Qatar 2022 football World Cup
-
FIFA rankings: రెండో ర్యాంక్‌లో అర్జెంటీనా
ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత అర్జెంటీనా ఒక స్థానం పురోగతి సాధించింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో అర్జెంటీనా మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బ్రెజిల్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది. రన్నరప్ ఫ్రాన్స్ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది. గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన బెల్జియం రెండో ర్యాంక్ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది. మూడో స్థానం పొందిన క్రొయేషియా ఐదు స్థానాలు పురోగతి సాధించి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా గుర్తింపు పొందిన మొరాకో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకుంది. జపాన్ 20వ ర్యాంక్‌తో ఆసియా నంబర్‌వన్ జట్టుగా నిలిచింది. భారత్ 106వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. -
Qatar FIFA World Cup 2022: మెస్సీ మెరిసె... జగమే మురిసె...
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఎన్నో వివాదాలు... వేడిమి వాతావరణంతో ఇబ్బందులు తప్పవేమోనని ఆటగాళ్ల సందేహాలు... ఆంక్షల మధ్య అభిమానులు ఆటను ఆస్వాదిస్తారో లేదోనని ఏమూలనో అనుమానం... కానీ ఒక్కసారి ‘కిక్’ మొదలుకాగానే... గోల్స్ మోత మోగింది... సంచలనాలతో సాకర్ సంరంభం షురూ అయింది... ఫైనల్ మ్యాచ్ చివరి క్షణం దాకా అదే ఉత్కంఠ కొనసాగింది... విశ్వవ్యాప్తంగా అభిమానులందరూ చిరకాలం గుర్తుండేలా ‘ఖతర్’నాక్ ప్రపంచకప్ సూపర్‌హిట్ అయ్యింది. ప్రపంచ నంబర్‌వన్ బ్రెజిల్ జిగేల్ మనలేదు... బెంబేలెత్తిస్తుందనుకున్న బెల్జియం బోల్తా కొట్టింది... పూర్వ వైభవం సాధిస్తుందనుకున్న జర్మనీ ఇంకా సంధికాలంలోనే ఉన్నామని సంకేతాలు పంపించింది... క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చు‘గల్లంతయింది’... ఆతిథ్యంలో అద్భుతమనిపించినా... ఆతిథ్య జట్టు ‘ఖతర్’నాక్ ఆటతో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 56 ఏళ్లుగా మరో ప్రపంచకప్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ దానిని మరో నాలుగేళ్లకు పొడిగించుకోగా... నెదర్లాండ్స్ ‘షూటౌట్’లో అవుట్ అయింది... సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా అడపాదడపా మెరిసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితంకాగా... డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ అంచనాలను నిలబెట్టుకుంది. అర్జెంటీనా ఆరంభ విఘ్నాన్ని అధిగమించి ఆఖరకు జగజ్జేతగా నిలిచి ఔరా అనిపించి సాకర్ సంగ్రామానికి శుభంకార్డు వేసింది. అంచనాలను మించి... 29 రోజులపాటు సాగిన ఈ సాకర్ సమరంలో అందరి అంచనాలను తారుమారు చేసి ఆకట్టుకున్న జట్టు మొరాకో. 2018 ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తొలి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించి, రెండో మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంను బోల్తా కొట్టించి... మూడో మ్యాచ్‌లో కెనడాపై గెలిచిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’ టాపర్‌గా నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌పై ‘షూటౌట్’లో గెలిచిన మొరాకో క్వార్టర్ ఫైనల్లో 1–0తో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టును ఇంటిదారి పట్టించి ప్రపంచకప్ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా ఘనత సాధించింది. అయితే సెమీఫైనల్లో పటిష్టమైన ఫ్రాన్స్ చేతిలో పోరాడి ఓడిన మొరాకో మూడో స్థానం కోసం మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలోనూ ఓడిపోయి నాలుగో స్థానంతో ఈ మెగా ఈవెంట్‌ను ముగించింది. మెస్సీ ఇంకొన్నాళ్లు... 36 ఏళ్ల అర్జెంటీనా ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన మెస్సీ తన కెరీర్లో లోటుగా ఉన్న విశ్వ కిరీటాన్ని సొంతం చేసుకొని దిగ్గజాల సరసన చేరిపోయాడు. సౌదీ అరేబియా చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయినా తన నాయకత్వ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మెస్సీ ఆ తర్వాత ట్రోఫీ ముద్దాడేవరకు వెనుదిరిగి చూడలేదు. ఫ్రాన్స్‌తో ఫైనల్ అర్జెంటీనా తరఫున తన చివరి మ్యాచ్ అని ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ జట్టు జగజ్జేతగా నిలవడంతో తన నిర్ణయంపై పునరాలోచించాడు. ప్రపంచ చాంపియన్ అనే హోదాను ఇంకొన్నాళ్లు ఆస్వాదిస్తానని... జాతీయ జట్టుకు మరికొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని తన మనసులోని మాటను వెల్లడించాడు. మెస్సీ కోరుకుంటే 2026 ప్రపంచకప్‌లోనూ ఆడవచ్చని అర్జెంటీనా కోచ్ లియోనల్ స్కలోని వ్యాఖ్యానించారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్ సాధించిన మెస్సీ అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గానూ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. భవిష్యత్ ఎంబాపెదే... నాలుగేళ్ల క్రితం రష్యా గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ టైటిల్ సాధించడంలో యువస్టార్ కిలియాన్ ఎంబాపె కీలకపాత్ర పోషించాడు. ఖతర్‌లోనూ ఎంబాపె అదరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో చివరి పది నిమిషాల్లో ఎంబాపె ఆటతో అర్జెంటీనా హడలెత్తిపోయింది. మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య కాకుండా ఎంబాపె, అర్జెంటీనా మధ్య జరుగుతోందా అనే అనుమానం కలిగింది. చివరకు ‘షూటౌట్’లో ఫ్రాన్స్ ఓడిపోయినా ఎంబాపె పోరాట యోధుడిలా అందరి దృష్టిలో నిలిచాడు. జిరూడ్, గ్రీజ్మన్, కరీమ్ బెంజెమాలాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో భవిష్యత్ ఎంబాపెదే కానుంది. 23 ఏళ్ల ఎంబాపె ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం వచ్చే ప్రపంచకప్‌లోనూ ఫ్రాన్స్ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందని చెప్పవచ్చు. ‘యునైటెడ్’లో కలుద్దాం... అందరి ఆటగా పేరున్న ఫుట్‌బాల్ విశ్వసమరం వచ్చేసారి మూడు దేశాల్లో జరగనుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు 2026 ప్రపంచకప్‌నకు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మరిన్ని జట్లకు అవకాశం లభించాలనే సదుద్దేశంతో ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) 2026 ప్రపంచకప్‌ను 32 జట్లకు బదులుగా 48 జట్లతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లకు నేరుగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశం లభించింది. మిగతా 45 బెర్త్‌ల కోసం వచ్చే ఏడాది మార్చి నుంచి క్వాలిఫయింగ్ దశ మ్యాచ్‌లు మొదలై 2026 మార్చి వరకు కొనసాగుతాయి. మొత్తం 48 జట్లను 16 గ్రూప్‌లుగా (ఒక్కో గ్రూప్‌లో మూడు జట్లు) విభజిస్తారు. గ్రూప్ దశ తర్వాత ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 32 జట్లు నాకౌట్ తొలి రౌండ్ దశకు అర్హత సాధిస్తాయి. సాక్షి క్రీడా విభాగం -
మెస్సీ కల నెరవేరింది.. అభిమానుల కళ్లు చెమర్చాయి (ఫొటోలు)
-
అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం
ఏమా ఆట... ఎంతటి అద్భుత ప్రదర్శన... ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు... ప్రపంచకప్ ఫైనల్ అంటే ఇలా ఉంటుంది... కాదు, కాదు.. ఇంత గొప్పగా, ఇలాగే ఉంటుంది అనిపించేలా సాగిన ఆట... మైదానంలో ఆటగాళ్లు కొదమసింహాల్లా పోటీపడుతుంటే... స్టేడియంలో 90 వేల మంది ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తం ఊగిపోయింది... ఫైనల్లో ఆడుతున్న జట్లు మాత్రమే కాదు... ఏ జట్టుతో సంబంధం లేకపోయినా, రెప్పార్పకుండా చూసిన వీరాభిమానుల సంఖ్యకు లెక్కే లేదు... ఆట ఆరంభంలో అర్జెంటీనా దూకుడు చూస్తే మ్యాచ్ ఏకపక్షమే అనిపించింది... ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... పదే పదే అటాక్ మంత్రంగా ఆ జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది... రెండు గోల్స్ ఆధిక్యం సాధించాక మెస్సీ మాయలో ఊగిపోతున్న అర్జెంటీనా అభిమానులు సంబరాలు షురూ చేసేశారు... తొలి అర్ధ భాగం చూస్తే అసలు ఫ్రాన్స్ ఫైనల్ చేరిన జట్టేనా అనిపించింది... స్టార్ ఆటగాళ్ల జాడే కనిపించలేదు. రెండో అర్ధభాగంలో కూడా కూడా అర్జెంటీనా తగ్గలేదు... మొత్తం 67 నిమిషాల ఆట సాగినా... ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌పై కొట్టలేకపోయింది. అప్పుడొచ్చాడు ఎంబాపె... అప్పటి వరకు కనీసం పాస్‌లు కూడా అందుకోలేకపోయిన ఈ సంచలన ఆటగాడు తనేంటో చూపించాడు... 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేసేసి అర్జెంటీనాను ఒక్కసారిగా అచేతనంగా మార్చాడు. ఆపై తమదే ఆట అన్నట్లుగా ఫ్రాన్స్ దూసుకుపోగా, మెస్సీ సేన నిస్సహాయంగా కనిపించింది... స్కోరు సమం చేయడం సంగతేమో కానీ డిఫెన్స్‌తో తమ గోల్‌పోస్ట్‌ను కాపాడుకోవడమే అర్జెంటీనాకు కనాకష్టంగా మారింది. నిర్ణీత సమయం ముగిసింది... ఇంజ్యూరీ టైమ్ కూడా అయిపోయింది. స్కోర్లు సమంగానే ఉన్నాయి. అప్పుడు అదనపు సమయం తప్పలేదు. మళ్లీ మెస్సీపైనే గెలుపు భారం పడింది... తన కోసం, తన దేశం కోసం అన్నట్లుగా ఒక్కసారిగా శక్తి పుంజుకున్న మెస్సీ మరో గోల్‌తో ముందంజలో నిలిపి విజయధ్వానం చేశాడు... అయితే అది కొద్ది క్షణాలకే పరిమితమైంది... ఎంబాపె మళ్లీ మ్యాజిక్ ప్రదర్శించడంతో స్కోరు మళ్లీ సమమైంది. దాంతో ఫలితం పెనాల్టీ ‘షూటౌట్’కు వెళ్లింది. ‘అర్జెంటీనా జట్టు గెలవాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. మా దేశంలో కూడా అలాంటివారు ఉన్నారు’... ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్ కోచ్ డెషాంప్స్ చేసిన వ్యాఖ్య ఇది. సగటు ఫుట్‌బాల్ అభిమాని దృష్టిలో ఇది నిజంగా నిజం... అందుకు ఒకే ఒక్క కారణం లయోనల్ మెస్సీ... ప్రపంచవ్యాప్తంగా అతడిని అభిమానించే వారెందరో అతను వరల్డ్‌కప్‌ను అందుకోవాలని కోరుకున్నారు. వారంతా ఫైనల్ రోజు అర్జెంటీనా అభిమానులుగా మారిపోయారు... అందుకే మెస్సీ కొట్టిన ప్రతీ గోల్ వారిని ఆనందంతో ముంచెత్తితే... ఎంబాపె ఆట చూస్తుంటే ఎక్కడో గుండెల్లో అలజడి... ఎక్కడ అతను మ్యాచ్‌ను లాగేసుకుంటాడేమోనని ఆందోళన... కానీ అందరి కల నెరవేరింది... ఐదో ప్రపంచకప్ ప్రయత్నంలో మెస్సీ తన టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ ఒక్క లోటును అధిగమించి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచాడు. సంవత్సరం క్రితం దివికేగిన డీగో మారడోనా పైనుంచి ఆశీర్వదించినట్లుగా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా చాంపియన్‌గా మారింది. దోహా: గొంజాలో మోంటీల్... కొన్ని క్షణాల ముందు అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉండి గెలుపు ఖాయమనుకుంటున్న దశలో అప్రయత్నంగానే మోచేతికి బంతికి తగిలించాడు... దాంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ దక్కి స్కోరు సమమైంది. సబ్‌స్టిట్యూట్‌గా కొన్ని నిమిషాల క్రితమే మైదానంలోకి దిగి ఒక్క పొరపాటుతో విలన్‌గా మారిపోయాడు... కానీ మరికొన్ని నిమిషాల తర్వాత అతనే హీరోగా నిలిచాడు. షూటౌట్లో అర్జెంటీనా ఓడి ఉంటే తన తప్పిదపు భారాన్ని అతను జీవితకాలం మోయాల్సి వచ్చేదేమో... షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఉండగా మోంటీల్ పెనాల్టీ తీసుకున్నాడు... అతను కొట్టిన కిక్ ఫ్రాన్స్ గోల్ కీపర్ లోరిస్‌ను దాటి నెట్లో పడింది! అంతే... అర్జెంటీనా బృందం విజయ గర్జన చేసింది... కన్నీళ్లతో మోంటీల్ భావోద్వేగభరితమయ్యాడు. ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4–2 (షూటౌట్లో) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా, షూటౌట్లో ఫలితం తేలింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (23వ నిమిషం, 108వ నిమిషం), మరియా (36వ నిమిషం) గోల్స్ చేయగా... ఫ్రాన్స్ తరఫున ఎంబాపె ఒక్కడే (80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేశాడు. హోరాహోరీ... విజిల్ మోగిన దగ్గరి నుంచి అర్జెంటీనా ఆధిపత్యమే సాగింది. వరుసగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై జట్టు దాడులు చేస్తూ పోయింది. అదే జోరులో ఫలితం రాబట్టింది. పెనాల్టీ ఏరియాలో ఫ్రాన్స్ వింగర్ ఉస్మాన్ డెంబెలెను దాటి అర్జెంటీనా ఆటగాడు డి మరియా బంతితో దూసుకుపోయాడు. అతడిని నిలువరించే క్రమంలో ఉస్మాన్ వెనకనుంచి మరియాను తోసేశాడు. దాంతో మరో మాట లేకుండా రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ప్రకటించాడు. మెస్సీ ప్రశాంతంగా ఎడమ కాలితో కుడి వైపు చివరకు కిక్ కొట్టగా, మరోవైపు దూకిన గోల్ కీపర్ హ్యూగో లోరిస్ బంతిని ఆపడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత మెస్సీ, అల్వారెజ్ అద్భుత సమన్వయంతో పాస్‌లు ఇచ్చుకుంటూ దూసుకుపోయారు. బంతి అలిస్టర్‌కు చేరగా, అతడి నుంచి పాస్ అందుకున్న మరియా అద్భుత గోల్‌గా మలిచాడు. తొలి అర్ధభాగంలో అసలు ఫ్రాన్స్ ఆటగాళ్లు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పాస్‌లు సరిగా అందుకోలేకపోగా, కదలికల్లో కూడా వేగం లోపించింది. రెండో అర్ధభాగంలో కూడా అర్జెంటీనా ఆట చూస్తే తామే వెనుకబడి ఉన్నామా అన్నట్లు అనిపించింది. మళ్లీ మళ్లీ అదే దూకుడుతో వారు ప్రత్యర్థిపై చెలరేగారు. అయితే నికోల్స్ పొరపాటుతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గోల్‌గా మలచిన ఎంబాపె తర్వాతి నిమిషంలో అద్భుత ఆటతో ఫీల్డ్ గోల్ నమోదు చేశాడు. మెస్సీ సేన బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మాత్రం అర్జెంటీనా కాస్త తేరుకుంది. దాంతో అదనపు సమయం మొత్తం పోటాపోటీగా సాగింది. మెస్సీ, ఎంబాపె ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ చెరో గోల్‌తో మళ్లీ మ్యాచ్‌లో జీవం పోశారు. చివరకు పెనాల్టీ షూటౌట్ విశ్వవిజేతను తేల్చింది. –సాక్షి క్రీడా విభాగం -
నేడే ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్.. అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనున్న ఫ్రాన్స్
దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతా తానై... టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది. క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్‌కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్‌కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎంబాపె ఒక్కడే కాదు... అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్‌డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్‌కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. నేటి ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్‌గా నిలిచింది. 3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది. 10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది. 11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్ లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది. -
FIFA World Cup Qatar 2022 Second Semi-Final: ఫైనల్‌కు ‘ఫ్రెంచ్ కిక్’
ఎట్టకేలకు మొరాకో తన ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకుంది. మేటి జట్లకే కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ ఆఫ్రికా జట్టు చివరకు సెమీఫైనల్లో ఓడింది. సంచలనానికి ఛాన్స్ ఇవ్వని ఫ్రాన్స్ నిర్ణీత సమయంలోనే విజయం సాధించింది. ‘డిఫెండింగ్ చాంపియన్’ వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిజానికి మొరాకో ఆషామాషీగా తలొగ్గలేదు. గోల్ కోసం ఆఖరి ఇంజ్యూరీ టైమ్ దాకా శ్రమించింది. మైదానం మొత్తం మీద ఫ్రాన్స్ స్ట్రయికర్లకు దీటుగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై గురి పెట్టినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. మరోవైపు ఫ్రాన్స్... ఈ టోర్నీలోనే కొరకరాని కొయ్యను ఐదో నిమిషంలోనే దారికి తెచ్చుకుంది. ద్వితీయార్ధంలో ఎదురులేని విజయానికి స్కోరును రెట్టింపు చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఖతర్‌కు వచ్చి తమ అద్భుత పోరాటపటిమతో తమకంటే ఎంతో మెరుగైన జట్లను బోల్తా కొట్టించిన మొరాకో ఇక మూడో స్థానం కోసం శనివారం గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియాతో తలపడుతుంది. దోహా: అర్జెంటీనా ఫైనల్ ప్రత్యర్థి ఎవరో తేలింది. ఇక ఆఖరి సమరమే మిగిలుంది. విజేత ఎవరో... రన్నరప్‌గా మిగిలేదెవరో ఆదివారం రాత్రి తెలుస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–0 గోల్స్ తేడాతో ఈ టోర్నీలో మింగుడు పడని ప్రత్యర్థి మొరాకోను ఓడించి ఫైనల్ చేరింది. మ్యాచ్ 5వ నిమిషంలో థియో హెర్నాండెజ్... 79వ నిమిషంలో ‘సబ్‌స్టిట్యూట్’ రాన్‌డల్ కొలొముని ఫ్రాన్స్ జట్టుకు చెరో గోల్ అందించారు. 78వ నిమిషంలోనే మైదానంలోకి వచ్చిన సబ్‌స్టిట్యూట్ రాన్‌డల్ 44 సెకన్లలోనే గోల్ చేయడం విశేషం. ఈ మెగా టోర్నీలోనే నిర్ణీత సమయంలో క్వార్టర్స్ దాకా ప్రత్యర్థులెవరికీ గోల్ ఇవ్వని మొరాకో సెమీస్‌లో రెండు గోల్స్ ఇవ్వడమే కాకుండా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మొరాకో గత మ్యాచ్‌లకి, తాజా సెమీఫైనల్స్‌కు ఇదొక్కటే తేడా! దీని వల్లే సంచలనం, టైటిల్ సమరం రెండు సాకారం కాలేకపోయాయి. ఆట మొదలైన కాసేపటికే ఫ్రాన్స్ పంజా విసరడం మొదలు పెట్టింది. గ్రీజ్మన్ ‘డి’ ఏరియాలో బంతిని ప్రత్యర్థి గోల్‌పోస్ట్ సమీపానికి తీసుకెళ్లాడు. కానీ క్రాస్ షాట్ కష్టం కావడంతో కిలియాన్ ఎంబాపెకు క్రాస్ చేశాడు. కానీ అతని షాట్ విఫలమైంది. అక్కడే గుమిగూడిన మొరాకో డిఫెండర్లు అడ్డుకున్నారు. అయితే బంతి మాత్రం అక్కడక్కడే దిశ మార్చుకుంది. గోల్‌పోస్ట్‌కు కుడివైపు వెళ్లగా అక్కడే ఉన్న థియో హెర్నాండెజ్ గాల్లోకి ఎగిరి ఎడమ కాలితో కిక్ సంధించాడు. దీన్ని ఆపేందుకు గోల్ కీపర్ యాసిన్ బోనో అతని ముందుకెళ్లగా... మొరాకో కెప్టెన్ రొమెయిన్ సైస్, అచ్రాఫ్ డారి గోల్‌పోస్ట్‌ను కాచుకున్నారు. అయినా సరే హెర్నాండెజ్ తన ఛాతీ ఎత్తున ఉన్న బంతిని ఎడమ కాలితో తన్ని లక్ష్యానికి చేర్చాడు. ఆఖరి క్షణంలో గోల్పోస్ట్లోనే ఉన్న అచ్రాఫ్ డారి దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశాడు. కానీ అతని కుడి మొకాలికి వెంట్రుకవాసి దూరంలోనే బంతి గోల్ అయ్యింది. ఫ్రాన్స్ 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే... మొరాకోకు ఆట పదో నిమిషంలో సమం చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘డి’ ఏరియా వెలుపలి నుంచి అజెడైన్ వొవునహి ఫ్రాన్స్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా లాంగ్‌షాట్ కొట్టాడు. ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ ఎడమ చేతితో అడ్డుకున్నప్పటికీ బంతి రీబౌండ్ అయింది. కానీ సమీపంలో తిరిగి షాట్ కొట్టే మొరాకో స్ట్రయికర్లు ఎవరూ లేకపోవడంతో గోల్ అవకాశం త్రుటిలో చేజారింది. 17వ నిమిషంలో ఫ్రాన్స్ స్కోరు రెట్టింపయ్యే ఛాన్స్ కూడా మిస్సయ్యింది. ఒలివియర్ జిరూడ్ మెరుపు వేగంతో మొరాకో ‘డి’ ఏరియాలోకి దూసుకొచ్చి బలంగా కొట్టిన షాట్ ప్రత్యర్థి గోల్‌కీపర్ కూడా ఆపలేకపోయాడు. కానీ బంతి గోల్‌పోస్ట్ కుడివైపున బార్ అంచును తాకి బయటికి వెళ్లిపోయింది. మళ్లీ 36వ నిమిషంలోనూ ఫ్రాన్స్ ఆటగాడు జిరూడ్ గట్టిగానే ప్రయత్నించాడు. వాయువేగంతో కొట్టిన షాట్‌ను మొరాకో డిఫెండర్ జవాద్ ఎల్ యామిక్ కళ్లు చెదిరే కిక్‌తో అడ్డుకున్నాడు. లేదంటే బంతి బుల్లెట్ వేగంతో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లేది! 44వ నిమిషంలో కార్నర్‌ను గోల్‌పోస్ట్ కుడివైపున ఉన్న జవాద్ ఎల్ యామిక్ చక్కగా తనను తాను నియంత్రించుకొని బైసైకిల్ కిక్ కొట్టాడు. దాదాపు గోల్ అయ్యే ఈ షాట్‌ను ఫ్రాన్స్ గోల్‌కీపర్ లోరిస్ కుడి వైపునకు డైవ్ చేసి చేతితో బయటికి పంపించాడు. ద్వితీయార్ధంలోనూ మొరాకో గోల్స్ కోసం అదేపనిగా చేసిన ప్రయత్నాల్ని ఫ్రాన్స్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ కట్టడి చేసి అడ్డుకున్నారు. 78వ నిమిషంలో రాన్‌డల్ మైదానంలోకి వచ్చాడు. అప్పుడే సహచరులు మార్కస్ తురమ్, ఎంబాపెలు మొరాకో ‘డి’ ఏరియాలో పరస్పరం పాస్ చేసుకొని గోల్‌పై గురి పెట్టారు. కానీ డిఫెండర్లు చుట్టుముట్టడంతో గోల్‌పోస్ట్‌కు మరింత సమీపంలో ఉన్న రాన్డల్కు ఎంబాపె క్రాస్పాస్ చేశాడు. 79 నిమిషంలో రాన్‌డల్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సులువుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో ఫ్రాన్స్ ఆధిక్యం రెట్టింపైంది. మొరాకో విజయంపై ఆశలు వదులుకుంది. 4: ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో ఫ్రాన్స్ నాలుగోసారి (1998, 2006, 2018, 2022) ఫైనల్ చేరింది. రెండుసార్లు (1998, 2018) విజేతగా నిలిచింది. 5: వరుసగా రెండు అంతకంటే ఎక్కువసార్లు ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన ఐదో జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. గతంలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962), నెదర్లాండ్స్ (1974, 1978), పశ్చిమ జర్మనీ (1982, 1986), బ్రెజిల్ (1994, 1998, 2002) ఈ ఘనత సాధించాయి. 4: తమ జట్టును వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఫైనల్‌కు చేర్చిన నాలుగో కోచ్‌గా ఫ్రాన్స్‌కు చెందిన దిదీర్ డెషాంప్ గుర్తింపు పొందాడు. గతంలో విటోరియో పోజో (ఇటలీ; 1934, 1938), కార్లోస్ బిలార్డో (అర్జెంటీనా; 1986, 1990), బెకన్బాయెర్ (జర్మనీ; 1986, 1990) ఈ ఘనత సాధించారు. 1998లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో డెషాంప్ ప్లేయర్‌గా ఉన్నాడు. అనంతరం 2018లో విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు ఆయనే కోచ్‌గా ఉన్నారు. 3: ప్రపంచకప్ చరిత్రలో సబ్‌స్టిట్యూట్‌గా ఫాస్టెస్ట్ గోల్ చేసిన మూడో ప్లేయర్‌గా రాన్‌డల్ (ఫ్రాన్స్) గుర్తింపు పొందాడు. మొరాకోతో మ్యాచ్‌లో అతను సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన 44 సెకన్లకే గోల్ చేశాడు. ఈ జాబితాలో రిచర్డ్ మొరాలెస్ (ఉరుగ్వే; 2002లో సెనెగల్పై 16 సెకన్లలో), ఎబ్బీ సాండ్ (డెన్మార్క్; 1998లో నైజీరియాపై 26 సెకన్లలో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: మెస్సీ మాయ...
అంతా తానై జట్టును ముందుడి నడిపిస్తున్న లయెనెల్ మెస్సీ తన ‘ప్రపంచకప్’ కలను నిజం చేసుకోవడానికి మరో విజయం దూరంలో నిలిచాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా 0–3తో క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. నాలుగేళ్ల తర్వాత మెస్సీ సారథ్యంలోనే క్రొయేషియాపై అర్జెంటీనా 3–0తో ప్రతీకార విజయం సాధించింది. ఆనాడు అంతగా ప్రభావం చూపని మెస్సీ ఈసారి మాత్రం విశ్వరూపమే ప్రదర్శించాడు. మైదానం మొత్తం పాదరసంలా కదులుతూ క్రొయేషియా డిఫెండర్లకు చుక్కలు చూపించాడు. ఒక గోల్ చేయడంతోపాటు తనను ఆరాధ్యంగా భావించే 22 ఏళ్ల జూలియన్ అల్వారెజ్‌కు రెండు గోల్స్ చేయడానికి సహకరించాడు. ఫలితంగా అర్జెంటీనా ఆరోసారి ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1986లో చివరిసారి విశ్వవిజేతగా నిలిచిన అర్జెంటీనా మళ్లీ జగజ్జేత కావడానికి గెలుపు దూరంలో ఉంది. దోహా: గతంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఐదుసార్లూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న అర్జెంటీనా అదే ఆనవాయితీని కొనసాగించింది. ఆరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ ఆడిన మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా అద్భుత ఆటతీరుతో క్రొయేషియా అడ్డంకిని అధిగమించి దర్జాగా ఆరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. 88,966 మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన లుసైల్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి సెమీఫైనల్లో అర్జెంటీనా 3–0 గోల్స్ తేడాతో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును చిత్తుగా ఓడించింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (34వ ని.లో) ఒక గోల్ చేయగా... జూలియన్ అల్వారెజ్ (39వ, 69వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మొరాకోజట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఈనెల 18న జరిగే ఫైనల్లో అర్జెంటీనా తలపడుతుంది. అర్జెంటీనా 1978, 1986లలో ప్రపంచ చాంపియన్‌గా... 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. పక్కా ప్రణాళికతో... నాకౌట్ మ్యాచ్‌ల్లో రక్షణాత్మకంగా ఆడుతూ ప్రత్యర్థికి గోల్స్ ఇవ్వకుండా చివర్లో షూటౌట్లో విజయం సాధించడం క్రొయేషియా అలవాటుగా మార్చుకుంది. ఆరంభంలోనే గోల్స్ చేసి క్రొయేషియాను ఒత్తిడికి నెట్టాలనే వ్యూహంతో అర్జెంటీనా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఈ వ్యూహం ఫలితాన్నిచ్చింది. ఆట 34వ నిమిషంలో ‘డి’ ఏరియాలో అల్వారెజ్ను క్రొయేషియా గోల్‌కీపర్ లివకోవిచ్ మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. మెస్సీ ఎడమ కాలితో కొట్టిన షాట్ బుల్లెట్ వేగంతో క్రొయేషియా గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. అర్జెంటీనా 1–0తో ఆధిక్యం సంపాదించింది. ఐదు నిమిషాల తర్వాత అర్జెంటీనా ఖాతాలో రెండో గోల్ చేరింది. మధ్య భాగంలో ఉన్న మెస్సీ బంతిని అల్వారెజ్‌కు పాస్ ఇవ్వగా అతను వాయువేగంతో క్రొయేషియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ‘డి’ ఏరియాలోకి వచ్చాడు. అదే జోరులో గోల్కీపర్ను తప్పిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి అర్జెంటీనా 2–0తో ముందంజలో నిలిచింది. తక్కువ అంచనా వేయకుండా... నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2–0తో ఆధిక్యంలో నిలిచినా చివర్లో తడబడి రెండు గోల్స్ సమర్పించుకొని చివరకు షూటౌట్లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. ప్రమాదకరమైన క్రొయేషియా జట్టుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అర్జెంటీనా రెండో అర్ధభాగంలోనూ జాగ్రత్తగా ఆడింది. బంతి ఎక్కువ శాతం క్రొయేషియా ఆటగాళ్ల ఆధీనంలో ఉన్నప్పటికీ వారిని ‘డి’ ఏరియా వరకు రానివ్వకుండా చేయడంలో అర్జెంటీనా డిఫెండర్లు సఫలమయ్యారు. మ్యాచ్ మొత్తంలో క్రొయేషియా కేవలం రెండుసార్లు మాత్రమే అర్జెంటీనా గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టడం గమనార్హం. క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిచ్, పెరిసిచ్, బ్రోజోవిచ్, కొవాసిచ్లను అర్జెంటీనా డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. వారెవ్వా.. ఏమి గోల్..... ఆట 57వ నిమిషంలో అర్జెంటీనా ఖాతాలో మూడో గోల్ చేరేదే కానీ మెస్సీ కొట్టిన షాట్‌ను గోల్‌పోస్ట్ ముందు గోల్‌కీపర్ లివకోవిచ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత 69వ నిమిషంలో అద్భుతమే జరిగింది. తనదైన రోజున తానెంత ప్రమాదకర ప్లేయర్‌నో మెస్సీ నిరూపించాడు. కుడి వైపున బంతి అందుకున్న మెస్సీ పాదరసంలా కదులుతూ ముందుకు వెళ్లగా... అతని వెంబడే క్రొయేషియా డిఫెండర్ జోస్కో గ్వార్డియోల్ పరుగెత్తాడు. గ్వార్డియోల్ అన్ని రకాలుగా మెస్సీని నిలువరించాలని చూసినా... ఈ అర్జెంటీనా స్టార్ మాత్రం కనువిందులాంటి డ్రిబ్లింగ్‌తో అలరించాడు. చివరకు గోల్‌లైన్ అంచుల్లోంచి గ్వార్డియోల్ కాళ్ల సందులోంచి బంతిని మెస్సీ క్రాస్ పాస్ ఇవ్వగా... అక్కడే ఉన్న అల్వారెజ్ నేర్పుతో బంతిని లక్ష్యానికి చేర్చాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ గోల్‌ను కళ్లారా చూసిన వారందరూ మెస్సీ మ్యాజిక్కు ఫిదా అయిపోవడమే కాకుండా ఈ గోల్‌ను చిరకాలం గుర్తుంచుకుంటారు. అర్జెంటీనా ఆధిక్యం 3–0కు పెరగడంతో క్రొయేషియా విజయంపై ఆశలు వదులుకుంది. మరోవైపు అర్జెంటీనా చివరి వరకు దూకుడును కొనసాగిస్తూ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరిసారిగా... ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి వరల్డ్‌కప్ అవుతుందని అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ అధికారికంగా ప్రకటించాడు. 2006 నుంచి వరుసగా ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మెస్సీ, తన ఆఖరి పోరులో గెలిచి చరిత్రకెక్కాలని పట్టుదలగా ఉన్నాడు. ‘నా ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించబోతున్నాను. నా చివరి మ్యాచ్‌గా ఫైనల్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మరోసారి వరల్డ్‌కప్ అంటే చాలా దూరంలో ఉంది. నేను అప్పటి వరకు ఆడలేనని తెలుసు. వరల్డ్‌కప్‌లో వేర్వేరు రికార్డులు నా దరిచేరడం మంచిదే. కానీ అన్నింటికంటే ముఖ్యం జట్టుగా మా లక్ష్యం ఏమిటనేది. అది సాధిస్తేనే అంతా అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. ఎంతో కష్టపడి ఈ దశకు వచ్చాం. ట్రోఫీ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని 35 ఏళ్ల మెస్సీ వ్యాఖ్యానించాడు. 2005 నుంచి అర్జెంటీనా సీనియర్ జట్టుకు ఆడుతున్న మెస్సీ 171 మ్యాచ్‌లు ఆడి 96 గోల్స్ సాధించాడు. 1: ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అర్జెంటీనా ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. బటిస్టుటా (10 గోల్స్) పేరిట ఉన్న రికార్డును మెస్సీ (11 గోల్స్) సవరించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో మెస్సీ సంయుక్తంగా ఆరో స్థానానికి చేరుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ (16), రొనాల్డో నజారియో (15), గెర్డ్ ముల్లర్ (14) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 2: ప్రపంచకప్‌లో తొలి లీగ్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత ఫైనల్ చేరడం అర్జెంటీనాకిది రెండోసారి. 1990లోనూ అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో కామెరూన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 1982లో పశ్చిమ జర్మనీ... 1994లో ఇటలీ... 2010లో స్పెయిన్ కూడా ఈ ఘనత సాధించాయి. జర్మనీ, ఇటలీ రన్నరప్‌గా నిలువగా... స్పెయిన్ మాత్రం టైటిల్ సాధించింది. 2: జర్మనీ తర్వాత ప్రపంచకప్ సెమీఫైనల్లో రెండుసార్లు మూడు అంతకంటే ఎక్కువ గోల్స్ తేడాతో గెలిచిన రెండో జట్టుగా అర్జెంటీనా నిలిచింది. 3: వరుసగా ఐదో ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ గత నాలుగు ప్రపంచకప్‌లలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేదు. ఈసారి మాత్రం ఏకంగా మూడు గోల్స్ చేశాడు. 5: ఒకే ప్రపంచకప్‌లో ఐదు గోల్స్ చేసిన పెద్ద వయస్కుడిగా మెస్సీ (35 ఏళ్లు) ఘనత సాధించాడు. 6: ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. జర్మనీ అత్యధికంగా 8 సార్లు ఫైనల్ చేరింది. బ్రెజిల్, ఇటలీ (6 సార్లు చొప్పున) సరసన అర్జెంటీనా నిలిచింది. 16: ఈ ఏడాది అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్. తన కెరీర్లో జాతీయ జట్టుకు ఒకే సంవత్సరం ఇన్ని గోల్స్ అందించడం ఇదే ప్రథమం. 25: ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో మెస్సీ ఆడిన మ్యాచ్‌లు. లోథర్ మథియాస్ (జర్మనీ–25 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఫైనల్లోనూ మెస్సీ బరిలోకి దిగితే ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: అందరి కళ్లు మొరాకో పైనే...
దోహా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఊహకందని ప్రదర్శనతో అదరగొడుతున్న ఆఫ్రికా జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మొరాకో తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి మ్యాచ్ కాగా... వేర్వేరు టోర్నీలలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి. 1963లో ఒక్కసారి ఫ్రాన్స్‌ను ఓడించిన మొరాకో ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 2007 తర్వాత ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరుగుతుండటం విశేషం. ఎంబాపె, జిరూడ్, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్, చువమెని, గోల్‌కీపర్ హుగో లోరిస్లాంటి స్టార్ ఆటగాళ్లతో ఫ్రాన్స్ పటిష్టంగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న మొరాకో ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డు నెలకొల్పింది. కెనడాతో మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ మినహా ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకొని ఏకైక జట్టుగా మొరాకో నిలిచింది. గ్రూప్ దశలో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును నిలువరించిన మొరాకో ఆ తర్వాత రెండో ర్యాంకర్ బెల్జియంపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 విశ్వవిజేత స్పెయిన్‌పై... క్వార్టర్ ఫైనల్లో 2016 యూరో చాంపియన్ పోర్చుగల్‌ను ఓడించి తమను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని ఫ్రాన్స్‌కు హెచ్చరికలు పంపించింది. మొరాకో తరఫున యూసుఫ్ ఎన్ నెసిరి, అచ్రఫ్ హకీమి, హకీమ్ జియెచ్, సఫ్యాన్ అమ్రాబత్, గోల్‌కీపర్ యాసిన్ బోనో ప్రదర్శన మరోసారి కీలకం కానుంది. ఈ టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన 39 షాట్లను గోల్‌కీపర్ యాసిన్ బోనో నిలువరించడం విశేషం. -
Qatar FIFA World Cup 2022: ఫ్రాన్స్ జోరు...
దోహా: ఆద్యంతం దూకుడుగా ఆడిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొమ్మిదోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోలాండ్‌తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో పోలాండ్ జట్టును ఓడించింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (44వ ని.లో) ఒక గోల్ చేయగా... ఎంబాపె (74వ, 90+1వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పోలాండ్ జట్టుకు కెప్టెన్ లెవన్డౌస్కీ (90+9వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఆరంభంలో ఫ్రాన్స్‌ను నిలువరించిన పోలాండ్ తొలి అర్ధభాగం చివర్లో తడబడింది. ఎంబాపె అందించిన పాస్‌ను జిరూడ్ లక్ష్యానికి చేర్చడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. జిరూడ్ కెరీర్లో ఇది 52వ గోల్. ఈ గోల్‌తో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును జిరూడ్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ ఆడుతుంది. -
Qatar FIFA World Cup 2022: క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్
అమెరికాకు తొలి నాకౌట్ దెబ్బ పడింది. నెదర్లాండ్స్ మొదటి క్వార్టర్స్ బెర్తు సాధించింది. ప్రపంచకప్‌లో లీగ్ దశ వెనువెంటనే మొదలైన నాకౌట్ పోరులో మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్ 3–1తో అమెరికాపై ఘనవిజయం సాధించింది. డచ్ డిఫెండర్లు ప్రత్యర్థి స్ట్రయికర్లను నిలువరించగా... ఫార్వర్డ్ ఆటగాళ్లు గోల్స్ చేయడంలో సఫలమయ్యారు. దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో డచ్ టీమ్ 3–1 గోల్స్ తేడాతో అమెరికాపై జయభేరి మోగించింది. నెదర్లాండ్స్ ఆటగాడు డెంజెల్ డంఫ్రైస్ అసాధారణ ఆటతీరు కనబరిచాడు. డచ్ విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలి రెండు గోల్స్‌కు మెరుపు పాస్‌లు అందించిన డెంజెల్... ఆట ముగింపు దశలో స్వయంగా తనే గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఆధిక్యానికి ఎదురేలేకుండా పోయింది. డచ్ తరఫున మెంఫిస్ డిపే (10వ ని.), డెలీ బ్లైండ్ (ఇంజ్యూరి టైమ్ 45+1వ ని.), డంఫ్రైస్ (81వ ని.) గోల్ చేశారు. అమెరికా జట్టులో హజి రైట్ (76వ ని.) గోల్ సాధించాడు. ఆట ఆరంభంలో అమెరికా స్ట్రయికర్లే నెదర్లాండ్స్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. రెండో నిమిషం నుంచే అమెరికా గోల్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫినిషింగ్ లోపాలతో ఏ ఒక్కటి సఫలం కాలేదు. అయితే ఆట పదో నిమిషంలో కళ్లు చెదిరే గోల్‌కు డంఫ్రైస్ కారణమయ్యాడు. ప్రత్యర్థి డి ఏరియాకు సమీపంలో కుడివైపు నుంచి డంఫ్రైస్ దూసుకొస్తూ ఇచ్చిన క్రాస్పాస్ను మెంఫిస్ డిపే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే మెరుపువేగంతో గోల్‌కీపర్‌కు అవకాశం లేకుండా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. మళ్లీ తొలి అర్ధభాగం స్టాపేజ్ (ఇంజ్యూరి టైమ్)లో అదే రకమైన క్రాస్ పాస్‌ను డెలీ బ్లైండ్‌కు ఇవ్వగా అతను కూడా చాకచక్యంగా బంతిని లక్ష్యం చేర్చడంలో సఫలమయ్యాడు. ద్వితీయార్ధంలో అమెరికా బృందంలో 67వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ అయిన హజి రైట్ (76వ ని.) వచ్చిన 9 నిమిషాలకే అమెరికాకు గోల్ చేసి పెట్టాడు. డచ్ ఆధిక్యం 2–1కు తగ్గిన కాసేపటికే డంఫ్రైస్ మళ్లీ గర్జించాడు. ఈసారి తానే ఏకంగా గోల్‌పోస్ట్‌పై గురిపెట్టడంతో 81వ నిమిషంలో నెదర్లాండ్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మ్యాచ్‌లో డచ్‌ను నడిపించిన డెంజెల్ డంఫ్రైస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అర్జెంటీనా–ఆస్ట్రేలియా మ్యాచ్ విజేతతో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్లో తలపడుతుంది. ప్రపంచకప్‌లో నేడు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) ఫ్రాన్స్ X పోలాండ్ రాత్రి గం. 8:30 నుంచి ఇంగ్లండ్ X సెనెగల్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డంఫ్రైస్ -
FIFA World Cup Qatar 2022: నాకౌట్‌కు దక్షిణ కొరియా
దోహా: గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశకే పరిమితమైన దక్షిణ కొరియా ఈసారి సత్తా చాటింది. కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌లో చెలరేగి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. పోర్చుగల్‌తో జరిగిన గ్రూప్ ‘హెచ్’ పోరులో కొరియా 2–1తో గెలిచింది. మ్యాచ్ 5వ నిమిషంలోనే హోర్టా గోల్ సాధించి పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే కొరియా తరఫున 27వ నిమిషంలో కిమ్ యంగ్ గ్వాన్ గోల్ చేసి స్కోరును సమం చేయగా...మ్యాచ్ చివర్లో వాంగ్ హీ చాన్ చేసిన అద్భుతమైన కౌంటర్ అటాక్ గోల్ (90+1వ నిమిషంలో)తో కొరియా దూసుకుపోయింది. గ్రూప్‌లో ఈ మ్యాచ్‌కు ముందే 2 విజయాలు సాధించి నాకౌట్ చేరిన పోర్చుగల్‌తో పాటు రెండో జట్టుగా కొరియా ముందంజ వేసింది. ఘనాతో మ్యాచ్ ముగిశాక రిఫరీతో వాగ్వాదం చేసినందుకు ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటుకు గురైన కొరియా కోచ్ పౌలో బెంటో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకుల గ్యాలరీల్లో కూర్చోని చూశారు. చదవండి: Football: కుప్పకూలి.. యువ ఆటగాడు కన్నుమూత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: బెల్జియం అవుట్
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ అజేయంగా...
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది. అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది. వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది. 18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్ఫోర్డ్కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు. నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: పోర్చుగల్ ముందుకు...
దోహా: అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన క్రిస్టియానో రొనాల్డో బృందం తొలి అడ్డంకిని దాటింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘హెచ్’ మ్యాచ్‌లో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గతంలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఉరుగ్వే జట్టుపై గెలిచింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను బ్రూనో ఫెర్నాండెజ్ (54వ ని.లో, 90+3వ ని.లో) సాధించాడు. వరుసగా రెండో విజయం సాధించిన పోర్చుగల్ జట్టు ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గత ప్రపంచకప్‌లో ఉరుగ్వే చేతిలో 1–2తో ఓడిపోయిన రొనాల్డో జట్టు ఈసారి ఈ మాజీ విజేత జట్టును తేలిగ్గా తీసుకోలేదు. ముఖ్యంగా రొనాల్డో ముందుండి జట్టును నడిపించాడు. పలుమార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ దిశగా వెళ్లి లక్ష్యంపై గురి పెట్టాడు. మరోవైపు ఉరుగ్వే కూడా దూకుడుగానే ఆడింది. కానీ ఆ జట్టును కూడా ఫినిషింగ్ లోపం వేధించింది. విరామ సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. ఎట్టకేలకు 54వ నిమిషంలో బ్రూనో ఫెర్నాండెజ్ సంధించిన క్రాస్ షాట్ నేరుగా ఉరుగ్వే గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్రూనో కిక్‌ను గాల్లోకి ఎగిరి రొనాల్డో హెడర్ ద్వారా అందుకునే ప్రయత్నం చేసినా బంతి రొనాల్డో తలకు తగలకుండానే గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఉరుగ్వే తరఫున బెంటాన్కర్, గోమెజ్ కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లాయి. స్టాపేజ్ సమయంలో ‘డి’ ఏరియాలో ఉరుగ్వే ప్లేయర్ జిమినెజ్ చేతికి బంతి తగలడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. బ్రూనో ఈ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. చివరి సెకన్లలో బ్రూనో కొట్టిన షాట్ గోల్‌పోస్ట్‌కు తగిలి బయటకు వెళ్లింది. లేదంటే అతని ఖాతాలో హ్యాట్రిక్ చేరేది. ప్రపంచకప్‌లో నేడు డెన్మార్క్ X ఆస్ట్రేలియా రాత్రి గం. 8:30 నుంచి ఫ్రాన్స్ X ట్యునీషియా రాత్రి గం. 8:30 నుంచి అర్జెంటీనా X పోలాండ్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి మెక్సికో X సౌదీ అరేబియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: 20 ఏళ్ల తర్వాత...
దోహా: రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సెనెగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండోసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సెనెగల్ 2–1 గోల్స్ తేడాతో ఈక్వెడార్ జట్టును ఓడించింది. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు అర్హత పొందింది. సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సార్ (44వ ని.లో), కెప్టెన్ కలిదు కులిబాలి (70వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఈక్వెడార్‌కు మోజెస్ కైసెడో (67వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. మూడోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న సెనెగల్ తొలిసారి బరిలోకి దిగిన 2002లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌లకు అర్హత పొందలేకపోయింది. మళ్లీ 2018లో రెండో సారి ఈ మెగా ఈవెంట్లో ఆడిన సెనెగల్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి సమష్టిగా రాణించి తొలి అడ్డంకిని అధిగమించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తప్పనిసరిగా గెలిస్తేనే నాకౌట్ దశకు చేరే అవకాశం ఉండటంతో సెనెగల్ ఆటగాళ్లు ఆద్యంతం దూకుడుగా ఆడారు. ‘డ్రా’ చేసుకున్నా నాకౌట్ దశకు చేరే చాన్స్ ఉండటంతో ఈక్వెడార్ కూడా వెనక్కి తగ్గలేదు. సాధ్యమైనంత ఎక్కువసేపు తమ ఆధీనంలో బంతి ఉండేలా ఈక్వెడార్ ఆటగాళ్లు ప్రయత్నించారు. సెనెగల్ ఆటగాళ్లను మొరటుగా అడ్డుకునేందుకు వెనుకాడలేదు. ఈ క్రమంలో 44వ నిమిషంలో ‘డి’ ఏరియాలో సెనెగల్ ప్లేయర్ ఇస్మాయిల్ సార్‌ను ఈక్వెడార్ డిఫెండర్ హిన్కాపి తోసేశాడు. దాంతో రిఫరీ మరో ఆలోచన లేకుండా సెనెగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించాడు. పెనాల్టీని ఇస్మా యిల్ సార్ గోల్‌గా మలిచాడు. దాంతో విరామ సమయానికి సెనెగల్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఈక్వెడార్ స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. 67వ నిమిషంలో లభించిన కార్నర్‌ను ప్లాటా ‘డి’ ఏరియాలోకి కొట్టాడు. దానిని టోరెస్ హెడర్ షాట్‌తో ఒంటరిగా ఉన్న మోజెస్ కైసెడో వద్దకు పంపించగా అతను గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమం అయింది. అయితే ఈక్వెడార్‌కు ఈ ఆనందం మూడు నిమిషాల్లోనే ఆవిరైంది. 70వ నిమిషంలో సెనెగల్ జట్టుకు లభించిన కార్నర్‌ను గుయె ‘డి’ ఏరియాలోకి కొట్టగా ఈక్వెడార్ ప్లేయర్ టోరెస్‌కు తగిలి బంతి గాల్లో లేచింది. అక్కడే ఉన్న కెప్టెన్ కులిబాలి బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించి సెనెగల్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత సెనెగల్ చివరివరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. నెదర్లాండ్స్ 11వసారి... మరోవైపు ఆతిథ్య ఖతర్ జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచి ఏడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి 11వసారి ప్రపంచకప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున కొడి గాప్కో (26వ ని.లో), ఫ్రాంకీ డి జాంగ్ (49వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ టోర్నీలో గాప్కోకిది మూడో గోల్ కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!
దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్ దాటకపోవడమే పెద్ద షాక్ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్‌తో జరిగిన లీగ్ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది. స్పెయిన్ తరఫున సబ్‌స్టిట్యూట్ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్‌స్టిట్యూట్ ఫుల్క్రుగ్ (83వ ని.లో) గోల్ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్‌తో స్పెయిన్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. -
FIFA World Cup Qatar 2022: ‘ఘన’మైన విజయం
దోహా: తొలి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరకు పోర్చుగల్ ముందు తలొగ్గిన ఆఫ్రికా దేశం ఘనా తర్వాతి పోరులో సత్తా చాటింది. తమకంటే బలమైన, ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న దక్షిణ కొరియాను చిత్తు చేసి గ్రూప్ ‘హెచ్’లో సమరాన్ని ఆసక్తికరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఘనా 3–2 గోల్స్ తేడాతో కొరియాపై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ కుడూస్ (34వ, 68వ ని.లో) రెండు గోల్స్‌తో చెలరేగగా, మొహమ్మద్ సలిసు (24వ ని.లో) మరో గోల్ చేశాడు. కొరియా ఆటగాడు చో గూసంగ్ (58వ, 61వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఘనా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఫార్వర్డ్లు దూసుకుపోవడంతో తొలి 24 నిమిషాల్లోనైతే బంతి పూర్తిగా కొరియా ఏరియాలోనే కనిపించింది. చివరకు ఘనా ఫలితం రాబట్టింది. జోర్డాన్ ఆయూ ఎడమ వైపు నుంచి కొట్టిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో కెప్టెన్ ఆండ్రూ ఆయూ నియంత్రణలోకి తెచ్చుకోగా, ఆ వెంటనే సలిసు గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాల్లోనే ఘనా ఆధిక్యం పెంచుకుంది. ఈసారి కూడా జోర్డాన్ ఆయూనే పాస్ అందించగా... కుడూస్ హెడర్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో విస్తుపోవడం కొరియా వంతైంది. తొలి అర్ధభాగంలో ఘనా ఆట చూస్తే కొరియా చిత్తుగా ఓడుతుందనిపించింది. అయితే విరామం తర్వాత కొరియా కోలుకుంది. 168 సెకన్ల వ్యవధిలో చో గూసంగ్ చేసిన రెండు హెడర్ గోల్స్ ఒక్కసారిగా మ్యాచ్ పరిస్థితిని మార్చేశాయి. లీ కాంగ్ ఇచ్చిన క్రాస్తో తొలి గోల్ చేసిన గూసంగ్, రెండో గోల్‌తో అద్భుతాన్ని ప్రదర్శించాడు. కిమ్ జిన్ కిక్ కొట్టగా, గోల్ పోస్ట్ ముందు గిడియాన్ మెన్సాను తప్పించి గాల్లోకి ఎగురుతూ గోల్ సాధించడం హైలైట్‌గా నిలిచింది. స్కోరు సమం కావడంతో మళ్లీ హోరాహోరీ మొదలైంది. అయితే కొరియా డిఫెన్స్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ కుడూస్ మళ్లీ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివర్లో ఘనా గోల్‌కీపర్ లారెన్స్ అతీ జిగీ మెరుపు వేగంతో కదులుతూ గోల్స్‌ను అడ్డుకోవడం విశేషం. మ్యాచ్ తర్వాత పెనాల్టీ విషయంలో రిఫరీ ఆంథోనీ టేలర్‌తో వాదనకు దిగిన కొరియా కోచ్ బెంటో రెడ్‌కార్డుకు గురయ్యాడు. ప్రపంచకప్‌లో నేడు ఈక్వెడార్ X సెనెగల్ రాత్రి గం. 8:30 నుంచి నెదర్లాండ్స్ X ఖతర్ రాత్రి గం. 8:30 నుంచి ఇరాన్ X అమెరికా అర్ధరాత్రి గం. 12:30 నుంచి ఇంగ్లండ్ X వేల్స్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా నిలిచింది
తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి అర్జెంటీనా వెంటనే తేరుకుంది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లో నాకౌట్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్ జట్టు సమష్టి ప్రదర్శనతో రాణించింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల మెక్సికోను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే సౌదీ అరేబియా–మెక్సికో మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పోలాండ్ చేతిలో ఓడితే మాత్రం అర్జెంటీనా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. దోహా: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న అర్జెంటీనా రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టు ఆడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా మెక్సికోతో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆట 64వ నిమిషంలో కెప్టెన్ లయనెల్ మెస్సీ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాకౌట్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడింది. మరోవైపు మెక్సికో ఫార్వర్డ్ అలెక్సిక్ వెగా అవకాశం వచ్చినపుడల్లా అర్జెంటీనా రక్షణ శ్రేణి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టాడు. 45వ నిమిషంలో వెగా కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు తమ దాడుల్లో పదును పెంచారు. చివరకు 64వ నిమిషంలో కుడివైపు నుంచి డిమారియా ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ 25 గజాల దూరం నుంచి షాట్ కొట్టగా మెక్సికో గోల్‌కీపర్ డైవ్ చేసినా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పోకుండా అడ్డుకోలేకపోయాడు. దాంతో అర్జెంటీనా బోణీ కొట్టింది. ఖాతా తెరిచిన ఉత్సాహంతో అర్జెంటీనా మరింత జోరు పెంచింది. మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ అందుకొని షాట్ కొట్టగా బంతి మెక్సికో గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. దాంతో ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా చేతిలో మెక్సికోకు నాలుగో ఓటమి ఎదురైంది. ప్రపంచకప్‌లో నేడు కామెరూన్ X సెర్బియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి దక్షిణ కొరియా X ఘనా సాయంత్రం గం. 6:30 నుంచి బ్రెజిల్ X స్విట్జర్లాండ్ రాత్రి గం. 9:30 నుంచి పోర్చుగల్ X ఉరుగ్వే అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
FIFA World Cup Qatar 2022: ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్
దోహా: వరుసగా రెండో విజయం నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్‌లో నాకౌట్ బెర్త్‌ను (ప్రిక్వార్టర్ ఫైనల్) ఖరారు చేసుకుంది. డెన్మార్క్ జట్టుతో శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె (61వ, 86వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. డెన్మార్క్ తరఫున క్రిస్టెన్సన్ (68వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. థియో హెర్నాండెజ్ అందించిన పాస్‌ను గోల్‌పోస్ట్‌లోనికి పంపించి తొలి గోల్ సాధించిన ఎంబాపె... గ్రీజ్మన్ క్రాస్ షాట్‌ను గాల్లోకి ఎగిరి లక్ష్యానికి చేర్చి రెండో గోల్ చేశాడు. ప్రపంచకప్‌లో నేడు జపాన్ X కోస్టారికా మధ్యాహ్నం గం. 3:30 నుంచి బెల్జియం X మొరాకో సాయంత్రం గం. 6:30 నుంచి క్రొయేషియా X కెనడా రాత్రి గం. 9:30 నుంచి జర్మనీ X స్పెయిన్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA World Cup Qatar 2022: నెదర్లాండ్స్, ఈక్వెడార్ మ్యాచ్ ‘డ్రా’
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నెదర్లాండ్స్, ఈక్వెడార్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆతిథ్య ఖతర్ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. ఆట ఆరో నిమిషంలో కోడి గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామ సమయం వరకు ఆధిక్యంలో నిలిచిన ‘ఆరెంజ్ జట్టు’ రెండో అర్ధభాగంలో తడబడింది. ఆట 49వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ ఎనెర్ వాలెన్సియా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేశాడు. ఒక విజయం, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, ఈక్వెడార్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లను ఈ రెండు జట్లు ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. -
FIFA World Cup Qatar 2022: పోర్చు‘గోల్’ కొట్టింది..!
దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో పోర్చుగల్ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బోణీ కొట్టింది. గోల్ లేకుండా తొలి అర్ధ భాగం చప్పగా సాగగా... ద్వితియార్ధంలో పెనాల్టీ కిక్ మ్యాచ్‌ను ఉన్నపళంగా మార్చేసింది. చకాచకా గోల్స్‌తో నమోదవడంతో మ్యాచ్‌లో ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చివరకు పోర్చుగల్ 3–2తో ఘనాపై గెలిచింది. ఆట 64వ నిమిషంలో స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డోను మొరటుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీన్ని సులువుగానే రొనాల్డో గోల్‌గా మలిచాడు. కానీ 8 నిమిషాల వ్యవధిలో ఘన ఆటగాడు అండ్రూ అవియు (73వ ని.) ఫీల్డ్ గోల్‌తో స్కోరును 1–1గా సమం చేశాడు. మళ్లీ ఐదు నిమిషాల్లో ఆధిక్యం మారింది. జొవో ఫెలిక్స్ (78వ ని.), రాఫెల్ లియో (80వ ని.) ఫీల్డ్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ 3–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెగ్యులర్ టైమ్ ముగిసే దశలో ఘనా ఆటగాడు ఉస్మాన్ బుకారి (89వ ని.) హెడర్‌తో అద్భుతమైన గోల్ సాధించాడు. ఇంజ్యూరి టైమ్‌లో స్కోరును సమం చేసేందుకు ఘనా ఆటగాళ్లు శక్తికి మించి శ్రమించారు. ఆఖరి క్షణందాకా వారు గోల్‌పోస్ట్‌పై చేసిన దాడుల్ని పోర్చుగల్ డిఫెండర్లు అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పదే పదే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రిఫరీ ఆరు సార్లు ఎల్లో కార్డు ప్రయోగించాడు. పోర్చుగల్ జట్టులో ఇద్దరు, ఘనా బృందంలో నలుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. 5: ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్ సాధించాడు. -
FIFA World Cup Qatar 2022: స్పెయిన్ ‘సెవెన్’ స్టార్ ప్రదర్శన
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టయిన స్పెయిన్ భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2010 విశ్వవిజేత స్పెయిన్ 7–0 గోల్స్ తేడాతో కోస్టారికా జట్టును చిత్తుగా ఓడించింది. స్పెయిన్ తరఫున ఫెరాన్ టోరెస్ (31వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డానీ ఓల్మో (11వ ని.లో), మార్కో అసెన్సియో (21వ ని.లో), గావి (74వ ని.లో), కార్లోస్ సోలెర్ (90వ ని.లో), అల్వారో మొరాటా (90+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తమ ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్కిదే అతిపెద్ద విజయం. ఆ జట్టు ప్రపంచకప్ మ్యాచ్‌లో ఏడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. కోస్టారికాతో మ్యాచ్‌లో స్పెయిన్ సంపూర్ ఆధిపత్యం చలాయించింది. 82 శాతం బంతి స్పెయిన్ ఆధీనంలో ఉండటం వారి ఆధిపత్యానికి నిదర్శనం. స్పెయిన్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఎనిమిది షాట్లు కొట్టగా... కోస్టారికా ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్ కొట్టలేకపోయింది. స్పెయిన్ ఆటగాళ్లు ఏకంగా 1,043 పాస్‌లు పూర్తి చేశారు. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పాస్‌లు పూర్తి చేయలేదు. కోస్టారికా ఆటగాళ్లు 231 పాస్‌లతో సరిపెట్టుకున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ చేయడం 1934 తర్వాత ఇదే తొలిసారి. 1934లో బ్రెజిల్‌పై తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ సాధించింది. క్రొయేషియా 0 మొరాకో 0 గత ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ రన్నరప్ క్రొయేషియాను మొరాకో నిలువరించింది. బుధవారం గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన లీగ్ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. సీనియర్ స్ట్రయికర్, క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఖాతా తెరిచేందుకు గట్టి ప్రయత్నాలే చేసిన మొరాకో ఆటగాళ్లు అడ్డుగోడ కట్టేయంతో గోల్ నమోదు కాలేదు. -
FIFA World Cup Qatar 2022: ఫ్రాన్స్ సూపర్ షో
అల్ వాక్రా (ఖతర్): వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఒకే జట్టు విజేతగా నిలిచి 60 ఏళ్లయింది. బ్రెజిల్ పేరిట ఉన్న ఈ ఘనతను తాము కూడా సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొలి పరీక్షలో పాస్ అయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 4–1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (32వ, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... అడ్రియన్ రాబియోట్ (27వ ని.లో), ఎంబాపె (68వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఆస్ట్రేలియా తరఫున ఏకైక గోల్‌ను క్రెయిగ్ గుడ్విన్ (9వ ని.లో) సాధించాడు. షాక్ నుంచి తేరుకొని... వరుసగా ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా మైదానంలో అభిమానులందరూ పూర్తిగా సర్దుకొని కూర్చునేలోపే ఖాతా తెరిచింది. ఆట తొమ్మిదో నిమిషంలో కుడి వైపు నుంచి లెకీ అందించిన పాస్‌ను క్రెయిగ్ గుడ్విన్ లక్ష్యానికి చేర్చడంతో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో అభిమానులకు మరో సంచలన ఫలితం తప్పదా అనే అనుమానం కలిగింది. అయితే ఫ్రాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. సమన్వయంతో ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు పగ్గాలు వేసింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి 2–1తో ఆధిక్యాన్ని అందుకుంది. 27వ నిమిషంలో ఎడమ వైపు నుంచి థియో హెర్నాండెజ్ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న ఆడ్రియన్ రాబియోట్ హెడర్ షాట్‌తో ఆస్ట్రేలియా గోల్కీపర్ను బోల్తా కొట్టించాడు. 32వ నిమిషంలో ఎడమ వైపు నుంచి రాబియోట్ అందించిన పాస్‌ను ఒలివియర్ జిరూడ్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ ఫ్రాన్స్ ఆధిపత్యం కనబరిచింది. ఈసారి మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి ఆస్ట్రేలియాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో ఫ్రాన్స్ జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. 51 ఆస్ట్రేలియాపై రెండు గోల్స్ చేసిన క్రమంలో ఒలివియర్ జిరూడ్ ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
FIFA World Cup Qatar 2022: జర్మనీకి జపాన్ షాక్
FIFA World Cup 2022 Germany Vs Japan Highlights: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో అనూహ్య ఫలితం వచ్చింది. మంగళవారం రెండుసార్లు విశ్వవిజేత అర్జెంటీనాను సౌదీ అరేబియా బోల్తా కొట్టిస్తే... బుధవారం ఏకంగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టును జపాన్ ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఆసియా గడ్డపై రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు రోజుల వ్యవధిలో రెండు ఆసియా జట్లు అద్భుతం చేశాయి. దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మేటి జట్లు, మాజీ చాంపియన్లకు ఆసియా జట్లు ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాయి. బుధవారం గ్రూప్ ‘ఇ’లో భాగంగా నాలుగుసార్లు చాంపియన్ జర్మనీని జపాన్ కంగుతినిపించింది. ఇద్దరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు రిత్సు డాన్, టకుమా అసానో చివరి 15 నిమిషాల్లో చేసిన రెండు గోల్స్‌తో జపాన్ 2–1 స్కోరుతో జర్మనీని గట్టిదెబ్బే తీసింది. తరచూ జర్మన్ క్లబ్‌లలో ఆడే రిత్సు (75వ ని.), అసానో (83వ ని.) ఈ ప్రపంచకప్‌లో ఆ జాతీయ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. జర్మనీ తరఫున ఇల్కే గుయెండగన్ (33వ ని.) గోల్ సాధించాడు. ఈ గ్రూప్‌లో టైటిల్ ఫేవరెట్ జట్టయిన జర్మనీ ఆరంభం నుంచే గోల్స్ ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ క్రమంలో 24 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు ఆడింది. ప్రథమార్ధంలోనే గుయెండగన్ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తీవ్రమైన ఒత్తిడిలో రెండో అర్ధభాగాన్ని మొదలుపెట్టిన జపాన్‌కు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు అసాధారణ ఫలితాలను సాధించి పెట్టారు. జపాన్ 2–1 ఆధిక్యంతో గెలుపు దారిలో పడగా... జర్మనీ మాత్రం ఎక్కడా పట్టు సడలించలేదు. ఆఖరి నిమిషం దాకా కష్టపడింది. నిర్ణీత సమయంలోని 90వ నిమిషం నుంచి ఇంజ్యూరీ టైమ్ 9 నిమిషాల పాటు స్కోరు సమం చేసేందుకు కడదాకా చెమటోడ్చింది. ఫుల్క్రగ్, రుడిగెర్, గోరెట్జా, సులే అదేపనిగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై షాట్లు ఆడారు. అయితే జపాన్ డిఫెండర్లు, గోల్ కీపర్ సమన్వయంతో ఆడ్డుకోవడంతో జర్మనీ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. జపాన్ గోల్ కీపర్ షుయిచి గొండా పెట్టని కోటలా నిలుచున్నాడు. ప్రపంచకప్ చరిత్ర లో ఆసియా జట్టు చేతిలో ఓడిపోవడం జర్మనీకిది రెండోసారి. 2018 ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా చేతిలో జర్మనీ 0–2తో ఓడిపోయింది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో! -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ శుభారంభం
దోహా: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణీ అదిరింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6–2 గోల్స్ తేడాతో ఇరాన్‌పై ఘనవిజయం సాధించింది. గతేడాది ‘యూరో కప్’ ఫైనల్లో ఇటలీతో జరిగిన షూటౌట్లో నిరాశపరిచిన బుకయో సాకా, మార్కస్ రాష్‌ఫోర్డ్ తాజా మ్యాచ్‌లో ‘హీరో’లయ్యారు. బుకయో (43వ, 62వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా, మార్కస్ (71వ ని.లో) ఒక గోల్ సాధించాడు. మిగతా మూడు గోల్స్‌ను జూడ్ బెలింగమ్ (35వ ని.లో), రహీమ్ స్టెర్లింగ్ (45+1వ ని.లో), జాక్ గ్రెలిష్ (90వ ని.లో) సాధించారు. మెహది టరెమి (65వ ని., 90+13వ ని. ఇంజూరి టైమ్) చేసిన రెండు గోల్స్‌తో ఇరాన్ పరువు నిలిచింది. ఇంగ్లండ్ స్ట్రయికర్లు ఆటగాళ్లు పాదరసంలా కదలడంతో ఇరాన్ డిఫెండర్లకు కష్టాలు తప్పలేదు. మ్యాచ్ మొత్తంమీద బంతిని తమ గుప్పిటే పెట్టుకోవడంలో ఇంగ్లండ్ స్ట్రయికర్లు సఫలమయ్యారు. ఇంగ్లండ్ తొలి అర్ధభాగంలోనే 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆధీనంలో బంతి 82 శాతం ఉండగా... ఆటగాళ్లు ఏకంగా 366 పాస్‌లను పూర్తి చేశారు. 1966 తర్వాత ఓ ప్రపంచకప్ తొలి అర్ధభాగంలో నమోదైన అత్యధిక పాస్‌లు ఇవే కావడం విశేషం. ఇరాన్ గోల్‌కీపర్‌కు గాయం మ్యాచ్ మొదలైన కాసేపటికే ఇరాన్ గోల్ కీపర్ అలి బెరన్వంద్ తీవ్రంగా గాయపడి మైదానం వీడాడు. సహచరుల తల అతని ముఖా నికి బలంగా తాకడంతో ముక్కు, గదవ దగ్గర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. నెదర్లాండ్స్ గెలుపు సెనెగల్ జట్టుతో సోమవారమే జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. ఆట 84వ నిమిషంలో కొడీ గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. ఇంజ్యూరీ టైమ్ (90+9వ ని.)లో డావీ క్లాసెన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయం ఖాయమైంది. ప్రపంచకప్‌లో నేడు అర్జెంటీనా X సౌదీ అరేబియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి డెన్మార్క్ X ట్యునీషియా సాయంత్రం గం. 6:30 నుంచి మెక్సికో X పోలాండ్ రాత్రి గం. 9:30 నుంచి ఫ్రాన్స్ X ఆస్ట్రేలియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం