బాలీవుడ్ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్‌రూబాకు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్‌గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుతుంది. భారత టీమ్‌తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది.
అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్‌లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment