Match draw
-
గుకేశ్, లిరెన్ నాలుగో గేమ్ ‘డ్రా’
సింగపూర్ సిటీ: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌కు ప్రతీ రౌండ్లోనూ గట్టి పోటీనే ఇస్తున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సమరంలో భాగంగా శుక్రవారం భారత్, చైనా ప్రత్యర్థుల మధ్య పోటాపోటీగా సాగిన నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. నల్లపావులతో బరిలోకి దిగిన భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఎత్తులకు డిఫెండింగ్ చాంపియన్ తడబడ్డాడు. 32 ఏళ్ల లిరెన్ పైఎత్తులకు దీటైన సమాధానం ఇవ్వడంతో చివరకు 42 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి గేమ్‌లో ఓడిన గుకేశ్ రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. తిరిగి మూడో రౌండ్లో సత్తా చాటుకున్న 18 ఏళ్ల ఈ భారత ఆటగాడు... చైనా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించాడు. తాజాగా నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరు 2–2 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. ఇంకా 10 గేమ్‌లు మిగిలిఉన్న ఈ చాంపియన్‌షిప్‌లో ముందుగా ఎవరైతే 7.5 పాయింట్లు సాధిస్తారో వారే విజేతగా నిలుస్తారు. -
ఐఎస్ఎల్ 1000వ మ్యాచ్ ‘డ్రా’
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చరిత్రలో 1000వ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శనివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జరిగిన పోరు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ అయింది. ముంబై జట్టు తరఫున నాథన్ రోడ్రిగ్స్ (63వ నిమిషంలో) ఒక గోల్ సాధించగా... చెన్నైయన్ ఎఫ్‌సీ తరఫున కెప్టెన్ ర్యాన్ ఎడ్వర్డ్స్ (60వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు.మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. ఇరు జట్లు చెరో 14 షాట్లు ఆడగా... అందులో ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా నాలుగేసి సార్లు దాడులు చేశాయి. ముంబై జట్టు చిన్న చిన్న పాస్‌లతో ముందుకు సాగగా... చెన్నైయన్జట్టు 15 ఫౌల్స్ చేసింది. ఈ ఫలితంతో 8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకున్న చెన్నైయన్ జట్టు 12 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానానికి చేరగా... 10 పాయింట్లు ఖాతాలో ఉన్న ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది.ఈస్ట్ బెంగాల్, మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ సాధించడంలో విఫలమయ్యాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌తో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. -
హైదరాబాద్, రాజస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
జైపూర్: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒక విజయం, 2 ఓటములు, ఒక ‘డ్రా’తో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానానికి చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 36/0తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.హిమతేజ (176 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... తన్మయ్ అగర్వాల్ (126 బంతుల్లో 79; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో మెరిశాడు. అభిరత్ రెడ్డి (46; 7 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రాకు అంగీకరించారు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయగా... రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన రాజస్తాన్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీ బాదిన రాజస్తాన్ బ్యాటర్ శుభమ్ గర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు లభించింది.స్కోరు వివరాలు:హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ 425; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) అజయ్ సింగ్ 79; అభిరత్ రెడ్డి (సి) కునాల్ సింగ్ రాథోడ్ 46; రోహిత్ రాయుడు (సి) కునాల్ సింగ్ రాథోడ్ (బి) అనికేత్ చౌధరి 0; హిమతేజ (నాటౌట్) 101; రాహుల్ సింగ్ (నాటౌట్) 47; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (65 ఓవర్లలో 3 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–56, 2–57, 3–196, బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 22–0–84–1, దీపక్ హుడా 6–2–17–0, మహిపాల్ లొమ్రోర్ 18–0–86–0, అరాఫత్ ఖాన్ 5–1–18–1, అనికేత్ చౌధరి 6–0–18–1, అభిజీత్ తోమర్ 6–0–39–0 -
ప్రజ్ఞానంద, గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మూడో గేమ్ 62 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కాటాలాన్ ఓపెనింగ్‌తో గేమ్‌ను ప్రారంభించాడు.మరోవైపు గుకేశ్ తొలి నాలుగు నిమిషాల్లోనే 18 ఎత్తులు పూర్తి చేయగా... ఆచితూచి ఆడిన ప్రజ్ఞానంద 18 ఎత్తులకు ఒక గంట సమయం తీసుకున్నాడు. 34వ ఎత్తుల్లో గుకేశ్ తప్పిదం కారణంగా ప్రజ్ఞానందకు గెలుపు దారులు తెరుచుకున్నాయి. అయితే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవడంలో ప్రజ్ఞానంద విఫలమయ్యాడు.చివరకు ఇద్దరూ గేమ్‌ను ‘డ్రా’గా ముగించేందుకు అంగీకరించారు. మూడో రౌండ్ తర్వాత గుకేశ్, ప్రజ్ఞానంద ఖాతాలో 1.5 పాయింట్లు ఉన్నాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా గుకేశ్ నాలుగో ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్‌లో ఉన్నారు. -
ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మ్యాచ్ ‘డ్రా’
లీప్జిగ్ (జర్మనీ): ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గోల్ నమోదు కాని తొలి ‘డ్రా’ నమోదైంది. అదీ యూరోప్‌లోని రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌లో కావడం విశేషం. శనివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. హోరాహోరీ సమరంలో ఇరు జట్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే మ్యాచ్ కీలక దశలో నెదర్లాండ్స్‌ను దురదృష్టం వెంటాడింది. డచ్ ప్లేయర్ గ్జెవీ సైమన్స్ చేసిన గోల్‌ను రిఫరీ తిరస్కరించాడు. సుదీర్ఘ సమయం పాటు వీడియో రీప్లేలు చూసిన తర్వాత ఆ గోల్‌ను ‘ఆఫ్‌సైడ్’గా ప్రకటించారు. మరో వైపు తమ స్టార్ ప్లేయర్ ఎంబాపె లేకుండా ఫ్రాన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. మరో మ్యాచ్‌లో పోర్చు గల్ 3–0 గోల్స్ తేడాతో టర్కీని చిత్తు చేసింది. -
ఇంగ్లండ్, డెన్మార్క్ మ్యాచ్ ‘డ్రా’
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గత రన్నరప్ ఇంగ్లండ్ జట్టు ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. డెన్మార్క్‌తో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌ను ఇంగ్లండ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున ఆట 18వ నిమిషంలో హ్యారీ కేన్ గోల్ చేయగా... 34వ నిమిషంలో హిజుల్మండ్ గోల్‌తో డెన్మార్క్ జట్టు స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. గ్రూప్ ‘ఎ’లో స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో... గ్రూప్ ‘సి’లో స్లొవేనియా, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’గా ముగిశాయి. -
సుమిత్‌కు క్లిష్టమైన ‘డ్రా’..!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భారత నంబర్‌వన్, ప్రపంచ 94వ ర్యాంకర్ సుమిత్ నగాల్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో సుమిత్ ఆడతాడు.గతంలో వీరిద్దరు ముఖాముఖిగా ఒక్కసారి కూడా తలపడలేదు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ తన కెరీర్లో 6 ఏటీపీ టూర్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గగా... సుమిత్ ఒక్కసారి కూడా ఏటీపీ టూర్ టోరీ్నల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్కు కూడా తొలి రౌండ్లో కఠిన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు.14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్ తొలి రౌండ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో ఆడతాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఈనెల 26 నుంచి జరుగుతుంది.ఇవి చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. సన్‌రైజర్స్ గెలవాలంటే.. -
భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
అబా (సౌదీ అరేబియా): ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో బలహీన ప్రత్యర్థిపై గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ పేలవ ఆటతీరు కనబర్చి ‘డ్రా’గా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్... ఒక్క గోల్ అయినా నమోదు కాకుండా ‘డ్రా’ అయ్యింది. తొలి అర్ధ భాగంలో మన్వీర్ సింగ్ రెండు సార్లు గోల్స్ చేసేందుకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ వైపు దూసుకెళ్లాడు. కానీ గోల్ మాత్రం చేయలేకపోయాడు. రెండో అర్ధ భాగంలో విక్రమ్ ప్రతాప్ కూడా గోల్ కోసం విఫల యత్నాలు చేశాడు. మళ్లీ ఫినిషింగ్ లోపాలతో భారత్ ఖాతా తెరవలేకపోయింది. సులువైన ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను ఛేదించలేకపోవడంపై భారత కోచ్ ఐగర్ స్టిమాక్ అసహనం వ్యక్తం చేశారు. తాజా ‘డ్రా’తో భారత్ ఈ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లాడిన భారత్ ఖాతాలో 4 పాయింట్లున్నాయి. 3 మ్యాచ్‌ల ద్వారా 9 పాయింట్లు సాధించిన ఖతర్ అగ్ర స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో ఖతర్ 3–0తో కువైట్‌పై గెలుపొందింది. -
WTC ఫైనల్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుకంటే..!
-
FIFA World Cup Qatar 2022: నెదర్లాండ్స్, ఈక్వెడార్ మ్యాచ్ ‘డ్రా’
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నెదర్లాండ్స్, ఈక్వెడార్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆతిథ్య ఖతర్ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. ఆట ఆరో నిమిషంలో కోడి గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామ సమయం వరకు ఆధిక్యంలో నిలిచిన ‘ఆరెంజ్ జట్టు’ రెండో అర్ధభాగంలో తడబడింది. ఆట 49వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ ఎనెర్ వాలెన్సియా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేశాడు. ఒక విజయం, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, ఈక్వెడార్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లను ఈ రెండు జట్లు ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. -
రెండో టెస్టు ‘డ్రా’
సౌతాంప్టన్: ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ నిస్సారమైన ‘డ్రా’గా ముగిసింది. వర్షం కారణంగా చాలా భాగం తుడిచిపెట్టుకుపోవడంతో రెండు ఇన్నింగ్స్‌లు కూడా పూర్తి కాలేదు. ఓవర్‌నైట్ స్కోరు 7/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 110 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. క్రాలీ (53) అర్ధ సెంచరీ చేశాడు. ఆ వెంటనే మ్యాచ్‌ను ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. చివరి టెస్టు శుక్రవారంనుంచి జరుగుతుంది. -
ఆబిద్ అలీ అరుదైన ఘనత
రావల్పిండి: ఊహించిన ఫలితమే వచ్చింది. తొలి నాలుగు రోజులు వర్షం అంతరాయం కలిగించిన పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. చివరిరోజు ఎండ కాయడంతో పూర్తి ఓవర్లు సాధ్యమయ్యాయి. ఓవర్‌నైట్ స్కోరు 282/6తో ఆట చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ఆరు వికెట్లకు 308 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డి సిల్వా (102 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 2 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఓపెనర్ ఆబిద్ అలీ (109 నాటౌట్; 11 ఫోర్లు), బాబర్ ఆజమ్ (102 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీలు చేశారు. ఈ శతకంతో ఆబిద్ అలీ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల క్రికెట్లో టెస్టు, వన్డే అరంగేట్రం మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ ఏడాది దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన తాను ఆడిన తొలి వన్డేలో ఆబిద్ అలీ 112 పరుగులు చేశాడు. పురుషుల క్రికెట్ కంటే ముందుగా మహిళల క్రికెట్లో ఈ ఘనత నమోదైంది. ఇంగ్లండ్‌కు చెందిన ఎనిడ్ బ్లాక్వెల్ తాను ఆడిన తొలి టెస్టు (1968లో ఆ్రస్టేలియాపై 113)లో, తొలి వన్డేలో (1973లో ఇంటర్నేషనల్ ఎలెవన్‌పై 101 నాటౌట్) సెంచరీలు చేసింది. -
‘డ్రా’ దిశగా...
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా రెడ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ‘డ్రా’ దిశగా సాగుతోంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ‘రెడ్’ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 404 పరుగులు చేసింది. మహీపాల్ లోమ్రోర్ (126; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా... కరుణ్ నాయర్ (90; 16 ఫోర్లు) శతకం కోల్పోయాడు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (38), అవేశ్ (34 బ్యాటింగ్), ఉనాద్కట్ (30) ఫర్వాలేదని పించారు. ధర్మేంద్ర సింగ్ జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మూడు రోజుల తర్వాత కూడా రెండు ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమైంది. ఆదివారం మ్యాచ్‌కు చివరి రోజు. ‘గ్రీన్’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 440 పరుగులకు ‘రెడ్’ మరో 36 పరుగుల దూరంలో ఉంది. అయితే చేతిలో ఒకే వికెట్ ఉండటంతో గ్రీన్ ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే గ్రీన్ జట్టుకు 3, రెడ్ జట్టుకు 1 పాయింట్ దక్కుతాయి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఈ రెండు జట్లు బ్లూ (2)ను వెనక్కి నెట్టి ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
భారత్ ‘ఎ’, ఇంగ్లండ్ లయన్స్ మ్యాచ్ ‘డ్రా’
వాయనాడ్: ఒలివర్ పోప్ (122 బంతుల్లో 63; 10 ఫోర్లు), సామ్యూల్ హైన్ (178 బంతుల్లో 57; 7 ఫోర్లు) పట్టుదలగా ఆడటంతో... భారత్ ‘ఎ’తో జరిగిన నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్ లయన్స్ ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 20/0తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ 82 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 13 ఓవర్లు మిగిలి ఉండగానే ఇద్దరు కెప్టెన్ల అంగీకారంతో ఆటను నిలిపి వేశారు. పోప్, హైన్ మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు ఈనెల 13న మైసూర్లో ప్రారంభమవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన భారత ‘ఎ’ బ్యాట్స్‌మన్ ప్రియాంక్ పాంచల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్: 340; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 540/6 డిక్లేర్డ్; ఇంగ్లండ్ లయన్స్ రెండో ఇన్నింగ్స్: 214/5 (83 ఓవర్లలో) (ఒలివర్ పోప్ 63, సామ్యూల్ హైన్ 57, డకెట్ 30, హోల్డెన్ 29; జలజ్ సక్సేనా 2/41). -
భారత్‌కు ‘డ్రా’నందం
భారత్ బాగా ఆడింది. తమకన్నా మెరుగైన ర్యాంకులో ఉన్న బెల్జియం జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. కానీ చివరి నిమిషాల్లో తడబడే అలవాటు ఆతిథ్య జట్టును మళ్లీ వెంటాడింది. తుదకు గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది. భువనేశ్వర్ ప్రపంచకప్ హాకీలో భారత్ మరో స్ఫూర్తిదాయక పోరాటం చేసింది. రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియం జట్టును నిలువరించింది. పూల్ ‘సి’లో భాగంగా ఆదివారం భారత్, బెల్జియం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. ఆరంభంలో తడబడినప్పటికీ మ్యాచ్ జరిగేకొద్దీ ఆతిథ్య జట్టు ఆటగాళ్లు పుంజుకున్నారు. ఒక దశలో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంను కంగుతినిపించే స్థితిలో నిలిచింది. అయితే చివరి క్షణాల్లో గోల్స్ సమర్పించుకొనే అలవాటును భారత్ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. ఆతిథ్య జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్ (39వ ని.లో), సిమ్రన్‌జీత్ సింగ్ (47వ ని.లో) చెరో గోల్ చేయగా, బెల్జియం తరఫున హెన్డ్రిక్స్ (8వ ని.లో), సైమన్ గోనర్డ్ (56వ ని.లో) గోల్స్ సాధించారు. ఆఖరి నిమిషాల్లో భారత డిఫెన్స్ కాస్త డీలా పడటంతో ఇదే అదనుగా భావించిన సైమన్ బెల్జియంను ఓటమి నుంచి తప్పించాడు. ఫలితం ‘డ్రా’ అయినా... ఈ పూల్‌లో భారతే అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాతో 5–0తో గెలుపు, గోల్స్ పరంగా బెల్జియం కంటే భారత్‌నే ముందువరుసలో నిలబెట్టింది. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత బెల్జియం తొలి మ్యాచ్‌లో (2–1తో) కెనడాను ఓడించినా... గోల్స్ రేట్లో భారతే ఎంతో ముందుంది. ఈ పూల్‌లో ఇరుజట్లకు ఇక ఒకే మ్యాచ్ మిగిలుంది. ఈ నెల 8న జరిగే మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్, దక్షిణాఫ్రికాతో బెల్జియం తలపడతాయి. ఇవి ముగిశాక తొలి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అగ్రస్థానంలోనే ఉంటే నేరుగా క్వార్టర్స్ చేరుకుంటుంది. కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా... ఇదే పూల్‌లో కెనడా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’ అయింది. ఇరు జట్ల ఆటగాళ్లు దీటుగా కదంతొక్కడంతో రెండు క్వార్టర్లు గోల్ లేకుండానే ముగిశాయి. మూడో క్వార్టర్ చివర్లో దక్షిణాఫ్రికా తరఫున ఎన్కొబిలి ఎన్తులి (43వ ని.) గోల్ చేయగా, రెండు నిమిషాల వ్యవధిలోనే కెనడా కెప్టెన్ స్కాట్ టపర్ (45వ ని.) గోల్ చేసి స్కోరును సమం చేశాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; న్యూజిలాండ్‌తో అర్జెంటీనా తలపడతాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నిరాశపరిచిన మెస్సీ.. మ్యాచ్ డ్రా
మాస్కో : టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లోనే నిరాశపర్చింది. గ్రూప్ డిలో భాగంగా అర్జెంటీనా, ఐలాండ్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అందివచ్చిన పలు పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మలచటంలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ పూర్తిగా విఫలమయ్యాడు. మరో వైపు ఐలాండ్ గోల్‌కీపర్ హానెస్ హాల్డోరసన్ కళ్లు చెదిరే రీతిలో డైవ్లతో అర్జెంటీనా మరో గోల్ చేయకుండా అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన 19వ నిమిషంలో కున్ అగురో గోల్ చేసి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు, 23వ నిమిషంలో ఫిన్బోగ్సన్ ఐలాండ్‌కు గోల్ అందించి స్కోర్ సమం చేశాడు. ప్రథమార్ధం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అనంతరం ద్వితీయార్దంలో మరింత దూకుడు ప్రదర్శించినా గోల్ సాధించండంలో మాత్రం అర్జెంటీనా విఫలమైంది. పదేపదే వచ్చిన అవకాశాలను అర్జెంటీనా ఆటగాళ్లు, ముఖ్యంగా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బంతి పూర్తిగా అర్జెంటీనా ఆధీనంలో ఉంది. అర్జెంటీనా చేసిన ఏడు గోల్ ప్రయత్నాలను ఐలాండ్ గోల్ కీపర్ విజయవంతంగా అడ్డుకున్నాడు. అంతేకాక అర్జెంటీనాకు వచ్చిన 15 ఫ్రీకిక్లను ఉపయోగించుకోవడంలో విఫలం అయింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 4 అనవసర తప్పిదాలు చేయగా, ఐలాండ్ 9 తప్పిదాలు చేసింది. -
‘డ్రా’తో ముగింపు
సియోల్: దక్షిణ కొరియా మహిళల హాకీ జట్టుతో జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత జట్టు 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ ఖాయం చేసుకున్న రాణి రాంపాల్ బృందం నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది. తొమ్మిదో ర్యాంకర్ కొరియాతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున వందన (48వ ని.లో), ప్రత్యర్థి జట్టు నుంచి బోమీ కిమ్ (50వ ని.లో) చెరో గోల్ చేశారు. -
దక్షిణాఫ్రికా, కివీస్ టెస్టు ‘డ్రా’
డ్యునెడిన్: వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యం కాకపోవడంతో... న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఐదో రోజు ఆదివారం కనీసం ఒక్క బంతి ఆట కూడా సాధ్యంకాలేదు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 224 పరుగులు చేసింది. 191 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. చివరి రోజు వేగంగా స్కోరు చేసి న్యూజిలాండ్‌కు ఊరించే లక్ష్యం ఇచ్చి... ఫలితం కోసం ప్రయత్నించాలని దక్షిణాఫ్రికా భావించినా వరుణుడు వారి ఆశలపై నీళ్లు చల్లాడు. -
అదరగొట్టిన ఆంధ్రా
కడప స్పోర్ట్స్: ఆంధ్రా బ్యాట్స్‌మన్ ప్రణీత్ డబుల్ సెంచరీతో అదరగొట్టడంతో ఆంధ్రాజట్టు పంజాబ్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కల్నల్ సీకే నాయుడు అండర్–23 స్టేట్మ్యాచ్లలో ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి 3 పాయింట్లు కైవసం చేసుకోగా పంజాబ్ జట్టుకు 1 పాయింట్ లభించింది. 74 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆంధ్రాజట్టు బ్యాట్స్‌మన్ ప్రణీత్ 25 ఫోర్లు 2 సిక్సర్లతో 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 297 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఆంధ్రా బ్యాట్స్‌మన్ చివరిరోజు చెలరేగడంతో 502 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. పంజాబ్ బౌలర్లు సుఖ్వీందర్, ఆర్పిత్‌పన్ను, ఎన్.చౌదరి తలా రెండు వికెట్లు తీశారు. కాగా ఓవర్‌నైట్ ఆంధ్రా బ్యాట్స్‌మన్ ప్రణీత్ 208, శశికాంత్ 76 పరుగులు చేశారు. వీరిద్దరూ కలిసి 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 501 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆసక్తికరంగా మ్యాచ్: ఏసీఏ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి ఆంధ్రా–పంజాబ్ జట్ల మధ్య నిర్వహించిన మ్యాచ్ ఆధ్యంతం ఆసక్తిగా సాగిందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి అన్నారు. మైదానంలో తొలిసారి డబుల్ సెంచరీ నమోదు కావడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రా జట్టు ఆటతీరుపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ప్రణీత్‌ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, సభ్యులు పాల్గొన్నారు. -
చెన్నైయిన్, కోల్‌కతా మ్యాచ్ డ్రా
కోల్‌కతా: చివరి నిమిషాల్లో చేసిన గోల్‌తో అట్లెడికో డి కోల్‌కతా ఓటమి నుంచి తప్పించుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నైరుున్‌తో జరిగిన మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు 2-2తో డ్రాగా ముగించింది. దాదాపుగా మ్యాచ్ ఆద్యంతం చెన్నైరుున్ ఆధిక్యం చూపినా చివరి నాలుగు నిమిషాల్లో తడబడింది. డౌటీ (59వ నిమిషంలో), హ్యుమే (86) అట్లెటికో తరఫున గోల్స్ చేయగా.. చెన్నైరుున్ నుంచి జయేశ్ (66వ నిమిషంలో), ముల్డర్ (70) గోల్స్ సాధించారు. -
ఐఎస్ఎల్: పుణే, ముంబై మ్యాచ్ డ్రా
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భాగంగా ముంబై, పుణే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఈ లీగ్‌లో ఈ రెండు జట్లకు ఇది మూడో ‘డ్రా’ కావడం గమనార్హం. ఈ ఏడాది ఈ లీగ్‌లో ఒక మ్యాచ్‌లో గోల్ నమోదు కాకపోవడం ఇది రెండోసారి మాత్రమే. గతనెల 10న కేరళ బ్లాస్టర్స్, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ గోల్స్ నమోదు కాలేదు. ప్రస్తుతం గోవా, పుణే జట్లు 15 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌తో అట్లెటికో డి కోల్‌కతా జట్టు ఆడుతుంది. -
ఏబీ.. అదే జోరు
* సెంచరీ బాదిన డివిలియర్స్ * భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’ ముంబై: మ్యాచ్ ఎలాంటిదైనా దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (131 బంతుల్లో 112; 18 ఫోర్లు) జోరు మాత్రం తగ్గడం లేదు. బోర్డు ప్రెసిడెంట్ జట్టు కుర్ర బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ సెంచరీతో శివాలెత్తాడు. దీంతో ఇరుజట్ల మధ్య శనివారం ముగిసిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. డివిలియర్స్‌కు తోడు విలాస్ (78 బంతుల్లో 54; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బోర్డు జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. రాహుల్ (43 నాటౌట్), పుజారా (49 నాటౌట్) ఆకట్టుకున్నారు. అంతకుముందు 46/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ప్రొటీస్... స్వల్ప వ్యవధిలో ఎల్గర్ (23), డు ప్లెసిస్ (4), ఆమ్లా (1)ల వికెట్లను కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ దెబ్బకు సఫారీ జట్టు 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డివిలియర్స్ బోర్డు బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. పేస్ బౌలింగ్‌లో కాస్త నియంత్రణతో ఆడిన ఏబీ.. కరణ్ శర్మ స్పిన్‌ను దారుణంగా దెబ్బతీశాడు. కట్, స్వీప్, ఫుల్, డ్రైవ్‌లతో వరుస బౌండరీలు బాదాడు. బావుమా (15)తో కలిసి ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించిన డివిలియర్స్... విలాస్‌తో కలిసి ఏడో వికెట్‌కు 115 పరుగులు సమకూర్చాడు. చివరకు టీ తర్వాత స్పిన్నర్ జయంత్... ఏబీని అవుట్ చేయడంతో బోర్డు జట్టు ఊపిరి పీల్చుకుంది. ఫిలాండర్ (12) విఫలమైనా... స్టెయిన్ (28 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లు ఆడటంతో ప్రొటీస్ స్కోరు మూడొందలు దాటింది. శార్దూల్ 4, జయంత్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. స్కోరు వివరాలు భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: వాన్‌జెల్ (సి) ఉన్ముక్త్ (బి) ఠాకూర్ 18; ఎల్గర్ (సి) ఉన్ముక్త్ (బి) సింగ్ 23; హర్మర్ (సి) ఓజా (బి) ఠాకూర్ 4; డు ప్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఠాకూర్ 4; ఆమ్లా (సి) నాయర్ (బి) ఠాకూర్ 1; డివిలియర్స్ (బి) జయంత్ 112; బావుమా (సి) అయ్యర్ (బి) పాండ్యా 15; విలాస్ (బి) జయంత్ 54; ఫిలాండర్ (బి) కుల్దీప్ 12; స్టెయిన్ (బి) కుల్దీప్ 37; రబడ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: (69.2 ఓవర్లలో ఆలౌట్) 302. వికెట్ల పతనం: 1-38; 2-46; 3-54; 4-57; 5-57; 6-111; 7-226; 8-259; 9-285; 10-302. బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 16-3-70-4; నాథ్ సింగ్ 14.4-2-56-1; హార్డిక్ పాండ్యా 14-1-64-1; కరణ్ శర్మ 8-0-43-0; జయంత్ యాదవ్ 8-2-37-2; కుల్దీప్ యాదవ్ 8.4-0-24-2. భారత బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 43; పుజారా నాటౌట్ 49; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: (30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 92; బౌలింగ్: హర్మర్ 10-2-24-0; పిడెట్ 10-3-32-0; తాహిర్ 5-0-25-0; ఎల్గర్ 5-0-11-0.