భారత్ తొలిసారి....
చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్లోకి..
లండన్: పలువురు స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఆరు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి.. 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఆస్ట్రేలియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. బెల్జియంతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను బ్రిటన్ 3-3తో ‘డ్రా’గా ముగించడం భారత్‌కు కలిసొచ్చింది.
ఒకవేళ ఈ మ్యాచ్‌లో బ్రిటన్ గెలిచి ఉంటే భారత్‌కు నిరాశే ఎదురయ్యేది. మరోవైపు మూడు గోల్స్ తేడాతో గెలిస్తేనే బెల్జియం జట్టుకు ఫైనల్ బెర్త్ దక్కేది. అయితే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు అర్హత పొం దింది. 38 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1982లో కాంస్య పతకం నెగ్గడమే ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత అత్యుత్తమ ప్రదర్శన.