Group B
-
‘డ్రా’తో గట్టెక్కిన ఆంధ్ర
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు లీగ్ దశను ‘డ్రా’తో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా కేరళతో జరిగిన చివరిదైన ఏడో లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు పోరాడి ‘డ్రా’ చేసుకుంది. చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు సాధించి ‘డ్రా’తో గట్టెక్కింది. 242 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కేరళ జట్టుకు 3 పాయింట్లు, ఆంధ్ర జట్టుకు ఒక పాయింట్ లభించాయి. అశ్విన్ హెబ్బర్ (165 బంతుల్లో 72; 12 ఫోర్లు, 1 సిక్స్) సంయమనంతో ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కరణ్ షిండే (82 బంతుల్లో 26; 5 ఫోర్లు), షేక్ రషీద్ (93 బంతుల్లో 36; 6 ఫోర్లు), షోయబ్ ఖాన్ (93 బంతుల్లో 11; 2 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి ఆంధ్ర జట్టుకు ఓటమి తప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ తొలి ఇన్నింగ్స్‌ను 514/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. -
Womens Hockey Olympic Qualifier: గెలిచి నిలిచిన భారత్
రాంచీ: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుకుంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సంగీత కుమారి (1వ ని.లో), ఉదిత (12వ ని.లో), డుంగ్‌డుంగ్ బ్యూటీ (14వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు మేగన్ హల్ (9వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. మరో మ్యాచ్‌లో అమెరికా 2–0తో ఇటలీ జట్టును ఓడించింది. ప్రస్తుతం అమెరికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, న్యూజిలాండ్ 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అమెరికాతో న్యూజిలాండ్; ఇటలీతో భారత్ తలపడతాయి. -
Womens T20 World Cup: మరో విజయమే లక్ష్యంగా...
కేప్‌టౌన్: టి20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు వరుసగా మరో విజయంపై దృష్టి సారించింది. బుధవారం గ్రూప్ ‘బి’లో జరిగే లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన... వెస్టిండీస్‌తో తలపడుతుంది. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓడిన కరీబియన్ అమ్మాయిలు బోణీ కొట్టేందుకు చూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాక్ ఎదురైన గత మ్యాచ్‌లో భారత జట్టు ఆరంభంలో తడబడినా... తర్వాత పుంజుకుంది. డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన గాయంతో అందుబాటులో లేకపోయినా... లక్ష్యఛేదనలో భారత్ ఆడిన తీరు బాగుంది. ఇప్పుడైతే స్టార్ ఓపెనర్ స్మృతి తుది జట్టులోకి రావడంతో బ్యాటింగ్ దళం మరింత పటిష్టమైంది. గత జనవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడిన రెండుసార్లు విజయం సాధించింది. ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఫామ్‌లో ఉండటంతో భారత టాపార్డర్‌కు ఏ ఢోకా లేదు. మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌లు కూడా బ్యాట్ ఝుళిపించగలరు. దీంతో భారీస్కోర్లు సాధించే సత్తా మన జట్టుకుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్ తన పదును చూపాల్సి ఉంది. పాక్‌తో పోరులో తొలి పది ఓవర్ల పాటు బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. కానీ తర్వాతి 10 ఓవర్లే కట్టుదిట్టంగా వేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో అలాంటి తడబాటుకు అవకాశమివ్వకుండా రాణిస్తే భారత్‌కు వరుస విజయం కష్టమేం కాదు. మరోవైపు విండీస్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. వరుసగా 14 మ్యాచ్‌ల్లో హేలీ మాథ్యూస్ సేన గెలుపొందలేకపోయింది. ఇందులో ఒక మ్యాచ్ ‘టై’కాగా... 13 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం జట్టును కుంగదీస్తోంది. మెగా ఈవెంట్లో\ ముందంజ వేయాలంటే కరీబియన్ జట్టుకు ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి లీగ్ మ్యాచ్‌లో విండీస్ ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. 12:ఇప్పటి వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 20 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 12 మ్యాచ్‌ల్లో, వెస్టిండీస్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్లు రెండుసార్లు తలపడగా...ఇరు జట్లకు ఒక్కో మ్యాచ్‌లో విజయం దక్కింది. -
పాక్‌తో పోరుకు భారత్ ‘సై’
కేప్‌టౌన్: టి20 ప్రపంచకప్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత మహిళల జట్టు నేడు గ్రూప్ ‘బి’ తొలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. కీలకమైన పోరుకు ముందు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్నెస్ సమస్యలు జట్టును సతమతం చేస్తున్నాయి. తొలి మ్యాచ్‌కు స్మృతి గాయంతో జట్టుకు దూరమవడం బ్యాటింగ్‌పై ప్రభావం చూపగలదు. అయితే ఇటీవల షఫాలీ వర్మ, రిచా అండర్–19 ఈవెంట్లో రాణించారు. ఇప్పుడు కూడా బాధ్యతను పంచుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. జెమీమా, హర్లీన్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మిడిలార్డర్లో రాణిస్తే జట్టుకు ఢోకా ఉండదు. బౌలింగ్ లో రేణుక, శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు విజయం సులువవుతుంది. -
Ranji Trophy: రహానే సేన చేతిలో హైదరాబాద్ పరాజయం
ముంబై: తమిళనాడుతో తొలి మ్యాచ్‌లో వెలుతురులేమితో ఓటమిని తప్పించుకున్న హైదరాబాద్ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. రంజీ ట్రోఫీ టైటిల్‌ను 41 సార్లు సాధించిన ముంబై జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో తన్మయ్ అగర్వాల్ సారథ్యంలోని హైదరాబాద్ ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 173/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగుల వద్ద ఆలౌటైంది. ముంబై ఎడంచేతి వాటం స్పిన్నర్ షమ్స్ ములానీ (7/94) హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. 437 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ముంబై... హైదరాబాద్‌కు ఫాలోఆన్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ హైదరాబాద్ విఫలమై 67.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ (39; 5 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ బుద్ధి (65; 10 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (39 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమ్స్ ములానీ (4/82), తనుష్ కొటియాన్ (5/82) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు. -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ అజేయంగా...
ఐదున్నర దశాబ్దాలుగా ఊరిస్తున్న రెండో ప్రపంచకప్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు తొలి దశను సాఫీగా అధిగమించింది. కనీసం ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉన్నా... ఈ మాజీ చాంపియన్ మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో భారీ విజయం నమోదు చేసి గ్రూప్ దశను అజేయంగా ముగించి తమ గ్రూప్ ‘బి’లో ‘టాపర్’గా నిలిచింది. అల్ రయ్యాన్ (ఖతర్): ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో 13వసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన గ్రూప్ ‘బి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ 3–0 గోల్స్ తేడాతో వేల్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున మార్కస్ రాష్‌ఫోర్డ్ (50వ, 68వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఫిల్ ఫోడెన్ (51వ ని.లో) ఒక గోల్ అందించాడు. 1958లో తొలిసారి ప్రపంచకప్‌లో పాల్గొని క్వార్టర్ ఫైనల్ చేరిన వేల్స్ 64 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి అర్హత సాధించినా ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటలేకపోయింది. వేల్స్‌తో కనీసం ‘డ్రా’ చేసుకున్నా తదుపరి దశకు అర్హత పొందే అవకాశమున్నా ఇంగ్లండ్ మాత్రం విజయమే లక్ష్యంగా ఆడింది. అయితే వేల్స్ డిఫెండర్లు గట్టిగా నిలబడటంతో తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఖాతా తెరువలేకపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో నిండిన ఇంగ్లండ్ రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చి ఫలితం పొందింది. 18 నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ సాధించి వేల్స్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా చేసింది. 50వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను రాష్‌ఫోర్డ్ నేరుగా వేల్స్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. 2020 యూరో ఫైనల్లో ఇటలీపై పెనాల్టీ షూటౌట్లో తన షాట్‌ను గోల్‌గా మలచలేకపోయిన రాష్ఫోర్డ్కు గత రెండేళ్లుగా ఏదీ కలసి రావడంలేదు. నల్ల జాతీయుడు కావడంతో స్వదేశంలో అతనిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వేల్స్‌పై రాష్‌ఫోర్డ్ రెండు గోల్స్‌తో రాణించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తొలి గోల్ అయ్యాక నిమిషం వ్యవధిలోనే ఇంగ్లండ్ ఖాతాలో రెండో గోల్ చేరింది. కెప్టెన్ హ్యారీ కేన్ క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఫిల్ ఫోడెన్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం 68వ నిమిషంలో రాష్‌ఫోర్డ్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యం 3–0కు పెరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన మూడో గోల్ ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టుకు 100వ గోల్ కావడం విశేషం. 92 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో 100 గోల్స్ మైలురాయిని అందుకున్న ఏడో జట్టుగా ఇంగ్లండ్ గుర్తింపు పొందింది. ‘బి’ గ్రూప్ టాపర్‌గా నిలిచిన ఇంగ్లండ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సెనెగల్ జట్టుతో ఆడుతుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ శుభారంభం
దోహా: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణీ అదిరింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6–2 గోల్స్ తేడాతో ఇరాన్‌పై ఘనవిజయం సాధించింది. గతేడాది ‘యూరో కప్’ ఫైనల్లో ఇటలీతో జరిగిన షూటౌట్లో నిరాశపరిచిన బుకయో సాకా, మార్కస్ రాష్‌ఫోర్డ్ తాజా మ్యాచ్‌లో ‘హీరో’లయ్యారు. బుకయో (43వ, 62వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా, మార్కస్ (71వ ని.లో) ఒక గోల్ సాధించాడు. మిగతా మూడు గోల్స్‌ను జూడ్ బెలింగమ్ (35వ ని.లో), రహీమ్ స్టెర్లింగ్ (45+1వ ని.లో), జాక్ గ్రెలిష్ (90వ ని.లో) సాధించారు. మెహది టరెమి (65వ ని., 90+13వ ని. ఇంజూరి టైమ్) చేసిన రెండు గోల్స్‌తో ఇరాన్ పరువు నిలిచింది. ఇంగ్లండ్ స్ట్రయికర్లు ఆటగాళ్లు పాదరసంలా కదలడంతో ఇరాన్ డిఫెండర్లకు కష్టాలు తప్పలేదు. మ్యాచ్ మొత్తంమీద బంతిని తమ గుప్పిటే పెట్టుకోవడంలో ఇంగ్లండ్ స్ట్రయికర్లు సఫలమయ్యారు. ఇంగ్లండ్ తొలి అర్ధభాగంలోనే 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆధీనంలో బంతి 82 శాతం ఉండగా... ఆటగాళ్లు ఏకంగా 366 పాస్‌లను పూర్తి చేశారు. 1966 తర్వాత ఓ ప్రపంచకప్ తొలి అర్ధభాగంలో నమోదైన అత్యధిక పాస్‌లు ఇవే కావడం విశేషం. ఇరాన్ గోల్‌కీపర్‌కు గాయం మ్యాచ్ మొదలైన కాసేపటికే ఇరాన్ గోల్ కీపర్ అలి బెరన్వంద్ తీవ్రంగా గాయపడి మైదానం వీడాడు. సహచరుల తల అతని ముఖా నికి బలంగా తాకడంతో ముక్కు, గదవ దగ్గర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. నెదర్లాండ్స్ గెలుపు సెనెగల్ జట్టుతో సోమవారమే జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. ఆట 84వ నిమిషంలో కొడీ గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. ఇంజ్యూరీ టైమ్ (90+9వ ని.)లో డావీ క్లాసెన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయం ఖాయమైంది. ప్రపంచకప్‌లో నేడు అర్జెంటీనా X సౌదీ అరేబియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి డెన్మార్క్ X ట్యునీషియా సాయంత్రం గం. 6:30 నుంచి మెక్సికో X పోలాండ్ రాత్రి గం. 9:30 నుంచి ఫ్రాన్స్ X ఆస్ట్రేలియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2022 WI VS ZIM: విండీస్ విజయం
హోబర్ట్: వెస్టిండీస్ దారిలో పడే విజయం సాధించింది. టి20 ప్రపంచకప్ తొలిరౌండ్ గ్రూప్ ‘బి’లో జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పోరులో ఓపెనర్ చార్లెస్ (36 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్ (4/16), జేసన్ హోల్డర్ (3/12) నిప్పులు చెరిగారు. రెండు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన విండీస్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి ‘సూపర్ 12’ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కరీబియన్ టాపార్డర్‌లో ఓపెనర్ కైల్ మేయర్స్ (12 బంతుల్లో 13; 2 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ (18 బంతుల్లో 15; 1 ఫోర్) నిరాశపరిచారు. కానీ మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ 13 ఓవర్లదాకా క్రీజులో నిలిచాడు. జట్టు స్కోరు 97 పరుగుల వద్ద అతను అవుట్ కాగానే... జింబాబ్వే బౌలర్ సికందర్ రజా (3/19) ఒకే ఓవర్లో బ్రూక్స్ (0), హోల్డర్ (4)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ 101 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆఖరి ఓవర్లలో రోవ్‌మన్ పావెల్ (21 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అకీల్ హోసిన్ (18 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు) ధాటిగా ఆడటంతో 150 పైచిలుకు స్కోరు చేసింది. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, సీన్ విలియమ్స్ ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ వెస్లీ మదెవెర్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), చివర్లో లూక్ జాంగ్వే (22 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. మిగతా వారిలో ఆరుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నిజానికి పవర్‌ప్లేలో 4.4 ఓవర్ల వరకు 47/1 స్కోరుతో పటిష్టంగా ఉన్న జింబాబ్వే మరో 11 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లను కోల్పోయి 64/5 స్కోరుతో కష్టాల్లో కూరుకుపోయింది. జోసెఫ్, హోల్డర్ ధాటికి ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. ఐర్లాండ్‌ను గెలిపించిన కాంఫర్ ఇదే గ్రూపులో జరిగిన మరో పోరులో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై జయభేరి మోగించింది. ధనాధన్ మెరుపులతో టి20 మజా పంచిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ మిడిలార్డర్ బ్యాటర్ కుర్టిస్ కాంఫర్ (32 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హీరోగా నిలిచాడు. అంతకుముందు స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. మైకెల్ జోన్స్ (55 బంతుల్లో 86; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. కెప్టెన్ బెరింగ్టన్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), క్రాస్ (28; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. తర్వాత ఐర్లాండ్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. 61/4 స్కోరుతో పరాజయం దిశగా పయనిస్తున్న జట్టును కాంఫర్, జార్జ్ డాక్రెల్ (37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించి గెలిపించారు. ‘బి’లో అందరూ రేసులో... గ్రూప్ ‘బి’ అందరిని ఊరిస్తోంది. ఇందులో ఉన్న స్కాట్లాండ్, జింబాబ్వే, విండీస్, ఐర్లాండ్ రెండేసి మ్యాచ్‌లాడాయి. అన్నీ జట్ల ఖాతాలో ఒక విజయం, 2 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఈ నాలుగు జట్లు శుక్రవారం ఆడే రెండు లీగ్ మ్యాచ్‌లు నాకౌట్‌గా మారాయి. రేపు ఐర్లాండ్‌తో విండీస్, స్కాట్లాండ్తో జింబాబ్వే తలపడతాయి. గెలిచిన రెండు జట్లు ‘సూపర్ 12’కు అర్హత సంపాదిస్తాయి. గ్రూప్ ‘ఎ’లో నేటి మ్యాచ్‌లు శ్రీలంక vs నెదర్లాండ్స్ (ఉ.గం. 9:30 నుంచి) నమీబియ్ఠా vs యూఏఈ (మ.గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా..
టరోబా: అండర్– 19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అసాధారణ గెలుపుతో లీగ్ దశ ను ముగించింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో యువ భారత్ 326 పరుగుల భారీ తేడాతో ఉగాండాపై నెగ్గింది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీస్కోరు చేసింది. రాజ్ అంగద్ బావా (162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), అంగ్కృష్ (144; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో నిషాంత్ 4, రాజ్వర్ధన్ 2 వికెట్లు తీశారు. ఈనెల 29న జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది దీపావళి పండగ సీజన్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి 30 రోజుల వేతనాలకు సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(అడ్-హాక్ బోనస్)ను గ్రూప్ 'సీ'లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రూపు 'బి'లోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరు ఎలాంటి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీం కింద కవర్ కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ తాత్కాలిక బోనస్ సెంట్రల్ పారా మిలటరీ దళాలు, సాయుధ దళాలలో అర్హులైన ఉద్యోగులకు కూడా లభిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. ఇతర బోనస్ లేదా ఎక్స్ గ్రేషియా దీని కింద కవర్ చేయబడదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ(డిఓఈ) ఈ రోజు(అక్టోబర్ 18) ఆఫీస్ మెమోరాండంలో తెలిపింది. 31-3-2021 నాటికి సర్వీసులో ఉండి 2020-21 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సేవ చేసిన ఉద్యోగులు మాత్రమే అడ్ హాక్ బోనస్ చెల్లింపుకు అర్హులు. (చదవండి: దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!) -
బంగ్లాదేశ్ బోల్తా
T20 World Cup 2021 Scotland Vs Bangladesh: మస్కట్: అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన స్కాట్లాండ్ జట్టు టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘బి’లో గెలుపు బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి ఆశ్చర్యపరిచింది. క్రిస్ గ్రీవ్స్ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2/19) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత స్కాట్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మెహిదీ హసన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. ముషి్ఫకర్ రహీమ్ (36 బంతుల్లో 38; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. కీలకమైన షకీబ్, ముషి్ఫకర్ వికెట్లను గ్రీవ్స్ పడగొట్టగా... మరో బౌలర్ బ్రాడ్ వీల్‌కు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఇది కేవలం రెండో టి20 మ్యాచ్‌కాగా రెండింటిలోనూ స్కాట్లాండే నెగ్గడం విశేషం. 2012లో ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరిగింది. గ్రీవ్స్ మెరుపులు స్కాట్లాండ్ కెపె్టన్ కొయెట్జర్ (0) డకౌట్ కాగా, మున్సే (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూక్రాస్ (11) కాసేపు స్కోరు బోర్డును నడిపించారు. తర్వాత మెహిదీ హసన్, షకీబ్‌ల దెబ్బకు స్కాట్లాండ్ కుదేలైంది. 8 పరుగుల వ్యవధిలోనే క్రాస్, మున్సే, బెరింగ్టన్ (2), లిస్్క(0), మ్యాక్‌లియోడ్ (5) పెవిలియన్ చేరారు. 53 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన స్కాట్లాండ్ను క్రిస్ గ్రీవ్స్ ఆదుకున్నాడు. మార్క్ వాట్ (22; 2 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. టాపార్డర్ వైఫల్యం బంగ్లా టాపార్డర్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు లిటన్ దాస్ (5), సౌమ్య సర్కార్ (5), షకీబ్ (20) నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. ముషి్ఫకర్, మహ్మూదుల్లా (23; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. అయితే స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా స్కోరు వేగం పడిపోయింది. దీంతో తర్వాత క్రీజులోకి దిగిన బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడే ప్రయత్నంలో ఒత్తిడికి తలవంచారు. షకీబ్ రికార్డు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. స్కాట్లాండ్పై అతను 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా శ్రీలంక పేసర్ మలింగ పేరిట ఉన్న 107 వికెట్ల రికార్డును అధిగమించి 108 వికెట్లతో టాప్ ర్యాంక్‌లోకి వెళ్లాడు. స్కోరు వివరాలు స్కాట్లాండ్ ఇన్నింగ్స్: మున్సే (బి) మెహిదీ 29; కొయెట్జర్ (బి) సైఫుద్దీన్ 0; క్రాస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మెహిదీ 11; బెరింగ్టన్ (సి) అఫిఫ్ (బి) షకీబ్ 2; మ్యాక్‌లియోడ్ (బి) మెహిదీ 5; లిస్క్ (సి) లిటన్ దాస్ (బి) షకీబ్ 0; గ్రీవ్స్ (సి) షకీబ్ (బి) ముస్తఫిజుర్ 45; వాట్ (సి) సౌమ్య సర్కార్ (బి) తస్కిన్ 22; డేవీ (బి) ముస్తఫిజుర్ 8; షరీఫ్ (నాటౌట్) 8; బ్రాడ్ వీల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–5, 2–45, 3–46, 4–52, 5–52, 6–53, 7–104, 8–131, 9–131. బౌలింగ్: తస్కిన్ 3–0–28–1, ముస్తఫిజుర్ 4–1–32–2, సైఫుద్దీన్ 4–0–30–1, షకీబ్ 4–0–17–2, మెహిదీ 4–0–19–3, అఫిఫ్ 1–0–10–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) మున్సే (బి) వీల్ 5; సౌమ్య సర్కార్ (సి) మున్సే (బి) డేవీ 5; షకీబ్ (సి) మ్యాక్‌లియోడ్ (బి) గ్రీవ్స్ 20; ముషి్ఫకర్ (బి) గ్రీవ్స్ 38; మహ్మూదుల్లా (సి) మ్యాక్‌లియోడ్ (బి) వీల్ 23; అఫిఫ్ (సి) డేవీ (బి) వాట్ 18; నురుల్ (సి) మ్యాక్‌లియోడ్ (బి) వీల్ 2; మెహిదీ (నాటౌట్) 13; సైఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–8, 2–18, 3–65, 4–74, 5–106, 6–110, 7–116. బౌలింగ్: బ్రాడ్ వీల్ 4–0–24–3, డేవీ 4–0–24–1, షరీఫ్ 3–0–26–0, లిస్క్ 2–0–20–0, మార్క్ వాట్ 4–0–19–1, గ్రీవ్స్ 3–0–19–2. -
Copa America 2021: బ్రెజిల్ శుభారంభం
సావ్‌పాలో: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బ్రెజిల్ 3–0 గోల్స్ తేడాతో వెనిజులాపై గెలుపొందింది. బ్రెజిల్ తరఫున మార్కినోస్ (23వ నిమిషంలో), నేమార్ (64వ నిమిషంలో), గాబ్రియెల్ (89వ నిమిషంలో) తలా ఓ గోల్ చేశారు. అనంతరం గ్రూప్ ‘బి’ లోనే జరిగిన మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ కొలంబియా 1–0తో ఈక్వెడార్‌పై నెగ్గింది. కొలంబియా ఆటగాడు కార్డోనా (42వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. -
డెన్మార్క్‌కు షాక్
కొపెన్‌హగన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో తొలిసారి ఆడుతున్న ఫిన్లాండ్ జట్టు... తమ మొదటి మ్యాచ్‌లోనే మాజీ చాంపియన్ డెన్మార్క్‌కు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఫిన్లాండ్ 1–0తో డెన్మార్క్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫిన్లాండ్ ఆటగాడు పొహాన్పొలావో ఆట 60 నిమిషంలో గోల్ చేశాడు. గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బెల్జియం 3–0తో రష్యాపై నెగ్గింది. గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1–0తో క్రొయేషియాపై... గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆస్ట్రియా 3–1తో నార్త్ మెసడోనియాపై నెగ్గాయి. -
విజయంతో ముగింపు
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు ఊరట విజయం లభించింది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయిన ఈ స్టార్ షట్లర్... శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 21–18, 21–15తో ప్రపంచ 13వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. శుక్రవారంతో లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. గ్రూప్ ‘బి’లో రెండేసి విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచిన పోర్న్‌పవీ, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), సింధు ఒక్కో విజయం సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించారు. ఓవరాల్‌గా పాయింట్ల ఆధారంగా గ్రూప్ ‘బి’లో రచనోక్ మూడో స్థానంలో, సింధు చివరిదైన నాలుగో స్థానంలో నిలిచారు. గ్రూప్ ‘ఎ’ నుంచి యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), కరోలినా మారిన్ (స్పెయిన్) సెమీఫైనల్ చేరుకున్నారు. పోర్న్‌పవీతో గతంలో నాలుగుసార్లు ఆడి మూడుసార్లు నెగ్గిన సింధుకు ఈసారీ అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గిన సింధు రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ‘ఈ టోర్నీలో నాకు మంచి ముగింపు లభించింది. తై జు యింగ్ చేతిలో ఓడిపోవడంతో నా సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. గత మ్యాచ్‌ల ఫలితాలతో గుణపాఠాలు నేర్చుకొని ప్రతి రోజును కొత్తగా మొదలుపెట్టాలి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. మళ్లీ తాజాగా కోర్టులో అడుగుపెడతా’ అని సింధు వ్యాఖ్యానించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–12, 18–21, 19–21తో పోరాడి ఓడిపోయాడు. గ్రూప్ ‘బి’ నుంచి జు వె వాంగ్ (చైనీస్ తైపీ), ఆంటోన్సెన్ (డెన్మార్క్) సెమీఫైనల్ చేరుకోగా... అంగుస్ మూడో స్థానంలో, శ్రీకాంత్ నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి అక్సెల్సన్ (డెన్మార్క్), తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
జాతీయ నియామక సంస్థ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) గ్రూప్ బి, గ్రూప్ సి (నాన్–టెక్నికల్) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్‌లిస్ట్ చేయడానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్ఆర్ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్‌కు చెందిన ప్రతినిధులు ఉంటారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీస్ పర్సనల్ (ఐబీపీఎస్) సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఈ జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు. ఇవీ ప్రయోజనాలు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి. సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుంది. పరీక్ష ఫీజుతో పాటు, అభ్యర్థులు ప్రయాణం, బోర్డింగ్, బస వంటి వాటి కోసం అదనపు ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఒకే పరీక్ష అభ్యర్థులపై ఆర్థిక భారాన్ని పెద్ద ఎత్తున తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా అభ్యర్థులు రవాణా, బస లభ్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు సహాయకులను వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ అవస్థలు కూడా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) ద్వారా తగ్గనున్నాయి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ముఖ్యాంశాలు.. ► ఎన్ఆర్ఏ కింద ఒక పరీక్షలో హాజరు కావడం ద్వారా అభ్యర్థులు అనేక పోస్టులకు పోటీపడే అవకాశం లభిస్తుంది. ఎన్ఆర్ఏ ప్రిలిమినరీ (మొదటి–స్థాయి / టైర్ 1) పరీక్షను నిర్వహిస్తుంది, ఇది అనేక ఇతర ఎంపికలకు మెట్టుగా మారుతుంది. ► కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. ► ఫలితం ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల కాలానికి అభ్యర్థి యొక్క సీఈటీ స్కోరు చెల్లుతుంది. స్కోరు మెరుగుపర్చుకోవడం కోసం పరీక్ష మళ్లీ రాసుకోవచ్చు. ఉన్న స్కోర్లలో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ► గరిçష్ట వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు గరిష్ట వయోపరిమితి ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు లోబడి ఉంటుంది. ► ప్రిలిమినరీ టెస్ట్‌లో వచ్చే స్కోరు అధారంగా ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ సంస్థలు తమ నియామకాల కోసం అవసరమైన సందర్భాల్లో తదుపరి దశల్లో పరీక్ష నిర్వహిస్తాయి. ► కంప్యూటర్ ఆధారిత సీఈటీని మూడు కేటగిరీల్లో నిర్వహిస్తారు. పట్టభద్రులు, 12వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులకు వేర్వేరు కేటగిరీలుగా ఈ పరీక్ష ఉంటుంది. ► పరీక్షలకు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ► మల్టిపుల్ చాయిస్ ఆబెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ► అభ్యర్థులు ఒక పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని సెంటర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు, మార్కులు, మెరిట్ లిస్టు... అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. ► విభిన్న భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ► సీఈటీ స్కోరు ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ ఏజెన్సీలకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ఏజెన్సీలు కూడా ఈ సీఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుని రిక్రూట్మెంట్ చేసుకుంటాయని కేంద్రం ఆశిస్తోంది. ► సెట్ ఆధారంగా జరిగి ప్రాథమిక వడపోతతో అనేక నియామక ప్రక్రియలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. యువతకు ప్రయోజనకరం: ప్రధాని జాతీయ నియామక సంస్థ ఏర్పాటు దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రయోజనకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బహుళ పరీక్షలను తొలగించి, విలువైన సమయాన్ని, వనరులను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. దీని మూలంగా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎంతో డబ్బును, సమయాన్ని ఆదా చేసే కామన్ ఎలిజిబిలిటీ టెస్టును ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. -
కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్), ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీసెస్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీసెస్), ఐఎఫ్ఓఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్) ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బీలోని కొన్ని గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి, ముఖ్యంగా కొన్ని గ్రూప్ బీ ఉద్యోగాల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ పోస్ట్‌లు, కొన్ని గ్రూప్ బీ గెజిటెడ్ పోస్ట్స్, గ్రూప్ సీ పోస్ట్‌ల భర్తీకి ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఆ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ‘కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)’ను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’ అని కేంద్ర సిబ్బంది శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. అలాగే, ఉద్యోగార్థులు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరారు. సెట్ నిర్వహణతో ఉద్యోగార్థులకు, ప్రభుత్వ సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర చెప్పారు. ప్రధాని లక్ష్యమైన సులభతర పాలనలో భాగంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. ‘ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వేర్వేరు సంస్థలు ప్రకటించే వేర్వేరు ఉద్యోగాలకు అభ్యర్థులు వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి పరీక్షకు హాజరవడం వరకు అభ్యర్థి అనేక వ్యయ ప్రయాసలకు లోనవాల్సి వస్తోంది. అందువల్ల ఒకే ఏజెన్సీ నిర్వహించే ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఒకేసారి ప్రిపేర్ కావచ్చు’ అని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలున్నాయి. -
గ్రూప్ ‘బి’లో భారత్
- రియో ఒలింపిక్స్ హాకీ లాసానే: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు కఠిన పరీక్ష ఎదురుకాబోతుంది. ఎనిమిది సార్లు స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉన్న భారత జట్టు పూల్ ‘బిలో ఉండగా దీంట్లోనే డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, ప్రపంచ నంబర్ టూ జట్టు నెదర్లాండ్స్ కూడా ఉన్నాయి. అర్జెంటీనా (6), ఐర్లాండ్ (12), కెనడా (14) మిగతా జట్లు. భారత జట్టు ప్రస్తుతం ఏడో ర్యాంకులో ఉంది. ఇటీవలి హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్లో కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గగా అంతకుముందు జర్మనీని 1-1తో నిలువరించింది. కొత్త నిబంధనల ప్రకారం భారత జట్టు ఐర్లాండ్, కెనడాలపై నెగ్గినా క్వార్టర్స్ చేరుకుంటుంది. ఇక పూల్ ‘ఎ’లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా (1), గ్రేట్ బ్రిటన్ (4), బెల్జియం (5), కివీస్ (8), స్పెయిన్ (11), ఆతిథ్య బ్రెజిల్ (32) ఉన్నాయి. మహిళల హాకీ జట్టు కూడా పూల్ ‘బి’లోనే ఉండగా అర్జెంటీనా, ఆసీస్, గ్రేట్ బ్రిటన్, అమెరికా, జపాన్‌లతో పోటీపడుతుంది. -
మూడులో రెండు...
నేటి గ్రూప్ ‘బి' చివరి లీగ్ మ్యాచ్‌లు రసవత్తరం ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ'లో క్వార్టర్ ఫైనల్ జట్లు ఖరారైనా... గ్రూప్ ‘బి'లో మాత్రం ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా రెండు బెర్త్‌లను ఖరారు చేసుకున్నా... మిగిలిన రెండు స్థానాల కోసం పాకిస్తాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఆదివారం ఈ గ్రూప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాబట్టి మూడింటిలో ఏ రెండు జట్లు ముందుకెళ్తాయో చూద్దాం! ప్రస్తుతం చెరో ఆరు పాయింట్లతో ఉన్న పాకిస్తాన్, ఐర్లాండ్ల మధ్య నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లు 8 పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరుకుంటారు. అదే సమయంలో ఓడిన జట్టు... వెస్టిండీస్, యూఏఈ మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే... అప్పుడు కరీబియన్ జట్టు ఖాతాలో కూడా ఆరు పాయింట్లు ఉంటాయి. కాబట్టి మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. విండీస్, యూఏఈ మ్యాచ్‌కు తుపాన్ గండం ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే విండీస్ 5 పాయింట్లతో ఇంటికి వెళ్లిపోతుంది. అప్పుడు పాక్, ఐర్లాండ్‌లు క్వార్టర్స్ బెర్త్‌లను దక్కించుకుంటాయి. మరోవైపు విండీస్, యూఏఈలది ‘డే' మ్యాచ్ కావడంతో... డే నైట్ మ్యాచ్‌గా జరగనున్న పాక్, ఐర్లాండ్ల జట్లకు తమ నెట్ రన్‌రేట్ మెరుగుపర్చుకోవడానికి ఎంత స్కోరు చేయాలన్న విషయం తెలిసిపోతుంది. ఈ అంశం ఈ రెండు జట్లకు అనుకూలాంశం కానుంది. -
అర్జెంటీనా సంచలనం
తొలిసారి సెమీస్‌లోకి హాకీ ప్రపంచకప్ ది హేగ్ (నెదర్లాండ్స్): పురుషుల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో 5-1తో దక్షిణాఫ్రికాపై గెలిచి తొలిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన అర్జెంటీనా మొత్తం 12 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ జర్మనీని వెనక్కి నెట్టి నాకౌట్ దశకు చేరుకుంది. అర్జెంటీనా, నెదర్లాండ్స్ చేతిలో ఓడటం జర్మనీ అవకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ సెమీస్‌కు చేరలేకపోవడం ఇది రెండోసారి. గతంలో 1971లో కెన్యా.... పశ్చిమ జర్మనీకి షాకిచ్చి ముందంజ వేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో జోక్విమ్ మెనిన్ (20వ ని.), గొంజాగో పిల్లట్ (25, 61వ ని.), లుకాస్ విల్లా (49, 63వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. క్లింటన్ పాంథర్ (57వ ని.) దక్షిణాఫ్రికా తరఫున ఏకైక గోల్ చేశాడు. 1986, 2002 ప్రపంచకప్‌లలో ఆరోస్థానంలో నిలిచిన అర్జెంటీనాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు భారత్ 9-10వ స్థానం కోసం దక్షిణ కొరియాతో శనివారం తలపడుతుంది.