దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నెదర్లాండ్స్, ఈక్వెడార్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆతిథ్య ఖతర్ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. ఆట ఆరో నిమిషంలో కోడి గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.
విరామ సమయం వరకు ఆధిక్యంలో నిలిచిన ‘ఆరెంజ్ జట్టు’ రెండో అర్ధభాగంలో తడబడింది. ఆట 49వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ ఎనెర్ వాలెన్సియా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేశాడు. ఒక విజయం, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, ఈక్వెడార్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లను ఈ రెండు జట్లు ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment