paris
-
ఏఐతో ఉద్యోగాలు పోవు..: ప్రధాని మోదీ
ఏఐ సామర్థ్యానికి అటూఇటూకృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరిగింది. ఒక ఏఐ యాప్‌లోకి వైద్య నివేదికను అప్లోడ్ చేస్తే అది వైద్యపరిభాషలోని సాంకేతిక అంశాలను పక్కనపెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. అదే సమయంలో ఏఐ పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అదే యాప్‌ను ఎడమ చేత్తో రాస్తున్న వ్యక్తి చిత్రాన్ని గీయమంటే అది దాదాపుగా కుడి చేత్తో రాస్తున్న వ్యక్తి బొమ్మ గీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఏఐ పాలన గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. – ప్రధాని మోదీ పారిస్: అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికగా పటాపంచలు చేశారు. సాంకేతికత వాడ కం వల్ల ఉద్యోగాలు కనుమరుగుకావని తేల్చిచెప్పారు. కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుందని స్పష్టం చేశారు. ఏఐ వాడకంతో కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మంగళవారం ఏఐ యాక్షన్ సమ్మిట్–2025కు సహాధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టిపెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్‌సోర్స్ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజావిశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు. చరిత్ర చెప్పేది అదే.. ‘కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధికం మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటిచెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి’అని మోదీ సూచించారు. ఈ శతాబ్దిలో కృత్రిమ మేధ మానవాళికి కోడ్‌ను రాస్తోందని.. కానీ మానవ చరిత్రలోని ఇతర మైలురాళ్లకన్నా ఇది ఎంతో విభిన్నమైనదన్నారు. ‘‘ఏఐ ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలతోపాటు సమాజాన్ని పునరి్నరి్మస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలను మెరుగుపరచడం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను ఏఐ మార్చగలదు. ఇంకెన్నింటినో చేయగలదు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మరింత సులభంగా, వేగంగా చేరుకోవడంలో దోహదపడగలదు. ఇందుకోసం మనం మన వనరులు, ప్రతిభను ఏకం చేయాలి’అని మోదీ పేర్కొన్నారు.ఏఐలో భారత్ సత్తా.. ఓపెన్ నెట్వర్క్, యాక్సెసబుల్ నెట్వర్క్ సాయంతో తక్కువ ఖర్చుతోనే భారత్ 140 కోట్ల మందికిపైగా ప్రజల డిజిటల్‌పరమైన మౌలిక వసతులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ప్రజాపయోజనాల కోసం మేం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. భారత్‌లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేస్తున్నాం’అని మోదీ తెలిపారు. స్టార్టప్‌లు, పరిశోధకులకు అందుబాటు ధరలో సాంకేతిక వనరులను అందించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని భారత్ అభివృద్ధి చేసిందన్నారు. ఏఐ భవిత ఉన్నతంగా, అందరికీ అందుబాటులో ఉండే విషయంలో భారత్ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. డేటా సాధికారత, పరిరక్షక వ్యవస్థ ద్వారా డేటా శక్తిని అందిపుచ్చుకుందని వివరించారు. ‘మేం డిజిటల్ కామర్స్‌ను ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాం. భారత్ తీసుకొచ్చిన నేషనల్ ఏఐ మిషన్‌కు ఈ దృక్పథమే పునాది. మా హయాంలో జీ20 దేశాలకు సారథ్యం వహించినప్పుడు కృత్రిమ మేధ వాడకం బాధ్యతాయుతంగా ఉండేలా, అందరి మంచికి ఉపయోగపడాలనే విషయంలో ఏకాభిప్రాయం సాధించాం. ప్రస్తుతం ఏఐ వినియోగం, డేటా గోప్యతకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో భారత్ ముందుంది’అని మోదీ తెలిపారు. ఏఐ మార్గదర్శకాలపై ఉమ్మడి కసరత్తు ఉండాల్సిందే ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ వినియోగానికి సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి చర్యలు అవసరమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ప్రజావిశ్వాసాన్ని, పారదర్శకతను పెంపొందించడంలో, వివక్షను చెరిపేయడంలో ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ‘కనీవినీ ఎరుగని విస్తృతి, వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతోంది. అంతకన్నా వేగంగా ఏఐ వినియోగం కొనసాగుతోంది. దీనికితోడు దేశాలకు అతీతంగా ఏఐ రంగంలో పరస్పర ఆధారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విలువలను కాపాడుకోవడంతోపాటు ఏఐపై భయాలను పారద్రోలేందుకు, ప్రజావిశ్వాసం చూరగొనేందుకు దోహదపడే ప్రమాణాలను నెలకొల్పాలి. అందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ సూచించారు. మేధస్సుపరంగా మనిషికన్నా యంత్రాలు ఎంతో ముందుంటాయని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ మన ఉమ్మడి భవిత, గమ్యం విషయంలో మనుషులమైన మనం తప్ప ఇంకెవరూ కీలకపాత్ర పోషించలేరు’అని మోదీ పేర్కొన్నారు. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధం: మోదీ తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఈ మేరకు పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్–2025లో ప్రతిపాదన చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏఐ దృక్పథం, ఉద్దేశంలో భాగస్వామ్య పక్షాల మధ్య స్పష్టమైన ఐకత్యను చాటేలా చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియకు మరింత ఉత్సాహం తెచ్చేందుకు తదుపరి యాక్షన్ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. మరోవైపు ‘ఏఐ ఫౌండేషన్’, ‘సుస్థిర ఏఐ మండలి’ని ఏర్పాటు చేయాలన్న సదస్సు నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ విషయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చొరవను అభినందించిన మోదీ.. భారత్ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ‘ఏఐ కోసం ప్రపంచ భాగస్వామ్యం’స్వభావరీత్యా సైతం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. దక్షిణాది దేశాలను ఇందులో సమ్మిళితం చేయాలని.. ఆయా దేశాల అవసరాలు, ఆందోళనలు, ప్రాధాన్యతలను గుర్తించాలని సూచించారు. -
శిఖరాగ్రం సాక్షిగా ఏఐ విభేదాలు
పారిస్: పెద్దన్నల పోట్లాటకు ఏఐ అంతర్జాతీయ శిఖరాగ్రం వేదికైంది. అతి కీలకమైన కృత్రిమ మేధ రంగానికి సంబంధించి వాటి మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధతీవ్రతకు అద్దం పట్టింది. ఏఐలో తిరుగులేని శక్తిగా మారిన అమెరికా, దాన్ని ఢీకొట్టే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న చైనా, ఆ రెండింటికీ దీటుగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న యూరప్ మధ్య విభేదాలు సదస్సు సాక్షిగా బయట పడ్డాయి. నిబంధనల పరిమితుల్లేకుండా సరికొత్త ఇన్నోవేషన్లు తదితరాలతో ఏఐ విషయంలో దూకుడుగా వెళ్లనున్నట్టు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టడం తెలిసిందే. చైనా కూడా ప్రభుత్వ దన్నుతో కూడిన టెక్ దిగ్గజాల చురుకైన భాగస్వామ్యంతో ఏఐ రంగంలో అంతర్జాతీయంగా పైచేయి సాధించే ప్రయత్నంలో పడింది.యూరప్ మాత్రం ఓవైపు ఏఐ వాడకం విషయంలో వ్యక్తుల భద్రతకు, జవాబుదారీతనానికే పెద్దపీట వేస్తూనే మరోవైపు అమెరికా, చైనాలకు దీటుగా మూడో శక్తిగా ఎదిగేందుకు పథక రచన చేస్తోంది. అందులో భాగంగా ఏఐ నిబంధనలను పలు యూరప్ దేశాలు నానాటికీ మరింత కఠినతరం చేస్తూ వస్తున్నాయి. దీనిపై తమ తీవ్ర అసంతృప్తిని పారిస్‌లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు అమెరికా బాహాటంగానే వెళ్లగక్కింది. కృత్రిమ మేధపై మితిమీరిన నియంత్రణ మంచిది కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. శరవేగంగా సాగుతున్న ఏఐ ప్రగతి ప్రస్థానానికి అది తీరని అడ్డంకిగా మారవచ్చని హెచ్చరించారు.ఏఐ తాలూకు దుష్పరిణామాలు, రిస్కులకు అడ్డుకట్ట వేసేందుకు యూరప్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన పరోక్షంగా ఆక్షేపించారు. ట్రంప్ రాకతో ఏఐ విషయంలో సమూలంగా మారిన అమెరికా వైఖరిని ప్రతిఫలించేలా వాన్స్ ప్రసంగం సాగింది. అనంతరం యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ మాట్లాడుతూ వాన్స్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఏఐ వాడకం అన్ని విధాలా సురక్షితమేనని ప్రజల్లో నమ్మకం కలగడం అన్నింటికంటే కీలకమని స్పష్టం చేశారు. దాన్ని సాధించడమే ఏఐపై ఈయూ నిబంధనల ఏకైక లక్ష్యమని ఆమె వివరించారు.ఏఐ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట నియమ నిబంధనలు తప్పనిసరి అని శిఖరాగ్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా స్పష్టం చేశారు. ఏఐ రేసులో మూడో శక్తిగా యూరప్ శరవేగంగా ఎదుగుతోందని ఆయన ప్రకటించారు. ఏఐ ఇన్నోవేషన్ల ఫలాలు అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సమానంగా అందాలని తన ముగింపు ప్రసంగంలో ఆకాంక్షించారు. ఏఐ రంగంపై యూరప్ నియంత్రణలను చైనా కూడా వ్యతిరేకించింది. అంతర్జాతీయ ఏఐ ప్రమాణాలనే సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని చైనా ఉప ప్రధాని జాంగ్ గువోకింగ్ పేర్కొన్నారు.మా కంపెనీలపై మతిలేని నియంత్రణలు: వాన్స్ఏఐని ఆవిరి యంత్రం ఆవిష్కరణకు దీటైన సరికొత్త పారిశ్రామిక విప్లవంగా అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక ప్రస్థానానికే ఏఐ మేలిమలుపు కాగలదన్నారు. దాన్ని నిబంధనల ఛట్రంలో బిగించి ప్రగతి నిరోధకులుగా మారొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అమెరికాలో రూపొందే ఏఐ వ్యవస్థలన్నీ సైద్ధాంతిక, ఇతరత్రా వివక్షలకు తావులేని రీతిలో ఉంటాయని స్పష్టం చేశారు. అమెరికా పౌరుల వాక్ స్వాతంత్య్రం తదితరాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ పరిమితులు విధించబోదన్నారు. అమెరికా టెక్నాలజీ సంస్థలపై పలు దేశాలు మతిలేని నియంత్రణలకు దిగుతున్నాయంటూ యూరోపియన్ యూనియన్ తీరును తప్పుబట్టారు. ఉపాధ్యక్ష హోదాలో అంతర్జాతీయ వేదికపై ఆయనకిది తొలి ప్రసంగం కావడం విశేషంఇదీ తీర్మానం⇒ డిజిటల్ అంతరాలను వీలైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరింతగా కృషి.⇒ ఏఐ టెక్నాలజీ పారదర్శకంగా, నైతిక సూ త్రాలకు అనుగుణంగా, సురక్షితంగా, విశ్వసనీ యంగా, అదే సమయంలో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం.⇒ ఏఐని ప్రజలకు, మొత్తంగా ప్రపంచానికి విశ్వసనీయ సుస్థిరాభివృద్ధి చోదక శక్తిగా తీర్చిదిద్దడం.⇒ మానవ హక్కులను, లింగ సమానత్వాన్ని, భాషాపరమైన వైవిధ్యాన్ని, మేధో సంపత్తి హక్కులను అన్ని విధాలా పరిరక్షించడం.ముప్పుపై ఆందోళనలునానాటికీ పెరిగిపోతున్న ఏఐ వాడకంతో పలు కీలక రంగాల్లో తలెత్తగల ముప్పుపై శిఖరాగ్రంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రక్షణ, యుద్ధతంత్రం తదితరాల్లో ఏఐ అంతిమంగా మానవ నియంత్రణ పరిధినే దాటిపోకుండా చూ డాలని నాటో కమాండర్ అడ్మిరల్ పియరీ వాండి యర్ అన్నారు. లేదంటే చూస్తుండగానే వ్యవహారం చేయి దాటిపోవచ్చని హెచ్చరించారు. వక్తల్లో అత్యధికులు ఆయన వాదనతో ఏకీభవించారు.‘ఇన్వెస్ట్ఏఐ’కి 200 బిలియన్ డాలర్లు: ఈయూకృత్రిమ మేధ రంగంపై అత్యంత భారీగా పెట్టుబడుల దిశగా యూరప్ శరవేగంగా సాగుతోంది. ఇందుకు ఉద్దేశించిన ‘ఇన్వెస్ట్ఏఐ’ కార్యక్రమానికి యూరప్‌వ్యాప్తంగా ఇప్పటికే ఏకంగా 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరినట్టు కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ ప్రకటించారు.మోదీ చెప్పింది అక్షరసత్యంప్రధానికి వాన్స్ అభినందనలుకృత్రిమ మేధ మనిషికి ఏనాటికీ ప్రత్యామ్నాయం కాబోదన్న ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. పారిస్ ఏఐ శిఖరాగ్రంలో మోదీ మాట్లాడుతూ మానవ ఉత్పాదనను మరింతగా పెంచేందుకు, వారికి మరింత స్వేచ్ఛ అందించేందుకు సమర్థమైన పరికరంగా ఏఐ తోడ్పడుతుందని అభిప్రా యపడ్డారు. అనంతరం మాట్లాడిన వాన్స్ ప్రధా ని వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. ‘‘మోదీ కీలకమైన అంశాలు లేవనెత్తారు. వాటిపై వాస్తవి క వైఖరిని చక్కగా, సమర్థంగా వెల్లడించారు. అందుకు ఆయనకు అభినందనలు’’ అంటూ ప్రశంసించారు. -
ఆశల ఊసుల నడుమ... ఏఐ శిఖరాగ్రం
పారిస్: 100కు పైగా దేశాల అధినేతలు, అగ్రనేతలు. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సారథులు. అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు. కృత్రిమ మేధ రంగానికి సంబంధించిన మేధావులు. నిపుణులు. సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మొదలైన రెండు రోజుల ఏఐ శిఖరాగ్ర సదస్సు వీరందరినీ ఒక్కచోట చేర్చింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరుగుతున్న తొలి అధికారిక సదస్సు కావడం విశేషం. నానాటికీ అనూహ్యంగా మారిపోతున్న ఏఐ రంగంలో అపార అవకాశాలను ఒడిసిపట్టుకోవడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సదస్సులో లోతుగా మథనం జరుగుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మానవాళి చరిత్రలోనే అత్యంత అరుదైందిగా చెప్పదగ్గ శాస్త్ర, సాంకేతిక విప్లవం ఏఐ రూపంలో మన కళ్లముందు కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఈ అవకాశాన్ని ఫ్రాన్స్, యూరప్ రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం మరింత మెరుగ్గా జీవించేందుకు, ఎంతగానో నేర్చుకునేందుకు, మరింత సమర్థంగా పని చేసేందుకు, మొత్తంగా గొప్పగా జీవించేందుకు అపారమైన అవకాశాలను ఏఐ అందుబాటులోకి తెస్తోంది’’అని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన 40 ఏళ్ల వాన్స్ అగ్ర రాజ్యానికి తొలిసారిగా ఓ అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. ఉపాధ్యక్షునిగా ఆయనకిదే తొలి విదేశీ పర్యటన కూడా. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన తొలిసారి భేటీ అవనున్నారు. అందులో భాగంగా మంగళవారం మాక్రాన్‌తో విందు భేటీలో పాల్గొంటారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా కల్లోలంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృక్కోణాన్ని మాక్రాన్‌కు వివరించడంతో పాటు ఆయన సందేశాన్ని కూడా వాన్స్ అందజేస్తారని చెబుతున్నారు. తెలుగు మూలాలున్న వాన్స్ సతీమణి ఉష కూడా తన ముగ్గురు పిల్లలతో సహా ఈ అధికారిక పర్యటనలో పాల్గొంటుండటం విశేషం. చైనా తరఫున ఉప ప్రధాని జాంగ్ జువోకింగ్ ఏఐ సదస్సులో పాల్గొంటున్నారు.మోదీ సహ ఆతిథ్యంఅంతర్జాతీయ ఏఐ రంగం అంతిమంగా అమెరికా, చైనా మధ్య బలప్రదర్శనకు వేదికగా మారకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఐటీతో పాటు అన్నిరకాల టెక్నాలజీల్లోనూ గ్లోబల్ పవర్‌గా వెలుగొందుతున్న భారత్ ఏఐలోనూ కచి్చతంగా అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసి తీరాలని ప్రధాని మోదీ ఇటీవల పదేపదే చెబుతున్నారు. అందులో భాగంగా టెక్ దిగ్గజాలతో మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు పారిస్ ఏఐ శిఖరాగ్రం సదవకాశమని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు మాక్రాన్‌తో పాటు మోదీ సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండటం విశేషం. మంగళవారం సదస్సునుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఏఐ వృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంపై భారత ఆలోచనలను దేశాధినేతలు, టెక్, ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు తదితరులతో ఆయన వివరంగా పంచుకోనున్నారు. అనంతరం ఆయా కంపెనీల సీఈఓలతో విడిగా ముఖాముఖి భేటీ కానున్నారు.తెరపైకి ‘కరెంట్ ఏఐ’ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి టెక్, ఏఐ దిగ్గజాల సీఈఓలు, అత్యున్నతాధికారులు సదస్సులో పాల్గొంటున్నారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సంస్కృతి తదితర రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను మరింత ప్రభావవంతంగా మార్చడం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా ‘కరెంట్ ఏఐ’పేరిట ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పారిస్ శిఖరాగ్రం ఏఐకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ కోసం జరుగుతున్న తొట్ట తొలి ప్రయత్నమని మొజిల్లా పబ్లిక్ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ లిండా గ్రిపిన్ అన్నారు. ఏఐ అభివృద్ధి ప్రస్థానంలో దీన్ని నిర్ణాయక క్షణంగా అభివరి్ణంచారు. ‘‘ఏఐపై గుత్తాధిపత్యం రూపంలో కీలక సాంకేతిక పరిజ్ఞానంపై అజమాయిషీ కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు. మానవాళి ప్రయోజనాలను తీర్చడమే ఏకైక ప్రాతిపదికగా ఏఐ ఫలాలు ప్రపంచమంతటికీ అందాలి’’అని యురేíÙయా గ్రూప్ సీనియర్ జియోటెక్నాలజీ అనలిస్టు నిక్ రెయినర్స్ అభిప్రాయపడ్డారు. పారిస్ శిఖరాగ్రాన్ని ఆ దిశగా భారీ ముందడుగుగా అభివర్ణించారు. శిఖరాగ్రం వేదికగా ఏఐ రంగంలో యూరప్‌లో భారీ పెట్టుబడి ప్రకటనలు వెలువడుతాయని అక్కడి దేశాలు ఆశిస్తున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఏఐ రంగంలో ఫ్రాన్స్ ఏకంగా 113 బిలియన్ డాలర్ల మేరకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రకటించనున్నట్టు మాక్రాన్ స్పష్టం చేశారు. -
ఫ్రాన్స్‌లో ప్రధాని
న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. రక్షణ మంత్రి సెబ్ లెకొర్నూ ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా, హోటల్ వద్ద బారులు తీరిన భారతీయుల సమూహానికి మోదీ అభివాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు. పారిస్‌లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు మాక్రాన్‌తో కలిసి మోదీ ఆతిథ్యమిస్తున్నారు. మంగళవారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం బుధవారం చారిత్రక నగరం మార్సెయిల్లో భారత్ తొలి కాన్సులేట్‌ను మాక్రాన్‌తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్‌ను సందర్శిస్తారు. తర్వాత ఫ్రాన్స్ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికులకు మజారŠగ్స్ వార్ సిమెట్రీ వద్ద నేతలిద్దరూ నివాళులర్పిస్తారు. అనంతరం మోదీ అమెరికా బయల్దేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్‌లో మోదీకి ఇది ఆరో అధికారిక పర్యటన. గతేడాది భారత్–ఫ్రాన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇరు దేశాల భాగస్వామ్యం ఇన్నొవేషన్లు, టెక్నాలజీ, మారిటైం, రక్షణ సహకారం, ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, సంప్రదాయేతర ఇంధన వనరులతో పాటు పలు రంగాలకు విస్తరించిందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మాక్రాన్ ఆహా్వనం మేరకు మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. యూఎస్‌తో బంధం బలోపేతం తన అమెరికా పర్యటన ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘టెక్నాలజీ, వర్తకం, రక్షణ, ఇంధన, సరఫరా తదితర రంగాల్లో అమెరికాలో బంధాన్ని సుదృఢం చేసే అజెండా రూపకల్పనకు నా పర్యటన దోహదం చేయనుంది. ట్రంప్ తొలి హయాంలో పలు అంశాలపై ఆయనతో సన్నిహితంగా కలిసి పని చేశా. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి భేటీ అవబోతున్నా. నా మిత్రున్ని కలిసేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా’’ అంటూ ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఎక్స్‌లో పేర్కొన్నారు. -
తెల్ల గులాబీలా హీరోయిన్.. వాచ్ ధర అన్ని లక్షలా?!
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అహుజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్లో ఆమె ఒకరు. నేషనల్ ఫీల్మ్ అవార్డుతో సహా పలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటి. అలాగే ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో 2012, 2016లలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేగాదు ఆమె ఇల్లు కూడా భారతీయ వారసత్వ కళకు అద్దం పట్టేలా అత్యంత అందంగా ఉంటుంది. ఫ్యాషన్ పరంగా కూడా సోనమ్‌కి సాటి లేరెవ్వరూ. అంతలా ఆమె ఫ్యాషన్ వార్డ్ రోబ్‌లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కలెక్షన్ భారీగానే ఉంటుంది. సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ అందుకు తగ్గ యాక్సెసరీలు ధరిస్తారామె. తాజాగా ఆమె ధరించి వాచ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దాని ధర కూడా అంతేస్థాయిలో అవాక్కయ్యేలా ఉంటుంది. మరీ ఆ వాచ్ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.సోనమ్ కపూర్(Sonam Kapoor) ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్(Paris Fashion Week)లో జరిగిన ఎలీ సాబ్ హాట్ కోచర్ షో(Elie Saab haute couture show)కు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కోసం ఆమె ఉల్లాసభరితమైన ఆల్-వైట్ లుక్‌లో మైమరిపించింది. ఆమె పీస్ఫుల్ డ్రెస్సింగ్ వేర్ మనసుకు ఆహ్లాదంగా కనుచూపుని తిప్పుకోని విధంగా ఉంది. ముఖ్యంగా ఆమె చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. నటి హై-ఎండ్ వాచ్ - పియాజెట్ లైమ్లైట్ గాలా ప్రెషియస్ రెయిన్‌బోని ధరించింది. దీన్ని పూర్తిగా విలువైన రంగు రాళ్లతో డిజైన్ చేశారు. అచ్చం రెయిన్ బో కలర్స్ మాదిరిగా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది ఈ వాచ్. బ్రాస్లెట్ మాదిరిగా ఉన్న ఈ వాచ్ ధర దగ్గర దగ్గర రూ. 94 లక్షలు పైనే అంటే.. రూ. 1 కోటి పలుకుతుందట. 1973ల నాటి వింటేజ్ పీస్ అయినా ఈ వాచ్ మరోసారి ఫ్యాషన్ ప్రియుల మనుసుని దోచుకునేలా హైలెట్‌గా నిలిచింది. ఇక సోనమ్ తన సోదరి, స్టైలిస్ట్ చిత్ర నిర్మాత రియా కపూర్ డిజైన్ చేసిన డ్రెస్‌ని ధరించారు. ఆ డ్రస్‌కి తగ్గట్టు సన్‌గ్లాసెస్, గులాబీ ఆకారపు చెవిపోగులు, స్టేట్మెంట్ రింగులు, ఈ లగ్జరీ వాచ్‌తో రాయల్టీగా కనిపించారు సోనమ్. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: 61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. జస్ట్ ఐదు నెలల్లోనే..) -
ఈఫిల్ టవర్‌పైకి విమానం!
ఈ ఫొటో చూస్తే ఏం గుర్తొస్తోంది? న్యూయార్క్ జంట టవర్లను విమానాలతో కూల్చేసిన 9/11 ఉగ్ర దాడే కదూ! కానీ నిజానికిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) రూపొందించిన ప్రకటన! భద్రతా ఆందోళనలతో పీఐఏపై విధించిన నిషేధాన్ని నాలుగేళ్ల అనంతరం ఇటీవలే యూరోపియన్ యూనియన్ తొలగించింది. దాంతో పాక్ నుంచి యూరప్‌కు విమాన సర్విసులు తిరిగి మొదలయ్యాయి. దీనికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నాల్లో భాగంగా పీఐఏ చేసిన ప్రయత్నమిది! కాకపోతే ప్రకటనలో పీఐఏ విమానం నేరుగా పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. పైగా, ‘పారిస్! ఈ రోజే మేమొచ్చేస్తున్నాం!’అంటూ క్యాప్షన్ కూడా జోడించారు!! అలా అచ్చం అమెరికాపై ఉగ్ర దాడిని గుర్తుకు తెస్తుండటంతో పీఏఐ ప్రకటన పూర్తిగా బెడిసికొట్టింది. యాడ్‌ను 9/11 ఉగ్ర దాడితో పోలుస్తూ నెటిజన్లంతా తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. దీనిపై పుట్టుకొచ్చిన మీమ్‌లు సోషల్ మీడియాలో రోజంతా వైరలయ్యాయి. సరదా కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. పీఐఏకు కొత్త గ్రాఫిక్ డిజైనర్ చాలా అవసరమంటూ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమర్ చెణుకులు విసిరారు. పార్లమెంటులోనూ ప్రస్తావన! యాడ్ ఉదంతం అంతర్జాతీయంగా పరువు తీయడంతో తలపట్టుకోవడం పాక్ ప్రభుత్వం వంతయింది. ఇది మూర్ఖత్వానికి పరాకష్ట అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు కూడా ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ అయితే ఈ అంశాన్ని ఏకంగా పార్లమెంటులోనే ప్రస్తావించారు. ‘ఫొటోయే చాలా అభ్యంతరకరం మొర్రో అంటే, క్యాప్షన్ మరింత దారుణంగా ఉంది’అంటూ వాపోయారు. ‘‘ప్రధాని కూడా దీనిపై చాల ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రకటనను ఎవరు అనుమతించారో విచారణలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తప్పవు’’అని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 2001లో జరిగిన ఉగ్ర దాడిలో 3,000 మందికి పైగా మరణించడం తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు జంట టవర్లను వాటితో ఢీకొట్టారు. దాంతో టవర్లు నేలమట్టమయ్యాయి. తొలిసారేమీ కాదు అర్థంపర్థం లేని ప్రకటనతో అభాసుపాలు కావడం పీఐఏకు కొత్తేమీ కాదు. 2016లో ఇస్లామాబాద్ విమానాశ్రయంలోనే గ్రౌండ్ స్టాఫ్ మేకను బలివ్వడం అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కింది. అంతకుముందు 1979లో ఏకంగా పాక్‌కు చెందిన బోయింగ్ 747 విమానం నేరుగా న్యూయార్క్ జంట టవర్లపైకి దూసుకెళ్తున్నట్టుగా పీఐఏ యాడ్ రూపొందించింది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ గతానుభవాల నుంచి పీఐఏ ఏమీ నేర్చుకోలేదని తాజాగా రుజువైందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పీఐఏ గ్రాఫిక్స్ హెడ్‌కు చరిత్రకు సంబంధించి క్రాష్ కోర్స్ చేయిస్తే మేలంటూ సలహాలిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం
గతేడాదిలో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తిని చిరంజీవి అభినందించారు. ఈ విషయన్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇలా తెలిపారు.'ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ అనే చిన్న గ్రామంలో జన్మించిన జీవాంజీ దీప్తి దేశానికి ఎంతో పేరు తెచ్చింది. అయితే, ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవి గారిని కలవాలని ఉందని చెప్పారు. ఇటీవల నేను చిరంజీవిగారిని ఓ సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పాను. ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు. అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు. రెండు గంటల పాటు అక్కడే గడిపారు. అలాగే ప్రతి ప్లేయర్‌ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్‌ను దీప్తికి అందించటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా క్రీడాకారులకు చిరంజీవిగారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను. ఈ ఇన్స్పిరేషన్తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను.' అని ఆయన అన్నారు.దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు రూ. కోటి2024లో పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో జీవాంజీ దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి కాంస్యం సాధించారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చాలామంది ప్రశంసలు కురిపించారు. ఆమె విజయంలో పుల్లెల గోపీచంద్ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి ప్రకటించింది. ఆపై దీప్తికి గ్రూప్-2 ఉద్యోగంతో పాటు వరంగల్‌లో 500 గజాల స్థలం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.కూతురి కోసం పొలం అమ్మేసిన తండ్రిజీవాంజీ దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మిల శ్రమ ఆమె విజయంలో ఎక్కువగా ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో చాలా ఇబ్బందులు పడింది. మేధోపరమైన బలహీనత ఉండడంతో ఆమె కోసం తండ్రి యాదగిరి చాలా తల్లడిల్లిపోయారు. చిన్నతనంలో కూతురుకు ఫిట్స్ వస్తే వారు విలవిలలాడిపోయేవారు. అయితే, దీప్తి క్రీడల్లో మాత్రం చాలా చురుకుగా ఉండేది. దీంతో ఆమె సంతోషం కోసం ఆ తండ్రి డబ్బులకు వెనకాడలేదు. తనకున్న ఎకరం పొలాన్ని కూతురి కోసం అమ్మేశారు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దీప్తి తిరుగులేని విజయాన్ని దేశానికి అందించింది. -
శతాబ్దాల ఖ్యాతి.. సమున్నతం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 సంవత్సరాల చరిత్ర కలిగిన నోట్రే డామ్ చర్చి మళ్లీ పునరుజ్జీవనం చెందింది. ఐదేళ్ల క్రితం భారీ అగ్నిప్రమాదంలో పాక్షిక్షంగా ధ్వంసమై కోట్లాది క్రైస్తవ భక్తుల్లో ఆవేదన మిగిల్చిన ఈ చర్చి మళ్లీ ప్రార్థనలకు సిద్ధమైంది. అప్పట్లో దీని పూర్తి నిర్మాణానికి ఏకంగా 200 ఏళ్లు పట్టిందని చెబుతారు. విభిన్నమైన డిజైన్, విశిష్ట నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చర్చికి మళ్లీ ఆ రూపం తేవడం చాలా కష్టమని నిర్మాణ రంగ నిపుణులే పెదవి విరిచారు. అయినా ఫ్రాన్స్ ప్రభుత్వం వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్చికి ప్రాణప్రతిష్ట చేసింది. కేవలం ఐదేళ్లలో ఏకంగా రూ.6,350 కోట్ల భారీ వ్యయంతో నాణ్యతో రాజీ పడకుండా అదే స్థాయిలో పునరుద్ధరించింది. శనివారం చర్చి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ యువరాజు విలియంసహా దాదాపు 50 దేశాలకు చెందిన అధి పతులు, రాజులు, సెలబ్రిటీలు, వివిధ దేశాల నుంచి 170 మంది బిషప్‌లు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రికార్డు సమయంలో చర్చిని అందుబాటులోకి తేవడంలో కార్మికుల అంకితభావం దాగుందని మేక్రాన్ జాతి నుద్దేశించి ప్రసంగంలో చెప్పారు. కోర్సియా పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు. 2,000 మంది నిపుణులతో.. 2019 ఏప్రిల్ 15న ఘోర అగ్నిప్రమాదంలో చర్చి పై కప్పు, శిఖరం, అంతర్గత దారు నిర్మాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. షాట్ సర్క్యూటో, కాల్చేసిన సిగరెట్ పీకో ఇందుకు కారణమంటారు. చర్చి పునఃనిర్మాణ వ్యయాన్ని భరిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముందుకొచ్చారు. వేలాది కోట్ల విరాళాలిచ్చారు. చర్చి నిర్మాణ ఖర్చంతా ఇలా సమకూరిందే! పునర్నిర్మాణ క్రతువులో ఏకంగా 2,000 మంది నిపుణులు భాగస్వాములయ్యారు. అత్యంత నాణ్యమైన కలపను ఇచ్చే 2,000 ఓక్ చెట్ల నుంచి సేకరించిన కలపను ఈ నిర్మాణంలో వాడారు. భారీ సంగీత విభావరితో.. చర్చి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీతకళాకారులతో భారీ సంగీత విభావరి నిర్వహించారు. ఒపెరా గాయకులు ప్రెటీ యేండీ, జూలీ ఫచ్, పియానిస్ట్ లాంగ్ లాంగ్ తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. పారిస్‌లోని సీన్ నదీ తీరం వెంట ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరల్లో కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంచేశారు. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా కోట్లాది మంది వాటిని వీక్షించనున్నారు. ఆరుబయట కార్యక్రమం నిర్వహిద్దామనుకున్నా భారీ ఈదురుగాలుల వల్ల లోనికి మార్చారు. ఆదివారం నుంచి చర్చిలో ప్రార్థనలను అనుమతిస్తారు.సామ్యవాదంతో సంబంధం మతసంబంధ ప్రదేశంగా మాత్రమే గాక ఫ్రాన్స్ రాజకీయాలతోనూ నోట్రేడామ్ చర్చి ముడిపడి ఉంది. ఫ్రెంచ్ విప్లవానికి, రెండు ప్రపంచయుద్ధాలకు ఇది సజీవ సాక్షి. 1302లో రాజు నాలుగో ఫిలిప్ ఎస్టేట్ చట్టాన్ని ఈ చర్చిలోనే చర్చించి ఖరారు చేశారు. పన్నులు, రాజ్య పరిపాలనపై ఇక్కడే నిర్ణయాలు జరిగాయి. రోడ్లన్నీ రోమ్‌కే దారి తీస్తాయి (ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్) అనే సామెతకూ ఈ చర్చే మూలం. రోమన్ సామ్రాజ్యంలో రోడ్లన్నీ ఈ చర్చి సమీపంగా వెళ్లాలని చక్రవర్తి అగస్టస్ ఆదేశించారు. ప్రత్యేకతలెన్నో..→ పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో నోట్రేడామ్ చర్చి ఒకటి. → ఫ్రాన్స్ చరిత్ర, సాంస్కృతిక వైభవంలో ఈ చర్చిది కీలక పాత్ర. → దీన్ని ఏటా ఏకంగా 1.3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. → ఈఫిల్ టవర్ కంటే ఈ చర్చిని చూడ్డానికి పారిస్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ. → సీన్ నదిలో అత్యంత చిన్న ద్వీపమైన ‘ ది లే డీ లా సిట్’లో ఈ అద్భుత చర్చి నిర్మాణాన్ని నాటి బిషప్ మారీస్ డి సలీ ఆదేశాల మేరకు 1163లో పూర్తి చేశారు. → 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చర్చి 12వ శతాబ్దం దాకా యూరప్ ఖండంలో అతి పెద్ద మానవ నిర్మాణం. → మేరోవియన్, కారోవియన్, రోమన్ల, గోథిక్ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు. → మన తల కంటే ముంజేయి పొడవు సరిగ్గా 1.61803399 రెట్లు పెద్దగా ఉంటుందని గణిత సూత్రం. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. → చర్చి నిర్మాణంలో ఈ గణిత సూత్రాన్ని అణువణువునా వాడారు. చర్చిలో అంతర్నిర్మాణాల మధ్య కూడా ఇవే కొలతలను పాటించడంతో ఏ వైపు నుంచి చూసినా చర్చి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలోనే ఆకర్షణీయమైన నగరంగా పారిస్.. భారత్ నుంచి ఒకే సిటీ!
ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరంగా పారిస్ నిలిచింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. జపాన్ రాజధాని టోక్యో మూడో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి కేవలం ఢిల్లీ మాత్రమే టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ మేరకు డేటా అనలిటిక్స్ కంపెనీ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించింది. 2024లో పారిస్ వరుసగా నాలుగోసారి అత్యంత ఆకర్షణీయమైన నగరంగా నిలిచింది.మాడ్రిడ్టో, క్యోలు వరుసగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో రోమ్, మిలన్, న్యూయార్క్, ఆమ్స్టర్డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా ఉన్నాయి. భారత్ నుంచి ఢిల్లీ 74వ స్థానంలో నిలిచింది. 98వ స్థానంలో జెరూసలేం, 99వ స్థానంలో జుహై, 100 స్తానంలో కైరో నిలిచింది. ఆర్థిక, వ్యాపార పనితీరు, పర్యాటక పనితీరు, పర్యాటక మౌలిక సదుపాయాలు, పర్యాటక విధానం, ఆకర్షణ, ఆరోగ్యం, భద్రత మరియు స్థిరత్వం వంటి అంశాలు ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేశారు. -
పేరు మార్చుకుని పుతిన్ కూతురు రహస్య జీవనం.. ఎక్కడ ఉన్నారంటే?
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నాటి నుంచి వ్లాదిమిన్ పుతిన్ ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో పుతిన్.. కుటుంబ సభ్యు గురించి కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక, తాజాగా పుతిన్ రహస్య కుమార్తె తన పేరు మార్చుకుని పారిస్ లో ఉంటున్నారని సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. పుతిన్, సెత్వాన్ క్రివోనోగిఖ్ కుమార్తె ఎలిజావేటా క్రివోనోగిఖ్ పేరు బయటకు వచ్చింది. ఎలిజావేటా ప్రస్తుతం తన పేరు మార్చుకుని లాయిజా రోజోవా అనే పేరుతో పారిస్ లో ఉంటున్నారని ఉక్రెయిన్ కు సంబంధించిన మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజోవా రహస్యంగా పారిస్ లో ఉంటున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. వ్యాపారవేత్త అయిన సెత్వాన్ క్రివోనోగిఖ్(49) పుతిన్ భాగస్వామిగా ఉన్నారని మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి. ఇక, అంతకుముందు కూడా పుతిన్ మరో కూతురు కేథరిన్ టిఖోనోవా గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. కేథరినా ఒక డ్యాన్సర్(జిమ్నాస్టిక్). ఆమె రష్యాకు చెందిన బిలియనీర్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 2017లో విడిపోయారు.🚨 Vladimir Putin has an illegitimate daughter living under a pseudonym in Paris where she works as a DJ: pic.twitter.com/twtwfxWqyM— Emmanuel Rincón (@EmmaRincon) November 29, 2024 -
జర్నలిజం నేరం కాదు: జూలియన్ అసాంజే
వికీలీక్స్ వ్యవస్థపకుడు జూలియన్ అసాంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జర్నలిజం నేరం అని ఒప్పుకున్నందుకే విడుదల అయినట్లు వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తొలిసారి మంగళవారం అసాంజ్.. స్ట్రాస్‌బర్గ్ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ ఆఫ్ యూరప్ హక్కుల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.‘‘నేను స్వేచ్ఛగా లేను. ఎందుకంటే వ్యవస్థ అలా సాగుతోంది. అయితే కొన్ని ఏళ్ల నిర్భందం తర్వాత నేను ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నాను. దానికి గల కారణం జర్నలిజం నేరాన్ని ఒప్పుకున్నాను. అందుకే నిర్భందం నుంచి బయటపడ్డాను. చివరికి అవాస్తవమైన న్యాయం కంటే స్వేచ్ఛను ఎంచుకున్నా. నాకు న్యాయం ఇప్పుడు అసాధ్యంగా మారింది. నేను ప్రస్తుతం 175 ఏళ్ల జైలు శిక్షను ఎదుర్కొంటున్నా. అయితే జర్నలిజం నేరం కాదు. పౌర సమాజానికి, స్వేచ్ఛకు ఒక మూల స్తంభం. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏం లేదు. కానీ, జర్నలిస్టులుగా తమ విధులు నిర్వహిస్తున్నవారిని విచారించవద్దు’ అని అన్నారు. అదేవిధంగా తాను ఖైదీగా ఉన్న సమయంలో తనకు సంబంధించిన భూమిని కోల్పోయానని తెలిపారు. నిజం చెప్పినందుకు శిక్ష, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చినట్లు అయిందని అసాంజే పేర్కొన్నారు."I want to be totally clear. I am not free today because the system worked. I am free today because after years of incarceration I pleaded guilty to journalism. I pleaded guilty to seeking information from a source" - Julian Assange, Council of Europe pic.twitter.com/N0Ix58CeSu— WikiLeaks (@wikileaks) October 1, 2024 గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను ఇటీవల అసాంజ్ అంగీకరించారు. దీంతో ఆయన్ను అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదేళ్లుగా బ్రిటన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్న అసాంజే.. అమెరికా న్యాయ విభాగంతో నేరాంగీకార ఒప్పందం కుదుర్చుకోవడంతో విడుదలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇదీ నేపథ్యంఇరాక్, అఫ్గానిస్తాన్ తదితర చోట్ల అమెరికా సైన్యం పాల్పడ్డ తప్పిదాలు, చేపట్టిన తప్పుడు చర్యలకు సంబంధించిన లక్షలాది రహస్య పత్రాలను లీక్ చేసి జూలియన్ అసాంజే సంచలనం సృష్టించడం తెలిసిందే. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అసాంజే స్థాపించిన వికీలీక్స్ అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలెన్నింటినో విడుదల చేసింది. బాగ్దాద్‌పై 2010లో అమెరికా వైమానిక దాడిలో ఇద్దరు రాయిటర్ జర్నలిస్టులతో పాటు సామాన్యులు మృతి చెందిన వీడియో వంటివి వీటిలో ఉన్నాయి.అఫ్గాన్ యుద్ధానికి సంబంధించి 91,000కు పైగా పత్రాలనూ వికీలీక్స్ విడుదల చేసింది. తర్వాత ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను విడుదల చేసింది. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపడంతో అసాంజ్‌పై అమెరికా తీవ్ర అభియోగాలు మోపింది. మరోవైపు లైంగిక నేరాల ఆరోపణలపై అసాంజే అరెస్టుకు స్వీడన్ కోర్టు 2010 నవంబర్‌లో ఆదేశించింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.చదవండి: WikiLeaks: అసాంజ్‌కు విముక్తి -
పారిస్ ఫ్యాషన్ వీక్ : గ్లామ్ లుక్‌తో అదరగొట్టిన మరో బాలీవుడ్ దివా
-
Paris Fashion Week 2024: ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్ 2024లో అందంగా మెరిసిపోయింది. ఆమె లేని ర్యాంప్‌వాక్ ఊహించలేం అన్నట్టుగా ఎర్రని దుస్తుల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. గత కొన్నేళ్లుగా లోరియల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఐష్ గ్రాండ్ ఫ్యాషన్ గాలాలో ఎప్పటిలాగానే తన లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. తనదైన స్టయిల్లో ఫ్లయింగ్ కిస్, నమస్తేతో ర్యాంప్ వాక్ అదుర్స్ అనిపించింది. View this post on Instagram A post shared by L'Oréal Paris Official (@lorealparis) పారిస్‌లోని పలైస్ గార్నియర్ ఒపెరా హౌస్‌లో ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2025 సేకరణలో భాగంగా లోరియల్ పారిస్ షో "వాక్ యువర్ వర్త్" పేరుతో అందాల రాణులు, సెలబ్రిటీలు సందడి చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కూడా ర్యాంప్ వ్యాక్ చేశారు. ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌లో అలియా మెరవడం ఇదే తొలిసారి. -
పారాలింపిక్స్ పతక విజేతలకు సన్మానం
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రోత్సాహకాల్ని అందించింది. స్వర్ణ పతక విజేతకు రూ. 75 లక్షలు... రజత పతకం నెగ్గిన వారికి రూ. 50 లక్షలు... కాంస్య పతకం గెలిచిన వారికి రూ. 30 లక్షలు నజరానా ఇచ్చినట్లు క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. లాస్ ఏంజెలిస్ 2028 పారాలింపిక్స్ లక్ష్యంగా అథ్లెట్లు సన్నద్ధమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ‘పారాలింపిక్స్‌లో భారత్ దూసుకెళుతోంది. రియో (2016)లో 4 పతకాలు, టోక్యో (2020)లో 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు పారిస్‌లో అత్యధికంగా 29 పతకాలు గెలిచి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అథ్లెట్లకు అధునాతన సదుపాయాలు, కిట్లు అందజేస్తాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత పారా అథ్లెట్లు 29 పతకాలు నెగ్గారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలున్నాయి. -
ప్యారిస్ వీధుల్లో పతక సంబరం!
ప్యారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత హై జంపర్ నిషాద్ కుమార్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఈ విశ్వక్రీడల్లో నిషాద్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల హై జంప్ T47 విభాగంలో నిషద్ కూమార్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్స్‌లో నిషిద్ కూమార్ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానంలో నిలిచి.. రెండో పారాలింపిక్స్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.నిషాద్ సూపర్ డ్యాన్స్..ఇక పారాలింపిక్స్ ముగిసిన తర్వాత నిషాద్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. ప్యారిస్ వీధుల్లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నిషాద్ అద్బుతంగా డ్యాన్స్ చేస్తూ.. తన మెడల్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా నిషాద్ తన ఆరేళ్ల వయస్సులోనే ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోయాడు. అయినప్పటకి తన పట్టుదలతో విశ్వవేదికపై సత్తాచాటుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో సైతం అతడు సిల్వర్ మెడల్ సాధించాడు. Paralympics Silver Medalist Nishad Kumar amazing dance moves at Paris 🕺🗼Nishad is totally enjoying it 🤩pic.twitter.com/EkND79OoBk— The Khel India (@TheKhelIndia) September 9, 2024 -
లాస్ ఏంజెలిస్‌లో కలుద్దాం
పారిస్: వైకల్యాన్ని జయించి పతకాల భరతం పట్టిన పారా అథ్లెట్లు ఈ విశ్వక్రీడలను చిరస్మరణీయం చేసుకున్నారు. రెగ్యులర్ ఒలింపిక్స్‌లా సాగిన పారాలింపిక్స్‌కు ఆదివారం అర్ధరాత్రి తర్వాత తెరపడింది. అట్టహాసంగా నిర్వహించిన ముగింపు వేడుకలు మళ్లీ పారిస్‌ను మిలమిల మెరిపించింది. రంగురంగుల ఎల్ఈడీ లైటింగ్ నడిరాతిరిని వర్ణమయం చేస్తే... నిషిధిని చీల్చిన బాణాసంచా వెలుగులు పారిస్ నగరం నెత్తిన కిరీటాన్ని తలపించేలా చేశాయి. ప్రత్యేకంగా తయారు చేసిన అతిపెద్ద బెలూన్ బాగా ఆకట్టుకుంది. ఇది చూసిన వారికి మండుతున్న కుండలా కనిపించింది. అయితే ఇదేమీ బాణాసంచాతోనూ, అగ్గితోనూ చేసింది కాదు! పూర్తిగా అగ్గిమంటను తలపించే రంగు లైట్లతో అలా కనువిందు చేశారు. ప్రముఖ ఫ్రెంచ్ సింగర్ శాంటా హుషారెక్కించే పాటతో స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. పోటీల ఆఖరి రోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. మొరాకో అథ్లెట్ ఫాతిమా ఎజార ఎల్ ఇడ్రిస్సి మహిళల మారథాన్ పరుగులో, నైజీరియన్ లిఫ్టర్ ఒలువాఫెమియో రికార్డులు నెలకొల్పారు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని ఎల్ ఎడ్రిస్సి 2 గంటల 48 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా జపాన్‌కు చెందిన మిసాటో మిచిషిత 2020లో నెలకొల్పిన 2 గంటల 54 నిమిషాల 13 సెకన్ల రికార్డును బద్దలు కొట్టింది. మహిళల పవర్‌లిఫ్టింగ్‌లో డిఫెండింగ్ చాంపియన్, 39 ఏళ్ల ఒలువాఫెమియో తన రికార్డును తానే చెరిపింది. 86 కేజీల ఈవెంట్లో ఆమె 167 కిలోల బరువెత్తి జార్జియాలో ఈ ఏడాది జూన్‌లో ఎత్తిన 166 కిలోల రికార్డును తిరగరాసింది. అమెరికాకు మూడో స్థానం సాధారణంగా విశ్వక్రీడల్లో అమెరికా అథ్లెట్లు పతకాల పందెంలో ముందుంటారు. ఈసారి ఒలింపిక్స్‌లో అమెరికాకు గట్టి పోటీనిచి్చన చైనా అథ్లెట్లు చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ పారాలింపిక్స్‌లో చైనా క్రీడాకారులు అగ్రస్థానం చేజిక్కించుకున్నారు. 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్యాలతో చైనా మొత్తం 220 పతకాలు సాధించింది. అమెరికా 105 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో 36 పసిడి, 42 రజతాలు, 27 కాంస్యాలున్నాయి. రెండోస్థానం బ్రిటన్ (124 పతకాలు)కు దక్కింది. 49 బంగారు పతకాలు, 44 రజతాలు, 31 కాంస్యాలు గెలుచుకుంది. లాస్ ఏంజెలిస్ అధిగమిస్తుందా? పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్ ఆదరణలోనూ, అథ్లెట్లతోనూ విజయవంతమైంది. ఏకంగా 4000 పైచిలుకు అథ్లెట్లు పోటీపడిన ఈ విశ్వక్రీడలను చూసేందుకు లక్షల మంది ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో 2.4 మిలియన్ టికెట్లు (24 లక్షలు) అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు. లండన్–2012 ఒలింపిక్స్ తర్వాత ఆ స్థాయిలో టికెట్ల విక్రయం జరిగిన ఈవెంట్ ఇదేనని వెల్లడించారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి లాస్ ఏంజిలిస్–2028 ఒలింపిక్స్‌పై పడింది. ఈ ఆదరణను మించే విధంగా తదుపరి విశ్వక్రీడలు జరగాలని ఆశిస్తున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ప్రతినిధి క్రెయిగ్ స్పెన్స్ తెలిపారు. -
ధరమ్వీర్ ధమాకా
భారత సీనియర్ పారాలింపియన్లలో అమిత్ కుమార్ సరోహా కూడా ఒకడు. పారా ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో రెండు రజతాలతో పాటు క్లబ్ త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన రికార్డు అతని సొంతం. దీంతో పాటు క్లబ్ త్రోలో రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ రజతాలు కూడా అమిత్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి ఒలింపిక్ పతక అంచనాలతో అతను బరిలోకి దిగాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక క్లబ్ త్రో ఈవెంట్ జరిగింది. అయితే 10 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో అమిత్ పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచాడు. కానీ కొద్ది సేపటికే అతను ఆనందంగా, ఆత్మ సంతృప్తిగా ఆ పోటీల వేదిక నుంచి వెనుదిరిగాడు. ఎందుకంటే ఇందులో స్వర్ణ, రజతాలు సాధించిన అథ్లెట్లు ధరమ్వీర్, ప్రణవ్ సూర్మా అమిత్ శిష్యులు కావడం విశేషం. వారిద్దరు పాల్గొన్న ఈవెంట్లోనే తానూ పోటీ పడ్డాడు. తాను గెలవకపోతేనేమి... తన శిష్యులిద్దరూ గెలిచి గురుపూజోత్సవం రోజున గురుదక్షిణ అందించారని అమిత్ చెప్పడం విశేషం. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ‘క్లబ్ త్రో–ఎఫ్51’ ఈవెంట్లో భారత్‌కు చెందిన ధరమ్వీర్ పసిడి పతకం సాధించాడు. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ ప్రణవ్ సూర్మాకు రజతం దక్కింది. ‘క్లబ్’ను 34.92 మీటర్ల దూరం విసిరి ధరమ్వీర్ పసిడి పతకాన్ని గెలుచుకోగా... 34.59 మీటర్ల దూరంతో ప్రణవ్ సూర్మా రజతం సొంతం చేసుకున్నాడు. తొలి నాలుగు ప్రయత్నాలు ఫౌల్ అయినా ఐదో త్రోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి చివరకు ధరమ్వీర్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఈవెంట్లో దిమిత్రిజెవిచ్ (సెర్బియా–34.18 మీటర్లు)కు కాంస్యం దక్కింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఈ పతకాన్ని తన గురువు అమిత్‌కు అంకితం ఇస్తున్నట్లు ధరమ్వీర్ ప్రకటించాడు. క్లబ్ త్రో ఈవెంట్‌కు మన దేశంలో పెద్దగా ఆదరణ, గుర్తింపు లేని వేళ దానిని ముందుకు తీసుకెళ్లేందుకు అమిత్ శ్రమించాడు. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్‌గా ఆయన తీర్చిదిద్దిన అథ్లెట్లలో ధరమ్వీర్, ప్రణవ్ ఉన్నారు. ‘క్వాడ్రిప్లెజిక్’ బాధితులు ఈ ఎఫ్51 కేటగిరీలో పాల్గొంటారు. ఈ సమస్య వల్ల మెడ కింది భాగం మొత్తం పని చేయకుండా పోతుంది. దాంతో చక్రాల కుర్చీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జూడోలో కపిల్‌కు కాంస్యం... పురుషుల జూడో 60 కేజీల జే1 ఈవెంట్లో భారత ప్లేయర్ కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కపిల్ 10–0తో ఒలీవిరా డి ఎలెల్టన్ (బ్రెజిల్)పై విజయం సాధించాడు. ఆర్చరీలో చేజారిన కాంస్యం... భారత ఆర్చరీ మిక్స్డ్ జోడీ హర్విందర్–పూజ జత్యాన్ కాంస్య పతకం నెగ్గడంలో విఫలమైంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్విందర్ –పూజ 4–5తో స్లొవేనియాకు చెందిన జివా లావ్రింక్–ఫ్యాబ్‌సిక్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో మోనా అగర్వాల్30వ స్థానంలో, సిద్ధార్థ బాబు 22వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. మహిళల 100 మీటర్ల టి12 ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ సిమ్రన్ 12.11 సెకన్లలో రేసు పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో భారత ప్లేయర్ అశోక్ ఆరో స్థానంతో ముగించాడు. హరియాణాలోని సోనేపట్ ధరమ్వీర్ స్వస్థలం. సహచర కుర్రాళ్లతో కలిసి కాలువలోకి దూకి ఈత కొట్టే సమయంలో అతను లోతును సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో దిగువన ఉన్న రాళ్లను ఢీకొనడంతో శరీరానికి బాగా దెబ్బలు తగిలి పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. 25 ఏళ్ల వయసులో అతను పారా క్రీడల వైపు మళ్లాడు. రెండేళ్లు తిరిగే లోపే అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాడు. వరల్డ్ పారా చాంపియన్íÙప్లో కాంస్యం గెలిచిన ధరమ్వీర్ ఆసియా పారా క్రీడల్లో రెండు రజతాలు సాధించాడు. ప్రణవ్ సూర్మాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు విషాదం ఎదురైంది. అనుకోకుండా సిమెంట్ షీట్ అతనిపై పడటంతో వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఆరు నెలలు ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతను భవిష్యత్తులో నడవలేడని డాక్టర్లు తేల్చేశారు. ఆ తర్వాత పూర్తిగా వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. కామర్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన అతను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. మరోవైపు పారా క్రీడల వైపు ఆకర్షితుడై సాధన చేశాడు. ఈ ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతను వరల్డ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ కాగా ఐదుగురు సంతానంలో అతను ఒకడు. చిన్నప్పుడు తన అన్న జూడో పోటీల్లో పాల్గొనడం చూసి ఆకర్షితుడయ్యాడు. అయితే పొలంలో వాటర్ పంప్ వద్ద కరెంట్ షాక్‌కు గురై ఆరు నెలల పాటు అతను కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోలుకున్నా చూపు చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆరి్థక సమస్యలతో అతను, సోదరుడు కలిసి టీ స్టాల్ కూడా నడిపారు. పారాలింపిక్స్‌లో ‘విజన్ ఇంపెయిర్మెంట్’ కేటగిరీలోనే అతను పోటీ పడ్డాడు. -
Deepthi Jeevanji: గేలిచేస్తే గెలిచేసి...
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో మన వరంగల్ బిడ్డ దీప్తి జీవాన్జీ కాంస్యం సాధించింది. 400 మీటర్ల టి20 విభాగంలో ఆమె ఈ ఘనతను లిఖించింది. పారా ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో అయినా పతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు దీప్తే. ఊర్లో అందరూ వెక్కిరించినా హేళనతో బాధించినా వారందరికీ తన విజయాలతో సమాధానం చెబుతోంది దీప్తి. ఒకనాడు హేళన చేసిన వారు నేడు ఆమె పేరును గర్వంగా తలుస్తున్నారు.మొన్నటి మంగళవారం (సెప్టంబర్ 3) పారిస్ పారా ఒలింపిక్స్‌లో దీప్తి పరుగు తెలుగు వారికీ దేశానికి గొప్ప సంతోషాన్ని గర్వాన్ని ఇచ్చింది. 400 మీటర్ల టి20 (బుద్ధిమాంద్యం) విభాగంలో దీప్తి 55.52 సెకండ్లలో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ ΄ోటీలో మొదటి స్థానంలో ఉక్రెయిన్‌కి చెందిన యూలియా (55.16 సెకండ్లు), రెండవ స్థానంలో టర్కీకి చెందిన ఐసెల్ (55.23) సెకన్లు నిలిచారు. ఇంకొన్ని సెకన్లలో ఆమెకు స్వర్ణమే వచ్చేదైనా ఈ విజయం కూడా అసామాన్యమైనదే ఆమె నేపథ్యానికి.షూస్ లేని పాదాలుదీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లాలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. పుట్టుకతో దీప్తి బుద్ధిమాంద్యంతో ఉంది. ఆమె రూపం కూడా పూర్తిగా ఆకారం దాల్చలేదు. దాంతో స్కూల్లో చుట్టుపక్కల అన్నీ హేళనలే. మాటల్లో వ్యక్తపరచడం రాని దీప్తి అన్నింటినీ మౌనంగా సహించేది. కొందరు ‘కోతి’ అని వెక్కిరించేవారు. స్కూల్లో ఆమె ఆటల్లో చరుకుదనం చూపించేసరికి తల్లిదండ్రులు కనీసం ఈ రంగంలో అయినా ఆమెను ్ర΄ోత్సహిస్తే కొంత బాధ తగ్గుతుందని భావించారు. పిఇటీ టీచర్ బియాని వెంకటేశ్వర్లు ఆమెను ్ర΄ోత్సహించారు. హనుమకొండలో స్కూల్ లెవల్లో ఆమె పరుగు చూసి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ ్ర΄ోత్సహించాడు. రాష్ట్రస్థాయి ΄ోటీలకు హైదరాబాద్ రమ్మంటే షూస్ లేకుండా ఖాళీ పాదాలతో వచ్చిన దీప్తికి సహాయం అందించేందుకు నాగపురి రమేశ్ పూర్తి దృష్టి పెట్టాడు. దాంతో అంచలంచెలుగా ఎదిగిన దీప్తి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. పుల్లెల గోపిచంద్ కూడా ఆమె శిక్షణకు ఆర్థిక సహాయం అందించారు.బంగారు పరుగు2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. అదే సంవత్సరం బ్రిస్బే¯Œ ఆసియానియా ΄ోటీల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడిపతకం గెలిచింది. 400 మీటర్లను 57.58 సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మే 2024లో జపాన్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్‌లో ఏకంగా స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు పారిస్‌లో కాంస్యం సాధించడంతో ఆమె దేశ పతాకాన్ని తల ఎత్తుకునేలా చేసింది. ఒకప్పుడు గేలి చేసిన ఊరికి ఆమె పేరు ఇప్పుడు చిరునామాగా మారింది. -
‘టోక్యో’ను దాటేసి...
ఊహించినట్లుగానే భారత పారాలింపియన్లు గత విశ్వ క్రీడలకంటే మరింత మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటారు. 2020 టోక్యో కీడల్లో ఓవరాల్‌గా 19 పతకాలు గెలుచుకున్న మన బృందం ఇప్పుడు దానిని అధిగమించింది. బుధవారం పోటీలు ముగిసేసరికి భారత్ ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక హైజంప్‌లో శరద్ కుమార్, తంగవేలు మరియప్పన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా... ఆ తర్వాత జావెలిన్ త్రోలో ఇలాగే అజీత్ సింగ్, సుందర్ సింగ్ లకు వరుసగా రజత, కాంస్యాలు లభించాయి. దీంతో మన బృందం టోక్యో ప్రదర్శనను దాటగా... షాట్‌పుట్‌లో సచిన్ సాధించిన రజతంతో, ఆర్చరీలో హర్విందర్ సింగ్ గెలిచిన స్వర్ణంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. వరుసగా మూడో పారాలింపిక్స్‌లోనూ పతకం గెలిచిన తమిళనాడు ప్లేయర్ తంగవేలు ప్రదర్శన ఈ క్రీడల్లో హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్ క్రీడాంశంలో పతకాల పంట పండింది. ఇప్పటికే జట్టుకు ఇందులో 11 మెడల్స్ లభించాయి. పురుషుల హైజంప్ టి63 ఈవెంట్లో ఇద్దరు భారత ఆటగాళ్లు పోడియంపై నిలిచారు. 1.88 మీటర్ల ఎత్తుకు జంప్ చేసిన శరద్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సొంతం చేసుకున్నాడు. సీనియర్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు ఈ ఈవెంట్లోనే కాంస్యం దక్కింది. అతను 1.85 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. మరో భారత ప్లేయర్ శైలేష్ కుమార్‌కు నాలుగో స్థానం (1.85 మీటర్లు) దక్కింది. ఇద్దరి స్కోర్లూ సమానంగానే ఉన్నా... తక్కువసార్లు విఫలమైన తంగవేలుకు పతకం ఖరారైంది. ఈ పోటీలో ఎజ్రా ఫ్రెంచ్ (అమెరికా; 1.94 మీటర్లు) స్వర్ణ పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల జావెలిన్ త్రో ఎఫ్46 ఈవెంట్లో భారత అథ్లెట్ అజీత్ సింగ్ రజత పతకం సొంతం చేసుకున్నాడు.అతను తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేస్తూ జావెలిన్‌ను 65.62 మీటర్ల దూరం విసిరాడు. అతని తర్వాత మూడో స్థానంలో నిలిచి సుందర్ సింగ్ గుర్జర్ కాంస్యం గెలుచుకున్నాడు. సుందర్ విసిరిన జావెలిన్ 64.96 మీటర్లు వెళ్లింది. ఇందులో క్యూబాకు చెందిన గిలెర్మో గొంజాలెజ్ (66.14 మీటర్లు) స్వర్ణం గెలుచుకున్నాడు. హర్విందర్ ‘పసిడి’ గురి పురుషుల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో హర్విందర్ 6–0తో (28–24, 28–27, 29–25) లుకాస్ సిస్జెక్ (పోలాండ్)పై గెలుపొందాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో హరి్వందర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. సత్తా చాటిన సచిన్... పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో భారత ఆటగాడు సచిన్ ఖిలారి రజత పతకంతో మెరిశాడు. ఈ ఈవెంట్లో ప్రపంచ చాంపియన్ అయిన సచిన్ తన రెండో ప్రయత్నంలో ఇనుప గుండును అత్యుత్తమంగా 16.32 మీటర్లు విసిరాడు. స్కూల్లో చదివే రోజుల్లోనే జరిగిన ప్రమాదం తర్వాత నుంచి సచిన్ ఎడమచేయి పని చేయలేదు. పలు శస్త్రచికిత్సల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. 2015లో ఆటల్లోకి ప్రవేశించి ముందుగా జావెలిన్‌లో ప్రయత్నం చేసిన అతను ఆ తర్వాత షాట్పుట్కు మారాడు. గత ఆసియా పారా క్రీడల్లో అతను స్వర్ణం సాధించాడు. మెకానికల్ ఇంజినీర్ అయిన సచిన్ ప్రస్తుతం పలు విద్యా సంస్థల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. మరోవైపు టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. టోక్యోలో రజతం సాధించిన భవీనా ఈసారి క్వార్టర్స్‌లో 12–14, 9–11, 11–8, 6–11 స్కోరుతో యింగ్ జూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. షూటింగ్లో 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ (ఎస్‌హెచ్1)లో భారత ఆటగాళ్లు నిహాల్ సింగ్, రుద్రాంశ్ ఖండేల్వాల్ క్వాలిఫయింగ్‌లోనే విఫలమైన ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. -
తంగవేలు తీన్మార్
ఒకటి, రెండు, మూడు... అతని అడుగులు వేగంగా పడ్డాయి. ఎప్పటిలాగే ఒంటి కాలిపై వేగంగా ముందుకు దూసుకుపోయి చేసిన జంప్ మరో పారాలింపిక్ పతకాన్ని అందించింది. ఒకటి కాదు రెండు కాదు ఇది వరుసగా మూడో పారాలింపిక్ మెడల్... ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా 29 ఏళ్ల మరియప్పన్ తంగవేలు సగర్వంగా నిలిచాడు. హైజంప్‌లో ఎదురులేకుండా సాగిన అతను 2016 ‘రియో’లో స్వర్ణం, 2020 ‘టోక్యో’లో రజతం గెలవగా... 2024 ‘పారిస్’లో కాంస్యం దక్కింది. ఐదేళ్ల వయసులో అంగవైకల్యాన్ని ఎదుర్కొన్న రోజు నుంచి ఇప్పుడు పారా క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించే వరకు తంగవేలు సాగించిన ప్రస్థానం అసాధారణం, అందరికీ స్ఫూర్తిదాయం. పేదరికానికి చిరునామాలాంటి కుటుంబంలో జన్మించిన తంగవేలుకు అనూహ్యంగా ఎదురైన వైకల్యం కష్టాలతో పాటు అతనిలో పట్టుదలను కూడా పెంచింది. తమిళనాడు సేలం వద్ద ఒక చిన్న గ్రామం అతనిది. ఆరుగురు పిల్లల కుటుంబంలో అతనొకడు. తండ్రి పట్టించుకోకపోవడంతో తల్లి కూలీ పని, ఆపై కూరగాయలు అమ్మి తీవ్ర ఇబ్బందుల మధ్య పిల్లలను పెంచింది. అలాంటి స్థితిలో ఐదేళ్ల వయసులో స్కూల్‌కు వెళుతుండగా బస్సు ఢీకొనడంతో కుడికాలు కింది భాగాన్ని కోల్పోయాడు. శస్త్రచికిత్స తర్వాత కూడా దానిని ఏం చేయలేమని డాక్టర్లు తేల్చేశారు. కానీ స్కూల్ స్థాయిలో కూడా ఆ చిన్నారి ఎలాంటి బాధను తన దరిచేరనీయలేదు. తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్లో ఆ కాలుతోనే అన్ని క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధపడిపోయేవాడు. అన్ని సక్రమంగా ఉన్నవారితో మరీ పోటీ పడి గెలిచేవాడు కూడా. తాను ఎవరికంటే తక్కువ కాదనే భావనను ఇది కలిగించిందని అతను చెప్పుకునేవాడు. వేర్వేరు క్రీడలతో మొదలైనా పీఈటీ సర్ సూచన మేరకు హైజంప్‌ను అతను తన గేమ్‌గా మార్చుకున్నాడు. ఇదే జోరులో ఎక్కడ అవకాశం దొరికినా పోటీలో పాల్గొంటూ జాతీయ పారా క్రీడల వరకు తంగవేలు చేరుకున్నాడు. దివ్యాంగుల క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతో మేటి అయిన సత్యనారాయణ దృష్టిలో పడటం తంగవేలు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆయన శిక్షణలో అసలైన ప్రొఫెషనల్ తరహా కోచింగ్ తంగవేలుకు లభించింది. ఫలితంగా పారా క్రీడల్లో తంగవేలుకు వరుస విజయాలు దక్కాయి. ఈ క్రమంలో 2016 రియో పారాలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అతని గురించి ప్రపంచానికి తెలిసింది. ఇక ఆ తర్వాత ఒలింపిక్ పతకం, వరల్డ్ చాంపియన్íÙప్లో స్వర్ణాలు తంగవేలుకు పేరు తెచ్చిపెట్టాయి. క్రీడల్లో గుర్తింపు తెచ్చుకొని కొంత డబ్బు రాగానే అతను కుటుంబ కనీస అవసరాలపైనే దృష్టి పెట్టాడు. ముందుగా అమ్మ కోసం కొంత పొలం కొనడం, ఊర్లో సొంత ఇల్లు కట్టుకోవడంవంటివే చేశాడు. ‘అర్జున’... ‘పద్మశ్రీ’... ‘ఖేల్‌రత్న’ అవార్డుల తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌గా ఉద్యోగం కూడా దక్కడంతో తంగవేలు స్థిరపడ్డాడు. ఇప్పుడు మూడో ఒలింపిక్ పతకంతో పారా క్రీడల్లో శాశ్వత కీర్తిని అందుకున్నాడు.– సాక్షి క్రీడావిభాగం -
కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా... మా దీప్తి ’బంగారం’!
పారాలింపిక్స్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. సోమవారం ఏకంగా ఎనిమిది పతకాలతో భారత క్రీడాకారులు అదరగొట్టగా... మంగళవారం కాంస్యం రూపంలో ఒక పతకం లభించింది. మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 రేసులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజి కాంస్య పతకం సాధించింది. ప్రపంచ పారా చాంపియన్, పారా ఆసియా గేమ్స్ చాంపియన్ హోదాలో తొలిసారి పారాలింపిక్స్‌లో అడుగుపెట్టిన దీప్తి మూడో స్థానాన్ని సంపాదించింది. దీప్తి కాంస్యంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 16కు చేరుకుంది. మరిన్ని మెడల్ ఈవెంట్స్‌లో మన క్రీడాకారులు పోటీపడాల్సి ఉండటంతో ఈసారి భారత్ పతకాల సంఖ్య 20 దాటే అవకాశముంది. మూడేళ్ల క్రితం టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో 16వ పతకం చేరింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 400 మీటర్ల టి20 కేటగిరి ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జివాంజి కాంస్య పతకాన్ని సాధించింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో 20 ఏళ్ల దీప్తి 55.82 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. యూలియా షులియర్ (ఉక్రెయిన్; 55.16 సెకన్లు) స్వర్ణం సంపాదించగా... టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ (55.23 సెకన్ల) రజత పతకాన్ని గెల్చుకుంది. ఈ ఏడాది మేలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకం నెగ్గిన దీప్తి అదే ప్రదర్శనను ‘పారిస్’లో పునరావృతం చేయలేకపోయింది. ఒకవేళ ఇదే టైమింగ్‌ను దీప్తి ‘పారిస్’లో నమోదు చేసి ఉంటే ఆమెకు స్వర్ణ పతకం లభించేది. ఫైనల్ రేసు ఆరంభంలో చివరి వరకు రెండో స్థానంలో ఉన్న దీప్తి ఆఖరి పది మీటర్లలో వెనుకబడిపోయి మూడో స్థానంలో నిలిచింది. సోమవారం రాత్రి జరిగిన హీట్స్‌లో 54.96 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన టర్కీ అథ్లెట్ ఐసెల్ ఒండెర్ చివరి పది మీటర్లలో వేగంగా పరుగెత్తి దీప్తిని దాటేసి రజత పతకాన్ని ఖరారు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన మహిళల బ్యాడ్మింటన్ ఎస్‌హెచ్6 సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి నిత్యశ్రీ శివన్ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో నిత్యశ్రీ 21–14, 21–6తో రీనా మార్లిన్ (ఇండోనేసియా)పై గెలిచింది. మహిళల షాట్‌పుట్ ఎఫ్34 కేటగిరీలో భారత అథ్లెట్ భాగ్యశ్రీ జాధవ్ ఇనుప గుండును 7.28 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. అవనికి ఐదో స్థానం తన పారాలింపిక్స్ కెరీర్లో మూడో పతకం సాధించాలని ఆశించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్‌హెచ్1 ఈవెంట్ ఫైనల్లో 22 ఏళ్ల అవని ఐదో స్థానంలో నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని 420.6 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌లో అవని 1159 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ముగిసిన పూజ పోరు మహిళల ఆర్చరీ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్ పూజ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో పూజ 4–6 (28–23, 25–24, 27–28, 24–27, 24–27)తో వు చున్యాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు సెట్లు గెలిచిన పూజ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో సెట్లో స్కోరును సమం చేసినా పూజ సెమీఫైనల్‌కు చేరుకునేది. కానీ పూజ తడబడి మూడు సెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. తొలి రౌండ్లో పూజ 6–0 (27–24, 26–22, 272–6)తో యాగ్ముర్ (టరీ్క)పై నెగ్గింది.కల్లెడ నుంచి ‘పారిస్’ దాకా...పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న క్రీడాకారులు ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా లోని కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఇబ్బంది పెడుతుండగా... మరోవైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా గ్రామంలో హేళన చేసేవారు. ఇలాంటి తరుణంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ టోర్నీలో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన స్నేహితుడి ద్వారా రమేశ్‌కు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో ట్రెయినింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో దీప్తికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి దీప్తికి ఆర్థికంగా సహకారం అందించారు. కెరీర్ ఆరంభంలో దీప్తి అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆర్థిక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ స్వర్ణ ప్రదర్శనతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా చాంపియన్‌షిప్‌లో దీప్తి 55.07 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించి పారాలింపిక్స్‌లో మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ పతకం సాధించింది. -
పారిస్ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్
షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 (క్వాలిఫికేషన్): నిహాల్ సింగ్–రుద్రాన్‡్ష (మధ్యాహ్నం గం. 1:00 నుంచి)అథ్లెటిక్స్ పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 (పతక పోరు): యాసిర్, రోహిత్, సచిన్ (మధ్యాహ్నం గం. 1:35 నుంచి), మహిళల షాట్‌పుట్ ఎఫ్46 (పతక పోరు): అమిషా రావత్ (మధ్యాహ్నం గం. 3:17 నుంచి), పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (పతక పోరు): ధరమ్వీర్, ప్రణవ్, అమిత్ కుమార్ (రాత్రి గం. 10:50 నుంచి), మహిళల 100 మీటర్ల టి12 (హీట్): సిమ్రన్ (రాత్రి గం. 11:03 నుంచి)సైక్లింగ్ పురుషుల సి2 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక పోరు): అర్షద్ షేక్ (రాత్రి గం. 11:57 నుంచి), మహిళల సి1–3 వ్యక్తిగత రోడ్ టైమ్ ట్రయల్ (పతక పోరు): జ్యోతి గడేరియా (మధ్యాహ్నం గం. 12:32 నుంచి)పవర్ లిఫ్టింగ్ పురుషుల 49 కేజీలు (పతక పోరు): పరమ్‌జీత్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి), మహిళల 45 కేజీలు (పతక పోరు): సకీనా ఖాతూన్ (రాత్రి గం. 8:30 నుంచి)టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్ 4 (క్వార్టర్ ఫైనల్స్): భవీనా పటేల్ ్ఠ జో యింగ్ (చైనా) (మధ్యాహ్నం గం. 2:15 నుంచి)ఆర్చరీ పురుషుల రికర్వ్ (ప్రిక్వార్టర్ ఫైనల్): హర్విందర్ సింగ్ ్ఠ సెంగ్ లుంగ్ హుయి (చైనీస్ తైపీ) (సాయంత్రం గం 5:49 నుంచి) -
భళా శీతల్... నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు. మీరు దేశానికి, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అంటూ సోషల్ మీడియా వేదికగా శీతల్ దేవిని అభినందించారు. Extraordinary courage, commitment & a never-give-up spirit are not linked to medals…#SheetalDevi, you are a beacon of inspiration for the country—and the entire world.Almost a year ago, as a salute to your indomitable spirit, I had requested you to accept any car from our… pic.twitter.com/LDpaEOolxA— anand mahindra (@anandmahindra) September 2, 2024అలాగే ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టారు ఆనంద్ మహీంద్ర.కాగా పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో యువ పారా ఆర్చర్ శీతల్ దేవి ప్రిక్వార్టర్స్‌కు చేరి అరుదైన రికార్డు సాధించింది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో శీతల్ కాలి ఫీట్‌తో అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఆమె చేతులకు బదులుగా కాలితో విల్లు ఎక్కి పెట్టిన దృశ్యం వైరల్ గా మారింది. ప్రత్యర్థి వీల్ చైర్లోకూర్చుని చేతులతోనే బాణం వేసి పతకాన్ని కైవసం చేసుకోవడంతో తృటిలో పతకం చేజారింది. అయితే శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచంలో కొద్దిమందిగా ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో పిన్న వయసు ఆర్చర్‌గా శీతల్ గుర్తింపు తెచ్చుకుంది. దీంతో శీతల్ మున్ముందు అద్భుతాలు సాధిస్తుందంటూ పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు కొని యాడారు. -
రుబీనా అదుర్స్
పారిస్ పారాలింపిక్స్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు మన గన్ గర్జించడంతో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో భారత పారా షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యంతో సత్తా చాటింది. చెదరని గురితో పోడియంపై చోటు దక్కించుకుంది. ఇతర క్రీడల్లోనూ శనివారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో నితీశ్ కుమార్, సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలకు చేరువయ్యారు. పారిస్: పారాలింపిక్స్‌లో భారత షూటర్లు పతకాలతో అదరగొడుతున్నారు. శుక్రవారం రైఫిల్ విభాగంలో అవనీ లేఖరా, మోనా అగర్వాల్ పతకాలతో సత్తా చాటితే... శనివారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో మెరిసింది. ఈ విభాగంలో పారాలింపిక్స్ పతకం నెగ్గిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. తుదిపోరులో 25 ఏళ్ల రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పతకం ఖాతాలో వేసుకుంది. వైల్డ్‌కార్డ్ ద్వారా పారిస్ పారాలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. ఇరాన్ షూటర్ జవాన్మార్డీ సారా 236.8 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. సారాకు ఇది వరుసగా మూడో పారాలింపిక్ పసిడి కావడం విశేషం. అజ్గాన్ అయ్సెల్ (టర్కీ) 231.1 పాయింట్లతో రజత పతకం గెలుచుకుంది. స్థిరమైన గురితో సత్తాచాటిన రుబీనా... క్వాలిఫయింగ్ రౌండ్ కంటే ఎంతో మెరుగైన ప్రదర్శన చేసి పోడియంపై నిలిచింది. తుది పోరులో తొలి పది షాట్ల తర్వాత రుబీనా 97.6 పాయింట్లతో నిలిచింది. 14 షాట్ల తర్వాత నాలుగో స్థానంలో ఉన్న రుబీనా తదుపరి రెండు షాట్లలో మెరుగైన ప్రదర్శన చేసి మూడో స్థానానికి చేరింది. కాంస్యం గెలిచిన రుబీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందించారు. గొప్ప సంకల్పం, అసాధారణమైన గురితో పతకం సాధించిన రుబీనా దేశాన్ని గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. గగన్ నారంగ్ స్ఫూర్తితో.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన మెకానిక్ కూతురైన రుబీనా... పుట్టుకతోనే కుడి కాలు లోపంతో జన్మించింది. తండ్రి స్నేహితుల ప్రోద్బలంతో షూటింగ్ కెరీర్ ప్రారంభించిన రుబీనా... ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. జబల్పూర్ అకాడమీలో షూటింగ్ ఓనమాలు నేర్చుకున్న ఫ్రాన్సిస్... ఒలింపిక్ పతక విజేత, హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ ఘనతలు చూసి షూటింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుంది. కెరీర్ ఆరంభంలో షూటింగ్ రేంజ్‌కు వెళ్లేందుకు కూడా డబ్బులు లేని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రుబీనా... అకుంఠిత దీక్షతో ముందుకు సాగి 2017లో గగన్ నారంగ్ అకాడమీ ‘గన్ ఫర్ గ్లోరీ’లో అడుగుపెట్టిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు స్కోరుతో బరిలోకి దిగి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. బ్యాడ్మింటన్ సెమీస్‌లో నితీశ్, సుకాంత్ పారిస్ పారాలింపిక్స్‌లో భారత షట్లర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితీశ్ కుమార్, ఎస్ఎల్4లో సుకాంత్ కదమ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి అడుగు దూరంలో నిలిచారు. శనివారం క్వార్టర్ ఫైనల్లో నితీశ్ 21–13, 21–14తో మాంగ్ఖాన్ బున్సన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించి గ్రూప్ ‘ఎ’లో టాప్ ప్లేస్ దక్కించుకొని సెమీస్‌కు చేరాడు. గ్రూప్ నుంచి రెండో స్థానంలోనిలిచిన బున్సన్ కూడా సెమీస్‌కు చేరాడు. ఎస్ఎల్4 క్లాస్‌లో సుకాంత్ 21–12, 21–12తో టిమార్రోమ్ సిరిపాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3లో సుహాస్ యతిరాజ్–పాలక్ కోహ్లీ జంట 11–21, 17–21తో హిక్మత్–లియాని రాట్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో నితీశ్ కుమార్–తులసిమతి ద్వయం కూడా పరాజయం పాలైంది. క్వార్టర్ ఫైనల్లో సరిత ఓటమి భారత పారా ఆర్చర్ సరితా కుమారి క్వార్టర్ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం మహిళల కాంపౌండ్ క్వార్టర్స్‌లో సరిత 140–145తో టాప్ సీడ్ ఓజు్నర్ కూర్ గిర్డి (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ఎలిమినేషన్ రెండో రౌండ్లో సరిత 141–135తో ఎలెనోరా సార్టీ (ఇటలీ)పై గెలిచింది. తొలి రౌండ్లో సరిత 138–124తో నూర్ అబ్దుల్ జలీల్ (మలేసియా)పై గెలిచింది. మరోమ్యాచ్‌లో భారత ఆర్చర్, రెండో సీడ్ శీతల్ దేవి 137–138తోమిరియానా జునీగా (చిలీ)పై చేతిలో ఓడింది. రోయింగ్ రెపిచాజ్లో మూడో స్థానం రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె జంట రెపిచాజ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచి ఫైనల్ ‘బి’లో అడుగుపెట్టింది. శనివారం పోటీలో ఈ జంట 7 నిమిషాల 54.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఉక్రెయిన్ (7 నిమిషాల 29.24 సెకన్లు), బ్రిటన్ (7 నిమిషాల 20.53 సెకన్లు) జోడీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఫైనల్ ‘బి’లోని రోవర్లు 7 నుంచి 12వ స్థానం కోసం పోటీపడనున్నారు. సైక్లింగ్‌లో నిరాశ పారిస్ పారాలింపిక్స్‌లో భారత సైక్లిస్ట్‌లకు నిరాశ ఎదురైంది. అర్షద్ షేక్, జ్యోతి గడేరియా తమతమ విభాగాల్లో ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగారు. పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 విభాగంలో బరిలోకి దిగిన అర్షద్ శనివారం క్వాలిఫయింగ్ రౌండ్లో చివరి స్థానంతో రేసును ముగించాడు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ పోటీలో అర్షద్ 1 నిమిషం 21.416 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. మహిళల 500 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి గడేరియా 49.233 సెకన్లలో లక్ష్యాన్ని చేరి చివరి స్థానంలో నిలిచింది. -
పారిస్ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్
రోయింగ్ మిక్స్డ్ పీఆర్3 డబుల్ స్కల్స్ (ఫైనల్ ‘బి’): భారత్ (అనిత, నారాయణ కొంగనపల్లె) (మధ్యాహ్నం గం. 2:00 నుంచి) షూటింగ్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రొన్ ఎస్‌హెచ్1 (క్వాలిఫికేషన్): భారత్ (సిద్ధార్థ బాబు–అవని లేఖరా) (మధ్యాహ్నం గం. 1:00 నుంచి), మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్2 (క్వాలిఫికేషన్): శ్రీహర్ష (మధ్యాహ్నం గం. 3:00 నుంచి) ఆర్చరీ పురుషుల కాంపౌండ్ (క్వార్టర్ ఫైనల్): రాకేశ్ కుమార్ X కేన్ స్వగుమిలాంగ్ (ఇండోనేసియా) (రాత్రి గం. 7:17 నుంచి)బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 (సెమీఫైనల్): నితీశ్ కుమార్ X ఫుజిహరా (జపాన్) (రాత్రి గం. 8:10 నుంచి)టేబుట్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్ 4 (ప్రిక్వార్టర్‌ఫైనల్): భవీనా పటేల్ X మార్థా వర్డిన్ (మెక్సికో) (రాత్రి గం. 9:15 నుంచి), మహిళల సింగిల్స్ క్లాస్ 3 (ప్రిక్వార్టర్‌ఫైనల్): సోనాల్‌బెన్ పటేల్ X అన్డెలా విన్సెటిచ్ (క్రొయేíÙయా) (అర్ధరాత్రి గం. 12:15 నుంచి)అథ్లెటిక్స్మహిళల 1500 మీటర్ల టి11 (హీట్): రక్షిత రాజు (మధ్యాహ్నం గం. 1:57 నుంచి), పురుషుల షాట్ పుట్ ఎఫ్40 (పతక పోరు): రవి రంగోలీ (మధ్యాహ్నం గం. 3:12 నుంచి), పురుషుల హై జంప్ టీ47 (పతక పోరు): నిషాద్ కుమార్, రామ్‌పాల్ (రాత్రి గం. 10:40 నుంచి), మహిళల 200 మీటర్లు టి35 (పతక పోరు): ప్రీతి పాల్ (రాత్రి గం. 11:27 నుంచి) -
అవని అద్వితీయం
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్లో మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. వీటితో పాటు పురుషుల షూటింగ్లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్‌లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్‌హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్‌లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు. టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కూడా అవని తలపడనుంది. మనీశ్ నర్వాల్‌కు రజతం... పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు. మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది. కంచు మోగించిన ప్రీతి పాల్... పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్. సెమీస్‌లో సుహాస్, నితీశ్... పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు. 2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్ మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు. -
పారిస్ పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్
షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 (క్వాలిఫికేషన్): స్వరూప్ (మధ్యాహ్నం గం. 1:00 నుంచి), మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్మెచ్1 (క్వాలిఫికేషన్): రుబీనా (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).ట్రాక్ సైక్లింగ్ మహిళల 500 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 (క్వాలిఫయింగ్): జ్యోతి (మ. గం. 1:30 నుంచి). పురుషుల 1000 మీటర్ల టైమ్ ట్రయల్ సీ1–3 (క్వాలిఫయింగ్) అర్షద్ షేక్ (మధ్యాహ్నం గం. 1:49 నుంచి). ఆర్చరీ మహిళల కాంపౌండ్ (ఎలిమినేషన్): సరితా దేవి X ఎలెనోరా సార్టీ (ఇటలీ) (రాత్రి గం. 7:00 నుంచి), మహిళల కాంపౌండ్ (ఎలిమినేషన్): శీతల్ దేవి – మిరియానా జునీగా (చిలీ) (రాత్రి గం. 8:59 నుంచి). అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్57 (పతక పోరు): ప్రవీణ్ కుమార్ (రాత్రి గం. 10:30 నుంచి). -
Rakshitha: కాళ్లే కళ్లయ్యి..
కళ్లు మూసుకొని నాలుగడుగులు వేయలేము. కళ్లు కనపడకుండా పరిగెత్తగలమా? ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు తేలేని బంగారు పతకం మన దివ్యాంగ క్రీడాకారులు తెస్తారని ఆశ. కర్ణాటకకు చెందిన అంధ అథ్లెట్ రక్షిత రాజు 1500 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న తొలి భారతీయ పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించనుంది. పతకం తెస్తే అది మరో చరిత్ర. రక్షిత రాజు పరిచయం.అక్టోబర్ 26, 2023.రక్షిత రాజుకు ఆనందబాష్పాలు చిప్పిల్లుతున్నాయి. కన్నీరు కూడా ఉబుకుతోంది. ఆమె హాంగ్జావు (చైనా) పారా ఆసియా గేమ్స్‌లో 1500 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. చాలా పెద్ద విజయం ఇది. ఈ విషయాన్ని ఆమె తన అమ్మమ్మతో పంచుకోవాలనుకుంటోంది. కాని పంచుకోలేక΄ోతోంది. కారణం? అమ్మమ్మకు వినపడదు. చెవుడు. మాట్లాడలేదు. మూగ. కాని ఆ అమ్మమ్మే రక్షితను పెంచి పెద్ద చేసింది. ఆమె వెనుక కొండలా నిలుచుంది. ఆ ఘట్టం బహుశా ఏ సినిమా కథకూ తక్కువ కాదు. నిజజీవితాలు కల్పన కంటే కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి.ఊరు వదిలేసింది..కర్నాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని చిన్న పల్లెకు చెందిన రక్షిత రాజు పుట్టుకతోనే అంధురాలు. ఆమెకు నాలుగు సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు మరణించారు. దాంతో ఊరంతా రక్షితను, ఆమె చిన్నారి తమ్ముణ్ణి నిరాకరించారు. చూసేవాళ్లు ఎవరూ లేరు. అప్పుడు రక్షిత అమ్మమ్మ వచ్చి పిల్లలను దగ్గరకు తీసుకుంది. ఆమె స్వయంగా చెవుడు, మూగ లోపాలతో బాధ పడుతున్నా మనవళ్ల కోసం గట్టిగా నిలుచుంది. మనవరాలిని చిక్‌బళ్లాపూర్‌లో అంధుల కోసం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ స్కూల్లో చదివించింది. అక్కడి హాస్టల్లో ఉంటూ అప్పుడప్పుడు అమ్మమ్మ వచ్చి పలుకరిస్తే ధైర్యం తెచ్చుకునేది. అంధత్వం వల్ల భవిష్యత్తు ఏమీ అర్థం అయ్యేది కాదు. దిగులుగా ఉండేది.వెలుతురు తెచ్చిన పరుగు..ఆశా కిరణ్ స్కూల్లో మంజన్న అనే పీఈటీ సారు రక్షిత బాగా పరిగెత్తగలదని గమనించి ఆమెను ఆటల్లో పెట్టాడు. స్కూల్లో ఉన్న ట్రాక్ మీద పరిగెట్టడం ్రపాక్టీసు చేయించాడు. జైపూర్‌లో పారా గేమ్స్ జరిగితే తీసుకెళ్లి వాటిలో పాల్గొనేలా చేశాడు. అక్కడే రాహుల్ అనే కర్ణాటక అథ్లెట్ దృష్టి రక్షిత మీద పడింది. ఈమెను నేను ట్రెయిన్ చేస్తాను అని చెప్పి ఆమె బాధ్యత తీసుకున్నాడు. అప్పటివరకూ సింథెటిక్ ట్రాక్ అంటేనే ఏమిటో రక్షితకు తెలియదు. రాహుల్ మెల్లమెల్లగా ఆమెకు తర్ఫీదు ఇచ్చి అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెట్‌గా తీర్చిదిద్దాడు.గైడ్ రన్నర్ సాయంతో..అంధ అథ్లెట్లు ట్రాక్ మీద మరో రన్నర్ చేతిని తమ చేతితో ముడేసుకుని పరిగెడతారు. ఇలా తోడు పరిగెత్తేవారిని ‘గైడ్ రన్నర్‘అంటారు. అంతర్జాతీయ ΄ోటీల్లో రాహులే స్వయంగా ఆమెకు గైడ్ రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. హాంగ్జావులో 1500 మీటర్లను రక్షిత 5 నిమిషాల 21 సెకన్లలో ముగించింది. ‘చైనా, కిర్గిజ్స్తాన్ నుంచి గట్టి ΄ోటీదారులు వచ్చినా నేను గెలిచాను. పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించగలననే ఆత్మవిశ్వాసం కలిగింది’ అంటుంది రక్షిత.అదే సవాలు..అంధులు పరిగెత్తడం పెద్ద సవాలు. వారు గైడ్ రన్నర్ సాయంతోనే పరిగెత్తాలి. ‘మాతోపాటు ఎవరైనా పరిగెత్తొచ్చు అనుకుంటారు. కాని గైడ్ రన్నర్లకు, మాకు సమన్వయం ఉండాలి. మమ్మల్ని పరిగెత్తిస్తూ వారూ పరిగెత్తాలి. ఎంతోమంది ప్రతిభావంతులైన అంధ రన్నర్లు ఉన్నా గైడ్ రన్నర్లు దొరకడం చాలా కష్టంగా ఉంటోంది. ఒకప్పుడు నా కళ్ల ఎదుట అంతా చీకటే ఉండేది. ఇప్పుడు పరుగు నాకు ఒక వెలుతురునిచ్చింది. పారిస్‌లో స్వర్ణం సాధించి తిరిగి వస్తాను’ అంటోంది రక్షిత. -
పారిస్ మళ్లీ మురిసె...
పారిస్: మొన్న రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఎంత వైభవంగా ఆరంభించారో... దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్‌ను కూడా అంతే అట్టహాసంగా అంగరంగ వైభంగా ప్రారంభించారు. దీంతో మరోసారి పారిస్ కలలు, కళాకారులు, నృత్యరీతులు, పాప్ గీతాలతో విశ్వక్రీడల శోభకు వినూత్న ‘షో’కులద్దింది. కనుల్ని కట్టిపడేసే వేడుకలు ఆద్యంతం అలరించాయి. పలు ఆటపాటలు, కళాకారుల విన్యాసాల అనంతరం ఫ్రాన్స్ జెండాలోని మూడు రంగుల్ని ఆరు ఫ్లయిట్లు ఆకాశానికి పూసినట్లుగా చేసిన ఎయిర్ షో వీక్షకుల్ని విశేషంగా కట్టిపడేసింది. ఆ వెంటే మార్చ్‌పాస్ట్ మొదలైంది. ఒలింపిక్స్ ప్రారంబోత్సవంలో పడవలపై మార్ప్పాస్ట్ సాగితే... పారాలింపిక్స్ మార్చ్‌పాస్ట్ పారిస్ రహదారిపై కేరింతగా రెగ్యులర్ ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగింది. రేపటి నుంచి పోటీలు జరుగుతాయి. 11 రోజుల పాటు జరిగే పారా విశ్వక్రీడల్లో 4000 మందికి పైగా దివ్యాంగ అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో పోటీపడతారు. రెగ్యులర్ ఒలింపిక్స్‌ను ఆదరించినట్లుగానే ఈ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారని నిర్వాహకులు తెలిపారు. 2 మిలియన్ల (20 లక్షలు)కు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవడమే ఆదరణకు నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపీసీ) అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ మాట్లాడుతూ మరోమారు పారిస్‌ను ప్రేక్షకుల సమూహం ముంచెత్తనుందన్నారు. మూడేళ్ల క్రితం టోక్యోలో కోవిడ్ మహమ్మారి కారణంగా పారా అథ్లెట్లంతా ఖాళీ స్టాండ్ల (ప్రేక్షకులు లేక) ముందు తమ ప్రదర్శన కనబరిచారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదని క్రీడాభిమానుల కరతాళధ్వనుల మధ్య పారాలింపియన్లు పోటీలను పూర్తిచేస్తారని నిర్వాహకులు చెప్పారు. గురువారం ముందుగా తైక్వాండోలో పారాలింపియన్లు పతకాల బోణీ కొట్టనున్నారు. దీంతో పాటు పోటీల తొలిరోజు టేబుల్ టెన్నిస్, ట్రాక్ సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. -
ఈఫిల్ టవర్‌పైకి ఆగంతకుడు
పారిస్: ఒలింపిక్ క్రీడల ముగింపు ముంగిట్లో ఆదివారం ఓ వ్యక్తి పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌పైకి ఎక్కడం కలకలం రేపింది. 330 మీటర్ల ఎత్తున్న టవర్‌పై అతను రెండో సెక్షన్ వద్ద ఉండగా సిబ్బంది గమనించారు. దాంతో పర్యాటకులను ఖాళీ చేయించారు. అతన్ని కిందికి దించి అరెస్ట్ చేశారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ముగింపు వేడుకలకు మరో వేదికను నిర్ణయించడం తెలిసిందే. వీటికోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !
పారిస్ ఒలింపిక్స్‌లో అసమానతలు ధిక్కరించిన అథ్లెట్లలో అజర్బైజాన్ ఆర్చర్ యైలగుల్ రమజనోవా ఒకరు. 35 ఏళ్ల ఈ ఆర్చర్ ఆరు నెలల నిండు గర్భిణి. ప్రతిష్టాత్మకమైన పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని, మాతృత్వం రెండింటిని ప్రదర్శించి అందరిచే ప్రశంసలందుకుంది. బేబీ బంప్ ఉన్నప్పటికీ ప్రతి షాట్‌ని ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ప్రదర్శించింది. హృదయాన్ని కదిలించే ఆమె గాథ ఏంటో సవివరంగా చూద్దామా..!చరిత్రలో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెండవ ఆర్చర్ యైలగుల్ రమజనోవా . రియో 2016లో ఓల్కా సెన్యుక్ తర్వాత అజర్‌బైజాన్‌కు తొలిసారిగా ప్రాతినిధ్య వహించిన రెండో ఆర్చర్ ఈ 34 ఏళ్ల రమజనోవా. ఆమె మహిళల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్లో పాల్గొంది. ఆమె ఎలిమినేషన్ రౌండ్ 1/32లో 28వ ర్యాంక్ చైనీస్ ఆర్చర్ ఆన్ క్విక్సువాన్ను ఓడించింది. అయితే ఆ తర్వాత 1/16 రౌండ్లో జర్మనీకి చెందని మిచెల్ క్రోపెన్ చేతిలో నిష్క్రమించింది. గర్భవతిగా ఉన్న ఒలింపియన్‌గా తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో పర్ఫెక్ట్ 10 షూట్ చేయడానికి ముందు తన బేబీ కిక్‌ను అనుభవించిన అనుభవాన్ని వివరించింది. "నేను ఈ చివరి బాణాన్ని వేసే ముందు నా బిడ్డ నన్ను తన్నినట్లు నేను భావించాను, ఆపై నేను 10 షూట్స్ ప్రదర్శించాను. అలాగే ఈ ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో నా గర్భంతో నేను అసౌకర్యంగా భావించలేదు. బదులుగా, నేను ఒంటరిగా పోరాడడం లేదని, నా బిడ్డతో కలిసి పోరాడుతున్నానని నాకు అనిపించింది… నా పిల్లవాడికి లేదా ఆమెకు ఆసక్తి ఉంటే నేను విలువిద్య నేర్పిస్తాను, ” అని రమజనోవా ఇన్‌స్టాగ్రాంలో రాసింది. 127వ ర్యాంక్‌లో ఉన్న రమజనోవా ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో పాల్లొన్న తొలి గర్భిణీ క్రీడాకారిణి కాదు. ఈజిప్టుకు చెందిన 26 ఏళ్ల ఫెన్సర్ నాడా హఫీజ్ కూడా ఏడు నెలల గర్భవతిగా పోటీ పడింది. మహిళల సాబర్ పోటీలో హఫీజ్ తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో యూఎస్ఏకి చెందిన మాజీ ఎన్సీఏఏ ఛాంపియన్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీని ఓడించింది. ఇక్కడ ఈ అద్భుతమైన మహిళలు తమ పుట్టబోయే పిల్లలను మోస్తూనే అత్యున్నత స్థాయిలో పోటీ చేసి అంచనాలను ధిక్కరించి, మాతృత్వపు బలాన్ని ప్రదర్శించారు. గర్భవతులుగా ఒలింపిక్స్‌లో పోటీ పడి స్ఫూర్తిగా నిలవడమేగాక ఈ మహిళలు సంకల్పం, సామర్థ్యానికి హద్దులు లేవని ప్రపంచానికి చాటిచెప్పారు.(చదవండి: ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!) -
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంపై ట్రంప్ విమర్శలు
వాషింగ్టన్: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా అవమానకరంగా జరిగాయని విమర్శించారు. ప్రముఖ చిత్రకారుడు లియొనార్డో డావిన్సీ గీసిన ‘లాస్ట్ సప్పర్’ పెయింట్ స్ఫూర్తితో చేసిన ప్రదర్శన ఓ వర్గం విశ్వాసాలను కించపర్చేటట్లు ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించే ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం ఏ మతాచారాలను ఉద్దేశించి ఆ ప్రదర్శన చేయలేదని వివరణ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చాలా ఓపెన్‌గా మాట్లాడే మనస్తత్వం నాది. ఏదిఏమైనా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలోని కార్యక్రమాలు అవమానకంగా ఉన్నాయి’’ అని అన్నారు.Trump on the Olympics: "I thought that the opening ceremony was a disgrace, actually." pic.twitter.com/TMv7qYlf0G— Aaron Rupar (@atrupar) July 30, 2024 ట్రంప్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌ను ఎలా నిర్వహిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ప్రారంభోత్సంలోని ‘లాస్ట్ సప్పర్’ వంటి కార్యక్రమాన్ని మాత్రం చేయమని అన్నారు. పారిస్ ప్రారంభోత్సవంలో లాస్ట్ సప్పర్‌ను గుర్తుచేసే విధంగా కనిపించిన నృత్యకారులు, డ్రాగ్ క్వీన్స్, డీజే భంగిమలలో కూడిన సన్నివేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా చేసిన ట్రంప్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. -
రామ్ చరణ్‌తో పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్‌లో అరుదైన దృశ్యం!
పారిస్ ఒలింపిక్స్‌లో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. గేమ్స్ ప్రారంభానికి ముందే పారిస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారతో పాటు బయలుదేరి వెళ్లారు. ప్రారంభ వేడుకల్లోనూ ఒలింపిక్ జ్యోతి పట్టుకుని చిరంజీవి, సురేఖ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.తాజాగా పారిస్ వీధుల్లో రామ్ చరణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కలిసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారిద్దరూ సరదాగా ముచ్చటిస్తున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. అనుకోకుండా రామ్ చరణ్, సింధు కలుసుకోవడం చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చెర్రీ పెట్ డాగ్ రైమ్ గురించి సింధు ఆరాతీస్తూ కనిపించింది. ఎక్కడికెళ్లినా రైమ్‌ను తీసుకెళ్తారా? అంటూ రామ్ చరణ్ అడిగింది. సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాగా.. పీవీ సింధు ఇవాళ తన తొలి విజయాన్ని నమోదు చేసింది. View this post on Instagram A post shared by Rhyme Konidela (@alwaysrhyme) -
పారిస్‌లో స్టార్స్
సాక్షి, హైదరాబాద్: పారిస్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన 2024 ఒలింపిక్ పోటీలకు దేశం నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పోటీలను తిలకిచడానికి నగరం నుంచి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా పారిస్ వెళ్లారు. కుటుంబ సభ్యులు సురేఖ, రామ్‌చరణ్, ఉపాసనతో పాటు మనుమరాలు క్లీంకారతో తీసుకున్న ఫొటోలను సోషల్ యాప్‌లో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ సుధారెడ్డి కూడా పారిస్ ఒలింపిక్స్‌లో మెరిశారు. అయితే 117 మందితో కూడిన భారత ఒలింపిక్ క్రీడాకారుల బృందంలో నగరం నుంచి నలుగురు మహిళా అథ్లెట్లు పాల్గొంటున్నారు. అంతేకాకుండా భారత జాతీయ ఫ్లాగ్ బేరర్‌గా తెలుగమ్మాయి పీవీ సింధూ నాయకత్వం వహించడం విశేషం. జాతీయ జెండా రంగులతో రూపొందించిన చీరతో పీవీ సింధూ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
Paris Olympics 2024: దిగ్గజాల సమక్షంలో...
‘మీ గెలుపే మా గెలుపు... మీ ఓటమే మా ఓటమి... వచ్చే రెండు వారాల పాటు మీ భావోద్వేగాల్లో మేమూ భాగం... మేమందరం మీ వైపే’... పారిస్ క్రీడల అధ్యక్షుడు, మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణపతక విజేత టోనీ ఎస్టాన్గెట్ ఒలింపిక్ క్రీడల విశిష్టత గురించి ఇచ్చిన సందేశంతో ఒలింపిక్స్‌కు తెర లేచింది. శుక్రవారం భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రారంబోత్సవ కార్యక్రమాలు సుదీర్ఘ సమయం పాటు సాగాయి. సెన్ నదిపై జరిగిన బోట్ పరేడ్‌లో అందరికంటే చివరగా ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు వచి్చనప్పుడు నదీ తీరమంతా స్థానిక అభిమానుల కేరింతలతో హోరెత్తింది.స్విమ్మర్ ఫ్లారెంట్ మనాడు, డిస్కర్ త్రోయర్ మెలినా రాబర్ట్ మికాన్ ఆ దేశపు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. అంతకుముందు గత ఒలింపిక్స్ నిర్వహించిన జపాన్, 2028 ఒలింపిక్స్ జరిగే అమెరికా జట్లు వచ్చాయి. టెన్నిస్ స్టార్ కోకో గాఫ్, బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ యూఎస్ పతాకధారులుగా వ్యవహరించారు. ఆ తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పతాకంతో ఒక గుర్రంపై ‘మెటల్ ఉమన్’ కూర్చొని సెన్ నదిపై దూసుకుపోగా... ఆ వెంటనే ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అన్ని దేశాల జాతీయ పతాకాలతో పరేడ్ సాగింది. ఆ సమయంలో నేపథ్యంలో ఒలింపిక్ గీతాన్ని వినిపించారు. జ్యోతి వెలిగింది... ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ ముందుగా ప్రసంగిస్తూ... ఆధునిక ఒలింపిక్ క్రీడల సృష్టికర్త అయిన పియరీ డి క్యూబర్టీన్ జన్మస్థలంలో ఈ క్రీడల నిర్వహణ తమకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ ఒలింపిక్ క్రీడలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులందరి తరఫున ఫ్రాన్స్ ఫ్లాగ్‌బేరర్లు ఫ్లారెంట్ మనాడు, మెలినా రాబర్ట్ మికాన్ ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత అసలైన మరో ఘట్టం మొదలైంది. కార్యక్రమం ఆరంభమైన దగ్గరి నుంచి ముఖానికి ముసుగులో ఒలింపిక్ టార్చ్‌తో కనిపించిన వ్యక్తి ఎట్టకేలకు దానిని తీసుకొచ్చి ఫ్రాన్స్ ఫుట్‌బాల్ గ్రేట్ జినెదిన్ జిదాన్ చేతిలో పెట్టగా... జిదాన్ దానిని టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్కు అందించాడు. స్పెయిన్‌కు చెందినవాడే అయినా రోలాండ్ గారోస్‌లో 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గి ఈ మట్టితో ప్రత్యేక అనుబంధం ఉండటంతో నిర్వాహకులు నాదల్‌ను సముచితంగా గౌరవించారు. ఆ వెంటనే మెరుపులు, బాణాసంచాతో ఈఫిల్ టవర్‌పై ఐదు ఒలింపిక్స్ రింగ్స్ ప్రదర్శించడంతో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 9 ఒలింపిక్ స్వర్ణాల విజేత కార్ల్ లూయిస్, నాలుగు స్వర్ణాలు సాధించిన సెరెనా విలియమ్స్, రొమేనియా జిమ్నాస్టిక్స్ దిగ్గజం నాదియా కొమనెసి వేదికపై నాదల్కు జత కలిశారు. జ్యోతి ఆ తర్వాత ఫ్రెంచ్ మాజీ టెన్నిస్ ప్లేయర్, ఈ ఒలింపిక్స్ డైరెక్టర్ అమెలీ మౌరెస్మో వద్దకు వెళ్లి ఆ తర్వాత బాస్కెట్‌బాల్ స్టార్ టోనీ పార్కర్ వద్దకు చేరింది. చివరగా ఫ్రాన్స్ జూడో ప్లేయర్ టెడ్డీ రైనర్, అథ్లెట్ మేరీ జోస్ పెరెక్ టార్చ్‌ను అందుకున్నారు. ప్రస్తుత, మాజీ ఒలింపియన్లు, పారాలింపియన్లు కలిపి మొత్తం 18 మంది సమక్షంలో చివరగా రైనర్, పెరెక్ జ్యోతిని వెలిగించడంతో లాంఛనంగా పారిస్ 2024 ఆటలకు నగారా మోగింది. కార్యక్రమం సాగినంత సేపూ స్వల్పంగా చినుకులు కురిసినా... దాని వల్ల ఎలాంటి ఆటంకం కలగలేదు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఆ«దీనంలోని ‘తహితి’లో ఒలింపిక్స్‌కు సంబంధించిన సర్ఫింగ్ పోటీలు జరుగుతాయి. ఈ దీవి పసిఫిక్ మహా సముద్రంలో ఆ్రస్టేలియాకు దగ్గరగా, ఫ్రాన్స్‌కు దాదాపు 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. పారిస్‌లో ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఇక్కడ కూడా ఘనంగా ఉత్సవం నిర్వహించడం విశేషం. రోదసిలో ఒలింపిక్ జ్యోతి... ఒకవైపు పారిస్‌లో వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరోవైపు రోదసిలో కూడా ఒలింపిక్స్ సంబరం కనిపించింది. ప్రతిష్టాత్మక సంస్థ ‘నాసా’ దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో భాగంగా ఉన్న సునీతా విలియమ్స్, మరో ఐదుగురు ఆస్ట్రోనాట్లు కలిసి ఒలింపిక్ క్రీడలను అనుకరించి తమ సంఘీభావాన్ని ప్రదర్శించారు. ఒక్కో క్రీడాంశాన్ని గుర్తుకు తెచ్చేలా వారంతా విన్యాసాలు చేశారు. ఒలింపిక్ జ్యోతిని పోలిన నమూనా జ్యోతిని కూడా ఒకరినుంచి మరొకరు అందుకుంటూ క్రీడల పట్ల తమ అభిమానాన్ని ప్రదర్శించారు. పెళ్లి ఉంగరం నీటిపాలు... ప్రారంబోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఇటలీ హైజంపర్, టోక్యో స్వర్ణపతక విజేత గియాన్‌మార్కో టాంబెరి కొద్దిసేపటి తర్వాత తీవ్ర నిరాశలో మునగాల్సి వచ్చింది. ఇటలీ ఫ్లాగ్‌బేరర్ కూడా అయిన గియాన్‌మార్కో పెళ్లి ఉంగరం సెన్ నదిలో పడిపోయింది. అయితే ఒకవైపు దీనికి తన భార్యకు క్షమాపణలు చెబుతూనే అతను రాసిన వాక్యాలు హృద్యంగా, ఆసక్తికరంగా అందరి మనసులను గెలుచుకోవడం విశేషం. ‘నా పెళ్లి ఉంగరం సెన్ నదిలో పడిపోవడం బాధాకరమే అయినా అది కోల్పోవడానికి ఇంతకంటే మంచి చోటు లభించదు. ప్రేమకు చిరునామాలాంటి నగరపు నదిలో అది ఎప్పటికీ నిలిచిపోతుంది. నా జాతీయ పతాకాన్ని సగర్వంగా పైకి ప్రదర్శించే క్రమంలో దానిని కోల్పోయాను. ఇందులో కొంత కవిత్వం కనిపించవచ్చు గానీ... నీ ఉంగరాన్ని కూడా అందులో విసిరేస్తే అవి కలిసి ఉండిపోతాయి. పెళ్లినాటి ప్రమాణాలను మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకునే మనం మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది’ అని అతను రాశాడు. -
వినూత్న రీతిలో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు
-
Paris Olympics 2024 : లాహిరి లాహిరి లాహిరిలో...
ఈఫిల్ టవర్ సమీపాన చారిత్రక ‘ట్రొకార్డో’ వద్ద ప్రారంభమైన పరేడ్ సెన్ నదీ తీరం వెంట సాగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్‌తో పాటు దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు ప్రారంబోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నింటికంటే ముందు సెన్ నదిపై ఉన్న పాంట్ డి ఆస్టర్లిజ్ బ్రిడ్జిపై ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని ఎరుపు, తెలుపు, నీలి రంగులను వెదజల్లుతూ నయనానందకరంగా కార్యక్రమం మొదలైంది. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఫ్రెంచ్ భాషలో ‘ఎన్‌చాంట్’ నినాదంతో పడవలపై ఆటగాళ్ల పరేడ్ మొదలైంది. ఎప్పటిలాగే తొలి ఒలింపిక్స్‌కు వేదికైన గ్రీస్ బృందం అందరికంటే ముందుగా రాగా, ఐఓసీ శరణార్థి టీమ్ దానిని అనుసరించింది. ఫ్రెంచ్ అక్షరమాలలో జట్లు వరుసగా వచ్చాయి. బోట్లు వెళుతున్న సమయంలో ఫ్రెంచ్ సంగీతాన్ని నేపథ్యంలో వినిపించారు. అనంతరం ప్రఖ్యాత పాప్ సింగ్ లేడీ గాగా తన ఆటపాటతో అలరించింది. పారిస్: ప్రారంబోత్సవంలో భాగంగా ఆ తర్వాత ఫ్రాన్స్ దేశపు చరిత్ర, సంస్కృతి, సంగీతం అన్నీ ప్రతిబింబించేలా వరుసగా కార్యక్రమాలు సాగాయి. 80 మంది కళాకారులతో ఫ్రెంచ్ క్యాబరే డ్యాన్స్ ‘కెన్ కెన్’ను ప్రదర్శించగా... పారిస్ ఒలింపిక్ క్రీడలను నిర్వహించడంలో పని చేసిన కార్మికులు, సామాన్య ప్రజలకు అంకితం ఇస్తూ ‘సింక్రానిసిటీ’ పేరుతో షోను ఫ్రాన్స్ పర్యాటక ప్రదేశాల్లో ప్రఖ్యాతమైన ‘నోటర్ డేమ్ క్యాథడ్రిల్’ వద్ద నిర్వహించారు. ఆపై ఫ్రెంచ్ సాహిత్యం విశేషాలు తెలిపే, ఆ దేశపు ప్రస్థానాన్ని తెలిపే థీమ్‌తో ప్రోగ్రాం జరిగింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ విప్లవ కాలపు గీతాలను కూడా వినిపించారు. చారిత్రక ల్యూర్ మ్యాజియం, మేడలీన్ చిత్రం తదితర కళాఖండాలను గుర్తుకు తెస్తూ వాటిని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆ తర్వాత ఫ్రెంచ్ సినిమాకు నీరాజనం అంటూ కార్యక్రమం సాగింది. అనంతరం ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని వినిపించారు. ఈ సమయంలో ఫ్రెంచ్ చరిత్రలో పది మంది ప్రముఖ మహిళల బంగారు విగ్రహాలను ప్రదర్శించారు. 78 మందితో మన బృందం... బోట్లపై పరేడ్‌లో 84వ స్థానంలో భారత జట్టు వచ్చింది. ఫ్లాగ్ బేరర్లు పీవీ సింధు, ఆచంట శరత్ కమల్ ముందుండి భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించగా... ఇతర అథ్లెట్లు కూడా చేతుల్లో చిన్న పతాకాలతో అభివందనం చేశారు. ఒలింపిక్స్‌లాంటి విశ్వ సంబరంలో పాల్గొంటున్న ఆనందం అందరిలోనూ కనిపించింది. దీపిక కుమారి, లవ్లీనా బొర్గొహైన్, మనికా బత్రా, రోహన్ బోపన్న, సుమీత్ నగాల్, శ్రీరామ్ బాలాజీ తదితరులు పరేడ్‌లో భాగమయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ నుంచి ఆటగాళ్లు, అధికారులు కలిపి మొత్తం 78 మంది పాల్గొన్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, పారిస్ ఒలింపిక్స్‌లో భారత చెఫ్ డి మిషన్ గగన్ నారంగ్ కలిసి ఈ బృందాన్ని ఎంపిక చేశారు. శనివారం పోటీలో పాల్గొనే ప్లేయర్లతో పాటు ఇంకా పారిస్‌కు చేరుకోని అథ్లెట్లు, వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు ఈ కార్యక్రమంలో భాగం కాలేదు. శనివారం తమ పోటీలు లేని షూటర్లు అంజుమ్, సిఫ్ట్ కౌర్, ఐశ్వర్య ప్రతాప్, అనీశ్ కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. భారత హాకీ జట్టు నేడు న్యూజిలాండ్‌తో తలపడనుండటంతో జట్టులోని రిజర్వ్ ఆటగాళ్లు మాత్రమే హాజరయ్యారు. ‘తస్వ’ డిజైన్లతో... ప్రారంబోత్సవ కార్యక్రమంలో భారత బృందం ధరించిన డ్రెస్‌లను ప్రముఖ కంపెనీ ‘తస్వ’ తయారు చేసింది. పురుషుల డ్రెస్‌లలో, మహిళల చీరకట్టులో కూడా అంచులను భారత త్రివర్ణ పతాకపు మూడు రంగులతో డిజైన్ చేశారు. ‘తస్వ’ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందినది కాగా... ఇందులో భాగంగా ఉన్న ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని పర్యవేక్షణలోనే భారత టీమ్ డ్రెస్ రూపకల్పన జరిగింది. మరో వైపు మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొనే సమయంలో ఉపయోగించే కిట్లను ప్రముఖ సంస్థ జిందాల్ గ్రూప్‌నకు చెందిన ‘ఇన్‌సై్పర్’ రూపొందించింది. జిందాల్ గ్రూప్ గతంలో 2022 కామన్వెల్త్ క్రీడల్లో, 2023 ఆసియా క్రీడల్లో కూడా భారత బృందానికి కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు వాడే స్పోర్ట్స్ కిట్లను డిజైనర్ ఆఖిబ్ వాని రూపొందించాడు. నీరజ్ చోప్రా, మనూ భాకర్, మనికా బాత్రా తదితర ఆటగాళ్లు జిందాల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ గ్రూప్‌లో భాగంగా ఉన్నారు. -
జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం: తాప్సీ పన్ను
హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫీర్ ఆయి హాసిన్ దిల్రుబా చిత్రంలో కనిపంచనుంది. 2021లో హసీన్ దిల్రుబా మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, సన్నీ కె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ఇండియన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డికి 2021 నుంచి కోచ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఆటగాళ్లు పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.దీంతో తన భర్త కోసం నటి తాప్సీ పన్ను పారిస్ ఒలింపిక్ క్రీడలకు హాజరు కానున్నారు. ఈనెల 29న పారిస్‌కు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ఒలింపిక్స్ చూసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని పేర్కొన్నారు. తన భర్తతో పాటు.. మనదేశ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు పారిస్ వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, తాప్సీ భర్త మథియాస్ బో పారిస్ చేరుకున్నారు. మథియోస్ను 2012లో ఒలింపిక్స్ పతకం గెలిచిన తర్వాత తొలిసారి కలుసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.కాగా.. తాస్పీ పన్ను తెలుగులో పలు చిత్రాలు చేసింది. బాలీవుడ్లో సూర్మ (2018), సాంద్ కి ఆంఖ్ (2019), రష్మీ రాకెట్ (2021), లూప్ లాపేట (2022), శభాష్ మిథు (2022) స్పోర్ట్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. తాను స్క్వాష్ గేమ్ మాత్రమే బాగా ఆడగలనని తాప్సీ తెలిపింది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్‌లో కలకలం
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో కలకలం. పారిస్ వేదికగా ఓ వైపు సమ్మర్ ఒలింపిక్స్ 2024 (జులై 26) ప్రారంభం కావడం.. మరోవైపు పారిస్ హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్‌ను గుర్తు తెలియని అగంతకులు పెద్ద మొత్తంలో విధ్వంసం చేయడం ఆందోళన నెలకొంది. ఫలితంగా ఫ్రాన్స్ ఇంటర్సిటీ హై స్పీడ్ రైల్ సర్వీస్ నెట్వర్క్ స్తంభించినట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వే కంపెనీ సొసైటీ నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ ఫ్రాంకైస్ (ఎస్ఎన్సీఎఫ్) తెలిపింది.నిందితులు ఏకకాలంలో దాడులు చేయడంతో అట్లాంటిక్, తూర్పు-ఉత్తర రైల్వే లైన్లలో కార్యకలాపాలు ఆగిపోయాయిని ఎస్ఎన్సీఎఫ్ అధికారులు వెల్లడించారు.France's high-speed rail network has been hit by "malicious acts" including arson attacks that have disrupted the transport system, train operator SNCF said, hours before the opening ceremony of the Paris Olympics. “This is a massive attack to paralyse the Railway” https://t.co/RaAzI1URZC pic.twitter.com/JPHZXmO1k8— #𝕎𝕒𝕣 ℍ𝕠𝕣𝕚𝕫𝕠𝕟 (@WarHorizon) July 26, 2024 ‘రైల్వే కార్యకలాపాల్ని దెబ్బతీసేందుకు రైల్వే లైన్లను విధ్వంసం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రభావిత మార్గాలలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తులు నిర్వహించి, పరిస్థితుల్ని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరమ్మత్తులు చేసిన రైల్వే ట్రాక్‌లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే వారం రోజుల సమయం పడుతుంది’ అని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లను వేర్వేరు ట్రాక్‌లకు మళ్లిస్తున్నాం. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకల్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రజలు తమ రైల్వే ప్రయాణాల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోమని ఎస్ఎన్సీఎఫ్ విజ్ఞప్తి చేస్తోంది. -
వసుధైక క్రీడోత్సవం: మరింత వేగంగా.. మరింత ఎత్తుకు.. మరింత బలంగా..
పారిస్ నగరం పగలు పెర్ఫ్యూమ్ బాటిల్లా, రాత్రి షాంపేన్ బాటిల్లా కనిపిస్తుందంటారు. ఇప్పుడు మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా ఒలింపిక్మయంగా మారిపోతోంది. ఫ్రెంచ్ వైన్‌ను మించిన స్పోర్ట్స్ మత్తులో నగరం మునిగిపోతోంది. 100 ఏళ్ల తర్వాత తమ ఇంట్లో జరగబోతున్న పండగతో సీన్ నదీ తీరమంతా క్రీడా సందడికి కేరాఫ్‌గా నిలుస్తోంది.రాబోయే కొన్ని రోజుల పాటు అక్కడ కలలు రెక్కలు విప్పుకుంటాయి. ఆశలు, అంచనాలు ఈఫిల్ టవర్‌ను తాకుతాయి. ఫ్యాషన్ స్ట్రీట్‌లో కూడా పతకాలు, పతాకాల గురించే చర్చ సాగుతుంది. గెలిచే మెడల్‌కు ఫ్రెంచ్ ముద్దుతోనే మురిపెం. ఒక్కసారి ఆడితే చాలు అదృష్టంగా భావించేవారు, ఒక్క పతకం గెలిస్తే చాలనుకునేవారు, కనకం కొడితే జన్మ ధన్యమైనట్లుగా సంబరపడేవారు, మళ్లీ మళ్లీ గెలిచి సగర్వంగా శిఖరాన నిలిచేవారు, అందరూ ఇక్కడే కలసిపోతారు. సంబరాలు, కన్నీళ్లు, ఆనందబాష్పాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కచోటే కనిపిస్తాయి.జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు క్రీడాకారుల గుండె లోతుల్లో పొంగే భావనను లెక్కకట్టేందుకు ఎలాంటి కొలమానాలు సరిపోవు. ఔను! సమస్త క్రీడా జాతిని ఏకం చేసే మెగా ఈవెంట్‌కు సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా ఆనందానుభూతి పంచేందుకు విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. ప్రఖ్యాత పారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్‌కు ఈనెల 26న తెర లేవనుంది.5 నగరాల నుంచి..2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేర్వేరు నగరాల నుంచి 2015 సెప్టెంబర్‌లోనే బిడ్లను ఆహ్వానించింది. ఒలింపిక్స్ ప్రణాళికలు, భిన్నమైన రీతిలో నిర్వహణ, వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, వేదికకు కావాల్సిన ఆర్థిక పుష్టి, గతానుభవం, ఆ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు తదితర అంశాలను దృష్టిలోకి తీసుకుంటూ బిడ్లను కోరారు. పారిస్ (ఫ్రాన్స్), లాస్ ఏంజెలిస్ (అమెరికా), బుడాపెస్ట్ (హంగరీ), హాంబర్గ్ (జర్మనీ), రోమ్ (ఇటలీ) నగరాలు తుది జాబితాలో నిలిచాయి. అయితే ఆర్థిక కారణాలతో మూడు నగరాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోమ్, హాంబర్గ్ నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా, ఎక్కువమంది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. బుడాపెస్ట్‌లో అయితే ఒలింపిక్స్ జరిగితే ఆర్థికంగా చితికిపోతామంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలు ‘నో ఒలింపిక్స్’ పేరుతో ఉద్యమమే నడిపించాయి. దాంతో చివరకు పారిస్, లాస్ ఏంజెలిస్ మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఐఏసీ 2024కే కాకుండా 2028 కోసం కూడా బిడ్‌ను ఖాయం చేసేందుకు సిద్ధమైంది. దాంతో లాస్ ఏంజెలిస్ వెనక్కి తగ్గి తాము 2028లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తామంటూ స్పష్టం చేయడంతో 2017 జూలైలో పారిస్‌కు గేమ్స్ ఖాయమయ్యాయి.రూ. 40 వేల కోట్లతో...పారిస్ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900 (రెండో ఒలింపిక్స్), 1924 (ఎనిమిదో ఒలింపిక్స్) కూడా ఇక్కడే జరిగాయి. ఒలింపిక్స్‌కు రెండుసార్లు నిర్వహించిన తొలి నగరంగా పారిస్ గుర్తింపు పొందింది. 2024 క్రీడల కోసం అక్షరాలా 4.38 బిలియన్ యూరోలు (సుమారు రూ. 40 వేల కోట్లు) కేటాయించారు. ఇదంతా 100 శాతం ప్రైవేట్ ఫండింగ్ కావడం విశేషం. ఇందులో టీవీ రైట్స్, టికెట్ల అమ్మకం, హాస్పిటాలిటీ, లైసెన్సింగ్, ఇతర భాగస్వామ్యపు ఒప్పందాలు కలసి ఉన్నాయి.ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి సహకారం లేకుండా ఈ ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే సహజంగానే ఒలింపిక్స్ నిర్వహణ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, క్రీడల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, స్టేడియాలు ఆ తర్వాత పనికి రాకుండా పోయి వృథాగా పడి ఉండటం గత కొన్ని ఒలింపిక్స్లుగా చూస్తూనే ఉన్నాం. దాంతో ఆర్థిక భారం అంశంపై ఈసారి బాగా చర్చ జరిగింది. అయితే పారిస్‌లో ఈసారి ఒలింపిక్స్ నిర్వహణ నష్టదాయకం కాదని, ఆర్థిక సమస్యలను తట్టుకోగలిగే శక్తి ఉందని పలు తాజా నివేదికలు వెల్లడించాయి.ముఖ్యంగా ఒలింపిక్స్ జరిగే సమయంలో పారిస్‌కు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల కారణంగా నగరానికి మంచి ఆదాయం రానుందనేది అంచనా. పారిస్ ప్రాంతానికి కనీసం 6.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 56 వేల కోట్లు) వరకు ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఎలా చూసినా ఒలింపిక్స్ నిర్వహణ లాభదాయకమే తప్ప నష్టం లేదని నిర్వహణా కమిటీ ఘంటాపథంగా చెబుతోంది.టార్చ్‌తో మొదలు..క్రీడల్లో ఒలింపిక్ జ్యోతికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఒలింపిక్ ఉద్యమానికి ఇది సూచిక. ప్రాచీన గ్రీకురాజ్యంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీనిని ఒలింపిక్స్ వరకు తీసుకొచ్చారు. ఏథెన్స్ సమీపంలోని ఒలింపియాలో సూర్యకిరణాల ద్వారా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం ప్రతి ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు జరిగే ప్రక్రియ. అక్కడ వెలిగిన జ్యోతితో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ద్వారా టార్చ్ రిలే కొనసాగుతుంది. శాంతి, స్నేహ సంబంధాల సందేశం ఇవ్వడం ఈ ఒలింపిక్ టార్చ్ ప్రధాన ఉద్దేశం.1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదటిసారి దీనిని వాడారు. తర్వాతి రోజుల్లో ఆతిథ్య దేశం ఆలోచనలు, వారి సంస్కృతికి అనుగుణంగా టార్చ్ల నమూనాలను రూపొందించడం సంప్రదాయంగా మారింది. క్రీడలు జరిగినన్ని రోజులు ఒలింపిక్ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మెగా ఈవెంట్ ముగిసిన తర్వాత దానిని ఆర్పేస్తారు. సాధారణంగా ఆయా దేశపు ప్రముఖ లేదా మాజీ క్రీడాకారులు ఒలింపిక్ టార్చ్ అందుకొని రిలేలో పాల్గొంటారు. పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి 10 వేల మంది టార్చ్ బేరర్లతో 400 నగరాల గుండా ఈ జ్యోతి ప్రయాణించింది.మస్కట్, లోగో..పారిస్ ఒలింపిక్స్ కోసం ‘ఫ్రీ జీ’ పేరుతో అధికారిక మస్కట్‌ను విడుదల చేశారు. ప్రాచీన ఫ్రెంచ్ సంప్రదాయ టోపీని ‘ఫ్రీజీ’గా వ్యవహరిస్తారు. ఆ దేశపు చరిత్ర ప్రకారం దీనిని ఒక టోపీగా మాత్రమే చూడరు. ఆ దేశపు స్వేచ్ఛకు సంకేతంగా భావిస్తారు. దీనికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం సమయంలో విప్లవకారులంతా ఇలాంటి టోపీలనే ధరించారు.ఫ్రాన్స్ దేశపు రోజువారీ వ్యవహారాల్లో ఈ ‘ఫ్రీజీ’ టోపీ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని రంగులైన ఎరుపు, నీలం, తెలుపు ఇందులో కనిపిస్తాయి. ఒలింపిక్స్‌కు సంబంధించిన డిజైనింగ్ టీమ్ దీనిని రూపొందించింది. ఒలింపిక్ జ్యోతిని బంగారపు రంగులో ప్రదర్శిస్తూ పారిస్ 2024 లోగోను తయారుచేశారు. ‘విడిగా మనం వేగంగా వెళ్లవచ్చు. కానీ కలసికట్టుగా మరింత ముందుకు పోవచ్చు’ అనేది ఈ ఒలింపిక్స్ మోటోగా నిర్ణయించారు.కొత్తగా ఆడుదాం..ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలను ప్రోత్సహించడం సంప్రదాయంగా వస్తోంది. అప్పటికే బాగా గుర్తింపు పొందిన ఆటలతో పాటు ఇలాంటి కొత్త క్రీడలు కొత్త తరం క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పనికొస్తాయని ఐఓసీ ఉద్దేశం. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలకు కొత్త క్రీడల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో కొత్తగా ఒక క్రీడాంశాన్ని ప్రవేశపెట్టారు.బ్రేకింగ్: 1970ల నుంచి అమెరికా సంస్కృతిలో భాగంగా ఉన్న డాన్స్‌లలో ఒక భాగం ఇది. సరిగ్గా చెప్పాలంటే మన దగ్గర సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన బ్రేక్ డాన్స్ రూపమిది. శారీరక కదలికలు, ఫుట్‌వర్క్‌లో స్టయిల్ తదితర అంశాలతో పాయింట్లు కేటాయిస్తారు. 1990 నుంచి ఇందులో పోటీలు జరుగుతున్నా ఒలింపిక్స్‌కు చేరేందుకు ఇంత సమయం పట్టింది. 2018 యూత్ ఒలింపిక్స్‌లో దీనికి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు ఒలింపిక్స్‌లో చేర్చారు.అమెరికాదే హవా... దీటుగా చైనా..1061 స్వర్ణాలు, 830 రజత పతకాలు, 738 కాంస్యాలు... మొత్తం 2629 పతకాలు... ఒలింపిక్స్ చరిత్రలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) అసాధారణ ఘనత ఇది. 1896లో తొలి ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా నాటి నుంచి ఇప్పటి వరకు తమ హవా కొనసాగిస్తూనే ఉంది. ఎన్నెన్నో అద్భుత ప్రదర్శనలు, ప్రపంచ రికార్డు ప్రదర్శనలు అన్నీ అలవోకగా అమెరికా ఆటగాళ్ల నుంచి వచ్చాయి.ముఖ్యంగా అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లోనైతే ఇతర దేశాల ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీ పడేందుకే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. ఇతర జట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడం అగ్ర రాజ్యానికే చెల్లింది. ఒలింపిక్స్‌లో నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి జట్లను ఒక ఆటాడుకోవడం అమెరికా ఆటగాళ్లకు అలవాటైన విద్య.ఎప్పుడో పుష్కరానికోసారి ఒక చిన్న సంచలనం, కాస్త ఏమరుపాటుతో కొన్నిసార్లు వెనుకబడినా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి మొత్తంగా అమెరికన్లకు తిరుగులేదు. అన్ని రకాలుగా క్రీడలకు ప్రోత్సాహం, సరైన వ్యవస్థ, ప్రొఫెషనల్ దృక్పథం, అభిమానుల మొదలు కార్పొరేట్ల వరకు అన్ని ఆటలకు అండగా నిలిచే తత్వం, సుదీర్ఘ కాలంగా క్రీడలు అక్కడి జీవితంలో ఒక భాగంగా మారిపోవడంవంటివి అమెరికా ముందంజకు ప్రధాన కారణాలు.మరోవైపు చైనా కూడా అమెరికాకు దాదాపు సమఉజ్జీగా నిలుస్తోంది. పతకాల్లో పోటీ పడుతూ రెండో స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్ ఓవరాల్ జాబితాలో 263 స్వర్ణాలు సహా 636 పతకాలతో చైనా ఐదో స్థానంలో కనిపిస్తోంది. అయితే 2004 ఒలింపిక్స్ వరకు చైనా ఖాతాలో పెద్దగా పతకాలు లేకపోవడమే ఐదో స్థానానికి కారణం.2008లో చైనా సొంతగడ్డ బీజింగ్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నాటి నుంచి ఆ దేశపు క్రీడా ముఖచిత్రమే మారిపోయింది. 2008–2020 మధ్య జరిగిన నాలుగు ఒలింపిక్ క్రీడల్లో చైనా 3 సార్లు రెండో స్థానంలో నిలిచి, ఒకసారి మూడో స్థానంతో ముగించింది. ఇది క్రీడా ప్రపంచంలో వచ్చిన మార్పునకు సంకేతం. కొత్త తరహా శిక్షణ, ప్రణాళికలతో 2008 కోసం ప్రత్యేక వ్యూహాలతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన చైనా ఆ తర్వాత తమ జోరును కొనసాగిస్తూ వచ్చింది. భిన్న క్రీడాంశాల్లో అమెరికాతో సై అంటే సై అంటూ పోటీ పడుతోంది.ఆధునిక ఒలింపిక్స్‌లో జేమ్స్ బ్రెండన్ బెనిట్ కొనలీ తొలి విజేతగా నిలిచాడు. అతడు ట్రిపుల్ జంప్‌లో ఈ విజయం సాధించాడు. హార్వర్డ్ విద్యార్థి అయిన కొనలీ సెలవు తీసుకుని ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అయితే, అనుమతి లేకుండా క్రీడా పోటీల్లో పాల్గొన్నందుకు హార్వర్డ్ వర్సిటీ అతడికి ఉద్వాసన పలికింది.తొలిసారిగా 1900లో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం లభించింది. ఆ ఒలింపిక్స్‌లో 22 మంది మహిళలు పాల్గొన్నారు. అప్పటికి ఇంకా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా రాలేదు. నానా పోరాటాల తర్వాత అమెరికాలో మహిళలకు 1920లో ఓటు హక్కు దక్కింది.ఆధునిక ఒలింపిక్స్‌లో 1896, 1900 సంవత్సరాల్లో పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత, కాంస్య పతకాలను మాత్రమే బహూకరించేవారు. అప్పట్లో మూడో బహుమతి ఉండేది కాదు. అయితే, 1904 నుంచి ప్రతి పోటీలోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను బహూకరించే ఆనవాయితీ మొదలైంది.ఒలింపిక్స్ సహా సమస్త క్రీడా కార్యక్రమాలను ఇప్పుడు టీవీల్లో చూడగలుగుతున్నాం. రోమ్‌లో 1960లో జరిగిన ఒలింపిక్స్ తొలిసారిగా టీవీలో ప్రసారమయ్యాయి. అప్పటి వరకు ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకోవడానికి పత్రికలే ఆధారంగా ఉండేవి.ఈఫిల్ టవర్ ఇనుముతో...ఒలింపిక్స్‌లో అన్నింటికంటే ఉద్వేగభరిత క్షణం విజేతలకు పతక ప్రదానం. ఏళ్ల శ్రమకు గుర్తింపుగా దక్కే స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో నిర్వాహకులు ప్రతిసారీ తమదైన ప్రత్యేకతను, భిన్నత్వాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా స్వర్ణపతకంలో బంగారం చాలా చాలా తక్కువ. ఇందులో 92.5 శాతం వెండిని వాడతారు. కేవలం 1.34 శాతమే బంగారం ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం కనీసం 6 గ్రాముల బంగారం ఇందులో ఉండాలి. రజత పతకంలో దాదాపు అంతా వెండి ఉంటుండగా, కంచు పతకంలో 95 శాతం రాగిని వాడతారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత ఉంది. తమ దేశంలో జరిగే ఒలింపిక్స్ పతకాలను భిన్నంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్వాహకులు కొత్తగా ఆలోచించారు.ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన అసలైన ఇనుమును పతకాల్లో చేర్చాలని నిర్ణయించారు. ఇన్నేళ్లలో ఈఫిల్ టవర్‌ను ఎన్నోసార్లు ఆధునికీకరించారు. ఈ క్రమంలో కొంత ఇనుమును పక్కన పెడుతూ వచ్చారు. ఇప్పుడు అందులోనుంచే చిన్న చిన్న ముక్కలను తాజా పతకాలలో చేర్చారు. గుండ్రటి పతకం మధ్య భాగంలో ఈ ఇనుమును పారిస్ 2024 లోగోతో కలిపి షడ్భుజాకారంలో ఉంచారు. ఎప్పటిలాగే వెనుక భాగంలో గ్రీకు విజయదేవత ఏథెనా నైకీ, ఆక్రోపొలిస్ భవనంతో పాటు మరో చివర ఈఫిల్ టవర్ కనిపిస్తుంది.10+9+16=35 ఒలింపిక్స్‌లో భారత పతకాల రికార్డు..1900లో జరిగిన రెండో ఒలింపిక్స్ (పారిస్)లో భారత్ తొలిసారి బరిలోకి దిగింది. వ్యక్తిగత విభాగంలో ఏకైక అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వేర్వేరు కారణాలతో తర్వాతి మూడు ఒలింపిక్స్‌కు భారత్ దూరంగా ఉండగా, 1920లో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లలో కలిపి ఐదుగురు క్రీడాకారులు బరిలోకి దిగగా, వ్యాపారవేత్త దొరాబ్జీ టాటా తదితరులు ఆర్థిక సహాయం అందించారు. అప్పటి నుంచి మన దేశం వరుసగా ప్రతీ ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చింది.ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీ అత్యధిక పతకాలు తెచ్చి పెట్టింది. జట్టు ఏకంగా 8 స్వర్ణాలు గెలిచింది. మన స్వర్ణయుగంగా సాగిన కాలంలో 1928–1956 మధ్య వరుసగా ఆరు స్వర్ణాలు సాధించిన టీమ్ 1960లో రజతం; 1968, 1972, 2020లలో కాంస్యం గెలుచుకుంది.1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో 2 రజతాలు సాధించాడు. ప్రిచర్డ్ జాతీయతపై కాస్త వివాదం ఉండటంతో అతను గెలుచుకున్న పతకాలు భారత్ ఖాతాలో వస్తాయా రావా అనేదానిపై చర్చ జరిగింది. అతను పాత బ్రిటిష్ కుటుంబానికి చెందిన వాడు కాబట్టి తమవాడే అనేది బ్రిటన్ చరిత్రకారుల వాదన.1900 ఒలింపిక్స్‌కు ముందు లండన్‌లో జరిగిన ఏఏఏ చాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శన ఆధారంగానే ఎంపికయ్యాడు కాబట్టి అతను ఇంగ్లిష్‌వాడే అనేది వారు చెప్పే మాట. అయితే ప్రిచర్డ్ కోల్‌కతాలో పుట్టడంతో పాటు సుదీర్ఘ కాలం భారత్‌లోనే గడిపాడు కాబట్టి భారతీయుడే అనేది మరో వాదన. అయితే 1900 క్రీడల్లో గ్రేట్ బ్రిటన్ టీమ్ కూడా బరిలోకి దిగింది. వారి తరఫున కాకుండా భారత్ తరఫున ఆడాడు కాబట్టి భారతీయుడే! చివరకు ఐఓసీ తమ పతకాల జాబితాలో ప్రిచర్డ్ రెండు రజతాలు భారత్ ఖాతాలోనే వేసి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.స్వతంత్ర భారతంలో తొలి పతకం 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ (రెజ్లింగ్) గెలుచుకున్నాడు. హాకీ కాకుండా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు...హాకీ 12..8 స్వర్ణాలు (1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్; 1948 లండన్; 1952 హెల్సింకీ, 1956 మెల్బోర్న్; 1964 టోక్యో, 1980 మాస్కో)1 రజతం (1960 రోమ్)3 కాంస్యాలు (1968 మెక్సికో, 1972 మ్యూనిక్, 2020 టోక్యో)షూటింగ్ 4..1 స్వర్ణం (అభినవ్ బింద్రా; 2008 బీజింగ్)2 రజతాలు (రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్; 2004 ఏథెన్స్... విజయ్‌కుమార్; 2012 లండన్), 1 కాంస్యం (గగన్ నారంగ్; 2012 లండన్)అథ్లెటిక్స్3..1 స్వర్ణం (నీరజ్ చోప్రా; 2020 టోక్యో)2 రజతాలు (నార్మన్ ప్రిచర్డ్; 1900 పారిస్)రెజ్లింగ్ 7..2 రజతాలు (సుశీల్ కుమార్; 2012 లండన్... రవి కుమార్ దహియా; 2020 టోక్యో)5 కాంస్యాలు (ఖాషాబా జాదవ్; 1952 హెల్సింకీ... సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్; 2012 లండన్... సాక్షి మలిక్; 2016 రియో... బజరంగ్ పూనియా; 2020 టోక్యో)బాక్సింగ్ 3..3 కాంస్యాలు (విజేందర్; 2008 బీజింగ్... మేరీ కోమ్; 2012 లండన్... లవ్లీనా బొర్గోహైన్; 2020 టోక్యో)బ్యాడ్మింటన్ 3..1 రజతం (పీవీ సింధు; 2016 రియో)2 కాంస్యాలు (సైనా నెహ్వాల్; 2012 లండన్, సింధు; 2020 టోక్యో)వెయిట్ లిఫ్టింగ్ 2..1 రజతం (మీరాబాయి చాను; 2020 టోక్యో)1 కాంస్యం (కరణం మల్లీశ్వరి; 2000 సిడ్నీ)టెన్నిస్ 1..1 కాంస్యం (లియాండర్ పేస్; 1996 అట్లాంటా)మనం ఎక్కడున్నాం?71, 71, 65, 50, 55, 67, 48... అట్లాంటాలో జరిగిన 1996 ఒలింపిక్స్ నుంచి టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్ వరకు పతకాల పట్టికలో భారత్ స్థానమిది. గత పోటీల్లోనైతే నీరజ్ చోప్రా ప్రదర్శనతో ఒక స్వర్ణపతకం చేరిన తర్వాత కూడా మనం 48వ స్థానానికే పరిమితమయ్యాం. అగ్రరాజ్యాల సంగతి సరే; చెక్ రిపబ్లిక్, క్రొయేషియా, స్లొవేనియా, ఉజ్బెకిస్తాన్, జార్జియా, ఉగాండా, ఈక్వెడార్, బహామాస్, కొసవో, బెలారస్ దేశాలు కూడా పతకాల పట్టికలో మనకంటే ముందు నిలిచాయి. ఈ ప్రదర్శన చూసి నిరాశ చెందాలో, లేక 1996కు ముందు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా లేకుండా సున్నా చుట్టి అసలు ఏ స్థానమూ సాధించని స్థితి నుంచి మెరుగయ్యామో అర్థం కాని పరిస్థితి.వ్యక్తిగత క్రీడాంశంలోనైతే 1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒక్క పతకమూ రాలేదంటే ఆటల్లో మన సత్తా ఏపాటిదో అర్థమవుతుంది. క్రికెట్లో విశ్వ విజేతలుగా నిలుస్తున్నా, ఇతర క్రీడాంశాలకు వచేసరికి భారత్ వెనుకబడిపోతూనే ఉంది. ఇక ఒలింపిక్స్ వచ్చే సమయానికి కాస్త హడావిడి పెరిగినా, చాలామంది క్రీడాకారులకు అది పాల్గొనాల్సిన లాంఛనమే తప్ప కచ్చితంగా పతకాలతో తిరిగి రాగలరనే నమ్మకం ఉండటం లేదు.అభిమానుల కోణంలో చూసినా సరే మెగా పోటీలు మొదలైన తొలిరోజు నుంచి పతకాల జాబితాలో మన వంతు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం అలవాటుగా మారిపోయింది. 1900 ఒలింపిక్స్‌లో ఒకే వ్యక్తిని పంపడం మినహాయిస్తే, 1920 నుంచి రెగ్యులర్‌గా మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు. అంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌తో భారత్ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలతో భారత్ మొత్తం 35 పతకాలు గెలుచుకోగలిగింది. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో పతకాలు గెలిచిన జట్ల జాబితాను చూస్తే భారత్ 56వ స్థానంలో ఉంది.ఒలింపిక్స్ సమయంలో మినహా...‘నా దృష్టిలో ఇది 1000 స్వర్ణాలతో సమానం. ఇంకా చెప్పాలంటే అది కూడా తక్కువే!’– 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్యం గెలిచినప్పుడు భారత స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇది. నిజానికి ఇది ఆ ప్లేయర్‌ను అభినందించినట్లుగా ఉంది. కానీ దేశమంతా అభిమానించే ఒక నటుడు ఈ విజయాన్ని అంత గొప్పగా చెబుతున్నాడంటే మనం ఎంత అల్పసంతోషులమో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు అప్పుడప్పుడూ సాధించే ఘనతలకు ఆకాశమంత గుర్తింపు దక్కుతుంది.ఆ సమయంలో సాగే హంగామా చూస్తే భారత్ ప్రపంచ క్రీడా వేదికపై అద్భుతాలు చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఒలింపిక్స్ సమయంలో మినహా మిగతా రోజుల్లో ఆయా క్రీడలపై చాలా మందికి కనీస ఆసక్తి కూడా ఉండదు. ఇలాంటి వాతావరణమే క్రికెటేతర క్రీడల్లో భారత్ ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తోంది. ఇటీవల భారత్ టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మహారాష్ట్రకు చెందిన నలుగురు ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు పురస్కారాన్ని అందించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ఎన్నో విజయాలు సాధిస్తున్న తనను కనీసం పట్టించుకోలేదని భారత బ్యాడ్మింటన్ ఆటగాడు చిరాగ్ శెట్టి బహిరంగంగానే విమర్శించడం చూస్తే ప్రభుత్వాల ప్రాధాన్యం ఏమిటో స్పష్టమవుతుంది.క్రీడా సంస్కృతి లేకపోవడం వల్లే...ఆటల్లోనూ అగ్రరాజ్యంగా నిలిచే అమెరికాలో క్రీడా మంత్రిత్వశాఖ అనేదే లేదు. క్రీడలకు ఒక మంత్రి కూడా లేడు. ఆశ్చర్యం అనిపించే వాస్తవమిది. క్రీడాకారులను తయారు చేయడంలో అక్కడి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. మరి ఇంత గొప్ప అథ్లెట్లు ఎక్కడి నుంచి, ఎలా పుట్టుకొస్తున్నారని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కొందరు పెద్ద పారిశ్రామికవేత్తలు ఆటలను ప్రోత్సహించేందుకు అండగా నిలుస్తున్నారు. వారికి కొన్ని పన్ను రాయితీలు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. అక్కడ స్కూల్స్, కాలేజీలు, స్థానిక పార్కుల్లోనే ఆటగాళ్లు తయారవుతారు. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించేవారిలో 80 శాతం మంది తమ నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) నుంచే వస్తారంటూ ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది.అమెరికాలో ప్రతి పార్కుకూ అనుబంధంగా తప్పనిసరిగా అథ్లెటిక్ ఫీల్డ్‌లు ఉంటాయి. మన దగ్గర అసలు ఇలాంటివి ఊహించగలమా? ఎక్కడో దూరం వరకు ఎందుకు, స్థానికంగా మన పాఠశాలల్లో చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో స్కూళ్లలో కనీసం గ్రౌండ్లు కూడా లేని పరిస్థితి ఉంది.భవిష్యత్తుపై నమ్మకం లేక...ఒలింపిక్స్‌లో సత్తా చాటి భారత్ తరఫున పతకం సాధించిన గుప్పెడు మందిని చూస్తే వారందరి విషయంలో ఒకే సారూప్యత కనిపిస్తుంది. దాదాపు అందరూ ఎన్నో ప్రతికూలతలను దాటి సొంతంగా పైకి ఎదిగినవారే! కెరీర్ ఆరంభంలో, వేర్వేరు వయో విభాగాలకు ఆడే దశల్లో ఎలాంటి సహకారం లభించలేకపోయినా, మొండిగా తమ ఆటను నమ్ముకొని వ్యక్తిగత ప్రతిభతో దూసుకొచ్చినవారే!వ్యవస్థ తయారు చేసిన క్రీడాకారుడు అంటూ ఒక్కరి గురించి కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మన దగ్గర అలాంటి అవకాశమే లేదు. గెలిచాక అభినందనలు, పోటీగా బహుమతులు, కనకవర్షం కురిపించడం సాధారణమే అయినా, అసలు సమయంలో అవసరం ఉన్నప్పుడు ఎవరూ వారిని పట్టించుకోలేదు. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఆదుకోలేదు. సరిగ్గా ఇదే అంశం తమ పిల్లలను క్రీడాకారులుగా మార్చడంలో సగటు భారతీయులను వెనక్కి నెడుతుంది.క్రీడల్లో సఫలమై ఏ స్థాయి వరకు చేరతారనే దానిపై ఎలాంటి గ్యారంటీ లేదు. కోచింగ్, ప్రాక్టీస్, ఎక్విప్మెంట్– ఇలా చాలా అంశాలు భారీ ఖర్చుతో ముడిపడి ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితాలు దక్కకపోవచ్చు కూడా. ఈ అనిశ్చితి వల్ల క్రీడలను కెరీర్‌గా చూడటం కష్టంగా మారిపోయింది. అందుకే దాదాపు అందరూ తమ పిల్లలు బాగా చదువుకుంటే చాలనే ఆలోచనతో దానిపైనే దృష్టి పెడుతున్నారు. మనవాళ్ల ప్రాధాన్యాల జాబితాలో క్రీడలు ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉంటాయి. ఎదుటివారి విజయాలకు చప్పట్లు కొట్టి అభినందించడమే తప్ప తమ పిల్లలను క్రీడల్లోకి పంపే సాహసం చేయడం లేదు. ఆటలు ఆడితే లాభం లేదనే సంస్కృతి మన జీవితాల్లో ‘ఖేలోగే కూదోగే తో హోంగే ఖరాబ్. పఢోగే లిఖోగే తో బనోగే నవాబ్’లాంటి మాటలతో నిండిపోయింది.సౌకర్యాలు కల్పించకుండా...‘మేం ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఎంత ఖర్చు చేశామో తెలుసా? అక్షరాలా 45 లక్షల పౌండ్లు’ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత బ్రిటిష్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్య ఇది. అంటే భారత కరెన్సీలో అప్పట్లోనే ఇది దాదాపు రూ. 38 కోట్లు. పతకమే లక్ష్యంగా ఆటగాళ్లకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి చేసిన క్రీడా సదుపాయాలు, డైట్, ఫిట్నెస్ వంటి అన్ని అంశాలూ ఇందులో కలసి ఉన్నాయి. అలా చూస్తే మన దేశంలో ఇలాంటిది సాధ్యమా? మన వద్ద గెలిచి వచ్చిన తర్వాత ఇంత మొత్తం ఆటగాళ్లకు ఇస్తారేమో గాని, గెలిచేందుకు కావాల్సిన వాతావరణాన్ని అందించే ప్రయత్నం మాత్రం చేయరు. భారతదేశ జనాభా దాదాపు 141.72 కోట్లు. ప్రపంచంలో మొదటి స్థానం.టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 7 మాత్రమే. దేశ జనాభా, గెలుచుకున్న పతకాలను లెక్క గట్టి సగటు చూస్తే అన్ని దేశాల్లోకి అత్యంత చెత్త ప్రదర్శన మనదే! నిజానికి జనాభాను బట్టి పతకాలు గెలుచుకోవాలనే లెక్క ఏమీ లేదు గాని, సహజంగానే ఇది చర్చనీయాంశం. చాలా తక్కువ మంది మాత్రమే ఆటల వైపు వెళ్లుతున్నారనేది వాస్తవం. వీరిలో అన్ని దశలను దాటి ఒలింపిక్స్ వరకు వెళ్లగలిగేవారు చాలా తక్కువ మంది మాత్రమే! 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం 126 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. మనం గెలుచుకున్న 7 పతకాలే ఇన్నేళ్లలో మన అత్యుత్తమ ప్రదర్శన. అమెరికా తరహాలో కార్పొరేట్లు పెద్ద ఎత్తున అండగా నిలవడం ఇక్కడ సాధ్యం కావడం లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచే క్రీడల అభివృద్ధికి తొలి అడుగు పడాలనేది వాస్తవం.మన పేలవ ప్రదర్శనకు కారణాలను ఎంచడం చూస్తే వాటికి పరిమితి ఉండదు. ఒలింపిక్స్ స్థాయికి తగిన స్టేడియాలు, కనీస సౌకర్యాలు లేకపోవడం, బడ్జెట్లో క్రీడలకు అతి తక్కువ నిధులు కేటాయించడం, ప్రాథమిక స్థాయిలో ఆటలపై అసలు దృష్టి పెట్టకపోవడం, పరిపాలనా వ్యవస్థలోని లోటుపాట్లు క్రీడలకు అడ్డంకులుగా మారుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఏదోలా అక్కడక్కడా పైకి దూసుకొచ్చినవారిపైనే ఒలింపిక్స్‌లో మన ఆశలన్నీ ఉంటున్నాయి. ఇప్పటికీ ఫలానా క్రీడాంశంలో మనం పూర్తి ఆధిక్యం కనబరుస్తాం అని నమ్మకంగా చెప్పలేని పరిస్థితిలోనే మనం ఉన్నాం. అందుకే ఒకటీ, రెండు, మూడు అంటూ వేళ్లపై లెక్కించగలిగే పతకాలు వస్తున్న ప్రతిసారీ మనం వాటికి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నాం.ఈసారి రాత మారేనా?ఒలింపిక్స్‌లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదంటూ సుదీర్ఘకాలంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెంటనే ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో ఎక్కువ మందిని ఆటల వైపు ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావించింది. ఈ క్రమంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014లో మొదటిసారి దీనిని తీసుకొచ్చినా, స్వల్ప మార్పులతో 2018లో ‘టాప్స్’ను అదనపు అంశాలు జోడించి రూపొందించారు.ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. అయితే దీనిని పూర్తి స్థాయిలో వ్యవస్థాగతంగా సౌకర్యాల కల్పన, మైదానాల ఏర్పాటువంటివాటితో చూడలేం. కానీ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చేందుకు ఇది పనికొస్తోంది. సన్నద్ధతలో భాగంగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి స్థానికంగా శిక్షణ, అవసరమైతే విదేశాల్లో కోచింగ్, ఎక్విప్మెంట్, విదేశాల్లో పోటీలకు హాజరయ్యేందుకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. వీటితో పాటు ఉద్యోగం లేని ప్లేయర్లకు ఊరటగా నెలకు రూ.50 వేల స్టైపెండ్ కూడా లభిస్తుంది.దీని వల్ల ప్లేయర్లు ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా, ఏకాగ్రత చెదరకుండా పూర్తి స్థాయిలో తమ ఆటపైనే దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల సమూలంగా మార్పులు రాకపోయినా...గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుపు పడినట్లే. ప్రస్తుతం టాప్స్ స్కీమ్ కోర్ గ్రూప్‌లో మొత్తం 172 మంది ఆటగాళ్లు ఉన్నారు. నిజానికి టోక్యో ఒలింపిక్స్‌కు ముందే కొందరు ఆటగాళ్లు టాప్స్ ద్వారా శిక్షణ పొందారు. కానీ అప్పటికి తగినంత సమయం లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు పారిస్ లక్ష్యంగా క్రీడాకారులు సన్నద్ధమయ్యారు. మరి ఈసారి మన పతకాల సంఖ్య పెరిగి రెండంకెలకు చేరుతుందా అనేది చూడాలి.రెండో ప్రపంచయుద్ధం వల్ల 1940, 1944 సంవత్సరాల్లో జరగాల్సిన ఒలింపిక్స్ రద్దయ్యాయి. నిజానికి 1940 ఒలింపిక్స్ టోక్యోలో జరగాల్సి ఉన్నా, జపాన్‌లో యుద్ధబీభత్సం కారణంగా ఆ ఏడాది ఒలింపిక్ వేదిక ఫిన్లండ్‌కు మారింది. అయినా, తర్వాత అది కూడా రద్దయింది. – మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ లుక్ ఓ రేంజ్లో ఉంది. ఆమె స్టైలిష్ లుక్ ఆహుతులని మైమరిచిపోయేలా చేసింది. ముఖ్యంగా ఆ డిజైనర్ దుస్తుల్లో నడిచి వచ్చే విధానం హాట్‌టాపిక్‌గా మారింది. పారిస్ హాట్ కోచర్ వీక్ 2024లో ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రాకు మద్దతు ఇచ్చేందుకు జాన్వీ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఆరా బ్రాండ్ హోలోగ్రాఫిక్ టోన్ డిజైనర్ వేర్‌తో పారిస్ ఫ్యాషన్ వేదికపైకి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది జాన్వీ. ఈడ్రెస్ ముదురు బ్లాక్క లర్‌లో అల్లికలతో డిజైన్ చేసిన మెర్మైడ్ స్కర్ట్‌లా ఉంది. అందుకు తగ్గట్లు స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో జత చేయడం ఆమె లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకుకెళ్లింది. దీనికి తగ్గట్టు ఆమె మేకప్, కేశాలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంది. చెప్పాలంటే అక్కడ ఉన్న వారందరీ చూపు అటెన్షన్‌తో జాన్వీపైనే దృష్టి సారించేలా ఆమె రూపు ఉంది. ఇక్కడ జాన్వీ వేదికపై ఓ మత్సకన్యా మాదిరిగా ఆమె స్టన్నింగ్ లుక్ ఉండటం విశేషం. నిజంగానే మత్స్య కన్యేనా అని భ్రమింప చేసేలా ఉంది జాన్వీ లుక్. ముఖ్యంగా ఆ వేదికపై నడిచి వచ్చిన విధానం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు జాన్వీ స్టైలిష్ లుక్‌కి ఫిదా అవ్వతూ ఆమె నడిచే వచ్చే తీరు హీరామండి మూవీలో ది డైమండ్ బజార్ నుంచి గజగామినిలా నటించిన అదితి రావ్ హైదరీ నడకలా ఉందని ఒకరూ, 'ధితామ్ ధితామ్ ధిన్'లా నాట్యం చేసేందుకు వెళ్తున్నట్లుగా ఉందని మెచ్చకుంటూ పోస్టులు పెట్టారు. ఇక ఫ్యాషన్ వీక్‌లో రాహుల్ మిశ్రాకు మద్దతుగా బాలీవుడ్ ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఇంతకు మునుపు రాహుల్ మిశ్రాకు సపోర్ట్ చేస్తూ..బాలీవుడ్ నటి అనన్ యపాండే రంగురంగుల సీక్వెన్ డ్రెస్‌తో సీతాకోక చిలుక మాదిరిగా ఈఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ రాహుల్ మిశ్రా.. రాహుల్ మిశ్రా ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్. పారిస్‌లోని హాట్ కోచర్ వీక్‌లో ప్రదర్శనకు ఆహ్వానం దక్కించుకున్న తొలి భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా. ఆయన 2014లో మిలన్ ఫ్యాషన్ వీక్‌లో అంతర్జాతీయ వూల్మార్క్ బహుమతిని గెలుచుకున్నాడు. ఆయనకు మద్దతిచ్చేలా ఇలా బాలీవుడ్ ముద్దుగుమ్ములు అతడి డిజైనర్ కలెక్షన్లతో ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై సందడి చేశారు. మరీ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో జాన్వీ తదుపరి ముద్దుగుమ్మ ఎవరో వేచి చూడాల్సిందే. ఇక ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షో జూన్ 24 నుంచి జూన్ 27 వరకు పారిస్‌లో ఘనంగా జరుగుతాయి. View this post on Instagram A post shared by DietSabya® (@dietsabya) (చదవండి: ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!) -
MS Dhoni: ప్యారిస్ టూర్లో జీవాతో పాటు ధోని- సాక్షి (ఫొటోలు)
-
ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు.. ఆకస్మిక ఎన్నికలకు మేక్రాన్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ.. ఆకస్మిక ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతిత్వరలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారాయన. యూరోపియన్ యూనియన్(EU) పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ భారీ ఓటమి చవిచూస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. జూన్ 30న తొలి విడత, రెండో విడత ఎన్నికలు జూలై 7న జరగనున్నాయని మేక్రాన్ ప్రకటించారు. అయితే.. ఈయూ ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీ 31.5 శాతం ఓట్లు, మాక్రేన్ రెనాయిసెన్స్ పార్టీకి 15.2 శాతం ఓట్లు.. పైగా సగం ఓట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అలాగే.. సోషలిస్ట్ పార్టీ 14.3 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలుస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆయన పార్లమెంట్ రద్దును ప్రకటించి.. ఆ వెంటనే ఆకస్మిక ఎన్నికల ప్రకటన చేశారు.‘రైట్ పార్టీలు పలు చోట్ల పుంజుకుంటున్నాయి. అయితే నేను రాజీనామా చేసే పరిస్థితి లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రాత్రి(ఆదివారం)కే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా. ఈ నిర్ణయం చాలా పెద్దది. ఫ్రాన్స్ ప్రజలపై ఉన్న నమ్మకంతో, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మేక్రాన్ అన్నారు.ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి 577 మంది దిగువ సభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. వాస్తవానికి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. ఇక.. ఈయూ ఎన్నికలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నిక విధానం. 720 మంది ప్రతినిధులు ఉండే యూరోపియన్ పార్లమెంట్‌ను ఎన్నుకునేందుకు 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాలు.. యూరోపియన్ యూనియన్ నిర్ణయాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. వాతావరణ మార్పులు, రక్షణ, వలసలు, అంతర్జాతీయ దౌత్యం లాంటి అంశాలు.. అదీ చైనా, అమెరికా లాంటి దేశాల దౌత్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. -
ప్యారిస్–ముంబై విమానానికి బాంబు బెదిరింపు
ముంబై: పారిస్ నుంచి 306 మందితో ముంబై బయల్దేరిన విస్తారా విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ‘బాంబు పెట్టాం’ అని రాసిన నోట్ ఎయిర్ సిక్నెస్ బ్యాగ్‌లో కనిపించింది. దాంతో ముంబైలో లాండవగానే అందరినీ హుటాహుటిన దించేసి తనిఖీలు చేపట్టారు. బాంబు సహా అనుమానాస్పద వస్తువులేవీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
French Open 2024: నేటినుంచి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
ప్రతిష్టాత్మక క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. పారిస్‌లో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ 9 జూన్ వరకు సాగుతుంది. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం అందరి దృష్టీ దిగ్గజ ఆటగాడు, 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్)పైనే ఉంది. తొలి రౌండ్లో అతను సోమవారం నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడతాడు.ఈ జూన్ 3న 38 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నాదల్ వరుస గాయాలతో ఇబ్బంది పడుతూ ఒక దశలో టోరీ్నకి దూరమయ్యేలా కనిపించాడు. అయితే శనివారం మీడియాతో మాట్లాడిన అతను తాను ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నానని, ఇది చివరి ఫ్రెంచ్ ఓపెన్ కాకపోవచ్చని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన మ్యాచ్‌లలో మహిళల సింగిల్స్‌లో లూసియా బ్రాన్జెట్టీతో 4 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నయోమీ ఒసాకా తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో జేజే వుల్ఫ్‌ను మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ ఎదుర్కొంటాడు. అయితే సీనియర్లు ఆండీ ముర్రే, స్టాన్ వావ్రింకా మధ్య పోరు అత్యంత ఆసక్తికరం కానుంది. -
సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’..!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత నంబర్‌వన్, ప్రపంచ 94వ ర్యాంకర్ సుమిత్ నగాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో సుమిత్ ఆడతాడు.గతంలో వీరిద్దరు ముఖాముఖిగా ఒక్కసారి కూడా తలపడలేదు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ తన కెరీర్లో 6 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా... సుమిత్ ఒక్కసారి కూడా ఏటీపీ టూర్ టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు కూడా తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు.14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో ఆడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఈనెల 26 నుంచి జరుగుతుంది.ఇవి చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే.. -
ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు దేశీ భోజనం..హయిగా పప్పు, అన్నం..!
క్రీడలు ఏదైనా.. టోర్నీ ఎక్కడ జరిగినా.. స్థానిక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వేరే దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గొనాలంటే మాత్రం ఆటగాళ్లు పలు సమస్యలు ఎదర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడి వాతావరణం తోపాటు ఫుడ్‌కి అలవాటు పడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కొందరూ త్వరగా ఆ పరిస్థితులకు సెట్ అయినా మరికొందరు ఆటగాళ్లు నానాపాట్లు పడుతుంటారు. ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో ఆ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన భారతీయ వంటకాలకు చోటు ఉండదు. అలాంటిది ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో మాత్రం భారతీయ వంటకాలతో కూడిన మెను పెట్టనున్నారు. చక్కగా పప్పు అన్నం, కోడి కూర, గోబీ, ఆలు వంటి రుచికరమైన వంటకాలను క్రీడకారులకు పెట్టనన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు ఈ ఫుడ్ సమస్యను ఎన్నేళ్లుగానో ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు చెక్ పెడుతూ..ఈసారి జరగనున్న ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులకు పప్పు, అన్నం వడ్డించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ అంగీకరించడం విశేషం. ఈ ఏడాది ఒలింపిక్స్ పారిస్‌లో వేదికగా జరగనున్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లకు ఇక ఫుడ్ సమస్య ఉండదు. చక్కగా అథ్లెట్ల గ్రామంలో మన క్రీడాకారులకు భారతీయ వంటకాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎంచక్కా మన ఆటగాళ్లు పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర పులుసులను ఆస్వాదించవచ్చు. అంతేగాదు భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహార మెనుకి సంబంధించిన లిస్ట్‌ని ఓలింపిక్స్ నిర్వాహకులకు పంపించామని భారత డిప్యూటీ చెఫ్ డి మిషన్ శివ కేశవన్ తెలిపారు. ఇంతవరకు దక్షిణాసియా వంటకాలే.. భారత వంటకాలతో కూడిన మెనూ ఉండాలని చేసిన ప్రతిపాదనలకే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెఫ్ శివ తెలిపారు. ఇక ఈ జాబితాను పోషకాహార నిపుణుడి సూచనల మేరకే రూపొందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో మన అథ్లెట్ల ఆహారం విషయంలోనే పెద్ద సమస్య ఉందన్నారు చెప్పాలంటే..ఒలింపిక్స్‌లో క్రీడాకారుల భోజన మెనులో ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల వంటకాలు ఉంటాయి. కేవలం మనవాళ్లకి మినహా. అందువల్లే మన భారతీయ అథ్లెట్లకు దక్షిణాసియా వంటకాలు ఉండాలని పట్టుబట్టడం జరిందన్నారు శివ. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్స్ మండలి అంగీకరించిందని చెప్పారు. కాగా, ఈ అథ్లెట్ల గ్రామంలోనే డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో పూర్తిస్థాయి భారత క్రీడా సైన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగాట్, క్రికెటర్ రిషబ్ పంత్‌కు చికిత్స అందించింది దిన్‌షానే. ఈ క్రీజా సైన్స్ కేంద్రంలో అన్ని రకాల మెడిసెన్స్, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటుంది. ఇప్పటికే ఈ క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు కోసం భారత్ నుంచి చాలా యంత్రాలను అక్కడికి పంపించారు. ఇంకా పారిస్ ఒలింపిక్స్ కోసం రవాణా, పాటించాల్సిన నియమ నిబంధనలు ఇంకా తదితర విషయాలను మన అథ్లెట్లుగా ముందుగానే వివరిస్తామని కూడా శివ తెలిపారు. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్ స్ప్రే
పారిస్: ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్‌పైకి పర్యావరణ ఉద్యమకారులు సూప్‌ను స్ప్రే చేశారు. అయితే, పెయింటింగ్‌కు గ్లాస్ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్ట వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ పారిస్‌లోని లౌవ్రె ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం ‘రిపోస్టె అలిమెంటయిర్’అనే గ్రూపునకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూప్‌ను మొనాలిసా పెయింటింగ్‌పైకి స్ప్రే చేశారు. అనంతరం వారు ‘కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైంది? వ్యవసాయరంగం సమస్యల్లో ఉంది. రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్‌ను తొలగించి, శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు పారిస్‌ను దిగ్బంధించారు. గతంలోనూ దెబ్బతింది ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో, పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్‌కు రక్షణగా గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూ గ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్‌పైకి కేక్‌ను విసిరేశాడు. -
France PM Gabriel Attal: ఒక ‘గే’ ఫ్రాన్స్‌కు ప్రధానిగా ఎలా ఎదిగారు?
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియేల్ అటల్ నియమితులయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తమ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అటల్(35)ను తన కొత్త ప్రధానిగా నియమించారు. యుద్ధానంతర ఫ్రాన్స్‌కు గాబ్రియేల్ అటల్ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. గాబ్రియేల్ అటల్‌కు ముందు లారెంట్ ఫాబియస్ తన 37 ఏళ్ల వయస్సులో అతి పిన్నవయసు ప్రధాని అయ్యారు. 1984లో ఫ్రాంకోయిస్ మిత్రాండ్ ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు. తాజాగా ఎలిజబెత్ బోర్న్ స్థానంలో గాబ్రియెల్ నియమితులయ్యారు. గాబ్రియేల్ అటల్ బహిరంగంగా తాను స్వలింగ సంపర్కుడినని (గే) ప్రకటించుకున్నారు. గాబ్రియేల్ అటల్ 2018లో మాక్రాన్ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా ఉన్నప్పుడు చర్చల్లో నిలిచారు. ఆ సమయంలో అటల్.. మాక్రాన్ మాజీ రాజకీయ సలహాదారు స్టెఫాన్ సెజోర్న్తో సంబంధం ఏర్పరుచుకున్నారు. గాబ్రియేల్ అటల్ మాజీ క్లాస్మేట్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో గాబ్రియేల్ అటల్ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా పనిచేశారు. అప్పటి నుండి ఫ్రెంచ్ రాజకీయాల్లో కీలకనేతగా మారారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు అటల్ ఆయనకు సలహాదారునిగా ఉన్నారు. అలాగే ఐదేళ్లపాటు ఆరోగ్య మంత్రికి సలహాదారుగానూ పనిచేశారు. దశాబ్ద కాలంలోనే ఫ్రాన్స్ ప్రధానమంత్రి పదవిని అందిపుచ్చుకున్నారు. అటల్ 2027 జూన్ 18న ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు అటల్ 1989 మార్చి 16న పారిస్ సమీపంలోని క్లామార్ట్లో జన్మించారు. అటల్ ట్యునీషియా యూదు న్యాయవాది, చిత్రనిర్మాత వైవ్స్ అటల్ కుమారుడు. అటల్ తండ్రి 2015లో కన్నుమూశారు. అటల్ తన ముగ్గురు చెల్లెళ్లతోపాటు పారిస్‌లో పెరిగారు. అతని తల్లి మేరీ డి కోర్రిస్ ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పనిచేశారు. అటల్ పారిస్‌లోని ఎకోల్ అల్సాసిన్ పాఠశాలలో చదువుకున్నారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాక, ప్రతిష్టాత్మక సైన్సెస్ పో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అనంతరం పబ్లిక్ అఫైర్స్‌లో పీజీ పట్టా పొందారు. అటల్ రాజకీయ జీవితం 2006లో సోషలిస్టు పార్టీలో చేరడంతో ప్రారంభమయ్యింది. -
Vishnupriya Bhimeneni: పారిస్‌లో చిల్ అవుతోన్న విష్ణుప్రియ (ఫోటోలు)
-
ఏడు కోట్ల విలువైన డైమండ్ రింగ్ మాయం.. తీరా చూస్తే..
లగ్జరీ హోటల్‌కు వెళ్లిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఏడు కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్ కనిపించకపోవడంతో సదరు మహిళ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో పోగొట్టుకున్న రింగ్ ఆమె తప్పిదం వల్లే మరో చోట దొరకడంతో ఖంగుతుంది. ఈ ఘటన ప్యారిస్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్యారిస్‌లోని ప్రఖ్యాత హోటల్ రిట్జ్‌లో బస చేసిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంకేముంది. ఆ మహిళ ఆరునొక్క రాగం అందుకుంది. హోటల్ సిబ్బందిపై చిర్రుబుర్రులాడింది. పాపం హోటల్ వాళ్లు కూడా ప్రతిష్టకు పోయారు. ఇంతపెద్ద హోటల్లో అంత విలువైన ఆభరణం చోరీ అవడమేమిటి? ఠాట్! అనుకున్నారేమో... హోటల్ మొత్తం వెతకడం మొదలు పెట్టారు. ప్రతివ్యక్తినీ అనుమానించారు. శోధించారు. బ్యాగేజీ.. ఫర్నీచర్.. బీరువాలు.. లాకర్లు.. ఇలా సిబ్బంది వెతకని చోటంటూ లేకపోయింది. అంత చేసినా ఆ ఉంగరం దొరికిందా? ఊహూ లేదు! ఇక మా వల్ల కాదని సిబ్బంది కూడా చేతులెత్తేస్తున్న సమయంలో సిబ్బందిలో ఒకరు.. ‘దొరికింది’ అని గాట్ఠిగా అరవడం వినిపించింది. ఎక్కడో తెలుసా?.. వాక్యూమ్ క్లీనర్ బ్యాగ్‌లో!. అంటే.. ఆ మహిళ దాన్ని గదిలో ఎక్కడో పడేసుకుంటే.. కార్పెట్‌ను క్లీన్ చేస్తుండగా వాక్యూమ్ క్లీనర్ ద్వారా లోపలికి చేరిపోయిందన్నమాట!. ఇక, విలువైన డైమండ్ రింగ్ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఆమెను మలేషియాకు చెందిన మహిళగా గుర్తించారు. Diamond ring, worth €750K is lost in the luxury Ritz hotel in Paris, before found in a vacuum cleaner bag. British Museum is set to publish, an independent review of how its artefacts were stolen, and sold. Gigantic skull of sea monster Pliosaur is found, on the cliffs of Dorset pic.twitter.com/uHHRpTIbFn — News Source Crawler (@NewsSrcCrawler) December 11, 2023 -
పారిస్ ఒప్పందానికి చిల్లు? భయపెడుతున్న భూతాపం!
ప్రపంచ మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం. దీనిని నియంత్రించే లక్ష్యంతో 2015లో 200 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు ఈ దేశాలన్నీ తగిన చర్యలు చేపట్టాలి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంట్రీగ్రేడ్‌ల కన్నా తక్కువకు నియంత్రించాలి. అప్పుడే విపత్కర వాతావరణ ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చని పారిస్ ఒప్పందంలో తీర్మానించారు. అయితే ఇది విఫలమయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2023 నవంబరు 17న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోజు భూ ఉపరితల ఉష్ణోగ్రత పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇదే రికార్డుగా నిలిచింది. ఇది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన గాలి ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రత, అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం మొదలైనవి భూతాపం పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గత జూలైలోనూ భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్ నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నాయని మరో నివేదిక పేర్కొంది. భూతాపం నియంత్రణకు అన్ని దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడం, అటవీ రక్షణ పెంపుదల, మొక్కల ఆధారిత ఆహారాలవైపు మళ్లడం, కొత్త బొగ్గు ప్రాజెక్టులను ఎత్తివేయడం, చమురు, గ్యాస్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి, చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని ఈ ముప్పు నుంచి బయటపడేయచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా? -
Interesting World Facts: ఆశ్చర్యం కలిగించే ప్రపంచ నిజాలు
-
పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య నెల రోజులుగా యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం కారణంగా ఫ్రాన్స్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం డిపార్చర్ హాల్లో 30 మంది ముస్లింలు నమాజ్ చేశారు. విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో ఈ ప్రార్థనలు జరిగాయి. ఈ ఉదంతంపై ఫ్రాన్స్ మాజీ మంత్రి నోయెల్ లెనోయ్ స్పందిస్తూ ఎయిర్ పోర్టులో నమాజ్ చేయడం విచారకరమని అన్నారు. ప్రార్థనల కోసం తగిన ప్రార్థనా స్థలాలు ఉన్నాయని, అక్కడ వీటిని నిర్వహించుకోవాలని అన్నారు. ఎయిర్ పోర్టులో ఇలాంటి చర్యలను అరికట్టాలని, నిఘా మరింతగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విమానాశ్రయం ప్రార్థనా స్థలంగా మారినప్పుడు సీఈఓ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా ‘విమానాశ్రయంలో ప్రత్యేక ప్రార్థన స్థలం అందుబాటులో ఉందని, ఎయిర్‌పోర్టులో నిబంధనలను అమలు చేసేందుకు విమానాశ్రయ అధికారులు కట్టుబడి ఉన్నారని ఫ్రెంచ్ రవాణా మంత్రి క్లెమెంట్ బ్యూన్ ట్విట్టర్లో తెలిపారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధ నేపధ్యంలో ముస్లింలకు మద్దతుగా పారిస్ ఎయిర్‌పోర్టులో నమాజ్ చేశారని భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: మనిషి దీర్ఘాయుష్షు ఎంత? -
Lionel Mess: ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ నెగ్గిన మెస్సీ.. (ఫొటోలు)
-
భారత్ ‘పారిస్’ ఆశలు ఆవిరి
తాస్కాంట్: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించే అవకాశాలకు తెరపడింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో భారత్ 0–7తో ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్ చేతిలో ఓడిపోగా...ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియాకు 1–3 గోల్స్ తేడాతో వియత్నాం జట్టు చేతిలో పరాజయం ఎదురైంది. లీగ్ దశ తర్వాత మూడు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లతోపాటు రెండో స్థానంలో నిలిచిన ఉత్తమ జట్టు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తరఫున సంధ్య రంగనాథన్ (80వ ని.లో) ఏకైక గోల్ చేయగా... వియత్నాం తరఫున హున్ ఎన్హు (4వ ని.లో), ట్రాన్ థి హై లిన్ (22వ ని.లో), ఫామ్ హై యెన్ (73వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ ఈ మ్యాచ్‌లో 59 నిమిషాలు ఆడింది. ఆ తర్వాత ఆమె స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా గ్రేస్‌ను బరిలోకి దించారు. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబర్ 1న ఉజ్బెకిస్తాన్‌తో ఆడుతుంది. -
అమ్మా నాన్న ఒక ఆరిల్
సినిమాలకు దూరమైనా సరే, నటులపై ఆసక్తి మాత్రం దూరం కాదు. ‘ఫలానా నటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ‘ఫలానా కథానాయిక ఇప్పుడు ఏ దేశంలో ఉంటుందో తెలుసా?’... ఇలాంటి విషయాలు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే. ‘గజిని’ ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ ‘ఘర్షణ’... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆశిన్ పెళ్లి తరువాత నటనకు దూరమైంది. కొన్ని నెలల క్రితం... ఆసిన్ భర్త నుంచి విడాకులు తీసుకుందని, మళ్లీ సినిమాలలో నటించనుందని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ‘అలాంటిది ఏమీ లేదండీ బాబూ. నేను మళ్లీ సినిమాల్లో నటించడం లేదు’ అని ఆసిన్ స్వయంగా ప్రకటించింది. తాజాగా... ప్యారిస్‌లో జరిగిన కుమార్తె ఆరిన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆసిన్. వీటిలో ఆమె భర్త రాహుల్ శర్మ కూడా ఉన్నాడు. ఇక రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడినట్లే కదా! -
నిఖత్ ‘డబుల్’ ధమాకా
తన పంచ్ పవర్ ఎలా ఉంటుందో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి చాటుకుంది. ఆసియా క్రీడల్లో తొలిసారి పాల్గొంటున్న ఈ తెలంగాణ బాక్సర్ 50 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ కేవలం 53 సెకన్లలో రిఫరీ స్టాప్స్ కంటెస్ట్ (ఆర్ఎస్సీ) పద్ధతిలో విజయాన్ని అందుకుంది. హనన్ నాసర్ (జోర్డాన్)తో జరిగిన ఈ బౌట్లో నిఖత్ సంధించిన పంచ్‌లకు ఆమె ప్రత్యర్థి బెంబేలెత్తిపోయింది. దాంతో మూడు నిమిషాల నిడివి గల తొలి రౌండ్లో 53 సెకన్లు ముగియగానే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. గత ఏడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో.. 2022, 2023 ప్రపంచ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాలు గెలిచిన నిఖత్ ఆసియా క్రీడల పతకాన్ని కూడా ఖాయం చేసుకుంది. ‘క్వార్టర్ ఫైనల్లో గెలవడంతోపాటు తొలిసారి ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే’ అని 27 ఏళ్ల నిఖత్ వ్యాఖ్యానించింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో చుథామట్ రక్సత్ (థాయ్‌లాండ్)తో నిఖత్ తలపడుతుంది. మరోవైపు 57 కేజీల విభాగంలో పర్వీన్ క్వార్టర్ ఫైనల్ చేరగా.. పురుషుల 80 కేజీల విభాగంలో లక్ష్య చహర్ ఓడిపోయాడు. పరీ్వన్ 5–0తో జిచున్ జు (చైనా)పై నెగ్గగా... లక్ష్య చహర్ 1–4తో ఒముర్బెక్ (కిర్గిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
Janhvi Kapoor Paris Holiday: పారిస్‌లో చిల్ అవుతోన్న దేవర భామ జాన్వీ కపూర్! (ఫొటోలు)
-
ప్యారిస్ సభలో బీజేపీపై రాహుల్ ఫైర్..
ఢిల్లీ: బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూయిజంతో వారికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హిందువులకు వారు చేసిందేమీ లేదని చెప్పారు. తాను భగవద్గీత, ఉపనిషత్‌లను చదివానని ఎక్కడా కూడా హిందువులు(బీజేపీ) వారి గురించి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లో సైన్స్ పీఓ యూనివర్సిటీ విద్యార్ధులతో ముచ్చటించారు. I have read the Gita, Upanishads and many Hindu books. There is nothing Hindu about what the BJP does—absolutely nothing. I have not read anywhere in any Hindu book or heard from any learned Hindu person that you should terrorize or harm people who are weaker than you. They… pic.twitter.com/mEj2vOrAxq — Congress (@INCIndia) September 10, 2023 "మీ కంటే బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయాలని లేదా హాని చేయాలని నేను ఏ హిందూ పుస్తకంలో చదవలేదు. ఏ హిందూ పండితుడి నుంచి వినలేదు. ఈ ఆలోచన, హిందూ జాతీయవాది అనేది పూర్తిగా తప్పు పదం. 'హిందూ జాతీయవాదులు'లకు హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. "బిజెపి, ఆర్ఎస్ఎస్కు హిందూ మతంతో ఎటువంటి సంబంధం లేదు. వారు ఎలాగైనా అధికారం సాధించాలని చూస్తున్నారు. ఇందుకోసం వారు ఏదైనా చేస్తారు" అని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ యువకులపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఈ విధంగా సమాధానమిచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ లోక్ సభ ఎంపీ తేజశ్వీ సూర్య తప్పుబట్టారు. రాహుల్ గాంధీకి మన ధర్మంపై చాలా తక్కువ అవగాహన ఉందని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ వేదికలకు భారత్ నిలయంగా మారిందని చెప్పారు. జీ20 సమ్మిట్‌లో డిక్లరేషన్‌ను ప్రపంచ దేశాలు 100 శాతం ఆమోదించాయని గుర్తుచేశారు. The very fact that Rahul Gandhi thinks that Hinduism is practiced by referring to ‘books’ shows how shallow his understanding of our dharma. That he has been reduced to crying before a handful of people in some far away European city while Bharat is achieving global consensus… https://t.co/TZk2VmmC6w — Tejasvi Surya (@Tejasvi_Surya) September 10, 2023 ఇదీ చదవండి: జీ20 డిన్నర్ మీటింగ్‌లో మమతా బెనర్జీ.. కాంగ్రెస్ అసంతృప్తి -
రామ్ చరణ్ ఉపాసన పారిస్ టూర్ పోస్ట్ వైరల్..పొరపాటు పడ్డ ఆడియోన్స్
-
Eiffel Tower: బాంబు బెదిరింపుతో ఈఫిల్ టవర్ ఖాళీ
ప్యారిస్: సుందర కట్టడంగా పేరొందిన ఈఫిల్ టవర్ వద్ద ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ప్యారిస్లో ఉన్న ఈ టవర్‌కు శనివారం బాంబు బెదిరింపు వచ్చింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలో దుండగులు ఫోన్ చేసి ఈఫిల్ టవర్‌ను కూల్చేందుకు బాంబు అమర్చామంటూ బెదిరించారు. దీంతో హుటాహుటినా టవర్లలోని ఫ్లోర్లన్నింటిని ఖాళీ చేయించారు అధికారులు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ప్యారిస్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి.. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టి.. 1889 మార్చి 31వ తేదీనాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించగా.. కిందటి ఏడాది 62 లక్షల మంది ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. FRANCE 🇫🇷 The Eiffel Tower has been evacuated due to a bomb threat. This is developing. They don’t seem to be in much of a hurry evacuating. Hmmmm pic.twitter.com/Iabb9SqdXY — Forever Trumper (@FanaTeresafana) August 12, 2023 -
దోపిడి దొంగల బీభత్సం.. గోల్‌కీపర్, అతని భార్యను బంధించి
ఇటలీ గోల్‌కీపర్ గియాన్లుయిగి డోనరుమ్మాకు చేదు అనుభవం ఎదురైంది. పారిస్‌లోని తన ఇంట్లోకి చొరబడిన దుండగులు 500,000 యూరోల(భారత కరెన్సీలో సుమారు రూ. 4కోట్లకు పైగా) విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే అడ్డుపడేందుకు ప్రయత్నించి డోనరుమ్మా, అతని భార్యపై దాడి చేసిన దుండగులు వారిని బంధించి అక్కడి నుంచి పారిపోయారు. కాగా ఇదంతా తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుండగులు డోనరుమ్మా ఇంటి నుంచి పారిపోతున్న సమయంలో పక్కన ఉన్న హోటల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కాగా డోనరుమ్మా ఇంట్లో పనిచేసే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం డోనరుమ్మా, అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి చికిత్స నిర్వహించామని.. అయితే తమ కళ్ల ముందే దొంగతనం జరగడంతో కాస్త షాక్‌లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం డోనరుమ్మా పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతకముందు ఏసీ మిలన్ క్లబ్‌కు ఆడిన డోనరుమ్మా 2020లో ఇటలీ యూరో టైటిల్ కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక 2021లో పీఎస్జీ క్లబ్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. ఇక పీఎస్జీ తరపున ఇప్పటివరకు 72 మ్యాచ్‌లాడాడు. పీఎస్జీ రెండుసార్లు లీగ్-1 ట్రోఫీలు గెలవడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇటలీ తరపున ఇప్పటివరకు 54 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. Understand Gianluigi Donnarumma will travel to Japan with PSG tomorrow, as planned. Donnarumma and his wife were the victims of a violent burglary, during which they were both tied up. They managed to take refuge in a hotel located not far from their home around 3:20am. pic.twitter.com/IBwBo8tjUC — Fabrizio Romano (@FabrizioRomano) July 21, 2023 చదవండి: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి' -
సాఫ్రాన్ అతిపెద్ద ‘ఎంఆర్వో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో ఉన్న ప్యారిస్ కంపెనీ సాఫ్రాన్ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇంజన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) కోసం అతిపెద్ద ఫెసిలిటీ ఏర్పాటు చేస్తోంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సరీ్వసెస్ ఇండియా ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్‌తో ఒప్పందం చేసుకుంది. శంషాబాద్‌లోని ఈ సెజ్‌లో లీజు ప్రాతిపదికన 23.5 ఎకరాల్లో లీడింగ్ ఎడ్జ్ ఏవియేషన్ ప్రొపల్షన్ టర్బోఫ్యాన్ ఇంజన్స్ కోసం ఎంఆర్వో కేం్రద్రం రానుంది. ఏటా 100 ఇంజన్లతో ప్రారంభమై 2035 నాటికి 300 ఇంజన్లకు సర్వీస్ చేయగలిగే స్థాయిలో రూపుదిద్దుకోనుంది. 2023 సెప్టెంబరులో నిర్మాణ పనులు మొదలై 2025లో కార్యరూపం దాల్చనుంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే నాటికి 1,000 మందికి ఉపాధి కలి్పంచనుంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కేంద్రం అతిపెద్ద ఎంఆర్వో ఫెసిలిటీ కానుందని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్స్ సపోర్ట్, సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ నికోలస్ పొచియే తెలిపారు. జీఎంఆర్ ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ పార్క్‌లో ఇప్పటికే సాఫ్రాన్ కేబుల్ హార్నెసింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ కంపోనెంట్ తయారీ కేంద్రాలను స్థాపించింది. -
పారిస్ ఒలంపిక్స్‌కు శ్రీశంకర్ అర్హత
బ్యాంకాక్: భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ (2024)కు అర్హత సాధించాడు. తద్వారా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఈ ఘనత సాధింన తొలి భారత ఆటగాడిగా అతను ఘనత వహించాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో శనివారం జరిగిన పురుషుల లాంగ్‌జంప్ ఈవెంట్లో అతను రజత పతకం సాధించాడు. 24 ఏళ్ల భారత అథ్లెట్ 8.37 మీటర్ల దూరం దుమికి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన అతని కెరీర్లోనే రెండో ఉత్తమ ప్రదర్శన కాగా... పారిస్ ఈవెంట్ క్వాలిఫికేషన్ మార్క్ (8.27 మీటర్లు)ను అధిగమించాడు. శ్రీశంకర్‌కు ఇది రెండో ఒలింపిక్స్ కాగా... గత టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధింన అతను క్వాలిఫికేషన్ రౌండ్లోనే వెనుదిరిగాడు. ఈ లాంగ్‌జంప్‌లో యు తంగ్ లిన్ (8.40 మీ.; చైనీస్ తైపీ) స్వరం గెలుపొందాడు. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో రాజేశ్ రమేశ్, అమోజ్ జాకబ్, ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశన్‌లతో కూడిన భారత బృందం పసిడి పతకంతో మెరిసింది. ఈ రిలే జట్టు పోటీని 3 నిమిషాల 14.70 సెకన్లలో పూర్తిచేసి కొత్త జాతీయ రికార్డును నిలకొల్పింది. గతంలో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నమోదు చేసిన 3ని.15.77 సె. రికార్డును తిరగరాసింది. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో మూడో స్థానంలో నిలిచిన సంతోష్ కుమార్ (49.09 సె.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే 2.26 మీ. ఎత్తు వరకు జంప్ చేసి రజతం గెలిచాడు. మహిళల హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ 5840 పాయింట్లతో రజతం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ 200 మీటర్ల స్ప్రింట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆమె 23.29 సె. టైమింగ్‌తో ఫైనల్స్‌కు అర్హత పొందింది. శనివారం నాటి పోటీల్లో భారత్ ఒక పసిడి, మూడు రజతాలు, ఒక కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో 14 (6 స్వరాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు) పతకాలున్నాయి. చదవండి Wimbledon: మహిళల సింగిల్స్‌లో సంచలనం.. వొండ్రుసోవా సరికొత్త చరిత్ర -
ప్రధాని నోట 'ఎంబాపె' మాట..'నీకు భారత్‌లో మస్తు క్రేజ్'
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌కు చేరుకున్న మోదీకి దేశ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. కాగా ప్రధాని మోదీ నోటి వెంట ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్.. జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పేరు రావడం ఆసక్తి కలిగించింది. పారిస్‌లోని లా సినేలో భారతీయ సంఘంతో సమావేశమయ్యారు. భారతీయ సంఘానికి తన సందేశాన్ని వినిపిస్తూ ఎంబాపె గురించి ప్రస్తావించారు. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతుందని పేర్కొన్నారు. '' ఇవాళ ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న కైలియన్ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మా దేశంలో ఎంబాపెకు మస్తు క్రేజ్ ఉంది. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. #WATCH | French football player Kylian Mbappe is superhit among the youth in India. Mbappe is probably known to more people in India than in France, said PM Modi, in Paris pic.twitter.com/fydn9tQ86V — ANI (@ANI) July 13, 2023 ఇక 2018లో ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలవడంలో ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ అర్జెంటీనాతో జరిగిన ఫైనల్లోనూ ఎంబాపె సంచలన ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి మెస్సీ జట్టుకు వణుకు పుట్టించాడు. పెనాల్టీ షూటౌట్లో ఓడి ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలిచినప్పటికి ఎంబాపె తన ప్రదర్శనతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ ఒక్క ప్రదర్శనతో మెస్సీ, రొనాల్డో తర్వాత అత్యధిక అభిమానగనం సంపాదించిన ప్లేయర్‌గా ఎంబాపె చరిత్రకెక్కాడు. 2017లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించిన ఎంబాపె అనతికాలంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. 24 ఏళ్ల వయసులోనే సంచలన ఆటతో అదరగొడుతున్న ఎంబాపె ఇప్పటివరకు ఫ్రాన్స్ తరపున 70 మ్యాచ్‌లాడి 40 గోల్స్ చేశాడు. చదవండి: #CarlosAlcaraz: 'నాన్నను నిందించొద్దు.. ప్రేమతో అలా చేశాడు; నాకు ఒరిగేదేం లేదు!' క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం -
ఫ్రాన్స్‌లో మోదీకి రెడ్‌కార్పెట్
పారిస్: ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో రెడ్‌కార్పెట్ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బార్నీ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి పూర్తి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. శుక్రవారం ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా మోదీ పాల్గొంటారు. అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో సమావేశమవుతారు. ‘‘పారిస్ చేరుకున్నా. భారత్–ఫ్రాన్స్ మధ్య మరింత సంబంధాలు బలపడేందుకు నా పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్‌లోని భారతీయులతో భేటీ కాబోతున్నానని వెల్లడించారు. వారంతా ఆయన బస చేసిన హోటల్ బయట గుమికూడి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. వారితో మోదీ ముచ్చటించారు. ప్రవాస భారతీయులు తమ నైపుణ్యాలు, కష్టించే తత్వంతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ప్రశంసించారు. ఈ పర్యటన నాకెంతో ప్రత్యేకం భారత్–ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి తన పర్యటనతో మరింత ఊపొస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. రక్షణ భాగస్వామ్యంతోపాటు కీలక అంశాలపై ఆయనతో చర్చించబోతున్నానని వివరించారు. రాబోయే పాతికేళ్లలో ఇరు దేశాల బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మాక్రాన్‌తో కలిసి పనిచేస్తామన్నారు. ఫ్రాన్స్ పర్యటన తనకెంతో ప్రత్యేకమని ఉద్ఘాటించారు. నేషనల్ డే పరేడ్‌లో 269 మంది జవాన్ల భారత బృందం పాలుపంచుకోనుంది. తర్వాత మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని అబూదాబీలో పర్యటిస్తారు. 26 రఫేల్ జెట్లు, 3 స్కారి్పన్ సబ్మెరైన్లు న్యూఢిల్లీ: నావికా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పిన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ శాఖ గురువారం ఆమోద ముద్ర వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని రక్షణ ఆయుధాల సేకరణ మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విలువ రూ.85,000 కోట్ల దాకా ఉంటుందని అంచనా. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతం కానుంది. ప్రధాని మోదీ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీఅలో ద్వైపాక్షిక వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతంలో భాగంగా రఫేల్, స్కారి్పన్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంటారని సమాచారం. వైమానిక దళం కోసం ఫ్రాన్స్ నుంచి 36 ఫైటర్ జెట్లను భారత్ ఇప్పటికే కొనుగోలు చేసింది. -
నేటి నుంచి ఫ్రాన్స్‌లో... ప్రధాని మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అధికారిక పర్యటన వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ కవాతులో భారత త్రివిధ దళాలకు చెందిన బృందం పాల్గొననుంది. ప్రధాని అయ్యాక మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఐదోసారి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మోదీకి ఫ్రాన్స్ అధికార విందుతోపాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులనూ మోదీ కలుస్తారు. అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలు, అక్కడి ప్రముఖులను కలుస్తారు. ‘ఇండియా–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆరంభమైన ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల భిన్నరంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సాంస్కృతిక, శాస్త్రీయ, విద్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ‘ నేవీ వేరియంట్ 26 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుతోపాటు ఇరుదేశాలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందం ఖరారుకావచ్చు’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. ఫ్రాన్స్ గణతంత్ర వేడుకలుగా భావించే బాస్టిల్ డే కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం సీ–17 గ్లోబ్‌మాస్టర్ యుద్ధసరుకు రవాణా విమానంలో పారిస్‌కు చేరుకుంది. ఛాంప్స్ ఎలీసెస్ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్ యుద్ధవిమానాలకు తోడు భారత రాఫెల్ ఫైటర్జెట్లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొననున్నాయి. తిరుగుప్రయాణంలో యూఏఈలో పర్యటన ఫ్రాన్స్ పర్యటన తర్వాత తిరుగుప్రయాణంలో జూలై 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షులు, అబుదాబీ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తో ఈ సందర్భంగా మోదీ భేటీ కానున్నారు. సంస్కృతి, ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్‌టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవడంపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నారు. ‘కాప్–28కు యూఏఈ, జీ20కి భారత్ సారథ్యం వహిస్తున్న ఈ తరుణంలో అగ్రనేతలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరపనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
మూలానికి మందు వేయాలి!
ఒకటి కాదు రెండు కాదు... ఇప్పటికి ఎనిమిది రోజులు. ఫ్రాన్స్ తగలబడుతూనే ఉంది. ప్యారిస్‌కు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించినందుకు కారు ఆపమన్నప్పుడు ఆపని పాపానికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని నేరానికి 17 ఏళ్ళ నల్లజాతి టీనేజర్‌ను ఓ పోలీసు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపిన వీడియో ప్రజాగ్రహం పెల్లుబికేలా చేసింది. పాశవిక చర్యకు పాల్పడ్డ పోలీసుపై సరైన చర్య తీసుకోకపోవడం అల్లర్లకు దారి తీసినట్టు పైకి కనిపిస్తున్నా, లోలోపల ఫ్రాన్స్‌ను పీడిస్తున్న అనేక అంశాలున్నాయి. ఆఫ్రికన్, అరేబియన్ మూలాలున్న నల్ల జాతీయులు, నిరుపేదలు ఏళ్ళ తరబడిగా ఎదుర్కొంటున్న జాతివివక్ష ఇలా విస్ఫోటించింది. యువత వీధుల్లోకొచ్చి కార్లు తగలబెట్టి, బడులు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, దుకాణాల్ని లూఠీ చేసే పరిస్థితి తెచ్చింది. 2018 నాటి ‘ఎల్లో వెస్ట్స్‘ నిరసనల తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను ఎన్నడెరుగని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు వేలాది భద్రతా సిబ్బందిని బరిలోకి దింపడం సరే కానీ, ఆర్థిక – సామాజిక అసమానతల కేంద్రంగా మారిన ఆ దేశం చేయాల్సిన అసలు పని వేరే ఉంది. సంపన్న సాంస్కృతిక వారసత్వం, చైతన్యశీలతతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఫ్రాన్స్ ఇప్పుడు వీధుల్లోకి విస్తరించిన అసంతృప్తికీ, హింసాత్మక ప్రదర్శనలకూ కేంద్రమవడం గమనార్హం. ప్యారిస్ మొదలు అనేక చోట్లకు విస్తరించిన తాజా అల్లర్లే అందుకు నిదర్శనం. మెక్రాన్ సత్వరమే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అల్జీరియన్ సంతతికి చెందిన టీనేజర్ నహేల్ హత్య అంగీకారయోగ్యం, క్షమార్హం కాదంటూనే, మూక దాడులు, విధ్వంసం సైతం సమర్థ నీయం కావన్నారు. ఆయన మాటలు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశమే. అల్లర్లు అదుపులోకి వచ్చాక పాలకులకూ, ప్రజలకూ మధ్య చర్చకు ఆ మాటలు ఉపకరిస్తాయి. కానీ, మాటలొక్కటే సరి పోవు. 2011లో బ్రిటన్ నుంచి 2013లో అమెరికాలో ‘బ్లాక్‌లైవ్స్ మేటర్’ ఉద్యమం దాకా పాశ్చాత్య దేశాల్లో జాతివివక్ష పోలీసు దౌర్జన్యాలపై అల్లర్లు పదేపదే జరుగుతూనే ఉన్నాయనేది చరిత్ర పాఠం. ఫ్రాన్స్‌లో పోలీసులు ఆదేశించినప్పుడు వాహనం ఆపకున్నా, బెదిరించినా ఆ వాహన చోదకుణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి. 2017లో చేసిన సవరణ అలాంటి అపరిమిత అధికారం పోలీసులకు కట్టబెట్టింది. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇలాంటి పోలీసు కాల్పులు, మరణాలు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గత ఏడాది ఇలాంటివి 13 జరిగాయట. ఇన్నేళ్ళలో ఈ బాధితుల్లో అత్యధికులు నల్లజాతి వారే. గీత దాటితే శిక్షించాల్సిందే కానీ, కాల్చి చంపేందుకు అనుమతించడం దారుణం. ఈ చట్టాన్ని ఫ్రాన్స్ తక్షణం రద్దు చేయాలి. పోలీస్ దౌర్జన్యం, పాలనాపరమైన దీర్ఘకాలిక నిర్లక్ష్యం, వర్గ అసమానతలనేవి ఇవాళ ఫ్రాన్స్ సహా ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక ప్రాంతాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న అంశాలు. సత్వరం దృష్టి పెట్టాల్సిన సమస్యలు. ఫ్రాన్స్‌లో పట్టణాలు, నగరాల చుట్టూ శివార్లలో అల్పాదాయ వర్గాల గృహసముదాయాలైన ‘బాన్లూ్య’లు ఉంటాయి. ఒకప్పటి ఫ్రెంచ్ వలస దేశాల శరణార్థులు ప్రధానంగా ఉండే ప్రాంతాలివి. ఈ శివారు నివాస సముదాయాల, అక్కడి పరదేశీయుల కష్టనష్టాలను నివారించడం కీలకం. 2021 నాటి అంచనా ప్రకారం ఫ్రాన్స్‌లో 10.3 శాతం మంది వలస జనాభానే. అత్యధికులు అల్జీరియా, మొరాకో, ట్యునీసియాల నుంచి వచ్చినవారు. ఫ్రాన్స్ శ్రామికశక్తిలో వీరిది ప్రధాన పాత్ర. అలాగే, దేశానికి వన్నె తెచ్చే ఫుట్‌బాల్‌లోనూ వీరి ప్రతిభ వెలుగులీనుతోంది. అయినప్పటికీ అనేక యూరోపి యన్ దేశాల లానే ఫ్రాన్స్ సైతం ఈ వలసదారుల్ని తమలో కలుపుకోవడంలో విఫలమవుతోంది. చట్ట సంస్థలు ఇప్పటికీ వీరిని అనుమానంగానే చూడడం విచారకరం. ఆ మాటకొస్తే, ఈ శరణార్థుల సంక్షోభానికి మానవీయ పరిష్కారం కనుగొనడంలో దేశాలన్నీ విఫలమయ్యాయి. అది విషాదం. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండే ఫ్రాన్స్‌లో సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అంతరాలూ అంతే ఎక్కువ. సంపద పంపిణీలో, అవకాశాల్లో భారీ తేడా నెలకొంది. నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, లోకువగా చూస్తూ అణచివేయడం వగైరాలన్నీ వలసదారుల్లో ఆశాభంగం, ఆగ్రహం కలిగించి, అలజడి రేపుతున్నాయి. ఇవాళ ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో రాజకీయ, సామాజిక చీలిక లకు ఇవి ప్రధాన కారణం. అణగారిన ప్రజలు సామాజిక అసమానత, ఆర్థిక అసంతృప్తితో తమ బాధల్ని పాలకుల దృష్టికి తీసుకురావడానికి అల్లర్లను సాధనంగా ఎంచుకుంటున్నారు. జాతి వివక్షతో పోలీసులు జరుపుతున్న దాష్టీకం మారాలని కోరుతున్నారు. సమాజంలో లోతుగా పాతుకు పోయిన ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పౌర సమాజం, ప్రజలు సమ్రగ్ర పరిష్కారానికి చేయూత నివ్వాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలనే పరిణత ప్రజాస్వామ్యమైన ఫ్రాన్స్‌లోనే పరిస్థితి తద్విరుద్ధంగా ఉండడం చేదు నిజం. అక్కడి పరిణామాలు ఇతర ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు. వివిధ జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలతో వైవిధ్యభరితమైన ప్రజానీకమున్న దేశాలు ఆ విభిన్న ప్రజానీకపు అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు వ్యవహరించాలి. ప్రభుత్వ సంస్థల విధి విధా నాలను అందుకు తగినట్టు మార్చుకోవాలి. పాలనలో దీన్ని తక్షణ ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. లేదంటే, ఇవాళ ఫ్రాన్స్‌లో జరిగినట్టే రేపు తమ దేశంలో జరగదన్న గ్యారెంటీ ఏమీ లేదు. వివక్ష పెంచిన సామాజిక ఉద్రిక్తతలతో చేతులు కాలకముందే మేల్కోవడం వివేకవంతులైన పాలకుల లక్షణం! -
ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు
17 ఏళ్ల యువకుడి చావు ఫ్రాన్స్ దేశాన్ని తగలబెడుతోంది. జూన్ 27న జరిగిన ఓ ఘటన దేశాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. పోలీసుల కాల్పుల్లో యువకుడు నాహేల్ చినపోయిన తర్వాత ఆదోళలు, నిరసలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి బీభత్సం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పారిస్ శివారు ప్రాంతాల్లో మొదలైన ఈ అల్లర్లు.. ఇప్పుడు దేశమంతటికీ పాకాయి. గత నాలుగో రోజులుగా హింసా కొనసాగుతూనే ఉంది. ఏ వీధిని చూసినా.. రణరంగంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి 1,311 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే అల్లరిమూకల కారణంగా 200 మందికిపైగా పోలీసులు అధికారులు గాయపడ్డారని పేరేంది. నిరసనలు ప్రారంభమైన మంగళవారం నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు ఈ స్థాయిలో అరెస్ట్‌లు జరగడం ఇదే అత్యధికం. ఆందోళనల్లో పాల్గొన్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం బయడపడింది. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు కనిపిస్తున్నాయి. దేనికైనా తెగిస్తామన్నట్టుగా ఊరేగింపుగా సాగుతున్నారు. ఎంతగా నచ్చజెప్పినా ఆందోళనలు తగ్గడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. నహేల్ మృతితో చెలరేగిన అల్లర్లు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకాయి. How are French protesters getting their hands on heavy firearms? pic.twitter.com/k9nqO6bFfy — Ian Miles Cheong (@stillgray) July 1, 2023 ప్రస్తుతం హింస కాస్త తగ్గిందని ఫ్రెంచ్ ప్రభుత్వం వెల్లడించింది. ఆందోళనకారుల నిరసనల్లో 1,350 వహానాలు, 234 భవనాలు తగలబడిపోయాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో 2,560 అగ్ని ప్రమాదాలు జరిగాయని చెప్పింది. ఆందోళనకారుల్ని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా 45, 000 మంది పోలీసులు సాయుధ వాహనాలతో మోహరించారు. క్రాక్ పోలీస్, ఇతర భద్రతా దళాలను సైతం రప్పించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొడ్తున్నారు. ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మార్సెయిల్ మేయర్ బెనాయిట్ పాయన్, వెంటనే అదనపు దళాలను పంపాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని కోరారు.. ఫ్రాన్స్‌లోని మూడవ అతిపెద్ద నగరమైన లియోన్‌లో హెలికాప్టర్, సాయుధ సిబ్బంది క్యారియర్లు మోహరించాయి. ఉద్రిక్తతల కారణంగా పారిస్ శివారులోని క్లామర్ట్ టౌన్లో కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉండగా, పారిస్ శివారు నాంటెర్రె వద్ద మంగళవారం తనిఖీల సమయంలో 17 ఏళ్ల యువకుడు నాహేల్‌ను ఓ పోలీస్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. నహేల్ కుటుంబం ఆఫ్రికా దేశం అల్జీరియా నుంచి వలస వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో మరోసారి ఫ్రాన్స్ పోలీసుల జాతి దురహంకార వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీంతో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్సెయిల్, లియోన్లలో హింస, దాడులు అత్యంత దారుణ స్థాయికి చేరాయి. పారిస్ శివారు, గ్రెనోబుల్, సెయింట్-ఎటియెన్లోని కొన్ని ప్రాంతాల్లో హుడ్ ధరించిన నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచే బస్సు, ట్రామ్ సేవలను నిలిపివేశారు. బాణసంచా అమ్మకాలను కూడ నిషేధించారు. కాగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒమ్మాన్యుయేల్ మాక్రాన్ టీనెజ్ యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని తల్లిదండ్రులను కోరారు. సోషల్ మీడియానే ఈ హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించారు. వీడియోలు వైరల్ యాప్‌లు స్నాప్ చాట్, టిక్‌టాక్ లలో వాటిని తొలగించాలని కోరారు. మరోవైపు ఉద్రిక్త వాతావరణంలో నాన్టెర్రిలోని స్మశానవాటికలో నాహెల్ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
కనీవినీ ఎరుగని రీతిలో ప్రారంభమైన 'ప్యారిస్ ఎయిర్ షో' (ఫోటోలు)
-
ఆకాశానికి నిచ్చెనలు వద్దు..ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్
ఆకాశహర్మ్యాలకు పారిస్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ దగ్గర్నుంచి ఎన్నో భవంతులు నింగికి నిచ్చెన వేసినట్టుగా ఆకర్షిస్తూ ఉంటాయి. పారిస్ ఇప్పుడు వాటి నిర్మాణానికి బ్రేక్ వేసింది. మొట్టమొదటి ఆకాశాన్నంటే భవనాన్ని నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్ సిటీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటే భవన నిర్మాణాలు ఇంకా కొన సాగితే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై సాధారణ భవనాలదే భవిష్యత్ అన్నది పర్యావరణ వేత్తల మాట. ప్రపంచ పర్యాటక స్వర్గధామం పారిస్. ఫ్యాషన్లకు పుట్టినిల్లయిన ఈ సుందర నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కోట్లాదిమంది విదేశీయులు తరలివస్తుంటారు. ఈఫిల్ టవర్, మోపానాసే టవర్, లౌవ్రే పిరమిడ్ వంటి ఆకాశహర్మ్యాలను సంభ్రమాశ్చర్యాలతో చూస్తుంటారు. అంతస్తుల మీద అంతస్తులు నింగికి నిచ్చెనలా వేసుకుంటూ నిర్మించిన భవనాల అందాలు వర్ణించ వీల్లేదు. 330 మీటర్ల ఎత్తైన ఈఫిల్ టవర్ , 210 మీటర్ల ఎత్తయిన మోపానాస్ టవర్ (689 అడుగులు) పారిస్‌కున్న సిటీ ఆఫ్ లైట్స్‌కి ప్రత్యామ్నాయంగా నిలిచాయి. పారిస్‌లో ఎత్తైన భవన నిర్మాణాలు మనకి ఇక కనిపించవు. వాటి నిర్మాణంపై పారిస్ నగర కౌన్సిల్ నిషేధం విధించింది. స్థానికంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కొత్తగా నిర్మించే భవనాలేవైనా 12 అంతస్తులు లేదంటే 37 మీటర్లకు మించకూడదని ఆంక్షలు విధించింది. ఇటీవల కాలంలో అంతటి అందాల నగరం మురికి కూపంలా మారిపోయింది. పారిస్‌కు తిరిగి పూర్వ వైభవం కల్పించాలంటే కాలుష్య కారకమైన ఆకాశహర్మ్యాల నిర్మాణాన్ని నిలిపివేశారు. 18వ శతాబ్దంలో పారిస్ అంటే చిన్న చిన్న ఇళ్లతో చూడముచ్చటగా ఉండేది. ఆ దేశ మొట్ట మొదటి అధ్యక్షుడు నెపోలియన్ –3 రాజధానిపై ఎన్నో కలలు కన్నారు. ఆధునిక, చైతన్యవంతమైన నగరంగా పారిస్‌ను రూపొందించడానికి ప్రత్యేకంగా కొందరు ఇంజనీర్లను నియమించారు. చిన్న చిన్న భవనాలు, ఉద్యాన వనాలు అండర్ డ్రైనేజీ వంటి వ్యవస్థలతో పారిస్ అత్యంత పరిశుభ్రంగా పచ్చదనంతో అలరారేలా మారింది. ఆరు అంతస్తుల రాతి నిర్మాణాలు చూడడానికి అందంగా , నివాస యోగ్యంగా ఉండేవి. ఈఫిల్ టవర్ మినహాయించి మరో ఎత్తైన భవనం లేదనే చెప్పాలి. రెండో ప్రపంచ యుద్ధంలో నగరం చాలా వరకు ధ్వంసం కావడంతో ఆ శిథిలాల నుంచి ఇప్పుడు మనందరం చూస్తున్న సరికొత్త పారిస్ నగరం పుట్టింది. అప్పటికే ఆకాశాన్నంటే భవంతులతో అందరినీ ఆకట్టుకుంటున్న న్యూయార్క్, లండన్ వంటి నగరాల బాటలో పారిస్ నడిచింది. 40 అంతస్తులు, 50 అంతస్తులు, 59 అంతస్తులు ఇలా కట్టుకుంటూ వెళ్లిపోయింది. 1973లో తొలిసారిగా అత్యంత ఎత్తైన మోపానాస్ టవర్ నిర్మాణం జరిగింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెతలా మళ్లీ ఆ నాటి నిర్మాణాల వైపు చూస్తోంది. ప్రజలకి తగ్గిన మోజు రానురాను ప్రజలకీ ఈ హంగు ఆర్భాటాల్లాంటి భవనాలపై మోజు తగ్గింది. మళ్లీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు నాటి పారిస్‌గా మారిపోవాలని వారు కోరుకుంటున్నారు. పైగా అన్నేసి అంతస్తులున్న భవనాల్లో నివాసం మా వల్ల కాదంటూ ఒక దండం పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 50 అంతస్తుల భవనం నిర్మిస్తే పై అంతస్తులో నివాసం కోసం ప్రజలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి పలు కారణాలున్నాయి. పై అంతస్తుల్లో ఉండే వారిలో ఒంటరితనం వెంటాడుతోంది. సమూహం నుంచి దూరంగా ఉన్న భావన పెరిగిపోయి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అంత ఎత్తు నుంచి కిందకి రావడమే ఒక ప్రసహనంగా మారుతోంది. దీంతో నాలుగ్గోడల మధ్య అధికంగా కాలక్షేపం చేయడంతో శారీరక, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ప్రజలు కూడా ఎత్తైన భవనాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పర్యావరణానికీ దెబ్బే అతి పెద్ద అంతస్తులు పర్యావరణానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఇంధనం వినియోగం విపరీతంగా ఉంటుంది. సాధారణ భవనంలో ప్రతీ చదరపు మీటర్‌కి ఖర్చు అయ్యే ఇంధనానికి ఆకాశహర్మ్యాలలో రెట్టింపు ఖర్చు అవుతుంది. కాలుష్యం 145% అధికంగా విడుదల అవుతుంది. పై అంతస్తులకి నీళ్లు పంప్ చెయ్యడానికి అధికంగా విద్యుత్ వినియోగించాలి. భవనాల నిర్వహణ ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. ఈ భవన నిర్మాణాలతో ఇంధనం 48% , కర్బన ఉద్గారాలు విడుదల 45% , వ్యర్థాలు 25% వస్తూ ఉంటే నీటి వినియోగం 15% ఉంటోంది. భావితరాలు వినియోగించాల్సిన సహజ వనరుల్ని ఇప్పుడే మనం ఖర్చు చేసేయడంపై పర్యావరణవేత్తల్లో ఆందోళన కూడా నెలకొంది.అందుకే ఇక భవిష్యత్ అంతా సాధారణ భవనాలదేనని పర్యావరణవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. చైనా కూడా పారిస్ బాటలోనే నడుస్తూ ఎత్తయిన భవన నిర్మాణాలను నిలిపివేసింది. గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరుగుతూ ఉంటే ఇతర దేశాల్లో అతి పెద్ద నగరాలు కూడా పారిస్ బాటలో నడవక తప్పదు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నేను స్మార్ట్ అయితే’..లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను ఎందుకు కొంటాను?
కొత్త కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్స్‌కు ఊతం ఇచ్చేలా ఫాన్స్ దేశం పారిస్ నగరంలో జరుగుతున్న వివా టెక్ కాన్ఫరెన్స్‌లో ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా, 44 బిలియన్ డాలర్ల (రూ.3.37 లక్షల కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేయాలన్న తన ఆలోచనతో సమాజంలో ప్రతికూల వాతావారణం నెలకొందని అన్నారు. అదే సమయంలో గత ఏడాది అక్టోబర్ నెలలో ట్విటర్ కొనుగోలుతో సంస్థ పట్ల తనకున్న ముందు చూపు, అనుకూల పరిస్థితుల్ని వివరించారు. ‘ ఒకవేళ నేను స్మార్ట్ అయితే, రూ.3.37 లక్షల కోట్లు పెట్టి ట్విటర్‌ను ఎందుకు కొంటాను’ అంటూ చమత్కరించారు. కొనుగోలుకు ముందు ట్విటర్ దశ - దిశలపై ఆందోళనకు గురైనట్లు చెప్పారు. అందుకే, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను సానుకూల దిశలో నడిపించాలని అనుకున్నారు. కాబట్టే ట్విటర్‌కు తానొక ముఖ్యమైన వినియోగదారుడిగా భావించి పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి నిత్య మార్పులు చేస్తూ మెరుగైన ఫలితాలను రాబట్టినట్లు సూచించారు. ఫలితంగా యూజర్లలో ట్విటర్ పట్ల సానుకూల ధోరణ ఏర్పడిందని నొక్కి చెప్పారు. ట్విటర్ 90 శాతం బాట్లు, స్కామ్‌లను విజయవంతంగా తొలగించిందని, అలాగే పిల్లల దోపిడీకి సంబంధించిన విషయాలను 95 శాతం తగ్గించిందని మస్క్ పేర్కొన్నారు. కాగా, జూన్ 14 నుంచి జూన్ 17 వరకు వివా టెక్ కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ఈ కాన్ఫరెన్స్‌లో 1800 స్టార్టప్స్, 1700 మంది ఇన్వెస్టర్లు, 91,000 సందర్శకులు హాజరయ్యారు. చదవండి👉 : ఎవరీ లిండా? ట్విటర్ సీఈవోగా ఆమెకున్న అర్హతలేంటి? -
పారిస్‌లో ప్రపంచ కుబేరుల లంచ్ మీట్: ఫోటోలు వైరల్
ప్రపంచ కుబేరులు ఒకేవేదికపై దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోనే ఇద్దరు అత్యంత ధనవంతులు, ఎలోన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ వారి కుటుంబ సభ్యులతో కలిసి పారిస్‌లో కలిశారు. జూన్ 14 నుండి జూన్ 17 వరకు ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరిగిన వివా టెక్నాలజీ సదస్సు 7వ ఎడిషన్‌కు వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు. తల్లి మేయే మస్క్‌తో కలిసి టెస్లా సీఈవో మస్క్ హాజరు కాగా, ఎల్ఎఈఎంహెచ్ ఛైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని ఇద్దరు కుమారులు - ఆంటోయిన్ , అలెగ్జాండ్రే ఆర్నాల్ట్‌తో వచ్చారు. ఆంటోయిన్ ఆర్నాల్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మరోవైపు "కలిసి పని చేద్దాం! అంటూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మస్క్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. NEW: Elon Musk expresses his support for free speech at the Viva Technology event in Paris, France. It's crazy that this is a controversial take in 2023. "We should have free speech as much as possible... We want to allow the people to express themselves." "Free speech matters… pic.twitter.com/PGZrdmNSML — Collin Rugg (@CollinRugg) June 16, 2023 కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో యూరోప్ అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్ ఈవెంట్ జరుగుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా టెక్ లీడర్లు, స్టార్టప్‌లు, ప్రధాన కార్పొరేషన్లు, పెట్టుబడిదారులను కనెక్ట్ చేయాలనేది ప్లాన్. ఈ ఈవెంట్లో ట్విటర్ బాస్ మస్క్, అతిపెద్ద ఫ్యాషన్ ప్రపంచం అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రధాన వక్తలుగా ఉన్నాయి. వీరితోపాటు ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సేల్స్‌ఫోర్స్ కో-ఫౌండర్ మార్క్ బెనియోఫ్, మెటా యాన్ లెకున్లోని వైస్‌ప్రెసిడెంట్, ఏఏ చీఫ్ ఏసైంటిస్ట్ కూడా ప్రసంగించారు. (హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?) కాగా ఫోర్బ్స్ ప్రకారం, మస్క్ నికర విలువ 236.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి కాగా, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 233.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) -
సమయం లేదు మిత్రమా!
ప్రపంచంలోని 175 దేశాలు... దాదాపు 1000 మంది ప్రతినిధులు... అయిదు రోజుల చర్చోప చర్చలు... ఎట్టకేలకు ప్రపంచ సమస్యకు పరిష్కారం దిశగా చిన్న ముందడుగు. మే 29 నుంచి జూన్ 2 వరకు ప్యారిస్‌లో ప్లాస్టిక్‌పై ఐరాస అంతర్ ప్రభుత్వ చర్చల సంఘం2 (ఐఎన్‌సీ–2) సమావేశంలో జరిగింది ఇదే. ప్లాస్టిక్ కాలుష్యభూతాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా విశ్వవ్యాప్త ఒప్పందానికి చిన్నగా అడుగులు పడ్డాయి. ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని పారద్రోలండి’ అన్నది ఈసారి ప్రధానాంశమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొద్దిగా ముందు జరిగిన ఈ సమావేశం ఆ మేరకు ఆనందించదగ్గది, అయితే, నవంబర్‌లో నైరోబీలో జరిగే ‘ఐఎన్‌సీ–3’ నాటికి కేవలం ఆలోచనలు ఏకరవు పెట్టే చిత్తు ప్రతి తయారీనే ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకోవడం ఆశ్చర్యకరం. పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు పసి ఫిక్ మహాసముద్రంలో కదులుతున్న కృత్రిమ ద్వీపంలా తయారైన వేళ ఇది అతి జాప్యమే. నిజానికి, వచ్చే 2024 చివర లోపల ప్లాస్టిక్ భూతంపై ఈ చర్చోపచర్చలు ముగించాల్సి ఉంది. అందులో భాగంగా తలపెట్టిన అయిదు సమావేశాల్లో తాజా ప్యారిస్ సమావేశం రెండోది. ఆరు నెలల క్రితం ఉరుగ్వేలో జరిగిన తొలి సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని దేశాలు విశ్వవ్యాప్త కార్యాచరణ కోరితే, మరికొన్ని దేశాలు జాతీయ పరిష్కారాలు కావాలన్నాయి. ఇంకొన్ని దేశాలు రెండూ కావాల్సిందే అన్నాయి. తీరా ఆరునెలల తర్వాత తాజా సమావేశంలోనూ తొలి రెండు రోజులూ ఉద్రిక్తత నడుమ వృథా అయ్యాయి. సహజంగానే ప్లాస్టిక్‌తో తమ ఆర్థిక అంశాలు ముడిపడ్డ చమురు, సహజవాయు, పాలిమర్ ఉత్పాదక దేశాలు ఏకాభిప్రాయం కుదరనివ్వక తమకు అనుకూల వాదనను ఎంచుకుంటూ, చర్చలను జాప్యం చేశాయి. ఎట్టకేలకు మూడో రోజున చర్చల రథం కొంత ముందుకు కదిలింది. ఆర్థిక ప్రయోజనాలు అర్థం చేసుకోదగినవే కానీ, వాటి కోసం ప్రపంచమే ప్రమాదంలో ఉన్నా పట్టదంటే ముమ్మాటికీ తప్పే. మానవాళికి ప్లాస్టిక్ పెనుభూతమే. ప్రపంచంలో ఏటా 43 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. అందులో సగానికి పైగా ఉత్పత్తులు పరిమిత కాలం ఆయువున్నవే. ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్‌లో మూడింట రెండు వంతులను వ్యర్థాలుగా పారేస్తున్నారు. పది శాతం ప్లాస్టిక్కే రీసైక్లింగ్‌కు నోచు కుంటోంది. అతి కొద్దిభాగం ప్లాస్టిక్ వ్యర్థాలనే దహనం చేస్తున్నారు. అత్యధిక భాగం భూమిలో, జల వనరుల్లో, సముద్రాల్లో చేరిపోతున్నాయి. ఇది సమస్త జీవరాశికీ ముప్పు. ఇలా పేరుకుంటున్న వ్యర్థాల పరిమాణం వచ్చే 2060కి మూడు రెట్లవుతుంది. అందులో అయిదోవంతే రీసైకిల్ చేయడా నికి వీలుంటుంది. ఇక, 2019లో ప్రపంచవ్యాప్త ఉద్గారాల్లో 3 శాతం పైగా ప్లాస్టిక్ వ్యర్థాల పాపమే. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ఈ ప్రమాదాలపై తాజాగా అప్రమత్తం చేసింది. కొత్తగా మైక్రో ప్లాస్టిక్స్ మరో పెను ఆందోళన. చేపలు, బ్లూ వేల్ లాంటి సముద్రచరాలు రోజూ కోటి ముక్కల మైక్రో ప్లాస్టిక్‌ను పొట్టలో వేసుకుంటున్నాయి. వాటిని భుజిస్తున్న మన రక్తంలో, చనుబాలలో, చివరకు గర్భస్థ మావిలో సైతం చేరి, ఆరోగ్య సమస్యగా మారాయి. కానీ, ప్లాస్టిక్ ఉత్పత్తిని పరిమితం చేయాలంటున్న దేశాలకూ, వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే సరి అంటున్న దేశాలకూ మధ్య భేదాభిప్రాయాలు మరోసారి ప్యారిస్ సాక్షిగా బయటపడ్డాయి. మన దేశంతో సహా సౌదీ అరేబియా, చైనా తదితర దేశాలూ నియంత్రణ చర్యలపై మెజారిటీ ఓటింగ్ కాక, ఏకాభిప్రాయం కావాలని పట్టుబట్టడం చిత్రం. లెక్కల్లో మన దేశ తలసరి ప్లాస్టిక్ వినియోగం అనేక ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. కానీ మన మొత్తం జనాభా, అన్ని కోట్లమంది అవసరాలకై ప్లాస్టిక్ ఉత్పత్తి, తత్ఫలి తంగా వ్యర్థాలు మాత్రం ఎక్కువే. పైపెచ్చు, ఎప్పటికప్పుడు అది అధికమవుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రిస్తూ, కాలుష్యాన్ని మొగ్గలోనే తుంచేసే అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒడంబడిక ప్రపంచానికి ఇప్పుడు అవసరమంటున్నది అందుకే. ప్యారిస్ పరిణామాలు, అధిగమించా ల్సిన అడ్డంకుల్ని చూస్తుంటే ఆ ఒడంబడిక అంత త్వరగా వచ్చేలా లేదు. ఇవాళ్టికీ సామాన్య ప్రజలు తమ జీవితంపై ప్లాస్టిక్ వ్యర్థాల ప్రభావాన్ని గుర్తించడం లేదు. ఆ వైఖరిని మార్చడం విశ్వ ఒడంబడికను మించిన సవాలు. అలాగే వచ్చే ఏడాది చివరకి అంతర్జాతీయ సమాజం కట్టుబడి ఉండే చట్టబద్ధమైన విశ్వవ్యాప్త ఒడంబడిక తెద్దామని యోచన బాగున్నా, అందుకు కట్టుబడి ఉండడం కీలకం. ఒప్పందంలోనూ శషభిషలు లేకుండా ప్లాస్టిక్‌పై కఠిన కార్యాచరణ మరీ కీలకం. అలాకాక, మునుపటి పర్యావరణ ఒప్పందాల్లా ఈ కొత్త ఒడంబడికనూ కాలయాపన వ్యవహారంగా, ధనిక దేశాలకు అనుకూలంగా మారిస్తే ఫలితం శూన్యం. వర్ధమాన దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. ప్యారిస్ సమావేశం ప్రారంభ చర్చల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నట్టు, ప్లాస్టిక్ కాలుష్యం ఇప్పుడు ఓ టైమ్ బాంబ్. తక్షణ చర్యలకు దిగకపోతే, పర్యావరణానికీ, జీవవైవిధ్యానికీ, యావత్ ప్రపంచ మానవాళి ఆరోగ్యానికే ప్రమాదం. దీన్ని కేవలం వ్యర్థాల నిర్వహణ అంశంగానే చూస్తే ఇబ్బందే. కేవలం రీసైక్లింగ్కో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధానికో పరిమితం కాకుండా పాలు, నీళ్ళ నుంచి తిండి దాకా అన్నీ ప్యాకెట్లూ ప్లాస్టిక్మయమైన ఈ రోజుల్లో ప్రజల జీవన విధానాన్ని మార్పించడంపై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై త్వరపడాలి. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల పైనే బాధ్యత మోపే ఆలోచన చేయాలి. ముప్పు ముంచుకొచ్చిన వేళ ఆలసిస్తే ఆనక ఏ ఒడంబడి కైనా నిరుపయోగమే. మెక్రాన్ మాటల్లోనే చెప్పాలంటే... ఆట్టే సమయం లేదు మిత్రమా! -
పారిస్.. యానాం మూడుముళ్ల బంధం
యానాం నుంచి పారిస్‌కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం. సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు. 30 మందికి పైగా.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే. ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి. జాక్‌పాట్ కొట్టినట్టే.. ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్‌పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ.. కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్‌లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు. చెక్కుచెదరని అనుబంధం స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం -
ఎస్‌యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్‌తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్‌యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్‌యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్‌యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్‌యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్‌తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్‌ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
మళ్లీ ఓడిన ఎంబాపె.. మెస్సీదే పైచేయి
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును కొల్లగొట్టాడు. భారత కాలామాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్(FIFA) నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 సంవత్సరాల అర్జెంటీనా అభిమానుల నిరీక్షణకు తెరదించిన మెస్సీ వరల్డ్‌కప్ అందుకోవాలన్న తన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. ఇక గతేడాది జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ కొదమసింహాల్లా తలపడ్డాయి. మెస్సీ రెండు గోల్స్‌తో మెరవగా.. ఎంబాపె ఏకంగా హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ 3-3తో డ్రా కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ ఓడినా ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్స్ కైలియన్ ఎంబాపె, కరీమ్ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. 2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్ 2022 వరకు మెన్స్ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగా.. కైలియన్ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్ ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్ ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్ ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) MESSI IS THE WINNER OF THE BEST AWARD ❤️🐐 pic.twitter.com/4pJhMoVCI6 — Messi Media (@LeoMessiMedia) February 27, 2023 -
ఏంటి.. ఫొటో తిరగేశారనుకుంటున్నారా?.. అబ్బే కాదండోయ్!
ఫొటో తిరగబడలేదు.. డ్రెస్సే తిరగేసి వేసుకున్నారు.. ఫ్యాషన్‌కు రాజధానిగా పిలిచే ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో దీన్ని చూసిన అందరికీ పిచ్చిలేచిందట. వీటిని అక్కడ లైవ్‌లో చూసినోళ్ల పరిస్థితి అలా ఉంటే.. ఒరిజినల్ ఐడియాలు కరువయ్యే.. చివరికి ఈ సంస్థ ఇలాంటి పిచ్చి టైపు క్రియేషన్‌కు తెరలేపిందని ఇటు ఇంటర్నెట్లో కామెంట్లు వెల్లువెత్తాయి. ఇంతకీ దీన్ని ఎవరూ తయారు చేశారో చెప్పలేదు కదూ.. విక్టర్ అండ్ రోల్ప్ ఫ్యాషన్ హౌస్ దీని సృష్టికర్త. ఈ డ్రేస్సే కాదు.. ఇలాంటివే మరికొన్ని డిఫరెంట్ కాస్ట్యూమ్‌లను కూడా రూపొందించింది సదరు ఫ్యాషన్ హౌజ్ సంస్థ. ఆ కళాఖండాలను చూసేయండి మరి. చదవండి: దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో.. -
France: ఆందోళనలతో అట్టుడికిన ఫ్రాన్స్.. ఎందుకీ వ్యతిరేకత?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పెన్షన్ సంస్కరణలు దేశ చరిత్రలో అతి పెద్ద నిరసన ప్రదర్శనకు దారి తీశాయి. పదవీ విరమణ వయసుని 62 నుంచి 64కి పెంచుతూ ప్రతిపాదనలు చేసినందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పెన్షన్ అందుకోవడానికి మరో రెండేళ్లు పని చేయాలా అంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. రైళ్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పాఠశాలలు తెరుచుకోలేదు. కార్యాలయాలు మూతబడ్డాయి. ఈఫిల్ టవర్‌ను మూసేశారు. పారిస్ సహా పలు నగరాల్లో 10 లక్షల మందికిపైగా నిరసనకారులు వీధుల్లోకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 12 ట్రేడ్ యూనియన్లు, లెఫ్ట్ పార్టీలు, ఫార్ రైట్ పార్టీలు కలసికట్టుగా ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. దేశంలో 68% ప్రజలు ఈ పెన్షన్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. రైట్ పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పెన్షన్ సంస్కరణల బిల్లుకు ఎంతవరకు మద్దతు లభిస్తుందన్న అనుమానాలున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంపు ఎందుకు? ప్రపంచమంతటా సగటు ఆయుఃప్రమాణం పెరుగుతోంది. జననాల రేటు తగ్గిపోతోంది. దీంతో వయసు మీద పడినా కష్టపడి పని చేయాల్సి వస్తోంది. అయితే రిటైర్మెంట్ వయసు యూరప్‌లోకెల్లా ఫ్రాన్స్‌లోనే తక్కువ. స్పెయిన్‌లో 65, యూకేలో 67, జర్మనీలో 67 ఏళ్లుగా ఉంది. జర్మనీ కూడా రిటైర్మెంట్ వయసును 70 ఏళ్లకు పెంచే యోచనలో ఉంది. ఫ్రాన్స్ కూడా పెన్షన్ నిధుల్ని పెంచుకోవడానికే ఈ సంస్కరణలను తీసుకొచ్చింది. రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంపుతో ఏడాదికి 1,770 కోట్ల యూరోలు జమ అవుతాయి. 2027 నాటికి బ్రేక్ ఈవెన్ సాధ్యపడుతుంది. ఎందుకీ వ్యతిరేకత? హాయిగా ఇంటి పట్టున ఉండి పెన్షన్ అందుకుందామని అనుకున్న వారు మరో రెండేళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరు. ఇంకా పని చేస్తే రిటైరవక ముందే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని రైల్వే వర్కర్లు, మహిళలు, నైట్‌షిఫ్ట్‌ల్లో ఉండేవారు ఆందోళనగా ఉన్నారు. కనీసం 43 ఏళ్లు పని చేయాలన్న నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆలస్యంగా మొదలు పెట్టే మహిళలు, ఉన్నత విద్య చదివే వారు 67 ఏళ్ల దాకా పని చేయాల్సి వస్తుంది. మరోవైపు నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగాలు లేటవుతాయంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో కనీస పెన్షన్ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా లేదు. కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ధరాభారం పెరిగింది. ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలపై నిరసనలు ఇదేం మొదటి సారి కాదు. 2010లో రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 ఏళ్లకు పెంచినప్పుడు కూడా ఇదే స్థాయి వ్యతిరేకత ఎదురైంది. ఫ్రాన్స్ అధ్యక్షుడయ్యాక మాక్రాన్ ఈ సంస్కరణలు తేవాలని గట్టిగా అనుకున్నారు. 2019లో ఈ ప్రతిపాదిత సంస్కరణలకి వ్యతిరేకంగా సమ్మె జరిగినా కరోనా సంక్షోభంతో సమ్మెని ఆపేశారు. పెన్షన్ నిధి పెంచుకోవాలంటే సంపన్నులకి పన్నులు పెంచాలని, పెన్షన్ పథకంలో యాజమాన్యాల వాటాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ పథకంలో సంస్కరణలివే ► రిటైర్మెంట్ వయసును ఏడాదికి మూడు నెలల చొప్పున పెంచుతూ 2030 నాటికి 64 ఏళ్లకు పెంచడం. ► 2027 తర్వాత చేరే ఉద్యోగులెవరైనా పూర్తి పెన్షన్ కోసం కనీసం 43 ఏళ్లు పని చేయాలి. ► పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రిటైరయే నాటికి 43 ఏళ్ల సర్వీసు లేకపోతే 67 ఏళ్లు వచ్చేదాకా పని చేస్తేనే పెన్షన్ లభిస్తుంది. ► పూర్తి కాలం ఉద్యోగం చేసిన అల్పాదాయ వర్గాలకు 85% పెంపుతో పెన్షన్ 1200 యూరోలు అవుతుంది. 20 లక్షల మంది చిన్న ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. ‘‘నేను ఒక కాస్మటిక్ కంపెనీలో పనిచేస్తున్నాను. మా కార్యాలయంలో పని చేసే పరిస్థితుల్లేవు. మరో రెండేళ్లు పనిచేయాలంటే నా వల్ల కానేకాదు. ఈ పెన్షన్ బిల్లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు’’ – వర్జీనియా, మహిళా ఉద్యోగి ‘‘నేను రైల్వేల్లో పనిచేస్తాను. శారీరక శ్రమ చేయాలి. చేతులు, కాళ్లు విరగ్గొట్టుకుంటూ పని చేస్తున్నాను.ఈ పరిస్థితుల్లో ఎన్నేళ్లు వచ్చే వరకు పని చెయ్యగలను. కనీసం 43 ఏళ్ల సర్వీసు ఉంటేనే పెన్షన్ వస్తుందనడం చాలా అన్యాయం’’ – రైల్వే కార్మికుడు ఇక వృద్ధులు భారమేనా..? ► ప్రపంచ దేశాలు పెన్షన్లను ఖరీదైన వ్యవహారంగా పరిగణిస్తున్నాయి. అమెరికాలో 50 ఏళ్ల క్రితం ప్రతీ 10 మందిలో 8 మందికి డిఫైన్డ్ బెనిఫిట్ పథకాలు వర్తిస్తే ఇప్పుడు ప్రతీ 10 మందిలో ఒక్కరికే వర్తిస్తోంది. ► ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం వృద్ధులలో దాదాపు మూడో వంతు మందికి పెన్షన్‌పై భరోసా లేదు. కొందరికి పెన్షన్ వస్తున్నా అది వారి కనీస అవసరాలకి ఏ మూలకూ సరిపోవడం లేదు. ► వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు ఆర్థికంగా అండదండగా ఉంటారన్న నమ్మకం లేదు. ఎందుకంటే పిల్లల సంఖ్య కూడా ప్రపంచమంతటా క్రమక్రమంగా తగ్గిపోతోంది. కుటుంబంలో పిల్లల సంఖ్య సగటున 1.7కి పడిపోయింది. ► 1960వ దశకంలో ప్రపంచ జనాభాలో ఒక వృద్ధునికి సగటున 12 మంది పని చేసే శ్రామికుల చొప్పున ఉండేవారు. కానీ ప్రస్తుతం అలా పని చేసేవారి సంఖ్య ఏకంగా ఎనిమిదికి పడిపోయింది! 2050 నాటికల్లా ఈ సంఖ్య మరీ తక్కువగా 4కు పడిపోతుందని అంచనా. దీంతో పని చేయలేని వృద్ధులను ప్రభుత్వాలు భారంగా చూసే రోజులొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్