league matches
-
ఐపీఎల్ చరిత్రలో ఇలా తొలిసారి..
దుబాయ్: ఐపీఎల్-2021 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 8న జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని ప్రకటించింది. గ్రూప్ దశలో ఇలా రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో ప్రారంభం కానుండటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీ, బెంగళూరు జట్ల మ్యాచ్ ఉంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభమవుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉండటం వల్లే షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. చదవండి: గట్టిగా పార్టీ చేస్తే 2 లక్షలకు పైగా బిల్లు కడతాను.. అలాంటి నేను ఫిక్సింగ్ చేస్తానా..? -
లీగ్ మ్యాచ్‌లు ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. లీగ్ మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్స్ కోటాలో తమ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇస్తామని, అయితే లీగ్ మ్యాచ్‌లలో తమను ఆడనివ్వడం లేదంటూ యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిభావంతులను గుర్తించడానికి తాము లీగ్ మ్యాచ్‌లలో పాల్గొంటామని, ఈ మేరకు గతంలో హైకోర్టు ఆదేశించినా తమను లీగ్ మ్యాచ్‌లు ఆడనివ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు.(చదవండి: ఓపెనర్‌గానే రోహిత్ శర్మ! ) ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తి... హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎటువంటి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించరాదని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని హెచ్‌సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇటీవలే యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే హెచ్‌సీఏ లీగ్‌లో ఆంధ్రా బ్యాంక్ పేరుతో ప్రత్యేక జట్టు ఉంది. అయితే యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా తమను ప్రత్యేక జట్టుగా గుర్తించి మ్యాచ్‌ల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని హెచ్‌సీఏను కోరింది. -
40 ఏళ్లు దాటితే లీగ్స్‌లో నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) బాధ్యతలు స్వీకరించిన జి. వివేక్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గం లీగ్ మ్యాచ్‌ల నియమ నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసి ఈ సీజన్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది నుంచి 40 ఏళ్లు పైబడిన క్రికెటర్లను లీగ్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు అనుమతించబోమని హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ స్పష్టం చేశారు. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న శేష్ నారాయణ్ హెచ్‌సీఏ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. త్వరలో అండర్–16, 19 స్థాయిలో ప్రత్యేక లీగ్‌లను నిర్వహించేందుకు నగరంలోని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఈ లీగ్‌ల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లోధా కమిటీ సిఫార్సుల అమలుపై చర్చించడానికి జూలై 2న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం హెచ్‌సీఏ అనుబంధ 214 సంఘాలను సమావేశానికి ఆహ్వానించి వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామని చెప్పారు. ఈసారి లీగ్ మ్యాచ్‌లను బీసీసీఐ వర్గాలకు చెందిన అవినీతి నిరోధక కమిటీల ఆధ్వర్యంలో మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 26న ముంబైలో జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తాను పాల్గొనబోతున్నట్లు శేష్‌నారాయణ్ తెలిపారు. రాయుడు మళ్లీ హైదరాబాద్‌కు... హైదరాబాద్ నుంచి తప్పుకొని గతంలో బరోడా, విదర్భ రంజీ జట్లకు ప్రాతినిధ్యం వహించిన అంబటి తిరుపతి రాయుడు తిరిగి హైదరాబాద్ జట్టులోకి చేరాడు. ఈ లీగ్‌లో ఇండియా సిమెంట్స్ జట్టు తరఫున రాయుడు ఆడతాడు. మరోవైపు హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌ల్లో ఆధిపత్యం ప్రదర్శించే ఎస్బీహెచ్ జట్టు ఈ సీజన్లో ఎస్బీఐ పేరుతో బరిలోకి దిగనుంది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, జాన్ మనోజ్‌లతో పాటు వారికి చెందిన లీగ్ జట్లు ఎన్స్‌కాన్స్, ఎంపీ కోల్ట్స్‌పై ప్రస్తుత హెచ్‌సీఏ కార్యవర్గం వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఎన్స్‌కాన్స్ జట్టు సభ్యులైన తన్మయ్ అగర్వాల్, మెహదీ హసన్ ఈ సీజన్లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. జాన్ మనోజ్‌కు చెందిన ఎంపీ కోల్ట్స్ ఆటగాళ్లు బి. అనిరుధ్, బెంజమిన్ థామస్, కె.అక్షత్ ఈస్ట్ మారేడ్‌పల్లి సీసీ తరఫున ఆడనున్నారు. -
భారత్ తొలిసారి....
చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్లోకి.. లండన్: పలువురు స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆరు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి.. 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఆస్ట్రేలియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. బెల్జియంతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రిటన్ 3-3తో ‘డ్రా’గా ముగించడం భారత్‌కు కలిసొచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బ్రిటన్ గెలిచి ఉంటే భారత్‌కు నిరాశే ఎదురయ్యేది. మరోవైపు మూడు గోల్స్ తేడాతో గెలిస్తేనే బెల్జియం జట్టుకు ఫైనల్ బెర్త్ దక్కేది. అయితే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు అర్హత పొం దింది. 38 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1982లో కాంస్య పతకం నెగ్గడమే ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన. -
నాలుగు బెర్త్‌లు... ఆరు జట్లు
ఐపీఎల్లో లీగ్ మ్యాచ్‌లు క్లైమాక్స్ దశకు వచ్చాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ జట్టు ఖరారయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సన్‌రైజర్స్ జట్టు ఒక్కటే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినట్లు కనిపిస్తున్నా... వాస్తవానికి ఏ జట్టూ అధికారికంగా ముందంజ వేయలేదు. ప్రస్తుతం నాలుగు బెర్త్‌లకుగాను ఆరు జట్లు రేసులో ఉన్నాయి. పంజాబ్, పుణే జట్లకు ఇప్పటికే ప్లే ఆఫ్ ద్వారం మూసుకుపోయింది. మిగిలిన ఆరు జట్లలో ఎవరి అవకాశాలు ఏమిటి? ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఏ జట్టు ఏం చేయాలో చూద్దాం..? సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఇతర సమీకరణాలు, గోల లేకుండా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలవాలి. ఒకవేళ సన్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే... కోల్‌కతాపై గుజరాత్ గెలిచి ముంబై చేతిలో ఓడితే... బెంగళూరు, ఢిల్లీల్లో ఒక జట్టు 16 పాయింట్లకు వస్తే... అప్పుడు ఐదు జట్లు 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. రన్‌రేట్ లెక్కలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం సన్ రన్‌రేట్ బాగుంది. కాబట్టి చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒకవేళ ఓడినా... చిత్తుగా ఓడకుండా రన్‌రేట్‌ను కాపాడుకోవాలి. ఈ సమీకరణం చాలా క్లిష్టం కాబట్టి సన్‌రైజర్స్ ముందుకు వెళ్లినట్లే భావించాలి. ► మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ (శుక్రవారం), కోల్‌కతా (ఆదివారం) కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రస్తుతం 14 పాయిం ట్లతో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి గొడవా లేదు. ఒకవేళ ఒక్క మ్యాచ్ గెలిచినా రన్‌రేట్ బాగుంది కాబట్టి సమస్య రాకపోవచ్చు. మిగిలిన రెండు మ్యాచ్‌లూ ఓడితే 14 పాయింట్లతో ముందుకు వెళ్లడం కష్టం. సన్‌రైజర్స్ అన్నీ గెలిచి, గుజరాత్ కూడా ముంబైపై గెలవాలి. అదే సమయంలో ఢిల్లీ బెంగళూరుపై గెలవాలి. ఈ సమీకరణంలో నాలుగు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు ముందుకు వెళతాయి. ఈ గొడవలన్నీ లేకుండా కనీసం ఒక మ్యాచ్ గెలిస్తే మేలు. ► మిగిలిన మ్యాచ్‌లు: గుజరాత్ (గురువారం), హైదరాబాద్ (ఆదివారం) ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ గుజరాత్ చేతిలో ఓడితే... అటు ఢిల్లీ బెంగళూరుపై గెలవాలని కోరుకోవాలి. అదే సమయంలో సన్‌రైజర్స్ కూడా అన్ని మ్యాచ్‌లూ గెలవాలని కోరుకోవాలి. ఇలాంటి సందర్భం వచ్చినా నెట్న్‌ర్రేట్ బాగా లేదు కాబట్టి ముందుకు వెళ్లడం కష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్‌పై గెలిచి, మిగిలిన మ్యాచ్‌ల ఫలితాల కోసం చూడాలి. ► మిగిలిన మ్యాచ్: గుజరాత్ (శనివారం) గుజరాత్ లయన్స్ కోల్‌కతా, గుజరాత్ పరి స్థితి ఒకేలా ఉంది. కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఒకవేళ కోల్‌కతాతో ఓడితే ముంబైపై కచ్చితంగా గెలవాలి. ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం 14 పాయింట్లతో ఉన్నా ఏ రకమైన సమీకరణంలో అయినా ముందుకు పోవడం కష్టం కావచ్చు. ఎందుకంటే రేసులో ఉన్న ఆరు జట్లలో అత్యంత దారుణంగా ఈ జట్టు రన్‌రేట్ ఉంది. కాబట్టి వీలైతే రెండు, లేదంటే కనీసం ఒక్కటైనా గెలవాలి. ► మిగిలిన మ్యాచ్‌లు: కోల్‌కతా (గురువారం), ముంబై (శనివారం) బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది. లీగ్ ఆఖరి మ్యాచ్ ఢిల్లీతో ఆడాల్సి ఉంది. ఆ సమయానికి మిగిలిన మూడు బెర్త్‌లు దాదాపుగా ఖరారు కావచ్చు. ఒకవేళ ఢిల్లీ జట్టు హైదరాబాద్‌పై గెలిస్తే... ఢిల్లీ, బెంగళూరుల ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముందుకు వెళ్లే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఆ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 14 పాయింట్ల మీద నాలుగు జట్లు ఆగిపోయే పరిస్థితి వస్తే... రన్‌రేట్ అందరికంటే బాగున్నందున ముందుకు వెళుతుంది. మిగిలిన మ్యాచ్: ఢిల్లీ (ఆదివారం) ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. కచ్చితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే అవకాశాలు ఉంటాయి. రన్‌రేట్ కూడా బాగోలేదు కాబట్టి... ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు. మిగిలిన మ్యాచ్‌లు: హైదరాబాద్ (శుక్రవారం), బెంగళూరు (ఆదివారం) కొసమెరుపు: రేసులో నుంచి ఇప్పటికే వైదొలిగిన పుణే, పంజాబ్ జట్లు ఈ ఆరు జట్ల అవకాశాలను ప్రభావం చేయలేవు. ఎందుకంటే ఈ రెండు జట్లూ తమ ఆఖరి మ్యాచ్‌ను పరస్పరం ఆడాల్సి ఉంది. ఇందులో ఓడిన జట్టు ఆఖరి స్థానంలో నిలుస్తుంది. కాబట్టి ఇది గెలవడం ఈ రెండు జట్లకూ ముఖ్యమే. -
పోరాడి ఓడిన భారత్
స్టెలెన్‌బోష్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఆదివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 2-3తో జర్మనీ చేతిలో పోరాడి ఓడింది. భారత్‌కు సునీత లాక్రా తొలి గోల్ అందించింది. రెండో క్వార్టర్లో జర్మనీ క్రీడాకారిణి లిసా మారి షుట్జ్ ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేసింది. అయితే 29వ నిమిషంలో భారత ప్లేయర్ అనురాధ దేవి ఫీల్డ్ గోల్ సాధించినా... ఆ వెంటనే క్రుగర్ (జర్మనీ) పెనాల్టీని గోల్‌గా మల్చడంతో ఇరుజట్ల స్కోరు 2-2తో సమమైంది. ఇక డ్రా అనుకుంటున్న తరుణంలో క్రూగర్ రెండో పెనాల్టీని గోల్‌గా మలిచి జర్మనీని 3-2తో గెలిపించింది. -
మూడులో రెండు...
నేటి గ్రూప్ ‘బి' చివరి లీగ్ మ్యాచ్‌లు రసవత్తరం ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ'లో క్వార్టర్ ఫైనల్ జట్లు ఖరారైనా... గ్రూప్ ‘బి'లో మాత్రం ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ గ్రూప్‌లో ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా రెండు బెర్త్‌లను ఖరారు చేసుకున్నా... మిగిలిన రెండు స్థానాల కోసం పాకిస్తాన్, ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఆదివారం ఈ గ్రూప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాబట్టి మూడింటిలో ఏ రెండు జట్లు ముందుకెళ్తాయో చూద్దాం! ప్రస్తుతం చెరో ఆరు పాయింట్లతో ఉన్న పాకిస్తాన్, ఐర్లాండ్ల మధ్య నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లు 8 పాయింట్లతో క్వార్టర్స్‌కు చేరుకుంటారు. అదే సమయంలో ఓడిన జట్టు... వెస్టిండీస్, యూఏఈ మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో విండీస్ గెలిస్తే... అప్పుడు కరీబియన్ జట్టు ఖాతాలో కూడా ఆరు పాయింట్లు ఉంటాయి. కాబట్టి మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. విండీస్, యూఏఈ మ్యాచ్‌కు తుపాన్ గండం ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే విండీస్ 5 పాయింట్లతో ఇంటికి వెళ్లిపోతుంది. అప్పుడు పాక్, ఐర్లాండ్‌లు క్వార్టర్స్ బెర్త్‌లను దక్కించుకుంటాయి. మరోవైపు విండీస్, యూఏఈలది ‘డే' మ్యాచ్ కావడంతో... డే నైట్ మ్యాచ్‌గా జరగనున్న పాక్, ఐర్లాండ్ల జట్లకు తమ నెట్ రన్‌రేట్ మెరుగుపర్చుకోవడానికి ఎంత స్కోరు చేయాలన్న విషయం తెలిసిపోతుంది. ఈ అంశం ఈ రెండు జట్లకు అనుకూలాంశం కానుంది. -
ఒక్క చెడ్డ రోజు...!
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి,వెనకటికి ఎవడో సప్తసముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో పడ్డాడని సామెత. ప్రతి టోర్నీలోనూ ఎన్ని విజయాలు సాధించిన జట్టుకైనా ఏదో ఒక దశలో ఒక చెడు రోజు ఉంటుంది. దురదృష్టం ఏంటంటే భారత్‌కు అది ఫైనల్ అయింది. టి20 ప్రపంచకప్ మొదటి నుంచి అన్ని లీగ్ మ్యాచ్‌లు, సెమీస్‌లో చెలరేగి ఆడిన భారత్... కీలకమైన ఫైనల్లో మాత్రం ఘోరంగా విఫలమైంది. రెండో ఓవర్లోనే రహానే వికెట్ కోల్పోవడంతో టి20లకు అవసరమైన మెరుపు ఆరంభం దొరకలేదు. దీనికితోడు రోహిత్, కోహ్లి ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడారు. చేతిలో వికెట్లు ఉంటే చివరి ఓవర్లలో భారీగా పరుగులు చేయొచ్చు. గతంలో ఈ వ్యూహం భారత్‌కు బాగా పనికొచ్చింది. కానీ ఫైనల్లో యువరాజ్ పుణ్యమాని తేలిపోయాం. ఇక బౌలర్లను పెద్దగా తప్పు పట్టడానికి కూడా లేదు. లక్ష్యం చిన్నదే కావడంతో వాళ్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లారు. ముఖ్యంగా అశ్విన్ మీద బాగా ఒత్తిడి పెంచారు. అలాగే ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో కూడా ధోని తొలిసారి విఫలమయ్యాడు. శభాష్ విరాట్... భారత్ ఘోరంగా ఓడిపోయినప్పటికీ కోహ్లి తన క్లాస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. చక్కగా ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆఖరి ఐదు ఓవర్లలో హిట్టింగ్‌కు కావలసిన రంగం సిద్ధం చేశాడు. ఒక దశలో కోహ్లి సెంచరీ కూడా చేయొచ్చనిపించింది. కానీ యువీ, ధోని కలిసి కోహ్లికి కనీసం సరిగా స్ట్రయికింగ్ కూడా ఇవ్వలేకపోయారు. ఓవరాల్‌గా టోర్నీలో భారత ప్రదర్శన పేలవంగా ఏమీ లేదు. ఒక్క ఫైనల్‌ను మినహాయిస్తే చాంపియన్ తరహా ఆటతీరునే ప్రదర్శించింది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిపించిన ధోని... ఈసారి మాత్రం విఫలమయ్యాడు. అయితే ఏమాత్రం అంచనాలు లేకుండా బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్‌కు చేరడం ద్వారా కాస్త గౌరవంగానే స్వదేశానికి బయల్దేరుతోంది.