రాంచీ: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుకుంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సంగీత కుమారి (1వ ని.లో), ఉదిత (12వ ని.లో), డుంగ్‌డుంగ్ బ్యూటీ (14వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
న్యూజిలాండ్ జట్టుకు మేగన్ హల్ (9వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. మరో మ్యాచ్‌లో అమెరికా 2–0తో ఇటలీ జట్టును ఓడించింది. ప్రస్తుతం అమెరికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, న్యూజిలాండ్ 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో అమెరికాతో న్యూజిలాండ్; ఇటలీతో భారత్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment