక ఇటీవల తాప్సీ వెళ్లిన మాల్దీవుల వెకేషన్‌కు కూడా మథియాస్ వెళ్లాడు. అక్కడ వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా తాప్సీ షేర్ చేసింది. తాజాగా ఈ భామ తన బాయ్‌ఫ్రెండ్ గురించి మొదటిసారి నోరు విప్పింది. తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి పబ్లిక్‌గా ఎప్పుడూ మాట్లాడరెందుకని తాప్సీని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. దానిపై ఆమె స్పందించింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేట్ చేయడం తనకిష్టం లేదని తెలిపింది. ‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు వేర్వేరుగా ఉంచాలనుకుంటాను. నాకు సంబంధించిన వారి పుట్టినరోజుల్లో పాల్గొన్నపుడు ఏదో ఒక స్టిల్‌ను పంచుకుంటాను. నా పర్సనల్ లైఫ్‌లో భాగమైన మథియాస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి తాప్సీ మాట్లాడుతూ..‘నేను ఏదో ఒకసారి అయిదారు సినిమాలు చేయడానికి బదులు రెండుమూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడతాను. అప్పుడే నా వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని కేటాయించే అవకాశం దొరుకుతుంది’ అని పేర్కొంది. ఇక పోతే ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, సినిమాలు తగ్గించాలనుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పకనే చెప్పింది తాప్సీ. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రష్మీ రాకెట్, తమిళంలో జనగణమన చిత్రంతోపాటు మరో సినిమా కూడా చేస్తోంది. చదవండి: ఆమె డీఎన్ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ చదవండి: స్నేహితుడికి అండగా మహేష్.. ట్రైలర్ రిలీజ్ -
రాకుమారుడు ఉన్నాడు
ఒక కప్పను ఓ యువరాణి ముద్దాడితే ఆ కప్ప అందాల రాకుమారుడిగా మారిపోయింది. పట్టరానంత సంతోషంతో రాణి మైమరచిపోయింది. ఇది కథ అని చాలామందికి తెలుసు. అప్పటినుంచి కూడా ‘ఒక రాకుమారుడిని పొందాలంటే ఎన్నో కప్పలను ముద్దాడాలి’ అనేది వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే మాటను తాప్సీ చెబుతున్నారు. ‘‘నా రాకుమారుడు దొరకడానికి నేను ఎన్నో కప్పలను ముద్దాడాను’’ అంటూ తాను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టారీ బ్యూటీ. అయితే ఆ రాకుమారుడి పేరు మాత్రం చెప్పలేదు. దాదాపు నాలుగైదేళ్లుగా డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పిన తాప్సీ, ‘‘చాలామంది ఊహిస్తున్నట్లు అతను ఆ వృత్తి (ఓ క్రికెటర్‌తో తాప్సీ లవ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది)కి సంబంధించినవాడు కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో ఎవరున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. అతను నటుడు కాదు.. క్రికెటర్ కాదు. అసలు ఇక్కడివాడు కాదు’’ అన్నారు తాప్సీ. ‘‘నాకు పిల్లలు కావాలనుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఘనంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒకే రోజులో పెళ్లి వేడుక ముగించేయాలనుకుంటున్నాను. పెళ్లి పేరుతో రోజుల తరబడి వేడుకలు చేసుకోవడం నాకిష్టం లేదు’’ అని కూడా తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘తప్పాడ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ‘షూటర్స్’ చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా తీసిన ‘సాండ్ కీ ఆంఖ్’లో ప్రకాశీ పాత్ర చేశారు తాప్సీ. ఈ చిత్రం వచ్చే నెల 25న విడుదల కానుంది. -
మేం లవర్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్!
ప్లేటులో పెట్టిన బిర్యానీ ప్లేటులోనే ఉంది. ఇప్పుడు తినకపోతే నేను కరిగిపోతా అని ఐస్‌క్రీమ్ ఆశగా చూసినా ఊహూ... ఐసు, మనసు వాటి మీద ఉంటేనే కదా. వెళ్లింది లంచ్ డేట్‌కే అయినా కారణం వేరు. స్వీట్లు, హాటులు తినడంకన్నా స్వీట్ నథింగ్స్ చెప్పుకోవాలన్నదే మెయిన్ రీజన్. కారణం ఏదైనా లంచ్ డేట్‌కి వెళ్లిన ప్రేమ పక్షుల మీదే అందరి చూపు. ముంబైలోని రెండు ప్రముఖ రెస్టారెంట్స్‌లో రెండు జంటలు లంచ్ డేట్‌కి వెళ్లి హాట్ టాపిక్‌గా మారారు. ఒక జంట మథియాస్ బో–తాప్సీ అయితే మరో జంట టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ. ‘‘మీరంతా అనుకున్నట్లు మేం లవర్స్ కాదు.. జస్ట్ ఫ్రెండ్స్. అయినా లవ్‌లో పడితే మేమే చెబుతాం’’ అని ఈ రెండు జంటలూ కొన్ని సందర్భాల్లో చెప్పారు. మరి.. ఏమీ లేకపోతే ఈ లంచ్ డేటులూ, డిన్నర్ డేటులూ ఏంటమ్మా? అంటే.. నో ఆన్సర్. ‘‘మేమే చెబుతాం’’ అన్నారు కదా సమాధానం ఎదురు చూడటం కూడా కరెక్ట్ కాదేమో. ఇంతకీ మథియాస్ బోతో తాప్సీ లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి కదా.. ఆ మథియాస్ ఎవరంటే డెన్మార్క్‌కి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఓసారి మ్యాచ్ చూడ్డానికి వెళ్లినప్పుడే ఇద్దరి కళ్లూ కలిశాయని, పరిచయం ప్రేమగా మారిందని టాక్. ఇక, టైగర్, దిశా గురించి చెప్పాలంటే, రెండేళ్ల క్రితం ‘బేఫిక్రా’ అనే మ్యూజిక్ వీడియోలో నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారని వార్త. ఆ తర్వాత ఇద్దరూ ‘భాగీ 2’ సినిమాలో జంటగా నటించారు. ప్రేమ రోజు రోజుకీ పెరుగుతోందట. కానీ మేం క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఏదేతైనేం ఔత్సాహికరాయుళ్ల నోటికి ఈ జంటలు మంచి మేత ఇస్తున్నాయి. -
సీక్రెట్ బయటపెట్టిన టాప్ హీరోయిన్
న్యూఢిల్లీ: హీరోయిన్ తాప్సి పొన్ను తాను ప్రేమలో పడిన విషయాన్ని బయటపెట్టింది. తన ప్రేమికుడు వివరాలు మాత్రం వెల్లడించలేదు. తాను ప్రేమిస్తున్న వ్యక్తి గర్వించదగ్గ వ్యక్తి అని తెలిపింది. ఒలింపిక్స్ సిల్వర్ పతక విజేత, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాతియాస్ బోయ్ తో రిలేషన్ షిప్ లో ఆమె ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. 'నా వ్యక్తిగత జీవితంలో మంచి దశలో ఉన్నాను. వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగత విషయాలు వెల్లడిస్తే మీడియా దాని గురించే ఎక్కువగా చూపిస్తుంది. నా పని గురించి పట్టించుకోదు. అందుకే పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలనుకోవడం లేదు. నా రిలేషన్ షిప్ పట్ల, నేను ప్రేమించే వ్యక్తి పట్ల గర్వంగా ఉన్నాన'ని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి వెల్లడించింది. కాకతాళీయంగా ప్రేమికులిద్దరూ ఆదివారం ఢిల్లీలోనే ఉన్నారు. ఇండియా సూపర్ సిరీస్ కోసం మాతియాస్, నామ్ షబనా సినిమా ప్రచారం కోసం తాప్సి ఢిల్లీకి వచ్చారు. -
మా జంట బాగుందని మీరే అంటారు!
‘‘నా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. నేనింకా చిన్నదాన్నే’’ అంటున్నారు తాప్సీ. బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోతో ఆమె ప్రేమలో పడ్డారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే ఊహాగానాలకు ఈ విధంగా సమాధానం చెప్పారు తాప్సీ. ఆ విషయాన్ని అలా ఉంచితే, హిందీలో ఆమె నటించిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వం వహించనున్న ఓ చిత్రంలో కథానాయికగా నటించడానికి ఆమె అంగీకరించిన విషయం తెలిసిందే. అక్షయ్ వయసు 46 ఏళ్లు. తాప్సీకేమో 26 ఏళ్లు. ఇద్దరి మధ్య ఇరవయ్యేళ్ల వయసు వ్యత్యాసం ఉంది కాబట్టి, అక్షయ్ సరసన చిన్నపిల్లలా కనిపిస్తారేమో? అనే ప్రశ్న తాప్సీ ముందు ఉంచితే - ‘‘సినిమా చూస్తే మా జంట ఎలా ఉంటుందో తెలుస్తుంది. కుర్ర హీరోల సరసన ఒదిగిపోయినట్లుగానే అక్షయ్ సరసన కూడా ఒదిగిపోగలుగుతాను. తనకు సరిజోడీ అనిపించుకుంటాను. సినిమా చూసినవాళ్లు మా జంట బాగుందని కచ్చితంగా అంటారు. దాదాపు ప్రతి సినిమాలోనూ హీరోల పాత్రకు ఉన్నంత నిడివి హీరోయిన్లకు ఉండదు. ఈ సినిమాలో కూడా నా పాత్ర నిడివికన్నా అక్షయ్‌ది ఎక్కువగా ఉండొచ్చు. కానీ, నిడివి గురించి ఆలోచించలేదు. కథానాయికగా కూడా ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టే, ఈ సినిమా అంగీకరించాను’’ అని చెప్పారు. -
ఎందరిని ప్రేమిస్తాను...?
‘‘నేనెంత మందినని ప్రేమిస్తాను ఇప్పటికే చాలా మందితో కలుపుతూ రాశారు. మీ రాతలకు అంతం ఉండదా?’’ అంటూ మండిపడుతోంది నటి తాప్సీ. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్ కొచ్చి పడిన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ తరువాత వందాన్ వెండ్రాన్, మరందేన్ మన్నిత్తేన్, ఆరంభం వంటి చిత్రాల్లో నటించింది. ఆరంభం షూటింగ్ సమయంలో ఆర్యతో ప్రేమాయణం అంటూ, అంతకు ముందే ఒక తెలుగు నటుడితో కలుపుతూ సాగిన ప్రచారం పెద్ద సంచలనాన్నే రేకెత్తించింది. తాజాగా మరో కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలంటూ ప్రచారం జోరందుకుంది. ఆయనెవరో కాదు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్ బోవ్ నే. ఈ ప్రేమ పక్షులిద్దరూ నిత్యం ఫేస్బుక్ ద్వారా మాటల రొమాన్స్ చేసుకుంటున్నారట. సమయం దొరికినప్పుడల్లా జంటగా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. ప్రస్తుతం షాదీ డాట్‌కామ్ అనే హిందీ చిత్రంలో తాప్సీ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల చండీగఢ్‌లో జరిగింది. ఆ సమయంలో తాప్సీని కలుసుకోవడానికి మాథ్యూస్ ముంబాయి నుంచి చండీగఢ్ వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది. అంతేకాదు తన ట్విట్టర్లో తనకో మంచి గర్ల్‌ఫ్రెండ్ దొరికింది. ఆమె మరెవరో కాదు నటి తాప్సీనే అంటూ మ్యాథ్యూస్ పోస్ట్ చేయడంతో వీరి మధ్య లవ్వాట మొదలైందనే ప్రచారం ఇటీవల కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించాలని తాప్సీని అడగితే ఆగ్రహంతో అగ్గిమీద గుగ్గిలయ్యింది. ‘‘నా గురించి నా వ్యక్తి గత జీవితం గురించి ఇప్పటికే చాలా వదంతులు ప్రచారం చేశారు. అలాంటి వాటికి బదులిచ్చి అలసిపోయూను. ఇకపై ఎలాంటి గ్యాసిప్స్ కు సమాధానం చెప్పేది లేదు. ఇతరులతో నన్ను చేరుస్తూ రాయడానికి అంతం లేదా? ఇలా నేనెంతమందిని ప్రేమిస్తాను. రోజుకో కథ రాస్తున్నారు’’ అంటూ తాప్సీ రుసరుసలాడుతోంది. నిప్పులేనిదే పొగరాదని ఈమె ఎరుగదేమో!