ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌తో ‘ఢీ’
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత నంబర్‌వన్, ప్రపంచ 94వ ర్యాంకర్ సుమిత్ నగాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో సుమిత్ ఆడతాడు.
గతంలో వీరిద్దరు ముఖాముఖిగా ఒక్కసారి కూడా తలపడలేదు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ తన కెరీర్‌లో 6 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా... సుమిత్ ఒక్కసారి కూడా ఏటీపీ టూర్ టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్‌కు కూడా తొలి రౌండ్‌లో కఠిన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు.
14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో ఆడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఈనెల 26 నుంచి జరుగుతుంది.
ఇవి చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే..
Comments
Please login to add a commentAdd a comment