నేటి గ్రూప్ ‘బి' చివరి లీగ్ మ్యాచ్‌లు రసవత్తరం
ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ'లో క్వార్టర్ ఫైనల్ జట్లు ఖరారైనా... గ్రూప్ ‘బి'లో మాత్రం ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా రెండు బెర్త్‌లను ఖరారు చేసుకున్నా... మిగిలిన రెండు స్థానాల కోసం పాకిస్తాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఆదివారం ఈ గ్రూప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాబట్టి మూడింటిలో ఏ రెండు జట్లు ముందుకెళ్తాయో చూద్దాం!
ప్రస్తుతం చెరో ఆరు పాయింట్లతో ఉన్న పాకిస్తాన్, ఐర్లాండ్‌ల మధ్య నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లు 8 పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరుకుంటారు.
అదే సమయంలో ఓడిన జట్టు... వెస్టిండీస్, యూఏఈ మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే... అప్పుడు కరీబియన్ జట్టు ఖాతాలో కూడా ఆరు పాయింట్లు ఉంటాయి. కాబట్టి మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది.
విండీస్, యూఏఈ మ్యాచ్‌కు తుపాన్ గండం ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే విండీస్ 5 పాయింట్లతో ఇంటికి వెళ్లిపోతుంది. అప్పుడు పాక్, ఐర్లాండ్‌లు క్వార్టర్స్ బెర్త్‌లను దక్కించుకుంటాయి.
మరోవైపు విండీస్, యూఏఈలది ‘డే' మ్యాచ్ కావడంతో... డే నైట్ మ్యాచ్‌గా జరగనున్న పాక్, ఐర్లాండ్‌ల జట్లకు తమ నెట్ రన్‌రేట్ మెరుగుపర్చుకోవడానికి ఎంత స్కోరు చేయాలన్న విషయం తెలిసిపోతుంది. ఈ అంశం ఈ రెండు జట్లకు అనుకూలాంశం కానుంది.
మూడులో రెండు...
Published Sun, Mar 15 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement