దోహా: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణీ అదిరింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6–2 గోల్స్ తేడాతో ఇరాన్‌పై ఘనవిజయం సాధించింది. గతేడాది ‘యూరో కప్’ ఫైనల్లో ఇటలీతో జరిగిన షూటౌట్‌లో నిరాశపరిచిన బుకయో సాకా, మార్కస్ రాష్‌ఫోర్డ్ తాజా మ్యాచ్‌లో ‘హీరో’లయ్యారు. బుకయో (43వ, 62వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా, మార్కస్ (71వ ని.లో) ఒక గోల్ సాధించాడు. మిగతా మూడు గోల్స్‌ను జూడ్ బెలింగమ్ (35వ ని.లో), రహీమ్ స్టెర్లింగ్ (45+1వ ని.లో), జాక్ గ్రెలిష్ (90వ ని.లో) సాధించారు. మెహది టరెమి (65వ ని., 90+13వ ని. ఇంజూరి టైమ్) చేసిన రెండు గోల్స్‌తో ఇరాన్ పరువు నిలిచింది. ఇంగ్లండ్ స్ట్రయికర్లు ఆటగాళ్లు పాదరసంలా కదలడంతో ఇరాన్ డిఫెండర్లకు కష్టాలు తప్పలేదు. మ్యాచ్ మొత్తంమీద బంతిని తమ గుప్పిటే పెట్టుకోవడంలో ఇంగ్లండ్ స్ట్రయికర్లు సఫలమయ్యారు. ఇంగ్లండ్ తొలి అర్ధభాగంలోనే 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆధీనంలో బంతి 82 శాతం ఉండగా... ఆటగాళ్లు ఏకంగా 366 పాస్‌లను పూర్తి చేశారు. 1966 తర్వాత ఓ ప్రపంచకప్ తొలి అర్ధభాగంలో నమోదైన అత్యధిక పాస్‌లు ఇవే కావడం విశేషం.
ఇరాన్ గోల్‌కీపర్‌కు గాయం
మ్యాచ్ మొదలైన కాసేపటికే ఇరాన్ గోల్ కీపర్ అలి బెరన్‌వంద్ తీవ్రంగా గాయపడి మైదానం వీడాడు. సహచరుల తల అతని ముఖా నికి బలంగా తాకడంతో ముక్కు, గదవ దగ్గర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.
నెదర్లాండ్స్ గెలుపు
సెనెగల్ జట్టుతో సోమవారమే జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. ఆట 84వ నిమిషంలో కొడీ గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. ఇంజ్యూరీ టైమ్ (90+9వ ని.)లో డావీ క్లాసెన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయం ఖాయమైంది.
ప్రపంచకప్‌లో నేడు
అర్జెంటీనా X సౌదీ అరేబియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి
డెన్మార్క్ X ట్యునీషియా సాయంత్రం గం. 6:30 నుంచి
మెక్సికో X పోలాండ్ రాత్రి గం. 9:30 నుంచి
ఫ్రాన్స్ X ఆస్ట్రేలియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి
స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ శుభారంభం
Published Tue, Nov 22 2022 5:11 AM | Last Updated on Tue, Nov 22 2022 10:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment