దుబాయ్: ఐపీఎల్-2021 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 8న జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని ప్రకటించింది. గ్రూప్ దశలో ఇలా రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో ప్రారంభం కానుండటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీ, బెంగళూరు జట్ల మ్యాచ్ ఉంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభమవుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉండటం వల్లే షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
చదవండి: గట్టిగా పార్టీ చేస్తే 2 లక్షలకు పైగా బిల్లు కడతాను.. అలాంటి నేను ఫిక్సింగ్ చేస్తానా..?
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో ఇలా తొలిసారి..
Published Wed, Sep 29 2021 3:22 PM | Last Updated on Wed, Sep 29 2021 3:23 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment