Schedule change
-
ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ షెడ్యూల్ మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రమాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వివరాల ప్రకారం.. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్లో మార్పులు చేశారు అధికారులు. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ రైలు మంగళవారం ప్రయాణించదు. ఈ విషయాన్ని ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. Change in Days of Service of Visakhapatnam - Secunderabad - Visakhapatnam Vande Bharat express @drmsecunderabad pic.twitter.com/kNudtIeEc1— South Central Railway (@SCRailwayIndia) August 9, 2024 -
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్‌కుమార్ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు.. ► మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. ► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్–టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ DSC https:// apdsc. apcfss. in/ వెబ్సైట్లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. -
TS EAMCET: ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. -
ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం.. పాక్-ఆసీస్ సిరీస్‌పై నీలినీడలు..!
Political Tensions In Pakistan: పాకిస్థాన్‌లో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసీస్-పాక్ మధ్య జరుగుతున్న క్రికెట్ సిరీస్‌పై ప్రభావం చూపేలా ఉన్నాయి. దాయాది దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఈ నెలాఖర్లోగా (మార్చి 28 నుంచి 30 మధ్యలో) తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇమ్రాన్‌కు పదవీ గండం తప్పేలా లేదని తెలుస్తోంది. పాక్‌లో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆసీస్-పాక్ సిరీస్ కొనసాగడం అనుమానంగా మారింది. ఇరు జట్ల మధ్య మార్చ్ 29 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభంకావల్సి ఉండగా, అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీలు జరగనున్నాయి. ఈ ర్యాలీలు జరిగే ప్రదేశం క్రికెటర్లు బస చేసే హోటల్‌కు అతి సమీపంలో ఉండటంతో తదుపరి సిరీస్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సిరీస్ వేదికల మార్పు అంశాన్ని పీసీబీ పరిశీలిస్తుంది. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్ రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేదికను లహోర్‌కు మార్చే ఆలోచనలో పీసీబీ ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, 24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో పాక్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లు డ్రా కాగా, ఈ నెల 21 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. అనంతరం ఈనెల 29 నుంచి ఏప్రిల్ 5 వరకు పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది. చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం.. హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్ -
షెడ్యూల్ మార్చండి.. ముందుగా టీ20లు నిర్వహించండి..!
కొలొంబో: వచ్చే నెలలో టీమిండియాతో జరగబోయే సిరీస్ విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది. రెండు టెస్ట్‌లు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు లంక జట్టు ఫిబ్రవరి 25న భారత్‌కు రావాల్సి ఉండగా.. ఈ సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేయాలని ఆ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐని అభ్యర్ధించింది. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్‌లో తొలుత టెస్ట్‌లు, ఆతర్వాత టీ20లు జరగాల్సి ఉంది. అయితే, ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ పర్యటనకు కంటిన్యూయేషన్‌గా భారత్‌తో తొలుత టీ20లు, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ నిర్వహిస్తే తమకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్ఎల్సీ పేర్కొంది. దీని వల్ల ఆటగాళ్లను వెనక్కి పిలిపించే సమస్య ఉండదని విన్నవించుకుంది. ఆస్ట్రేలియాలో పర్యటించే జట్టునే భారత్‌కు పంపించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. దీని వల్ల ప్రయాణ భారంతో పాటు బయో బబుల్ సమస్య కూడా తలెత్తదని వివరించింది. కాగా, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక జట్ల మధ్య ఫిబ్రవరి 25న తొలి టెస్ట్, మార్చి 5న రెండో టెస్ట్, అనంతరం మార్చి 13,15,18 తేదీల్లో మూడు టీ20లు జరగాల్సి ఉంది. ఇదిలా ఉంటే, దేశంలో కరోనా స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో లంకతో సిరీస్‌ను ముందుగా ప్రకటించిన విధంగా నాలుగు వేదికల్లో(బెంగళూరు, మొహాలి, ధర్మశాల, లక్నో) కాకుండా రెండు వేదికల్లోనే కుదించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. బెంగళూరు, లక్నో నగరాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో మొహాలి, ధర్మశాలల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తుంది. చదవండి: వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు -
రెండు వేదికల్లోనే ...
ముంబై: వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే వన్డే, టి20 సిరీస్‌ల షెడ్యూల్లో బీసీసీఐ మార్పులు చేసింది. 3 వన్డేలు, 3 టి20ల కోసం గతంలో ఆరు వేదికలను ప్రకటించగా, ఇప్పుడు కరోనా ఇబ్బందుల కారణంగా వాటిని రెండుకు కుదించారు. వన్డే సిరీస్ మొత్తం అహ్మదాబాద్‌లో, టి20 సిరీస్ మొత్తం కోల్‌కతాలోనే జరుగుతుందని బోర్డు వెల్లడించింది. భారత్, విండీస్ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డేలు...16, 18, 20 తేదీల్లో టి20లు నిర్వహిస్తారు. -
ఐపీఎల్ చరిత్రలో ఇలా తొలిసారి..
దుబాయ్: ఐపీఎల్-2021 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. అక్టోబర్ 8న జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని ప్రకటించింది. గ్రూప్ దశలో ఇలా రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో ప్రారంభం కానుండటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. షెడ్యూల్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీ, బెంగళూరు జట్ల మ్యాచ్ ఉంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభమవుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉండటం వల్లే షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. చదవండి: గట్టిగా పార్టీ చేస్తే 2 లక్షలకు పైగా బిల్లు కడతాను.. అలాంటి నేను ఫిక్సింగ్ చేస్తానా..? -
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లలో మార్పు
సాక్షి, అమరావతి: గ్రూప్1, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, గెజిటెడ్, నాన్–గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షల షెడ్యూళ్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరించింది. ఈమేరకు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కమిషన్ వెబ్సైట్లోనూ సవరించిన షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు. సవరించిన షెడ్యూళ్లు ఇలా గ్రూప్1 తెలుగు పేపర్ (క్వాలిఫైయింగ్ నేచర్): నవంబర్ 2 ఇంగ్లీషు పేపర్ (క్వాలిఫైయింగ్ నేచర్): నవంబర్ 3 పేపర్1: నవంబర్ 5 పేపర్2: నవంబర్ 7 పేపర్3: నవంబర్ 9 పేపర్4: నవంబర్ 11 పేపర్ 5: నవంబర్ 13 గెజిటెడ్ పోస్టులు ► అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: సెప్టెంబర్21 (సబ్జెక్ట్స్) ► రాయల్టీ ఇన్స్పెక్టర్ ఏపీ మైనింగ్: సెప్టెంబర్22 ఉదయం (సబ్జెక్ట్స్), సెప్టెంబర్22 మధ్యాహ్నం(జీఎస్–ఎంఏ) ► సివిల్ అసిస్టెంట్ సర్జన్: సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్ 23 మధ్యాహ్నం (సబ్జెక్టులు) ► టెక్నికల్ అసిస్టెంట్ (పోలీసు ట్రాన్స్‌పోర్టు): సెప్టెంబర్23 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► అసిస్టెంట్ డైరక్టర్ టౌన్, ప్లానింగ్: సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► అసిస్టెంట్ కెమిస్ట్ గ్రౌండ్ వాటర్: సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్23 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్: సెప్టెంబర్ 23 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్ 23, 24 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) నాన్‌గెజిటెడ్ పోస్టులు ► టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్గ్రౌండ్వాటర్): సెప్టెంబర్ 25 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ గ్రౌండ్‌వాటర్): సెప్టెంబర్ 26 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► వెల్ఫేర్ ఆర్గనైజర్ (సైనిక్‌వెల్ఫేర్): సెప్టెంబర్ 26 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్26 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్: సెప్టెంబర్ 26 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కియాలజీ: సెప్టెంబర్ 26 ఉదయం (సబ్జెక్ట్స్), సెప్టెంబర్27 మధ్యాహ్నం (జీఎస్–ఎంఏ) ► టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్: సెప్టెంబర్ 27 ఉదయం(జీఎస్–ఎంఏ), సెప్టెంబర్27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) ► డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే: సెప్టెంబర్27 ఉదయం (జీఎస్–ఎంఏ), సెప్టెంబర్ 27 మధ్యాహ్నం (సబ్జెక్ట్స్) డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సెప్టెంబర్15 సబ్జెక్టులు సెప్టెంబర్16 ఉదయం జీఎస్, ఎంఏ సెప్టెంబర్16 మధ్యాహ్నం సబ్జెక్టులు -
రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20, 27 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. కాగా, రాహుల్ 20వ తేదీ పర్యటనకు సంబంధించి టీపీసీసీ ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా గురువారం రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులను చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ నాందేడ్ నుంచి బైంసాకు చేరకుంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు బైంసాలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత 2.30 నుంచి 3.30 గంటల వరకు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసగించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ చేరుకుని.. చార్మినార్ వద్ద సాయంత్రం జరిగే రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్ పర్యటనతో రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. కాగా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాహుల్ 20వ తేదీ ఉదయం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. -
ఏమిటీ ‘శిక్ష’ణ!
ఉండి : జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ తరగతులు తమకు శిక్షగా మారాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు తమ పాలిట శాపంగా మారాయంటూ వాపోతున్నారు. తరగతులు ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కావడం వరకు బాగానే ఉన్నా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇళ్లకు వెళ్ళాలంటే ప్రాణం పోయేలా ఉంటోందంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నందున ఈ శిక్షణ తరగతులను వాయిదా వేయాలని కోరినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రావద్దని చెబుతున్న వైద్యుల సలహాలను, కలెక్టర్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బెంబేలెత్తుతున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల్లో చాలా మంది బీపీ, సుగర్, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. తీవ్రమైన ఎండల్లో సుమారు 20 కి.మీ ప్రయాణించి శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఉండి మండలంలోని ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ కార్యక్రమం తొలిరోజునే ఉప్పులూరు మెయిన్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సరసా సత్యనారాయణ వడదెబ్బకు ప్రాణాపాయ స్థితికి చేరారు. వెంటనే దగ్గరలోని మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో శిక్షణ తరగతిలోనే కళ్ళుతిరిగిపడిపోయారు. దాంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. శిక్షణా కార్యక్రమం ముగిసిన అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ముందు వాతావరణాన్ని కూడా అంచనా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇవీ శిక్షణ మండలాలు ఉండి, ద్వారకాతిరుమల, కామవరపుకోట, వీరవాసరం, మోగల్తూరు, నిడదవోలు, తాళ్లపూడి, పెనుమంట్ర, పోలవరం, ఇరగవరం, పెనుగొండ, ఛాగల్లు మండలాల్లో సుమారు మండలానికి 100 నుంచి 150 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నారు. వచ్చే నెలకు మార్చాలి మండుటెండల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం దారుణం. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని వడగాల్పుల్లో ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి ప్రాణాల మీదకు తెస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి వచ్చే నెలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తే మంచిది. - గాదిరాజు రంగరాజు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, చెరుకువాడ. -
డీసెట్–16 ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పు
అనంతపురం ఎడ్యుకేషన్ : డీసెట్–16 ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్లు డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1 వరకు వెబ్ ఆప్షన్లు, 2 నుంచి 5 వరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. 6న అలాట్మెంట్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలి. 7,8 తేదీల్లో బుక్కపట్నంలోని డైట్ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. 9 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. -
మూడు దేశాల్లో IPL - 7