సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రమాణీకులకు ముఖ్య గమనిక. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
వివరాల ప్రకారం.. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందే భారత్ రైలు షెడ్యూల్‌లో మార్పులు చేశారు అధికారులు. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తోంది. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ రైలు మంగళవారం ప్రయాణించదు. ఈ విషయాన్ని ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ తెలిపింది.
Change in Days of Service of Visakhapatnam - Secunderabad - Visakhapatnam Vande Bharat express @drmsecunderabad pic.twitter.com/kNudtIeEc1
— South Central Railway (@SCRailwayIndia) August 9, 2024
Comments
Please login to add a commentAdd a comment