జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం: తాప్సీ పన్ను | Taapsee Pannu to root for Husband badminton coach Mathias Boe in Paris | Sakshi
Sakshi News home page

Tapsee Pannu: 'జీవితంలో ఒక్కసారే ఇలాంటి అరుదైన అవకాశం'

Published Fri, Jul 26 2024 6:03 PM | Last Updated on Fri, Jul 26 2024 6:42 PM

Taapsee Pannu to root for Husband badminton coach Mathias Boe in Paris

హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫీర్ ఆయి హాసిన్ దిల్‌రుబా చిత్రంలో కనిపంచనుంది. 2021లో హసీన్ దిల్‌రుబా మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, సన్నీ కె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్‌ కానుంది. 

అయితే ఈ ఏడాది మార్చిలో  తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్‌ బోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్‌ అయినా మథియాస్‌ ఇండియన్‌ ఆటగాళ్లు  చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డికి 2021 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఆటగాళ్లు పారిస్‌ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దీంతో తన భర్త కోసం నటి తాప్సీ పన్ను పారిస్ ఒలింపిక్ క్రీడలకు హాజరు కానున్నారు. ఈనెల 29న పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఒలింపిక్స్‌ చూసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని పేర్కొన్నారు. తన భర్తతో పాటు.. మనదేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు పారిస్‌ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఇ‍ప్పటికే బాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, తాప్సీ భర్త మథియాస్ బో పారిస్ చేరుకున్నారు. మథియోస్‌ను 2012లో ఒలింపిక్స్‌ పతకం గెలిచిన తర్వాత తొలిసారి కలుసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.

కాగా.. తాస్పీ పన్ను తెలుగులో పలు చిత్రాలు చేసింది. బాలీవుడ్‌లో సూర్మ (2018), సాంద్ కి ఆంఖ్ (2019), రష్మీ రాకెట్ (2021), లూప్ లాపేట (2022), శభాష్ మిథు (2022) స్పోర్ట్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు కూడా చేసింది. తాను  స్క్వాష్ గేమ్‌ మాత్రమే బాగా ఆడగలనని తాప్సీ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement