సీక్రెట్ బయటపెట్టిన టాప్ హీరోయిన్ | Taapsee Pannu opened up about her relationship | Sakshi
Sakshi News home page

సీక్రెట్ బయటపెట్టిన టాప్ హీరోయిన్

Mar 28 2017 2:23 PM | Updated on Sep 5 2017 7:20 AM

సీక్రెట్ బయటపెట్టిన టాప్ హీరోయిన్

సీక్రెట్ బయటపెట్టిన టాప్ హీరోయిన్

హీరోయిన్ తాప్సి పొన్ను తాను ప్రేమలో పడిన విషయాన్ని బయటపెట్టింది.

న్యూఢిల్లీ: హీరోయిన్ తాప్సి పొన్ను తాను ప్రేమలో పడిన విషయాన్ని బయటపెట్టింది. తన ప్రేమికుడు వివరాలు మాత్రం వెల్లడించలేదు. తాను ప్రేమిస్తున్న వ్యక్తి గర్వించదగ్గ వ్యక్తి అని తెలిపింది. ఒలింపిక్స్ సిల్వర్ పతక విజేత, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాతియాస్ బోయ్ తో రిలేషన్ షిప్ లో ఆమె ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.

'నా వ్యక్తిగత జీవితంలో మంచి దశలో ఉన్నాను. వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో పంచుకోవడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగత విషయాలు వెల్లడిస్తే మీడియా దాని గురించే ఎక్కువగా చూపిస్తుంది. నా పని గురించి పట్టించుకోదు. అందుకే పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలనుకోవడం లేదు. నా రిలేషన్ షిప్ పట్ల, నేను ప్రేమించే వ్యక్తి పట్ల గర్వంగా ఉన్నాన'ని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి వెల్లడించింది.

కాకతాళీయంగా ప్రేమికులిద్దరూ ఆదివారం ఢిల్లీలోనే ఉన్నారు. ఇండియా సూపర్ సిరీస్ కోసం మాతియాస్, నామ్ షబనా సినిమా ప్రచారం కోసం తాప్సి ఢిల్లీకి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement